Tuesday, January 11, 2011

ముగిసిన ‘బిగ్’ ప్రహసనం?!

గత ఏడాది వచ్చిన అన్ని రియాల్టీ షోలలో అందరి దృష్టిని ఆకర్షించినదీ, అనేకానేక వర్గాల విమర్శలు ఎదుర్కొన్న షో ఏదైనా ఉందంటే అది నిశ్చయంగా బిగ్ బాస్ - సీజన్ ఫోరే! (కలర్స్ ఛానల్‌లో ఈ ఏడాది జనవరి 8 వరకూ ప్రసారమైంది)
వివాదాలకు కారణం?
విభిన్న ప్రవృత్తులు, విభిన్న రంగాలకు చెందిన అపరిచిత వ్యక్తులు నిర్దేశించినన్ని రోజులు మరే విధమైన బాహ్య ప్రపంచ సంబంధాలు లేకుండా ఒకచోట ఉన్నప్పుడు వారి స్పందనలూ, వారి మధ్య జరిగే సంభాషణల అనంతరం వచ్చే మానవ సహజ భావోద్వేగాలూ, తదితరాలెలా ఉంటాయో వాస్తవ ధోరణిలో చూపడమే ‘బిగ్ బాస్’ ప్రధాన ఇతివృత్తం. ఎప్పుడైతే వాస్తవికతకు అరమరికలు లేకుండా పట్టం కట్టినపుడు కొన్నికొన్ని సందర్భాలలో హద్దు మీరిన మాటలు, అప్పుడప్పుడు అభ్యంతరకర సంగతులు తెరపై దర్శనమిస్తాయి. అవి తప్పకుండా కొందరి కనె్నర్రకు గురవుతాయి. పెద్దలు మాత్రమే వినదగ్గ అలాంటి మాటలు కుదరవు అని చెప్పి ‘బిగ్ బాస్’ కార్యక్రమం షూట్ చేస్తున్న ఇంటి ముందు రాజకీయ పార్టీలు ధర్నా చేశాయి. కోర్టు జోక్యంతో ప్రసారం చేసే సమయ వేళలూ మారాయి. అయితే ఇవేవీ ‘బిగ్ బాస్’ని వీలైనంత జన సమీపంగా తీర్చిదిద్దే చాకుల్లాంటి నిపుణుల బృందంలో ఉండే అవిశ్రాంత స్ఫూర్తికి విఘాతం కలిగించలేదు. అందుకే ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించిన ది గ్రేట్ సల్మాన్ భాయ్ దగ్గర్నించీ లైట్ బాయ్ వరకూ అందరూ అభినందనీయులే అంటారు కార్యక్రమ సమర్పకులు. ఇన్ని ఇలా ఉన్నా కార్యక్రమాన్ని అత్యధికులు ఎన్ని పనులున్నా ప్రసార సమయానికి పని గట్టుకు వచ్చి టీవీ ముందు కూర్చునేవారనడం అతిశయోక్తి కాదు. అనేక మంది స్వానుభవం. దీనికి కారణం సల్మాన్ ప్రభావంతో గెస్ట్‌లుగా వచ్చిన ప్రముఖుల సందడి. ఈ ప్రముఖుల పరంపరలో దేశీ సుందరి కత్రినా నుంచి.. హాలీవుడ్ దేవకన్య పమేలా ఆండర్సన్ వరకూ ఉండటం.
నో స్క్రిప్ట్..
ఏ కార్యక్రమానికైనా ఉద్దేశిత అంశాల ఆవిష్కరణకు స్క్రిప్ట్ తప్పనిసరి. అంటే ఎవరు ఏం మాట్లాడాలీ అన్నది.. కానీ 96 రోజుల షూటింగ్‌లో 50 కెమెరాల మధ్య పదమూడు మంది వ్యక్తులకు ఏ రకంగా స్క్రిప్ట్ సప్లై చేయగలం? అని కార్యక్రమ నిర్మాణంలో ముఖ్యుడొకరు అంటున్నారు. అయినా దీని ఉద్దేశమే వ్యక్తుల వాస్తవ మనోభావాల వెల్లడి కనుక ముందుగా రాసుకునే వాక్యాల ఊతం అనవసరం. కానీ ఓ లైన్ మాత్రం అంటే విధి విధానాల సూచిక మాత్రం ఉండి తీరాలి.
మధుర క్షణాలు
ఇక ‘బిగ్ బాస్’ ఆఖరి ఎపిసోడ్‌లో విన్నర్‌గా నిలిచిన శే్వతా తివారీ, ఆ సందర్భంలో గురైన మనోభావాలు మధురంగా ఉన్నాయి. గతంలోనే రియాల్టీ షోస్‌లో పాల్గొన్న అనుభవం ఆమెకున్నా విజేతగా నిలిచిన సమయంలో నోట మాట రాక ఆనంద భాష్పాలతో కూతుర్ని, తల్లినీ మదికి హత్తుకున్న తీరు ప్రేక్షకుల్ని రియల్ మూడ్‌లోకే తీసుకెళ్లింది. ఇక ప్రైజ్‌మనీ కోటి రూపాయలున్న బ్రీఫ్‌కేస్ శే్వత చేతికి అందజేస్తూ సల్మాన్‌ఖాన్ - ఈ ఆనందంలో నువ్వది మోయలేవు. పక్కనున్న మరో అభ్యర్థి ఖలీ (వృత్తిపరంగా డబ్ల్యుడబ్ల్యు ఫైటర్) కి ఇయ్యి’ అనడం, అది ఆయన తీసుకోవడం ప్రేక్షకుల్ని ఆనందంలో ముంచెత్తింది. ఏది ఏమైనా ఈ తరహా షోలు మానవ నైజాల బహిర్గతకు వేదికలనుకోవచ్చా?

