Sunday, March 6, 2011

తెలుగు ఛానల్స్ రేటింగ్స్

తెలుగు టెలివిజన్ ఛానళ్ల గ్రాస్ రేటింగ్ పాయింట్స్ (GRP) WK-09

TV9 Telugu News 124

TV5 Telugu News 65

ETV2 Telugu News 62

HM TV 52

Zee 24 Ghantalu 49

NTV News 48

Sakshi TV 47


Raj News 41

ABN Andhra Jyothi 31

Mahaa TV 22

I News 21

Studio N 14

Gemini News 9


Zee Telugu 318

Gemini TV 743

Maa Telugu 274

Eenadu TV 374

Gemini Movies 293

Maa Movies 105

Maa Junior 17

Star Cricket 189

ESPN 27 

Source: 24gantalu.blogspot.com

సమాజంలో విష బీజాలు నాటడం మొదలుపెట్టిన రియాల్టీ షోలు

ప్రస్తుతం టెలివిజన్ ఛానెళ్లు తమ టిఆర్‌పి రేట్లను పెంచుకోవడానికి రకాల రకాల రియాల్టీ షోలపై దృష్టి సారిస్తున్నారు. కొన్ని ఛానెల్లు చిన్న పిల్లలతో ఆట పాటలు చేయిస్తుంటే.. మరికొందరు పెద్దవారితో చేయిస్తున్నారు. ఇలా ఆట పాటల వరకూ అయితే ఫర్వాలేదు కానీ.. కొన్ని రియాల్టీ షోలయితే అత్యంత ప్రమాదకరమైనవి కూడా ఉన్నాయి. అలాగే కొన్ని అసభ్యకరమైనవి కూడా ఉన్నాయి. అసలు ఇదంతా ఎందుకు చెప్పుకొస్తున్నామంటే... ఇటీవల ప్రముఖ తెలుగు టెలివిజన్ ఛానెల్ 'జీ తెలుగు' ఓ వినూత్న రియాల్టీ షో "కొండవీటి రాజా.. కోటలో రాణి"ను ప్రారంభించింది.

ఈ రియాల్టీ షో కాన్సెప్ట్ ఏంటంటే... అడవిలో హాయిగా తమ పనులు తాము చేసుకునే గిరిజనులును పట్నం తీసుకు వచ్చి వారికి పట్నం అమ్మాయిలను పార్ట్‌నర్‌గా చేసి వివిధ రకాల పరీక్షలు పెట్టడం. చివరిగా ఎవరు నెగ్గుతారో... వారే కొండవీటి రాజా... కోటలో రాణి. కాన్సెప్ట్ వినడానికి బాగానే ఉంది కానీ.. నైతిక విలువల ప్రకారం చూస్తే.. ఏమీ తెలియని గిరిజనుల అమాయకత్వాన్ని మరో కోణంలో చూపించి నవ్వుకునేలా చేయడం ఇందులో దాగున్న రహస్యం.


లుంగీ, చొక్కా తప్పా జీన్స్, టీ-షర్ట్‌ల గురించి తెలియని వారికి ఆ దుస్తులు వేయించడం, అసలు చదువు అంటే తెలియని గిరిజనుల చేత ఇంగ్లీషు పద్యాలు చెప్పించడం. వారు తప్పులు చేస్తుంటే చూసి పకా పకా నవ్వుకోవడం ఇది దీని అసలు కాన్సెప్ట్. అంతటితో ఆగిపోయితే సరి, హవ్వ... ఈ షోలో పాల్గొన్న యువతులు మాట్లాడే అసభ్య పదజాలాన్ని వింటుంటే.. హరి హరీ.. చెప్పడానికి తెలుగు భాషలో మాటలే ఉండవని చెప్పాలి. స్పోర్టివ్‌గా తీసుకోవాల్సిన ఆటల్లో ద్వేషంతో వ్యవహరించండమేంటి..? సిగ్గు.. సిగ్గు.. ఇలాంటి షోలు సమాజంలో విష బీజాలను నాటడం ఖచ్చితమని మానవ హక్కుల సంఘాలు ఘోషిస్తున్నా.. మనం మాత్రం వీటని చూసి ఎంజాయ్ చేస్తుంటాం...!


