Sunday, March 6, 2011

తెలుగు ఛానల్స్ రేటింగ్స్

తెలుగు టెలివిజన్ ఛానళ్ల గ్రాస్ రేటింగ్ పాయింట్స్ (GRP) WK-09

TV9 Telugu News 124

TV5 Telugu News 65

ETV2 Telugu News 62

HM TV 52

Zee 24 Ghantalu 49

NTV News 48

Sakshi TV 47


Raj News 41

ABN Andhra Jyothi 31

Mahaa TV 22

I News 21

Studio N 14

Gemini News 9


Zee Telugu 318

Gemini TV 743

Maa Telugu 274

Eenadu TV 374

Gemini Movies 293

Maa Movies 105

Maa Junior 17

Star Cricket 189

ESPN 27 

Source: 24gantalu.blogspot.com

సమాజంలో విష బీజాలు నాటడం మొదలుపెట్టిన రియాల్టీ షోలు

ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లు తమ టిఆర్‌పి రేట్లను పెంచుకోవడానికి రకాల రకాల రియాల్టీ షోలపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని ఛానెల్లు చిన్న పిల్లలతో ఆట పాటలు చేయిస్తుంటే.. మరికొందరు పెద్దవారితో చేయిస్తున్నారు. ఇలా ఆట పాటల వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. కొన్ని రియాల్టీ షోలయితే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అసభ్యకరమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే... ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ 'జీ తెలుగు' ఓ వినూత్న రియాల్టీ షో "కొండవీటి రాజా.. కోటలో రాణి"ను ప్రారంభించింది.

ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్‌నర్‌గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.


లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్‌ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!


ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయిలి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్‌లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత. 


Source: kazachaitanya.blogspot.com

MAA TV to telecast Bunny’s marriage live

MAA TV got the opportunity to telecast Stylish Star Allu Arjun’s wedding function live on MAA Movies channel from 7.30 pm on March 6.

This would be really a feast to the eyes of the Telugu audiences in general and Allu Arjun and Mega fans across the world and they could get a feel of attending the marriage and meeting their favourite hero’s wedding personally.

Because the wedding is being held for the most eligible bachelor of the Tollywood all the who is who of not only the Telugu film industry, but also from the entire south India and also from Bollywood would attend the wedding and the audiences could watch the marriage by sitting in their drawing room along with family members and enjoy it.

This is definitely going to be a real “Pelli Sandadi” for all the Bunny fans.

Indiaglitz wishes both Bunny and Sneha “A Happy and Prosperous married life”.

Source: www.indiaglitz.com

కొత్త టివి ఛానెళ్ల నెట్‍వర్క్‌పై విభేదాలు

కొత్త టివి ఛానెళ్ల నెట్‍వర్క్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి, ప్రభుత్వానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. నెట్‍వర్క్‌‌ను మరింతగా పెంచాలని ట్రాయ్ సిఫారసు చేయగా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. ట్రాయ్ చేసినవి సిఫారసులు మాత్రమేనని, తాము మాత్రం తమ ఇదివరకటి వైఖరికే కట్టుబడి ఉంటామని ఈ శాఖ స్పష్టం చేసింది. డౌన్‌లింక్, లేదా అప్‌లింకింగ్‌కు అనుమతించే ఛానెళ్ల సంఖ్యపై నిషేధం ఉండరాదన్న సూచనతో తాము ఏకీభవిస్తున్నామని, అయితే నాన్-న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానెల్స్ నెట్‍వర్క్‌ రిక్వైర్‌మెంట్‍ను రు.15 మిలియన్ల నుంచి 50 మిలియన్లకు పెంచవచ్చునని ఈ శాఖ అభిప్రాయ పడింది. అలాగే ప్రతి అదనపు ఛానెల్‍కు దీనిని 25 మిలియన్లకు పెంచాలని సూచించింది.

Source: medianx.tv

ఇండియాలో ‘లాక్‌వేగాస్’

ఎక్కడో అమెరికాలోని ‘లాస్‌వేగాస్’ నగరం ఇండియాలో ఉందా? ‘స్టార్ వరల్డ్’ ఛానెల్ అవుననే అంటోంది మరి. ఇంతకీ ‘లాస్‌వేగాస్’ టైటిల్‍తో ఈ ఛానెల్ సరికొత్త షోను ప్రారంభిస్తోంది. ఆనగరంలోని ఎక్స్‌క్లూజివ్ క్యాసినోస్, షాపింగ్ మాల్స్, ఫైన్ డైనింగ్ తదితర లైఫ్‌స్టైల్స్ అన్నీ మన భారతీయ ప్రేక్షకులు ఈ షోలో తిలకించవచ్చు. ఈ నెల 7వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల స్లాట్‍లో ‘లాస్‌వేగాస్’ టెలికాస్ట్ అవుతుంది. హై డోస్ ఎంటర్‌టైన్‌మెంట్‍కు నిర్వచనం ఇచ్చే ఈ కొత్త షో తమ ఆడియెన్స్‌ను మరింతగా పెంచుతుందని స్టార్‌వరల్డ్ ఆశిస్తోంది.

Source: medianx.tv

ఆస్కార్ టెలికాస్ట్ అగ్రిమెంట్ పొడిగింపు

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమ ప్రసారాన్ని యుఎస్ ఛానెల్ ‘ఎబిసి’ మరో ఆరేళ్లు పొడిగించింది. ఈ కొత్త ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చిందని మోషన్ పిక్చర్స్ ప్రెసిడెంట్ టామ్ షెరాక్, డిస్నీ/ఎబిసి టెలివిజన్ గ్రూప్ ప్రెసిడెంట్ ఏన్‌స్వీనీ ప్రకటించారు. నిజానికి 2014లో ప్రస్తుత అగ్రిమెంట్ కాల పరిమితి ముగుస్తుంది. అయితే దీనిని మరో ఆరేళ్ల పాటు- అంటే 2020 వరకు పొడిగిస్తున్నట్టు వారు తెలిపారు. వరుసగా 46 ఏళ్ళ పాటు ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమాలను ప్రసారం చేసిన తాము ఇకపై కూడా ఇదే సహకారాన్ని కొనసాగిస్తామని వారు చెప్పారు.

Source: medianx.tv

డ్యాన్సింగ్ విత్ ది స్టార్ రియాల్టీషో

యుఎస్ ఛానల్-ఎబిసి ‘డ్యాన్సింగ్ విత్‌ ది స్టార్స్’ రియాల్టీ షోను ప్రారంభిస్తోంది. ఈ నెల 21 నుంచి ఈ షో టివీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఒక బాక్సింగ్ వీరుడు, ఓ టాక్‌షో పర్సనాలిటీ, మాజీ మోడల్ ఇలా వివిధ రంగాలకు చెందిన వారిలో 11 జంటలు ఈ డ్యాన్సింగ్ రియాల్టీ షోలో పాల్గొంటాయి. మొదటిసారిగా లైవ్‌లో రానున్న ఈ షోను లక్షలాది వీక్షకులు చూసి ఆనందిస్తారని ‘ఎబిసి’ భావిస్తోంది. ఈ షోకు న్యాయ నిర్ణేతలు కూడా ఉంటారు. వీక్షకులు తాము మెచ్చిన ఉత్తమమైన జంటలను ఎన్నుకోవచ్చు. ఫోన్ ద్వారా వారు తమ ‘ఓటుహక్కు’ వినియోగించుకునే వీలుంది. ఇంతేకాదు ‘డ్యాన్సింగ్ విత్‌ ది స్టార్స్’ షోలో హైలైట్లకు సంబంధించిన మొబైల్ వీడియో ఫుటేజీ కూడా కస్టమర్లకు లభిస్తుంది. ఈ షో పట్ల అప్పుడే అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. 

Source: medianx.tv

స్టార్‌వన్‌లో మ్యూజిక్ అవార్డులు

భారీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమానికి రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్, స్టార్‌ఇండియా, ఇండియన్ మ్యూజిక్ అకాడమీలు శ్రీకారం చుట్టాయి. ‘బిగ్‌స్టార్ ఐఎంఎ అవార్డ్స్’ పేరిట దేశవ్యాప్తంగా గల గాయనీ గాయకుల టాలెంట్‌కు పదునుపెట్టే ఈ కార్యక్రమం స్టార్‌వన్‌లో ప్రసారం అవుతుంది. హిందూస్థానీ, కర్నాటక సంగీతంతో సహా జానపదం, గజల్స్, సూఫీ, ఖవాలీవంటి వివిధ సంగీత రూపాలతో సింగర్స్ అలరించనున్నారు. ఈ అవార్డుల కోసం ఇప్పటికే తమకు మూడు వేల ఎంట్రీలు అందినట్లు స్టార్‌ఇండియా సిఓఓ సంజయ్‌గుప్తా తెలిపారు. ఇలాంటి అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారని అన్నారు. ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆయన చెప్పారు.

Source: medianx.tv

ఝలక్ దిఖ్‌లా జా....

