Friday, October 29, 2010

బుల్లితెర భలేగుందట

 Source: telugu.greatandhra.com

పోలీసు కేసులతో ఎన్టీవీ ఉక్కిరి బిక్కిరి

హైదరాబాద్, అక్టోబర్ 27: తెలుగు న్యూస్ చానల్ ఎన్‌టివి వరుస వివాదాల్లో చిక్కుకుంటోంది. పోలీసు కేసులు ఎదుర్కొనేందుకు ఆ చానల్ యాజమాన్యం నానా అవస్ధలు పడుతోంది. ఇటీవల విశాఖజిల్లాలో స్వామి స్వరూపానందేంద్ర సరస్వతిపై అభూత కల్పనలతో కధనాలు ప్రసారం చేశారన్న ఆరోపణలపై నమోదైన కేసులో ఇరుక్కున్న ఆ చానల్‌పై హైదరాబాద్ నగర పోలీసు కమీషనర్ మరో ఫిర్యాదును స్ధానిక నాంపల్లి కోర్టులో దాఖలు చేయడంతో ఆ చానల్ యాజమాన్యం ఉక్కిరిబిక్కిరి అవుతోంది. విశాఖ శారదా పీఠాధిపతి స్వామి స్వరూపానందేంద్ర సరస్వతి చేసిన ఫిర్యాదుపై ఇప్పటికే ఈ కేసులో పెందుర్తి పోలీసులు ఇద్దరు విలేఖరులను అరెస్టు చేశారు. ఈ కేసులో మిగిలిన నిందితులను అరెస్టు చేసేందుకు పెందుర్తి నుంచి ఇన్‌స్పెక్టర్ గోవిందరాజులు ఆధ్వర్యంలోని బృందం హైదరాబాద్ వచ్చింది. దీంతో చానల్ యాజమాన్యం కోర్టు నుంచి ముందస్తు బెయిల్ తీసుకునేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. హోంమంత్రి సబితా ఇంద్రారెడ్డి సమక్షంలో జరిగిన చర్చల్లో చానల్ చైర్మన్ నరేంద్ర చౌదరిని తప్ప మిగిలిన వారిని అరెస్టు చేయాలని హోంమంత్రి చెప్పినట్లు తెలిసింది. కాగా పెందుర్తి పోలీసులు నగరానికి వచ్చి ఎన్‌టివి యాజమాన్యాన్ని అరెస్టు చేసే విషయం స్ధానిక పోలీసులకు సమాచారం లేదని బంజారాహిల్స్ ఎసిపి రవీంద్రరెడ్డి తెలిపారు.
ఎన్‌టివి ‘మిర్చి మసాల’పై మరో కేసు
========================
ఎన్‌టివిలో రాత్రి 11.30 గంటల సమయంలో ప్రసారం చేస్తున్న మిర్చి మసాల కార్యక్రమంపై నగర పోలీసు కమీషనర్ ఎకె ఖాన్ బుధవారం నాంపల్లి కోర్టులో ఫిర్యాదు చేశారు. మిర్చి మసాల కార్యక్రమం ద్వారా అశ్లీల దృశ్యాలను ప్రసారం చేస్తూ యువతను చెడగొట్టే విధంగా వ్యవహరిస్తున్నట్లు భావించిన సిపి ఈ ఫిర్యాదును దాఖలు చేశారు. 1995 కేబుల్ టెలివిజన్ నియంత్రణ చట్టం కింద 17వ అదనపు చీఫ్ మెట్రోపాలిటిన్ మెజిస్ట్రేట్ కోర్టులో ఫిర్యాదు చేశారు. ఈ చట్టంలోని సెక్షన్ 18 కింద ఫిర్యాదు చేసేందుకు ఒక్క కమీషనర్‌కు మాత్రమే అధికారం ఉంది. ఎన్‌టివి చైర్మన్ నరేంద్ర చౌదరి, ఔట్‌పుట్ ఎడిటర్‌తో పాటు మొత్తం ఏడుగురిపై ఫిర్యాదు చేశారు. చట్టంలోని సెక్షన్ 5 కింద ప్రోగ్రామ్ కోడ్ ఉల్లంఘన కావడంతో కోర్టులో ఫిర్యాదు చేశారు. అశ్లీల ప్రసారాలను చేస్తున్న టివి చానల్స్‌పై పోలీసులు నియంత్రణ చేసేందుకు మానిటరింగ్ కమిటీని నియమించారు. ఆ కమిటీ ఇచ్చిన నివేదిక మేరకు కొన్ని అంశాలతో సిపి ఎకె ఖాన్ ఈ ఫిర్యాదును కోర్టులో దాఖలు చేశారు. దీనిపై ఏం చర్య తీసుకోవాలన్నది కోర్టు నిర్ణయం తీసుకుంటుంది.
కాగా టివిల్లో ప్రసారమయ్యే ఈ తరహా కార్యక్రమాలు సినిమాటోగ్రఫీ చట్టం కింద సెన్సార్ బోర్డుకు సంబంధం లేదని ఆయా వర్గాలు చెబుతున్నాయి. కేబుల్ నియంత్రణ చట్టం కింద రెండేళ్ళ జైలు శిక్ష, వెయ్యి రూపాయల జరిమానా విధించవచ్చు. ఒక వేళ రెండోసారి ఇదే నేరాన్ని చేస్తే శిక్షను ఐదేళ్ళకు పెంచి రూ.5 వేలు జరిమాన విధించే అవకాశం ఉందని పోలీసు వర్గాలు తెలిపాయి.

Source: www.andhrabhoomi.net

Thursday, October 28, 2010

Times TV Network set to launch Movies Now

MUMBAI: Times Television Network, the company which operates Times Now, ET Now and Bollywood entertainment channel Zoom, will soon launch an English movie channel, Movies Now.

Targeting the urban Indian audience, the channel will be launched in the high definition (HD) format.

Though the company has not announced the date of the launch, the new channel will be a part of Zoom Entertainment Network, the entertainment arm of Times Television Network.

Bennett Coleman & Company Limited (BCCL) MD Vineet Jain said, “Times Television Network brings yet another uniquely positioned TV channel to urban India, Movies Now. Movies Now will give its viewers a whole new experience with stunning pictures in 1080i and awesome 5.1 surround sound. Viewers will get to watch the best of ‘Hollywood in HD’ for the first time in India.” 