ఇలాంటిదే "ప్యాటి హుడిగిరో.. హల్లీ లైఫు" (సిటీ అమ్మాయిలి... పల్లె జీవనం) అనే మరో రియాల్టీ షో "సువర్ణ కర్ణాటక" అనే ఓ కన్నడ టెలివిజన్ ఛానెల్‌లో ప్రాసారం అవుతుంది. అయితే దీని కాన్సెప్ట్ మన కొండవీటి రాజా కోటలో రాణికి పూర్తిగా రివర్స్. ఇక్కడ పట్నం నుంచి వచ్చిన 12 మంది అమ్మాయిలతో ఉత్తర కర్ణాటకలో మారుమూల కుగ్రామంలో గొడ్డు చాకిరి చేయించడం ఈ రియాల్టీ షో అసలు కాన్సెప్ట్. అక్కడ ఎదురయ్యే కష్టనష్టాలను తట్టుకొని ఎవరు నిలబడుతారో వాల్లే విన్నర్స్ అన్నమాట. అమ్మాయిలతో పని చేయించే మాట అలా ఉంచితే పల్లె జీవనం ఎంత కష్టంగా ఉంటుందో.. అలాగే ఎంత అందంగా ఉంటుందో చూపించడం ఈ రియాల్టీ షో ప్రత్యేకత. 


Source: kazachaitanya.blogspot.com

MAA TV to telecast Bunny’s marriage live

MAA TV got the opportunity to telecast Stylish Star Allu Arjun’s wedding function live on MAA Movies channel from 7.30 pm on March 6.

This would be really a feast to the eyes of the Telugu audiences in general and Allu Arjun and Mega fans across the world and they could get a feel of attending the marriage and meeting their favourite hero’s wedding personally.

Because the wedding is being held for the most eligible bachelor of the Tollywood all the who is who of not only the Telugu film industry, but also from the entire south India and also from Bollywood would attend the wedding and the audiences could watch the marriage by sitting in their drawing room along with family members and enjoy it.

This is definitely going to be a real “Pelli Sandadi” for all the Bunny fans.

Indiaglitz wishes both Bunny and Sneha “A Happy and Prosperous married life”.

Source: www.indiaglitz.com

కొత్త టివి ఛానెళ్ల నెట్‍వర్క్‌పై విభేదాలు

కొత్త టివి ఛానెళ్ల నెట్‍వర్క్‌పై టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్ ఇండియా (ట్రాయ్)కి, ప్రభుత్వానికి మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. నెట్‍వర్క్‌‌ను మరింతగా పెంచాలని ట్రాయ్ సిఫారసు చేయగా, కేంద్ర సమాచార, ప్రసార శాఖ మాత్రం ఇందుకు భిన్నంగా స్పందించింది. ట్రాయ్ చేసినవి సిఫారసులు మాత్రమేనని, తాము మాత్రం తమ ఇదివరకటి వైఖరికే కట్టుబడి ఉంటామని ఈ శాఖ స్పష్టం చేసింది. డౌన్‌లింక్, లేదా అప్‌లింకింగ్‌కు అనుమతించే ఛానెళ్ల సంఖ్యపై నిషేధం ఉండరాదన్న సూచనతో తాము ఏకీభవిస్తున్నామని, అయితే నాన్-న్యూస్, కరెంట్ అఫైర్స్ ఛానెల్స్ నెట్‍వర్క్‌ రిక్వైర్‌మెంట్‍ను రు.15 మిలియన్ల నుంచి 50 మిలియన్లకు పెంచవచ్చునని ఈ శాఖ అభిప్రాయ పడింది. అలాగే ప్రతి అదనపు ఛానెల్‍కు దీనిని 25 మిలియన్లకు పెంచాలని సూచించింది.

