Friday, August 23, 2013

మహేష్ టీవీ హక్కుల రికార్డ్... పవన్‌ను మించిపోయాడు!

టాలీవుడ్ సినీఇండస్ట్రీలో సూపర్ స్టార్ మహేష్ బాబు క్రేజ్ గురించి చెప్పక్కర్లేదు. వరుస హిట్‌లతో కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ రికార్డులు తిరగరాస్తున్న మహేష్ ఇప్పుడు మరొరికార్డు సొంతం చేసుకున్నాడు. టాలీవుడ్‌లో తన స్టామినా ఎంటో మరోసారి నిరూపించుకున్నాడు. సినిమా బిజినెస్ లో అతని దూకుడు ఏమిటో ఇంకోసారి తెలిసింది.

సుకుమార్ దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న '1' సినిమా శాటిలైట్ హక్కుల అమ్మకంలో కొత్త రికార్డు నమోదైంది. ఈ హక్కులను రికార్డు రేటు ఆఫర్ చేసి జెమినీ టీవీ సొంతం చేసుకున్నట్టు సమాచారం. ఆ ఫిగర్ ఎంతనేది కచ్చితంగా ఇంకా వెల్లడికానప్పటికీ, పవన్ కల్యాణ్ చిత్రం 'అత్తారింటికి దారేది' రేటుని అధిగమించినట్టు చెబుతున్నారు. 'అత్తారింటికి' శాటిలైట్ హక్కులు 9 కోట్లకు అమ్ముడుపోయిన సంగతి మనకు తెలిసిందే.

Source: telugu.webdunia.com

బిజినెస్ చానల్ ఆలోచనలో టీవీ 5

విశాలమైన సొంత భవనం కట్టుకొని అందులోకి మారిన టీవీ 5 ఇప్పుడు బిజినెస్ చానల్ తీసుకురావాలని ఆలోచిస్తోంది. ఉదయం పూట ప్రసారాల్లో టీవీ 5 ముందుండటానికి ఆ చానల్ లో ప్రసారమవుతున్న బిజినెస్ కార్యక్రమం కూడా కారణమన సంగతి తెలిసిందే. పైగా ఆ చానల్ బిజినెస్ సంబంధమైన అనేక ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టి ప్రజాదరణ పొందింది.  ఇప్పుడు ఆ ఉత్సాహంతో పూర్తి స్థాయి బిజినెస్ చానల్ తెచ్చే ప్రయత్నంలో ఉంది. లైసెన్సుకు దరఖాస్తుకూడా పంపినట్టు తెలిసింది. దాదాపు ఆరు నెలలకిందట మహా టీవీ వారి ఎక్స్ ట్రా చానల్ లైసెన్స్ తో ఒక బిజినెస్ చానల్ ఆరంభమవుతుందని ప్రచారం జరిగినా, ఆ తరువాత ఆఆలోచన విరమించుకున్నారు. అంతకుముందు నెట్ లింక్స్ సంస్థ కూడా వై టీవీ ( Wealth, Health and You ) పేరుతో లైసెన్స్  నియమాలు కూడా పూర్తి చేసినా ఆ తరువాత వదిలేసింది. ఇప్పుడు టీవీ 5 మాత్రం బిజినెస్ చానల్ ఆలోచన మీద గట్టి ప్రయత్నాలు ప్రారంభించింది.

Source: telugutv.info

ఫోన్ల కోసమే ఓ చానల్

ప్రత్యేకంగా మొబైల్ ఫోన్లలో వీక్షించేవిధంగా 'వీ4యు' అనే చానల్‌ను తిరువనంతపురానికి చెందిన ఇంజనీరింగ్ పట్టభద్రుల బృందం ప్రారంభించింది. దేశంలో ఈ తరహా చానల్‌ను తొలిసారి ప్రారంభిస్తున్నట్లు, ప్రపంచంలో ఎక్కడ నుం చైనా 2జీ, 3జీ మొబైల్ వినియోగదారులు తమ ఫోన్లలో ఈ ఛానల్‌ను వీక్షించవచ్చని చానల్ ప్రారంభకుల్లో ఒకరైన జీఎస్ అరవింద్ పేర్కొన్నారు. టీవీల్లో మినహా కంప్యూటర్లు, ఐప్యాడ్‌లు, ట్యాబ్లెట్లలో జావా, ఆండ్రాయిడ్ ఏ ఆపరేటింగ్ సిస్టంల్లో నైనా ఈ చానల్‌ను 24 గంటలూ వీక్షించవచ్చన్నారు.