Source: www.andhrabhoomi.net

వైవిధ్యంతో ‘రాధాకల్యాణం’

ఇప్పుడైతే కొద్దిగా పరిస్థితి మారింది. కానీ గతంలో టీవీ అంటే సీరియల్సే. అందుకే తాము అభిమానించే ధారావాహిక ప్రసార సమయానికి చాలాసేపు ముందరే టీవీ ముందు చూడ్డానికి సమాయత్తమయ్యే ప్రేక్షక కోటి ఇంకా ఉంది. వాళ్ల నాకర్షించడం కోసమే కొత్తకొత్త ధారావాహికలు కదం తొక్కుతున్నాయి. అందులో ఒకటి ‘రాధాకల్యాణం’ (జీ తెలుగులో సోమవారం నుంచి శుక్రవారం వరకూ రాత్రి 8.30కి వస్తున్నది)

‘రాధాకల్యాణం’ పేరిట లోగడ సినిమాలు వచ్చాయి. ఇప్పుడీ ధారావాహిక. సినిమా అంటే ఏవో ఆరు పాటలు, మూడు ఫైట్లు వంటి పడికట్టు ముడి పదార్థాలున్నట్లే ధారావాహికకీ, ఓ అదరగొట్టే టైటిల్ సాంగూ, నిక్షేపంగా భావాలు పలికించే నెగెటివ్ లేడీ కేరెక్టరు, లెక్కకు మించిన ట్విస్టులు.. అంటూ కొన్ని ష్యూర్ టెక్నిక్స్ ఉన్నాయి. ఆ పోకడలను ఎంతవరకూ ఇది అనుసరించిందని నిర్ధారించడానికి ఇప్పటివరకూ అయినవి అయిదు భాగాలే కనుక తేల్చి చెప్పలేం కానీ కొన్నిటిని పరిశీలించాలి. అదరగొట్టే టైటిల్ సాంగ్ స్థానంలో శ్రావ్యమైన టైటిల్ సాంగు సీతాకోక చిలకమ్మా.. చిరు నవ్వేమైనది...’ అనేది ఉంది. అయితే ఇందులో గీత రచయిత చాలావరకూ చక్కటి టెంపో కొనసాగించినా, కొన్ని చోట్ల ప్రాస కోసం పడిన తెగ ప్రయాస కొట్టొచ్చినట్లు కన్పడింది. (మది, దోషం, మోసం... లాంటి పద ప్రయోగాల సందర్భం..) ఇక కథ విషయానికొస్తే.. పెళ్లీడే రాని ఓ అమ్మాయికి, తన అవసరాల కోసం ఓ దుష్టుడికి పెళ్లి చేయాలని సంకల్పించే తాగుబోతు తండ్రి.. తొలిచూపులోనే ప్రేమలో పడిన కీర్తి - వంశీల ఉదంతం ఇంకోవైపు సమాంతరంగా సాగుతున్నాయి. రెండింటికీ సమన్వయం ఎలా కుదురుస్తారో ముందు భాగాల్లో చూడాలి. అయితే రెండింటికీ ఉన్న ప్రధాన ట్విస్టు ‘పెళ్లి’. రాధ (పేదింట పుట్టిన చిన్నారి) తల్లికి, రాధ హస్తరేఖలు చూసి ఈమెకు రెండు నెలల్లోనే పెళ్లవుతుందని చెప్తాడు. వైద్యం చేయడానికి వచ్చిన ఓ ఆయుర్వేద వైద్యుడు (ఆయనకి హస్తసాముద్రికంలో పరిచయం ఉండి ఉండవచ్చు). అలాగే వంశీ తల్లి, నాయనమ్మ కూడా అతని ప్రేమ సమాచారం సెల్‌లో చూసి, పెళ్లి మంచిదే. కానీ రాబోయే అమ్మాయి ఆయుష్షు ఎలా ఉంటుందో అన్న భయాందోళనలు వెలిబుచ్చారు. అదే రీతిలో కీర్తికి పెళ్లి అంటే ఓ ఆదుర్దాతో కూడిన లుక్ ఇచ్చింది వాళ్లమ్మ. కనుక ఈ పెళ్లవడం లేదా ఏదైనా దీని చుట్టూ ఉంటుందన్న దృష్టి ప్రేక్షకులకు వచ్చేసింది. ఇక నటీనటుల అభినయానికి సంబంధించిన అంశానికి వస్తే, రాధ పాత్ర పోషిస్తున్న నటి ఇందాకా ప్రస్తావించుకున్న పాటలో మంచి అభినయాన్ని చూపింది. క్లోజప్స్‌లో ఆమెకున్న చిన్న కళ్లు ఇబ్బంది పెడ్తున్నాయి. ఇక మరి ఇలాంటి తండ్రి (కూతుర్ని ఓ జులాయికిచ్చి వివాహం చేద్దామనుకునే తత్వం) వుంటాడా అన్న అనుమానం మనల్ని వెంబడించినా, ఉంటే గింటే ఇలాగే ఉంటాడు అని అన్పిస్తున్నాడు క్వార్టర్ కేశవరావు పాత్రలో ఆ నటుడు. వంశీగా, కీర్తిగా నటిస్తున్న పాత్రధారులు ఓకే అయినా, వాళ్లకిచ్చిన డబ్బింగ్ వాయిస్‌ల్లో వైవిధ్యం కనపడ్డం లేదు. ఇక సంభాషణాకర్త మొత్తం ఎపిసోడ్స్‌ను రసపట్టుగా నడపడానికి పూచీ తీసుకున్నట్లు ప్రయోగిస్తున్న మాటల ధోరణి చెప్తోంది. ‘ఈ పచ్చని నోట్లతో నీ పచ్చని జీవితాన్ని పాడు చేస్తున్నాడు’ ‘కడుపున పుట్టిన నువ్వే కడుపు మీద కొడతావా’ ‘ప్రేమించిందన్న విషయం, కాలేజీ ఫస్టొచ్చినంత ఆనందంగా చెప్తారేమిటి?’ - అన్నవి అంతో ఇంతో సందర్భ సహితంగా ఉన్నాయి. కానీ జనవరి 6న ప్రసారమైన భాగంలో కీర్తి పాత్రలో ‘ప్రేమ క్షణికం కావచ్చు, కానీ ప్రేమలో పడడానికి ఒక్క క్షణం చాలు..’ అన్న దాంట్లో క్లారిటీ లేదు.