Source: medianx.tv

ఇండియాలో ‘లాక్‌వేగాస్’

ఎక్కడో అమెరికాలోని ‘లాస్‌వేగాస్’ నగరం ఇండియాలో ఉందా? ‘స్టార్ వరల్డ్’ ఛానెల్ అవుననే అంటోంది మరి. ఇంతకీ ‘లాస్‌వేగాస్’ టైటిల్‍తో ఈ ఛానెల్ సరికొత్త షోను ప్రారంభిస్తోంది. ఆనగరంలోని ఎక్స్‌క్లూజివ్ క్యాసినోస్, షాపింగ్ మాల్స్, ఫైన్ డైనింగ్ తదితర లైఫ్‌స్టైల్స్ అన్నీ మన భారతీయ ప్రేక్షకులు ఈ షోలో తిలకించవచ్చు. ఈ నెల 7వ తేదీ నుంచి ఇది ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 9 గంటల స్లాట్‍లో ‘లాస్‌వేగాస్’ టెలికాస్ట్ అవుతుంది. హై డోస్ ఎంటర్‌టైన్‌మెంట్‍కు నిర్వచనం ఇచ్చే ఈ కొత్త షో తమ ఆడియెన్స్‌ను మరింతగా పెంచుతుందని స్టార్‌వరల్డ్ ఆశిస్తోంది.

Source: medianx.tv

ఆస్కార్ టెలికాస్ట్ అగ్రిమెంట్ పొడిగింపు

ప్రతిష్టాత్మకమైన ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమ ప్రసారాన్ని యుఎస్ ఛానెల్ ‘ఎబిసి’ మరో ఆరేళ్లు పొడిగించింది. ఈ కొత్త ఒప్పందం తక్షణమే అమలులోకి వచ్చిందని మోషన్ పిక్చర్స్ ప్రెసిడెంట్ టామ్ షెరాక్, డిస్నీ/ఎబిసి టెలివిజన్ గ్రూప్ ప్రెసిడెంట్ ఏన్‌స్వీనీ ప్రకటించారు. నిజానికి 2014లో ప్రస్తుత అగ్రిమెంట్ కాల పరిమితి ముగుస్తుంది. అయితే దీనిని మరో ఆరేళ్ల పాటు- అంటే 2020 వరకు పొడిగిస్తున్నట్టు వారు తెలిపారు. వరుసగా 46 ఏళ్ళ పాటు ఆస్కార్ అవార్డుల ప్రదాన కార్యక్రమాలను ప్రసారం చేసిన తాము ఇకపై కూడా ఇదే సహకారాన్ని కొనసాగిస్తామని వారు చెప్పారు.

Source: medianx.tv

డ్యాన్సింగ్ విత్ ది స్టార్ రియాల్టీషో

యుఎస్ ఛానల్-ఎబిసి ‘డ్యాన్సింగ్ విత్‌ ది స్టార్స్’ రియాల్టీ షోను ప్రారంభిస్తోంది. ఈ నెల 21 నుంచి ఈ షో టివీ ప్రేక్షకుల్ని అలరిస్తుంది. ఒక బాక్సింగ్ వీరుడు, ఓ టాక్‌షో పర్సనాలిటీ, మాజీ మోడల్ ఇలా వివిధ రంగాలకు చెందిన వారిలో 11 జంటలు ఈ డ్యాన్సింగ్ రియాల్టీ షోలో పాల్గొంటాయి. మొదటిసారిగా లైవ్‌లో రానున్న ఈ షోను లక్షలాది వీక్షకులు చూసి ఆనందిస్తారని ‘ఎబిసి’ భావిస్తోంది. ఈ షోకు న్యాయ నిర్ణేతలు కూడా ఉంటారు. వీక్షకులు తాము మెచ్చిన ఉత్తమమైన జంటలను ఎన్నుకోవచ్చు. ఫోన్ ద్వారా వారు తమ ‘ఓటుహక్కు’ వినియోగించుకునే వీలుంది. ఇంతేకాదు ‘డ్యాన్సింగ్ విత్‌ ది స్టార్స్’ షోలో హైలైట్లకు సంబంధించిన మొబైల్ వీడియో ఫుటేజీ కూడా కస్టమర్లకు లభిస్తుంది. ఈ షో పట్ల అప్పుడే అనేక మంది ఆసక్తి చూపుతున్నారు. 

