Showing posts with label Telugu. Show all posts
Showing posts with label Telugu. Show all posts

Monday, January 14, 2019

బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త!


న్యూదిల్లీ: బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) శుభవార్త తెలిపింది. వీక్షకులు 100 పే లేదా ఫీ ఛానళ్లను రూ.153.40కే పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్‌టీతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. కేబుల్‌/డీటీహెచ్‌లలో 100 ఛానళ్లను వీక్షించవచ్చన్న ట్రాయ్‌.. జనవరి 31లోపు వీక్షకులు 100 ఛానళ్లను ఎంపిక చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని, ఈ ప్యాక్‌లో హెచ్‌డీ ఛానళ్లు లభించవని స్పష్టం చేసింది. అయితే, రెండు సాధారణ ఛానళ్లకు బదులు ఒక హెచ్‌డీ ఛానల్‌ను ఎంపిక‌ చేసుకోవచ్చని కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. తమ సర్వీసు ప్రొవైడర్ల నుంచి వినియోగదారులు మరిన్ని తెలుసుకోవాలని ట్రాయ్‌ సూచించింది. కాగా, ఒక ఛానల్‌ గరిష్ఠ ధరను రూ.19గా నిర్ణయించింది. ప్రతి ఛానల్‌ రేటును ట్రాయ్‌ తన అధికారిక వెబ్‌సైట్‌ channeltariff.trai.gov.inలో ఉంచింది.
తెలుగు పే ఛానళ్ల జాబితా ఇది



Source: https://www.eenadu.net

Friday, December 28, 2018

ఛానళ్ల ఎంపికకు నెల గడువు

దిల్లీ: టెలివిజన్‌ ప్రేక్షకులు చెల్లింపు ఛానళ్లను ఎంపిక చేసుకునేందుకు మరో నెల గడువు పొడిగించారు. ప్రసారాలు, కేబుల్‌ సర్వీసులపై రూపొందించిన కొత్త విధివిధానాల అమలులో భాగంగా ఇష్టమైన ఛానళ్లనే ఎంపిక చేసుకునేందుకు జనవరి 31 దాకా గడువు పొడిగిస్తున్నట్లు భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ (ట్రాయ్‌) ప్రకటించింది. గురువారం ప్రసార సంస్థలు, డీటీహెచ్‌ ఆపరేటర్లు, ఎంఎస్‌వోలతో సమావేశమయిన తర్వాత ట్రాయ్‌ కార్యదర్శి ఎస్‌కే గుప్తా ఈ విషయాన్ని తెలిపారు. కొత్త విధివిధానాలను అమలు చేసేందుకు అందరూ సంసిద్ధత వ్యక్తం చేశారన్నారు. ఈ ప్రక్రియ సాఫీగా, అంతరాయాలు    తలెత్తకుండా మార్పిడి జరిగేందుకు మరికొంత సమయం కావాలని వారంతా విన్నవించారన్నారు. వినియోగదారుల నుంచి ఐచ్ఛికాలు తీసుకునేందుకు పంపిణీ ఆపరేటర్లకు జనవరి 31దాకా అవవకాశం కల్పించినట్లు తెలిపారు.
తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం
కొత్త విధివిధానాల వల్ల వినియోగదారులు తాము చూడాలనుకునే ఛానళ్లనే ఎంపిక చేసుకొని, వాటికే చెల్లింపు చేయొచ్చు. టీవీ ప్రసార సంస్థలు ప్రతి ఛానల్‌కు, ప్యాకేజీకి గరిష్ఠ చిల్లర ధరను వెల్లడించాల్సి ఉంటుంది. కొత్త నిబంధనలతో టీవీ ప్రేక్షకులపై ధరల భారం తక్కువగా ఉంటుందని ట్రాయ్‌ గతంలోనే స్పష్టం చేసింది. వినియోగదారుల్లో అనవసర ఆందోళనను పెంచేలా కొంతమంది తప్పుడు సమాచారంతో దుష్ప్రచారం చేశారంటూ మండిపడింది. ట్రాయ్‌ కొత్త విధివిధానాలను, టారిఫ్‌లను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లను సుప్రీంకోర్టు ఇంతకుముందే కొట్టివేసింది.


