Friday, December 17, 2010

జి శాట్‌ 5 పి ప్రయోగానికి సర్వం సిద్ధం !

సూళ్ళూరుపేట (వి.వి.) : సమాచార, సాంకేతిక రంగ సేవల బలోపేతానికి ఈ నెల 20వ తేదీ సాయంకాలం 4గంటల సమయంలో శ్రీహరికోటలోని రెండవ లాంచ్‌ప్యాడ్‌ నుంచి జి.ఎస్‌.ఎల్‌.వి-ఎఫ్‌06 (జియో సింక్రనస్‌ శాటిలైట్‌ లాంచ్‌ వెహికల్‌) వాహక నౌకద్వారా నింగిలోకి పంపనున్న జిశాట్‌ 5పి ప్రయోగానికి సర్వం సిద్ధమైంది. ఈ ప్రయోగం విజయవంతమైతే తలపెట్టిన లక్ష్యం నెరవేరడంతోపాటు గత ఏడాది పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో పరీక్షించి కీలక క్రయోదశలో విఫలం చెందడంతో నిరాశ చెందిన శాస్త్రవేత్తల్లో ఆత్మస్థైర్యాన్ని నింపడానికి ఈ ప్రయోగ విజయం చక్కని వేదిక కానుంది.

ఈనెల12వ తేదీన శాటిలైట్‌ను రాకెట్‌కు అనుసంధానించి తదుపరి కార్యక్రమాలను అహర్నిశలూ శ్రమిస్తూ శరవేగంగా పూర్తిచేస్తున్నారు. 2310 కిలోల బరువు కలిగిన ఉపగ్రహాన్ని 420 టన్నుల బరువు కలిగిన రాకెట్‌ ద్వారా నింగిలోకి పంపబడే జిశాట్‌ 5పి భూ ఉపరితలంనుంచి అత్యల్పంగా175 కి.మీ, అత్యధిక దూరం 35,975 కి.మీ.ల కక్ష్యలో భూమధ్య రేఖకు 19.3 డిగ్రీల వాలులో విస్తరించిన భూస్థిర మధ్యంతర కక్ష్య (జియో ట్రాన్స్‌ఫర్‌ ఆర్బిట్‌ - జి.టి.ఒ)కు చేరుతుంది.అనంతరం దశలవారీగా రాకెట్‌ను నియంత్రిస్తూ ఉపగ్రహాన్ని షుమారు 36,000 కి.మీ. ఎత్తులో 55 డిగ్రీల తూర్పు రేఖాంశం వద్ద వృత్తాకార భూస్థిర కక్ష్యలోకి చేరుస్తారు. సాంకేతిక పరిజ్ఞానం విరివిగా పెరిగిన ప్రస్తుత పరిస్థితుల్లో సరిపడినన్ని ట్రాన్స్‌పాండర్లు అందుబాటులోలేవు.అందువల్ల ఇప్పటికే పలు టీవీ చానళ్ళ కార్యక్రమాలకు అంతరాయాలు కలిగిన విషయం తెలిసిందే. భవిష్యత్‌లో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా మరిన్ని కొత్తసేవలు అందుబాటులోకి తెచ్చేందుకు ఈ ప్రయోగం ఎంతగానో ఉపయోగ పడనుంది. 1983లో ప్రారంభించబడిన ఇన్సాట్‌ వ్యవస్థలో ప్రస్తుతం పనిచేస్తున్న తొమ్మిది ఉపగ్రహాల ద్వారా ఎస్‌ బ్యాండ్‌, సీ బ్యాండ్‌, అభివృద్ధిపరచిన సీ బ్యాండ్‌, కె.యు బ్యాండ్‌లలో మొత్తం 178 పనిచేసే ట్రాన్స్‌పాండర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రస్తుతం ప్రయోగించనున్న జిశాట్‌ 5పిలో పొందుపరచబడ్డ 24 సాధారణ, 12 అభివృద్ధిపరిచిన సీ బ్యాండ్‌ ట్రాన్స్‌పాండర్లు ఈ వ్యవస్థకు మరింత పరిపుష్టి కలిగిస్తాయి. వీటిద్వారా సమాచార, ప్రసార, వాతావరణ పరిశీలన, విపత్తుల సమాచారం, అన్వేషణ-రక్షణ వంటి వివిధ సేవలు ఇస్రో అందిస్తుంది.గత ఏడాది ఏప్రియల్‌ 15వ తేదీన స్వదేశీ తయారీ క్రయోజనిక్‌ ఇంజన్‌తో జి.ఎస్‌.ఎల్‌.వి-డి3 ద్వారా ప్రయోగించిన జిశాట్‌ 4 ప్రయోగం విఫలం చెందడంతో ఎప్పటిలానే రష్యానుంచి దిగుమతి చేసుకున్న క్రయో ఇంజన్‌తో ప్రస్తుత య్రోగాన్ని జరుపనున్నారు.13.7 సంవత్సరాల జీవిత కాలం సేవలందించేందుకు ఉద్దేశించిన ఈ ఉపగ్రహం ఇప్పటికే సేవలందింస్తున్న శాటిలైట్లకు జిశాట్‌ సిరీస్‌లో ఐదవదిగా నింగిలోకి పంపుతున్న జిశాట్‌ 5పి జతకలిసి సేవలను విస్తరించనుంది.