బిబిసి ఛానెల్‌లో ఎంతో పాపులర్ అయిన ‘స్ట్రిక్ట్‌లీ కమ్ డాన్సింగ్’ అనే ప్రోగ్రామ్ 2006లో సోనీ ఛానెల్‌లో ‘ఝలక్ దిఖ్‌లా జా’ గా ప్రత్యక్షమయింది. ఒక సెలబ్రిటీకి ఒక ప్రొఫెషనల్ కోరియోగ్రాఫర్‌ను జత ఇచ్చి... ఇలా ఎనిమిది జోడీలు తయారు చేసి వారి మధ్యన డాన్స్ పోటీ పెట్టడం ఈ షో ఫార్మాట్. విదేశాలలో ఈ షో నిర్వహించే తీరు వేరు. అక్కడ లైవ్ మ్యూజిక్ కి జోడీలు వివిధ డాన్స్ రీతులు ప్రదర్శిస్తారు. మన దేశంలో ఈ షో ఫార్మాట్ కొంచెం మార్చి బాలీవుడ్ రంగుని అద్దారు. హిందీ సినిమాల్లో పాపులర్ పాటలకు హోరెత్తించే స్టెప్పులతో చేసే ఈ డ్యాన్సులకి ప్రేక్షకులు కిర్రెక్కిపోయారు. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన ఈ షో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నాలుగేళ్లలో ‘సూపర్ హిట్ షో’ స్టేటస్‌ను తెచ్చుకుంది.

డైలీ సీరియల్స్ రూపంలో తమ ముందుకు వచ్చే టీవీ స్టార్లను సరికొత్త అవతారాలలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. వారిలోని ఈ కొత్తకోణం ప్రేక్షకులను బాగా అలరించింది. షో మొదలైన నాటి నుంచే మంచి టిఆర్‌పి రేటింగుని సంపాదించుకుంది. దానికి తోడు జడ్జీలుగా బాలీవుడ్ తారలు... వారి కామెంట్లతో షోని ఎంతగానో రక్తికట్టించారు. వారం వారం ఒక టీమ్‌ని తొలగించటంలో ప్రేక్షకులు తమవంతు పాత్రను పెద్ద ఎత్తున పోషించారు. ఎస్సెమ్మెస్‌లు పంపి వారికి సహకరించారు. దీంతో షో రేటింగ్స్ మరింత భారీగా పెరిగాయి.


ఇప్పటికి మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకున్న ఈ షో పోయిన ఏడాది డిసెంబర్ నెలలో కొత్త హంగులను సంతరించుకొని నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది. వస్తూ వస్తూ ఒకప్పుడు భారతదేశపు సినీ ప్రేక్షకులని తన అందంతో, నటనతో, డాన్సులతో ఊపు ఊపిన మాధురి దీక్షిత్‌ను జడ్జి రూపంలో తీసుకువచ్చింది. అమెరికాలో సెటిల్ అయిన కారణంగా కొంత కాలంగా తెరమరుగైపోయిన కలల రాణి మాధురిని వారం వారం చూడటానికి... ఆమె జడ్జిమెంట్‌ని వినటానికి ప్రేక్షకులు ప్రతి వారం టీవీ సెట్ల ముందుకు చేరుకోవటం మొదలుపెట్టారు. నవ్వితే నవ వసంతాన్ని చిందించే మాధురి రాకతో ఈ షో లెవల్ మరింతగా పెరిగిపోయింది. ఆమెకు తోడు మున్నీగా బద్నాం అయిన మలైకా అరోరా మరో సెలబ్రిటీ జడ్జి అవటంతో షోకి మరింత గ్లామర్ పెరిగి ప్రేక్షకుల టెంపరేచర్లు పెంచేసింది. మూడో జడ్జ్‌గా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఒక షోకి మొదటి సీజన్ విజేత, పాపులర్ నటి మోనాసింగ్‌తో పాటు సుమీత్ రాఘవన్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.


ప్రముఖ గాయనీగాయకులు, రియాల్టీ షో విజేతలు, టెలివిజన్ స్టార్లు, స్పోర్ట్స్‌మెన్ ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని షోని మరింత రక్తి కట్టిస్తున్నారు. సోనీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఛానెల్‌లో ప్రతి సోమ, మంగళ వారాలలో రాత్రి తొమ్మిది గంటలకు ఈ షోని మీరు చూసి ఆనందించవచ్చు.

Source: www.sakshi.com

Thursday, March 3, 2011

బుల్లితెరపై మాట్లాటలు

హిందీలో కాఫీ విత్ కరణ్ బహుళ జనాదరణ పొందిన మాట్లాట (టాక్ షో). అదే మూసలో జీ టివి కొంతకాలం క్రితం లక్ష్మీ ప్రసన్నతో ఓ మాట్లాటను ప్రారంభించింది. తెలుగు నాట పుట్టి పెరిగినందుకూ, డైలాగ్ కింగ్‌గా ప్రసిద్ధికెక్కిన నటుడు మోహన్ బాబు కుమార్తె అయినందుకూ- తగిన విధంగా చక్కని తెలుగు మాట్లాడుతోందామె. చాలా కాలం అమెరికాలో ఉండి, అక్కడి మీడియాతో అనుబంధం పెంచు కోవడంవల్లనేమో- అమె యాస అల్లూరి సీతారామరాజు చిత్రంలో రూథర్‌ఫర్డ్‌ని స్ఫురింపజేస్తుంది. అయినా జగదేకవీరుడు, శ్రీకృష్ణార్జున యుద్ధము వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో బి సరోజాదేవి మాటల్లా ముద్దుగా అనిపించడం విశేషం. కానీ ఒకోసారి వేషధారణలో అమె తెలుగు పిల్ల అని ఏమాత్రం అనిపించదు. మేకప్‌లో పాశ్చాత్య ధోరణులను అనుకరించడం నుంచి కనీసం బుల్లితెరకైనా విముక్తి కలిగించడం అవసరం. ఐతే ఆమె మాటలో తీరులో సహజత్వం, సౌలభ్యం ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తూ ఆకర్షణీయం చేశాయి. ఇప్పుడామె ఈటివిలో ప్రేమతో మీ లక్ష్మీ పేరిట కొత్తగా ప్రారంభించిన మాట్లాట దానికి కొనసాగింపు అనిపిస్తుంది. పెద్దగా ప్రయోజనం లేకపోయినా- పేరు పడిన సాంఘిక, రాజకీయ, సినీ ప్రముఖులతో నడిచే ఈ కార్యక్రమం కాలక్షేపానికి బాగానే ఉంది.  ఇటీవల చంద్రబాబు నాయుడుతో మాట్లాట ఐతే సత్కాలక్షేపం అని కూడా అనిపించింది. మిగతావి కాసేపు ఫరవాలేదు కానీ పూర్తిగా చూడ్డానికి విసుగనిపించింది.

ఇలాంటిదే చాలాకాలంగా మాటివిలో జయప్రదం పేరిట ప్రముఖ సినీతార జయప్రద నిర్వహణలో వస్తోంది. అక్కినేని. జయసుధ, దాసరి వంటి సినీ ప్రముఖులతో ముచ్చట్లు అభిమానుల్ని సంతృప్తి పరుస్తాయి. జయప్రద వేసే ప్రశ్నలు- లబ్దప్రతిష్ఠులైన ఆయా ప్రముఖుల గొప్పతనాన్ని తెలుసుకుందుకు మినహా- ఆసక్తికరమైన విశేషాలు బయటపడడానికి సహకరించవు. ఆమె తీరు, మందహాసం నటిస్తున్నట్లే తప్ప మాట్లాటలా అనిపించవు. అందం ఆమెకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇప్పటికీ ఆమెది అప్పటి అందమే! ఆ అందాన్ని వేషధారణ దారుణంగా హరించిందని స్వాభిప్రాయం. మేకప్ తగ్గించినా, అసలు లేకపోయినా ఆమె మరింత హుందాగానూ, అందంగానూ అగుపిస్తుందని కూడా మాకు అనిపించింది. వస్తువు అనాసక్తికరం కావడంవల్ల- ఈ కార్యక్రమం కాసేపు చూసేక విసుగనిపిస్తుంది. నిర్వాహకులీ విషయమై ష్రద్ధ వహించాలి.

ప్రముఖులని పొగడ్తలతో ముంచెత్తే ప్రక్రియగా కాక- మాట్లాటలు సరికొత్త విశేషాల్ని బయటపెడుతూ, చర్చావేదికలంత ఆసక్తికరంగా మారి కాలక్షేపంతోపాటు ప్రయోజనాన్నీ ఇస్తాయని ఆశిద్దాం.

ఈ సందర్భంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో వస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె మాట్లాటలో ఆర్కె తీరు కొంతవరకూ ఆదర్శప్రాయం అని చెప్పాలి. ఎటొచ్చీ ఈ ఫిబ్రవరి 27న ప్రకాష్‌రాజ్‌తో ముఖాముఖీ మాత్రం కొంత నిరాశ కలిగించింది. మనసు విప్పి మాట్లాడాల్సిన ఈ కార్యక్రమంలో ప్రకాష్‌రాజ్ మెదడుకే తప్ప మనసుకు పని చెప్పకపోవడం అందుకు కారణం.