Wednesday, December 26, 2018

చూడాలనుకునే ఛానళ్లకే చెల్లింపు


నెలకు రూ.130తో 100 ఉచిత ఛానళ్లు
ఆపై ఎంచుకునే వాటికే చెల్లించాలి..
ఛానళ్ల వారీగా వేర్వేరు ధరలు
టీవీ ముందు కూర్చుని రిమోట్‌ నొక్కుతూ ఉంటే వందల కొద్దీ ఛానళ్లు ప్రత్యక్షమవుతూనే ఉంటాయి. అందులో ఓ పదీ ఇరవై తప్ప మిగతావన్నీ మనకి పరిచయం లేనివి, ఆసక్తి అంతకన్నా లేనివే వస్తుంటాయి. పరాయి భాషల్లో రకరకాల ఛానళ్లు వస్తుంటాయి. ఒక్కరోజూ నిమిషంపాటు వాటిని చూసే అవసరం రాదు. చాలాభాగం కుటుంబ సభ్యుల్లో ఎవరూ చూడనివే. కొత్త కేబుల్‌ ఛానళ్ల విధానంతో ఈ పద్ధతి మారనుంది. ఇష్టమైన ఛానళ్లకే డబ్బు చెల్లించి వాటిని వీక్షించే అవకాశం వినియోగదారులకు దక్కనుంది. ఈ నెల 29 నుంచి అమల్లోకి రానున్న కొత్త విధానంలో వంద దాకా ఉచిత ఛానళ్లకుతోడు, మనం డబ్బులు చెల్లించిన ఛానళ్లే ప్రసారమవుతాయి. ఇందులో కుటుంబ సభ్యుల అభిరుచి, ఇష్టాయిష్టాలను బట్టి ఎంచుకొని చూసే అవకాశం ఉంది.


ఇకపై టెలివిజన్‌ ప్రేక్షకులు తాము ఏయే ఛానళ్లు చూడాలనుకుంటున్నారో వాటికి మాత్రమే డబ్బులు చెల్లించే సరికొత్త విధానాన్ని భారత టెలికం నియంత్రణ ప్రాధికార సంస్థ(ట్రాయ్‌) అమల్లోకి తీసుకొస్తోంది. ఈ కొత్త విధానం ఈనెల 29 నుంచి (శనివారం) ప్రారంభం కానుంది. దీని ప్రకారం వినియోగదారుడు నెలకు రూ.130 (పన్నులు అదనం) చెల్లిస్తే సరిపోతుంది. ఇందులో 100 ఉచిత ఛానళ్లు అందుబాటులో ఉంటాయి. ఇవి కాకుండా చెల్లింపు ఛానళ్ల కోసం వినియోగదారులు అదనంగా చెల్లించాల్సి ఉంటుంది. సినిమాలు, క్రీడలు, వార్తలు, ఇతర వినోద ఛానళ్లను చెల్లింపు విభాగంలోకి వస్తాయి. వాటికి చందాదారులుగా మారితేనే వీక్షించే అవకాశం ఉంటుంది. చెల్లింపు ఛానళ్లకు ఒక్కోదానికి ఒక్కోధర ఉంది. ఏ ఛానల్‌ కావాలని కోరుకుంటే, వాటికి మాత్రమే డబ్బులు చెల్లించి చూడొచ్చు. చెల్లింపు టీవీ ఛానళ్లకు గరిష్ఠ చిల్లర ధర ఎంతనేది తెలుసుకునేందుకు ట్రాయ్‌ వెబ్‌సైట్‌ ‌www.trai.gov.in లో పరిశీలించుకోవచ్చు. లేదా ఇప్పటికే పలు ఛానళ్లలో ధరల వివరాల్ని ప్రసారం చేస్తుండటాన్ని గమనించవచ్చు. డిసెంబర్‌ 28 అర్ధరాత్రి తర్వాత ఉచిత ఛానళ్లు మాత్రమే ప్రసారమవుతాయి. దేశవ్యాప్తంగా డీటీహెచ్‌, కేబుల్‌ కనెక్షన్లు అన్నింటికీ ఈనెల 28వ తేదీయే తుది గడువు. 28వ తేదీతో ఛానళ్ల ప్రసారం ఆగిపోవద్దనుకుంటే వీక్షించాలనుకుంటున్న చెల్లింపు ఛానళ్లకు సంబంధించిన జాబితాను స్థానిక కేబుల్‌ ఆపరేటర్‌కు ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పద్ధతి వల్ల సగటు వినియోగదారుడు ప్రస్తుతం తాను చెల్లిస్తున్నదానికన్నా రెట్టింపు వ్యయం చేయాల్సి వస్తుందనేది కేబుల్‌ ఆపరేటర్ల వాదన. అయితే, ప్రస్తుత కేబుల్‌ వ్యవస్థ ద్వారా ప్రసారమయ్యే వందకుపైగా ఛానళ్లలో వీక్షకులు అనునిత్యం చూసేవి కొన్నే ఉంటాయని, మిగతావన్నీ వృథాయేనని, ఇకపై అవసరమైన వాటిని మాత్రమే ఎంచుకుని చూసే అవకాశం దక్కుతుందని పలువురు వినియోగదారులు అభిప్రాయపడుతున్నారు.
 ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో దాదాపు 90 శాతం మంది ప్రేక్షకులు తెలుగు ఛానళ్లు మాత్రమే వీక్షిస్తారని, కేబుల్‌ టీవీలో వచ్చే ఇతర ఛానళ్లన్నీ ఇతర భాషలకు, అంశాలకు సంబంధించినవేనని, వాటిని చూసే అవసరం ఎప్పుడో తప్ప రాదని భావిస్తున్నారు. కుటుంబ సభ్యుల్లో పిల్లలు, వృద్ధులు, యుక్తవయస్కులకు అభిరుచుల వారీగా అవసరమైన ఛానళ్లనే ఎంచుకునే వెసులుబాటు ఉంటుంది. కొత్త విధానంలో వందదాకా ఉచిత ఛానళ్లు ప్రసారమవుతూనే, అదనపు చెల్లింపుతో అవసరమైన చెల్లింపు ఛానళ్లు మాత్రమే రావడం వల్ల అనవసరపు ఖర్చుల భారం ఉండదనే అభిప్రాయాలూ ఉన్నాయి.
  Source: https://www.eenadu.net