Source: www.visalaandhra.com

Wednesday, December 15, 2010

సరిగమలతో ఉపాధి మార్గాలు

 ఎ.ఆర్‌.రెహమాన్‌ జయహో అంటే.. యావత్‌ ప్రపంచం జై కొట్టింది. సరిగమల సిరియని కీర్తించింది. ఎక్కడో అమెరికాలో మైకేల్‌ జాక్సన్‌ కన్నుమూస్తే విశ్వమంతా నివాళులర్పించింది. నిను మరువలేమంటూ నీరాజనాలు పలికింది. మొన్నటికి మొన్న మన రాష్ట్రానికి చెందిన శ్రీరామ్‌ను ' నువ్వే మా ఐడల్‌' అంటూ భరతావని జేజేలు పలికింది. 'ఆడపిల్లనమ్మా నేను ఆడపిల్లనానీ... భాధ పడకమ్మా నీవు దిగులు చెందకమ్మా' అంటూ చిన్నారి మధుప్రియ ఆంధ్రప్రదేశ్‌ మొత్తాన్ని ఆలోచింపజేసింది. వీరందరి నేపథ్యమూ ఒక్కటే... అదే సంగీతం. ప్రపంచంలో ఏ రంగమైనా పేరు ప్రతిష్టలు, కావాల్సినంత డబ్బు సంపాదించగలిగే శక్తి సమకూర్చుకో గలదేమో గానీ... హృదయాన్ని కదిలించే శక్తి ఒక్క సంగీతానికే మాత్రమే వుంది. వినోద ప్రపంచం విస్తరిస్తున్న నేటి ితరుణంలో ఈ రంగంలో ఉపాధి అవకాశాలు లభిస్తున్నాయి. యువతరానికి ఆశాకిరణంలా వెలుగొందుతున్న ఈ సంగీత సామ్రాజ్యంలో ఎలాంటి అవకాశాలున్నాయి. శిక్షణ ఎక్కడ లభిస్తుంది. ఎలాంటి అర్హతలు అవసరం తదితర విషయాలు తెలుసుకుందాం.

సంగీతంలో ప్రతిభ కనబర్చాలంటే... ఆ రంగంలో రాణించాలంటే... ట్యాలెంట్‌ ఒక్కటే సరిపోదు. సంప్రదాయ సంగీత వారసత్వం కలిగిన వారైనా సరే సాధన, శిక్షణ తప్పనిసరి. ఏదేని సంగీత శిక్షణా కేంద్రంలో ప్రవేశిండమే మ్యూజిక్‌ ప్రపంచంలో రాణించేందుకు వేసే తొలి అడుగు. దీనికి తోడు కాలనుగుణమైన అభిరుచులను ఆహ్వానిస్తూ... ఆస్వాదిస్తూ అందించగలిగే నేర్పును ఒడిసి పట్టకోగలగాలి. అంతటి దీక్షాదక్షత అలవర్చుకోవాలి. అంకిత భావంతో నిరంతర సాధనకు సిద్ధపడాలి. అప్పుడే సముచిత స్థానం దక్కుతుంది.

సంప్రదాయ, జానపద, జాజ్‌, పాప్‌ ఫ్యూజన్‌.. తదితర వైవిధ్యమైన సంగీత రీతులున్నట్లే... ఎన్నో రకాల ఉపాధి అవకాశాలు కూడా మ్యూజిక్‌ రంగంలో ఉన్నాయి. నేపథ్యగానం, స్వరకూర్పులేగాక కంపోజర్‌, సాంగ్స్‌రైటర్‌, మ్యూజిక్‌, పబ్లిషర్‌, మ్యూజిక్‌ జర్నలిస్టు, డిస్క్‌ జాకీస్‌, వీడియో జాకీస్‌, మ్యూజిక్‌ థెరపిస్ట్‌, ఆర్టిస్ట్‌ మేనేజర్‌, పిఆర్‌... ఇలా ఎన్నో రకాలుగా స్థిరపడవచ్చు. స్వయం ఉపాధి పొందేందుకు కూడా ఈ రంగంలో విస్తృత అవకాశాలు ఉన్నాయి. ఇంట్లోనే ప్రయివేటుగా మ్యూజికల్‌ క్లాసెస్‌ చెప్పొచ్చు. మ్యూజిక్‌ స్కూల్‌ను నడపవచ్చు. వివిధ సందర్భాలను పురస్కరించుకొని సంగీత కార్యక్రమాలను నిర్వహిస్తూ కూడా ఉపాధి పొందవచ్చు. టివి ఛానళ్లు పుట్టగొడుగుల్లా పుట్టుకు రావడం, మ్యూజిక్‌ ఛానెళ్ల పాపులారిటీ పెరుగుతుండటం, పెద్ద పెద్ద కార్పొరేటు సంస్థలు, తమ ఉత్పత్తుల ప్రచారం కోసం సంగీతోత్సవాలు (మ్యూజికల్‌ ఈవెంట్లు) నిర్వహిస్తుండటంవల్ల నేడు ఈ రంగం వ్యాపార సుస్థిరత సాధిస్తోంది. ఏ చిన్న అవకాశం తగిలి సక్సెస్‌ అయినా.. అవకాశాలు, డబ్బు, ప్రతిష్ట వెతుక్కుంటూ వస్తాయి. సరైన ప్రణాళిక, అంకుఠిత దీక్ష, నిరంతర సాధనవుంటే ఈ రంగంలో స్థిరపడవచ్చు.