Source: www.indiantelevision.com

సరిగమప ‘నువ్వా-నేనా’

సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరిక ఔత్సాహిక గాయనీ గాయకులకు ఉంటుంది. వారి ఆశను తీర్చేందుకు జీ తెలుగు ‘సరిగమప’ రూపంలో ఒక సంగీత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత ఐదేళ్ళలో ఆరు విజయవంతమైన సిరీస్‌లతో ఎంతోమంది గాయనీ గాయకులను సంగీత ప్రవాహానికి పరిచయం చేసింది. ‘సరిగమప’ విభిన్న రీతిలో, వినూత్న పంథాలో గతంలో గెలిచిన విజేతలను ఛాలెంజర్స్ సవాలు చేస్తున్నారు. దీంతోపాటు మరెంతోమంది కొత్త గాయనీ గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నానికి ‘సరిగమప నువ్వా-నేనా’ అంటోంది. ఈ ఏడో సిరీస్‌లో రాష్టమ్రంతటా జరిపిన గళానే్వషణలో ఎన్నో సుమధుర స్వర కుసుమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నవయువ గళాలు గత విజేతలు, రన్నర్స్‌తో జతకట్టి యుగళ గీతాలను ఆలపించేందుకు సంసిద్ధమవుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, వరంగల్, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఆడిషన్స్‌కి సుమారు 3వేల మంది ఔత్సాహిక గాయనీ గాయకులు హాజరయ్యారు. శాస్ర్తియ సంగీతాన్ని అభ్యసించి యువ సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుండి ప్రతి బుధ, గురువారాల్లో రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.

Source: www.andhrabhoomi.net

ప్రేక్షకుల ముందుకొచ్చిన సెలబ్రిటీ ‘నాచోరే’

డాన్స్ రియాలిటీ షోలకు నాంది పలికిన జీ తెలుగు వినోదంలో తన విజయ పరంపరను కొనసాగిస్తూ కనీవినీ ఎరుగని రీతిలో ఇప్పుడు ఒక సెలబ్రిటీ డాన్స్ రియాలిటీ షోకి తెర తీసింది. ఐదు సిరీస్‌ల ‘ఆట’ విజయం తర్వాత డాన్స్ రియాలిటీ షోలను మరో మెట్టుపైకి తీసుకెళ్లే రీతిలో ‘నాచోరే’ మీ ముందుకు రానుంది. తెలుగు సినీ జగత్తులో అగ్ర హీరోలతో స్టెప్పులు వేసిన హీరోయిన్లు ‘నాచోరే’ వేదిక ద్వారా వీక్షకులను అలరించనున్నారు. ‘12 మంది రాణులు - ఒకటే కిరీటం’ అనే ట్యాగ్‌లైన్‌తో ముందుకొస్తోందీ కార్యక్రమం. ‘డాన్స్ రియాలిటీ షోలను తెలుగు ప్రేక్షకులకు పరిచయం చేసింది జీ తెలుగు ఛానెల్. డాన్స్ రియాలిటీ షోలకు ‘నాచోరే’ వినూత్న వొరవడిని సృష్టిస్తుందనటంలో సందేహం లేదంటోంది జీ తెలుగు. చిరంజీవి సరసన ‘శంకర్‌దాదా జిందాబాద్’ చిత్రంలో హీరోయిన్‌గా నటించి అలరించిన కరిష్మా కొటక్, జూ.ఎన్టీఆర్‌తో ‘ఆది’ చిత్రంలో స్టెప్పులేసి మాస్ ప్రేక్షకులను ఉర్రూతలూగించిన కీర్తిచావ్లా, ‘ఇట్లు శ్రావణి సుబ్రహ్మణ్యం’ చిత్రంతో పరిచయమై కుర్రకారుతో ఈలలేయించిన తనూరాయ్ సహా 12 మంది గ్లామరస్ హీరోయిన్లు ‘నాచోరే’లో కదం తొక్కనున్నారు. టాలీవుడ్‌లో హీరోయిన్‌గా అగ్ర హీరోల సరసన నటించి, అగ్ర హీరోయిన్‌గా పేరుగాంచిన రోజా, యువ హీరోలతో ‘రింగ రింగా...’ అంటూ స్టెప్పులు వేయించిన కొరియోగ్రాఫర్ నోబుల్ మాస్టర్ లు ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతలుగా వ్యవహరిస్తున్నారు. ‘నాచోరే’ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ నుండి ప్రతి సోమ, మంగళ వారాల్లో రాత్రి 9గంటలకు జీ తెలుగులో ప్రసారమవుతోంది.

Source: www.andhrabhoomi.net

మీ యొక్క ఇష్టమైన ఛానల్ కు ఓటు చెయ్యండి

ఈ బ్లాగుకు కుడి ప్రక్కన ఉన్న మీ యొక్క ఇష్టమైన చానల్స్(ఎంటర్-టైన్మెంట్, న్యూస్, మ్యూజిక్)కు ఓటు చెయ్యండి

Vote Your Best Channel On TeluguTelevisonMedia Blog

On Right Hand Side Of This Blog Best Channel Polls are There.
Vote Your Best Channels(Entertainment, News, Music).

న్యూస్ 9 పత్రిక కార్యాలయంపై దాడి



న్యూస్ 9 పత్రిక కార్యాలయంపై దాడి, టివి 9 సిబ్బంది పనే అంటున్న బాధితులు

Source: www.telugunewstoday.com

ఏలూరు యాక్ట్‌ టీవీ డిజిటల్‌ సేవలు

హైదరాబాద్‌ (వి.వి) : బెంగుళూరుకు చెందిన భారతదేశపు అగ్రస్థాయి మల్టీ-సర్వీస్‌ ఆపరేటర్‌ (ఎంఎస్‌ఒ) అయిన ఎట్రియా కన్వర్జన్స్‌ టెక్నాలజీస్‌ (యాక్ట్‌) ప్రైవేట్‌ లిమిటెడ్‌ ఏలూరు వాసులను అలరించేందుకు డిజిటల్‌ కేబుల్‌ సేవలతో సిద్ధమైంది. ఈ విషయాన్ని, వివరాల్ని సంస్థ ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. ఏలూరు ప్రాంత టీవీ వీక్షకుల్ని మంత్రముగ్ధుల్ని చేసే అద్భుతమైన అనుభవాన్ని యాక్ట్‌ డిజిటల్‌ టీవీ సర్వీస్‌ అందిస్తుందని, కేవలం ఒక సాధారణ సెట్‌ - టాప్‌ బాక్స్‌ను అమర్చుకోవడం ద్వారా అత్యున్నమైన డీవీడీ నాణ్యత కలిగిన పిక్చర్‌ను ప్రాంతీయంతో కలిపి 175 చానెళ్లతో ప్రత్యేకమైన కంటెంట్‌, ఎలక్ట్రానిక్‌ ప్రోగ్రామ్‌ గైడ్‌ (ఇపిజి), ప్రోగ్రామ్‌ రిమైండర్‌, చైల్డ్‌ లాక్‌, రేడియో ఆన్‌ టివి, వంటివి ఎన్నో ఇది అందిస్తుంది. సులభంగా అమర్చుకునేందుకు వీలుగా డిజిటల్‌ టివి సర్వీస్‌ ఏలూరు వాసులకు పలు రకాల ఇబ్బం దుల్ని తొలగిస్తుంది. వానలు, పిడుగులు మరేదీ కూడా చిత్ర నాణ్యతను దెబ్బతీయని విధంగా టీవీ వీక్షణను అందిస్తుంది.

