Monday, May 23, 2011
ఎస్వీ భక్తి ఛానల్ నిధుల దుర్వినియోగం
తిరుమల తిరుపతి దేవస్థానముల (టిటిడి) ఆధ్వర్యంలో నడుస్తున్న శ్రీ వేంకటేశ్వర భక్తి ఛానల్‌లో(ఎస్వీబీసీ) అవకతవకలపై కేంద్ర దర్యాప్తు సంస్ధతో (సిబిఐ) విచారణకు ఆదేశించాల్సిందిగా శ్రీవైష్ణవ బ్రాహ్మణ సమాజ సంఘ సేవా సమితి రాష్ట్ర ప్రభుత్వాన్ని పట్టుబట్టింది.
సమితి రాష్ట్ర అధ్యక్షుడు కె.గోపాలాచార్యులు గురువారమిక్కడి విలేకరులతో మాట్లాడుతూ వేంకటేశ్వర స్వామి కార్యక్రమాల రూపకల్పనలో నిధుల దుర్వినియోగం జరుగుతోందని ఆరోపించారు. ""ఛానల్‌కు కార్యక్రమాలు రూపొందిస్తున్నామనే ముసుగులో కొందరు అగ్ర నిర్మాతలు వారికి చెందిన ప్రెవై[ట్ స్టూడియోల్లో చిత్రీకరణకు అనుమతిస్తూ పెద్ద మొత్తాల్లో బిల్లులు సమర్పిస్తున్నారు. కార్యక్రమాల చిత్రీకరణకు ఇప్పటి దాకా సరిగ్గా ఉపయోగపడని ఒక ప్రెవై[ట్ స్టూడియోకు సైతం ఛానల్ నెలకు రూ.మూడు లక్షలు చెల్లిస్తోంది'' అని ఆయన ఆరోపించారు.
ప్రధాన కార్యాలయాన్ని హైదరాబాద్ నుంచి తిరుపతికి తరలించేందుకు కొందరు అధికారులు ప్రయత్నిస్తున్నారని గోపాలాచార్యులు పేర్కొన్నారు.
"అర్చన' సీరియల్ రూపకల్పన కోసం ఎస్వీబీసీ ఛానల్ అలిపిరి గేట్ దగ్గర రూ.రెండు కోట్ల విలువైన షూటింగ్ సెట్‌ను నిర్మించింది. కానీ పెదజీయర్ స్వామీ అభ్యంతరం చెప్పటంతో ఆ సీరియల్ ఛానల్‌లో ప్రసారం కాలేదు. స్వామీ అభ్యంతరాన్ని అనుసరించి "అర్చన' సీరియల్ ఒక ప్రైవేట్ ఛానల్‌లో ప్రసారమవుతోందని ఆయన ఆరోపించారు.
ఛానల్‌లో జరుగుతున్న అవకతవకలపై త్వరలో ముఖ్యమంత్రి నల్లారి కిరణ్ కుమార్‌రెడ్డికి తాము ఒక వినతి పత్రం సమర్పిస్తామని గోపాలాచార్యులు తెలిపారు. ఛానల్ వ్యవహారంపై హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం దాఖలు చేస్తామని ఆయన చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ఒక వారం రోజుల్లోగా తమ డిమాండ్లను పరిష్కరించని పక్షంలో తిరుపతి వద్ద ఆమరణ దీక్ష ప్రారంభిస్తానని గోపాలాచార్యులు బెదిరించారు.
Source: www.apweekly.com
Labels:
Telugu
Friday, May 20, 2011
Nagam To Launch A News Channel?
Senior Telugu Desam Party leader Nagam Janardhan Reddy, who has been at loggerheads with the party leadership on Telangana issue, is said to be toying with the idea of launching a news channel.
The rebel Telangana leader is understood to be keen on taking “Raj TV” on lease and convert it into a full-fledged channel for promoting Telangana statehood cause.
Earlier, the Telangana Rashtra Samithi had an arrangement with Raj TV before starting its own channel “T News” which has gained popularity within a short span of time. The Telangana channel has registered significant growth compared to its competitors in the market and garnered a significant TRP rating.
With leading politicians owning news channels and using them as platforms for promoting their image, Nagam, who has been projecting himself as the sole champion of Telangana cause in the TDP, is keen to join the bandwagon.