ఎలాంటి అర్హతలు ఉండాలి: సంగీతంలో రాణించాలంటే ప్రత్యేక అర్హతలేవీ ఉండాల్సిన అవసరం లేదు. అయితే ఏదేని మ్యూజిక్‌ కోర్సు చేయాలంటే మాత్రం కనీసం ఇంటర్మీడియట్‌ అయినా పూర్తి చేసి వుండాలి. మ్యూజిక్‌ను కెరియర్‌గా ఎంచుకునేవారికి సంగీతమంటే అభిమానం, ఆసక్తి ఉండాలి. స్పందించే గుణం, మ్యూజికల్‌ సెన్స్‌ ఉండాలి. వేదికపై అనర్ఘళంగా గళం విప్పగలిగే దృఢ మనస్తత్వం తమదైన ప్రత్యేక ముద్ర, విభిన్నత, ప్రత్యేకత, క్రియేటివిటీ ఆవిష్కరించగలగాలి. ఇవి లేకపోతే సాధన ద్వారా అలవర్చుకోవాలి. మంచి ప్రతిభ ఉండికూడా నలుగురికీ తెలియకపోతే అది వృథాప్రయాసే అవుతుంది. కాబట్టి ఈ రంగంలో రాణించాలనుకునే వారికి ప్రచారం కూడా తప్పనిసరి.అందుకే సంబంధిత నిపుణులతో, వ్యక్తులతో సత్సంబంధాలు ఏర్పర్చుకోవాలి. కాలనుగుణ అభిరుచులకు అనుగుణంగా శిక్షణ పొందేందుకు సిద్ధపడాలి. వీలైనప్పుడల్లా డెమో క్యాసెట్స్‌ విడుదల చేయాలి. వివిధ కార్యక్రమాలతో తరచూ మీడియా దృష్టినీ, తద్వారా సంగీత ప్రియులనూ ఆకట్టుకోగలగాలి.

కోర్సులు/శిక్షణ: మ్యూజిక్‌ వినోదమే కాదు, ఇప్పుడో పెద్ద వ్యాపారం కూడా. లెక్కలేనన్ని శిక్షణా సంస్థలు ఈ రంగంలో వెలుస్తున్నాయి. పట్టణాల్లో చాలావరకు ప్రాథమిక సంగీత శిక్షణా కేంద్రాలు ఉంటున్నాయి. మన రాష్ట్రంలో ఆంధ్రా యూనివర్సిటీ (విశాఖప్టణం), నాగార్జున యూనివర్సిటీ(నాగార్జునాసాగర్‌), శ్రీకృష్ణ దేవరాయ యూనివర్సిటీ (తిరుపతి) వివిధ రకాల సంగీత కోర్సులను అందిస్తున్నాయి.

మ్యూజిక్‌ కంపోజర్‌/సాంగ్స్‌ రైటర్స్‌: మంచి రచనాశైలి కలిగినవారు స్వర రచన, గేయ రచనలో ప్రవేశించవచ్చు. ఈ కోర్సులు చేసేవారు సంగీత కూర్పు, గేయ రచనలో విడివిడిగా లేదా రెండింటిలోనూ రాణించవచ్చు. కంపోజర్లు ప్రేక్షకుల అభిరుచులను ఆకళింపు చేసుకొని సరికొత్త బాణీలు కూర్చాల్సి వుంటుంది. ఇందుకోసం సంగీతంలో విభిన్న రీతుల్లో పట్టు సాధించాలి. అలాగే సౌండ్‌పై కూడా స్పష్టమైన అవగాహన పెంచుకోవాల్సి వుంటుంది. గేయ రచన చేయదల్చుకున్నవారు కూడా ప్రేక్షకుల నాడి తెలుసుకోవాలి. చెప్పాల్సిన భావాలను అర్థం చేసుకొనేవిధంగా, సంగీత బాణీలకు అనుగుణంగా ప్రజలకు చేరువయ్యే పదజాలంతో పాటల లిరిక్స్‌ రాయాల్సి వుంటుంది. ఇందులోనే జింగిల్‌ రైటర్స్‌ అనే మరో కేటగిరి వుంది. ఎఫ్‌ఎం, రేడియో, టివిలలో వచ్చే ప్రకటనలకు ప్రత్యేకంగా లిరిక్స్‌ రాసేవారు ఈ విధంగా వ్యవహరిస్తారు. కంపోజర్లు/గేయ రచయితలు సినిమాలకు సంగీతం అందించవచ్చు. వాణిజ్య జింగిల్స్‌లోనూ రాణించవచ్చు. జానపద గీతాలతో చక్కని ఆల్బమ్స్‌ రూపొందించి ఖ్యాతి గడించవచ్చు. ఈ రెండు రకాల కోర్సులు చేసేవారు వ్యాపార దృక్కోణం అర్థం చేసుకోవాల్సి వుంటుంది. అంది వచ్చే అవకాశాలను సద్వినియోగం చేసుకోగలగాలి. కాపీరైటర్లు, నెట్‌వర్కింగ్‌, పబ్లిషింగ్‌, కాంట్రాక్టులు, ప్రదర్శన హక్కులు వంటి విషయాలపై అవగాహన పెంచుకోవాలి. మ్యూజిక్‌ కంపోజర్లు, అడ్వర్టయిజింగ్‌ కంపెనీలలోనూ, మ్యూజిక్‌ పబ్లిషింగ్‌ సంస్థల్లోనూ, సినిమాల్లోనూ, టివి ఛానళ్లలోనూ, రేడియోలలోనూ పనిచేయవచ్చు. జింగిల్‌ రైటర్లు, నిర్మాతలతో, వివిధ సంస్థల డైరెక్టర్లతో పరిచయాలు ఏర్పర్చుకుంటే, ఆయా సంస్థలకు వాణిజ్య ప్రకటనలు రూపొందిస్తూ ఉపాధి పొందవచ్చు. ఆ తర్వాత సినిమాల్లో, టివిల్లో అవకాశాలు చేజిక్కించుకోవచ్చు.

Source: www.prajasakti.com

పెళ్ళి చేసుకోమని టీవీ యాంకర్ ఒత్తిడి?

