చానల్ 4 టెస్ట్ సిగ్నల్స్ మొదలయ్యాయి. సాంకేతికంగా దీన్ని హెచ్ వై టీవీ అనే పిలవాల్సినా అది కేవలం సాంకేతికమే కాబట్టి జవజీవాలు సమకూర్చిన చానల్4 యాజమాన్యాన్నే గుర్తించాలి. టీ ఆర్ ఎస్ వారి రాజ్ న్యూస్ తరువాత రాష్ట్రంలో ఇలా లీజు పద్ధతిమీద నడుస్తున్న రెండో చానల్ ఇది. ఒకవైపు ఇన్ని న్యూస్ చానల్స్ ఎలా మనగలుగుతాయని అందరూ అనుకుంటున్న సమయంలోనే ధైర్యంగా ముందుకొచ్చిన చానల్ ఇది. నగరవాసులనుద్దేశించిన చానల్ అయినా ఇది కేవలం మెట్రో చానల్ గానే స్థిరపడిపోవటానికి సిద్ధంగాలేదు. పట్టణ ప్రాంతాల్లో నివసించే మధ్యతరగతి, ఎగువ మధ్యతరగతి ప్రజల్ని లక్ష్యంగా చేసుకొని ముందుకొచ్చిన ఈ చానల్ ఇంకా కేబుల్ ఆపరేటర్ల ద్వారా పూర్తిస్థాయిలో ప్రేక్షకులకు అందాల్సి ఉంది. తొలుత హైదరాబాద్ ను లక్ష్యంగా చేసుకొని, ఆ తరువాత ప్రధాన నగరాలు, పట్టణాలకు విస్తరించే వ్యూహంతో చానల్4 ముందుకు సాగుతోంది. ఈ లోపు చిన్న చిన్న లోటుపాట్లను సరిచేసుకునే ప్రయత్నంలో ఉన్నారు ఆ సంస్థ నిర్వాహకులు వాసిరెడ్డి శివరామ్ ప్రసాద్.
అడ్వర్టయిజింగ్ లో పోస్ట్ గ్రాడ్యుయేట్ అయిన శివరామ్ ఫ్రసాద్ ఈనాడుతో జీవితం ప్రారంభించారు. ప్రజలను ఆకట్టుకునేవిధంగా ఎలాంటి మాధ్యమాన్ని ఎలా తీర్చిదిద్దాలనే విషయంలో ఆయనకు నిశ్చితాభిప్రాయాలున్నాయి. పరిసరాలు గమనిస్తూ, సృజనాత్మకంగా ఆలోచిస్తూ, ఆలోచనలకు పదునుపెడుతూ అనుక్షణం కొత్తదనం కోసం తపిస్తూ ఉంటారు. అందుకే కేవలం ’ ఉద్యోగం ’ ఆయనకు సంతృప్తినివ్వలేకపోయింది. అంతమాత్రాన ఉన్న ఉద్యోగాన్ని వదులుకోవటం మంచిదికాదన్న మిత్రుల సలహాలు కూదా బాగానే పనిచేశాయి. ఉద్యోగం చేస్తూనే ఏదో ఒకటి చెయ్యాలని నిర్ణయించుకున్నాక ఇక వెనుదిరిగి చూడలేదు. నైట్ డ్యూటీ వేయించుకొని పగలంతా తన సొంత ఏజెన్సీ పనులతో బిజీ అయ్యారు. ఆ రంగంలో నిలబడగలననే పూర్తి నమ్మకం కలిగాక ఉద్యోగానికి రాజీనామా చేశారు. విజన్ కమ్యూనికేషన్స్ బాగానే పుంజుకుంది. ఆ తరువాత అక్రెడిటేషన్ సమయంలో పేరుమార్పు అనివార్యం కావడంతో అది విన్నింగ్ ఎడ్జ్ కమ్యూనికేషన్స్ గా మారింది. ఏజెన్సీ కార్యకలాపాలలో భాగంగా అనేక టీవీ ప్రకటనలు తయారుచేయటం, కార్యక్రమాలు మార్కెట్ చేయటం అలవాటయ్యాయి. అప్పుడే ఆయనకు టీవీ చానల్ ఆలోచన వచ్చింది.