Source: medianx.tv

స్టార్‌వన్‌లో మ్యూజిక్ అవార్డులు

భారీ మ్యూజిక్ అవార్డుల కార్యక్రమానికి రిలయన్స్ బ్రాడ్‌కాస్ట్, స్టార్‌ఇండియా, ఇండియన్ మ్యూజిక్ అకాడమీలు శ్రీకారం చుట్టాయి. ‘బిగ్‌స్టార్ ఐఎంఎ అవార్డ్స్’ పేరిట దేశవ్యాప్తంగా గల గాయనీ గాయకుల టాలెంట్‌కు పదునుపెట్టే ఈ కార్యక్రమం స్టార్‌వన్‌లో ప్రసారం అవుతుంది. హిందూస్థానీ, కర్నాటక సంగీతంతో సహా జానపదం, గజల్స్, సూఫీ, ఖవాలీవంటి వివిధ సంగీత రూపాలతో సింగర్స్ అలరించనున్నారు. ఈ అవార్డుల కోసం ఇప్పటికే తమకు మూడు వేల ఎంట్రీలు అందినట్లు స్టార్‌ఇండియా సిఓఓ సంజయ్‌గుప్తా తెలిపారు. ఇలాంటి అవార్డుల కార్యక్రమాన్ని చేపట్టడం ఇదే మొదటిసారని అన్నారు. ప్రతిభావంతులైన యువ గాయనీ గాయకులు ఈ అవకాశాన్ని వినియోగించుకుంటారని ఆయన చెప్పారు.

Source: medianx.tv

ఝలక్ దిఖ్‌లా జా....

బిబిసి ఛానెల్‌లో ఎంతో పాపులర్ అయిన ‘స్ట్రిక్ట్‌లీ కమ్ డాన్సింగ్’ అనే ప్రోగ్రామ్ 2006లో సోనీ ఛానెల్‌లో ‘ఝలక్ దిఖ్‌లా జా’ గా ప్రత్యక్షమయింది. ఒక సెలబ్రిటీకి ఒక ప్రొఫెషనల్ కోరియోగ్రాఫర్‌ను జత ఇచ్చి... ఇలా ఎనిమిది జోడీలు తయారు చేసి వారి మధ్యన డాన్స్ పోటీ పెట్టడం ఈ షో ఫార్మాట్. విదేశాలలో ఈ షో నిర్వహించే తీరు వేరు. అక్కడ లైవ్ మ్యూజిక్ కి జోడీలు వివిధ డాన్స్ రీతులు ప్రదర్శిస్తారు. మన దేశంలో ఈ షో ఫార్మాట్ కొంచెం మార్చి బాలీవుడ్ రంగుని అద్దారు. హిందీ సినిమాల్లో పాపులర్ పాటలకు హోరెత్తించే స్టెప్పులతో చేసే ఈ డ్యాన్సులకి ప్రేక్షకులు కిర్రెక్కిపోయారు. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన ఈ షో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నాలుగేళ్లలో ‘సూపర్ హిట్ షో’ స్టేటస్‌ను తెచ్చుకుంది.