ఈ మద్య హీరో నవదీప్ ఒదో ఒక విషయంలో మీడియాకు చాలా దగ్గరవుతున్నారు. ఒక్క సారి బైక్ రేస్, ఇంకొక్కసారి, కారు స్పీడు, ఇప్పుడు అమ్మాయి గొడవ...ఈ మధ్య హీరోలకి పబ్ ల వెంట పార్టీలు అని తిరగడం ఫ్యాషన్ అయ్యిపోయింది. 5,6 సినిమాలు తీసిన తర్వాత ఇంక చాన్స్ లు లేక పబ్ ల వెంట తిరిగే హీరోలలో నవదీప్ ఒక్కడు. అయితే ఈ మద్య ఒకసారి ఇతగాడు తప్పతాగి ఓ యాంకర్ తో సహా వేగంగా కారు నడుపుతూ పోలీసులకు పట్టుబడిన విషయం తెలిసిందే. ఇది జరిగినప్పటి నుండి ఆ టివీ యాంకర్, ఈ హీరోని పెళ్ళి చేసుకోమని ఒత్తిడి చేస్తుందట. నవదీప్ తో కారులో తనే ఉన్న విషయం అందరికి తెలిసిపోయిందని, ఇప్పుడు అతనే తనని పెళ్ళి చేసుకోవాలని అంటోందట. ఇక దానితో ఈ హీరోగారి ఇంట్లో రోజూ గొడవ జరుగుతుందట. నవదీప్ తండ్రి ఆమెను పెళ్ళి చేసుకోవడానికి ఒప్పుకోవడం లేదట. పాపం ఇప్పుడు ఆ యాంకర్ పరిస్థితి ఏమిటో...?

ప్రస్తుతం నవదీప్ ఐతే, అనుకోకుండా ఒక రోజు, ఒక్కడున్నాడు వంటి చిత్రాలు రూపొందించిన యేలేటి చంద్రశేఖర్ వద్ద అశోసియేట్ గా పనిచేసిన రవి దర్శకుడుగా మారుతున్నారు. సంగీత దర్శకుడు కోటి కుమారుడు రాజీవ్ హీరోగా ఈ చిత్రం రూపుదిద్దుకోనుంది. నవదీప్ ఈ చిత్రంలో మరో కీలకపాత్రను చేయనున్నట్టు సమాచారం.

Source: www.telugunow.com

Tuesday, December 14, 2010

New Telugu Channels Coming Soon.....

Entertainment Channels:
DD Telangana(డి డి 9 ) - Doordarshan Telugu from hyderabad city
DD vizag(డి డి10) - Doordarshan Telugu from Vizag city
DD Vikasam (డి డి 11)- Doordarshan Telugu from Hyderabad For agriculture And Govt Plans
JAYA Telugu - JAYA Network's Telugu Channel.
SONY Telugu - SONY Network's Telugu Channel.
Kasturi TV - Sahara Groups Network's Telugu Channel.
UTV Telugu - UTV Network's Telugu Channel.

Comedy Channels:
ETV Comedy - 24 Hours Comedy Channel from ETV Network.
ZEE Navvu - 24 Hours Comedy Channel from ZEE Network.
 
Movie Channels:
UTV cinema - Telugu Movies Channel from UTV Network.
UTV movies - English Movies Dubbed in Telugu Movie Channel from UTV Network.
MAA movies - Telugu Movie Channel from MAA Network.
ETV movies - Telugu Movie Channel from ETV Network
ZEE movies - Telugu Movie Channel from ZEE Network

Music Channels:
COLORS Music - TELUG FILM Music ENTERTAINMENT Channel
Gemini Music -Music Channel from Sun Network.
ZEE Music - Film and Private telugu Music Channel from ZEE Network.
Maa Music - Music Channel from Maa Network.
ETV Music - Music Channel from ETV Network
MTV Telugu Music - Music Channel from MTV Network
Telangana Music - Regional And Local Traditional Music Channel from Telangana NEWS Channel.

Source: dthnews.mediadir.in & www.saveondish.com

చానెళ్లకు గుండె దడ!