Sources say that he has made preliminary inquiries with Raj TV regarding the lease charges and also the cost of running a news channel. Already, the YSR Congress Party President Y S Jagan Mohan Reddy owns “Sakshi” channel while TDP President N Chandrababu Naidu’s son Nara Lokesh runs “Studio N” channel.
There is also a speculation in political circles that Nagam may walk out of the TDP and float his own party to carry forward the Telangana agitation. He has openly defied the party leadership and organized “Telangana Nagaara” in his home town Nagarkurnool in Mahaboobnagar district recently without displaying the TDP’s flag.
Source: www.greatandhra.com
Labels:
English
Thursday, May 19, 2011
రొటీన్ కాన్సెప్ట్
రియాలిటీ షోల హవా చిన్న తెరకు ప్రధాన ముడి సరుకైన సీరియల్స్‌ని పక్కకు పెట్టేస్తుందేమోనన్న ఆలోచన వస్తున్న సమయంలో కొత్త సీరియల్స్ ప్రారంభించడంతో జీ తెలుగు ఛానెల్ మళ్లీ ఆ దిశగా వీక్షకుణ్ణి ఆసక్తిగా చూసేలా చేసింది. ఆ క్రమంలో జీ తెలుగు టీవీలో మే 9 నుంచి రాత్రి 9 గంటలకు ‘కన్యాదానం’ ధారావాహిక ప్రారంభమైంది.
అలవాటైన పంథా
పెళ్లికెదిగిన అమ్మాయిలు, పెళ్లి చేయడానికి వారి తల్లిదండ్రులు పడే తపన, కట్నాలు రాబట్టుకోవాలని అబ్బాయిల తరఫు వారు చూపించే ఆత్రం.. మొదలైన వాటిలో ఎన్ని చెప్పుకున్నా ఇంకా కొన్ని మిగిలిపోతూనే ఉంటాయి. ఆ కోణం ఆసరా చేసుకుని తయారైన కథగా తొలి భాగాల్లో కన్యాదానం కన్పడింది. దీనికి తోడు పెళ్లి కావలసిన అమ్మాయి ‘రంగు’ తక్కువ అంశం కూడా ప్రధానంగా ఉంది ఇందులో. పెళ్లి కావల్సిన అమ్మాయి అర్చన నల్లగా ఉంటుంది. ఆ కారణంగా ఆమెకు వచ్చిన సంబంధాలన్నీ తప్పిపోతుంటాయి. ఆమె తల్లిదండ్రులు జమీందారు వంశీకులైనా ఆస్తి కోర్టు తగాదాల్లో ఉండటంతో ఆర్థిక ఇబ్బందులు పడుతుంటారు. అయినా డాంబికానికి లోటు లేకుండా అందిన చోట్లంతా అప్పులు చేస్తూ పైకి పరువు నిలుపుకుంటూంటారు. రంగు తక్కువైనా పెళ్లికి ఓకే అంటూ అందుకు ప్రతిగా భారీ మొత్తం కట్నంగా అడుగుతుంది అబ్బాయి తల్లి. ఆ డబ్బు సర్దుబాటు చేయలేక సతమతమవుతూంటే, ఈ పెళ్లి కుదిర్చిన పెళ్లిళ్ల పేరమ్మ రమాదేవి, మీ అబ్బాయికి పెళ్లి చేసి ఆ కట్నంలో అమ్మాయి పెళ్లి చేసేయండని సమయోచిత సలహా వదిలేస్తుంది. అది తప్ప మరో దారిలేక ఆ పనికీ ఉపక్రమిస్తారు అమ్మాయి కుటుంబం వారు. అయితే ఇక్కడో మెలికుంది. నల్లగా వుండే అర్చన, వాళ్లన్నయ్య కూడా వేర్వేరుగా ప్రేమలో పడతారు. కానీ ఈ సంగతి అప్పుడున్న పరిస్థితుల దృష్ట్యా వెల్లడి చేయలేక పోతారు. ఇప్పటివరకూ స్థూలంగా జరిగిన కథ ఇది.
కాలదోషం పట్టిన కాన్సెప్ట్..