Friday, July 29, 2016

ఈటీవీ హెచ్‌డీ ఛానల్‌ ప్రారంభం


 హైదరాబాద్‌: తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తున్న ఈటీవీ.. విస్పష్టమైన వినోదాల ప్రసారాలకు మరో అడుగు ముందుకు వేసింది. ఈటీవీ హెచ్‌డీ ఛానల్‌ ప్రసారాలను రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్‌ రామోజీరావు శుక్రవారం ప్రారంభించారు. తెలుగులో మొదటిసారి బీటాకామ్‌ ఎక్విప్‌మెంట్‌, ప్రైవేటు రంగంలో తొలిసారిగా ఎర్త్‌స్టేషన్‌ కలిగి సంచలనం సృష్టించిన ఈటీవీ... ఇప్పుడు హెచ్‌డీలో ప్రసారాలు ప్రారంభించి మరో మైలురాయిని అధిగమించింది. స్పష్టమైన చిత్రం, శబ్దం, అద్భుతమైన రంగులతో ఈటీవీ హెచ్‌డీ ఛానల్‌ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించనుంది.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈటీవీ సీఈవో బాపినీడు, చీఫ్‌ ప్రొడ్యూసర్‌ అజయ్‌శాంతి, నెట్‌వర్క్‌ చీఫ్‌ ప్రొడ్యూసర్‌ పీకే మాన్వి, చీఫ్‌ ఇంజనీర్‌ ఎస్‌ఎల్‌కే ప్రసాదరావు, ఆర్‌ఎఫ్‌సీ సీఈవో రాజీవ్‌ జాల్న పుర్కర్‌, సిబ్బంది పాల్గొన్నారు.