Source: www.andhrajyothy.com

అసెంబ్లీ వ్యవహారాలపై త్వరలో టీవీ చానల్ ప్రారంభం

ముంబై: అసెంబ్లీలో కొనసాగుతున్న వ్యవహారాలన్నింటినీ ప్రజలకు తెలియపరిచే ఉద్దేశంతో రాష్ట్ర ప్రభుత్వం తొందర్లోనే ‘అమ్చీ విధానసభా’ అనే టీ వీ చానల్‌ను ప్రారంభించనుంది. ఇందుకు ప్రయత్నాలు కూడా ప్రారంభమయ్యాయి. అందిన వివరాల మేరకు ఈ విషయంపై తుది నివేదిక రూపొందించినట్టు తెలిసింది.
 
అసెంబ్లీలో ప్రజాప్రతినిధులు ఎలా పనులు చేస్తారనే విషయంతోపాటు అసెంబ్లీ, బడ్జెట్ సమావేశాల్లో వారు సమస్యలపై చర్చలు ఎలా జరుపుతున్నారనే విషయం తెలుసుకోవాలని ప్రజల్లో కుతూహలం ఉంటుంది. వీటితోపాటు అనేక సంక్షేమ పథకాల గురించి ప్రజలకు తెలియపరచాలన్న ఉద్దేశంతో ఈ చానల్‌ను ప్రారంభిస్తున్నారని చెప్పవచ్చు. ఈ విషయంపై ముఖ్యమంత్రి పృథ్వీరాజ్ చవాన్, ఉపముఖ్యమంత్రి అజిత్ పవార్‌లతోపాటు శాసన సభ, శాసన మండలిల స్పీకర్లు, పదాధికారులు లోకసభ టీవీ చానల్ అధికారులతో భేటీ అయినట్టు సమాచారం.
Source: www.sakshi.com

ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు శుభవార్త...

2014 సాధారణ ఎన్నికల నేపథ్యంలో తెలుగులో మరో కొన్ని న్యూస్ చానల్స్ రాబోతున్నాయి. ఇందులో శరవేగంగా రాబోతున్న న్యూస్ చానల్స్ లో సిక్స్ టీవీ, తులసీ, హెచ్ వై టీవీలున్నాయి. టీవీ 5 లో పేరుగాంచిన మంచి జర్నలిస్ట్ ... యువ ఆలోచనలున్న వెంకటకృష్ణ సీఈఓగా సిక్స్ టీవీ అక్టోబర్ నెలాఖరుకు ప్రేక్షకులకు సరికొత్త తరహాలో న్యూస్ ను అందించనుంది.