Source: aksharajalam.wordpress.com

హృతిక్‌కు టివి కాసులపంట


తన ‘కైట్స్’ ‘గుజారిష్’ రెండు చిత్రాలూ బాక్స్‌ఆఫీసు వద్ద ఫట్టయితేనేం…. ఏనుగు..ఏనుగే అన్నట్టు బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ మాత్రం బుల్లితెరపై కాసుల వర్షం కురిపించుకుంటున్నాడు. ‘జస్ట్ డ్యాన్స్’ పేరిట స్టార్‌ప్లస్‌లో రానున్న డ్యాన్స్ రియాలిటీ షోకు న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్న హృతిక్ ఒక్కో ఎపిసోడ్‌కు 2 కోట్ల రూపాయలు డిమాండ్ చేశాడు. ఇందుకు స్టార్‌ ప్లస్ కూడా ఓ.కే. అంది. ‘నాకు బాగానే ముట్టింది’ అంటున్నాడు ముసిముసి నవ్వులతో హృతిక్! పెద్ద వైఫల్యాల తర్వాత పెద్ద సక్సెస్ ఉంటుందనడానికి ఇదే నిదర్శనం అంటున్నాడు. టెలివిజన్‌లో హయ్యెస్ట్ పెయిడ్ యాక్టర్ అంటే హృతిక్కే అని టివి వర్గాలు కూడా అంటున్నాయి. స్టార్‌ ప్లస్‌లో ‘జస్ట్‌ డాన్స్’ రియాల్టీ షో వచ్చే నెల నుంచి ప్రారంభమవుతుంది. ఇందులో హృతిక్‌తో బాటు కొరియోగ్రాఫర్లు ఫరాఖాన్, వైభవీ మర్చంట్ న్యాయనిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఇక బుల్లితెర పారితోషికాల విషయానికి వస్తే ఇటీవల వీకెండ్స్‌లో సల్మాన్ ఖాన్ ఒక్క రోజే షూటింగ్ ముగించి రెండున్నర కోట్లతో ఇంటి కెళ్లాడట! సినిమాలు ఫట్టయినా వీరిని హిట్ చేసేందుకు టివిలు ఉండనే ఉన్నాయి మరి.

Source: medianx.tv

వీడియోకాన్‌తో బిగ్‌సిబిఎస్ చెట్టపట్టాల్

బిగ్‌సిబిఎస్ నెట్‍వర్క్ – వీడియోకాన్ డిటుహెచ్‌తో చేతులు కలిపింది. రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్ నెట్‍వర్క్‌కు, సిబిఎస్ స్టుడియోస్ ఇంటర్నేషనల్‍కు మధ్య జాయింట్ వెంచర్‌గా ఉన్న బిగ్‌సిబిఎస్ తన డిస్ట్రిబ్యూషన్ నెట్‍వర్క్‌ని మరింతగా విస్తరించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగానే వీడియోకాన్ డిటుహెచ్‌తో ఒప్పందం కుదుర్చుకుంది. దీంతో అమెరికాలోని ముఖ్యమైన షోలలో కొన్నింటిని వీడియోకాన్ డిటుహెచ్ వినియోగదారులు హాయిగా చూడగలుగుతారు.

Source: medianx.tv

రేసులో రెండో ప్లేసులో ‘జీ’


హిందీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో రేటింగులు మారి పోతున్నాయి. ఈ వారం ఒకరి రేటింగ్ హై అయితే మరొకరిది ‘లో’ అవుతుంది. మరోవారం ‘లో’ రేటింగ్ ఛానల్ ‘హై’ రేటింగ్‌లో ఉంటుంది.

పరమపదసోపానపటంలో నిచ్చెన మెట్లలా ఉంటున్నాయి ఈ రేటింగ్‌లు ! హిందీ ఛానల్స్‌లో స్టార్‌ ప్లస్ ఫస్ట్ స్థానంలో కొనసాగుతుండగా ఇప్పటివరకు రెండో స్థానంలో ఉన్న ‘కలర్స్’ మూడో ప్లేస్‌కి పడి పోయింది. దాని స్థానే జీ టీవీ రెండో ప్లేసు కెక్కి కూచుంది. ఫిబ్రవరి 26తో అంతమైన వారానికి ఈ ఛానల్ రేటింగ్  233 పాయింట్లకు పెరిగింది.  225 పాయింట్లతో కలర్స్ రేటింగ్ రెండో స్థానంలో నిలిచింది. అలాగే ఫ్యామిలీ కామెడీ ఛానల్ ‘సబ్’ నాలుగో స్థానానికి చేరింది. టాప్ ఫోర్ లీగ్‌లో ఈ ఛానల్ ‘సోనీ’ని పడగొట్టడం ఇదే మొదటి సారి. సోనీ రేటింగ్స్ 136 పాయింట్స్ కాగా సబ్ ఛానల్ రేటింగ్స్ 153కు పెరిగింది. ఇక  297 పాయింట్లతో స్టార్‌ ప్లస్ తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది.


Source: medianx.tv

మొబైల్‍లో లైవ్ ప్రోగ్రామ్స్

మన మొబైల్ ఇక లైవ్ ప్రోగ్రామ్స్ కూడా కవర్ చేయనుంది. సెల్‍లో ప్రత్యక్ష ప్రసారాలు చూడడం అద్భుతమైన ఫీలింగ్ ! ఈ సౌకర్యంపై స్టార్‌ మొబైల్ ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ సోనీ ఎరిక్‌సన్‌తో చర్చించింది. మొబైల్‍లో లైవ్ ప్రసారాలపై వచ్చిన ప్రతిపాదన పట్ల టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్) కూడా సానుకూలంగా స్పందించడం విశేషం.

ఇందులో బిఎస్‌ఎన్‌ఎల్‌, వోడాఫోన్ కూడా చేతులు కలుపు తున్నాయి. యానిమేటెడ్ మ్యూజిక్ వీడియోలు, మూవీలు, ఈవెంట్స్ ఒకటేమిటి? ఆయా ఛానల్స్‌లో లైవ్‌గా వచ్చే అన్ని ప్రసారాలను హాయిగా మొబైల్‍లోనే చూస్తూ ‘ఎంజాయ్’ చేసే రోజులు వచ్చేస్తున్నాయ్ మరి ! మొబైల్ టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కడమంటే ఇదే మరి !

Source: medianx.tv

సినీతారల క్రికెట్ సందడి

చూస్తే ఈ ఏడాదంతా క్రికెట్ పండుగ జరిగేటట్టేఉంది. వరల్డ్‌కప్, ఐపిఎల్ నాలుగో సీజన్ ముగిశాక క్రికెట్‌ మీద సెలబ్రిటీ క్రికెట్ లీగ్ దృష్టి పెట్టింది. సినీతారల క్రికెట్ సందడి జూన్ మొదటి వారంలో ప్రారంభం కానుంది. దేశంలో మొట్ట మొదటి సారిగా బాలీవుడ్, దక్షిణాది సినీతారలు క్రికెట్‍లో తమ టాలెంట్ నిరూపించు కోవడానికి తహతహలాడుతున్నారు. సిసిఎల్ తొలి సీజన్‌లో బాలీవుడ్, తెలుగు, తమిళం, కన్నడ సినీ హీరోలు, నటులు ఆరు లీగ్ మ్యాచ్‌లు ఆడనున్నారు. చివరి మ్యాచ్ ఉత్కంఠ భరితంగా ఉంటుంది. ఈ క్రికెట్ మెగా ఈవెంట్‍కు సన్నాహక మ్యాచ్‌గా బాలీవుడ్X1, సౌత్ సూపర్ స్టార్స్X1 జట్లు ఢీకొననున్నాయి. వైజాగ్‌లోని విడిసిఎ క్రికెట్ స్టేడియంలో మార్చి 5న ఈ సన్నాహక మ్యాచ్ డే అండ్ నైట్ జరుగుతుంది. బాలీవుడ్ టీం (ముంబై హీరోస్)కు సునీల్‍శెట్టి కెప్టెన్‌గా, తెలుగు ఇండస్ట్రీ నుంచి మన జట్టుకు విక్టరీ వెంకటేష్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారు. అలాగే తమిళ జట్టుకు సూర్య, కన్నడ జట్టుకు సుదీప్ కెప్టెన్‌గా వ్యవహరిస్తారని సిసిఎల్ వర్గాలు తెలిపాయి. క్రికెట్, సినిమా రెండూ కలిస్తే అభిమానులకు పండగేగా మరి.!

Source: medianx.tv

బ్రిటన్‌లో గూగుల్ యూ ట్యూబ్ మూవీ సర్వీస్

గూగుల్ యూ ట్యూబ్ మూవీ సర్వీస్ బ్రిటన్‌లో లాంచ్ కానుంది. ఈ సర్వీసు ద్వారా పెద్ద సంఖ్యలో సబ్‍స్క్రైబర్లను ఆకట్టు కోవాలని గూగుల్ యోచిస్తోంది. ప్రస్తుతం నెట్‍ఫ్లిక్స్, అమెజాన్ సర్వీసులు ఉన్నప్పటికీ యూ-ట్యూబ్ మూవీ సర్వీసు మాత్రం పెద్దగా ప్రాచుర్యం పొందలేదు. ముఖ్యంగా యూరప్ దేశాలలో నెట్‍ఫ్లిక్స్ సేవలు ఎవరికీ అందుబాటులో లేవు. దీంతో గూగుల్ రంగంలోకి దిగింది. తన సర్వీసు కోసం ఈ సైట్ కోట్లాది డాలర్లను కేటాయించడానికి సిద్ధంగా ఉంది. నెట్‍ఫ్లిక్స్ నుంచి గత ఏడాది సెప్టెంబర్‌లో వైదొలగిన ఎగ్జిక్యూటివ్ రాబర్ట్ కిన్‌సెల్ ఇక బ్రిటన్‌లో గూగుల్ యూ ట్యూబ్ మూవీ సర్వీసు పగ్గాలు చేపడతారని వినికిడి.