Source: www.visalaandhra.com

Maa TV to air 10 UTV blockbusters in Telugu

MUMBAI: Breaking the language barrier, 10 blockbuster films from the UTV Motion Pictures are going down south.


The movie production studio has syndicated these films to Telugu entertainment channel Maa TV, which will air these movies dubbed in Telugu.


UTV has signed a five-year movie syndication deal with Maa TV for films like Fashion, Kaminey, A Wednesday, Delhi 6, Kurbaan, Wake up Sid, Kismat Konnection, Chance Pe Dance, Dhan Dhana Dhan Goal and Dhoondte Reh Jaage.

Maa Television Network director and CEO Sharrath Marar said, “Maa TV has always delivered best of the movies to the Telugu viewers. In continuation of this tradition, we entered into a new association with UTV to telecast some of the most popular Hindi movies in Telugu. This will provide a pleasant, premium and exclusive entertainment experience to ever increasing Maa TV viewers.”


Source: www.indiantelevision.com

Wednesday, October 27, 2010

Zee Telugu's Nachore To Rock Andhra Pradesh

Zee Telugu has been a trend setter for the whole concept of dance reality shows in Telugu Television industry. 12 breath-taking beauties of Telugu film industry, who have shared the screen with the Tolly’s top actors, will be participating in the show. “12 beauties - 1 crown” is the tagline for the show. Actresses like Karishma Kotak, Keerti Chawala, Tannu Rai and many more will compete against each other in the show.

Tollywood Diva Roja will be judging the competition. Accompanying her would be the state Nandi award winner Nobel Master. RJ Hemanth will be anchoring the show in his very own style.

This superlative show is all set to enthral the audience with ravishing foot tapping numbers and mesmerizing dance moves, starting October 25, every Monday and Tuesday at 9 pm only on Zee Telugu. Anuradha G, business head, Zee Telugu says, “Zee Telugu has been a pioneer in designing dance shows. Our latest offering Nacho Re brings newness to the dance show patterns.”

Source: expressbuzz.com

UTV films now in Telugu on Maa Tv

In a first of its kind association by a movie production studio, UTV's motion pictures division announced an exclusive partnership with the leading Telugu entertainment channel in Andhra Pradesh- Maa TV. Ten blockbuster movies from the UTV's movie library will now be showcased for the channel viewers in Telugu. 

The Motion Pictures division of UTV has delivered some contemporary and cult films in the recent past which will now be showcased dubbed in Telugu on the satellite television channel. This deal, been the two entertainment houses, has been signed for a period of 5 years. 

Viewers can now enjoy Fashion which won Priyanka and Kangana both national awards, Kaminey - one of the biggest blockbusters of 2009 along with two national award winning films - A Wednesday and Delhi 6 on their favourite channel. The movie offerings ranges from serious cinema like Kurbaan to some light hearted romantic films like Wake up Sid, Kismat Konnection and Chance Pe Dance. Along with these, the channel with also showcase Dhan Dhana Dhan Goal and Dhoondte Reh Jaage.

Announcing the agreement, Sharrath Marar, Director and CEO of MAA Television Network Limited, said, "MAA TV has always delivered best of the movies to the Telugu viewers. In continuation of this tradition, we entered into a new association with UTV to telecast some of the most popular Hindi movies in Telugu. This will provide a pleasant, premium and exclusive entertainment experience to ever increasing MAA TV viewers."

Amrita Pandey, Sr. VP, International Distribution & Syndication, Motion Pictures - UTV added, "We have noticed that regional audiences tend to be more receptive and comfortable with content in their language. Keeping up with this trend, we have partnered with Maa TV, one of the most popular channels in AP and dubbed a slew of our films in Telugu, so the audiences can enjoy the movies. This association with Maa TV is just a first of many such initiatives to come in the future"

For further information, please contact:

UTV Group
Pallavi Deshmukh
Mobile: +919321556801
Email: Pallavi.deshmukh@utvgroup.com

Source: www.afaqs.com

Monday, October 25, 2010

'సూర్య' టీవీ ఛానల్?




Source: telugu.greatandhra.com

Thursday, October 21, 2010

Discovery Channel offers Telugu feed

Mr Rajiv Bakshi, Vice-President, Marketing, India, Discovery Networks Asia-Pacific, announcing the launch of Telugu language feed for viewers in Andhra Pradesh, in Hyderabad, on Wednesday.

Hyderabad, Oct. 20

Discovery Channel, the flagship network of Discovery Communications, on Wednesday announced the launch of its new Telugu feed targeting viewers in Andhra Pradesh, barely eight months since it launched the Tamil version.

The Telugu feed is now available from 6 p.m. till midnight every day, with all programmes and their airing schedule remaining the same as the English, Hindi and Tamil feeds.

Mr Rajiv Bakshi, Vice-President (Marketing) for India, Discovery Networks Asia-Pacific, said the channel will launch 24-hour Telugu feed from January. After the launch of the Tamil feed, Discovery Channel moved up 27 positions, currently ranking 18 {+t} {+h} in Tamil Nadu, he told presspersons here.

Discovery's bouquet of offerings include Animal Planet and Travel Living, besides the recent launches—Discovery Turbo, Discovery Science and Discovery HD.

Discovery, with its non-fiction entertainment, reaches over 53 million subscribers in India; it launched the 24-hour parallel feed in 1998.

Mr Bakshi said the channel was in the process of launching new programmes to coincide with the launch of the Telugu feed.

These include a 12-part ‘Worst Case Scenario' based on survival from life-threatening situations; ‘Speed of Life' specialising in high speed photography to capture the life of animals and insects; and ‘I'M Alive' based on how victims of real-life animal attacks managed to beat the odds.

Source: www.thehindubusinessline.com

Wednesday, October 6, 2010

టీ.వీ ఛానళ్లలో వింత శిక్షలు

తప్పు ఎవరు చేసినా తప్పే. జర్నలిస్టులేమీ దీనికి అతీతులు కాదు. అందుకే, న్యూస్ ఛానళ్ల స్కోలింగ్స్‌లో ఎవో ఓ తప్పులు దొర్లుతుంటాయి. అయితే, చాలా వరకూ ఇలా పొరపాట్లు చేసేవారిని వారి పై నున్న వారు తిట్టి వదిలేస్తారు. కానీ, తెలుగు ఛానళ్లలో ఓ రెండింటిలో మాత్రం వింత శిక్షలను అమలు చేస్తున్నారు.. అవేమిటో తెలుసా...?

