Monday, February 28, 2011

ఐబిఎన్‌ 7 డైమండ్‌ స్టేట్స్‌ అవార్డులు

హైదరాబాద్‌ : నిరుద్యోగులకు ఉపాధి కల్పించడంలో ఆంధ్రప్రదేశ్‌ అదిపెద్ద రాష్ట్రంగా ప్రముఖ హిందీ న్యూస్‌ ఛానల్‌ ఐబిఎన్‌ 7 ప్రకటించింది. ఇటీవల ప్రకటించిన డైమండ్‌ స్టేట్స్‌ అవార్డుల్లో ఎంప్లాయ్‌మెంట్‌ కేటగిరీలో ఆంధ్రప్రదేశ్‌కు స్థానం లభించింది. సిటిజన్‌ కేటగిరీతో పాటు వాటర్‌ అండ్‌ శానిటేషన్‌, మహిళా సాధికారతలో తమిళనాడు, కోర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో గుజరాత్‌, విద్య, వైద్య రంగాల్లో కేరళ, పావర్టీ రిడక్షన్‌లో ఛత్తీస్‌ఘడ్‌ రాష్ట్రాలు అవార్డులను సొంతం చేసుకున్నాయి. ఈ అవార్డులను భారత ఉప రాష్టప్రతి మహ్మద్‌ హమీద్‌ అన్సారీ ప్రదానం చేశారు. 

Source: www.suryaa.com

ఇచ్చట తెలుగు వార్తా ఛానళ్లు కొనబడును… అయితే, ష్‌ష్‌ష్‌ష్‌ అంతా రహస్యం

తండ్రి అధికారాన్ని అడ్డంపెట్టుకుని మంది సొమ్మును అడ్డంగా దోచేసిన వైఎస్‌ తనయుడు జగన్మోహనరెడ్డి తానే గద్దెనెక్కేందుకు అన్ని మార్గాల్లోనూ వేటాడుతున్నాడు. ప్రధానంగా మీడియాను గుప్పిట్లో పెట్టుకునేందుకు శతవిధాలా సొమ్ము వెదజల్లుతున్నాడు. తన సాక్షి పత్రికనూ, టీవీని జగన్మోహకరించిందిగాక, పాక్షికంగా అమ్ముడుపోయేందుకు సిద్ధంగా ఉన్న ప్రసార మాధ్యమాలను కొనుగోలు చేస్తున్నాడు. ఇప్పుడు మూడు వార్తా ఛానళ్లను 50 శాతానికి కొద్దిగా అటూఇటూగా బినామీ పేర్లతో కొనుగోలు చేసేశాడు. ఖమ్మం జిల్లాకు చెందిన నరేంద్రనాథ్‌ చౌదరి సంస్థాపిత ఎన్‌ టీలో 49 శాతాన్నీ, కూడు, గూడు, గుడ్డ, విద్య, వైద్యం అన్న ఐదు అత్యవసరాలు అందరికీ అందించే ధ్యేయం తమదంటూ పురుడుపోసుకున్న టీవీ-5లో  42 శాతం,  టీవీ-9 పాత్రికేయులతో చిన్నపాటి సమరభేరి మోగించిన  ఓ విద్యా వ్యాపారి రాజు భావోద్వేగ ఫలితంగా ఉద్భవించిన ఐ న్యూస్‌లో 51 శాతాన్ని యువనేత కొనుగోలు చేసినట్లు జగన్మోహనరెడ్డి శిబిరంలో పనిచేస్తోన్న ఒకరు ఉప్పందించాడు.


ఈ మూడు ఛానళ్లు ఇక సాక్షి స్థాయిలో ఏకపక్షంగా జగన్మోహన చాలీసాలను అదే పనిగా భజనచేయకపోవచ్చేమోగానీ వ్యతిరేకంగా మాత్రం నోరు విప్పబోవు. అయితే ఈ ఛానళ్ల ద్వారా ప్రత్యర్థులను దొంగ దెబ్బ తీసేందుకు జగన్మోహనుడి శిబిరం ప్రణాళిక రూపొందించుకున్నట్లు మీడియా నిపుణులు విశ్లేషిస్తున్నారు. వాస్తవానికి జగన్మోహనుడి శిబిరంలోకి చేరిపోయిన మూడు ఛానళ్లూ తొలి నుంచీ అంతో ఇంతో వైఎస్‌ రాజశేఖరరెడ్డి దొడ్డిలోనే ఉండేవి. కాకపోతే ఇప్పుడు పూర్తిగా జగన్మోహన రాగాన్ని ఆలపించేందుకుగాను సొమ్ముల్ని దక్కించుకుని నీకో సగం – నాకో సగం అంటూ పాడబోతున్నాయి. అంటే ఈ ఛానళ్లు ఇక సోనియా వ్యతిరేక, నకికురె వ్యతిరేక, తెదేపా వ్యతిరేక ఆలాపనలకు వేదికలు అవనున్నాయి. ఇక ఆ తరహా ఆలాపాలు వినాలో? వినకూడదో? నిర్ణయించుకోవలసింది మాత్రం వీక్షకులే. 

Source: telugillu.wordpress.com

రాంగోపాల్ వర్మపై TV-9 తీరు అభ్యంతరకరం

ప్రేక్షకులు దేవుళ్ళని అన్న ఎన్టీర్ అనుకుంటే...ప్రేక్షకులు వెర్రి వెధవలు, దద్దమ్మలు, చవటలని రాంగోపాల్ వర్మ భావిస్తున్నారన్న ఓపెనింగ్ వ్యాఖ్యలతో చెత్త కథనాన్ని బుధవారం ప్రసారం చేసిన TV-9 ఆ దర్శకుడిని స్టూడియోలో మరింతగా అవమానించింది శుక్రవారం. దర్శకుడిగా కాకపోయినా...ఒక వ్యక్తిగా అయినా వర్మకు విలువ ఇవ్వకుండా...నోటికొచ్చిన ప్రశ్నలు అడిగి యాంకర్ రజనీకాంత్ ఆయనను అవమానించారు. ఇదొక వైపరీత్యం, అన్యాయం, ఆటవిక జర్నలిజం. 

