సంగీతానికి ఎల్లలు లేవు. మృదుమధురంగా వినసొంపుగా ఉండే సంగీతానికి సంగీతప్రియులు తన్మయత్వం చెందుతారు. పని ఒత్తిడితో సతమతమయ్యే వారికి కాసింత ఉపశమనం కలిగించేదే సంగీతం. నిత్యజీవితంలో ప్రతి ఒక్కరూ ఏదో ఒక సమయంలో సంగీతాన్ని ఆస్వాదిస్తారు. ఉదయం లేస్తూనే సుప్రభాతం వినేవారు ఒకరైతే విధి నిర్వహణలో మరొకరు తమకు ఇష్టమైన సంగీతాన్ని వింటుంటారు. అలాంటి శ్రావ్యమైన సంగీతాన్ని సంగీతప్రియులకు అందించేందుకు గాయకులు పడే కష్టం అంతా ఇంతా కాదు. ప్రతిఒక్కరి హృదయాల్లో చిరస్థాయిగా నిలిచే పాటలను అందించేందుకు ఈనాటి గాయకులు పోటీపడుతున్నారు. అలాంటి ప్రతిభావంతులను తెరపైకి తీసుకువచ్చేందు సాయిబాబా టెలిఫిల్మ్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ ‘సంగీత మహాయుద్ధం’ పేరుతో వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది...
రియాల్టీషోలకు బుల్లితెర ప్రేక్షకులు పెద్దపీట వేస్తున్నారు. మనసుకు నచ్చిన కార్యక్రమాలను వీక్షించేందుకు ఉత్సా హం చూపుతున్నారు. ఈతరుణంలో టెలివిజన్ ప్రొడక్షన్ కంపెనీ సాయిబాబా టెలిఫిల్మ్ ప్రైవేట్ లిమిటెడ్ భారతదేశ అతిపెద్ద సంగీత రియాలిటీ షో ‘సంగీత మహాయుద్ధం’ను ఆరంభించింది. ఈ కార్యక్రమం ఆంధ్రప్రదేశ్ అగ్రగామి ఛానల్ జెమినీ టీవీలో ఈనెల 26వ తేదీ నుంచి ప్రతి శని, ఆదివారాల్లో రాత్రి 9.30 నుంచి 10.30గంటల వరకు ప్రసారం కానుంది. ఆరుగురు ప్రఖ్యాత సంగీత దర్శకులు, గాయకులు అయిన రఘు కుంచె, హేమచంద్ర, వేణుగో పాల్, గీతామాధురి, మాళవిక, నీహాళికలను సాయిబాబా టెలిఫిలింస్ ఒకే వేదిక పైకి చేర్చింది.
ఈ ఆరుగురూ దక్షిణ భారతదేశ సంగీత రియాలిటీ టెలివిజన్ చర్రిలోనే ప్రప్రథమంగా ఒకే వేదికపై ఒక్కొక్కరు ఒక్కో యువబృందానికి నాయ కత్వం వహిస్తూ ఆధిపత్యం కోసం పోటీపడనున్నారు. ప్రముఖ యాంకర్, నటి ఉదయభాను ఈ కార్యక్రమాన్ని హోస్ట్ చేయనున్నారు. మ్యూజిక్ రియాలిటీ షోలలో ఓ నూతన ఫార్మాట్‌ను తీసుకురావడమే ఈ ‘సంగీత మహాయుద్ధం’ లక్ష్యం. నగరస్థాయి ఆడియన్స్ నుంచి ఫైనల్స్ వరకు వీక్షకులు అలా సంగీత మహాయుద్ధంతోపాటు పయనిస్తుంటారు. రియాలిటీ టీవీ అంటే ‘అంతా ఇంతకు ముం దు చూసిందేగా ’ అనే భావన నుంచి ‘అంతా కొత్తగా ఉంది’ అనే భావనను ఈ సంగీత మహాయుద్ధం కల్పిం చనుంది. హైదరాబా ద్‌లో జరిగే మెగా ఆడిషన్స్‌లో 18మంది ఫైనలిస్టుల ఎంపిక జరుగుతుంది. రఘు కుంచె, హేమచంద్ర, వేణుగోపాల్, గీతామాధురి, మాళవిక, నీహాళి కలు నేతృత్వం వహించే బృందాల్లో వీరు సభ్యులుగా ఉంటారు. ఉద్వేగభరితమైన ఫార్మాట్‌లో రియాలిటీ టెలి విజన్ రంగంలో సంగీత మహాయుద్ధానికి రంగం సిద్ధమైంది.
షోలో ఆరు ప్రత్యేక బృందాలు...