సాష్టాంగ ప్రణామం
తెలుగు న్యూస్ ఛానళ్లలో నెంబర్ వన్ స్థానంలో కొనసాగుతున్న టీవీ 9 గురించి ముందు చెప్పుకుందాం. ఇక్కడ అవుట్‌పుట్ వ్యవహారాలన్నీ అరుణ్‌సాగర్ చూస్తుంటారు. స్కోలింగ్స్‌లో తప్పొచ్చినా, వార్తలను తప్పుగా ఇచ్చినా సబ్ ఎడిటర్లకు, షిఫ్ట్ ఇంఛార్జులకు ఆయన వేసే శిక్ష చాలా ఫన్నీగా ఉంటుంది. తప్పు చేసిన వారి వద్దకు వచ్చి, అమాంతం నేలపై పడి సాష్టాంగ ప్రణామం చేస్తారు అరుణ్ సాగర్. టీవీ9 లో పనిచేసే వారిలో చాలామంది ఇది ఎదురైన అనుభవం. చాలాకాలంగా ఈ శిక్షను ఆయన అమలు చేస్తున్నారు. చాలామందిలా నోటికి వచ్చినవన్నీ తిట్టకుండా, వారు మరోసారి తప్పు చేయకుండా, వారు ఇబ్బంది పడేలా అరుణ్‌సాగర్ వేస్తున్న ఈ శిక్ష ఆయన కింద పనిచేసేవారిలో మార్పు తెచ్చిందో లేదో టీవీ9 వారే చెప్పాలి.

ఒకటికి రూ.25లు

కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలన్నట్లు, టీవీ9 ను మాత్రమే పోటీగా భావించే ఛానల్ ఏబీఎన్ ఆంధ్రజ్యోతి. టీవీ 9ను ఎప్పుడెలా ఇరుకున పెడదామా అని ఎదురుచూసే ఎబీఎన్ ఎండీ వేమూరి రాధాకృష్ణకూ ఇలా వెరైటీ శిక్షలు వేసే అలవాటుంది. అయితే.. అరుణ్ సాగర్‌లా ప్రణామాన్ని ఆయన చేయరు. తప్పుకు రూ.25ను వసూలు చేస్తారు. చిన్నవాళ్ల నుంచి డెస్క్ ఇంఛార్జ్ వరకూ ఎవరు తప్పు చేసినా దానికి రూ.25ను రాధాకృష్ణకు చెల్లించుకోవాల్సిందే. చివరకు ఆయన ఇంట్లో ఉన్నప్పుడు స్రోలింగ్‌లో తప్పు కనిపించినా, దానికి ఫోన్ చేసి మరీ కనుక్కొని, డబ్బులు వసూలు చేస్తారు.

ఇలా రెగ్యులర్‌గా డబ్బులు తీసుకోవడంపై అంతా గుసగుసలాడుకుంటున్నారని తెలుసుకొని, స్వీట్లు తెప్పించి ఆఫీసులు పంచారట రాధాకృష్ణ.

ఈటీవీలోనూ ఇలాంటి శిక్షలే అమలయ్యేవి. అప్పట్లో శాస్త్రి డెస్క్ ఇన్‌ఛార్జ్‌గా ఉన్నప్పుడు పొరపాట్లు చేసిన వారిని బూతులు తిడుతూ రాసిన స్లిప్‌ను.. నోటీస్‌బోర్డులో పెట్టేవారు. 

Source: www.24gantalu.co.cc

షూటింగ్‌లో ‘మాయాబజార్’

విలక్షణ కామెడీ సీరియల్ ‘మాయాబజార్’ షూటింగ్ ప్రారంభమైంది. ‘ఒక టీవీ ఛానెల్ నడపడమంటే మాటలా...’ అన్న కానె్సప్ట్‌తో రూపుదిద్దుకుంటున్న ఈ సీరియల్‌లో ప్రముఖ నటుడు రంగనాథ్, నందకిషోర్, కళ్లు చిదంబరం, మధుమణి, అనన్య, రమాప్రభ, నరసింహరాజు తదితరులు నటిస్తున్నారు. ఇక కథ విషయానికొస్తే - కొండకు వెంట్రుక ముడేసి కొండను లాగడం ఎంత కష్టమో.. టీవీ చానెల్ నడపడం అంత కష్టం. ఐతేనేం చాలా కష్టపడి చాలా వెంట్రుకలు పోగొట్టుకుని.. హార్డ్‌వేలో టీవీ ఛానెల్ నడపడం నేర్చుకున్న హార్డ్‌కోర్ చానెల్ హెడ్.. రైట్ ఛాయిస్ రంగనాథం.. ఆ విధంగా ఆయన ముందుకు పోతూ ఉన్నాడు. ఇకపోతే.. క్రియేటివిటీ స్పెల్లింగ్ ‘కే’తో రాసే మహా క్రియేటివ్ బుర్ర - కల్లు చిదంబరం. ఈ చానెల్‌కు క్రియేటివ్ హెడ్. అసలాయనకు హెడ్డే లేదని స్ట్ఫా ఒపీనియను. తనకు తప్ప మిగిలిన ప్రపంచానికి మీడియా గురించి ఏమీ తెలియదని కల్లు చిదంబరం స్ట్రాంగ్ ఒపీనియన్. ఆయనకు కల్లుముంత తప్ప మరేమీ తెలియదని అందరి ఒపీనియన్. తెలుగు టీవీ మెడ పట్టుకుని హిమాలయాల ఎత్తుకు నెట్టుకు వెళ్లాలనుకునే అనన్య ఈ చానెల్ ప్రోగ్రామింగ్ హెడ్. అసలు తాను పుట్టగానే హాస్పిటల్ రూంలో ఇంగ్లీషు సినిమా చూశానని చెప్పుకునే అనన్యకు హాలీవుడ్ లెవెల్లో ప్రోగ్రామ్‌లు తప్ప మరేమీ కనపడవు. అసలావిడకు కళ్లు నెత్తికెక్కాయి కాబట్టి ఏమీ కనపడ్డం లేదని స్ట్ఫా ఒపీనియన్. ఇటువంటి విభిన్న తరహా మనస్తత్వాల తీరుతెన్నులనూ పోకడలనూ ఆద్యంతం హాస్యభరితంగా నిర్మించనున్న ఈ ‘మాయాబజార్’ - ఇంగ్లీష్‌లో టాప్ రేటింగ్స్‌తో నడిచిన సీరియల్ ‘జస్ట్ షూట్ మీ’ ఆధారంగా చిత్రీకరణ జరుపుకుంటున్న నవ్వుల పూజల్లు. కామెడీకి కొత్త నడకలు నేర్పే హ్యూమర్ ఎక్స్‌ప్లోజర్ - మాయాబజార్‌కు రచన: పల్లేటి లక్ష్మీకులశేఖర్, సంగీతం: నాని, కథ, మాటలు, దర్శకత్వం: వెంకట్ కె.కృష్ణ