Source: www.andhrabhoomi.net

Monday, January 10, 2011

బుల్లితెర వైపు...బిగ్‌స్టార్స్‌

పనిగట్టుకుని థియేటర్‌కి వచ్చి సినిమా చూస్తేనే వినోదం అనే భావన క్రమక్రమంగా తగ్గిపోతోంది. అందుకే భారీ చిత్రాలు సైతం బాక్సాఫీస్‌ వద్ద చతికిలపడుతున్నాయి. వందల థియేటర్లు, షాపింగ్‌మాల్స్‌గా మారుతున్నాయి. మరి వినోదం సంగతి..! అదిప్పుడు బుల్లితెర వంతు. చేతిలో రిమోట్‌ ఉంటే, ప్రపంచంలో ఏ జరుగుతుందో తెలుసుకోవచ్చు. వీలైతే విజ్ఞానమూ దక్కుతుంది. అలిసిపోతే అలరించే కార్యక్రమాలకూ తక్కువ ఉండదు. వెండితెర కన్నా వాడివేడిగా వడ్డింపులు బుల్లితెరపై వీనుల విందు నడుస్తోంది. దీంతో ప్రేక్షకుల వద్దకే కాన్సెప్ట్‌ అనేది బాలీవుడ్‌ స్టార్స్‌ బాగా అర్థం చేసుకున్నారు. దాని ఫలితమే పలు రియాల్టీ షోలు. వీటి మహిమేంటో హిందీ తారలు ముందుగానే పసిగట్టారు. 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' అంటూ అమితాబ్‌ బచ్చన్‌ చేసిన షో జాతీయస్థాయిలో సంచలనం సృష్టించింది. టీవీ కార్యక్రమాన్ని నడపటంలోనూ నవ్యతను బిగ్‌ బి చూపారు. ఇప్పుడు ఆయన బాటలో పలువురు తారలు నడుస్తున్నారు. దీంతో టీవీ ఛానళ్ల టిఆర్‌పి రేటింగ్స్‌ అమాంతంగా పెరిగిపోయాయి. ఇక్కడా వీరు పోటీపడుతున్నారు.

సల్మాన్‌ 'బిగ్‌బాస్‌'
కౌన్‌బనేగా కరోడ్‌పతి కార్యక్రమానికి గట్టిపోటీ ఇవ్వాలంటే, అదే స్థాయిలో సంచలనం సృష్టించే మరో స్టార్‌ కావాలి. దాంతో సల్మాన్‌ వారికి కనబడ్డాడు. అంతేగాక వాంటెడ్‌, దబాంగ్‌ హిట్స్‌తో మాంచి ఊపులో ఉన్నాడు. సల్లూ కూడా ఒకే అనడంతో, ఈ కండల వీరుడితో ఓ వినూత్న షోకు కలర్స్‌ ఛానల్‌ శ్రీకారం చుట్టింది. బాలీవుడ్‌ యాక్షన్‌ హీరో అక్షరుకుమార్‌ రియాల్టీ షో కోసం ఏకంగా గరెటపట్టి వంట చేసేస్తున్నాడు. 'మాస్టర్‌ చెఫ్‌ ఇండియా'గా ప్రసారమవుతున్న ఈ షోకు మంచి క్రేజ్‌ ఏర్పడింది. భారతీయ సంస్కృతీ సంప్రదాయాలకు కార్యక్రమంలో చోటు కల్పించడంతో అభిమానుల ఆదరణ చూరగొంది. కెబిసి-3తో తన సత్తా మరోసారి బిగ్‌ బి రుచిచూపించాడు. దీనికున్న డిమాండ్‌ చూసి కెబిసి-4 కూడా మొదలెట్టేశారు. ప్రస్తుతం అమితాబ్‌, సల్మాన్‌, అక్షరు ఈ ముగ్గురూ చేస్తున్న ఈ మూడు షోలే బుల్లితెర ప్రపంచాన్ని ఏలుతున్నాయని, వాటికొస్తున్న టిఆర్‌పి రేటింగ్స్‌ చెబుతున్నాయి.

షారూక్‌ 'జోర్‌ కా జట్కా'