Source: medianx.tv

బిబిసిలో ‘డైనొసార్లు’

కోట్ల సంవత్సరాల క్రితం రాక్షసిబల్లులు ఉన్నట్టు మనం చదివాం…. వాటి శిలాజాల గురించి తెలుసుకున్నాం. అయితే గత 10 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు పరిశోధకులు లేటెస్ట్ డైనొసార్లకు సంబంధించిన అనేక అంశాలను కొత్తగా అధ్యయనం చేశారు. యంగ్‌జనరేషన్ డైనొసార్ లవర్స్ కోసం బిబిసి ఛానెల్ అప్‌డేట్ ప్రసారాలతో అలరించనుంది. రానున్న తరంవారికి డైనొసార్లతో బాటు టిరన్నోసారస్‌లు, డిప్లోడోకస్ లేదా స్పైనోసారస్ లేదా సముద్ర రాక్షసి ప్రిడేటర్X, మజునాసారస్‌ల వంటి అతి భయంకర జంతువుల గురించి తెలియజేసేందుకు బిబిసి సరికొత్త ప్రయోగాలు చేపట్టింది. త్రీడి గ్రాఫిక్స్‌తో ఈ జంతువుల భీకర పోరాటాలు, వాటి జీవన విధానం, వేటాడే పద్ధతులపై ఈ ప్రసారాలు ఉంటాయి. అలాగే ఆయా దేశాల్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలలో భద్ర పరచిన ఈ రాకాసి జంతువుల శిలాజాల గురించి, పరిశోధకులు వివరిస్తారు. భూ మండలంలోని అనేక వింత జంతువులు ప్రకృతిలో సంభవించిన మార్పుల కారణంగా అంతరించి పోయాయి. వాటి శిలాజాల కోసం జరుగుతున్న అన్వేషణపై కూడా బిబిసి ప్రసారాలు తెలియజేస్తాయి.

Source: medianx.tv

కొండవీటి రాజాలతో షోకుల రాణులు

ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లు తమ టిఆర్‌పి రేట్లను పెంచుకోవడానికి రకాల రకాల రియాల్టీ షోలపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని ఛానెల్లు చిన్న పిల్లలతో ఆట పాటలు చేయిస్తుంటే.. మరికొందరు పెద్దవారితో చేయిస్తున్నారు. ఇలా ఆట పాటల వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. కొన్ని రియాల్టీ షోలయితే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అసభ్యకరమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే... ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ 'జీ తెలుగు' ఓ వినూత్న రియాల్టీ షో "కొండవీటి రాజా.. కోటలో రాణి"ను ప్రారంభించింది.

ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్‌నర్‌గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.

లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్‌ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!

ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్‌లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత.

Source: thatstelugu.oneindia.in

Wednesday, March 2, 2011

యుఎస్‌లో ‘జూమ్’ ‘టైమ్స్ నౌ’ ప్రసారాలు

ఇండియాలో రెండు పాపులర్ ఛానెల్స్ ‘జూమ్’ ‘టైమ్స్ నౌ’ ఇక యుఎస్‌లో ప్రసారాలు ప్రారంభిస్తున్నాయి. ఇంగ్లీష్ న్యూస్ ఛానెల్ ‘టైమ్స్ నౌ’తో బాటు బాలీవుడ్ గాసిప్స్, మ్యూజిక్, మూవీస్‌తో అలరిస్తున్న ‘జూమ్’ ఛానెల్ ప్రసారాలను అమెరికా వాసులు తిలకించనున్నారు. ప్రపంచానికి ఇండియాను మరింత సన్నిహితం చేసేందుకు తాము ప్రయత్నిస్తున్నామని టైమ్స్ టెలివిజన్ నెట్‍వర్క్ చైర్మన్ వినీత్ జైన్ తెలిపారు. యుఎస్‌లో డిష్ నెట్‍వర్క్‌పై ఈ రెండు ఛానెల్స్ ప్రసారాలు ఉంటాయన్నారు. అమెరికాలో వీటికి శ్రీకారం చుట్టడం తమకు గర్వకారణమని జూమ్, టైమ్స్ నౌ వర్గాలు తెలిపాయి.

Source: medianx.tv

క్రికెట్ మీద డబ్బే డబ్బు

క్రీడల్లో క్రికెట్ రారాజుగా మారి పోయింది. క్రికెట్ మీద టివి ఛానళ్లకు కాసులు పండుతున్నాయి గత ఏడాది వీటికి కేవలం క్రికెట్ పైనే 1500 కోట్ల రూపాయల ఆదాయం వచ్చిందని అంచనా. ఈ సంవత్సరం వరల్డ్‌కప్, ఐపిఎల్ ఉండనే ఉన్నాయి. వీటి ద్వారా ఈ ఆదాయం దాదాపు 1800 కోట్లకు పెరగవచ్చునని భావిస్తున్నారు. పెద్ద సంఖ్యలో అడ్వర్టయిజర్లు – టెలికాస్ట్ హక్కుల కోసం పోటీలు పడుతున్నారు. 2007లో మూడు టెలికాం కంపెనీలు మాత్రమే క్రికెట్ టెలికాస్ట్ హక్కులు కోరగా, ఇప్పుడు వీటి సంఖ్య 17కు పెరిగిపోయింది. 2007లో సోనీ టివితో పోలిస్తే ఇఎస్‌పిఎన్, స్టార్ స్పోర్ట్స్ వంటి ఛానెల్స్ ఇప్పుడు రెట్టింతల ఆదాయం పొందుతున్నాయట! వరల్డ్‌కప్ నుంచి న్యూస్‌ ఛానెల్స్ కూడా బాగానే లాభపడుతున్నాయని ‘లోడ్ స్టార్ యూనివర్సల్’ సిఇఓ ప్రముఖ విశ్లేషకుడు అయిన శశిసిన్హా తెలిపారు. క్రికెట్‍పై ఛానల్స్‌కు వచ్చిన ఆదాయం మీద ఆయన అధ్యయనం చేశారు.

Source: medianx.tv

క్లియరెన్స్‌ల కోసం ఛానెల్స్ క్యూ


దేశంలో టివి ఛానెల్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయెట్టు ఉన్నాయి. తమకు లైసెన్స్‌లు కావాలంటూ కొత్తగా పెద్ద సంఖ్యలో ఛానెల్స్ యాజమాన్యాల నుంచి వస్తున్న దరఖాస్తులు వెల్లువలా కేంద్రం వద్ద పెరిగిపోతున్నాయి. గత ఏడాది జులై, ఈ ఏడాది జనవరి 19  వరకు కొత్తగా 29 అప్లికేషన్లు సర్కార్‌కు అందాయట. దాంతో వీటి సంఖ్య మొత్తం 293కి పెరిగిపోయింది. దేశంలో ప్రస్తుతం 626 ఛానల్స్ ఉన్నాయి. వీటిలో 314 ఛానెల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ కాగా, 312 ఛానెల్స్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఛానల్స్ అని తేలింది. అప్‌లింకింగ్, డౌన్‌లింకింగ్ గైడ్‌లైన్స్‌ కింద ఈ దరఖాస్తులన్నీ పరిశీలన దశలో ఉన్నాయి. హోంశాఖ నుంచి క్లియరెన్సులు రాగానే వీటికి పర్మిషన్ ఇస్తారు. లైసెన్సుల కోసం దరఖాస్తుల దాఖలు మీద నిషేధాన్ని ఇటీవలే ఎత్తివేశారు. ఛానెళ్ల సంఖ్యపై ఏదైనా సీలింగ్ విధించాలా అన్న విషయాన్ని పరిశీలించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)ని కేంద్రం ఆమధ్య కోరింది. అయితే ట్రాయ్ నివేదిక సమర్పణలో జాప్యం జరుగుతుండడంతో ఈ నిషేధాన్ని ఇటీవలి కాలంలో ఎత్తివేశారు.

Source: medianx.tv

మా టివికి ‘డమరుకం’ శాటిలైట్ హక్కులు

కింగ్ నాగార్జున నటించబోతున్న ‘డమరుకం’ చిత్రం షూటింగ్ ఇంకా మొదలు కానేలేదు… కానీ అప్పుడే ఈ సినిమా శాటిలైట్ హక్కుల్ని మా టివి సొంతం చేసుకుంది. రు.5.50 కోట్లకు ఈ హక్కులు మా టివి కైవసమయ్యాయట! ‘నాగ్’తో ‘అనుష్క’ ఈ చిత్రంలో మళ్లీ తళుక్కుమని మెరవనుంది. వెంకట్ ప్రొడ్యూస్ చేస్తున్న ‘డమరుకం’ సినిమాను శ్రీనివాస రెడ్డి దర్శకులు. ఆర్‌ఆర్ మూవీమేకర్స్ బ్యానర్‌పై తీస్తున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రంలో సుమారు 50 నిముషాల పాటు గ్రాఫిక్స్ వర్క్ ఉంటుందట! వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా రానున్న ‘డమరుకం’ ప్రేక్షకుల్ని నాగ్ అభిమానుల్ని రంజింపజేయనుంది.