Source: http://www.eenadu.net/

Thursday, July 9, 2015

రామోజీ గ్రూపు నుంచి 4 తెలుగు ఛానెళ్లు: ఆగస్టు 27న ప్రారంభం

రామోజీ రావు గ్రూపు నుంచి నాలుగు తెలుగు ఛానెళ్లు ప్రేక్షకులను రంజింపచేయనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకుపోతున్న రామోజీ గ్రూపు ఈ టీవీ 20వ వార్షికోత్సవాల సందర్భంగా నాలుగు ఛానళ్లను ప్రారంభించనున్నారు. ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి పేరుతో రానున్న ఛానళ్లు తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి.
 
యువతరాన్ని ఆకట్టుకునే ఈటీవీ ప్లస్, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఈ టీవీ లైఫ్ ఉంటాయి. ఈటీవీ ప్లస్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా, ఈటీవీ లైఫ్ ఆరోగ్యం, యోగా, ఆయుర్వేదం లాంటి సుఖీభవ తరహా కార్యక్రమాలు ఉంటాయి. ఈటీవీ అభిరుచి విషయానికి వస్తే... ఇది పూర్తిగా వంటా వార్పుల ఛానల్. ఇక ఈటీవీ సినిమా ఛానల్ పూర్తి స్థాయి సినిమా ఛానల్. ఆగస్ట్ 27న ప్రారంభమయ్యే ఈ నాలుగు ఛానళ్లు తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తాయని రామోజీ గ్రూపు అధికారులు తెలిపారు. 
 
ఇకపోతే.. 1995 ఆగస్ట్ 27వ తేదీన ఈటీవీ ప్రసారాలను ప్రారంభించిన రామోజీ గ్రూపు ప్రారంభించిన రామోజీ రావు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో రాణిస్తోంది. అనేక వినోద, వార్త ఛానల్స్‌తో జాతీయ స్థాయిలోని గొప్ప నెట్ వర్క్‌లలో రామోజీ గ్రూపు కూడా ఒకటని చెప్పేవిధంగా ఎదిగింది.
 
Source: http://telugu.webdunia.com

Tuesday, September 3, 2013

టీవీక్షణం: వెండితెర వయా బుల్లితెర!

టీవీ ఆర్టిస్టులు సినిమాల్లో సక్సెస్ కావడం కష్టం... చాలా తేలికగా అనేస్తారీ మాటని. కానీ అలా అనేముందు గుర్తు తెచ్చుకోవాల్సిన వాళ్లు కొందరున్నారు. వారు తమ కెరీర్‌కి పునాదిని బుల్లితెర మీదే వేసుకున్నారు. అక్కడ పని చేస్తూనే వెండితెర మీద తమ అదృష్టాన్ని పరీక్షించుకున్నారు. ఆటుపోట్లకు తట్టుకుని నిలబడ్డారు. ఈరోజు స్టార్‌‌సగా వెలుగొందుతున్నారు.

 షారుఖ్ ఖాన్... బాలీవుడ్ బాద్‌షా అని పిలుచుకునే ఈ సూపర్‌స్టార్ తన తొలి అడుగు టెలివిజన్ రంగుంలోనే వేశాడు. ఫౌజీ, దిల్ దరియా వంటి సీరియల్స్‌లో నటించాడు. ‘సర్కస్’ సీరియల్ అతడిని అందరి దృష్టిలో పడేలా చేసింది. సినిమా అవకాశాలు వెతుక్కుంటూ వచ్చాయి. కట్‌చేస్తే... బాలీవుడ్‌లో తిరుగులేని నటుడయ్యారు షారుఖ్. జాతీయ అవార్డునందుకున్న నటి విద్యాబాలన్ కూడా టీవీలోనే ఓనమాలు దిద్దుకుంది. ‘హమ్ పాంచ్’ సీరియల్‌లో నటించిన విద్య ప్రతిభ ఆమెను సినిమాల్లోకి లాక్కెళ్లింది. తొలి సినిమా ‘పరిణీత’ సూపర్ హిట్. ‘లగేరహో మున్నాభాయ్’ డూపర్ హిట్. ‘డర్టీ పిక్చర్’ బంపర్ హిట్. ‘కహానీ’ సెన్సేషనల్ హిట్. ఆమె కోసం ఇప్పుడు ప్రత్యేకంగా కథలు రాస్తున్నారంటే అర్థం చేసుకోవచ్చు... ఆమె రేంజ్ ఏమిటో!