ఓ పక్క సినిమాల్లోనూ, మరోపక్క ప్రకటనల్లోనూ రెండు చేతులా సంపాదిస్తున్న బాలీవుడ్‌ తారలకు బుల్లితెర రియాల్టీ షో కాసులు కురిపిస్తున్నాయి. అందరి కళ్లు వీటి మీదే పడ్డాయి. కింగ్‌ ఖాన్‌ షారూక్‌ 'జోర్‌ కా జట్కా' అనే షో చేయడానికి అంగీకారం తెలిపాడు. అంతర్జాతీయంగా వస్తున్న 'వైప్‌ అవుట్‌' షోకి ఇది అనుకరణ. మరో ప్రముఖ ఛానల్‌వారు 'రతన్‌ కా రిస్తా' అనే షో చేయమని కూడా అడిగారట. అమ్మాయిల డ్రీమ్‌ హీరో హృతిక్‌రోషన్‌ 'డ్యాన్స్‌ ఒలింపిక్స్‌', అందాల భామ మల్లికా శెరావత్‌ 'చక్‌ ధూమ్‌ ధూమ్‌ టీమ్‌ ఛాలెంజ్‌' షోలు చేయడానికి గ్రీన్‌ సిగల్‌ ఇచ్చేశారు. చేతిలో సరైన సినిమాలు లేని మల్లిక బుల్లితెర అయినా కలిసొస్తుందని ఆశతో ఉంది. స్వయంవరం పేరుతో రాఖీసావంత్‌ చేసిన రియాల్టీషో వివాదమూ, వినోదమూ రేపింది. ప్రీతీ జింటా 'గిన్నీస్‌ వరల్డ్‌ రికార్డ్స్‌', లారాదత్తా 'అబ్‌ ఇండియా తోడేగా' షోలు చేయడానికి అంగీకారం తెలుపడానికి ఆసక్తి చూపుతున్నారు !
వినూత్నంగా ప్రేక్షకుల్ని ఆకర్షించే రియాల్టీ షోలు చేయడానికి బాలీవుడ్‌ తారల మధ్య గట్టీ పోటీ ఏర్పడింది. పోటీ కొన్ని హద్దులుదాటం వల్ల చిక్కులు కూడా ఏర్పడుతున్నాయి. సరదాగా వినోదాన్ని అందించాల్సిన షోలు శ్రుతిమించుతున్నాయి. హద్దులు దాటితే ఏదైనా ప్రమాదమే కదా!
 
Source: www.prajasakti.com

భాను దందాలో టీవీ యాంకర్

మద్దెలచెర్వు సూరి హత్య కేసులో నిందితుడు భాను కిరణ్ దందాలో ఓ టీవీ యాంకర్ పాత్ర వెలుగులోకి వచ్చింది. మహబూబ్‌నగర్ జిల్లాలోని తలకొండపల్లి మండలంలో భాను కిరణ్ అక్రమంగా 25 ఎకరాల భూమిని అక్రమంగా కబ్జా చేశాడని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆ ఆక్రమణకుగాను భాను కిరణ్ ఓ టీవీ యాంకర్‌ను వాడుకోవడానికి ప్రయత్నించాడు. బొజ్జి రెడ్డి అనే వ్యక్తి కూతురు సునీత పేర ఉన్న భూమిని రిజిష్టర్ చేయించుకోవడానికి భాను కిరణ్ ముఠా ఆ టీవీ యాంకర్‌ను వాడుకోవడానికి ప్రయత్నించాడు. ఆ యాంకర్ సునీతను పోలి ఉందట. దాంతో ఆమెను సునీతగా నమ్మించి ఆమె సంతకంతో భూమిని తమ పేర్ల మీదికి మార్చుకోవడానికి భాను కిరణ్ ముఠా ప్రయత్నించిదని అంటున్నారు. సునీతను బాగా ఎరిగిన ఓ ప్రజాప్రతినిధి అనుమానాలు వ్యక్తం చేయడంతో ఆ టీవీ యాంకర్ కథ ఎదురు తిరిగినట్లు సమాచారం. అయితే, ఆ తర్వాత మరో మార్గంలో భాను కిరణ్ ఆ భూమిని కబ్జా చేశాడని అంటున్నారు.

Source: thatstelugu.oneindia.in

Friday, January 7, 2011

శ్రీకృష్ణ కమిటీ నివేదిక: టీవీ చానెళ్లపై మితిమీరిన ఆంక్షలు

హైదరాబాద్: న్యూస్ బ్రాడ్‌కాస్టర్స్ అసోసియేషన్ (ఎన్‌బిఎ) ఆంక్షలు అమలు అవుతుండడంతో రాష్ట్రంలోని తెలుగు టీవీ చానెళ్లు తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దృశ్యాలను ప్రసారం చేయడం మానేశాయి. హింసకు, తెలంగాణ ఉద్యమానికి సంబంధించిన దృశ్యాలను టీవీ చానెళ్లు ప్రసారం చేయడం ఆపేశాయి. ఎన్‌బిఎ మార్గదర్శక మార్గాలను ఉల్లంఘించే మీడియాపై చర్యలు తీసుకుంటామని డిజిపి అరవింద రావు శుక్రవారం మీడియా ప్రతినిధుల వద్ద స్పష్టం చేశారు. నిరసనలు, ఉత్సవాలకు సంబంధించిన దృశ్యాలను కూడా టీవీ చానెళ్లు నిలిపేశాయి.

ఆందోళనలకు సంబంధించి ప్రత్యక్ష ప్రసారాలను కూడా ఆపేశాయి. ఉస్మానియా విశ్వవిద్యాలంయ వద్ద ఒకటి, రెండు ఒబి వ్యాన్లు మాత్రమే ఉన్నాయి. ప్రత్యక్ష ప్రసారాలను అనుమతించేది లేదని, దానివల్ల హింసను నిరోధించగలుగుతామని పోలీసులు అంటున్నారు. ఒయులో జరిగిన రాళ్ల దాడిని ప్రసారం చేయడానికి ప్రయత్నించిన ఓ చానెల్ ప్రసారాలను కొద్దిసేపు ఆపేశారు. ఉస్మానియా విశ్వవిద్యాలయంలో శుక్రవారం రెండో సారి కూడా తీవ్ర ఉద్రిక్తత నెలకొందని, పోలీసులు విద్యార్థులపై టియర్ గ్యాస్ ప్రయోగించారని వార్తలు వచ్చాయి. కానీ వాటిని ధ్రువీకరించే మార్గాలు కూడా లేకుండా పోయాయి. ఉస్మానియాలో ఏం జరుగుతుందో కూడా తెలియడం లేదు.