Source: www.andhrabhoomi.net

చానళ్ల బుద్ధి కురచ

పెళ్లెప్పుడు బాబూ-అని ప్రశ్నిస్తూ ఓ తెలుగు టీవీ న్యూస్ ఛానల్ ఓ ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వరుణ్‌గాంధీ పెళ్లి కబురు వచ్చేసరికి రాహుల్‌గాంధీకి పెళ్లి కాలేదని మన తెలుగు చానళ్లకు తెలిసివచ్చింది. అంతే సదరు విషయంపై కార్యక్రమం సిద్ధమై, తెలుగునాట వాలిపోయింది.చానళ్లకు జ్ఞాపకశక్తి అతి కురచ అనడానికి ఇది నిలువెత్తు నిదర్శనం!
సరిగా సంవత్సరం క్రితం మన రాష్ట్రాన్ని వరదలు కుదిపేశాయి. మహబూబ్‌నగర్, కృష్ణా జిల్లాలు తల్లడిల్లిపోయాయి. తెలుగు చానళ్లు ఈ వార్తలతో మహావరదలుగా మారిపోయాయి. టీవీ-9 దీనిమీద ఊరూరా ర్యాలీలుపెట్టి విరాళాలు సేకరించింది కూడా! నిజానికి ఇలా విరాళాలు సేకరించడంపై మరో చానల్ ఒక ప్రత్యేక కార్యక్రమం రూపొందించబోయి చివరకు ఆ అంశం తప్ప మిగతా విషయాలతో కార్యక్రమాన్ని నింపింది. సరే! టీవీ-9 ఇంతవరకు అలా సేకరించిన విరాళం ఎలా వ్యయం చేసిందో టీవీ చానళ్లను తక్కువగా వీక్షించే భవదీయ కాలమిస్టుకు ఇంతవరకు కంటకానీ, చెవినగానీ పడలేదు. ప్రజలు స్వచ్ఛందంగా ఇచ్చిన విరాళం కనుక, వారికి తెలుసుకొనే హక్కు లేదని ఏలే చానళ్ల ‘ఆధునిక నీతి నియమం’ కావచ్చుకాక! కానీ సంవత్సరం తిరగలేదు, ఏ చానల్‌కైనా 2009 అక్టోబర్ వరదలు గుర్తుకు వచ్చాయా? ఏదో పొరపాటున మహాటీవీ వారికి మాత్రం గుర్తు వచ్చినట్టుంది. వారు మాత్రం అరగంట కార్యక్రమం చేసినట్టు మాత్రమే మా కంటబడింది.
* * *
చానళ్లకు పేర్లు మారడం తెలుగులో బాగా పెరిగిందా? తేజ న్యూస్, అల్ఫా తెలుగు, ఆదిత్య, సంస్కృతి, తేజ, నవ్వులు, ఖుషీ వీటిపేర్లు మారిపోయాయి. అక్టోబర్ ఒకటవ తేదీనుంచి ‘తేజ’ జెమిని మూవీస్‌గా మారింది. అలాగే నవ్వులు, ఖుషీ కూడా అదే త్రోవలో నడిచాయి. అంటే సన్ నెట్‌వర్క్ చానళ్లు ఆంధ్రప్రదేశ్‌లో ఏదోరకంగా జెమినీ అనే అక్షరాలను తప్పక కలిగి ఉంటాయి. అలాగే కర్నాటక, కేరళ, తమిళనాడు రాష్ట్రాలలో వరసగా ఉదయ, సూర్య, సన్ అనే పేర్లను కచ్చితంగా కలిగి ఉంటాయి. ఇది యాజమాన్యపరంగా అనుకూలించే విషయం. అంతకుమించి జాతీయస్థాయిలో ప్రకటనలు ఆకర్షించడానికి కొంత వెసులుబాటు అదనంగా ఉంటుంది.
* * *
ఈసారి వినాయకచవితి అవాంఛనీయ సంఘటనలు లేకుండా గడిచిపోయింది. నిమజ్జనంతోపాటు అయోధ్య తీర్పు అనే హడావుడి వార్తలు జనాలను బెదరగొట్టాయి. తర్వాత తీర్పు 28 అనీ ప్రచారం మొదలైంది. చివరికి సెప్టెంబర్ 30గా ఖరారు అయింది. తీర్పు కూడా భయాందోళనలు లేని రీతిలో రావడం దేశం ఊపిరి పీల్చుకుంది.
వినాయక చవితి సమయంలో శ్రీకాకుళం జిల్లా సోంపేటలో ప్రేలుడు సంభవించింది అని చానళ్లు హంగామా చేశాయి. కానీ చానళ్లు భయపెట్టినంత స్థాయిలో సంఘటన లేదు కానీ ఒకవైపు వినాయకచవితి ఉత్సవాలు, మరోవైపు బాబ్రీ మసీదు తీర్పు అని సంశయ పడుతున్న వేళ ఇటువంటి వార్తలకు అటువంటి స్థాయిలో సంచలనం సృష్టించాలనుకోవడం మన తెలుగు చానళ్ల స్థాయికే చెల్లింది.
టెక్నాలజీ బాగా పెరిగితే, బుర్ర మరీ నేలబారిపోతోందా? నిమజ్జనంరోజున ఒకేసారి పలు దృశ్యాలను చూపాలని నాలుగు కాదు, ఏడెనిమిది దృశ్యాలను ప్రత్యక్ష ప్రసారంగా చూపాలని తాపత్రయపడ్డారు. ఈ దృశ్యాలు ఎంత చిన్నగా మారాయంటే ఒక్కోసారి సదరు చానల్ లోగో ఒక దృశ్యాన్ని మింగేసేటంత! అదే సమయంలో లైవ్ అంటూ మాటలు రాని రిపోర్టర్ చేత వ్యాఖ్యానం ఇప్పించాలని ప్రయత్నించడం మరో విషయం. ఈ రిపోర్టర్‌లు అంతా నాయకుల తగవులను బాగా అందివ్వగలరు గానీ ఇటువంటి సంఘటనలను కాదు. టీవీ-9 వ్యాఖ్యాత తొమ్మిది ప్రాధాన్యతను చెబుతూ టీవీ-9ను సంకీర్తన లంకించుకోవడం ఎంతో ఎబ్బెట్టుగా ఉంది. వినాయక చవితి నిమజ్జనం వ్యాఖ్యానం విషయంలో దూరదర్శన్ పైచేయి అని రుజువు చేసుకుంది. మిగతా చానళ్లు ఏమాత్రం శ్రమ, ఖర్చు లేకుండా రేటింగులు రాలాలని ప్రయత్నించాయి. కానీ బాలాపూర్ లడ్డు వేలం వివాద విషయాన్ని ప్రత్యక్ష ప్రసారంగా మలచిన చానళ్లు కూడా రెండు ఉన్నాయి. దానికేశ్రమ అక్కరలేదు. ప్రచారం కావాలనుకున్నవారు, వారే సొంత వాహనం మీద పారితోషికం ఆశించకుండా స్టుడియోలో వాలుతారు. అదీ కిటుకు!
* * *
టీవీ చానళ్లు చూస్తుంటే ఎవరి గోల వారిది అనే సామెత పదే పదే గుర్తుకువస్తుంది. సాక్షి చూస్తే జగనన్న యాత్ర పదేపదే చూపుతారు కదా అని స్టుడియో ఎన్‌వైపు వెళ్లాను. రాత్రి పదిగంటలకు ఒన్‌మినిట్ అని అరగంటలో ముప్పయి వార్తలు ఇచ్చే కార్యక్రమం అది. కానీ ఆ కార్యక్రమం ఎవరికీ చెప్పకుండా రద్దయిపోయింది. అంతేకాదు చంద్రబాబు యాత్రతో చానల్ సాగిపోయింది. అది అరగంటో, గంటో-మనకు తెలియదు. ఎందుకంటే పరీక్షగా చూసే ఓపిక లేదు కనుక. చమక్కు: ఓరు‘ఘల్లు’, విశాఖ తీరాన, కృష్ణాతీరం...ఇవి ఎన్‌టీవీలో ప్రాంతాలవారీ వార్తాకదంబాలకు చేసిన నామకరణాలు. ఇంగ్లీషు శీర్షికల ఎడారిలో తెలుగు ఒయాసిస్సులా ఇవి వినపడుతున్నాయి. *