ఇండస్ట్రీలో ఏ హీరోని ఎప్పుడు ఛీత్కరిస్తారో? ప్రైవేట్ ఛానెళ్లలో ఏ హీరోని ఆకాశానికి ఎత్తేస్తారన్న విషయం మీద ఇప్పటికీ తర్జన భర్జనలు జరుగుతూనే ఉన్నారుూ అంటే - పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. తాజాగా - ‘దబాంగ్’ చిత్రం సూపర్ డూపర్ హిట్టయింది కదాని - సల్మాన్ ఖాన్ పేరు చెప్పుకొని ‘బిగ్ బాస్-4’ స్థాయిని టిఆర్‌పిలో స్థిరం చేద్దామనుకుంటే - అస్సలు కుదర్లేదని వాపోతున్నార్ట నిర్వాహకులు. ఆఖరికి కంటెస్ట్‌లు సైతం పూర్తి స్థాయిలో నిరాకరణోద్యమాన్ని చేపట్టడంతో - హాలీవుడ్ నుంచీ పమేలా ఆండర్సన్‌ని కోట్ల ఖర్చు మీద రప్పించారు. ఈ ‘బే వాచ్’ అమ్మాయి ముచ్చటగా మూడు రోజులు మురిపించి తళుక్కున అదృశ్యమైంది. మళ్లీ ‘బిగ్ బాస్-4’కి తలనొప్పి మొదలైంది. మరోవైపు ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ టిఆర్‌పి విస్తృత స్థాయిలో పెరిగిపోవటంతో ‘బిగ్ బాస్’కి గుండెల్లో దడ. ఇలా ఎవరికి వారే - టిఆర్‌పి బెడద నుంచీ తప్పించుకోటానికి చేస్తున్న కుతంత్రాలూ కుట్రలూ అన్నీ ఇన్నీ కావు. ఇక - ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ సంగతికి వస్తే - ప్రేక్షకుల్లో ఒక సందిగ్ధావస్థ. ఒకవేళ అభ్యర్థి గనక కోటి రూపాయలు గెలుచుకుంటే - ‘జాక్‌పాట్’ క్వొశ్చన్ (దీనికి ఐదు కోట్ల బహుమతి)కి సరైన సమాధానం ఇవ్వకుంటే - ఉన్నపళంగా కోటి రూపాయల నుంచీ 3.5 లక్షలకు దిగిపోవటం ఏమిటి అన్న ప్రశ్న వెంటాడుతోంది. ఈ మెలోడ్రామాకి అర్థం ఏమిటో విడమరిస్తే బావుంటుందన్నది వీక్షకుల ఆలోచన. ఈ ప్రశ్నని పక్కన పెడితే - ‘కౌన్ బనేగా’ నిర్వాహకుడు సిద్దార్థ బసు కూడా ‘హోస్ట్’ల విషయంలో ఎటూ తేల్చుకోలేని స్థితిలో ఉన్నాట్ట. సినిమా అంటే మధ్యలో హీరోని తొలగించే ప్రసక్తే ఉండదు కాబట్టి - చచ్చినట్టు భరించాల్సిందే. కానీ - ఛానెల్ విషయంలో అలా కాదు. ప్రేక్షకులకు గానీ.. కంటెస్ట్‌లకు గానీ నచ్చకపోతే - తీసేయటం ప్రధానం. ప్రతి దానికీ టిఆర్‌పి ఒకటి ఉండటంతో ఆచితూచి అడుగు వేయాల్సిందే నంటాడు. ఇంకోవైపు అక్షయ్ కుమార్ ‘మాస్టర్ ఛెఫ్ ఇండియా’ ఇప్పుడిప్పుడే టిఆర్‌పి వేగాన్ని పుంజుకుంటోంది. ఈ ఇంటర్నేషనల్ ఫార్మేట్‌ని వొంటబట్టించుకోటానికి ఇన్నాళ్లు పట్టిందని అంటాడు అక్షయ్ కూడా.
ఈ ధోరణి ఇదైతే - ఇక - కార్యక్రమ నిర్వాహకుల కోపతాపాలనూ ఆవేశ కావేశాలనూ అదుపు చేయటం మా వల్ల కావటం లేదని ఛానెళ్లు చేతులెత్తేస్తున్నాయి. కోట్ల కొద్దీ జనం వీక్షించే కార్యక్రమంలో ఏ మాత్రం మాట తూలినా అది పృథ్విని దాటుతుందన్న సత్యాన్ని మరచి - ఛానెళ్లలో వారి వారి వాగ్ధాటిని చూపటం ఎంతవరకూ సబబు అన్నది మరో ప్రశ్న. ఇప్పటికే ‘బిగ్ బాస్-4’లో కంటెస్ట్‌ల మాటలు శృతిమించి రాగాన పడుతున్నాయని - కోర్టు సైతం వాతలు పెట్టినప్పటికీ.. రాఖీ నోరు అదుపులో పెట్టుకోక పోవటంవల్ల - ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడన్న అభియోగాన్ని తలకెత్తుకున్నా.. ఇలాంటి సంఘటనల వల్లనైనా - ఆవేశాన్ని నిలువరించుకుంటే బావుంటుందన్నది మరో వాదన.

Source: www.andhrabhoomi.net

పేరుకు తగ్గ షో ‘జీన్స్’

మల్లెమాల ఎంటర్‌టైన్‌మెంట్స్‌పై ఈటీవీలో శనివారం 9.30 గంటలకు ప్రసారమవుతున్న ‘జీన్స్’ కింగ్ ఆఫ్ గేమ్ షోస్ పేరుకు తగ్గట్టుగానే రూపొందుతోంది. ఈ కార్యక్రమానికి సుమ వ్యాఖ్యానం మరింత జోష్‌ని అందిస్తోంది. మొదట్లో సాధారణ ప్రేక్షకులతో మొదలైన గేమ్ షో కాస్త రానురాను సినీ ప్రముఖులకు ప్రాధాన్యత కల్పిస్తోంది. ఇటీవల ప్రసారమైన కృష్ణ భగవాన్, రఘుబాబు కలిసి ఆడిన ఎపిసోడ్, అల్లరి నరేష్ ఆడిన ఎపిసోడ్ ప్రేక్షకులకు బాగా చేరువయ్యాయని చెప్పవచ్చు.

ఈ గేమ్ షో నిర్వహణకు నిర్వాహకులు కాస్త కష్టపడక తప్పదని తెలుస్తుంది. ఎందుచేతనంటే జీన్స్ అని పేరు పెట్టినందుకు మానవులు - వారి మధ్య సంబంధాలకు ప్రాధాన్యత ఉండే విధంగా రౌండ్స్ ప్లాన్ చేశారు. దాంతో ఈ షో నిర్వహించాలంటే మానవ వనరులు ఎక్కువే కావాలి. అవే గేమ్ షోలో ప్రశ్నలు - జవాబులుగా కనిపిస్తాయి. అందుచేత జీన్ షోకు ప్రశ్న జవాబులుగా ఎంతోమంది కుటుంబ సభ్యులు వచ్చి స్క్రీన్‌పై కనపడటమే కాకుండా వచ్చిన సెలబ్రిటీతో మాట్లాడేందుకు, ప్రశ్నించేందుకు అవకాశం కల్పిస్తున్నారు నిర్వాహకులు. అభిమాన నటులను కలుసుకోవడమే కాదు వారు కూడా గేమ్ షోలో పాల్గొనడం ఆనందంగా ఫీలవుతున్నారు.