ఇదే కాకుండా ఎన్నో రోజులుగా చర్చించుకుంటున్న తులసీ న్యూస్ కూడా మరో రెండు నెలలల్లో ప్రసారాలను ప్రారంభించనుంది. ఇప్పటికే ఇంగ్లీష్ , తెలుగులో నడిచి ఆగిపోయినా... హెచ్ వై టీవీని ... డైనమిక్ జర్నలిస్ట్ శైలేష్ రెడ్డి సారథ్యంలో మరోసారి ప్రేక్షకులకు తెలుగులో న్యూస్ ను అందివ్వనుంది. గతంలో లాగా కాకుండా ... జీతాల విషయమే కాదు.. రాష్ట్ర వ్యాప్త ప్రసారాలతో లాంచ్ చేయడానికి శైలేష్ కసరత్తు చేస్తున్నట్లు సమాచారం. వీటితో పాటు ఎలక్ట్రానిక్ మీడియాకు అధ్యాపకుడు బావ నారాయణ నేతృత్వంలో ఎపీ9 న్యూస్, సీపీఐ పార్టీ ఆధ్వర్యంలో సీనియర్ జర్నలిస్ట్ అజిత నాయకత్వంలో టీవీ 99 న్యూస్ కూడా మరో 3, 4 నెలల్లో అందుబాటులో వస్తుందని తెలుస్తోంది. ఇదే కాక మరో ప్రముఖ జర్నలిస్ట్ , ప్రతిభావంతుడు... పలు పత్రికల వ్యవస్థాపకుడు... సత్యమూర్తి ఎడిటర్ గా బ్రేకింగ్ న్యూస్ కూడా అతి త్వరలోనే ప్రారంభకానుంది. సూర్యలో పని చేసి... ఇప్పుడు ఎలక్ట్రానిక్ రంగంలో అడుగుపెట్టిన సత్యమూర్తి కూడా టాలెంటెడ్ పర్సన్స్ కు అవకాశం ఇవ్వడానికి మొగ్గు చూపుతున్నట్లు సమాచారం. ఎంటర్ టైన్ మెంట్ రంగంలో ఆర్ వీఎస్ చానల్ నడిపిస్తున్న పారిశ్రామిక వేత్త, స్నేహాశీలి వెంకటస్వామి ... ఆర్ వీఎస్ న్యూస్ పేరుతో కొత్తగా మరో చానల్ ను స్టార్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు న్యూస్ చానల్స్ ప్రారంభిస్తున్న మేనేజ్ మెంట్లు ... జీతాల విషయంలో కచ్చితత్వం, నిర్ణయించిన తేదీనే జీతాలు చెల్లించేలా, ప్రణాళిక బడ్జెట్ తోనే ముందుకు వస్తున్నట్లు తెలుస్తుంది. మరోవైపు రాజ్ న్యూస్ ను కూడా విస్తరిస్తున్నారు. ఇది కొంత బీజేపీకి ప్రోగా ఉంటుందని అందులో పనిచేస్తున్న ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఉద్యోగులకు ఇది శుభవార్త. అయినా... ఆయా చానల్స్ లో చేరే ముందు ... కంపెనీ, మేనేజ్ మెంట్లు, అక్కడ చేరిన సీఈఓలు, హెడ్స్ గురించి తెలుసుకోండి. ఆ తర్వాతే ఒక నిర్ణయానికి రండి. మంచి, సక్రమంగా జీతాలు చెల్లించే చానల్స్ వదిలి పెట్టవద్దని సలహా. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్.

Source: www.tajaanews.com

ఎక్స్ ప్రెస్ న్యూస్ ఛానల్

మరో కొత్త న్యూస్ ఛానల్ రాబోతుంది. ఈనాడు, సాక్షి, ఎన్టీవీలో పనిచేస్తున్న సీనియర్ ఎడిటర్ విఎస్ఆర్ శాస్త్రీ ... ఈ కొత్త ఛానల్ రూపకల్పనలో నిమగ్నమయ్యారు. ఓల్డ్ టీవీ 5 కార్యాలయం స్ట్రీట్ లోనే ఎక్స్ ప్రెస్ టీవీ ఆఫీస్ ను ఏర్పాటు చేసినట్లు సమాచారం. రెడ్డీస్ ల్యాబ్ లో ఒక పార్ట్ నర్ ఎక్స్ ప్రెస్ టీవీని తీసుకువస్తున్నట్లు తెలిసింది. ఈ మేనేజ్ మెంట్ ఎక్స్ ప్రెస్ న్యూస్, ఎక్స్ ప్రెస్ టీవీ పేరుతో రెండు లైసెన్స్ లు కలిగి ఉన్నది. ఔత్సాహికులైన జర్నలిస్టులకే కాదు ఇతర సిబ్బందికి కూడా మంచి అవకాశాలు లభించనున్నాయి.