Source: www.andhrabhoomi.net

Monday, October 4, 2010

తేజా టీవీ… మనకిక లేదు

తెలుగు టీవీ చరిత్ర నుంచి “తేజా” కనుమరుగైంది. అక్టోబర్ 1 నుంచి అది జెమిని మూవీస్ గా పేరుమార్చుకుంది. జెమిని బ్రాండ్ తోనే నడపాలనుకోవటం, సినిమాల చానల్ గా పేరులోనే  గుర్తింపు ఇవ్వాలని సన్ నెట్‍వర్క్ భావించటం ఇందుకు ప్రధానమైన కారణాలుగా చెబుతున్నారు. తెలుగులో తొలి మ్యూజిక్ చానల్ కూడా మొదలుపెట్టిన సన్ నెట్‍వర్క్ ఇప్పటిదాకా తేజా టీవీని  అధికారికంగా మూవీ చానల్ గా ప్రకటించలేదు.  మా టీవీ నెట్‍వర్క్ ఇప్పుడు  ’ మా మూవీస్ ’ పేరుతో ఒక చానల్ ప్రారంభిస్తుండటంతో ఇలా పేరుమార్చాలని నిర్ణయం తీసుకున్నారని అర్థమవుతోంది. అయితే ఈ మార్పును నిశితంగా గమనిస్తే ఇదేమీ ఆషామాషీ నిర్ణయం కాకపోవచ్చునని కూడా అనిపిస్తుంది. ట్రాయ్ నియమాల ప్రకారం పాత చానల్స్ ఏవీ పే చానల్ టారిఫ్ పెంచటానికి వీల్లేదు. కొత్త చానల్స్ అయితే కొత్త రేట్లు నిర్ణయించుకోవచ్చు. అందుకే టెక్నికల్ గా దీన్ని కొత్త చానల్ గా చూపించే ప్రయత్నంలో భాగంగా పేరు మార్చి ఉండవచ్చు. అనుక్షణం కమర్షియల్ ఆలోచనలకే పెద్దపీటవేసే సన్ నెట్‍వర్క్ ఆ మాత్రం ఆలోచించకుండా ఉంటుందని ఎలా ఊహించగలం ? కాలం  గడిచే కొద్దీ అసలు వ్యూహాలు అర్థమవుతాయి.
తేజా టీవీ ప్రస్థానాన్ని నెమరువేసుకుంటే,  ఎన్నో సందర్భాలలో అది తన ప్రత్యేకతను చాటుకున్న సంగతి గుర్తుకొస్తుంది. తేజ టీవీ స్థాపించటానికి దారితీసిన పరిస్థితులు మొదలుకొని అది సాధించిన విజయాలను ఒక్కసారి మననం చేసుకోవటం అవసరం. తెలుగులో జెమిని తొలి శాటిలైట్ చానల్. దాదాపు ఆరునెలల తరువాత మొదలైన ఈటీవీ త్వరత్వరగా అడుగులు ముందుకేసింది. ఈనాడు నెట్‍వర్క్ సాయం, ధనబలం కూడా ఈటీవీ మనుగడకు దోహదం చేశాయి. కార్యక్రమాలు బాగున్నా, ఆర్థికపరమైన ఇబ్బందుల్లో చిక్కుకున్న జెమిని తప్పనిసరి పరిస్థితుల్లో సగం వాటాను సన్ నెట్‍వర్క్ కు అమ్ముకుంది. ఆర్థిక లావాదేవీల నియంత్రణ లాంటి కీలకమైన అంశాలను సన్ నెట్‍వర్క్ వ్యూహాత్మకంగా దక్కించుకోవటం ద్వారా క్రమేపీ జెమినీ మీద పెత్తనం చెలాయించే స్థితికి చేరుకోవటం తెలిసిందే. అయితే, జెమిని ప్రమోటర్లు వ్యక్తిగతంగా చానల్ పట్ల ఉండే ప్రేమను ధారాదత్తం చేసినందుకు బాధపడ్డారే  తప్ప ఒక సంస్థగా దాని ఎదుగుదల అప్రతిహతంగా సాగటం మాత్రం వారికి ఆనందం కలిగించింది. మొత్తం మీద ఈ నాటికీ నెంబర్ వన్ స్థానం నుండి దానిని ఎవరూ కదిలించలేకపోయారు. అలా జెమినీ పుంజుకోవటం మొదలైన తరువాత ఒక దశలో జెమినీ మార్కెట్ షేర్, ఈటీవీకి రెట్టింపయింది.  నెంబర్ వన్, నెంబర్ టూ చానల్స్ మధ్య అంతరం ఇంతగా పెరిగిపోతున్నసమయంలో  “అసలైన నెంబర్ టూ స్థానం ఖాళీగా ఉంది, అందుకే ఆ స్థానాన్ని భర్తీ చేయటం కోసం మరో తెలుగు చానల్ ప్రారంభిస్తున్నామ”ని అప్పటి జెమినీ ఎమ్ డీ శరద్ కుమార్ ఒక ఆంగ్ల పత్రికకిచ్చిన ఇంటర్వ్యూ లో చెప్పారు.
ఆ విధంగా 1999 మే 19 న తేజా టీవీ ఆవిర్భవించింది. కేవలం పాటలతో మొదలైంది. వినోదకార్యక్రమాలకే పరిమితం చేయాలా, న్యూస్ చానల్ చేయాలా అని కొంతకాలం తర్జనభర్జనలు జరిగాయి. అలా సాగుతుండగానే న్యూస్ స్క్రోల్ ఇవ్వాలనే విషయంలో ఏకాభిప్రాయం కుదిరింది. పాటలు చూస్తూ ముఖ్యమైన వార్తల స్క్రోలింగ్ చూడటానికి జనం బాగానే అలవాటు పడ్దారు. ఆ విధంగా తెలుగులో న్యూస్  స్క్రోల్ ఇచ్చిన మొదటి చానల్ తేజ టీవీ. అప్పట్లో చాలా మంది  తమ వార్త స్క్రోల్ లో వచ్చినా చాలుననుకునేవారు. దాదాపు సంవత్సరం గడిచాక న్యూస్ బులిటెన్స్ జెమినీ నుంచి తేజా కు మార్చాలని నిర్ణయించారు. అప్పటికి జెమిని టీవీకున్నఆదరణతో పోల్చుకుంటే తేజా ఆదరణ చాలా తక్కువ. అందుకే అలా మార్చటం న్యూస్ లో ఎవరికీ ఇష్టం లేదు. కానీ యాజమాన్యం ఆలోచన మరోలా ఉంది. ఆ సమయాన్ని సీరియల్స్ కు కేటాయిస్తే వచ్చే ఆదాయం చాలా ఎక్కువ కాబట్టి న్యూస్ ను అలా తేజా కు మార్చటమే మంచిదన్నారు. పైగా,  ”తేజా ను ఒక న్యూస్ చానల్ గా మార్చే ఆలోచన ఉన్నప్పుడు ఇప్పటినుంచే బులిటెన్స్ అందులో ఇవ్వటంలో తప్పేముంది” అని అడిగారు. ఆ విధంగా 2000 సంవత్సరం ఆగస్టు 10  నుంచి జెమినీవార్తలు తేజావార్తలయ్యాయి.