షో విషయానికి వస్తే
మొదటి రౌండ్‌గా ‘సేమ్ టు సేమ్’ అంటూ కొంతమంది తల్లిదండ్రులను పిల్లలను (వేర్వేరు కుటుంబాలకు చెందిన) నిలబెట్టి గుర్తించాలి. అలా గుర్తించలేకపోతే పార్టిసిపెంట్‌కి మొదటిగా ఇవ్వబడిన నలభై వేల నుండి పదివేలు చొప్పున పోగొట్టుకుంటాడు. గుర్తించగలిగితే సుమ నుండి రాబట్టుకుంటాడు. అంటే ఆట నలభై వేలతో మొదలౌతుంది. రెండవ రౌండ్‌గా సెలబ్రిటీ రౌండ్‌లో ప్రముఖుల ఫొటోలతో వారి పిల్లలనో పెద్దలనో మ్యాచ్ చేయాల్సి ఉంటుంది.
మూడవ రౌండ్ బొమ్మరిల్లు రౌండ్. దీంట్లో అతి పెద్ద కుటుంబాన్ని ప్రేక్షకులకు వారి మధ్య రిలేషన్స్‌తో పరిచయం చేస్తారు. వారిలో ఎవరో ఇద్దరిని ఒకచోట నిలబెట్టి వారి మధ్య సంబంధాన్ని పార్టిసిపెంట్ చెప్పాలి. కరెక్ట్‌గా చెబితే లక్ష వస్తుంది. తప్పు లేదా ఒప్పు తెలుసుకోవాలంటే సుమకు ఐదువేలు ఇవ్వాలి. ఇక ఆఖరి రౌండ్‌గా ఒకే కుటుంబానికి చెందిన పెద్దలను పిల్లలను జత చేయాలి. దీనిని చేయడానికి పార్టిసిపెంట్‌కి 100 సెకన్లు 80 సెకన్లు 60 సెకన్లు ఇస్తారు. వారు కోరుకున్న సెకన్లను బట్టి అప్పటి వరకు వారి వద్దనున్న మొత్తం మూడు రెట్లు నాలుగు రెట్లు లభిస్తుంది. జత చేయడంలో ఒక తప్పు చేసినా అప్పటివరకు వారి వద్ద నున్న మొత్తం సగమై పోతుంది. ఈ విధంగా షో ముగుస్తుంది.