Source: medianx.tv

బాబోయ్ "కాఫీబార్‌" బేజార్...‌!

గీతాకృష్ణ రెండేళ్లుగా తీస్తున్న 'కాఫీబార్‌' అనే సినిమాను ఎట్టకేలకు ఈనెల 11న విడుదల చేస్తున్నట్లు ప్రకటించాడు. ఈ చిత్రం బిజినెస్‌ కాకపోవడంతో డబ్బింగ్‌ సినిమాలు తీసి కాస్తోకూస్తో వెనకేసుకున్న సుబ్రహ్మణ్యం తన భుజాలపై వేసుకుని రిలీజ్‌ చేయడానికి ముందుకు వచ్చాడు.
తెలుగు, తమిళ, హిందీ భాషల్లోఈ చిత్రాన్ని నిర్మించినట్లు చెప్పారు. అయితే... తెలుగు సినిమా శాటిలైట్‌ రైట్స్‌ కోసం కొంత ఆఫర్‌ చేసిన ప్రముఖ ఛానల్‌కు ససేమిరా అన్నాడు గీతాకృష్ణ. మరో ఛానల్‌ దాని హక్కులు కోసం ముందుకు వచ్చింది. వారి కోరిక మేరకు ప్రసాద్‌ ల్యాబ్స్‌లో షో ఏర్పాటు చేశారు.
సినిమా చూశాక వారు వెనుకడుగు వేశారు. ఇచ్చిన అడ్వాన్స్‌ తిరిగి ఇవ్వననడంతో తర్వాత ఎలా రాబట్టుకోవాలో చూద్దామంటూ... సదరు ఛానల్‌ వారు వెళ్ళిపోయారు. సినిమాలో ఏమాత్రం సరైన కథ లేకపోవడంతోపాటు.... నలుగురు మినహా తెలిసిన మొహాలు లేకపోవడం విశేషం. రోడ్డుపై చెత్తను ఏరుకునే కొంతమంది వ్యక్తులు అంతర్జాతీయ టెర్రరిస్టుల్ని పట్టుకోవడం చిత్రకథ. తీసిన విధానంలో ఎక్కడా లాజిక్కు లేకపోవడంతో... వారు వెనక్కు తగ్గినట్లు సమాచారం.

Source: telugu.webdunia.com

Tuesday, March 1, 2011

బుల్లితెరపై హృతిక్ హవా

బుల్లితెరపై అత్యధిక పారితోషకం పొందిన సినీ నటుడుగా బాలీవుడ్ హీరో హృతిక్ రోషన్ నిలిచాడు. ఒక టివీ ఛానల్‌లో ప్రసారం కానున్న డ్యాన్స్ రియాల్టీ షోకు అతడు న్యాయనిర్ణేతగా వ్యవహరిస్తున్నాడు.

స్టార్ ప్లస్ టివీ ఛానల్ 'జస్ట్ డ్యాన్స్' రియాల్టీ షోను రూపొందిస్తున్నది. రియాల్టీ షో షూటింగ్ వచ్చే నెలలో ప్రారంభమవుతుంది. ఆ రియాల్టీ షోలో పాల్గోనే పోటీదారుల నాట్య సామర్థ్యాన్ని అంచనావేసే బాధ్యతను బాలోవుడ్ నృత్యదర్శకులు ఫరాఖాన్, వైభవీ మర్చంట్‌లతో 37 సంవత్సరాల హృతిక్ పంచుకుంటాడు.

హృతిక్ ఈమధ్య కాలంలో నటించగా విడుదలైన 'కైట్స్', 'గుజారిష్' చిత్రాలు బాక్సాపీస్ వద్ద బోల్తా కొట్టాయి. దాంతో బుల్లితెరపై విజయవంతమైన ఇన్నింగ్స్‌ను అతడు ప్రారంభించాడు.

"భారీ వైఫల్యాల తర్వాతనే భారీ విజయం వరిస్తుంది" అని గత మాసం డ్యాన్స్ రియాల్టీ షో ఆవిష్కరణ కార్యక్రమంలో హృతిక్ వ్యాఖ్యానించాడు. రియాల్టీ షోలో నటించే ప్రతి ఎపిసోడ్‌కు దాదాపు రూ. రెండు కోట్లను కార్యక్రమ నిర్వాహకులు ఆయనకు చెల్లిస్తారనే వార్తలపై హృతిక్ స్పందిస్తూ "నాకు తగిన పారితొషకం ఇస్తున్నారనే అనుకుంటున్నాను" అని అన్నాడు.

కానీ బుల్లితెరపై నటించే బాలీవుడ్ నటుల్లో అత్యధిక పారితోషకాన్ని హృతిక్ రోషన్ పొందుతున్నాడని ఆయన సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. "ప్రతి ఎపిసోడ్‌కు ఆయనకు రూ. రెండు కోట్లు చెల్లిస్తారు. సల్మాన్ ఖాన్ ఒక టివీ షో కోసం కేవలం వారాంతాల్లోనే నటిస్తున్నాడు. ఒక్క రోజులో రెండు ఎపిసోడ్లలో నటించినందుకుగాను సల్మాన్‌కు రూ. 2.5 కోట్లు ముట్ట చెప్పారు" అని వర్గాలు తెలిపాయి.

Source: www.apweekly.com

ఎయిర్‌టెల్ డిజిటల్‌లో టీవీ5 న్యూస్


సాక్షి రెండవ వార్షికోత్సవం ప్రోమో వీడియో

మీడియాపై కసిగా వర్మ సినిమా?

ఓ తెలుగు  టీవీ చానెల్‌పై గుర్రుగా ఉన్న ప్రముఖ దర్శక నిర్మాత రామ్‌గోపాల్ వర్మ మీడియాపై తన కసి తీర్చుకోనున్నట్లు సమాచారం. ఆ టీవీ చానెల్ తనను అవమానపరిచిందంటూ వర్మ గగ్గోలు పెడుతున్నారు. అందరినీ తన సినిమాలతో ఏకి పారేసే వర్మ ఓ టీవీ చానెల్ తనను ఏకేయడంతో బిత్తరపోయినట్లే కనిపిస్తున్నారు. బెజవాడ రౌడీలు సినిమా కూడా రూపు దిద్దుకుంటోంది. ఇది కల్పిత వాస్తవ కథ కాదట, పూర్తిగా కల్పిత గాథనే అని ఆయన అంటున్నారు. విజయవాడకు చెందిన పలువురు రాజకీయ నాయకులు బెజవాడ రౌడీలు టైటిల్‌ను వ్యతిరేకిస్తున్నారు. దీంతో ఆయన రక్త చరిత్ర లాగా కల్పిత వాస్తవ గాథ అని కాకుండా పూర్తిగా కల్పిత కథ అని ముందు నుంచే చెప్పుకుంటున్నారు. అసలు విషయానికి వస్తే, ఆయన మీడియాపై తీయబోయే సినిమా కల్పిత కథనో, వాస్తవ కథనో తెలియదు. దీనికి సంబంధించి వర్మ ఆలోచన చేస్తున్నప్పటికీ చేస్తారో, లేదో కూడా తెలియదు.

Source: thatstelugu.oneindia.in

నో.. ముద్దు..

మికా సింగ్ ఎవరో తెలుసా? రాఖీ సావంత్‌ని పట్టపగలు పార్టీలో నిర్మొహమాటంగా ముద్దిడిన మగానుభావుడు. ఆ తర్వాత మికా సింగ్‌పై రాఖీ కేసు వేయటం.. అతగాడు కోర్టు మెట్లెక్కడం - కావల్సినంత పబ్లిసిటీ స్టంట్ జరగటం అన్నీ ముగిసింత్తర్వాత - మళ్లీ మికాసింగ్ తెర మీదికి రావటానికి కారణం - ఒక వీడియో ఆల్బమ్‌కి గాను కంగనా రనౌట్‌ని ‘ముద్దు’ కి ప్రపోజ్ చేశాట్ట. దాంతో మండిపడి అరిచి గోల చేసింది కంగనా. ఇదంతా నటనలో భాగమేనని అంటున్నప్పటికీ ఛస్తే ఒప్పుకోనని తెగేసి చెప్పిందిట. మరి ‘పబ్లిసిటీ’ అవసరం లేదనుకుందేమో?!

Source: www.andhrabhoomi.net

‘టెర్రస్’ ప్రేమ కథ

ప్రేమ కథలన్నీ - ఏ బస్టాప్‌ల్లోనో.. వీధి మలుపుల్లోనో.. కాలేజీ వరండాల్లోనో జరుగుతాయన్నది యుగాల నుంచీ వస్తున్న సంప్రదాయం. కానీ ‘టెర్రస్’ మీద కూడా ప్రేమ కథలు పుడతాయిట. రొమాన్స్‌కి ‘మేనర్స్’ లేనట్టే.. కథ ఎక్కడ మొదలైతే ఏమిటి? మా కథ టెర్రస్ మీద మొదలవుతుంది అంటున్నారు ‘ఛజ్జే ఛజ్జే కా ప్యార్’ నిర్వాహకులు. రొమాన్స్, కామెడీ, ట్రాజెడీ కలబోతగా నిర్మితమవబోతున్న ఈ ‘టెర్రస్’ కథకి గాను పాత ఢిల్లీలో అందమైన సెట్స్ వేశారు. రియాలిటీ షోలకు పెట్టింది పేరైన మేజర్ ఎండెమోల్ ఇండియా ఆధ్వర్యంలో మహేష్ పాండే ఈ కథని రాశాడు. ఇదేదో పెద్దింటి కథ కాదు. పేదింటి కథ. ఒక అమ్మాయికి - ఒక అబ్బాయికి ‘కామన్’గా వాడుకునే టెర్రస్ మీద పరిచయం. ఆ కథ టెర్రస్ మీద ఎనె్నన్ని మలుపులు తిరిగిందో? చూడాలంటే కొన్ని నెలలు ఆగాలి. షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగుతూ ప్రైమ్ టైమ్ కోసం నిరీక్షిస్తున్నట్టు భోగట్టా.