అప్పటికీ తేజాటీవీ అంతగా ప్రాచుర్యం పొందలేదు. వార్తలు మార్చి మూడు వారాలు గడిచేలోపు జరిగిన ఒక సంఘటన తేజాటీవీకి రాష్ట్రప్రజలందరి అభిమానాన్ని సంపాదించిపెట్టింది. ఆగస్టు 28నాటి బషీర్‍బాగ్ కాల్పుల ఘటనతో  రాష్ట్రమంతా తేజాటీవీ పేరు మారుమోగింది. బషీర్‍బాగ్ లో పోలీసు కాల్పులు జరుగుతున్నప్పుడు తేజా టీవీ కెమెరామెన్ తీసిన వీడియో ఫీడ్ చెన్నై కార్యాలయానికి పంపినప్పుడు ఆ దృశ్యాలను వరుసగా తేజా టీవీలో ప్రసారం చెయ్యాలని నిర్ణయించడమే అందుకు కారణం. అందిన ప్రతి కాసెట్ యథాతథంగా  ప్లే చెయ్యాలని హైదరాబాద్ కార్యాలయానికి చెప్పడంతో వేరు వేరు స్థానాల్లో ఉండి తీసిన కాసెట్స్ ఒక క్రమపద్ధతంటూ లేకుండా ప్రసారమయ్యాయి. (అది చూసిన సన్ టీవీ అధిపతి కళానిధి మారన్  తమిళ చానల్ లో కూడా ప్రసారం చేయించారు). చాలా మంది ఇదంతా  ప్రత్యక్షప్రసారమని అనుకుంటారు కాని అది నిజం కాదు. కనీసం 45 నిమిషాల తేడా ఉంది. పైగా ఏది ముందు జరిగిందో, ఏది తరువాత జరిగిందో కూడా తెలియదు.. గుర్తుపట్టటం కూడా చాలా కష్టం. ఆ సంగతలా ఉంచితే, రాష్ట్ర ప్రజలకు ఒళ్ళుగగుర్పాటు కలిగించే అనుభూతి. కాల్పులఘట్టాన్ని నేరుగా చూస్తున్నట్టే అనిపించింది. ఈ విషయం తెలిసినవారు పరుగుపరుగున ఇళ్ళకువెళ్ళి టీవీలకు అతుక్కుపోయారు. ఏ నోట విన్నా తేజా టీవీ మాటే. అది ప్రత్యక్షప్రసారం కాకపోయినా ఒక ప్రత్యేకప్రసారమే.ఆ రోజునుంచి తేజా టీవీ తిరుగులేని ప్రజాభిమానం సంపాదించుకుంది.  తేజాటీవీ వార్తలకు ఆదరణ పెరిగింది.
తేజా టీవీ ని న్యూస్ చానల్ గా మార్చాలని డైరెక్టర్ పి. కిరణ్ చాలాసార్లు ప్రతిపాదించారు. ఎన్నో విధాలుగా నచ్చజెప్పబోయారు. అయినాసరే, ఆయన ప్రతిపాదనలేవీ కార్యరూపంలోకి రాలేదు. అదే జరిగి ఉంటే, తొలి తెలుగు చానల్ ఘనతతోబాటు తొలి న్యూస్ చానల్ ఘనత కూడా జెమినీ కి దక్కి ఉండేది. తెలుగు ప్రేక్షకులకు వినోదం తప్ప ఏమీ పట్టదని, డబ్బింగ్ సీరియల్స్ అయినా సరే బాగా చూస్తారని, పే చానల్ చేసినా కిమ్మనకుండా డబ్బు కడతారని సన్ నెట్‍వర్క్ కి కొన్ని నిశ్చితాభిప్రాయాలుండేవి. పైగా, ఎంటర్‍టైన్‍మెంట్ లో ఈటీవీ ని సవాలు చేయగలిగాం తప్ప న్యూస్ లో గట్టి నెట్‍వర్క్ ఉన్న రామోజీరావుతో పోటీ పడటం కష్టమని అనుకునేవారు. దీనికి తోడు సొంత అనుభవం ఉండనే ఉంది. స్టార్ టీవీ హిందీ, ఇంగ్లిష్ బులిటెన్లు మార్చి మార్చి ప్రసారం చేసినట్టు తమిళ, ఇంగ్లిష్ బులిటెన్స్ తో మొదలుపెట్టిన 24 గంటల సన్ న్యూస్ చానల్ చతికిలబడింది. ఇలాంటి కారణాలన్నిటి దృష్ట్యా తేజా టీవీ ఐదారు బులిటెన్స్ కే పరిమితమవుతూ వచ్చింది. అయితే, శుభోదయం లాంటి డెయిలీ షో తోబాటు  ఎన్‍కౌంటర్ (ఈ కార్యక్రమంతో తెలుగునాట పేరుతెచ్చుకున్న రవిప్రకాశ్ ఆ తరువాత కాలంలో టీవీ 9 ప్రారంభించటం తెలిసిందే), విశ్వదర్శనం, ఇదండీ సంగతి, ఇండియా రౌండప్, ఎపి రౌండప్ లాంటి వీక్లీ కార్యక్రమాలు కూడా ప్రసారమయ్యేవి. దక్కన్ క్రానికల్ ముందు పవన్ కళ్యాణ్ ధర్నాలాంటి ఘట్టాలను కూడా యథాతథంగా ప్రసారం చేసి ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకోవడం తేజాటీవీకే చెల్లింది. ప్రత్యక్షప్రసారాలు అలవోకగా అందించటం కూడా తేజాటీవీ ఘనతగానే చెప్పుకోవాలి. సన్ టీవీతో కలిసి ప్రత్యక్ష ప్రసారం చేసిన శబరిమల మకరదర్శనం, సంపూర్ణ సూర్యగ్రహణం, వేలాంకణీమాత ఉత్సవాల లాంటివి పక్కనబెట్టినా, శాసనసభాకార్యక్రమాలను ప్రత్యక్షప్రసారం చేసిన తొలితెలుగు శాటిలైట్ చానల్ గా తేజాటీవీ  ఎప్పటికీ చరిత్రలో మిగిలిపోతుంది. రాజ్ భవన్ నుంచి మంత్రుల ప్రమాణ స్వీకారోత్సవాన్ని రాష్ట్రప్రజలకు తొలిసారిగా ప్రత్యక్షప్రసారం ద్వారా చూపిన ఘనతకూడా తేజాటీవీ సొంతమే. నంది అవార్డుల బహుకరణ, క్లింటన్ పర్యటన సహా అనేక చారిత్రకఘట్టాలకు సామాన్య ప్రజలను ప్రత్యక్ష సాక్షుల్ని చేసిన అనుభవం అసాధారణం.
అయితే ఆ తరువాత కాలంలో రాష్ట్రంలో న్యూస్ చానల్స్ శకం మొదలై, అవి సాధించిన తొలివిజయాలు చూశాక న్యూస్ చానల్ పెట్టాలన్న ఆలోచన కార్యరూపం దాల్చింది. అప్పటికే ఎంటర్‍టైన్‍మెంట్ చానల్ గా నిలదొక్కుకున్న తేజా టీవీని యథాతథంగా కొనసాగించాలని నిర్ణయించుకోవటంతో జెమినీ న్యూస్ పేరిట 24గంటల న్యూస్ చానల్ మొదలుపెట్టారు. దాని మంచిచెడ్డల ప్రస్తావన ఇక్కడ అప్రస్తుతం. న్యూస్ చానల్ ఉండటం వలన తేజాటీవీలో బులిటెన్స్ తగ్గిపోయాయి. అది సినిమాల చానల్ గా మారిపోయింది. నామమాత్రంగా రాత్రి ఎనిమిదిన్నర గంటల బులిటెన్ కొనసాగుతూ వచ్చినా అదీ లేదు .ఏ లక్ష్యం కోసం మొదలైందో ఆ లక్ష్యాన్ని సాధించిందనేందుకు సాక్ష్యంగా అది కనుమరుగయ్యేనాటికీ రెండో స్థానంలోనే ఉంది. ఇప్పుడిక తేజాటీవీ లేదు. జెమినీ మ్యూజిక్ మాత్రమే కనిపిస్తుంది. ఒకప్పటి తేజా టీవీ ఇలా పేరుమార్చుకుందన్న విషయమైనా కొత్తతరం గుర్తిస్తే అదేపదివేలనుకుంటూ హుందాగా తప్పుకుంది. పదకొండు సంవత్సరాలపాటు ప్రేక్షకుల మనసులలో చెరగని ముద్ర వేసుకున్న ఆ పేరు  ’’ కార్పొరేట్ బ్రాండ్ బిల్డింగ్  ”  అనే కమర్షియల్ రథచక్రాల కింద నలిగిపోయింది. చరిత్ర సృష్టించిన చానల్ అదే చరిత్రలో కలిసిపోయింది.  దాన్ని హృదయాలకు హత్తుకొని పెంచిపోషించిన వందలాదిమంది సిబ్బందికి, కోట్లాది వీక్షకులకు తీపిగుర్తుల్ని మాత్రం మిగిల్చిపోయింది.