Source: thatstelugu.oneindia.in

Thursday, January 6, 2011

బహుముఖ వేషధారి


నటనా రంగానికి మాతృక వంటిది నాటకం. నాటక రంగంలో రాణించిన అనంతరం సినిమాల్లోకి వచ్చి ఉత్తమ నటులుగా పేరు తెచ్చుకున్న వారెందరో ఉన్నారు. కానీ వీరంతా సినీ రంగానికి వచ్చిన తర్వాత నాటకాన్ని మరచిపోతుంటారు. కానీ తనకు పేరు తెచ్చిన నాటకాల్లో నటిస్తూనే సినీ, టీవి రంగంలో పేరుతెచ్చుకున్న నటులు చాలా అరుదుగా ఉంటారు. ఇటువంటి వారులో ఒకరు రాయల ఆర్‌.హరిశ్చంద్ర. ఆయన స్కూల్లో చదువుకుంటున్న రోజుల నుంచి నాటకాల్లో నటిస్తూ ఇప్పటికీ ఆ రంగాన్ని తన తల్లిగా భావిస్తున్నారు. 30 సంవత్సరాలుగా ఆయన నాటకాలు చేస్తున్నారు. ఇక మేకప్‌ ఆర్టిస్ట్‌గా సైతం పేరుతెచ్చుకున్న హరిశ్చంద్ర దేశంలోనే మొదటి సారిగా మేకప్‌, కాస్ట్యూమ్స్‌ అంశాలపై పిహెచ్‌డి చేసిన వ్యక్తి కావడం గమనార్హం. 

నటనలో బహుముఖ ప్రజ్ఞాశాలి...
రాయల హరిశ్చంద్ర జన్మస్థలం అనంతపురం జిల్లాలోని గుంతకల్‌ ప్రాంతం. ఆయన అక్కడే పాఠశాల, కళాశాల విధ్యాభ్యాసాన్ని పూర్తి చేశారు. ఆయన ఎనిమిదవ తరగతి నుంచి పాఠశాలల్లో నాటకాలు వేస్తూ ఉపాధ్యాయులు, తన తోటి విద్యార్థుల చేత శెభాష్‌ అనిపించుకున్నారు. అనంతరం గుంతకల్‌ ఎస్‌కెపి ప్రభుత్వ కళాశాలలో డిగ్రీ చదువుకునే రోజుల్లో ఆయన పలు నాట కాల పోటీల్లో నటించి ఉత్తమ రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్నారు. ఇక హరిశ్చంద్ర తండ్రి హెచ్‌.రామాంజనేయులు సైతం రంగస్థల నటులే కాకుండా నాటకాల దర్శకులు కూడా. రైల్వే ఉద్యోగిగా పనిచేస్తూనే ఆయన తరచుగా నాటకాల్లో నటించి ఎంతో పేరుతెచ్చుకున్నారు. ఆయన తన కుమారుడిని నాటకాల్లో నటించేందుకు చిన్నతనం నుంచి ఎంతో ప్రోత్సహించేవారు. తండ్రి ప్రోత్సాహంతో హరిశ్చంద్ర ఎంతో ఉత్సాహంగా పాఠశాల, కళాశాల స్థాయిలో నాటకాలు వేసేవారు. 
ఉత్తమ రంగస్థల నటునిగా...
harichandra3
గుంటూరులోని హిందూ కాలేజీ గోల్డెన్‌ జూబ్లీ వేడుకల సందర్భంగా 1986, 87, 88 సం వత్సరాల్లో నాటకాల పోటీలను నిర్వహిం చారు. ఈ పోటీల లో భాగంగా నిర్వ హించిన నాట కా ల్లోని పాత్రల్లో నటించడమే కాదు జీవించి వరుసగా మూడు సంవత్సరాల పాటు ఉత్తమ రంగస్థ ల నటునిగా అవార్డులు పొంది ఎంతో పేరుతె చ్చుకున్నారు. ‘హిందూ కాలేజీ నాటకాల పోటీ ల్లో ఉత్తమ రంగస్థల నటునిగా వరుసగా మూడు సార్లు ...అవార్డులు గెలుపొందడం నా జీవితంలో పెద్ద మలుపు. ఈ అవార్డులు అందు కోవడం నాకు జీవితంలో మరచిపోలేని అనుభూతులను మిగిల్చింది. ఆ తర్వాత నాటక రంగంలో వెనుదిరిగి చూడకుండా ఎదగగలిగాను’ అని హరి శ్చంద్ర అన్నారు. ఇక ప్రముఖ రంగస్థల నటులు ఆనంద్‌ వద్ద 1983లో హరిశ్చంద్ర నటనలో శిక్షణ పొందారు. సాంఘిక నాటకాల్లో ఏవిధంగా నటించాలో ఆయన వద్ద మెలకువలను నేర్చుకున్నారు. ప్రముఖ రంగ స్థల నటులు, సినీనటులు పుండరీకాక్షయ్య సోదరులైన అట్లూరి బలరామయ్య వద్ద సైతం నటనలో మెలకువలను నేర్చుకొని అంచెలంచెలుగా నాటక రంగంలో ఎదిగారు. ఇక తన తండ్రి మిత్రులైన కోటేశ్వరా వు దగ్గర మేకప్‌లో శిక్షణ పొందారు. 