Source: www.andhrabhoomi.net

వీక్షకుల తీర్పు

‘తీర్థయాత్ర’
ఈటీవీ-2లో ప్రసారమవుతోన్న ‘తీర్థయాత్ర’ చాలా నిరుత్సాహాన్ని కలిగిస్తోంది. కెమెరా అమ్మవారి ముఖం మాత్రం చూపించి, పాదాలనూ పీఠాన్నీ చూపించదు. అలాగే శివలింగం మీదున్న ధారా పాత్రనూ, లింగం మీది దళాలనూ చూపిస్తూ ఠక్కున భక్తురాళ్లని చూపిస్తుంది. లేదా సముద్రాన్ని చూపిస్తుంది. ఇలాగే ఎన్నెన్నో. సోమనాథాలయంలోని అమ్మవారి ముఖం పూర్తిగా చీకట్లో కలిసిపోయి ఉండటం మేం చూశాం. గతంలో ఉజ్జయిని ఆలయంలోకి కిందికి దిగి వెళ్లే మెట్లను కెమెరా పదేపదే చూపించింది. దిగి వెళ్తే కోనేరు వస్తుంది. కుడి పక్కన మహాకాళేశ్వర లింగమూ కనిపిస్తుంది. ఈ రెండూ చూపకుండా కెమెరా తిన్నగా లింగంపై భాగాన్ని మాత్రం చూపించింది. ఆ వెంటనే ఆలయ శిఖరాన్ని చూపించారు. ఇలా ప్రతి ఎపిసోడ్‌లనూ సగం సగం చూపటమే జరుగుతోంది. భక్తుల మనోభావాల పట్ల అంత నిర్లక్ష్యం కూడదు. స్క్రిప్ట్ విషయంలోనూ ఇలాగే. దర్శనీయమైన ప్రత్యేక అంశాలను అందించాలని రైటర్ తెలుసుకోవాలి. ఉదాహరణకు ఉజ్జయినిలోని మహాకాళేశ్వరుడికి జరిగే భస్మ హారతిని చూడటం జన్మ ఎత్తినందుకు ఒక సార్థకత. దాన్ని చూపాలి. ఇంకా మహాకాళేశ్వరుడికి జరిగే అలంకారాలు అద్భుతాలు వాటిని చూపాలి. తలపాగా మీసాల్తో ఉన్న ఒక మహారాజట! భిక్షువుట! కోపం ముఖంతో ఉన్న స్మరహరుడట!.. ఎన్ని రకాల అలంకారాలో! అక్కడ దొరికే ఫొటోలనైనా చూపించవచ్చు కదా. అలాగే సోమనాథాలయం పునరుద్ధరణ కార్యక్రమాన్ని ఎంతో సాహసవంతంగా నిర్వహించిన సర్దార్ వల్లభాయ్ పటేల్‌ను వివరంగా చూపించలేదేమి? అసలాయన్ని గురించి చెప్పలేదేమి? అక్కడకు దగ్గర్లో వున్న కృష్ణుడి నిర్యాణం సమాధిని చూపించనక్కర్లేదా?

‘అగస్త్యుల వారు ఇక్కడికి వచ్చారని ఇక్కడి వారి నమ్మకం’ వంటి వాక్యాలు (అన్ని ఎపిసోడ్‌లలోనూ ఉంటున్నవి) రైటర్‌కున్న అవగాహనలోని అసంపూర్ణత్వాన్ని స్పష్టంగా చెబుతున్నాయి. ఆ నమ్మకం ‘అక్కడి వారికేనా’? అందరు హిందువులకు లేదా? ఉండదా? ‘వచ్చారు’ అని చెప్పలేరా?


యాంకర్ వైదేహిగారు ‘శంఖరుడు’ ‘ఖాళీమాత’ వగైరా అపభ్రంశపు ఉచ్చారణలను మానాలి. మొత్తం మీద ‘తీర్థయాత్ర’ను గత కొన్నాళ్లుగా చూస్తున్న వాళ్లకు భక్త్భివం పెరగటం దేవుడెరుగు, ముందు విసుగు కలుగుతోంది.
-గుండు సుబ్రహ్మణ్య దీక్షితులు,
ఏలూరు


సిఐడి
రాత్రి 10 గంటలకు మాటీవీ వారు కొన్ని నేరాలు - హత్యలు అవి చేసిన వారి నేరాలను ఏ ‘క్లూ’తో కనుగొనవచ్చునో చూపుతున్నారు. ఫలానా ఆవిడ గుడ్ ‌నైట్ చెబుతూ, లిప్‌స్టిక్ పూసిన పెదవులతో తను చంపిన వ్యక్తికి ముద్దు ఇస్తుంది. అందువల్ల ఆ ముద్దు గుర్తును బట్టి ఆ లిప్‌స్టిక్ ముద్దు గుర్తును క్లూగా తీసుకుని ఆవిడే హంతకురాలు అని తెలుస్తుంది. ఇలాంటి ‘క్లూస్’ ఈ సిఐడి కార్యక్రమాలు తెలుపుతున్నాయి. ఈ తెలివిని ఉపయోగించి క్లూస్‌ను దొరకనీయకండి అని నేరస్థులకు పాఠాలు చెబుతున్నట్టా?
-శ్రీమతి ఈషికాదేవి (మల్కాజ్‌గిరి)


పసుపు-కుంకుమ

జీ తెలుగు ‘పసుపు-కుంకుమ’ సీరియల్‌లో దిష్టి తీసే సీనొకటి చూపారు. వయసులో చిన్నవారు తమకంటె పెద్దవారికి దిష్టి తీయకూడదు. ఆ అమ్మాయి ఇంట్లో పెద్దవారికి విషయం చెప్పి వారితో దిష్టి తీయించినట్లు చూపించి ఉంటే బాగుండేది.
-ఆర్.ఘంటప్ప (తాడిపత్రి)


ఘోరాతి ఘోరం
11.2.2011 ఘంటసాల వర్థంతి సందర్భంగా జీ తెలుగు ఛానెల్‌లో ‘చిరంజీవులు’ పేరిట ఘంటసాలపై ప్రత్యేక కార్యక్రమం ప్రసారం చేసి ఘంటసాల 46 చిత్రాల్లో పాడినట్లు 52 చిత్రాలకు సంగీత దర్శకత్వం వహించినట్లు స్క్రోలింగ్ వేశారు. ఇది పరమ దారుణం. ఘంటసాల 650 చిత్రాలకు పైగా పాటలు పాడారు. వందకు పైగా చిత్రాలకు సంగీతం అందించారు. నిజానిజాలను తెలుసుకోకుండా వీక్షకులకు తప్పుడు సమాచారం ఇవ్వటం ఘోరం. భవిష్యత్తులో ఇటువంటి పొరపాట్లు జరక్కుండా చూసుకోవటం మంచిది.
-ఎస్.వి.రామారావు
హైదరాబాద్


నల చరిత్రయా? నాలా చరిత్రయా?
ఫిల్మ్ అవార్డుల కార్యక్రమంలో (ముంబైలో కాబోలు) సాంస్కృతిక కార్యక్రమాలు చూపించారు. ఒక నృత్య కళాకారిణి ‘నల చరిత్ర’ (నల దమయంతి గాథ)లో భాగాలను నృత్యం చేసి చూపారు. కాని ఆ కార్యక్రమాన్ని పరిచయం చేసే యాంకర్ ‘ఫ్రం నాలా చరిత్ర’ అంది ఆంగ్లంలో. నాలాలకు నలులకు వ్యత్యాసం ఎంతో కదా. మరో తెలుగు యాంకర్ ‘శారీ’ (చీర) అనేందుకు బదులు ప్రతిసారి ‘సారీ’ అంటోంది. సారీకి శారీకి ఎంతో దూరం కదా.
-శ్రీమతి సుజాత నాగరాజారావు, కావలి


ఇవేం సీరియల్స్?
ఈ మధ్య హిందీ తెలుగు సీరియల్స్‌ని వివిధ ఛానల్స్ ప్రసారం చేస్తున్నాయి. ముగింపు లేని సీరియళ్లను అనవసరంగా పొడిగిస్తూ పోతూ ప్రేక్షకులు బోర్ చెందుతున్నారని గ్రహించి ఈ మధ్య ఏక్తాకపూర్ సీరియల్స్‌లోనూ, ఇతర సీరియల్స్‌లోనూ ప్రేమ దృశ్యాలు, కౌగిలింతలు, ముద్దు సీన్లు చిత్రీకరిస్తున్నారు. ‘సంగిని’ ‘దిల్ సే దియా వచన్’ లాంటి సీరియల్స్‌లో లవ్ సీన్లు మితిమీరిపోతున్నాయి. సినిమాల కంటే సీరియల్స్‌లో కూడా లవ్ దృశ్యాలు, కౌగిలింతలు, ఒకరిపై ఒకరు పడుతూ చూపిస్తున్న దృశ్యాలు ఇంట్లో కూర్చుని కుటుంబంతో కలిసి చూట్టానికి ఇబ్బంది పడుతున్నారు. టీవీ సీరియల్స్‌కు కూడా సెన్సార్ అవసరం.
-మహ్మద్ యూసుఫ్, కాజీపేట
 

