Thursday, August 29, 2013

హైదరాబాద్ లో ఎన్టీవీకి రెండో స్థానం, పుంజుకున్న సాక్షి, అన్ని చోట్లా టీవీ 9

జులై 13 తో ముగిసిన వారంలో 15 ఏళ్ళు పైబడిన పురుష ప్రేక్షకుల శాంపిల్ లో టీవీ9 అన్ని మార్కెట్లలోనూ తన ఆధిక్యం ప్రదర్శించింది. టీవీ 5 రెండో స్థానంలో ఉన్నప్పటికీ, ఎన్టీవీ దగ్గరవుతూ ఉంది. సాక్షి టీవీ గత వారాలతో పోల్చినప్పుడు హైదరాబాద్ లో గణనీయంగా పుంజుకుంది. ఆ కారణం వల్లనే ఈటీవీ 2 ను ఈ వారం దాటగలిగింది. ఎన్టీవీ హైదరాబాద్ మార్కెట్లో రెండో స్థానం పొందగలిగింది. విశాఖ, విజయవాడ నగరాల్లోనూ, చిన్నపట్టణాలలోనూ పరిస్థితి అంతంతమాత్రంగానే ఉన్నప్పటికీ మొత్తమీద ఎన్టీవీ పరిస్థితి మెరుగ్గా ఉండటానికి హైదరాబాద్ మార్కెట్ ప్రధాన కారణమని చెప్పకతప్పదు. ఈటీవీ 2 కు విశాఖ, విజయవాడ నగరాలలో ఆదరణ మరీ తక్కువగా ఉండటం వలన మొత్తం రేటింగ్స్ మీద ప్రతికూల ప్రభావం పడింది. ఈ నగరాలలో ఈటీవీ 2 కంటే స్టుడియో ఎన్, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి, 10 టీవీ చానల్స్ ను ఎక్కువమంది చూస్తున్నట్టు టామ్ లెక్కలు చెబుతున్నాయి.

జులై 13 తో ముగిసిన వారానికి వివిధ మార్కెట్లలో తెలుగు న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా

(  15 ఏళ్ళు పైబడిన పురుషుల ఆదరణ ఆధారంగా టామ్  సమాచారం )

  చానల్
హైదరాబాద్
విశాఖ, విజయవాడ
చిన్నపట్టణాలు
మొత్తం రాష్ట్రం
టీవీ 9
4.76
4.21
2.74
3.92
టీవీ 5 న్యూస్
3.83
3.25
1.23
2.77
ఎన్టీవీ
3.89
1.14
0.73
2.33
సాక్షి టీవీ
1.88
1.99
2.27
2.04
ఈటీవీ 2
3.13
0.68
1.08
2.03
స్టుడియో ఎన్
0.61
0.87
1.01
0.80
జీ 24 గంటలు
-
-
-
-
ఎబిఎన్ ఆంధ్రజ్యోతి
0.51
0.72
0.67
0.60
ఐ న్యూస్
0.90
0.32
0.18
0.55
10 టీవీ
0.49
0.88
0.51
0.55
హెచ్ ఎమ్ టీవీ
0.36
0.45
0.63
0.48
వి 6 న్యూస్
0.57
0.32
0.42
0.48
టి న్యూస్
0.48
0.00
0.33
0.36
సివిఆర్ న్యూస్
0.19
0.61
0.27
0.28
మహా న్యూస్
0.11
0.41
0.18
0.17
జెమిని న్యూస్
0.11
0.10
0.09
0.10

Source: telugutv.info

జాతీయ స్థాయిలో ఎన్డీటీవీతో సమానంగా ఎన్టీవీ

జాతీయ స్థాయి చానల్స్ కు దేశమంతటా మార్కెట్ ఉండటం వలన ప్రాంతీయ భాషల చానల్స్ వాటితో పోటీపడటం కష్టం. కానీ తెలుగు చానల్స్ అందుకు మినహాయింపు అని నిరూపించుకున్నాయి. ఇప్పటివరకు టీవీ 9 మాత్రమే సాధించిన ఈ గౌరవాన్ని ఇప్పుడు ఎన్టీవీ కూడా సొంతం చేసుకుంది. 15 ఏళ్ళు పైబడ్డ పురుషుల విభాగంలో ఎన్డీటీవీ ని మించిపోగా 25 పైబడ్డ పురుషుల విభాగంలో చాలా దగ్గరగా ఉంది.