Source: www.andhrabhoomi.net

Wednesday, December 8, 2010

కోట్లు కొల్లగొడుతున్న - ‘రియాలిటీ షో’లు

ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ ప్రస్తుతం రియాలిటీ షోల వెంట పరిగెడుతున్నాయి. జీడిపాకంలా సాగే సీరియల్స్ గ్రామీణ, పట్టణ స్థాయి ప్రజలను ఎంటర్‌టైన్ చేయడంతో పాటు బానిసలుగా మార్చేసినా నగర స్థాయి ప్రజలకు మాత్రం మహా బోర్‌గా తయారయ్యాయి. దాంతో ఛానల్స్ వారు డాన్స్, గేమ్స్ వంటి షోలపై ప్రత్యేక దృష్టి పెట్టి ప్రజలను విపరీతంగా ఆకట్టుకుంటున్నారు. ఓ తరహా ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో పాటల ప్రోగ్రాంలు కూడా బాగానే పని చేస్తున్నాయి.
రియాలిటీ షోల దెబ్మకి సీరియల్స్ కొంతవరకు ప్రభావాన్ని కోల్పోవడం జరుగుతుంది. అందుకే సీరియల్ వైపు ప్రేక్షకుల దృష్టిని మరల్చి బానిసలుగా మార్చేందుకు వెండి, బంగారం వంటి కానుకలను ఎరగా వేసి ఎస్‌ఎంఎస్ కాంటెస్ట్‌లను పెట్టడం జరుగుతుంది. అయినా ఏ ఎపిసోడ్‌కి ఆ ఎపిసోడ్ కొత్తగా కనిపించి రిజల్ట్ తేలిపోయే రియాలిటీ షోల వైపే ప్రేక్షకులు నడవడంతో ఛానల్స్ రియాలిటీ షోలను మరింత అందంగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నాయి.
ప్రతి ఛానల్ వారు వారంలో కనీసం నాలుగు రియాలిటీ షోలనైనా రూపొందించి అటు యువ ప్రేక్షకులతోపాటు మహిళలను కూడా ఆకర్షించే ప్రయత్నం చేస్తున్నారు. మధ్యాహ్నం ప్రసారమయ్యే రియాలిటీ షోలలో నగదు, బంగారాలను ఎరవేసి నిర్వహించడమే కాకుండా ఎస్‌ఎంఎస్‌ల ద్వారా కూడా బహుమతులు ఇవ్వడం జరుగుతుంది. రాత్రిపూట నిర్వహించే షోల ద్వారా అన్ని రకాల ప్రేక్షకులను కట్టిపడేయడంలో నిర్వాహకులు విపరీతంగా కృషి చేస్తున్నారు. దీనికి సంబంధించి వాద ప్రతివాదనలు, వివాదాలు, కన్నీళ్ల పర్యంతాలు వంటి సీన్‌లను ప్రత్యేకంగా ఎడిట్ చేసి ప్రోమోలుగా చూపుకుంటున్నారు. రియాలిటీ షోల ద్వారా వందల కోట్ల రూపాయలలో వ్యాపారం జరుగుతుందంటే ఆశ్చర్యపడక తప్పదు. అందుకే ఎంత ఖర్చు చేసైనా సరే భారీగా నిర్వహించడానికి భారీ మొత్తాల్లో ప్రైజ్‌లు ఇవ్వడానికి నిర్వాహకులు వెనుకంజ వేయడం లేదు. పాపులర్ రైటర్ యండమూరి సైతం ‘అదృష్టం’ వంటి రియాలిటీ షోలో పాల్గొన్నాక తనదైన శైలిలో ‘అంతర్ముఖం’ అనే సైకలాజికల్ షోను డిఫరెంట్‌గా నిర్వహించడానికి మా టీవీని వేదికగా మార్చుకున్నారు.
రియాలిటీ షోలకు ఆదాయం స్పాన్సర్స్ ద్వారానే కాదు ఎస్‌ఎంఎస్ నిర్వహించడం ద్వారా కూడా లభిస్తుంది. పది నిమిషాల ‘స్లాట్’ని కోట్లు కుమ్మరించి స్పాన్సర్స్ కొంటున్నారు. స్పాన్సర్, కో స్పాన్సర్ చెల్లించే మొత్తాలతో రియాలిటీ షోలు మరింత అందంగా తయారవుతున్నాయి. రియాలిటీ షోల మధ్య పోటీ నానాటికీ పెరిగిపోతోంది. షోలను నడిపించే స్టార్ల మధ్య కూడా నెంబర్ వన్ తత్వం కోసం పోటీ ముదిరిపోతోంది. రియాలిటీ షోలకు మరింత క్రేజ్‌ని అద్దడానికి చూపే ప్రోమోలు వివాదాస్పదంగా కూడా మారుతున్నాయి.
రియాలిటీ షోల మధ్య పోటీ ఎంతవరకైనా పోతుంది. వ్యక్తిగత విషయాలను డబ్బులు ఎరగా పెట్టి బయటకు తీసి ఆ కుటుంబాల్లో చిచ్చును రగిలించే షోలు కూడా నడుస్తున్నాయి. బుల్లితెరపై సెలబ్రిటీలు, గెస్ట్‌లు, పార్టిసిపెంట్స్, యాంకర్ల మధ్య జరిగే ఆసక్తికరమైన మాటలతోపాటు, మాటల యుద్ధాలు కూడా షో నిర్వాహకులకు కోట్లు కుమ్మరించడమే కాదు క్రేజ్‌ని కూడా పెంచుతున్నాయి. టిఆర్‌పి పెరిగిపోతుంటే రియాలిటీ షోలు ఎన్ని ఎపిసోడ్స్‌నైనా జరుపుకుంటాయి.
రియాలిటీ షోలలో మొదట పాల్గొనే స్థాయిలో వుండే సాధారణ ప్రేక్షకుడు ప్రస్తుతం ఎక్కువగా రియాలిటీ షోలను తిలకించే స్థాయిలోనే మిగిలిపోతున్నాడు. ఎందుకంటే షోలకు మరింత క్రేజ్ తీసుకురావడానికి అవసరమైన సెలబ్రిటీలను (సినిమా, టీవీ, వివిధ రంగాలకు చెందిన) సెలెక్ట్ చేయడంతో ఏ ఛానల్‌లో ఏ షో చూసినా సాధారణ ప్రేక్షకుడు ఎక్కువగా కనిపించడం లేదు. పండుగ పబ్బాలకు వచ్చే సెలబ్రిటీలు ప్రస్తుతం ఎక్కువ ఎపిసోడ్స్‌లో కనిపిస్తున్నారు. టీవీ స్టార్, సినిమా స్టార్, పొలిటికల్ స్టార్ ఇలా అన్ని రంగాల వారు షోలకు వచ్చే విధంగా నిర్వాహకులు ప్రయత్నిస్తున్నారు. దీనివల్ల వారి టిఆర్‌పి రేటింగ్ ఘనంగా పెరుగుతుంది. అందుకే రియాలిటీ షోలకు సాధారణ ప్రేక్షకుడు నానాటికీ దూరమై పోయి వీక్షకుడిగా మిగిలిపోతున్నాడు.
కొన్ని రియాలిటీ షోలకు జడ్జీలుగా, యాంకర్లుగా, స్పెషల్ గెస్ట్‌లుగా సెలబ్రిటీలు రావడం షో నిర్వాహకులకు కాసుల వర్షం కురిపిస్తుంది. వివిధ రంగాలలో క్రేజ్ తగ్గినా.. భారీ క్రేజ్ వున్నా కూడా రియాలిటీ షోలకు నిర్వాహకులుగా రావడానికి సెలబ్రిటీలు లక్షల నుండి కోట్ల వరకు షో నిర్వాహకుల నుండి చక్కగా గుంజుకుంటున్నారు. అందుకే నేడు ఎక్కువగా సినీ తారలు షోలను నడిపించడంలో ఉత్సాహం చూపుతున్నారు. ఈ విధానానికి బిగ్ బి అమితాబ్ ఆద్యుడై క్రేజీ స్టార్లని బుల్లితెరకు వచ్చేలా చేశాడు. బాలీవుడ్ స్టార్స్ అమితాబ్, షారుఖ్‌ఖాన్, సల్మాన్‌ఖాన్, అక్షయ్‌కుమార్ వంటి వారు నేడు బుల్లితెర షోలతో కోట్లు గడిస్తూ బిజీగా ఉన్నారు.
బుల్లితెర తెలుగు విషయానికి వస్తే గాయకుడు, బాలు, శైలజ, నాగూర్‌బాబులు, నటీమణులు సుమలత, వేద, జయప్రదలు, నటులు జగపతిబాబు, సాయికుమార్, మురళీమోహన్ వంటి వారు ఉన్నారు. రమ్యకృష్ణ, జయసుధ, ఉత్తేజ్, బ్రహ్మానందం వంటి కొంతమంది బుల్లితెరపై కొంతకాలం కనిపించి వెనుదిరిగారు. స్పెషల్ గెస్ట్‌లు వచ్చినపుడు.. స్పెషల్ గెస్ట్‌లతో షో నిర్వహించినపుడు టిఆర్‌పి రేటింగ్ పెరుగుతుందనేది ఛానల్స్ బాగా గమనించాయి కనుకనే ఎక్కువగా సెలబ్రిటీలతోనే ఎపిసోడ్స్ చేయడానికి ఇష్టపడుతున్నాయి. కొత్త సినిమాలు విడుదలైతే చాలు అన్ని షోలలోనూ ఆయా సినిమాలకు సంబంధించిన తారలు - టెక్నీషియనే్ల దర్శనమిస్తారు. ప్రస్తుతం బాలీవుడ్‌లో స్టార్స్ నిర్వహించే షోల మధ్య భారీ పోటీ కనిపిస్తూ నెంబర్ వన్ కావాలనే ఆరాటం కనిపిస్తుంది. కౌన్ బనేగా కరోడ్‌పతి... బిగ్‌బాస్ షోలు భారీ హంగామాను సృష్టిస్తూ ప్రపంచ ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నాయి. బిగ్‌బాస్ షోను మరింత క్రేజీగా మార్చడానికి హాలీవుడ్ తారను దిగుమతి చేసుకుని ఆమె కోసం ముంబాయికి 125 కి.మీ. దూరంలో ప్రత్యేక సెట్ వేసి మరీ షో చేస్తున్నారు. దీనిని బట్టే అర్థవౌతుంది రియాలిటీ షోల క్రేజ్.. ఆదాయం ఏమిటనేది.