చంద్రముఖి
ద్వేషాలు, మోసాలు, రోషాలు చూపించి/ బీభత్సములతోడ భీతి గొలుపు/ ఒకరితో ప్రేమ వేరొకరితో పెళ్లికి/ సిగ్గు విడిచి తాము సిద్ధపడుచు/ కిడ్నాపు డ్రామాలు కీలక దృశ్యాలు/ హింసించు టెంతయు హేయవౌను/ మనసులో ఒక రీతి మసలు పద్ధతి వేరు/ దొంగ నాటకమాడు దుష్టులగుచు/ పెక్కు ఎపిసోడ్లు పొడిగించి పెంచుచుండ/ చంద్రముఖి సీరియల్ గాంచి చకితులగుచు/ జిడ్డు సీరియలిదనుచు ఛీత్కరింప/ ఎపుడు ముగియింప జూతురో ఎరుక గాదు.
-కరణం రాజేశ్వరరావు, హిందూపురం
 

క్రికెట్ పండుగ
వచ్చేసింది.. వచ్చేసింది క్రికెట్ పండుగ. ఆనందమే ఆనందం. ఇక సీరియళ్ల బెడద ఉండదు. ఇడియట్ బాక్స్ నుంచీ అసందర్భపు సీన్లు, డైలాగులు, నిర్వాకాలు, జనాల్ని ఇబ్బంది పెట్టే వెర్రిమొర్రి వేషాలు, దరిద్రపు సీరియల్స్‌కు ఇక చెక్ పెట్టేయ్యొచ్చు.
-కొంగర ఉమామహేశ్వరరావు, తెనాలి


పునర్జన్మ
మాటీవీలో ప్రసారమవుతున్న ‘గత జన్మ రహస్యం’లో - ఒకామె ట్రాన్స్‌లోకి వెళ్లిపోయి తాను లంబాడీల ఇంట్లో పుట్టి బాధలనుభవించి ఓ కొడుక్కి తల్లయి ఆఖరికి చనిపోయినట్టు.. ఆ కొడుకే మరుజన్మలో భర్త అయినట్లు చెప్పారు. ఆమె జీవిత చరిత్ర తెలుసుకోగలిగాం. కాని ఆ కొడుకే భర్త (ఈ జన్మలో) అయినట్టు తెలుసుకునేందుకు దాఖలాలేవీ? ఈ కార్యక్రమంలో ఇటువంటి సందేహ నివృత్తి చేస్తే ప్రేక్షకులకు మరింత చేరువవుతుంది.
-శివాని, శృంగవరపుకోట


చిన్నారి పెళ్లికూతురు
మా టీవీలో రాత్రి 7 గంటలకు ప్రసారమవుతున్న ‘చిన్నారి పెళ్లికూతురు’ అద్భుతంగా ఉంది. బాల్య వివాహాల వల్ల కలిగే అనర్థాలను చూపుతూ రాజస్థానీ నేపథ్యంలో నిర్మించిన ఈ సీరియల్ చూసి మన సీరియల్ నిర్మాతలు, దర్శకులు నేర్చుకోవలసింది ఎంతైనా ఉంది.
-శుభ, కాకినాడ


Source: www.andhrabhoomi.net

ఎల్లలెరుగని నృత్యం

ఇది వరకైతే సినిమా వాళ్ళు టీవీల్లోకి వస్తే ‘అక్కడ కనుమరుగవుతుంటే ఇక్కడ ప్రత్యక్షమవుతున్నార’నే అపవాదొకటి ఆర్టిస్టులకొచ్చేవి. కానీ నేడు పరిస్థితి మారింది. సినిమాతో సమాంతరంగా చిన్న తెర రాజ్యమేలుతోంది. కొన్నికొన్ని సందర్భాలలో నటీనటుల సుదీర్ఘ చలనచిత్ర కాలంలో రానంత పేరు టీవీల్లో వారు పాల్గొనే ఒకటో, రెండో షోలకు వచ్చేస్తోంది. అందుకెన్నో ఉదాహరణలు. ఇప్పుడా మాదిరి ప్రయత్నాన్ని నటుడు హృతిక్ రోషన్ స్టార్ టీవీలో రానున్న ‘జస్ట్ డాన్స్’ నృత్య కార్యక్రమం ద్వారా చేయనున్నారు. ‘జస్ట్ డాన్స్’ కార్యక్రమానికి న్యాయనిర్ణేతల్లో ఒకరుగా హృతిక్ వ్యవహరిస్తున్నారు. ఈ కొత్త అవతారపు అనుభవాలు ఆయన మాటల్లోనే..

ఎందుకొప్పుకున్నానంటే..

ఒక ఆర్టిస్టుగా నిరంతరం నవ్యత కోసం అన్వేషిస్తూ వుంటా. ఆ అన్వేషణలో భాగంగానే స్టార్ చానల్ వారు ‘జస్ట్ డాన్స్’ కాన్సెప్ట్‌ని నా ముందుంచి నన్ను కూడా సహకరించమన్నప్పుడు ఇంకో ఆలోచన లేకుండా యస్ చెప్పేశా.

నేనేం పెద్ద గొప్ప డాన్సర్‌ని కాను
చాలామంది అంటున్నారు. నాకు డాన్స్‌పట్ల ఉన్న ఇష్టం వల్లే ఈ షో ఒప్పుకున్నానని. కానీ నా దృష్టిలో నేనేం పెద్ద నెంబర్ వన్ డాన్సర్నేం కాదు. నిజానికి నా కన్నా అనేక మంది ఉత్తమోత్తమ డాన్సర్లు ఉన్నారు. నన్నడిగితే పాత తరం నటుడు షమీకపూర్ బెస్ట్ డాన్సర్. ఇప్పుడు తరచు మనం అనుకునే ‘గాడ్ ఆఫ్ డాన్స్’ పదానికి సరిపోతారు. ఆయన నృత్యం చేస్తే హృదయం నుంచి ఆవిష్కరించుకుని నృత్యం చేసినట్లు ఉంటుంది. ఇంక ఈ కార్యక్రమం విషయానికొస్తే బెస్ట్ డాన్సర్‌ని గుర్తించే ప్రక్రియలో ఇదో భాగం. ఒక్కమాటలో చెప్పాలంటే నృత్యానికి ఎల్లలు లేవు. ఎంత నేర్చుకున్నా, చేసినా ఎంతో కొంత ఉంటూనే ఉంటుంది.

అందరూ స్ఫూర్తిదాయకులే!

నాకీ ప్రోగ్రాం చేయడానికి అంటే.. న్యాయనిర్ణేతగా, సంధానకర్తగా.. ఉండడానికి ప్రత్యేకించి ఫలానా వారు స్ఫూర్తి అని వర్గీకరించలేను కానీ, చాలా షోలు చూసిన నేపథ్యంలో అందరూ నాకు మార్గదర్శకులే అని మాత్రం చెప్పగలను. ఎక్కువగా నేను అమితాబ్ షోలు టీవీలో చూశాను. ఇక్కడ ఇంకో గమ్మత్తైన విషయం మరొకటుంది. నాకెక్కువ ఇష్టమైన డాన్స్‌లో నాకు గురువుల తగ్గ ఫర్హాఖాన్, వైభవీ మర్చెంట్‌తో పాటు నేనూ జడ్జ్‌గా ఈ షోకు వ్యవహరిస్తున్నాను.

వైఫల్యం వెనుకే విజయం

ఇటీవల నేను నటించిన రెండు చిత్రాలూ అంతగా విజయం పొందలేదు. అంత మాత్రాన దిగులు లేదు. ఎప్పుడూ చీకటి వెంట వెలుగున్నట్లే, ఫెయిల్యూర్‌ల వెన్నంటే సక్సెస్ కాచుకుని ఉంటుందని నేను నమ్ముతాను. ఆ తీరులోనే వాటి వెనుక వచ్చే ‘జస్ట్ డాన్స్’ తప్పక అందరి ఆదరణా పొందుతుంది’ అంటాడు హృతిక్.

Source: www.andhrabhoomi.net

ఎక్కడికెళ్తున్నాం మనం?

టీవీ అనేది ఏదో రోజంతా చేసిన శ్రమకు లేదా చికాకు, అన్య మనస్కత పోయి తిరిగి రీఛార్జ్ చేసుకోడానికి అనే రోజులు రాన్రాను పోతున్నాయనిపిస్తోంది. అలా అనడానికి బలమైన ఉదాహరణ ఎంటీవీలో ప్రతి శని, ఆదివారాలు రాత్రి 7 గంటలకు వస్తున్న ‘రోడీస్’ కార్యక్రమం అని చెప్పడానికి బాధగా ఉన్నా అనివార్యమే అనిపిస్తోంది. ఏ కార్యక్రమం చూసినా ఓ రకమైన ఆహ్లాదం, ఉత్సాహం వచ్చి కొత్త ఆలోచనలకు ఉపకరించాలి తప్ప ఇలా భావోద్వేగాలనో, భాషతో ఏ రకంగా మరొకరిని కించపరచవచ్చో అన్నది తెలియని వారికి సైతం లేని ఆలోచనలు వచ్చేలా చేసే ఈ ధోరణి వల్ల ఒక్కసారిగా సదాలోచనా పరులందరికీ ‘ఎక్కడికెళ్తున్నాం మనం’ అన్న భావన తప్పక కలుగుతుంది.