                      ( ఆగస్ట్ 10తో ముగిసిన వారానికి టామ్ సమాచారం ఆధారంగా )





 15 ఏళ్ళు పైబడ్డ పురుషులు
మార్కెట్ వాటా

25 ఏళ్ళు పైబడ్డ పురుషులు
మార్కెట్ వాటా
1
ఇండియా టీవీ
0.65
1
ఇండియా టీవీ
0.75
2
ఆజ్ తక్
0.64
2
ఆజ్ తక్
0.73
3
ఎబిపి న్యూస్
0.64
3
ఎబిపి న్యూస్
0.68
4
జీ న్యూస్
0.39
4
జీ న్యూస్
0.45
5
ఎబిపి మజా
0.34
5
ఎబిపి మజా
0.39
6
ఎన్టీవీ
0.32
6
ఎన్డీటీవీ ఇండియా
0.34
7
ఎన్డీటీవీ ఇండియా
0.30
7
ఎన్టీవీ
0.33
8
టీవీ 9 కర్నాటక
0.30
8
ఐబిఎన్ 7
0.31
9
ఐబిఎన్ 7
0.26
9
టీవీ9 కర్నాటక
0.28
10
న్యూస్ 24
0.24
10
ఇండియా న్యూస్
0.26
Source: telugutv.info

న్యూస్ చానల్స్ ఉదయం ప్రసారాలకు పెరిగిన ఆదరణ, టాప్ 30 లో కొమ్మినేని ముద్ర

జులై 13తో ముగిసినవారంలో అన్ని తెలుగు న్యూస్ చానల్స్ లో ప్రసారమైన అన్ని కార్యక్రమాలలో టాప్ 30 లో ఎన్టీవీ కార్యక్రమం లైవ్ షో విత్ కె ఎస్ ఆర్ మూడు సార్లు స్థానం సంపాదించుకుంది. గతంలో టీవీ 5 న్యూస్ స్కాన్ కూడా టాప్ 30 లో స్థానం సంపాదించుకున్నప్పటికీ నెంబర్ వన్ కార్యక్రమంగా 1.97 రేటింగ్ సంపాదించుకోవటం కొమ్మినేని కార్యక్రమం ప్రత్యేకతగానే చెప్పాలి.
మొత్తంగా చూస్తే న్యూస్ చానల్స్ లో ఉదయం పూట ప్రసారాలకే ఎక్కువ ఆదరణ ఉంటోంది. హైదరాబాద్ లోనూ ఈ పరిస్థితి ఎక్కువవుతూ వస్తోంది. సాయంత్రం అయ్యేసరికి ఎంటర్టైన్మెంట్ చానల్స్ వైపు మొగ్గు చూపుతున్నవారు ఎక్కువగా ఉండటం వలన కూడా న్యూస్ చానల్స్ కు సాయంత్రం వేళ ఆదరణ  తగ్గిపోతోంది. దాదాపుగా అన్ని న్యూస్ చానల్స్ లోనూ ఇలాంటి పరిస్థితి కనిపిస్తోంది. అయితే, న్యూస్ చానల్స్ లో ప్రసారమయ్యే వినోద కార్యక్రమాలకు మాత్రమే కొద్దిపాటి మినహాయింపు ఉన్నట్టు ఆయా చానల్స్ టాప్ 30 కార్యక్రమాల జాబితాలో గమనించవచ్చు
గతవారం ప్రసారమైన కార్యక్రమాలన్నిటిలో రేటింగ్ పరంగా మొదటి 30 స్థానాలు సంపాదించుకున్న కార్యక్రమాలను పరిశీలిస్తే మొదటిస్థానం ఎన్టీవీ వారి లైవ్ షో విత్ కె ఎస్ ఆర్ కు దక్కింది. మొత్తం 30 స్థానాల్లో టీవీ 9 కు అత్యధికంగా 17 స్థానాలు దక్కాయి. ఆ తరువాత టీవీ 5 కు 6 స్థానాలు,  ఎన్టీవీకి 4 స్థానాలు, ఈటీవీ 2 కు 3 స్థానాలు దక్కాయి. ఎన్టీవీ సంపాదించుకున్న నాలుగు స్థానాల్లో మూడు లైవ్ షో విత్ కె ఎస్ ఆర్ వల్లనే వచ్చాయి.