Source: www.andhrabhoomi.net

చక్కటి కథావస్తువు ‘పసుపు - కుంకుమ’

పసుపు కుంకుమ భారత స్ర్తి సౌభాగ్యంలో ఎంతో ఉత్కృష్ట స్థానాన్ని సంపాదించుకున్నాయి. ఆ స్థానాన్ని మరింత తారాస్థాయిగా చేర్చే దిశగా చక్కటి కథావస్తువుతో జీ తెలుగు, అన్నపూర్ణ స్టూడియోస్ సంస్థ కలిసి డైలీ సీరియల్ ‘పసుపు - కుంకుమ’ నవంబర్ 22 నుండి సోమ-శుక్ర వారం వరకు ప్రతిరోజూ రాత్రి 7.30 గంటలకు ప్రసారం చేస్తోంది. సావిత్రి.. అమ్మా నాన్న.. తమ్ముడు ఇదే ప్రపంచం అని భావించే అమ్మాయి. విధి బలీయమైనది. ఆమె జీవితం ఎలాంటి తీరాలకు చేరిందో. ‘పసుపు - కుంకుమ’లకు ఎలాంటి విలువనిచ్చిందో తెలియజేసే విభిన్న కథా గమనమే ‘పసుపు - కుంకుమ’.

Source: www.andhrabhoomi.net

Friday, November 26, 2010

IT Raids at TV Anchor Omkar’s House!

TV Anchor, who got popular with his AATA program in ZEE Telugu later moved to MAA TV with TATA DOCOMO CHALLAENGE programme. As per the sources now he is earning crores of rupees per annum with the support from Zee Telugu and MAA TV. Some people also say that his shows are irritating with his over action and also cheap Tricks for Publicity. Recently his AATA program Telecast was also banned by HRC due to the Vulgarity.

Now the latest news is that Anchor Omkar has purchased a couple of villas and a luxurious flat in the popular ’Indu Fortune Fields’ venture near Hitech City. Someone suggested to the Anchor to purchase the flats on some Binami names and that pushed him in problems.
  
There is also a buzz that the anchor’s house was raided a couple of days back by the Income Tax Officials. Though there is no official confirmation, the news is that Omkar has managed them by offering some huge gifts. Industry experts are saying that, a special channel that only telecast reality shows will be started by Omkar soon, if he is earning bucks at such a speed.

Source: www.chitramala.com

Wednesday, November 24, 2010

ప్రయోజనకర ‘న్యాయ సేవ’

‘టీవీ అంటే ఎప్పుడూ సీరియల్సూ, సినిమా క్లిప్పింగులతో కూడిన కదంబ కార్యక్రమాలు, లేకపోతే ఉన్నపాటున జరిగే వింత, వత్తిడులను పెంచే ప్రత్యక్ష ప్రసారాలూ.. అంతేగా.. అంటూ పెదవి విరిచే వారికి కొంచెం ఉపశమనం కలిగించే కార్యక్రమం ఈటీవీ-2లో వచ్చే ‘న్యాయ సేవ’. కాస్త ఉపయోగపడే కార్యక్రమం కూడా. ఇందులో న్యాయవాద వృత్తిలో అనుభవం గడించిన వారు పాల్గొని నిర్దేశించిన విషయ సంబంధిత ప్రశ్నలకి (ప్రేక్షకులు అడిగినవి) సమాధానాలు చెప్తారు. ఇవి వాస్తవానికి అలా అడిగిన వారికే కాక అలాంటి అంశాలకు సమాధానాలు దొరక్క ఆందోళన చెందేవారికి కూడా వీరు చెప్పే పరిష్కారాలు ఉపయుక్తమవుతాయి.
ప్రత్యక్షంలో నివారించాల్సినవి..
ఈ మధ్య చాలా అంశాలు ‘ప్రత్యక్ష’ ప్రసారాలకు నోచుకుంటున్నాయి కనుక దానికి చెందిన అనివార్య అంశాల తీవ్రత తగ్గించడానికి సంబంధితులు సాధన చేయాలి. ముఖ్యంగా తడబాట్లని, తొట్రుపాటుల్నీ యాంకర్లు పరిహరించుకునే ప్రయత్నాలు చేయాలి. ఉదాహరణకు యాంకర్ రెండు మూడుసార్లు పద ఉచ్ఛారణలో తడబడ్డారు (స్వార్జితం.. తదితర పదాలు) అలాగే ఇందులో ప్రశ్నలడిగేవారు కూడా సమయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంశాల్ని క్లుప్తంగా, క్లారిటీతో అడగాలి. అప్పుడు అది వినేవారికి, సమస్యకు పరిష్కారం చెప్పేవారికీ సౌకర్యంగా ఉంటుంది.

Source: www.andhrabhoomi.net