ప్రశ్నల ధోరణి ఇలాగా?
ఇప్పటి వరకూ ఏడు సీజన్ల కార్యక్రమం పూర్తి చేసుకున్న ‘రోడీస్’ ఎనిమిదవ సీజన్ ప్రోగ్రామ్స్ ఇటీవల ఆరంభమయ్యాయి. బెంగుళూరులో ఈ కార్యక్రమంలో పాల్గొనడానికి అర్హత సంపాదించే వ్యక్తుల ఎంపిక పోటీలు గత శనివారం, ఆదివారాలలో ప్రసారం చేశారు. ఇందులో అభ్యర్థులుగా అర్హత పొందగోరే వారిని అడిగే ప్రశ్నల విషయంలో ఏమి ఆశించి వాటిని అడిగారో అన్నది కాస్త ప్రశ్నార్థకంగా మారింది. ‘వివాహానికి పూర్వమే శారీరక సంబంధం అన్న దానిపై నీ అభిప్రాయం’ అన్న ప్రశ్నను సంధించారు. వారు దానికి ఎలా స్పందించారో అన్నది పక్కన పెడితే ఈ ప్రశ్న ఔచిత్యం లేదా ఏ స్థాయికిది సంకేతమో తెలియాలి. ఇందులో పాల్గొంటున్న వారంతా దాదాపు యవ్వన దశలో ఉన్నవారు కనుక అలా అడిగారా? లేదా ఈ తరం ఆలోచించేది ఇదేనని కార్యక్రమ నిర్వాహకులు డిసైడై పోయారా? అన్నది ఆలోచించాలి. ఈ ప్రశ్నకు సమాధానంగా ‘ఇద్దరికీ ఇష్టమైతే ఓకే.. అని ఒకరంటే, ఏది సక్రమం కాదో దానిలో మజా అనుభవిస్తాడు మనిషి అని మరొకరు సమాధానమిస్తారు. ఈ సమాధానాలకు ప్రమాణాలు దిగజారిపోతున్న పరిసరాలు అనుకోవాలి. అసలింతకంటే మంచి ప్రశ్నలు తట్టలేదా అన్న ఆవేదనా చూపరులకు కలిగింది.

రెచ్చగొట్టడమే లక్ష్యమా?..
 
ఇక ప్రశ్నల సంగతి అలా ఉంటే, ప్రశ్నల అడిగే వారి ధోరణీ కాస్త తేడాగానే ఉంది. అంతగా సంబంధిత అంశంలో అడిగిన దానికి అవగాహనా లోపమో, మరే కారణం వల్లో కొద్దిగా ఉద్రేకానికి లోనయినా, దాన్ని తగ్గించేలా చేయాల్సిన అవసరం నిర్వాహక పీఠంపై కూర్చున్న ప్రశ్నలడిగే పానెల్ సభ్యులపై ఉంది. ఈ కనీస ధర్మాన్ని సైతం విస్మరించి వారూ పెద్దగా అరవడం, అనవసర పదజాలం (ఇది మనకు వినిపించదనుకోండి!) ఉపయోగించడం వంటివి చూసి విస్తుపోవడం మన వంతైంది. అయితే ఇదంతా ప్రోగ్రామ్ డిజైనింగ్‌లో భాగం, దాని అంతరార్థం వేరు అని చెప్పే ప్రయత్నం తర్వాత చేసినా దీని దుష్ప్రభావం పోదు. ఇదెలా ఉందంటే సినిమాలో మొత్తం ఏవైతే చూపకూడదో అవి చూపించి చిత్రాంతాన ఇది తప్పు అని ఏకవాక్య సంభాషణతో శుభం కార్డు వేసినట్లుంది.

దీన్ని అతిశయోక్తి అనచ్చా?
ఇందులో పాల్గొనే క్యాండిడేట్స్ దీనిపై చూపే స్పందన, అనుభవాలూ పరిశీలిద్దాం. ఒక అభ్యర్థైతే నేను ఇంతవరకూ ఇందులో ఆరుసార్లు పాల్గొన్నా. ఇది ఏడోసారి అంటూ నా జీవిత లక్ష్యం అన్న టైప్‌లో మాట్లాడాడు. అలాగే తక్కినవారు. నేనిందులో పాల్గోడానికి ఎంతైనా కష్టపడతా. ఇష్టపడతా అన్న తరహాలో ఈ వాక్పటిమ సాగిపోయింది. అయితే అలా నా జీవితేచ్ఛ అని చెప్పిన వ్యక్తి రోడీస్‌లో ఎంపికయ్యారు. ఎంపిక చేస్తూ వ్యాఖ్యాత్రి చెప్పిన వ్యాఖ్యానం (నిన్నింక ఆడిషన్ చేసే అదృష్టం మాకు లేదు - అంటే ప్రస్తుత సీజన్‌లో ఆ వ్యక్తి సెలెక్ట్ అయినట్లు..) బాగుంది.

సూత్రాలు ఏవైనా..
మనిషిలో తెగింపు నేర్పడానికీ, భయాన్ని పారద్రోలడానికీ, జీవితంలో ఎలాంటి సంఘటనలు ఎదురైనా ధైర్యంగా ఎదుర్కోడానికీ ఈ మాదిరి షోలు ప్రేరకాలు అవుతాయని ఎంతగా సూత్రీకరించినా, అందుకు అనువైన ఆహ్లాదమైన, అపాయకర ధోరణిలోకి తీసుకువెళ్లని పంథాలో ‘రోడీస్’ని డిజైన్ చేస్తే బాగుంటుంది. లేకుంటే ఈ కార్యక్రమానికి ఉపనామంగా (షార్ట్ కట్ టు హెల్) పెట్టినది పదేపదే గుర్తుకొచ్చేలా ఉంది.

Source: www.andhrabhoomi.net

క్రికెట్ ఫీవర్

క్రికెట్ మాటేమోగానీ - కొన్నాళ్ల క్రితం ‘మందిర’ తన ‘స్ట్రాప్’ అందాలతో జనాన్ని ఉర్రూతలూగించి ‘సెంచరీ’ చేసేసి ఆనక బోలెడన్ని ప్రశంసలూ కొట్టేసింది. వరల్డ్ కప్ జరుగుతున్న నేపథ్యంలో అన్ని ఛానెళ్లూ క్రికెట్ అనుభవజ్ఞుల చేత చర్చాగోష్ఠులు నిర్వహించటం షరా మామూలే. ఫలానా ‘సచ్చినోడు’ సెంచరీ కొట్టేస్తాడా? పిచ్ బాగుంటే ఎన్ని బౌన్సర్లు పడతాయి? లేకుంటే ఎన్ని సిక్సర్లు పేల్తాయి? లాంటి చచ్చు ప్రశ్నలతో జనాన్ని ఠీవీకి కట్టి పడేయటం తెలిసిందే. ఐతే - ఆ పంథాని ఎంచక్కా మార్చేసి దేనికైనా ‘కమర్షియల్’ కిక్ లేందే జనానికి నచ్చదన్న సిద్ధాంతాన్ని వొంటబట్టించుకున్న ఇండియా టీవీ సరికొత్త తరహాలో ‘క్రికెట్’ చర్చాగోష్ఠినీ, వరల్డ్ కప్ వండర్లనూ తెర కెక్కించేందుకు ఐటెం గర్ల్ అలియాస్ హాట్‌హాట్ గర్ల్ రాఖీ సావంత్‌నీ, ‘బిగ్ బాస్’తో బోలెడంత క్రేజ్‌ని దక్కించుకున్న పాకిస్తానీ నటి వీణా మాలిక్‌లను ఆహ్వానించింది.

అంతేకాదు - ఆసక్తికరమైన బహుమతులూ ఉంటాయి. ఈ కార్యక్రమంలో 12 మంది అభ్యర్థులు రెండు గ్రూపులుగా విడిపోతారు. తమ తమ అభిమాన క్రీడాకారులు ఎన్ని పరుగులు తీస్తారు? ఎన్ని క్యాచ్‌లు పడతారు? క్యాచ్‌లు మిస్ చేస్తారు? ఇత్యాది పలు అంశాలపై ‘బెట్’ కట్టవచ్చు. దీంట్లో మాగ్జిమమ్ పాయింట్స్‌ని స్కోర్ చేస్తే ‘హోండా కారు’ గెలుచుకోవచ్చు. ఇక ఈ కార్యక్రమంలో రాఖీ సావంత్, వీణా మాలిక్‌లే కాదు - యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్ సింగ్, గాయకులు శంకర్ షెహనాయ్, అశోక్ మస్తీ, బ్యూటీషియన్లు సిల్వియా, ఆర్.జె.సిమ్రాన్.. కూడా కనిపిస్తారు.

Source: www.andhrabhoomi.net