తొండ ముదిరి ఊసరవెల్లి అయినట్లు...పైత్యం ముదిరి రాంగోపాల్ వర్మ అయ్యారనీ, వర్మ తీసిన సినిమా చూడడం ఏ జన్మలోనో చేసుకున్న పాపమనీ, వర్మకు ఇప్పుడు వాయిస్ ఓవర్ల పిచ్చి పట్టిందని, ఆయన డ్రాం గోపాల్ వర్మ అనీ ....విపరీత వ్యాఖ్యలు చేసిన ఆ చానెల్ పిలిస్తే...స్టూడియోకి వెళ్లి రెండు గంటల పాటు చెత్త ప్రశ్నలు ఎదుర్కోవడం వర్మ చేసిన పెద్ద తప్పు. కామ్ గా కేసువేసి మంచి లాయర్ను పెట్టుకోక...వర్మ ఆ స్టూడియోకి వెళ్ళారు. హద్దులు మీరి అతితెలివి ప్రశ్నలు వేయబోయిన రజనీకాంత్ ను ఆడుకొని రాంగోపాల్ వర్మ ప్రేక్షకులకు కనువిందు కలిగించడం బాగుంది కానీ...టీ.ఆర్.పీ.రేటింగ్ కోసం TV-9 ఇలా వివాదం సృష్టించి చీప్ ట్రిక్స్ కు పాల్పడడం బాగోలేదు. ఇది జర్నలిజం ఏ మాత్రం కాదు. తన తీరును అటు రవి, ఇటు రజని పునఃసమీక్షించుకోవాలి.    

ఏ దర్శకుడి కెరీర్లోనైనా...ఏ మనిషి జీవితంలోనైనా ఎగుడు దిగుళ్ళు సాధారణమే. వరస ఫ్లాప్స్ అనేది ఒక మహా పాపమయినట్లు, ఒక నెగిటివ్ స్టొరీ ప్రసారం చేసి సుద్దులు చెబితే...ఆయన ఆస్కార్ కొట్టేంత ఎదిగిపోతారనట్లు బిల్డప్ ఇవ్వడం బుల్లి తెర వీక్షకులను వెర్రి వెధవలను, దద్దమ్మలను, చవటలను చేసే ఒక విన్యాసం మాత్రమే!
 
Source: apmediakaburlu.blogspot.com

‘సువర్ణ’లో సరికొత్త రియాల్టీషో

కర్నాటకలోని సువర్ణ ఛానెల్ సరికొత్త రియాల్టీషోకు శ్రీకారం చుట్టింది. అటవీ ప్రాంతం నేపధ్యంలో సాగే రెండో రియాల్టీషో ఇది! ‘ప్యాతె హుడిగిరు హళ్లి లైఫ్’ పేరిట ఈ షో ఫిబ్రవరి 28 నుంచి ప్రారంభమవుతోంది. సోమవారం నుంచి శుక్రవారం వరకు రాత్రి 8 గంటల స్లాట్‍లో ఇది ప్రసారమవుతుంది. 12 మంది యువతులు కర్నాటక బాదామీ తాలూకాలోని ఓ గ్రామంలో 65 రోజుల పాటు గడిపి అక్కడి వాతావరణాన్ని అధ్యయనం చేయడమే ఈ షో ఉద్దేశ్యం. ఆ గ్రామ సంస్కృతి, గ్రామ వాసుల ఆచారాలను వారు ఆకళింపు చేసుకుంటారు. ఇందులో ఆ గ్రామీణులే కీలకపాత్ర వహిస్తారు. ఈ యువతులకు తగిన గైడెన్స్ ఇస్తారు. వారే న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు. ఈ బాలికల తీరు నచ్చకపొతే వారే ఎలిమినేట్ చేస్తారు. ఇది వరకు ఫారెస్ట్ థీమ్‌తో తీసిన రియాల్టీషోలకు యాంకర్‌గా వ్యవహరించిన అకుల్ బాలాజీ ఈ తాజా షోకు కూడా హోస్ట్‌గా వ్యవహరిస్తారు.

Source: medianx.tv

మీడియా వారికి రైల్వే ఐడి కార్డులు

రైల్వేమంత్రి మమతాబెనర్జీ తన రైల్వే బడ్జెట్‍లో మీడియావారిని కొంత కరుణించారు. మీడియా పర్సన్స్ ఇక ఫొటో ఐడెంటిఫికేషన్ కమ్ క్రెడిట్ కార్డులను వినియోగించుకుని రైళ్లలో రాయితీపై ప్రయాణించవచ్చు. ప్రెస్ ఇన్‌ఫర్మేషన్ బ్యూరో గానీ, సంబంధిత అధికారులు గానీ ఇచ్చే అనుమతి పత్రాల ఆధారంగా ఈ కార్డులు అందజేస్తారు. ఇప్పటివరకు మీడియావారు రాయితీల కోసం రైల్వేశాఖ నుంచి కూపన్లు పొందవలసివచ్చేది. అయితే ఇకపై వారు ఈ కార్డుల సౌకర్యం వినియోగించుకోవచ్చు. వీటి ఆధారంగా వారు రిజర్వేషన్ పొందుతారు, ఇప్పటి వరకు తమ భార్య లేదా తమ భర్తతో పాటు ప్రయాణించే వారికి ఇస్తున్న 30 శాతం రాయితీని 50 శాతానికి పెంచారు. ఏడాదిలో ఒక సారి ఈ సౌకర్యాన్ని వారు వినియోగించుకోవచ్చు.