సంగీత మహాయుద్ధంలో ఆరు బృందాలు ఉన్నాయి. నిజాం నవాబ్స్‌కు నిహాల్, కాకతీయ కింగ్స్‌కు హేమచంద్ర, చాళుక్య ఛాలెంజర్స్‌కు వేణుగోపాల్, పల్లవ ఫైటర్స్‌కు గీతామాధురి, విజయనగర వారియర్స్‌కు మాళవిక, శాతవాహన సోల ్జర్స్‌కు రఘు కుంచెలు నేతృత్వం వహిస్తారు. సంగీత మహాయుద్ధం కార్యక్రమం మొత్తం 14 వారాల పాటు సాగుతుంది. ప్రతివారం కూడా గెలుపుకోసం ఇద్దరు కెప్టెన్లు అత్యధిక స్కోర్ సాధించేందుకు పోటీ పడాల్సి ఉంటుంది. వాటిలో పాల్గొనని మిగిలిన కెప్టెన్లు ఆయా గాయకుల పనితీరును సమీక్షిస్తారు. ఇందులో జుగల్బందీ, సోలో, మెలోడీ అని మొత్తం మూడు రౌండ్లు ఉంటాయి. ప్రతి పోటీలోనూ ఈ మూడు రౌండ్లకు జడ్జీలు మార్కులు వేస్తారు. సాయిబాబా టెలిఫిల్మ్స్ గురించి...
భారతదేశంలో అగ్రగామి ప్రొడక్షన్ హౌస్‌లలో ఒకటి సాయిబాబా టెలిఫిల్మ్స్ ప్రైవే ట్‌లిమిటెడ్. నూతన తరం ప్రతిభను, విశిష్ట కంటెంట్‌ను అందిం చే ఉద్దేశ్యంతో దీనిని ఓ పెద్ద సంస్థగా తీర్చిదిద్దాలన్న లక్ష్యంతో భారతీయ ప్రతిభను ప్రపంచానికి చాటి చెప్పాలన్న ఆశయంలో 2006 నవంబర్‌లో గజేంద్రసింగ్ దీనిని ప్రారంభించారు. సంగీ త రియాలిటీషోలలో సాయిబాబా టెలి ఫిల్మ్స్ ఓ ట్రెండ్‌సెట్టర్‌గా నిలిచింది. వినో దప్రపంచంలో అగ్రగామిగా నిలుస్తోం ది. కామెడీ రంగంలో కూడా సాయిబా బా సంస్థ ‘లాఫర్ ఎక్స్‌ప్రెస్’, గృహల క్ష్మి, డాన్స్ సంగ్రామ్ (మహువా), లుగా లుగీ (ఈటీవీ బంగ్లా) లాంటి కార్య క్రమాలను రూపొందించింది. సంగీతం పట్ల ప్రేమాభిమానాలతో సాయిబాబా టెలిఫిల్మ్స్ తన సొంత మ్యూజిక్ అకాడమీ సరిగమపదనిస ఏర్పాటుకు నాంది పలికింది. 2007 ఆగస్టు 21న ఇది రూపుదిద్దుకుంది. గజేంద్రసింగ్ కలలుగన్న ఈ అకాడమీ చిన్నారుల ప్రతిభను వెలికితీసేందుకు వేదికగా నిలుస్తుంది.
ఎంతో ఎంజాయ్ చేశాం...- గీతామాధురి (పల్లవ ఫైటర్స్)
సంగీత మహాయుద్ధం షూటింగ్ సమయంలో ఎంతో ఎంజాయ్ చేశాం. ఇది చాలా గ్రేట్ ఫన్‌గా ఉంటుంది. గాయకుల మధ్య ఎన్నో ఎమోషన్స్‌ను ఇందులో చూడవచ్చు. రెగ్యులర్‌గా చూసే క్రియేటివ్ డ్రామాలా కాకుండా రకరకాల భావోద్వేగాలు ఉంటాయి.ఇది సమాన స్థాయి...స్టామినా కలిగిన సింగర్స్ మధ్య జరిగే రసవత్తర సమరం. అంతర్జాతీయ స్థాయిలో ఎంతో గుర్తింపు లభిస్తుంది.
ఇది రెగ్యులర్‌గా చూసే క్రియేటివ్ డ్రామా కాదు. తెలుగు బుల్లితెర ప్రేక్షకులకు వడ్డించిన విస్తరిలా ఉంటుంది. క్రికెట్‌లో ఎన్నో లీగ్ మ్యాచ్‌లను చూస్తుంటాం. అలాగే సంగీతంలో మ్యూజికల్ టోర్నమెంట్‌లా దీనిని తీర్చిదిద్దారు. ప్రతి ఎపిసోడ్ కూడా ఎంతో ఉత్కంఠతను కలిగిస్తుంది.