అసలు ఈ ధారావాహికకెన్నుకున్న మూల బిందువే అంతగా అందరూ ఒప్పుకునేది కాదు. ‘నలుపు కన్నయ్యకు అందం - నాకు శాపమా?’ అన్నది అప్పుడెప్పుడో అరవై దశకాల్లో ‘నాదీ ఆడజన్మ’ చిత్రం నాటి సంగతి. అప్పుడే నలుపులో ఉన్న నాణ్యతను ఫోకస్ చేస్తూ చెప్పుకొచ్చేవారు. రానురాను అసలు నలుపుపై చిన్న చూపు ఉండటం లేదు కూడా. పైగా ‘బ్లాక్ బ్యూటీ’ అంటూ మంచి విశేషణాలు కూడా జోడించే ఆరాధనా భావం కూడా పెరిగింది. మరి ఇలాంటి సందర్భాలలో ‘నలుపు’ పెద్ద అవరోధంగా కథాక్రమం సాగడం అసమంజసంగా ఉంది. ఇంక అర్చన - మురళి మధ్య అనురాగం పెరుగుతూంటే దాన్ని వ్యక్తపరచుకోడానికి పడిన సంకోచంలోనూ సమంజసత కన్పడలేదు. అలాగే రాజా (అర్చన సోదరుడు) మరొక అమ్మాయిని ప్రేమిస్తున్నట్లు వెల్లడి చేయకపోవడానికి కనపర్చిన కారణం (కట్నం రాకపోతే తన చెల్లెలి పెళ్లి కాదు) కొనసాగింపునకూ కేవలం కథలో పెట్టుకున్న ట్విస్టే మూలం అనుకోవాలి తప్ప మరే సమర్థనీయ కారణమూ కన్పడటం లేదు. అన్నిటికన్నా విచిత్రమేమిటంటే ‘ఇదిలా సరికాదు’ అని మనమిప్పుడేవైతే చెప్పుకున్నామో అని అన్నీ ఆయా పాత్రధారుల పక్క పాత్రల ద్వారా చెప్పించడం జరిగినా రైట్ ట్రాక్‌లోకి కథ రానివ్వలేదు. అలా వస్తే కథ నడవడం ఎలా అంటారా? అది వేరే సంగతి. అదే విధంగా లేని జమీందారీతనం కోసం లేనిపోని గొప్పలు పోవడం, అందుకుగానూ తలకు మించిన అప్పులు చేయడమూ లాంటివి కూడా ఇప్పటి కాలంలో అంతగా పొసగని సంగతులు.
మరీ అంత దట్టింపు అవసరమా?
ఇందులో సంభాషణా రచయిత చాలా పెద్ద పాత్ర వహించారు. చాలా చోట్ల సందేశాత్మక సంభాషణలూ, ఉదాహరణ పూర్వక మాటలూ దట్టిం చేశారు. ‘వంద అబద్ధాలు చెప్పైనా పెళ్లి చేయమనడం అప్పటి ట్రెండు. వంద నిజాలు చెప్పి ఒప్పించి పెళ్లి చేయడం ఇప్పటి ట్రెండు’. ‘ఆడపిల్ల ఎంత అందం తక్కువగా ఉంటే అంత ఎక్కువ కట్నం పిండచ్చు’ ‘నిన్ను మర్చిపోవడమంటే, నన్ను నేను మర్చిపోవడమే’ ‘ఆ పాట అలసిపోయిన గుండెలను నిద్రపుచ్చేదిలా ఉంటుంది’ ‘మనసులోని ప్రేమ దాచుకుని జీవితాన్ని నాశనం చేసుకునే వాళ్లంటే నాకిష్టం లేదు..’ ఇంత స్థాయి దట్టింపులు అవసరం లేదు. ఇవే భావాలు చిన్నచిన్న మాటలతో పలికించవచ్చు. కొన్నిచోట్ల ఉపయోగించిన (మనుషులకి తప్ప మనసులకి పేదా గొప్పా తేడా తెలియదేమో! ‘మనిషిలో నిరాశ పెరిగినప్పుడు ప్రతి చిన్న విషయం సమస్యగానే ఉంటుంది’ లాంటివి) వాక్యాలు అర్థవంతంగా, సన్నివేశానికి పుష్టినిచ్చేవిగానూ ఉన్నాయి. బంగారానికీ, రాగికీ తేడా తెలుపుతూ రమాదేవితో పలికించిన పదాలూ బాగున్నాయి. అన్ని సీరియల్స్‌లోలా ఇందులో టైటిల్ సాంగ్ అంటూ పెట్టక, మధ్యలో మురళి (సీరియల్‌లో గాయకుని పాత్ర - అర్చన ప్రేమికుడు) పాత్రపై తన ప్రేమను వ్యక్తపరుస్తూ ‘ఓ ప్రియతమా..’ అంటూ పాట పెట్టడం, అది కూడా పెద్ద ఇబ్బందేమీ పెట్టనిదిగా ఉండటం అభినందనీయం.