 హిందీ సీరియల్స్ నుంచి సినిమాల దాకా ప్రయాణించిన మరో నటి హన్సిక. చిన్నతనంలో ‘షకలక బూమ్‌బూమ్’ అనే కార్యక్రమంలో తొలిసారి తెరమీద మెరిసిన హన్సిక, ఆ తర్వాత ‘దేశ్‌మే నిక్‌లా హోగా చాంద్’ సీరియల్‌లో నటించింది. మరి ఇప్పుడు ఆమె ఏ స్థాయి నటి అయ్యిందో చూస్తున్నాం కదా! ఇప్పుడిప్పుడే హీరోయిన్‌గా ఎదుగుతున్న ప్రాచీ దేశాయ్ కూడా టీవీ నటే. సినిమాలను వద్దనుకుని, క్రికెట్ కామెంటేటర్‌గా సెన్సేషన్ సృష్టించిన మందిరాబేడీ కూడా సీరియల్ నటే.

 ఇక మన ప్రకాశ్‌రాజ్. ఆయన తెలుగువారు కాదు. అయినా ఆ విషయాన్ని మనం నమ్మం. అంతగా టాలీవుడ్‌లో పాతుకుపోయారు. ఆయన కూడా మొదట్లో సీరియల్ నటుడే. ‘గుప్పెడు మనసు’ సీరియల్ గుర్తుంది కదా! బాలచందర్ దర్శకత్వం వహించి, గీత లీడ్ రోల్ చేసిన ఈ సీరియల్ అప్పట్లో సంచలనం సృష్టించింది. అందులో ప్రకాశ్‌రాజ్‌ను చూసి చాలామంది అమ్మాయిలు అలాంటి భర్త కావాలని కోరుకున్నారు.

 అతడే ఆ తర్వాత విలన్‌గా, హీరోగా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా సినిమాల్లో ప్రత్యక్షమవుతాడని, తిరుగులేని నటుడవుతారని ఎవరూ ఊహించలేదు. ఇక స్వాతి గురించి చెప్పాల్సిన పని లేదు. ‘కలర్స్’ ప్రోగాములో ఆమె యాంకరింగుకు అందరూ ఫిదా అయిపోయారు. యువకులు అయితే ఆమె కోసమే ఆ కార్యక్రమాన్ని చూశారు. ఇప్పుడామె సినిమాల్లో బిజీ అయిపోయింది.

 వీళ్లే కాదు. టెలివిజన్ తెర మీద మెరిసి, ఆ తర్వాత వెండితెరపై వెలిగిన నటీనటులు ఎందరో ఉన్నారు. మహా సముద్రం లాంటి సినీ పరిశ్రమ వైపు నడిపించే నావ టెలివిజన్. అందుకే నటనను లక్ష్యంగా ఎంచుకున్నవారి ప్రయాణం ఆ నావలోనే మొదలవు తోంది. కచ్చితంగా ఏదో ఒక తీరానికి చేరుస్తుందని, మధ్యలో మాత్రం ముంచేయదని దాని మీద అందరికీ అంత నమ్మకం మరి!