Source: www.tajaanews.com

6టీవీలో వేగంగా రిక్రూట్ మెంట్

హైదరాబాద్ బేస్డ్ గా వస్తున్న 6టీవీలో వేగంగా రిక్రూట్ మెంట్ జరుగుతోంది. ఈ ఛానల్ సీఈఓ కమ్ ఎడిటర్ గా వెంకట కృష్ణ తో పాటు అవుట్ పుట్ ఎడిటర్ గా మహాటీవీలో పనిచేసిన కేశవ్ , ఇన్ పుట్ ఎడిటర్ గా టీ న్యూస్ లో పనిచేసిన బీఎస్ (బీ శ్రీనివాస్) చేరారు. సాక్షి టీవీలో టీడీపీ బీట్ రిపోర్టర్ గా పనిచేసిన బలరాంతో పాటు పలు ఛానళ్లల్లో పనిచేసిన చందు జనార్థన్ ఇక్కడ చేరారు. మరికొంత మంది సీనియర్ జర్నలిస్టులు కూడా ఇక్కడ చేరుతారని వినికిడి.

Source: www.tajaanews.com

స్వాతి న్యూస్ పేరుతో కొత్త టీవీ

న్యూస్ ఛానల్స్ సంఖ్య చాంతాడులా పెరిగిపోతుంది. లెక్కపెట్టలేనన్నిన్యూస్ ఛానల్స్ వస్తున్నాయి. తాజాగా సికింద్రాబాద్ కేంద్రంగా స్వాతి న్యూస్ పేరుతో మరో శాటిలైట్ ఛానల్ వస్తోంది. నవంబర్ ఒకటి నుంచి రాబోతుందని ప్రకటించిన స్వాతి న్యూస్ మేనేజ్ మెంట్ రిక్రూట్మెంట్ కు నోటిఫికేషన్ ఇచ్చింది. ఆగస్టు 20వ తేదీన మెయిన్ ఎడిషన్ లో ఈ ప్రకటనను ఇచ్చింది. ఇది ఒక రకంగా ఉద్యోగులకు మంచిదే అయినా... ఆ సంస్థ గురించి పూర్తి స్థాయిలో తెలుసుకోకుండా చేరడం మంచికాదనేది జర్నలిస్టుల అభిప్రాయం. వివరాలకు : 9701477375/8522888315.

Source: www.tajaanews.com

అగ్రిగోల్డ్ ‘టాలీవుడ్’ చానల్

అగ్రిగోల్డ్ గ్రూప్ మీడియా రంగంలోకి ప్రవేశిస్తోంది. పూర్తిగా తెలుగు సినిమారంగ వార్తలు, విశేషాలను అందించేందుకు ‘టాలీవుడ్’ పేరుతో కొత్త చానల్‌ను ప్రారంభిస్తున్నట్లు సంస్థ చైర్మన్ సీతారామ్ అవ్వాస్ తెలిపారు. గురువారం ఇక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ, తెలుగుచిత్ర రంగానికి సంబంధించిన అన్ని విభాగాలను,అన్ని రకాల అంశాలకు, వార్తలతో పాటు ప్రతిభను ప్రోత్సహించేందుకు ప్రత్యేక కార్యక్రమాలు రూపకల్పన చేసినట్టు చెప్పారు. 24 గంటలూ పూర్తిస్థాయి కార్యక్రమాలతో నిరంతర ప్రసారాలు అందించే చానల్ ప్రారంభిస్తున్నామని తెలిపారు. 

శుక్రవారం గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగే ప్రారంభ కార్యక్రమానికి ప్రముఖ నటి శ్రీదేవి ముఖ్యఅతిధిగా విచ్చేస్తున్నారని, కేంద్ర మంత్రులు చిరంజీవి, పనబాక లక్ష్మి, రాష్ట్ర మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, డీకే అరుణ, డి. శ్రీధర్‌బాబు, కేంద్ర మాజీ మంత్రులు టి. సుబ్బరామిరెడ్డి, దాసరి, ప్రముఖ దర్శకుడు కె.విశ్వనాధ్, జయసుధ తదితరులు పాల్గొంటున్నట్టు తెలిపారు. ఈ సమావేశంలో సంస్థ సీఈవో శర్మ, డెరైక్టర్ నరేందర్‌రెడ్డి, నటి సంజన తదితరులు పాల్గొన్నారు.

Source: www.sakshi.com

సీరియల్స్, సినిమాలు లేని చానల్ టాలివుడ్


 
 

Source: telugu.greatandhra.com