Source: medianx.tv

బిబిసి వెబ్‍సైట్ చొరవ

టివి కార్యక్రమాలను ప్రొడ్యూస్ చేయాలనుకుంటున్నారా! అయితే తమ వెబ్‍సైట్‍ను ఆశ్రయించండి అంటున్నారు బిబిసివారు. టివితోపాటు రేడియోకు సంబంధించి ఆన్‌లైన్ ప్రొడక్షన్ కార్యక్రమాలకు తాము సహకరిస్తామని చెబుతున్నారు. బిబిసి స్టాఫ్‌కే కాక, బ్రాడ్‌కాస్టింగ్ ఇండస్ట్రీకే ఇది ‘వరప్రదాయిని’ అని బిబిసి అంటోంది. ఇప్పటికే బిబిసి కాలేజ్ ఆఫ్ జర్నలిజం వెబ్‍సైట్ ఉంది. ఇదికాక కొత్తగా ఈ వెబ్‍సైట్‍ను లాంచ్ చేశారు. ఇందులో షార్ట్ రేడియో ప్రొగ్రామ్స్, వీడియోలు, బోధనా పద్ధతులతో సహా నిపుణుల చేత సూచనలు, సలహాలు అన్నీ ఉంటాయి. వీటిని పొందదలచినవారు ప్రశ్నలు కూడా అడగవచ్చు, సెల్ఫ్‌షూటింగ్, ఎడిటింగ్, ఇంటర్‌వ్యూయింగ్ వంటివి కూడా ఈ సైట్‍లో ఉంటాయి. ప్రపంచవ్యాప్తంగా బిబిసికి మొబైల్ వర్క్‌సోర్స్ ఉంది. ఈ కొత్త వెబ్‍సైట్‍తో ప్రజలకు మరింత చేరువవుతామని బిబిసి ఆశిస్తోంది.

Source: medianx.tv

Sunday, February 27, 2011

RGV, the drama king

Ram Gopal Varma derives great pleasure in criticising Karan Johar’s movie-making abilities, but when nasty comments are directed towards him, the spoilsport director goes running to the cops to lodge a complaint! A Telugu news channel decided to take an hour out of its schedule to criticise Varma on a show titled Ramu Damal Varma, and the director went ballistic. He took major offence to the fact that two critics spent quality time on TV ripping his movies, including the latest dud KSD Appalraju.

An upset RGV appeared on a TV show to defend his movies and then marched straight to the police station to lodge a complaint. He followed it with a press conference. He made all the right noises about being defamed, but stopped short of lodging a written complaint. So why all this drama? Varma claimed that while he doesn’t mind criticism, he takes offence when things get personal and his viewers gets dragged in! He felt the TV channel insulted his beloved audience and said he doesn’t treat them well. 

Maybe RGV should check whether he has any audience left! When contacted, many from the film fraternity felt it didn’t deserve a comment, while director Nandini Reddy of Ala Mogulanidi feels RGV is overreacting. “Everyone has the right to criticise a film and every filmmaker knows that. People should stop sensationalising things as we have better things to pay attention to.” Ouch. 

Well, the TV channel will be glad to know that the cops will not question them as commissioner A.K. Khan says, “When I asked him to give a written complaint he said he will get back to me. Only after he gives us one, will we look into the matter.” Looks like this was just Varma’s way of milking some free publicity.

Source: www.deccanchronicle.com

Saturday, February 26, 2011

యుటివికి కోర్టు నోటీసు

యుటివిలో ప్రసారమైన ‘ఎమోషనల్ అత్యాచార్’ రియాలిటీ షో  .. ఆ ఛానల్‍కు ఇబ్బందులు కలిగించింది. ఈ షోకు సంబంధించి  ఢిల్లీ హైకోర్టు ఆ ఛానల్‍కు, కేంద్ర సమాచార, ప్రసారశాఖలకు, హోంశాఖకు నోటీసులు జారీ చేసింది. వీటికి నాలుగు వారాల్లోగా సమాధానం ఇవ్వాలని కోర్టు ఆదేశించింది. ఢిల్లీలోని ఓ స్వచ్ఛంద సంస్థ దాఖలు చేసిన పిటిషన్‍పై కోర్టు స్పందించింది. యుటివిలో వచ్చిన ఈ రియాలిటీ షో అసభ్యకరంగా ఉందని, సమాజానికి తప్పుడు సంకేతాలు పంపే విధంగా ఉందని ఈ “ఇంద్రప్రస్థ పీపుల్’ అనే స్వచ్ఛంద సంస్థ పేర్కొంది.

Source: medianx.tv

సోను నిగం జడ్జిగా రియాల్టీషో

సింగింగ్ రియాల్టీషో-‘ది ఎక్స్‌ఫ్యాక్టర్’కు బాలీవుడ్ గాయకుడు సోనునిగం న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నారు. సోనీ టివిలో త్వరలో ఈ షో ప్రారంభంకానుంది. ఐపిఎల్ తర్వాత ఇది ప్రేక్షకులను అలరించనుందని సోనీ టివివర్గాలు తెలిపాయి. ఢిల్లీతో సహా ఏడు నగరాల్లో ఆడిషన్ నిర్వహిస్తారు. ఈ షోను నిర్వహించే ఆదిత్య నారాయణ్ కూడా ఈ నగరాలను సందర్శిస్తారు. 16 నుంచి 25 ఏళ్లవారు, 25 ఏళ్లు దాటిన వారెవరైనా ఇందులో పాల్గొని గానంలో తమ ప్రతిభను నిరూపించుకోవచ్చు. సోనునిగంతో బాటు మరో ఇద్దరు న్యాయనిర్ణేతలుగా వ్యవహరిస్తారు.

Source: medianx.tv

ఇండియన్ రియాల్టీషోలో జెన్నిఫర్

కలర్స్ ఛానల్స్‌లో ఆమధ్య ప్రసారమైన ‘బిగ్‌బాస్-4’ రియాలిటీషో కోట్లాది మందిని ఆకట్టుకుంది. ఆ షో చివరి నాలుగు రోజులలో భారత ప్రేక్షకుల్ని మైమరపించిన బేవాచ్ మాజీ స్టార్ పమేలా ఆండర్సన్ అందరికీ గుర్తుండే ఉంటుంది. అలాగే పమేలా బాటలో ఇప్పుడు పాప్ సింగర్ జెన్నిఫర్ లోపెజ్ కూడా పయనిస్తోంది. భారత్‌లో ఓ ఛానల్ నిర్వహించే రియాల్టీషోలో పాల్గొనేందుకు ఆమె అంగీకరించినట్టు భోగట్టా! అమెరికాలో హిట్టయిన ‘ఎక్స్‌ఫ్యాక్టర్’ మ్యూజికల్ రియాల్టీషోకు మన దేశవాళీ తరహాలో షోను నిర్వహించేందుకు ఓ ఛానల్ రెడీ అవుతోంది. ఇందులో జెన్నిఫర్‌ను న్యాయనిర్ణేతగా తీసుకుంటారట… పాప్‌సింగర్‍గా ‘జెన్నీ’కి కోట్లాది అభిమానులున్నారు. ఈ రియాల్టీషోతో ఆమె భారత్‌కు చేరువయ్యే అవకాశాలున్నాయి. ఏమైన ఈ రియాల్టీషోలతో టిఆర్‌పి రేటింగ్‌లు పెరుగుతాయంటారా?