Source: bhavanarayana.co.tv

Friday, October 1, 2010

పేరు మారిన తేజ టీవీ, నవ్వులు టీవీ



తేజ టీవీని జెమిని మూవీస్ గా
నవ్వులు టీవీని జెమిని కామెడీగా  పేరు మార్పు చెందినది.......

Teja TV And Navvulu TV Renamed




Teja TV And Navvulu TV Renamed As Gemini Movies And Gemini Comedy

తెలుగు డిస్కవరీ మొదలైంది

డిస్కవరీ చానల్ తెలుగు ప్రసారాలు ఈ రోజు ( అక్టోబర్ 1న) మొదలయ్యాయి.  ఈ రోజునుంచి రోజుకు ఆరుగంటలపాటు తెలుగు అనువాదంతో ప్రసారాలు అందిస్తూ ,వచ్చే జనవరి నాటికి 24 గంటలకు విస్తరించాలని డిస్కవరీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది జనవరిలోనే తమిళంలో ప్రసారాలు మొదలుపెట్టి అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకోగలిగింది. అయితే, అక్కడి అందమైన అనువాదం అందుకు దోహదం చేసింది. కానీ అందుకు పూర్తి భిన్నంగా  తెలుగులో అనువాదాన్ని భ్రష్టుపట్టించారు. అనువాదం ఎలా ఉండకూడదో ఈ రోజునుంచి డిస్కవరీ విని తరించవచ్చు. ఇప్పుడే విన్న ఒక మాట చూడండి… పులి గురించి చెబుతూ ఇంగ్లిష్ స్క్రిప్ట్ లో ఒక చోట బిగ్ కాట్ అని వాడినట్టున్నారు…. మన అనువాదకులు దాన్ని ’’పెద్దపిల్లి” గా మార్చారు. చానల్ నిర్వాహకులు మాత్రం ముంబయ్ లో యూటీవీ కి కాంట్రాక్ట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైగా వచ్చే జనవరి నాటికి ఇంకో రెండు భాషల్లో కూడా ప్రసారాలు మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగులో ప్రసారాలు మొదలెట్టిన నేషనల్ జాగ్రఫీ చానల్ కూడా అంతంతమాత్రంగానే ఉందనుకోండి.

Source: bhavanarayana.co.tv