డైలీ సీరియల్స్ రూపంలో తమ ముందుకు వచ్చే టీవీ స్టార్లను సరికొత్త అవతారాలలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. వారిలోని ఈ కొత్తకోణం ప్రేక్షకులను బాగా అలరించింది. షో మొదలైన నాటి నుంచే మంచి టిఆర్‌పి రేటింగుని సంపాదించుకుంది. దానికి తోడు జడ్జీలుగా బాలీవుడ్ తారలు... వారి కామెంట్లతో షోని ఎంతగానో రక్తికట్టించారు. వారం వారం ఒక టీమ్‌ని తొలగించటంలో ప్రేక్షకులు తమవంతు పాత్రను పెద్ద ఎత్తున పోషించారు. ఎస్సెమ్మెస్‌లు పంపి వారికి సహకరించారు. దీంతో షో రేటింగ్స్ మరింత భారీగా పెరిగాయి.


ఇప్పటికి మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకున్న ఈ షో పోయిన ఏడాది డిసెంబర్ నెలలో కొత్త హంగులను సంతరించుకొని నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది. వస్తూ వస్తూ ఒకప్పుడు భారతదేశపు సినీ ప్రేక్షకులని తన అందంతో, నటనతో, డాన్సులతో ఊపు ఊపిన మాధురి దీక్షిత్‌ను జడ్జి రూపంలో తీసుకువచ్చింది. అమెరికాలో సెటిల్ అయిన కారణంగా కొంత కాలంగా తెరమరుగైపోయిన కలల రాణి మాధురిని వారం వారం చూడటానికి... ఆమె జడ్జిమెంట్‌ని వినటానికి ప్రేక్షకులు ప్రతి వారం టీవీ సెట్ల ముందుకు చేరుకోవటం మొదలుపెట్టారు. నవ్వితే నవ వసంతాన్ని చిందించే మాధురి రాకతో ఈ షో లెవల్ మరింతగా పెరిగిపోయింది. ఆమెకు తోడు మున్నీగా బద్నాం అయిన మలైకా అరోరా మరో సెలబ్రిటీ జడ్జి అవటంతో షోకి మరింత గ్లామర్ పెరిగి ప్రేక్షకుల టెంపరేచర్లు పెంచేసింది. మూడో జడ్జ్‌గా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఒక షోకి మొదటి సీజన్ విజేత, పాపులర్ నటి మోనాసింగ్‌తో పాటు సుమీత్ రాఘవన్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.


ప్రముఖ గాయనీగాయకులు, రియాల్టీ షో విజేతలు, టెలివిజన్ స్టార్లు, స్పోర్ట్స్‌మెన్ ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని షోని మరింత రక్తి కట్టిస్తున్నారు. సోనీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఛానెల్‌లో ప్రతి సోమ, మంగళ వారాలలో రాత్రి తొమ్మిది గంటలకు ఈ షోని మీరు చూసి ఆనందించవచ్చు.

Source: www.sakshi.com

Thursday, March 3, 2011

బుల్లితెరపై మాట్లాటలు

హిందీలో కాఫీ విత్ కరణ్ బహుళ జనాదరణ పొందిన మాట్లాట (టాక్ షో). అదే మూసలో జీ టివి కొంతకాలం క్రితం లక్ష్మీ ప్రసన్నతో ఓ మాట్లాటను ప్రారంభించింది. తెలుగు నాట పుట్టి పెరిగినందుకూ, డైలాగ్ కింగ్‌గా ప్రసిద్ధికెక్కిన నటుడు మోహన్ బాబు కుమార్తె అయినందుకూ- తగిన విధంగా చక్కని తెలుగు మాట్లాడుతోందామె. చాలా కాలం అమెరికాలో ఉండి, అక్కడి మీడియాతో అనుబంధం పెంచు కోవడంవల్లనేమో- అమె యాస అల్లూరి సీతారామరాజు చిత్రంలో రూథర్‌ఫర్డ్‌ని స్ఫురింపజేస్తుంది. అయినా జగదేకవీరుడు, శ్రీకృష్ణార్జున యుద్ధము వంటి జానపద, పౌరాణిక చిత్రాల్లో బి సరోజాదేవి మాటల్లా ముద్దుగా అనిపించడం విశేషం. కానీ ఒకోసారి వేషధారణలో అమె తెలుగు పిల్ల అని ఏమాత్రం అనిపించదు. మేకప్‌లో పాశ్చాత్య ధోరణులను అనుకరించడం నుంచి కనీసం బుల్లితెరకైనా విముక్తి కలిగించడం అవసరం. ఐతే ఆమె మాటలో తీరులో సహజత్వం, సౌలభ్యం ఆ కార్యక్రమాన్ని రక్తి కట్టిస్తూ ఆకర్షణీయం చేశాయి. ఇప్పుడామె ఈటివిలో ప్రేమతో మీ లక్ష్మీ పేరిట కొత్తగా ప్రారంభించిన మాట్లాట దానికి కొనసాగింపు అనిపిస్తుంది. పెద్దగా ప్రయోజనం లేకపోయినా- పేరు పడిన సాంఘిక, రాజకీయ, సినీ ప్రముఖులతో నడిచే ఈ కార్యక్రమం కాలక్షేపానికి బాగానే ఉంది.  ఇటీవల చంద్రబాబు నాయుడుతో మాట్లాట ఐతే సత్కాలక్షేపం అని కూడా అనిపించింది. మిగతావి కాసేపు ఫరవాలేదు కానీ పూర్తిగా చూడ్డానికి విసుగనిపించింది.