మేకప్స్‌లో శ్రద్ధ వహించాలి..
మేకప్‌ని ఎంత తక్కువగా చేస్తే అంత సహజంగా ఉంటుంది. దాన్ని లైటింగ్ పరంగా, ఇతరేతర విధానాల ద్వారా సహజంగా చెయ్యచ్చు. కానీ ఇందులో పద్మజా రాణి కారీతి దట్టమైన మేకప్పు అవసరం లేదనిపించింది. .కనీసం రమాదేవి పాత్రకు వేసిన పెదాల రంగు విషయంలోనూ నిర్లక్ష్యం వహించడం వల్ల అది తెరపై వీక్షకులు చూడడానికి ఇబ్బంది పెట్టేసింది.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
Wednesday, May 18, 2011
Zee Telugu celebrates 6th anniversary
As the caption suggests 'Sarikotta Velugu', a Telugu phrase that conveys the meaning 'New Light'. Zee Telugu has always stood by it. Zee Telugu, the channel created with a vision to provide wholesome entertainment to the entire family, has become a very popular channel amongst all age groups today. The programs range from fiction, devotional, music, dance, comedy, to reality shows and blockbuster movies.
Zee Telugu is the first southern regional channel from Zee bouquet. In just few years of its inception it soared high on popularity charts by breaking the barriers of a stereo typical Fiction Television. It gave a new path with its creative ideas, constant innovation and a feel for popular taste thereby bringing radical changes in viewership patterns. Zee Telugu has been a head turner by bringing in innovative ideas and concepts like 'Reality' in regional entertainment. Being a strong contender for No.2 in Telugu GEC, Zee Telugu is striving to consolidate its position. There are over 15 million patrons to Zee Telugu across the globe.
This glorious journey has some beautiful and cherishable moments with shows like Sa Re Ga Ma Pa - a singing sensation, Aata - the ultimate dance show are exceptional properties, which broke the records with five back to back seasons. Loved by all and enjoyed by many has made these programs the channel driver for Zee Telugu. These shows have showcased the immense talent hidden in aspiring and upcoming singers and dancers from the state of Andhra Pradesh, who have now become youth icons in the industry.
Besides, catering to all cross sections of society today Zee Telugu has successfully completed above 2000 episodes in its shows like Mee Inti Vanta and Bhakti Samacharam which have been leading in its respective genres.
The channel has also done exceptionally good by bringing in a change with shows like Ayurvedam, Gopuram and a funfilled ladies entertaining game show Gadasai Atta Sogasari Kodalu that has made women all over Andhra Pradesh play, enjoy, and laugh.
With the stupendous success in the non - fiction segment, Zee Telugu has expanded its feature programming lineup into fiction segment with interesting Soaps and Serials. Serials like Chinna Kodalu and Muddubidda have been the milestone lunches as a step forward to strengthen our fiction bands. Post which, came-in serials like Pasupu Kumkuma, Radha Kalyanam with new look and feel that have strengthened the fiction band and have been giving good competition to other shows in the same band.
Our recent launches Kanyadanam and Kalavari Kodalu have been the prime talk of the town.
Zee Telugu's fiction has stood by the concept of family entertainment, with the right balance of emotion, comedy and drama that makes it a wholesome entertainment.
Zee Telugu reserves the right to entertain its audience with many good and well-presented blockbuster movies. Keeping up the glory of blockbuster films this year we have been able to bank in films like Mirapakaya, Alamodaliyindi, Nagavalli by adding this to the existing bank of a great range of Telugu films, especially blockbusters, from recent successes to all-time hits. All in all, Zee Telugu has become a wholesome entertainment package for its viewers.
Today we take the pride of putting forward the journey of our six years and dedicate it to all our viewers who have played a vital role in this successful journey.
