జనాలకు మీడియా మీద నమ్మకం పోవడానికి ప్రధాన కారణం--వార్తకు, వ్యాఖ్యకు మధ్య ఉన్న రేఖను జర్నలిస్టులు తుడిచిపారెయ్యడమే. ఆ పని చేస్తున్నది జర్నలిస్టులు అనడం కన్నా పత్రికలు/ఛానెల్స్ యాజమాన్యాలు చేయిస్తున్నాయని అనడం మంచిది. అలా చేయకూడదని యాజమాన్యాలకు చెప్పే దమ్మున్న జర్నలిస్టులు కరువయ్యారు. వార్తల ముసుగులో వ్యాఖ్యలు చొప్పించి తమ భావాలకు లేదా అజెండాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలనుకోవడం ఒక క్రిమినల్ నేరం.
'సాక్షి' పేపర్ లేదా ఛానల్ లో ఇలా వార్తకు, వ్యాఖ్యకు తేడా లేకుండా రొడ్డ కొట్టుడు కొడితే జనం పెద్దగా పట్టించుకోరు-అది కాంగ్రెస్ ఎంపీ సంస్థ కాబట్టి. 'మీడియా-ఆత్మశోధన' అంటూ సొల్లు కబుర్లు చెప్పే వేమూరి రాధాకృష్ణ, ఆయన ఎంచుకున్న జర్నలిస్టుల బృందం డేరింగ్ జర్నలిజం అనుకుని...వ్యాఖ్యకు, వార్తకు తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నది. 'సాక్షి' వాళ్ళ మాదిరిగా తెర మీద నారా చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఈ పనిచేస్తే ఇబ్బంది వుండదు కానీ....శ్రీ రంగ నీతులు చెబుతూ...ఇలాంటి తిక్కల పనులు చేయడం సమజసం కాదు.
శుక్రవారం రాత్రి ఒక రెండు గంటల పాటు ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ చూసిన ఎవ్వరికైనా వేమూరి టీం ఎంత రాజకీయ దిగజారుడు జర్నలిజానికి పాల్పడుతున్నదో అర్థమై వుంటుంది. ఒకవేళ...రాజకీయ పరిణామాలపై వ్యాఖ్య ఇవ్వదలిస్తే...'ఓనర్ కామెంట్' అనో 'ఎడిటర్ కామెంట్' అనో లోగో వేసుకుని నోటికొచ్చింది చెప్పుకోవచ్చు...రాజకీయ తీట తీర్చుకోవచ్చు. కానీ వార్తల ముసుగులో జనాలను మోసం చేయడం పధ్ధతి కాదు.
ముందుగా 'మా నాన్న గాంధీ' అనే పేరు మీద ఒక ప్రోగ్రాం ప్రసారం చేసింది ఈ ఛానల్. తన తండ్రిని జాతిపితతో జగన్ పోల్చడాన్ని తూర్పారపడుతూ చేసిన కార్యక్రమం అది. అంతవరకూ పర్వాలేదు. మరీ పెద్దగా కామెంట్స్ చేయకుండా....పలువురు పార్టీ నేతల అభిప్రాయాలతో దాన్ని వండి వార్చారు. పిత్రోత్సాహంతో...జగన్ అదుపుతప్పి చేసిన పిచ్చి కామెంట్ పై సహేతుకమైన కథనమే అది. అందులో కూడా రిపోర్టర్ ఆత్మ కొన్ని వాక్యాలలో ప్రస్ఫుటం.
దాని తర్వాత వార్తలలో...జగన్ కు కాంగ్రెస్ కు మధ్య పంచాయితీని రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో జగన్ పార్టీ పెట్టుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నారని కూడా తీర్మానించారు...వార్తల్లో. ఇదే మాట చెప్పదలిస్తే...'వార్త వ్యాఖ్య' అనే శీర్షికతో ఒక కార్యక్రమంలో చెప్పుకోవచ్చు గానీ....వార్తలలో విపరీతమైన కామెంట్స్ చేయడమేమిటి?
పలు రాజకీయ కామెంట్స్ ను న్యూస్ రీడర్ చదువుతూ పోవడం ఎబ్బెట్టుగా వుంది. ఇది సంసారపక్షపు జర్నలిజం కాదు...దీన్ని 'అజెండా జర్నలిజం' అంటారు. జగన్ యాత్ర ముగిసే లోపు ఈ దుర్లక్షణం ముదురు పాకాన పడే అవకాశం వుంది. అయ్యా...వేమూరి గారూ...మీరు వ్యాఖ్యలు చేయదలుచుకుంటే....వార్తలతో కలిపి దంచిపారెయ్యకండి. ఆ Mahaa-news వెంకట్రావు గారి లాగా పెద్ద మనిషి తరహాలో కొంత సమయం మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కేటాయించండి. అంతే గానీ....జనం గొర్రెలని భావించి...జర్నలిజాన్ని మరింత బ్రష్టు పట్టించకండి. ప్లీస్...మీడియా ఆత్మశోధన సంగతి తర్వాత....ముందు మీరు అర్జెంటుగా ఆత్మశోధన
Source: apmediakaburlu.blogspot.com
No comments:
Post a Comment