Source: medianx.tv

హృతిక్ ‘జస్ట్‌డ్యాన్స్’ రియాల్టీ షో

స్టార్ ప్లస్‌లో ‘జస్ట్‌డ్యాన్స్’ పేరిట ప్రారంభం కానున్న డ్యాన్స్ రియాల్టీషోకు బాలీవుడ్ నటుడు హృతిక్ రోషన్ న్యాయనిర్ణేతగా వ్యవహరించనున్నాడు. జూన్ లేదా జులైలో ఈ షో ప్రారంభమవుతుంది. ఈ షోలో అంతర్జాతీయ స్థాయిలో అన్ని దేశాలవారు పాల్గొంటారు. డ్యాన్స్‌లో తమ ప్రతిభను నిరూపించుకోవడానికే కాక, హృతిక్‌తో కలిసి స్టెప్పులేయడానికి కూడా విజేతలకు ఇది మంచి అవకాశం కల్పించనుంది. ఈ రియాల్టీషో ప్రోమోల షూటింగ్ కోసం హృతిక్ సుమారు 17 గంటలపాటు శ్రమించాడని వినికిడి! గుజారిష్, కైట్స్ సినిమాలు “ఫట్” అయినా హృతిక్ డ్యాన్స్ “హిట్” అని స్టార్ ప్లస్ నిరూపించనుందా?

Source: medianx.tv

ఫేస్ బుక్‌పై స్టార్ మూవీస్, స్టార్ వరల్డ్ హల్‍చల్

కంప్యూటర్ ప్రపంచంలో సోషల్ నెట్‍వర్క్ వెబ్‍సైట్లు హల్‍చల్ సృష్టిస్తుండగా అదే స్థాయిలో ఫేస్‌బుక్ కూడా దూసుకువస్తోంది. ఇది స్టార్‌ మూవీస్, స్టార్ వరల్డ్ ఛానల్స్‌కు వరమయింది. ఫేస్‌బుక్‌పై ఈ రెండు ఛానల్స్‌కు దాదాపు మూడున్నర లక్షలమంది చేరువయ్యారు. ఐప్యాడ్, ఐ-ఫోన్స్, ల్యాప్‌టాప్ వంటి వాటిని వాడుతున్నవారంతా ఫేస్‌బుక్‌ను ఆశ్రయిస్తూ ఈ ఛానల్స్ పట్ల తమ అభిమానాన్ని చాటుకుంటున్నారు. దీని వల్ల ప్రజల నాడి తెలుసుకునేందుకు వీలుకలుగుతోందని ఈ ఛానల్స్‌ వర్గాలు తెలిపాయి. ప్రతినెలా స్టార్ వరల్డ్‌కు సుమారు 12 వేల మంది స్టార్‌ మూవీకు దాదాపు 30 వేల మంది ఫేస్‌బుక్‌తో సన్నిహితం అవుతున్నారట! ఇటీవలే ఈ రెండు ఛానెల్స్ తమ అభిమానుల కోసం కొత్త పోటీలు కూడా ప్రారంభించాయి… టివిలో తమ ఫేవరేట్ సినిమాలను, ఇతర కార్యక్రమాలను చూసేందుకు వారికోసం ‘ఓటు హక్కు’ పోటీలను కూడా ఇవి నిర్వహించాయట!

Source: medianx.tv

అదండీ సంగతి!

కొన్ని ఛానల్స్‌లో వస్తున్న రియాల్టీషోలలో ‘పెద్దవారికి మాత్రమే’ ఉండే అంశాలను ఇక 20 ఏళ్లు పైబడినవారంతా ఆస్వాదించే అవకాశాలు ఉన్నాయి. తమకు ఇష్టమైన ‘అడల్ట్ రియాల్టీషో’లలో ‘ఎడిట్’ చేయని సన్నివేశాలను వారిక చూడవచ్చునట. అయితే ఇందుకు ఓ “రూల్” ఉంది. ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ వీటిని రాత్రి 11 తెల్లవారు జామున 4 గంటల మధ్య ప్రసారం చేసే ఛాన్స్ ఉంది. కేంద్ర సమాచార, ప్రసారశాఖ ఇందుకు గ్రీన్‌సిగ్నల్ ఇచ్చే యోచనలో ఉంది. పిల్లలు చూడదగని రియాలిటీ షోలను ఆయా ఛానల్స్ ఈ సమయంలో మాత్రమే టెలికాస్ట్ చేయవచ్చునని ఈ శాఖ సూత్ర ప్రాయంగా భావిస్తోంది. ఈ విషయంపై ఈ శాఖ ఇండియన్ బ్రాడ్ కాస్టింగ్ ఫౌండేషన్‌తో చర్చిస్తోంది. ఇదంతా చూస్తుంటే మన భారతీయ సంస్కృతి ఎటు పోతోంది అన్న ప్రశ్న తలెత్తక మానదు.