Source: www.sakshi.com

Friday, August 30, 2013

మళ్లీ...రాజ్‌కుమార్


టాలీవుడ్‌లో మెగాస్టార్ చిరంజీవికి డూప్‌గా నటించాలి అంటే టక్కున గుర్తొచ్చే పేరు రాజ్‌కుమార్. కేవలం డూప్‌గానే కాక తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్న ఆయన అచ్చు చిరంజీవిలా కనిపిస్తాడు. ఆయన అనేక చిత్రాల్లో హీరో పాత్రలతోపాటుగా, అనేక క్యారెక్టర్లలో కూడా జీవించి, మెప్పించాడు. మొదట్లో ఆయన ఫొటోలు చూసి అచ్చు చిరంజీవిలా ఉన్నాడని, అనేక మంది అనుకునేవారు. మొదట్లో ఈ పోలిక ఆయన కెరీర్‌కు ఎంతో ఉపయోగపడినా ఆ తరువాత తనకంటూ ఓ బాణీని ఏర్పరుచుకుని నటుడిగా ఎదిగారు. చిరంజీవి అభిమానులు కూడా రాజ్‌కుమార్‌ను అభిమానించేంత స్థాయికి చేరుకున్నారు. ఎక్కడ తనకవకాశాలు వచ్చినా అవి వినియోగించుకుంటూ సాగిన రాజ్‌కుమార్ టీవి మీడియాలో మెగాస్టార్‌గా కూడా ఎదిగారు. కొన్నాళ్లు కెరీర్ పరంగా ఒడుదుడుకులు ఎదుర్కొన్న ఆయన ఇప్పుడు మళ్లీ ప్రేక్షకుల ముందుకు సరికొత్త ఉత్సాహంతో వస్తున్నారు. తాజా చిత్రం ‘బారిష్టర్ శంకర్‌నారాయణ’తో రీ ఎంట్రీ ఇస్తున్నాడు. తన వాక్ చాతుర్యంతో ఎంత పెద్ద న్యాయవాదినైనా ఓడించగల లాయర్‌గా ఈ చిత్రంలో రాజ్‌కుమార్ నటిస్తున్నారు. శంకర్‌నారాయణ కేసును వాదించడానికి ఒప్పుకున్నారు అంటే ఇక ప్రత్యర్థులు ఓడిపోవాల్సిందే అనేట్లుగా ఈ చిత్ర కథ సాగుతుంది. బారిష్టర్ జీవితంలో ఓ కేసు తాలూకు అనుభవాలతో శంకర్‌నారాయణ వ్యక్తిగతంగా, వృత్తిపరంగా ఎదుర్కొన్న పరిస్థితుల నేపథ్యంలో సాగే ఈ చిత్రం అందరికీ నచ్చుతుందని ఆయన చెబుతున్నారు. ప్రముఖ డాన్స్ మాస్టర్ తార తొలిసారిగా ఈ చిత్రంతో దర్శకురాలిగా వెండితెరకు పరిచయమవుతున్నారు. ఈ చిత్రం తనకు మళ్లీ కెరీర్‌ను ప్రారంభించడానికి అనువుగా వుంటుందని, తెలుగు ప్రేక్షకుల అభిమానాన్ని మళ్లీ పొందుతానని, నటుడిగా తనలోని పలు కోణాలను ఆవిష్కరించడానికి మంచి మంచి కథలు ఎంచుకుంటున్నానని రాజ్‌కుమార్ తెలిపారు. హీరో పాత్రలతోపాటుగా క్యారెక్టర్ ఆర్టిస్టుగా అయినా, గతంలో అనేక మంది పెద్ద హీరోలు చేసిన పలు పాత్రల్లో ఒదిగిపోవటానికి కూడా తాను సిద్ధమయ్యానని, ఏ పాత్ర చేసినా ప్రేక్షకులకు పూర్తి సంతృప్తినిచ్చేలా నటించడమే తన వంతని ఆయన తెలిపారు. త్వరలో రానున్న ‘బారిష్టర్ శంకర్‌నారాయణ’ చిత్రం తనకు బెస్ట్ చిత్రం అవుతుందని ఈ చిత్రం తర్వాత తాను బిజీగా మారతానన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు రాజ్‌కుమార్.