విన్నింగ్ ఎడ్జ్ ప్రైవేట్ లిమిటెడ్ ఆధ్వర్యంలో సత్య టీవీ కి పునాదులు వేశారు. ఆశించిన పెట్టుబడులు సకాలంలో అందకపోవటంతో తొలి తెలుగు చానల్ స్థాపించిన ఘనత ఆయనకు దక్కలేదు. నష్టం కోట్లలో ఉన్నా, తప్పనిసరిపరిస్థితుల్లో కారుచౌకగా అమ్మేసి బయటపడ్డారు. (ఆ డబ్బు సైతం ఆయనకు పూర్తిగా ముట్టలేదని ఆయన సన్నిహితులు చెబుతారు). మళ్ళీ ఆయన తన యాడ్ ఏజెన్సీ పనుల్లోకి వచ్చారు. ఫోర్త్ ఎస్టేట్ నెట్‍వర్క్ ( ప్రై ) లిమిటెడ్ పేరుతో కార్యకలాపాలు మొదలయ్యాయి. ఈ సారి బ్రాండ్ నేమ్ చానల్ 4. సత్య చానల్ చేదు అనుభవం మిగిల్చినా చానల్ నడపాలన్న ఆలోచన మాత్రం ఆయన మదిలో మెదులుతూనే ఉంది. శ్రేయ బ్రాడ్‍కాస్టింగ్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్మన్ కోరిక మేరకు ఆయనతో చేతులు కలిపి టీవీ5 ప్రారంభించారు. చానల్ బ్రాండింగ్ మొదలుకొని ప్రతివిషయంలోనూ ఆయన తీసుకున్న శ్రద్ధ తోనే చానల్ బలమైన పునాదులు వేసుకొని ఇప్పటికీ నెంబర్ టూ స్థానంలో నిలబడింది. నిలదొక్కుకునే స్థాయి వచ్చిన తరువాత అక్కడ ఆయన అవసరం లేకపోయింది. ఆ పరిస్థితుల్లో బయటపడాల్సివచ్చింది.
అదే సమయంలో ఇద్దరినుంచి ఆయనకు పిలుపు వచ్చింది. ఒక చానల్ యజమాని ఆహ్వానిస్తే మర్యాదగానే తిరస్కరించారు. ఆయన తనను పిలవడం వెనుక హుందాతనం, సదుద్దేశం లేవనేది శివరామ్ ప్రసాద్ అభిప్రాయం. అందుకే సున్నితంగా త్రోసిపుచ్చారు. మరో చానల్ ఎం డీ అడిగితే అక్కడి చాదస్తపు పద్ధతులు, శీర్షికలు నచ్చక వెళ్ళలేదు. అంతలో నార్నె నెట్‍వర్క్స్ ప్రైవేట్ లిమిటెడ్ అధిపతి నార్నె శ్రీనివాసరావు ఆయనను సంప్రదించారు. స్టుడియో ఎన్ పేరుతో చానల్ ఏర్పాటుకు రంగం సిద్దమైంది. కొంతకాలం ఇంగ్లిష్ చానల్ అనుకుని ఆ తరువాత అకస్మాత్తుగా నిర్ణయం మార్చుకుని ఎన్నికలకు ముందే హడావిడిగా తెలుగు చానల్ తీసుకురావాలని యాజమాన్యం నిర్ణయించింది. అయినా సరే తక్కువ ఖర్చులో తక్కువ సమయంలో చానల్ బాగా తీసుకురాగలిగారు. ఎన్నికల సమయంలో ఒక పార్టీకి కొమ్ముకాయాల్సి రావటం, చానల్ గా నిలదొక్కుకోకముందే ఒక ముద్ర పడటం లాంటి అంశాలు ఇబ్బందులకు దారితీస్తున్నా చానల్ లో సృజనాత్మకత కనిపించడాన్ని అందరూ మెచ్చుకున్నారు. కానీ అదే సమయంలో యాజమాన్య నిర్ణయాలు, ఎడిటోరియల్ వ్యవహారాల్లో అడ్మినిస్ట్రేషన్ మితిమీరిన జోక్యం లాంటివి ఆయనకు ప్రతిబంధకాలయ్యాయి. చేరే ముందు ఇచ్చిన హామీలేవీ పనిచేయలేదు. అలా స్టుడియో ఎన్ లో శివరామ్ ప్రసాద్ అధ్యాయం ముగిసింది.