Source: medianx.tv

టివి9లో టిఎస్‌ఆర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమం

ప్రతిష్టాత్మకమైన టిఎస్‌ఆర్ ఫిల్మ్ అవార్డుల కార్యక్రమాన్ని టివి9 నిర్వహించనుంది. కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత, కళాబంధు టి.సుబ్బరామిరెడ్డి ప్రవేశ పెట్టిన ఈ అవార్డులకు ప్రేక్షకులే న్యాయ నిర్ణేతలుగా వ్యవహరించనున్నారు. ఉత్తమ నటుడు,  ఉత్తమ నటి, ఉత్తమ యువ నటుడు, ఉత్తమ యువ నటి తదితర రంగాలకు సంబంధించి అవార్డుల ప్రదాన కార్యక్రమం ఏప్రిల్ 10న శిల్పకళావేదికపై అంగరంగ వైభవంగా జరగనుంది. ఈ కార్యక్రమానికి… ప్రోమోలు సిద్ధమయ్యాయి. బాలీవుడ్ నుంచి ధర్మేంద్ర, మహిమాచౌదరి, అమీషా పటేల్ వంటి అగ్రశ్రేణి తారలే కాక, టాలీవుడ్ నుంచి అనేక మంది సినీ నటీనటులు ప్రముఖులు హాజరై దీనికి వన్నె తేనున్నారు. సినీ వినీలాకాశంలో ఎవరి నటన ఉజ్వలంగా ఉంటుందో ప్రేక్షకులు తేల్చనున్న ఈ చక్కని వేడుక ‘న భూతో న భవిష్యత్’ అన్న తీరులో జరగనుందని టిఎస్‌ఆర్ అంటున్నారు.

Source: medianx.tv

యుఎస్‌లో నియో క్రికెట్

భారత్‌లో క్రీడాభిమానులకు అత్యంత ప్రీతిపాత్రమైన స్పోర్ట్స్ ఛానెల్ ‘నియో క్రికెట్’ అమెరికా వాసులకు కనువిందు చేయనుంది. ఈ ఛానెల్‍తో ‘నియో బ్రాడ్‌కాస్ట్ అమెరికా ’ అనే సంస్థ డిస్ట్రిబ్యూషన్ అగ్రిమెంట్ కుదుర్చుకుంది. దీంతో భారత్‌లో బిసిసిఐ నిర్వహించే అన్ని అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌ల ప్రత్యక్ష ప్రసారాన్ని నియో క్రికెట్ ఛానెల్‍లో అమెరికా వాసులు చూడగల్గుతారు. ఈ తాజా ఒప్పందం యుఎస్‌లోని క్రికెట్ అభిమానులకు పండుగే అవుతుందని నియోస్పోర్ట్స్ బ్రాడ్‌కాస్ట్ సిఓఓ ప్రసన్నకృష్ణన్ అభివర్ణించారు.

Source: medianx.tv

శాటిలైట్ టెక్నాలజీవైపు రేడియోచూపు

దశాబ్దాలుగా అతి మారుమూల ప్రాంతాలకు సైతం చొచ్చుకుపోయిన రేడియో శాటిలైట్ టెక్నాలజీవైపు దృష్టి సారించాలని బ్రాడ్‌కాస్ట్ మీడియాకు చెందిన నిపుణులు సూచిస్తున్నారు. ఢిల్లీలో జరిగిన ‘రేడియో ఆసియా-2011’ సదస్సులో పాల్గొన్న వీరు అత్యాధునిక టెక్నాలజీలు రేడియోకు మరింతగా తోడ్పడాలని కోరారు. బ్రాడ్‌కాస్టర్లకు శాటిలైట్ రేడియో ఓ వరం కావాలని వారు పేర్కొన్నారు. ఇండియాలో డిటిహెచ్‌పైగల ప్రతి వంద ఛానళ్లకు రెండు వందల రేడియో ఛానళ్లు అందుబాటులో ఉన్నా వాడుకలో లేకుండా వృధాగా ఉన్నాయని, బ్రాడ్‌కాస్టర్లు వీటిని వినియోగించుకోవాలని నిపుణులు సూచించారు. నేడు డిజిటల్ రేడియో ఆవశ్యకత ఎంతోఉందని అభిప్రాయపడ్డారు. షార్ట్‌వేవ్, మీడియం వేవ్‌లపై డిజిటల్ టెరెస్ట్రియల్ రేడియో వ్యవస్థను బ్రాడ్‌కాస్టర్స్ వినియోగించుకోవచ్చునని, అలాగే రేడియో కార్యక్రమాల కంటెంట్ పెంచేందుకు ఇంటర్నెత్‌ను ప్రధాన సోర్స్‌గా వాడుకోవాలని బ్రాడ్‌కాస్ట్‌ మీడియా నిపుణులు సూచిస్తున్నారు.

Source: medianx.tv

ప్రపంచకప్ పంచ్

వరల్డ్‌కప్ పంచ్ భారతీయ టివి మార్కెట్‍ను ఓ కుదుపు కుదిపింది. ఈ కప్ పుణ్యమా అని టివి చానెల్స్ రేటింగ్‌లు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఓపెనింగ్ డేనాడు బంగ్లాదేశ్‌ను భారత జట్టు దెబ్బతీయడంతో టివిల పంటపండింది. బెంగళూరు, ముంబై, కోల్‍కతా వంటి ఆరు మెట్రోనగరాల్లో ఆ రోజు వీటి రేటింగ్ 12.48 శాతం ఉందట! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువట! ఈ నగరాల్లో దాదాపు మూడు కోట్లమంది టివిలకు అతుక్కుపోయి ఈ మ్యాచ్‌ను చూశారు. దూరదర్శన్‌తో పోలిస్తే స్టార్ క్రికెట్ రేటింగ్ సగటున 3.03 ఇఎస్‌పిఎన్ 2.47, స్టార్ స్పోర్ట్స్ 0.89 శాతం ఉన్నట్టు వెల్లడయింది. వీటిలో బెంగళూరు టాప్‌మోస్ట్‌లో ఉండగా, ఆ తర్వాత ముంబై రెండో స్థానం వహించింది. భారత జట్టు ఆడనున్న రోజుల్లో ఈ రేటింగ్ ఇంగా పెరగవచ్చునని భావిస్తున్నారు. ఒక నాటి ప్రపంచకప్ పోటీల సందర్భంలో కపిల్‍దేవ్ కొట్టిన 175 రన్స్‌ని గుర్తు చేసుకుందాం, తిరిగి మళ్లీ ఇప్పుడు మన సెహ్వాగ్ 175 పరుగులు చేయడం చూస్తే ప్రపంచకప్ మనదేనన్న ఆశలు మొలకెత్తుతున్నాయి.