Source: www.afaqs.com
Labels:
English
Tuesday, May 17, 2011
మెగా డికేడ్ టీవీ అవార్డుల ప్రదానం 18న
బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌గా ‘ఈటీవీ’
2001 నుంచి పదేళ్ల కాలానికి మెగా డికేడ్ టీవీ అవార్డులను మెగా సిటీ నవకళావేదిక 14వ వార్షికోత్సవం సందర్భంగా ప్రదానం చేయనుంది. అవార్డుల ప్రదానోత్సవాన్ని మే 18న సాయంత్రం త్యాగరాయ గానసభ సదనంలో జరుపుతున్నట్లు అవార్డుల కమిటీ అధ్యక్షుడు డా.వడ్డేపల్లి కృష్ణ, నిర్వాహణ సంస్థ అధ్యక్షుడు కె.మల్లికార్జునరావు సోమవారం త్యాగరాయ గానసభ భవనంలో విలేకరులకు తెలిపారు. మెగా డికేడ్ టీవీ అవార్డుకు బెస్ట్ ఫ్యామిలీ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్‌గా ఈ-టీవీ, బెస్ట్ న్యూస్ ఛానల్‌గా ఎన్ టీవీలను ఎంపిక చేసినట్లు వారు వివరించారు. ఉత్తమ నిర్మాతగా నాగబాల సురేష్‌కుమార్, దర్శకుడిగా శ్రీధర్, నటుడుగా ప్రభాకర్, నటిగా ప్రీతి నిగమ్, క్యారెక్టర్ యాక్టర్‌గా జీవీ నారాయణరావు, క్యారెక్టర్ యాక్ట్రెస్‌గా సనా, హాస్యనటుడుగా అశోక్‌కుమార్, హాస్యనటిగా రాగిణి ఎంపికయ్యారని వెల్లడించారు. సాయికుమార్ ఉత్తమ యాంకర్, స్వప్న ఫిమేల్ న్యూస్‌రీడర్, బద్రి మేల్ న్యూస్‌రీడర్, నేతాజీ న్యూస్ కో-ఆర్డీనేటర్, ఎ.శ్రీనివాస్ కథా రచయిత, నాగరాజు సంగీత దర్శకుడు, నిత్యసంతోషిని గాయని, బంటి గాయకుడుగా అవార్డులు అందుకుంటారన్నారు. ముఖ్య అతిథిగా స్త్రీ శిషు సంక్షేమ శాఖామంత్రి సునీతాలక్ష్మారెడ్డి, సభాధ్యక్షుడుగా సమాచార శాఖ కమిషనర్ పార్థసారధి హాజరవుతారన్నారు. మొదట మువ్వ ఆంధ్ర నాట్యం ప్రదర్శిస్తారన్నారు. గానసభ అధ్యక్షుడు కళాదీక్షితులు, నిర్వాహణ సంస్థ ప్రధాన కార్యదర్శి కె.రాఘవేంద్ర విలేకరుల సమావేశంలో పాల్గొన్నారు.
Source: www.vasantam.net
Labels:
Telugu
వీక్షకుల తీర్పు
ఏ ఛానెల్ చూసినా డాన్స్‌కు సంబంధించిన కార్యక్రమాలతో బిజీగా ఉంటున్నాయి. కొన్నింటిలో మరీ విపరీతమైన కొనసాగింపు. ‘ఢీ’తో మొదలైన కార్యక్రమం ‘ఢీ2’ నుండి ‘ఢీ4’ వరకూ కొనసాగుతూ ఉంది. మరి చివరి నెంబర్ ఎంతో తెలీదు. ఇక ఒక ఛానెల్‌లో నిర్వహించే ఇలాంటి కార్యక్రమం నిర్వహించరాదని, అది చిన్నపిల్లల మానసిక ఆనందానికి ఇబ్బంది కలిగిస్తున్నదని, వారి హక్కుల పరిరక్షణకు భంగకరమని.. ఇంకొన్ని కారణాల మూలంగా కొద్ది రోజులపాటు ఆ కార్యక్రమం నిర్వహించరాదని మానవ హక్కుల సంఘం వారి నుంచి తాఖీదులు కూడా అందాయి. కాని తరువాతి పరిణామాల వల్ల సదరు కార్యక్రమం ఈ రోజు వరకూ కొనసాగుతూనే ఉంది. ఒక ఛానెల్‌లో మొదలైన ఇలాంటి కార్యక్రమం అంటుజాఢ్యంలా ప్రతి ఛానెల్‌కూ వ్యాపించింది. కొన్నింటిలోనయితే జుగుప్సాకరంగా డాన్స్‌లు చేయడం కూడా జరుగుతోంది.