సంగీత ప్రియులకు కొత్త వినోదం- వేణుగోపాల్ (చాళుక్య ఛాలెంజర్స్)
బుల్లితెరలో ప్రసారమవుతున్న రియాల్టీషోలలో ఇది కొత్త వినోదాన్ని అందిస్తుంది. ఇంతవరకు గాయకులతో ఎన్నో కార్యక్రమాలు రూపుదిద్దుకున్నా వాటికంటే భిన్నంగా ఈ సంగీత మహాయుద్ధాన్ని కుటుంబసభ్యులతో అందరూ చూడవచ్చు. ఎలాంటి అసభ్యతలకూ తావివ్వని ప్రోగ్రాం.
సంప్రదాయ సమ్మేళనం... - రాజీవ్ ఛటర్జీ (సాయిబాబా టెలిఫిల్మ్స్ సిఈఓ)
భారతదేశంలో అపారంగా ఉన్న సంగీత ప్రతిభావంతుల గురించి అవగాహన పెంపొందించడమే మా లక్ష్యం. ఆంధ్రప్రదేశ్ మొదటినుంచి వినోదపరిశ్రమకు అవసరమైన ప్రతిభావంతులను అపారంగా కలిగి ఉంది. ఈ విషయం ఇప్పటికే తేటతెల్లమైంది. ఇప్పుడు ఆరంభించబోయే సంగీత మహాయుద్ధం అటు సంప్రదాయం, ఇటు ఆధునికతల విశిష్ట సమ్మేళనంగా ఉంటుంది. తెలుగు సినీ పరిశ్రమకు అత్యంత శక్తి సామర్ధ్యాలు కలిగిన సంగీత దర్శకులు, గాయకులతో కలిసి పనిచేయడం ఎంతో ఆనందాన్ని ఇచ్చింది. రియాలిటీ షోల స్థాయిని మరింత ఉన్నతస్థాయికి చేర్చేలా ఆరుగురు ప్రముఖుల మార్గదర్శకత్వంలో నడుచుకునే యువ సంగీత ప్రతిభావంతులను వెలికితీయడం ఎంతో సంతోషాన్ని ఇచ్చింది.
టాలీవుడ్‌లో డిఫరెంట్ షో... - హేమచంద్ర (కాకతీయ కింగ్స్)
నా కెరీర్ సాయిబాబా రియాలిటీ షోతోనే స్టార్ట్ అయింది. డిఫరెంట్ ఫార్మాట్‌తో ఇది షూట్ చేశారు. టాలీవుడ్‌లో ఇంతవరకు వచ్చిన వాటికంటే ఇది డిఫరెంట్‌గా కనిపిస్తుంది. ఈ షో బుల్లితెర ప్రేక్షకులను తప్పక ఆకట్టుకుంటుందని నమ్ముతున్నా.
చాలా కొత్తగా ఉంటుంది...- మాళవిక (విజయనగర వారియర్స్)
ఈ ప్రోగ్రామ్‌ను టెలివిజన్ ప్రేక్షకులు తప్పకుండా ఆదరిస్తారన్న నమ్మకం ఉంది. గజేంద్రసింగ్ నేతృత్వంలో పనిచేయడం ఎంతో ఆనందంగా ఉంది. ఇప్పటివరకు వచ్చిన కార్యక్రమాలకన్నా దీనిని సరికొత్తగా చిత్రీకరించారు. ఇది తప్పక ప్రేక్షకులను అలరిస్తుంది.
బుల్లితెరలో టాప్‌మోస్ట్...- నిహాల్ (నిజాం నవాబ్స్)
సంగీత మహాయుద్ధం బుల్లితెర ప్రపంచంలో టాప్‌మోస్ట్‌గా నిలుస్తుంది. నభూతో నభవిష్యత్ అన్న చందంగా ఉంటుంది. నిజమైన సంగీత మహాయుద్ధంలో స్వరయోధులుగా నిలుస్తామన్న నమ్మకంతో ఉన్నాం. నిజానికి మేమెంతో ఉత్సాహంగా ఉన్నాం. ఇటువంటి పోటీలు ఎంతో ఇంట్రెస్టింగ్‌గా ఉంటాయి.
- ఇస్కా రాజేష్‌బాబు
‘సూర్య’ స్టేట్‌బ్యూరో, ఫొటోలు: మహ్మద్ రఫి
Source: www.suryaa.com
No comments:
Post a Comment