Source: medianx.tv

కోట్లలో ఇక “ఇమాజిన్” పెళ్లిళ్లు

‘ఇమాజిన్’లో రియాలిటీషోలు ఎప్పుడూ న్యూస్‌లో ఉంటున్నాయి. రాఖీసావంత్ ‘స్వయంవర్’ గానీ రాహుల్ ‘దుల్‍హనియా లే జాయింగే’ కానీ… ఏదైనా అనేక మందిని ఆకట్టుకుంటూ వచ్చాయి. మనదేశంలో పెళ్లిళ్లు అంటే ఆషామాషీ కాదు. శ్రీమంతుల విషయం వదిలేస్తే, మధ్య తరగతివారు ఓ పెళ్లి చేయాలంటే కనీసం 5 నుంచి 10 లక్షల వరకు ఖర్చు చేయాల్సివస్తోంది. అయితే ఇమాజిన్ టివి ఇప్పుడు సరికొత్త రియాలిటీ షోకు శ్రీకారం చుడుతోంది. ఓ లక్కీ జంట పెళ్లికి అక్షరాలా మూడుకోట్ల రూపాయలు ఖర్చు పెట్టనుంది. ‘షాదీ తీన్ క్రోర్‌కీ’ పేరిట ఈ రియాలిటీషో ఆ లక్కీ జంట కలలను సాకారం చేయనుంది. ఈ షోలో కేవలం ఓ ఇన్విటేషన్ కార్డుకే 5 వేల రూపాయలు ఖర్చు పెడతారు. వధువుకు 25 సెట్ల నగలు, రిసెప్షన్, డిన్నర్‌లలో 250 రకాల డిషెస్ ఉంటాయి. మోనాసింగ్, అలీసాగర్‌లు హోస్ట్‌లుగా వ్యవహరించే ఈ షో ఓ మధ్య తరగతి లక్కీ జంటకు వరమేకానుంది. బాలీవుడ్ బాద్‌షా షారుఖ్ ఖాన్ నిర్వహిస్తున్న ‘జోర్‌కా ఝుట్కా’ స్థానే ఈ రియాల్టీషో ఈ నెల 28 నుంచి ప్రారంభమవుతొందని ఇమాజిన్ టివి వర్గాలు తెలిపాయి.

Source: medianx.tv

హిందీలో ‘మగధీర’...

2009లో బాక్సాఫీసు బద్దలు కొట్టిన తెలుగు బ్లాక్‌బస్టర్ చిత్రం ‘మగధీర’ను హిందీలో తీస్తున్నట్టు ‘గజిని’ ప్రొడ్యూసర్ మధుమంతెన ప్రకటించారు. రామ్‌చరణ్‍తేజ, కాజోల్ జంటగా నటించిన ‘మగధీర’ పలు అవార్డులు సైతం సొంతం చేసుకుంది. అద్భుతమైన గ్రాఫిక్స్, కంప్యూటర్ వర్క్స్, పునర్జన్మ అంశంతో సరికొత్త కథనం- ఈ సినిమాకు హైలైట్‌గా నిలిచాయి.  17వ శతాబ్దం నాటి కథనాన్ని, 400 ఏళ్ల తర్వాత ఆధునిక కాలంతో ముడిపెడుతూ సాగిన ఈ సినిమా సంగీతంలోనూ సరికొత్త బాణీని పలికించింది. ప్రేక్షకులను మురిపించింది. మగధీర హిందీ రీమేక్‌లో బాలీవుడ్ నటుడు రణబీర్ కపూర్ డబుల్‍రోల్‍లో నటిస్తాడు. మగధీర దర్శకుడు ఎస్.ఎస్.రాజమౌళి ఈ సినిమాకూ దర్శకత్వం వహించనున్నారు. మలయాళంలో డబ్ అయిన ఈ సినిమా “ధీరన్” త్వరలో రిలీజ్ కానుంది.

Source: medianx.tv

‘ఫాక్స్’కు మరో 7 ఛానల్స్

ఆసియాలో మంచి నెట్‍వర్క్ కలిగి ఉన్న ఫాక్స్ ఇంటర్నేషనల్- భారత్‌లో కొత్తగా మరో 7 ఛానల్స్ ప్రారంభిస్తోంది. ఇప్పటికే నేషనల్ జియొగ్రాఫిక్, ఫాక్స్ హిస్టరీ అండ్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ అశేష జనాదరణ పొందాయని ఈ ఛానెల్ వర్గాలు తెలిపాయి. ఇండియాలో ఈ జోరు కొనసాగించేందుకు మరో 7 ఛానెల్స్ అవసరమని భావిస్తున్నట్టు చెప్పాయి. ఆసియాలోని ఇతర దేశాల మార్కెట్లతో పోలిస్తే భారత్‌లో తమకు మంచి డిమాండ్ ఉందని ఫాక్స్ ఇంటర్నేషనల్ భావిస్తోంది. ఈ ఛానెల్స్ ద్వారా ప్రజానీకానికి మరింత చేరువకావాలని అనుకుంటోంది.

Source: medianx.tv

ఫ్యాషన్ టివి నుంచి మరో ఛానెల్

ప్రపంచవ్యాప్తంగా పాపులర్ అయిన  ఫ్యాషన్ టివి త్వరలో  ‘ఫ్యాషన్ టివి హెచ్‌త్రీడి’ ఛానెల్‍ను ప్యారిస్‌లో ప్రారంభించనుంది. ఇందుకోసం ఈ టివి ఆర్‌ర్ శాట్ గ్లోబల్ కమ్యూనికేషన్స్ నెట్‍వర్క్ సేవలను వినియోగించుకుంటుంది. తన ట్రయల్ రన్‌లో భాగంగా ఈ నెట్‍వర్క్ ఈనెల 18 నుంచి ఫ్యాషన్‌టివి త్రీడి ప్రసారాలకు శ్రీకారం చుట్టింది. ఇది 10 నిముషాలపాటు ప్రతిరోజూ వస్తోంది. అందాల భామల సోయగాలు, క్యాట్‌వాక్‌లు, మిస్ యూనివర్స్, మిస్‌ వరల్డ్ వంటి సుందరీమణుల పోటీలతో కోట్లాది మందిని రంజింపజేస్తున్న ఫ్యాషన్ టివి 193 దేశాలలో ‘అందాల ప్రేమికుల్ని’ అలరిస్తోంది. డిటిహెచ్ నెట్‌వర్క్‌లపై హైక్వాలిటీ త్రీడి ప్రసారాలను అందజేయాలన్నదే తమ లక్ష్యమని ఆ టివి వర్గాలు తెలిపాయి. మరో ఛానల్ ప్రారంభంతో మరింత మందికి తాము చేరువవుతామని ఈ వర్గాలు వివరించాయి.

