Thursday, September 2, 2010

న్యూస్ చానల్స్ మార్కెట్ వాటా

(  ఆగస్టు 22 నుండి 28 వరకు  )
నెం.         చానల్ 33వ వారం  34వ వారం  35వ వారం
1 టీవీ 9 3.95 4.18 4.06
2 ఎన్ టీవీ 1.41 1.31 1.54
3 టీవీ5 1.8 1.69 1.47
4 ఈటీవీ2 1.12 1.23 1.3
5 సాక్షి టీవీ 1.34 1.19 1.22
6 జీ 24 గంటలు 0.98 1.02 1.12
7 హెచ్ ఎమ్ టీవీ 0.83 0.76 0.97
8 ఎబిఎన్ ఆంధ్రజ్యోతి 1.03 1.02 0.96
9 మహా టీవీ 0.61 0.58 0.65
10 రాజ్ న్యూస్ 0.6 0.62 0.61
11 స్టుడియో ఎన్ 0.7 0.61 0.6
12 ఐ న్యూస్ 0.48 0.54 0.58
13 జెమిని న్యూస్ 0.21 0.13 0.27

ఎప్పటిలాగే టీవీ9 మొదటి స్థానంలో ఉండగా, ఈ సారి ఎన్ టీవీ రెండో స్థానానికి ఎగబాకింది. అయినప్పటికీ మొదటి చానల్ లో రెండోది సగం కూడా లేకపోవటం టీవీ9 తిరుగులేని ఆధిక్యాన్ని చాటుతోంది. వరుసగా మూడు వారాల మార్కెట్ వాటా గమనిస్తే టీవీ 5 తగ్గుతున్నట్టు, ఈటీవీ2 కొంతమేర పుంజుకుంటున్నట్టు అర్థమవుతుంది. అదేవిధంగా జీ 24 గంటలు పెరగటం, ఎబిఎన్ ఆంధ్రజ్యోతి తగ్గటం కనిపిస్తుంది.  రాజ్ న్యూస్ స్థిరంగా ఉండగా, స్టుడియో ఎన్ కొంత తగ్గింది. నెల రోజుల కిందటి దాకా బాగా తగ్గుతూ వచ్చిన ఐ న్యూస్ ఇప్పుడు యాజమాన్యం మారాక మళ్ళీ పుంజుకుంటున్నట్టు స్పష్టమవుతోంది.

Source: bhavanarayana.co.tv

No comments:

Post a Comment