సంఖ్య
చానల్
తేదీ
వారం
ఆరంభం
ముగింపు
కార్యక్రమం
రేటింగ్
1
ఎన్టీవీ
7/7/2013
ఆది
7:29
8:29
లైవ్ షో విత్ కె ఎస్ ఆర్
1.97
2
టీవీ 9
7/8/2013
సోమ
9:59
10:56
న్యూస్ ఎట్ 10 ఎ ఎం
1.93
3
టీవీ 9
7/12/2013
శుక్ర
6:42
6:56
స్పోర్ట్స్
1.89
4
టీవీ 9
7/10/2013
బుధ
8:29
8:58
ఎంటర్టైన్మెంట్ టునైట్
1.81
5
టీవీ 5 న్యూస్
7/8/2013
సోమ
9:00
9:25
న్యూస్ ఎట్ 9 ఎ ఎం
1.75
6
టీవీ 9
7/11/2013
గురు
9:29
9:53
30 మినిట్స్
1.75
7
టీవీ 5 న్యూస్
7/8/2013
సోమ
9:30
9:52
ఫేవరేట్ 5
1.72
8
టీవీ 9
7/12/2013
శుక్ర
8:01
8:23
మాణింగ్ న్యూస్
1.68
9
ఎన్టీవీ
7/13/2013
శని
7:30
8:32
లైవ్ షో విత్ కె ఎస్ ఆర్
1.67
10
టీవీ 9
7/12/2013
శుక్ర
6:57
7:12
మాణింగ్ న్యూస్
1.65
11
టీవీ 5 న్యూస్
7/9/2013
మంగళ
6:32
6:56
గ్రహశాస్త్రం
1.59
12
టీవీ 9
7/13/2013
శని
7:14
8:00
న్యూస్ వాచ్
1.50
13
టీవీ 9
7/12/2013
శుక్ర
8:28
8:55
ఎంటర్టైన్మెంట్ టునైట్
1.50
14
టీవీ 9
7/10/2013
బుధ
6:57
7:12
మాణింగ్ న్స్
1.48
15
టీవీ 9
7/7/2013
అది
6:51
6:56
స్పోర్ట్స్
1.48
16
టీవీ 5 న్యూస్
7/12/2013
శుక్ర
6:30
6:53
శ్రీరస్తు శుభమస్తు
1.47
17
ఈటీవీ 2
7/12/2013
శుక్ర
8:59
9:29
ఘంటారావం
1.46
18
టీవీ 9
7/11/2013
గురు
8:58
9:25
ప్రాదేశికవార్తలు
1.44
19
టీవీ 9
7/10/2013
బుధ
21:52
21:56
ఋతురాగాలు
1.43
20
ఎన్టీవీ
7/9/2013
మంగళ
7:29
8:27
లైవ్ షో విత్ కె ఎస్ ఆర్
1.40
21
టీవీ 9
7/13/2013
శని
6:44
6:57
స్పోర్ట్స్
1.40
22
ఈటీవీ 2
7/8/2013
సోమ
8:31
9:00
ఈటీవీ వాల్డ్
1.38
23
టీవీ 9
7/8/2013
సోమ
6:58
7:12
మాణింగ్ న్యూస్
1.38
24
టీవీ 9
7/9/2013
మంగళ
17:57
18:28
ప్రాదేశికవార్తలు
1.36
25
టీవీ 9
7/8/2013
సోమ
17:57
18:27
ప్రాదేశికవార్తలు
1.36
26
ఈటీవీ 2
7/8/2013
సోమ
7:30
8:00
ఆంధ్రావని
1.35
27
టీవీ 9
7/13/2013
శని
8:01
8:25
మాణింగ్ న్యూస్
1.34
28
ఎన్టీవీ
7/8/2013
సోమ
8:35
9:01
న్యూస్ ఆన్ లైన్
1.32
29
టీవీ 5 న్యూస్
7/7/2013
అది
9:32
9:53
అక్షయ పాత్ర
1.32
30
టీవీ 5 న్యూస్
7/12/2013
శుక్ర
6:57
7:25
మాణింగ్ న్యూస్
1.31

Source: telugutv.info