Source: medianx.tv

టైమ్స్ నుండి కొత్త డిటిహెచ్ మూవీ ఛానెల్:

టైమ్స్ టెలివిజన్ నెట్వర్క్ కొత్తగా మూవీ ఛానెల్ ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తుంది. మూవీస్‌నౌ అనే పేరుతో రానున్న ఈ ఛానెల్ హెచ్‌డీ ఫార్మేట్‍లో వున్న సినిమాలతో ఆడియన్స్‌కి చేరువ కావాలనుకుంటుంది. ఇండియాలో పూర్తి స్థాయి హెచ్‌డీ సినిమాల ఛానెల్‍గా టైమ్స్‌నౌ ట్రెండ్ క్రియేట్ చేయబోతోంది. డైహార్డ్-4, ఎక్స్-మెన్ లాంటి బ్లాక్‌బస్టర్ సినిమాలతో మంచి ఓపెనింగ్స్ రాబట్టడానికి నిర్వహాకులు ఏర్పాట్లు చేస్తున్నారు. 1080i, 5.0 సరౌండ్ సౌండ్ లాంటి స్టన్నింగ్ ఫీచర్స్ ప్రేక్షకుల్ని ఖుషీ చేయనున్నాయి. ఇంగ్లీషు సినిమాలకి ఇండియాలో ఎలాంటి గిరాకీ వుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. స్టార్‌మూవీస్, హెచ్‌బిఓలకి లభిస్తున్న డిమాండ్ టైమ్స్ ఈ నిర్ణయం తీసుకోవటానికి కారణం. సినిమాల ఎంపిక విషయంలో కొంచెం జాగ్రత్తగా వుంటే, హెచ్‌డి టెక్నాలజీ అద్భుతాలు చేయగలదని టైమ్స్ భావిస్తోంది. ఏక్షన్, కామెడీ, రొమాన్స్ ఏదో ఒక దానికే పరిమితం కాకుండా ద బెస్ట్ ఆఫ్ ఆల్‌ కైండ్స్ అనే ఫార్మూలాని ఫాలో అవ్వాలనే టైమ్స్ ఉద్దేశం ఇండియన్ మూవీలవర్స్‌కి కన్నుల విందు చేయడం ఖాయం.  

Source: medianx.tv

మన TV9 మెరుగు అయిన సమాజం కోసం పని చేస్తోందా ????

మన TV9 మెరుగు అయ్యిన సమాజం కోసం పని చేస్తోందా ? రేటింగ్  కోసం పని చేస్తోందా? జర్నలిజం గురించి వాటి విలువల గురించి హక్కుల గురించి  మాటలు ఆడే TV9 వాటి విలువలు పాటిస్తోందా  ఒక అప్పుడు TV9 అంటే జనాలు ఇష్టపడే వారు ? కానీ ఇప్పుడు  ప్రజలు ఏమంటున్నారు  TV9 గురించి  ప్రజల స్పందన ఏమిటి http://amplicate.com/hate/tv9


TV9ని అభినందించే వారు ఇష్ట పడేవారికీ  కూడా ఈ మధ్య ఆ ఛానల్ పట్ల ఆసక్తి తగ్గింది దానికి కారణం ఆ ఛానల్ అనవసరం అయిన చర్చలు పెట్టడం వల్ల .


TV9 బాధ్యతగా వుందా ? మనం ఒకరికి సహాయం చేసేటప్పుడు మన పేరు కన్నా సహాయం ముఖ్యం అని ఆలోచన చేయాలి ముఖ్యంగా వరదలు వచినప్పుడు మన బ్రాండ్ నేమ్ ప్రోమోట్ చేయడం ముఖ్యం కాదు. 
ఎవరో హీరో కూతురు పెళ్లి చేసుకుటే ఆ పెళ్లి గురించి ఆ రోజంతా మనం ఆ ప్రోగ్రాం వేసి ఆ ఇంట్లో వాళ్ళ పరువును దిగజార్చడం జర్నలిజం ఆ ??? వర్మ జీవితం గురించి  వర్మ రక్తచరిత్ర సినిమా గురించి ప్రోగ్రామ్స్ చేసేటప్పుడు మనం CRIME WATCH ప్రోగ్రాం చేయకూడదు కల్పిత పాత్రలు అని రాసి మరి చూపిస్తాం ఇది సమాజానికి అవసరమా ? ఇలాంటి కార్యక్రమాలు చూసి తప్పుచేసిన వాళ్ళు ఎలా తప్పించు కోవాలో తెలుసు కుంటున్నారు ఒక వ్యక్తి మరణిస్తే EXCLUSIVE FIRST ON TV9 అని వస్తుంది ఒకరి విషాదం ఒకరి బాధను మనం ఆ విధంగా చూపించ వచ్చునా ఇది ఏ రకమయిన జర్నలిజం రాంగోపాల్ వర్మ సినిమాల గురించి రాంగోపాల్ వర్మ  గురించి గంటల గంటలు చర్చలు అవసరమా TV9 వచ్చిన కొత్తలో తప్పు చేయాలి అంటే భయం కానీ ఇప్పుడు డబ్బు ఇస్తే న్యూస్ చూపించరు అనే విధంగా తయారు అయ్యింది.