ఇన్ని ఎదురుదెబ్బలు తగిలినా ఆయన కృంగిపోలేదు. అది ఆయన నైజం కూడా కాదు. సత్య టీవీలో కోట్లు నష్టపోయినా ఆయన బాధ పడలేదు గాని టీవీ5 లాంచింగ్ ఆలస్యమవుతున్నప్పుడు మాత్రం ఆ ఒత్తిడి వల్లనే ఆస్పత్రిపాలయ్యారని ఆయనకు అత్యంత సన్నిహితులొకరు చెప్పేవారు. ఆయన అంకితభావానికి అదొక నిదర్శనం. మళ్ళీ చానల్ ఆలోచన ఏమైనా ఉందా అంటే, ” అంత డబ్బు నా దగ్గర సమకూరిన రోజున, లేదా సరైన ఇన్వెస్టర్లు దొరికిన రోజున తప్పకుండా ఆలోచిస్తా”ననేవారు. అలాగే ఇప్పుడాయనకు ” సరైన ఇన్వెస్టర్లు” దొరికినట్టున్నారు. లీజుకు తీసుకోవటం ద్వారా తక్కువ పెట్టుబడితో సాధ్యమయ్యే ఈ చానల్ ని ఎంచుకున్నారు. క్రమంగా విస్తరించే అవకాశం ఉన్న ఈ మోడల్ తో సరికొత్త ప్రయోగానికి సిద్ధమయ్యారు. ఒక న్యూస్ చానల్ నిర్వహణకయ్యే నెలవారీ ఖర్చులో మూడోవంతు ఖర్చుతోనే ఈ చానల్ నడపడానికి ఆయన ఏర్పాట్లు చేసుకున్నట్టు అందుబాటులో ఉన్న సమాచారాన్ని బట్టి తెలుస్తున్నది. ఆయన అనుభవం ఒకవైపు, ఆయనతో కలిసి పనిచేయటానికి ఇష్టపడేవారు జీతం గురించి పెద్దగా ఆలోచించకపోవటం మరోవైపు దీన్ని సాధ్యం చేసి ఉండాలి.
మొత్తం మీద చానల్ 4 ఇప్పుడు మనముందుంది. ఇప్పటికిప్పుడు చానల్ ప్రసారాలను విశ్లేషించటం వీలయ్యేపనికాదు. చానల్ ఇంకా టెస్ట్ సిగ్నల్ దశలోనే ఉంది. పైగా మొదట్లో ఉండే ఒత్తిడి ఎలాగూ ఉంటుంది. అతి తక్కువ కాలంలో అతి తక్కువ ఖర్చుతో వచ్చిన చానల్ కనుక అందరిలోనూ ఆసక్తి మాత్రం ఉంటుంది. మొదటిసారి అసెంబ్లీలో అడుగుపెట్టిన ఎమ్మెల్యేల ఇంటర్వ్యూలు మొదలుకొని అడుగడుగునా కొత్తదనం కనిపించేలా కొత్త కార్యక్రమాలతో సిద్ధమైనట్లు అర్థమవుతూనే ఉంది. Face the Truth అని సవాలు చేస్తున్న చానల్4 ఇంకా తన డౌన్ లింకింగ్ వివరాలను బహిరంగంగా ప్రకటించలేదు. ఆసక్తి ఉన్న జర్నలిస్టులు మాత్రం channel4.in లో చూడటం లో బిజీ అయ్యారు. చూడగానే కూల్ గా కనిపిస్తూ, అనవసరమైన హడావిడికి దూరంగా, ఒక స్క్రోల్ లైన్ కే పరిమితమై ఆకట్టుకుంటూంది. ఇన్ని న్యూస్ చానల్స్ ఉన్నా ” నేను సైతం ” అని ఎలుగెత్తి చాటుకుంటూ , “We have a Dream” అంటున్న చానల్4 ఆ కలను సాకారం చేసుకుంటుందని ఆశిద్దాం.
Source: bhavanarayana.co.tv

best of luck to channel4. I am unable to write in Telugu as my PC dont know Telugu. My humble request is: At least your new channel will introduce speakers/ Ancors, etc who speaks pure Telugu language in the channel, so that you will become LEADER in this aspect and help Telugu LANGUAGE to regain its merit. Now a days it is known fact to every body that all the Telugu channels without expection are brutally killing THE TELUGU LANGUAGE being a MOTHER TONGUE.
ReplyDeletehope YOU UNDERSTAND MY HEART FEELING. THANKING YOU. ONCE AGAIN best of luck. My heartfull regards to the channel for its uplift.