వీటికి భిన్నంగా ప్రతి ఆదివారం ఉదయం ప్రసారమవుతోన్న ‘భగవద్గీత’ శ్లోకాల పోటీ కార్యక్రమంలో న్యాయనిర్ణేత, పార్టిసిపెంట్స్, యాంకర్స్ కూడా సంప్రదాయబద్ధమైన దుస్తులు ధరించి ఉంటారు. కార్యక్రమంలో పాల్గొనే ప్రతి చిన్నారి వారి స్తోమతకు తగ్గట్టుగా పట్టు పరికిణీలు లేదా మిగతా సంప్రదాయబద్ధమైన వస్త్రాలు ధరించి ఉంటారు. న్యాయనిర్ణేత వచ్చిన ప్రతి చిన్నారినీ ఫలానా శ్లోకం చెప్పమని అడగటమూ, చెప్పిన తరువాత సదరు శ్లోకానికి అర్థం అడగటం లాంటివన్నీ చూస్తూంటే ఆ పిల్లలకూ న్యాయనిర్ణేతకు శ్లోకాలపై, భగవద్గీతపై గల పట్టును సూచిస్తుంది. యాంకర్ కూడా ఇందులో భాగం వహించడంతో కార్యక్రమానికి మరింత శోభ వచ్చినట్లుగా కనిపిస్తుంది. పైన అనుకున్న ఏ డాన్స్ కార్యక్రమాన్ని చూసినా న్యాయనిర్ణేత, పార్టిసిపెంట్స్, యాంకర్స్‌తో మొదలుకొని అందరూ ఆనందాన్ని వ్యక్తం చేసే ఉద్దేశంతో విజిల్స్ (ఆడ మగ తేడాల్లేకుండా) వేదిక మీద వేయడం, మార్కులు చెప్పమంటే ‘నీ పాట అదుర్స్’ అంటూ తెలుగులో లేని పదాలను వాడి భాషను ఖూనీ చేయడం లేదా చేత్తో పేపర్‌ని పట్టుకుని చించివేయడం లాంటివి చేస్తూ కనిపిస్తారు. కాని ఇక్కడ అలాంటివేవీ కనిపించవు. వినిపించవు. ప్రతి మాటలోనూ సభ్యత, సంస్కారమూ కనిపిస్తాయి. ఈ రోజున ఏ పిల్లాడికీ, తెలుగులో సక్రమంగా (ఆంగ్ల పదాన్ని వాడకుండా) పది నిమిషాలు కూడా మాట్లాడలేని స్థితిలో ఉండి ఇంటి ముందరకు వచ్చిన బిచ్చగాడితో (అడుక్కునే అంకుల్ వచ్చాడని ఇంటిలోని వారికి చెప్పడం) మొదలుకొని ప్రతి వాడినీ అంకుల్ అని పిలవడంతో మొదలయ్యే దనచర్యలో ఎక్కడా కూడా శ్లోకాలు, పద్యాలు లాంటివి కనిపించవు. వినిపించవు. మరి ఈ కార్యక్రమంలో పాల్గొనే నిమిత్తం వారు ఏకంగా శ్లోకం, దాని అర్థం కూడా చెప్పగలిగేలా వారడిగిన మరో శ్లోకాన్ని చెప్పగలిగేలా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. భవిష్యత్తులో వాటిని కొనసాగించేలా తల్లిదండ్రులు చర్యలు తీసుకుంటే మంచిది.