Source: www.andhrabhoomi.net

Thursday, August 29, 2013

న్యూస్ చానల్స్ రేటింగ్స్ మీద హైదరాబాద్ ముద్ర


న్యూస్ చానల్స్ ప్రధానంగా హైదరాబాద్ లో సంపాదించుకునే ప్రేక్షకాదరణ మీదనే ఆధారపడుతున్నట్టు టామ్ సమాచారాన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతోంది. ఎన్టీవీ, ఈటీవీ 2  చానల్స్ ఈ విషయాన్ని నిర్ద్వంద్వంగా నిరూపిస్తున్నాయి. ఎన్టీవీకి విశాఖ, విజయవాడ, చిన్నపట్టణాలలో ఒక మోస్తరుగానైనా ఆదరణ నమోదుకాగా ఈటీవీ 2 కు ఆ రెండు మార్కెట్లలో ఆదరణ నామమాత్రంగానే ఉంది.
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, జెమినీ న్యూస్ మాత్రమే అన్ని మార్కెట్లలో దాదాపుగా ఒకే విధమైన ఆదరణ పొందుతుండగా హైదరాబాద్ మీద ఎక్కువగా ఆధారపడిన ఇతర చానల్స్ లో ఐ న్యూస్, ఎ టీవీ బాగా ముందున్నాయి. అదే విధంగా టి న్యూస్, వి.6 చానల్స్ కూడా హైదరాబాద్ లో ప్రధానంగా ఎక్కువ మంది ప్రేక్షకులను ఆకట్టుకోగలుగుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రకటన ప్రభావం వల్లనే ఐ న్యూస్, ఎ టీవీ, టి న్యూస్, వి 6 న్యూస్ చానల్స్ లో ఈ స్పష్టమైన మార్పు కనిపించి ఉండవచ్చుననే అభిప్రాయం కూడా ఉంది.
మార్కెట్ల వారీగా తెలుగు న్యూస్ చానల్స్ సాధించిన స్థూల రేటింగ్ పాయింట్లు ( 31వ వారం టామ్ డేటా )

సంఖ్య
చానల్
రాష్టం మొత్తం
హైదరాబాద్
విశాఖ, విజయవాడ
చిన్న పట్టణాలు
1
ఎన్ టీవీ
175
305
114
71
2
ఈటీవీ 2
161
314
48
57
3
స్టుడియో ఎన్
66
36
78
92
4
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
48
47
47
50
5
ఐ న్యూస్
41
71
27
16
6
జీ 24 గంటలు
36
40
47
28
7
వి 6 న్యూస్
36
58
23
20
8
10 టీవీ
35
34
46
31
9
హెచ్ ఎమ్ టీవీ
33
30
28
38
10
టి న్యూస్
29
55
0
16
11
సివిఆర్ న్యూస్
23
20
42
18
12
ఎ టీవీ
22
51
4
0
13
జెమినీ న్యూస్
10
11
11
9
14
మహా న్యూస్
8
4
12
11
15
ఆర్కే న్యూస్
3
0
0
6
16
టీవీ 9
0
0
0
0
17
టీవీ 5 న్యూస్
0
0
0
0
18
సాక్షి టీవీ
0
0
0
0


Source: telugutv.info

పన్నెండు న్యూస్ చానల్స్ లో ఎన్టీవీ నెంబర్ వన్


32 వ వారానికి గాను రేటింగ్స్ డేటా అందిన పన్నెండు తెలుగు న్యూస్ చానల్స్ లో ఎన్టీవీ నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతోంది. వరుసగా నాలుగోవారం కూడా టీవీ9, టీవీ5, సాక్షి టీవీ, రేటింగ్స్ డేటా అందలేదు. మొత్తమ్మీద రాష్ట్రంలో నెలకొన్న పరిస్థితుల దృష్ట్యా న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా గణనీయంగా పెరిగింది. కాస్త అటూ ఇటుగా దాదాపుగా అన్ని చానల్స్ లో ఆ పెరుగుదల కనిపిస్తోంది.
ఆగస్ట్ 10 తో ముగిసినవారానికి తెలుగు న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా ( మార్కెట్ల వారీగా )



 చానల్

హైదరాబాద్

విశాఖ, విజయవాడ

చిన్నపట్టణాలు

మొత్తం రాష్ట్రం
టీఎవీ  9
-
-
-
-
ఎన్టీవీ
4.33
2.54
1.18
2.82
ఈటీవీ 2
3.59
0.91
1.23
2.24
టీవీ 5 న్యూస్  
-
-
-
-
సాక్షి టీవీ
-
-
-
-
స్టుడియో ఎన్
0.73
2.93
1.47
1.37
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
0.78
0.89
1.18
0.96
జీ 24 గంటలు
0.65
1.66
0.7
0.83
వి6 న్యూస్
1.07
0.50
0.62
0.81
 ఐ న్యూస్
0.76
0.80
0.38
0.62
సివిఆర్ న్యూస్
0.38
0.84
0.63
0.55
హెచ్ ఎమ్ టీవీ
0.35
0.73
0.61
0.51
టి న్యూస్
0.85
0.01
0.3
0.50
జెమినీ న్యూస్
0.22
0.26
0.33
0.27
మహా న్యూస్
0.06
0.33
0.17
0.15

Source: telugutv.info