నటనలో శిక్షణా కోర్సులు...
స్వతహాగా నటనను నేర్చు కున్న హరిశ్చంద్ర యాక్టింగ్‌ లో ప్రొఫెషనల్‌గా శిక్షణ పొం దాలని భావించారు. రైల్వే ఉద్యోగి అయిన తండ్రి హైదరా బాద్‌కు బదిలీ అయిన తర్వాత ఆయన ఈ నగరానికి వచ్చారు. అనంతరం హైదరాబాద్‌లోని సెంట్రల్‌ యూనివర్సిటీలో 1990సంవత్సరంలో పిజి డిప్లొమా ఇన్‌ యాక్టింగ్‌ కోర్సు చేశారు. ‘నటనలో పిజి డిప్లొమా కోర్సు పూర్తి చేసిన తర్వాత నా జీవితమే మారిపోయింది. ఆ తర్వాత నా వృత్తి, ప్రవృత్తి నాటకమే అయ్యింది. ఈ కోర్సు పూర్తయిన తర్వాత నాకు థియేటర్‌ ఆర్ట్‌లోని మెలకువలను నేర్చుకోగలిగాను’ అని హరిశ్చంద్ర పేర్కొన్నారు. ఆ తర్వాత సెంట్రల్‌ యూనివర్సిటీలోనే ఎంఎ థియేటర్‌ ఆర్ట్‌‌సను పూర్తిచేశారు ఆయన. ఆ తర్వాత 1995లో నేషనల్‌ ఎలిజిబిలిటీ టెస్టును ఆయన పాసయ్యారు. దీంతో లెక్చరర్‌ కావడానికి ఆయన అర్హత లభించి నట్లయ్యింది.
మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన...
దేశంలో మొదటిసారిగా మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన చేసిన వ్యక్తిగా హరిశ్చంద్ర పేరు తెచ్చుకున్నారు. ప్రొఫెసర్‌ సుధాకర్‌రెడ్డి పర్యవేక్షణలో ఆయన ఈ అంశాలపై పిహెచ్‌డి చేశారు. ‘భాగవతాలు’ అంశంలో ఆహార్యం, మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన చేయాలని సుధాకర్‌రెడ్డి సూచించారు. ఆయ న సూచనల మేరకు చిందు భాగవతంలో మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై పరిశోధన చేశాను. ఈ మేరకు చేసిన పరిశోధనకు గాను నాకు పిెహచ్‌డి లభించింది. 2000లో డాక్టరేట్‌ పూర్తి చేయడం నాకు గొప్ప ఉత్సాహాన్నిచ్చింది. దేశంలోనే మొదటిసారిగా మేకప్‌, కాస్ట్యూ మ్స్‌పై పిహెచ్‌డి చేయడంతో అందరి దృష్టిలో పడినట్లయ్యింది. దీంతో నాకు పలువురు ప్రముఖు లతో పరిచయాలు ఏర్పడ్డాయి. వీ రిలో రంగస్థల ప్రముఖులు భాస్క ర్‌ శివాల్కర్‌, ఎన్‌.జె.భిక్షు, డాక్టర్‌ చాట్ల శ్రీరాములు, డాక్టర్‌ ప్రసా ద్‌రెడ్డి, ప్రొఫెసర్‌ నాగభూషణ శర్మ, డి.ఎస్‌.దీక్షిత్‌ వంటి వారితో పరిచయం ఏర్పడింది’ అని హరి శ్చంద్ర చెప్పారు. ‘పిహెచ్‌డి చేస్తు న్న సమయంలోనే సెంట్రల్‌ యూ నివర్సిటీ నన్ను గెస్ట్‌ ఫ్యాల్టీగా, మేకప్‌ ఆర్టిస్ట్‌గా ఎంతో ప్రోత్స హించింది. ఆర్థికంగా సహాయ పడడమేగాకుండా నటునిగా నాకు గుర్తింపునిచ్చింది’ అని ఆయన తెలిపారు. 
ప్రముఖ రంగస్థల నటునిగా...
డాక్టరేట్‌ పూర్తయిన అనంతరం హరిశ్చంద్ర రసరంజని సాంస్కృతిక సంస్థ ద్వారా పలు నాటకాల్లో నటించారు. నాటకాలతో పాటు మేకప్‌ ఆర్టిస్ట్‌గా సైతం చేశారు. తల్లవఝ్జుల సుందరం దర్శకత్వంలో ఎన్నో నాటకాలు చేశారు. అనంతరం డాక్టర్‌ ప్రసాద్‌రెడ్డి, డి.ఎస్‌.ఎన్‌.మూర్తి, ఎం.ఎన్‌.శర్మ, చాట్ల శ్రీరాములు దర్శకత్వంలో పలు నాటకాల్లో ఆయన నటించి మంచి పేరు తెచ్చుకున్నారు. ఈ నేపథ్యంలో 2005లో ఆయన ఆఫ్రికాలోని ఎరిత్రియా దేశానికి వెళ్లి అక్కడ ఐదేళ్ల పాటు నటన, దర్శకత్వం, మేకప్‌, కాస్ట్యూమ్స్‌పై అసిస్టెంట్‌ ప్రొఫెసర్‌గా పనిచేసి గత ఏడాది ప్రారంభంలో హైదరాబాద్‌కు తిరిగి వచ్చారు. ‘ఎరిత్రియాలో పనిచేసిన అయిదేళ్ల సమయంలో తెలుగు నాట రంగాన్ని ఆ దేశవాసులకు పరిచయం చేశాను. అక్కడ మొదటిసారిగా వరుసగా మూడేళ్ల పాటు ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని జరిపించాను. అనం తరం నాలుగవ సంవత్సరం నుంచి అక్కడి ప్రభుత్వం ఈ దినోత్సవాన్ని అధికా రికంగా జరిపిస్తోంది. అయిదేళ్ల పాటు ఎరిత్రియా దేశంలో గడపడం నాకెంతో ఆనందాన్నిచ్చింది. అక్కడి వారు తెలుగువారి సంస్కృతీ సంప్రదాయాలను తెలుసుకొని ఎంతో ముగ్దులయ్యారు’ అని హరిశ్చంద్ర పేర్కొన్నారు. 
సినిమా, టివి, రేడియోలో నటనానుభవం...
రంగస్థల నటునిగా పేరుతెచ్చుకున్న హరిశ్చంద్రకు పలు టివి ఛానెల్స్‌లో అవకాశాలు వాటంతటవే లభించాయి. ఆయన దూరదర్శన్‌, జెమిని, ఈటివి, ఈటివి2 ఛానెల్స్‌లో ఇప్పటివరకు 100కు పైగా సీరియల్స్‌లో నటించారు. వీటిలో రుతు రాగాలు, కస్తూరి, సంగ్రామం, ముగ్ద, సినిమానందలహరి, అంతులేని కథ, స్వాతి చినుకులు, పంచమవేదం, మహాకవి ధూర్జటి వంటి పేరొందిన సీరియల్స్‌ ఆయనకు ఎంతో పేరును తీసుకువచ్చి పెట్టాయి. ఇక సినిమాల్లో సైతం ఎన్నో అవకాశాలు ఆయనకు వచ్చాయి. వీటిలో ఒక్కడు, అర్జున్‌, అతడు, రెండేళ్ల తరువాత, అక్టోబర్‌ 19, ఖలేజా చిత్రాల్లో ఆయన నటించారు. ‘సినీ దర్శకులు త్రివిక్రమ శ్రీనివాస్‌, గుణశేఖర్‌ వంటి వారు నన్ను బాగా ప్రోత్సహించారు. వారి ప్రోత్సాహంతో పలు హిట్‌ సినిమాల్లో నటించగలిగాను ’అని హరిశ్చంద్ర పేర్కొన్నారు.