ఇక దూరదర్శన్‌లో ప్రసారమవుతున్న ‘అమ్మ’ కార్యక్రమంలో తల్లిని గురించి కొంతమంది పంపే కవితలను చదివి వాటిని విశ్లేస్తుంటారు. ఈ రోజున తల్లిదండ్రులను గౌరవించాలన్న స్పృహే లేకుండా, ప్రేమ పేరుతో తల్లిదండ్రుల మనసులను బాధలకు గురిచేస్తూ ఉంటూ ఆ విధమైన శాడిజానికి మోడల్‌గా ఉంటున్న ఈ రోజుల్లో తల్లిని గురించి కవితలు చెప్పడం, రాయడం, తల్లికి ఒక గొప్ప గౌరవం.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
ఆరు వసంతాల జీ తెలుగు సంబరాలు
జీ తెలుగు నేటికి ఆరు వసంతాలు పూర్తి చేసుకుని తెలుగులో ప్రధాన వినోదభరిత ఛానెల్‌గా నిలిచింది. ఎంటర్‌టైన్‌మెంట్, న్యూస్, మ్యూజిక్, మూవీస్ ఇలా అన్ని విభాగాల్లో ఛానెల్స్‌ని నిర్వహిస్తూ వినోదమే ఊపిరిగా, వైవిధ్యమే ఆయువుగా జీ తెలుగు కొనసాగుతోంది. ప్రతిభా అన్వేషణలో భాగంగా సింగింగ్ టాలెంట్ షోస్‌కి కొత్తదనాన్ని జోడించి జీ తెలుగు ఆవిష్కరించిన సరాగాల స్వరఝరి ‘సరిగమప’.. డాన్స్ అంటే ఆట, ఆట అంటే డాన్స్ అన్న రీతిలో ‘ఆట’ ది అల్టిమేట్ డాన్స్ షో.. తెలుగులో ప్రారంభమైన తొలి కుకరీ షో ‘మీ ఇంటి వంట’ ఇప్పటికి 2000 పైగా ఎపిసోడ్స్‌ని పూర్తి చేసుకుని మున్ముందుకు సాగుతోంది. ప్రేక్షకులకు ఆధ్యాత్మిక భావాన్ని అందించాలన్న ఆలోచనతో పుట్టిన ‘భక్తి సమాచారం’... సామాజిక బాధ్యతతో నిర్వహిస్తున్న ‘బతుకు జట్కా బండి’ కార్యక్రమం ఇప్పటికి దాదాపు వంద కుటుంబాలను కలిపింది. జీ తెలుగు అందిస్తున్న ఆయుర్వేద జీవన విజ్ఞానం, గోపురం, గడసరి అత్త - సొగసరి కోడలు కార్యక్రమాలు మహిళా ప్రేక్షకుల మన్ననలతో సాగుతున్నాయి. ఇక సీరియళ్ల సంగతి చెప్పనే అక్కర్లేదు. రాధికా మాధవుల ప్రణయగాథ ‘చిన్నకోడలు’.. చిట్టితల్లి సావిత్రి హృదయ వేదన ‘పసుపు కుంకుమ’.. చిన్నారి రాధతో విధి చెలగాటం ‘రాధా కల్యాణం’... - ఇలా ఎన్నో సీరియళ్లతోనూ కార్యక్రమాలతోనూ ఆరు వసంతాలు పూర్తి చేసుకుని ఏడవ వసంతంలోకి అడుగు పెట్టబోతోంది జీ తెలుగు.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
Wednesday, May 11, 2011
T ఛానల్ TRSదా? తెలంగాణదా?
తెలంగాణ కోసమే పుట్టిందని పదే పదే చెప్పుకుంటున్న టీ ఛానల్ లో తెలంగాణ అంటే కేసీఆర్ తప్పించి మిగిలిన తెలంగాణ వాదులు కానీ.. నాయకులు కానీ పెద్దగా కనిపించరు.. అక్కడ కేసీఆర్ కుటుంబ రాజ్యం నడుస్తుందనేది బహిరంగ సత్యం. తెలంగాణ ఉద్యమం ఎవరు చేసినా.. ఎక్కడ చేసినా దానిని ప్రత్యేకంగా కవర్ చేయాల్సిన బాధ్యత టీ ఛానల్ పై ఉంది. ఎందుకంటే అది తెలంగాణ వాదుల అందించే పైసల మీద నడుస్తుంది కాబట్టి.. కానీ నాగం జనార్థన్ రెడ్డి పాలమూరు జిల్లాలో భారీ ఎత్తున నగరా నిర్వహిస్తే… దానిని లైవ్ కవరేజ్ మాత్రం టీ ఛానల్ లో కనిపించదు.. అందులో కనిపించేది..