ఇలాంటిదే చాలాకాలంగా మాటివిలో జయప్రదం పేరిట ప్రముఖ సినీతార జయప్రద నిర్వహణలో వస్తోంది. అక్కినేని. జయసుధ, దాసరి వంటి సినీ ప్రముఖులతో ముచ్చట్లు అభిమానుల్ని సంతృప్తి పరుస్తాయి. జయప్రద వేసే ప్రశ్నలు- లబ్దప్రతిష్ఠులైన ఆయా ప్రముఖుల గొప్పతనాన్ని తెలుసుకుందుకు మినహా- ఆసక్తికరమైన విశేషాలు బయటపడడానికి సహకరించవు. ఆమె తీరు, మందహాసం నటిస్తున్నట్లే తప్ప మాట్లాటలా అనిపించవు. అందం ఆమెకు దేవుడిచ్చిన గొప్ప వరం. ఇప్పటికీ ఆమెది అప్పటి అందమే! ఆ అందాన్ని వేషధారణ దారుణంగా హరించిందని స్వాభిప్రాయం. మేకప్ తగ్గించినా, అసలు లేకపోయినా ఆమె మరింత హుందాగానూ, అందంగానూ అగుపిస్తుందని కూడా మాకు అనిపించింది. వస్తువు అనాసక్తికరం కావడంవల్ల- ఈ కార్యక్రమం కాసేపు చూసేక విసుగనిపిస్తుంది. నిర్వాహకులీ విషయమై ష్రద్ధ వహించాలి.

ప్రముఖులని పొగడ్తలతో ముంచెత్తే ప్రక్రియగా కాక- మాట్లాటలు సరికొత్త విశేషాల్ని బయటపెడుతూ, చర్చావేదికలంత ఆసక్తికరంగా మారి కాలక్షేపంతోపాటు ప్రయోజనాన్నీ ఇస్తాయని ఆశిద్దాం.

ఈ సందర్భంలో ఎబిఎన్ ఆంధ్రజ్యోతి ఛానెల్లో వస్తున్న ఓపెన్ హార్ట్ విత్ ఆర్కె మాట్లాటలో ఆర్కె తీరు కొంతవరకూ ఆదర్శప్రాయం అని చెప్పాలి. ఎటొచ్చీ ఈ ఫిబ్రవరి 27న ప్రకాష్‌రాజ్‌తో ముఖాముఖీ మాత్రం కొంత నిరాశ కలిగించింది. మనసు విప్పి మాట్లాడాల్సిన ఈ కార్యక్రమంలో ప్రకాష్‌రాజ్ మెదడుకే తప్ప మనసుకు పని చెప్పకపోవడం అందుకు కారణం.

Source: aksharajalam.wordpress.com