దక్కిన అవార్డులు...
దాదాపు 30 సంవత్సరాలుగా నటనా రంగంలో కొనసాగుతున్న హరిశ్చంద్రకు ఎన్నో అవార్డులు దక్కాయి. గత ఏడాది మే నెలలో బిహెచ్‌ఇఎల్‌ నిర్వహించిన 32వ ఆలిండియా డ్రామా కాంపిటీషన్స్‌లో ఆయనకు బెస్ట్‌ యాక్టర్‌ అవార్డు, బెస్ట్‌ డైరెక్టర్‌ అవార్డు, బెస్ట్‌ ప్రొడక్షన్‌ అవార్డులు లభించడం ఆయన బహు ముఖ ప్రజ్ఞకు అద్దం పడుతుంది. పరుచూరి రఘుబాబు మెమోరియల్‌ ట్రస్ట్‌ ఆధ్వర్యంలో జరిగిన 12వ ఆలిండియా డ్రామా కాంపిటీషన్స్‌లో ఆయన బెస్ట్‌ విలన్‌, యువ కళావాహిని 2005లో నిర్వహించిన ఆలిండియా డ్రామా కాంపిటీషన్స్‌లో బెస్ట్‌ క్యారెక్టర్‌ యాక్టర్‌ అవార్డులు లభించాయి. వీటితో పాటు మూడు దశాబ్దాలుగా ఆయనకు ఎన్నో అవార్డులు దక్కాయి.

Source: www.suryaa.com

Read Telangana report with 'open mind': PC tells leaders

Home Minister P Chidambaram today appealed to political parties in Andhra Pradesh to read the recommendations of the Justice Srikrishna Committee on Telangana with an ''open mind'' and give ''impartial consideration'' to them.

Andhra Pradesh Chief Minister N Kiran Kumar Reddy leaves after a meeting with senior leaders of Congress and party MPs of the Telangana region on the eve of the release of the Justice Srikrishna Committee report on Telangana, in New Delhi on Wednesday. PTI He expressed confidence that the report will generate an "informed and matured" debate on the issue.

Handing over copies of the report to leaders of political parties from the state at a meeting here, Chidambaram urged them to give "your most careful, thoughtful and impartial" consideration to the recommendations.

He asked them to read the report with an "open mind" and be prepared to persuade or be persuaded by those hold another point of view.

Chidambaram regretted the boycott of the meeting by TRS, TDP and BJP. "It is Government's sincere hope that the report will generate an informed and matured debate," he said.

Recalling the discussions on January 5 last year, which he said had showed the way forward -- that findings, study, analysis, options and recommendations, Chidambaram said its is the government's hope that the discussions today will also show the way forward.

"I am sure that besides political parties, people of Andhra Pradesh -- both individuals and groups -- would also make valuable suggestions that will show the way forward.

"You will note that I have repeatedly used the phrase 'way forward'. Today in order to reiterate government's intentions to find just, honourable and praticable solutions that has the widest measure of support among all stakeholders," he said.

Referring to the joint appeal made by the January 5 meeting to people of Andhra Pradesh to maintain peace and calm, Chidambaram said it had a salutary effect.

"It is necessary that peace, harmony and law and order should be maintained in the state. I would request you to join me at the end of this meeting to make an appeal similar to the appeal we made last year," he said.

The Home Minister said it is natural that the parties will require time to read the report and hold consultations within their organisations.
Asking them to participate in today's meeting, he said if the parties agreed, then he would suggest they meet again at a convenient date later this month.