చంద్రబాబుకు వ్యతిరేకంగా వచ్చేది మాత్రమే..లేదంటే తెలుగుదేశం పార్టీని చీల్చడానికో.. టీఆర్ ఎస్ పార్టీని పొగడానికో తప్పించి..తెలంగాణ కోసం మాత్రం కాదనేది నాగం నగరా సమయంలో టీ ఛానల్ వ్యవహరించిన తీరే అద్దం పడుతుంది. తెలంగాణ ప్రతినిధుల సభను గొప్పగా లైవ్ చేసిన టీ ఛానల్… అదే జిల్లాలో నాగం పెద్ద ఎత్తున తెలంగాణ నగరా మోగిస్తుంటే.. అది టీ ఛానల్ చెవికెక్కలేదు. నాగం మాట్లాడిన దానిలో తెలుగుదేశం ఎమ్మేల్యేలను చీల్చడానికో… తెలుగుదేశాన్ని చిత్తు చేయడానికో పనికొచ్చే వాటిని కట్ చేసుకుని ప్రసారం చేసుకున్న ఆ ఛానల్.. నాగం తెలంగాణ పోరాటాన్ని ఎందుకు లైవ్ చేయలేదు. తెలంగాణ కోసమే పుట్టామని చెబుతున్న ఈ ఛానల్ టీఆర్ ఎస్ స్వప్రయోజనాల కోసమే పుట్టిందనేది ఈ సంఘటన ద్వారా స్పష్టమవుతోంది. చంద్రబాబును ఎదిరించి.. తెలంగాణ కోసం తెలుగుదేశంలో తిరుగుబాటు జెండా ఎగురవేస్తున్న నాగం ఎందుకు టీ ఛానల్ కు కనిపించలేదు. బాబు తెలంగాణ పై కక్కలేక .. మింగలేక పరిస్థితులను కల్పిస్తూ.. బాబును ముప్పుతిప్పలు పెడుతున్న..నాగం జనార్థన్ రెడ్డిని టీ ఛానల్ ఎందుకు సపోర్ట్ చేయడం లేదు. ఎవరు ఎన్ని ఛానళ్లైనా పెట్టుకోవచ్చు.. కానీ తప్పులేదు.. పార్టీలు ఎన్నైనా పెట్టుకోవచ్చు.. తప్పులేదు.. కానీ తెలంగాణ నినాదం మారు మ్రోగేలా చేయాల్సిన బాధ్యత టీఆర్ ఎస్ పై ఉంది. ఎందుకంటే ఆ పార్టీ కట్టుకున్న ఇంద్ర భవనం.. అందులో పెట్టుకున్న ఛానల్.. అన్నీ.. తెలంగాణ వాదులు తమ సొంత జేబుల్లో నుంచి ఇచ్చిన పైసల్లోవే కానీ.. సొంత డబ్బులు కావన్న విషయం టీఆర్ ఎస్ అధినేత మరిచిపోతున్నారు. జిట్టా బాలక్రిష్ణా రెడ్డి, గద్దర్ లాంటి వాళ్లు తెలంగాణ పై గర్జించిన సందర్భాలెన్నో.. వారు ఎన్ని సభలు.. ధూం..ధాంలు పెట్టినా టీ ఛానల్ లో ఇచ్చే ప్రాముఖ్యం తక్కువ.. ఎందుకంటే అక్కడ టీఆర్ ఎస్ జెండా లేదు కాబట్టి.. అయినా టీ ఛానల్ తెలంగాణ కోసమే పని చేస్తుందా..? టీఆర్ ఎస్ కోసమే పని చేస్తుందా..? లేదంటే కేవలం కేసీఆర్ కుటుంబం కోసమే పని చేస్తుందా అనేది కూడా స్పష్టం కావాలి. ఎందుకంటే ఇఫ్పుడు అక్కడంతా కుటుంబ స్వామ్యమే నడుస్తోందనేది బహిరంగ సత్యం. టీ ఛానల్ ను కేసీఆర్ కొడుకు రామరావు పర్యవేక్షిస్తున్నారు..కాబట్టే ఆయన కేవలం తన కుటుంబాన్ని హైలెట్ చేసుకుంటారు.. తప్పించి… మిగిలిన నాయకులను పట్టించుకోరు. వారికి కేసీఆర్ చేసే ఉద్యమమే కనిపిస్తుంది తప్పించి.. తెలంగాణ వాదులు.. నాయకులు చేసే ఉద్యమాలు.. త్యాగాలు కనిపించవు.. వారికి కావాల్సిందల్లా.. సొంత పార్టీకి ఓ గొట్టం మైకు.. అదే టీ ఛానల్.. మీరు కాదంటారా..?
Source: telugushakthi.com
Labels:
Telugu
Subscribe to:
Posts (Atom)









