Tuesday, February 15, 2011

అమ్మాయలకేం తక్కువ..

నవ్వితే మాధురీ దీక్షిత్.. లెఫ్ట్ తీసుకుంటే - మూన్‌మూన్‌సేన్ - తలతిప్పితే.. సోనాలీ బింద్రే - ఇలా ఎవరో ఒకరు పలు కోణాల్లోంచి కనిపించటంతో - ఆఖరికి ఈ అమ్మాయిని ‘మినీ మాధుర్’గా స్థిరపరిచేశారు. ‘వైఫ్ బినా లైఫ్’లో హోస్ట్‌గా తళుకులీని పలు ప్రశంసల్ని మూటగట్టుకున్న మాధుర్ ‘ఇస్ జంగిల్ సే ముఝే బచావో’ రియాలిటీ షోతో కెరీర్‌ని ఆరంభించింది. ఆనాటి నుంచీ ఈనాటి వరకూ - చక్కటి అందం.. చిరునవ్వుల సోయగం ఉన్నప్పటికీ.. అవకాశాలు వెల్లువల పోటెత్తినప్పటికీ తనకంటూ ఓ ప్రత్యేకతని నిలుపుకునే ప్రయత్నంలో ఉందీమె. అవకాశాల కోసం నటీనటులు వెంపర్లాడుతూంటే - అడపాదడపా నటించటం వెనుక ఉద్దేశం ఏమిటని ప్రశ్నిస్తే- ప్రత్యేకించి ఏమీ లేదు. ఒక రియాలిటీ షో తర్వాత మరొకటి చేయాలన్నదే. ‘ఇస్ జంగిల్..’ తర్వాత ‘ఇండియన్ ఐడల్’ ఆ తర్వాతే ఏదైనా. కాకపోతే - ఛానెళ్లలో బాలీవుడ్ స్టార్ల హడావిడితోనూ.. టాప్ షోలన్నీ వారే నిర్వహించటంతో.. టీవీ నటీనటులకు అవకాశాలు దొరకటం లేదన్న బాధని వ్యక్తం చేస్తోంది.

‘వైఫ్ బినా లైఫ్’ షోలో పది మంది మగానుభావులు.. పిల్లల సంరక్షణ - ఇంటి పర్యవేక్షణ ఇత్యాది బాధ్యతలను ‘వైఫ్’లు లేకుండా చక్కటి ‘నైఫ్’తో నెగ్గుకొస్తున్నారా? అన్న ప్రశ్నకు - ఈ షోలో బోలెడంత డ్రామా, హ్యూమర్, ఎమోషన్స్. పెళ్లాం లేందే భర్తల బతుకు ఎంత దుర్భరంగానూ కష్టసాధ్యంగానూ.. తికమకగానూ ఉంటుందో ఇదొక చిన్న పరీక్ష మాత్రమే. ఏళ్ల తరబడి తల్లిగానీ.. పెళ్లాంగానీ ఇంట్లో వంట చేసి పెడుతూంటే - ఉప్పు ఎక్కడుందో? పప్పు ఎక్కడుందో తెలీక సందిగ్ధావస్థలో కొట్టుమిట్టాడే భర్తల వింతైన లోకం ఇది. అదే నిజ జీవితంలో కొనసాగితే పరిస్థితి ఎలా ఉంటుందోనని.. అప్పుడే ఆలోచనలో పడ్డారంటూ చెప్పుకొచ్చింది భర్తల అవస్థల గురించి. పైగా అమ్మాయలు ఎందులోనూ తీసిపోరంటూ సవాల్ విసురుతోంది.

Source: www.andhrabhoomi.net

No comments:

Post a Comment