నిన్న రాత్రి నుంచి మూడు ప్రధాన ఛానెల్స్--సాక్షి, i-news, HM-టీవీ-- ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ ఛానెల్స్ ట్యూన్ చేస్తే...నల్లని తెర మాత్రమే కనిపిస్తున్నది. ఉపగ్రహ సాంకేతిక సమస్య వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఒక సీనియర్ జర్నలిస్టు తెలిపారు.
TV-9, TV-5 ఛానెల్స్ లో కూడా స్పష్టత లోపించింది. ఏవో రంగుల చారలు అడ్డదిడ్డంగా వస్తున్నాయి. ఇలా కొన్ని ప్రాంతాలో వస్తున్నదా? అన్నిచోట్లా ఇదే పరిస్థితా? అన్నది తెలియరావడం లేదు. TV-9 లో గత కొన్ని రోజులుగా క్లారిటీ లోపిస్తే...పిచ్చి రేసులో పడి ఎవరైనా కావాలనే ప్రసారాలు అంతరాయం కలిగిస్తున్నదేమో అని నాకు అనుమానం వచ్చింది.
అయితే...అధిష్టానం హెచ్చరికలు తోసిరాజని వై.ఎస్.జగన్ యాత్ర ఆరంభించిన రోజే ఛానల్ ప్రసారాలు లేకపోవడంతో 'సాక్షి' యాజమాన్యం కలత చెంది వేగంగా స్పందించింది. కావాలనే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి ప్రసారాలు నిలిపివేసిందని, ఇది దారుణమని 'సాక్షి' ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. వారి అనుమానం నిజమో కాదో మనకు తెలియదు.
అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్న సమయంలో ఛానల్ లేకపోవడం భరించలేని జగన్ బృందం...సహచర కాంగ్రెస్ వాది, N-TV ఓనర్ నరేంద్ర చౌదరిని సంప్రదించింది. ఆయన పెరటి ఛానల్ గా నడుపుతున్న 'వనిత' ఛానల్ లో 'సాక్షి' ప్రసారాలు కొనసాగిస్తున్నారు. మామూలుగా ఛానెల్ వుంటే...అపుడుప్పుడు జగన్ ప్రోగ్రాం చూపే 'సాక్షి' వారు ఇప్పుడు 'వనిత'లో రెచ్చిపోయి లైవ్ ఇస్తున్నారు. 'వనిత' లోగో కింద 'courtesy to Saakshi channel' అని వేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఈ సాంకేతిక సమస్య పరిష్కారం కావచ్చని భావిస్తున్నారు.
Source: apmediakaburlu.blogspot.com
No comments:
Post a Comment