Source: www.deccanherald.com

కోక్‌ ప్రచార కర్తగా సచిన్‌

న్యూఢిల్లీ : ప్రసిద్ధ శీతల పానీయం కంపెనీ కోకకోలాతో సచిన్‌ టెండూల్కర్‌తో తమ బ్రాండ్‌కు మూడేళ్ల పాటు ప్రచార కర్తగా నియమించుకుంది. ఈ కాంట్రాక్టు విలువ రూ.20 కోట్ల వరకు వుండవచ్చు. రెండున్నరేళ్ల క్రితం కోక్‌ పోటీదారు పెప్సీ సచిన్‌ను తమ బ్రాండ్‌ ప్రచార కర్త నుంచి తొలగించింది. పరిశ్రమ వర్గాల సమాచారం ప్రకారం 3 సంవత్సరాల పాటు కొనసాగే కాంట్రాక్టు మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌కు ప్రతి ఏడాది రూ.6 కోట్లు చెల్లిస్తుందని అంటున్నారు. వచ్చే నెల నుంచి కొత్త కోక్‌ టీవీ కమర్షియల్‌ను టెండూల్కర్‌తో ప్రారంభిస్తుంది. దీనికి టీవీ కమర్షియల్‌ రచయిత ప్రసూన్‌ జోషి స్క్రి ప్టు రాస్తున్నారు. దీనిపై కోకాకోలా కంపెనీని విచారించగా ఇప్పటి వరకు తాము సచిన్‌తో ఎలాంటి ఒప్పందాన్ని కుదుర్చుకోలేదని చెప్పారు. తమ బ్రాండ్‌ను ప్రచారం చేసేందుకు తాము సెలెబ్రెటీలతో చర్చిస్తుంటామని కంపెనీ వారు చేప్పారు. ఒప్పందం జరిగితేనే తాము బహిరంగంగా ప్రకటిస్తామని చెప్పారు. దీనిపై స్పందించేందుకు వరల్ట్‌ స్పోర్ట్సు గ్రూపు (టెండూర్కలర్‌) దీనికి ప్రచార కర్తగా వ్యవహరిస్తున్నారు.
 
వారు దీనిపై వ్యాఖ్యానించేందుకు నిరాకరించారు. పెప్సీకోతో సచిన్‌ కాంట్రాక్టు 2008లో ముగిసింది. పెప్సీకో యంగి స్తాన్‌ కాన్సెప్ట్‌లో యువకులైన సినీ నటులు రణబీర్‌కపూర్‌, దీపక పదుకొనేను తీసుకున్నారు. అయితే గత 18 నెలల నుంచి సచిన్‌ తన హవా కొనసాగిస్తున్నారు. 51వ టెస్ట్‌ సెంచరీని సాధించాడు. రికార్డుల రికార్డులు బద్దలుకొడుతున్నాడు. డిసెంబర్‌లో ఆటోమొబైల్‌ లుబ్రికెంట్‌ (కందెన) కెస్ట్రాల్‌తో రెండేళ్ల ఒప్పందం కుదుర్చుకున్నారు. కాంట్రాక్టు విలువ ఎంత తెలియరాలేదు. అయితే తాజా వెలుగులోకి వచ్చిన ఆసక్తికరమైన విషయం ఏమిటంటే ఒక మద్యం కంపెనీ సచిన్‌ను సంప్రతించ తమ లిక్కర్‌ కంపెనీకి ప్రచార కర్తగా చేయమన్నారని, దీనికి రూ.20 కోట్లు ఆఫర్‌ చేసినట్లు, సచిన్‌ తిరస్కరించినట్లు వార్తలు వెల్లడయ్యాయి. మార్కెట్‌ వర్గాల సమాచారం ప్రకారం సచిన్‌ టెండూల్కర్‌ సచిన్‌ ఒక కంపెనీ ప్రచార కర్తగా పనిచేసేందుకు రూ.5 కోట్లు వసూలు చేస్తాడని సమాచారం. ప్రస్తుతం ఆయన చేతిలో ఉన్న కంపెనీలు తోషిబా, ఐటీసీ, బూస్ట్‌, కెనన్‌, ఆర్‌బీఎస్‌, రెనాల్డ్‌‌స, జెపీ సిమెంట్స్‌, అవివాలు.
 
Source: www.suryaa.com

Wednesday, January 5, 2011

Rajinikanth’s Blockbuster Robot in Gemini TV on January 15

South Indian Super Star Rajinikanth, Former Miss World Aishwarya Rai starrer science fiction ‘Robot’ directed by S Shankar is going to be telecasted in Gemini TV on January 15 on the occasion of Sankranthi. 

We had been seeing Hindi films being telecasted within 100 days of release in the recent time. Now the trend is spreading to Tollywood and Kollywood. 

‘Robot’ was released in Hindi, Telugu and Hindi simultaneously on October 1. It will be touching the 100-day mark on January 8. And, in just a week after it completes the 100-day run, the film is going to be telecasted on small screen.  

One main reason behind telecasting the movie so soon is that the TRP ratings of the TV Channel will be more on that day and can reap larger benefits in terms of ad revenues.

Source: telugu.16reels.com

Raj News Coming Soon To USA

We are pleased to announce that Raj News will be coming soon to USA and launched USA website (www.rajnewsusa.com) on Jan 01, 2011. Soon we will be launching the iphone/ipad and android applications to watch on mobile devises. 

Now you can watch Raj News live from your computer (www.rajnewsusa.com)

Raj News is the first and only channel with high focus on news, events, culture and lifestyle from Telangana. Raj News is now a Top rated Telugu News Channel in India.

Telangana News Channel 'Raj News' is rated as Number ONE channel by TAM. 'Raj News' pushed back all other Telugu News Channels and stood top on TRP ratings. Even in Hyderabad 'Raj News' is rated as number ONE.

We need your feed back regarding your preference of Major Networks (Dish/Direct TV/Cable/IPTV etc) to make the right decision.

Please go to www.rajnewsusa.com and sign up and let us know your preference.

Best Regards
US Team
Raj News USA
email: info@rajnewsusa.com


Source: www.greatandhra.com