Thursday, July 9, 2015

రామోజీ గ్రూపు నుంచి 4 తెలుగు ఛానెళ్లు: ఆగస్టు 27న ప్రారంభం

రామోజీ రావు గ్రూపు నుంచి నాలుగు తెలుగు ఛానెళ్లు ప్రేక్షకులను రంజింపచేయనున్నాయి. ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో దూసుకుపోతున్న రామోజీ గ్రూపు ఈ టీవీ 20వ వార్షికోత్సవాల సందర్భంగా నాలుగు ఛానళ్లను ప్రారంభించనున్నారు. ఈటీవీ లైఫ్, ఈటీవీ సినిమా, ఈటీవీ ప్లస్, ఈటీవీ అభిరుచి పేరుతో రానున్న ఛానళ్లు తెలుగు ప్రేక్షకులను అలరించనున్నాయి.
 
యువతరాన్ని ఆకట్టుకునే ఈటీవీ ప్లస్, ఫ్యామిలీ ఓరియెంటెడ్‌గా ఈ టీవీ లైఫ్ ఉంటాయి. ఈటీవీ ప్లస్ కామెడీకి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుండగా, ఈటీవీ లైఫ్ ఆరోగ్యం, యోగా, ఆయుర్వేదం లాంటి సుఖీభవ తరహా కార్యక్రమాలు ఉంటాయి. ఈటీవీ అభిరుచి విషయానికి వస్తే... ఇది పూర్తిగా వంటా వార్పుల ఛానల్. ఇక ఈటీవీ సినిమా ఛానల్ పూర్తి స్థాయి సినిమా ఛానల్. ఆగస్ట్ 27న ప్రారంభమయ్యే ఈ నాలుగు ఛానళ్లు తెలుగు ప్రేక్షకులను రంజింపజేస్తాయని రామోజీ గ్రూపు అధికారులు తెలిపారు. 
 
ఇకపోతే.. 1995 ఆగస్ట్ 27వ తేదీన ఈటీవీ ప్రసారాలను ప్రారంభించిన రామోజీ గ్రూపు ప్రారంభించిన రామోజీ రావు ఎలక్ట్రానిక్ మీడియా రంగంలో రాణిస్తోంది. అనేక వినోద, వార్త ఛానల్స్‌తో జాతీయ స్థాయిలోని గొప్ప నెట్ వర్క్‌లలో రామోజీ గ్రూపు కూడా ఒకటని చెప్పేవిధంగా ఎదిగింది.
 
Source: http://telugu.webdunia.com