ఇలాంటి కార్యక్రమలు చూపించడమే మెరుగైన సమాజమా
 
సోర్సు: apsensational.blogspot.com

జాక్‌పాట్‌ను వదులుకుంటున్న నమిత

Source: andhravilas.com

గత జన్మలున్నాయా, చానెళ్ల గోల

పూర్వ జన్మలకు సంబంధించిన సినిమాలను మనం చాలానే చూశాం. వాటిని అలా చూసేసి వదిలేస్తాం. గత జన్మలున్నాయా, లేదా అనే ఆలోచన, మీమాంస అప్పుడు పెద్దగా పనిచేయదు. దాని అవసరం కూడా ఉండదు. గత జన్మలున్నాయా, లేదా అని మీమాంసలోకి వెళ్లాల్సిన అవసరం సినిమాలు కల్పించవు. సినిమాను ఓ ఊహా ప్రపంచంగానే పరిగణిస్తాం కాబట్టి ఆ అవసరం ఏర్పడదు. కానీ ఇటీవల తెలుగు టీవీ చానెళ్లకు పూర్వజన్మ రోగం పట్టుకుంది.

గత జన్మలున్నాయని, ఈ లోకంలోని మనుషులు గత జన్మల్లోకి వెళ్లి తాము ఎదుర్కున్న పరిణామాలను చూడవచ్చునని తెలుగు టీవీ చానెళ్లు ఇటీవల పెద్ద యెత్తున ఊదరగొడుతున్నాయి. అది వాస్తవమైనప్పటికీ కార్యక్రమాలను ప్రసారం చేస్తున్నాయి. మా టీవీ చానెల్‌లో ప్రముఖ సినీ నటుడు సాయి కుమార్ యాంకర్‌గా వ్యవహరిస్తూ గత జన్మ రహస్యం అనే కార్యక్రమాన్ని ప్రసారం చేస్తున్నారు. వారానికి ఒక రోజు ఈ కార్యక్రమం ప్రసారమవుతోంది. ఓ వైద్యుడు తన వద్దకు వచ్చిన వ్యక్తిని హిప్నటైజ్ చేసి గత జన్మలోకి తీసుకుని వెళ్తున్నాడు. దాన్ని చిత్రీకరించి ప్రసారం చేస్తున్నారు.

అతను దాదాపు లక్ష మందికి పూర్వజన్మలు చూపించినట్లు అతను ఢంకా బజాయించి చెప్పుకుంటున్నాడు. ఇప్పటి వరకు మూడు ఎపిసోడ్‌లు ప్రసారమయ్యాయి. ఇందులో హీరో రాజాను కూడా ఆ వైద్యుడు గత జన్మలోకి తీసుకుని వెళ్లాడు. మూడు వేల ఏళ్ల క్రితం రాజా ఓ పోరాట యోధుడట. ఆ కథనాన్ని హిప్నటైజ్ అయిన రాజాను చూపిస్తూ దృశ్యాలుగా చిత్రీకరించి ప్రసారం చేశారు. గత జన్మలు ఉన్నాయని తాను నమ్ముతున్నానని యాంకర్‌గా వ్యవహరిస్తున్న సాయి కుమార్ పదే పదే చెప్పడం కార్యక్రమంలోని ప్రధానాంశం.

మా టీవీలో ఈ కార్యక్రమం ప్రారంభమైన వెంటనే మరో రెండు టీవీ చానెళ్లు రంగంలోకి దిగాయి. ఎన్టీవీ ఓనాడు దానికి సంబంధించిన కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. గత జన్మలోకి తీసుకుని వెళ్లే ఈ కార్యక్రమం ఏ మేరకు నమ్మదగిందో అర్థం కాదు. అలాగే, మహా టీవీలో కూడా యాంకర్‌ను గత జన్మలోకి తీసుకుని వెళ్లినట్లు ఓ కార్యక్రమం ప్రసారమైంది. ఇవన్నీ చూసిన ఎబిఎన్ ఆంధ్రజ్యోతి టీవీ చానెల్ రంగంలోకి దిగింది.

ఓ వైద్యుడిని, ఇద్దరు వైద్యులను పెట్టుకుని ఈ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. వైద్యుడు టీవీ యాంకర్, జర్నలిస్టు మూర్తిని వైద్యుడు గత జన్మలోకి తీసుకుని వెళ్లే ప్రయత్నాన్ని లైవ్‌గా చూపించారు. అయితే, అలా వెళ్లడం తనకు సాధ్యం కాలేదని మూర్తి చెప్పారు. తనకు ఏ వెలుగు మాత్రమే కనిపించిందని, అయితే శరీరమూ మనసూ చాలా విశ్రాంతిని పొందినట్లుగా ఉందని మూర్తి చెప్పారు.

అయితే, అవసరం ఉన్నవారు గత జన్మలోకి వెళ్తారని ఆ వైద్యుడు తప్పించుకున్నారు. మనిషి మరణించిన తర్వాత జన్మలుంటాయని శాస్త్రీయంగా నిరూపితం కానప్పుడు, అలాంటి జన్మలు ఉండనప్పుడు గత జన్మలోకి వెళ్లడం సాధ్యం కాదని ఈ కార్యక్రమంలో పాల్గొన్న డాక్టర్ కె. లింగా రెడ్డి చెప్పారు. కానీ, ఆయనతో వైద్యుడు ఏకీభవించలేదు. ఏమైనా, గత జన్మ రహస్యం ఎపిసోడ్ మాత్రం మాటీవీలో సాయి కుమార్ యాంకర్‌గా వారం వారం ప్రసారమవుతూనే ఉన్నది.

Source: thatstelugu.oneindia.in

MAA TV bags ‘Damarukam’ satellite rights

Even as the shooting of ‘Damarukam’ of Nagarjuna is yet to begin, the satellite rights for the film were sold out. MAA TV bagged the satellite rights of the movie for a record price of Rs 5.50 crore, which is a record in Nag’s carer. Anushka is pairing up with the King in this movie and the film is being directed by Srinivasa Reddy and produced by Venkat on the banner of RR Movie Makers. It is learnt that it is a socio-fantasy film and it also has a lot of scope for graphics and the producer is planning to assign job to experts as the total length of graphics are expected to be around 50 minutes. The film is slated for release as Sankranti gift next year.

Source: www.telugucinemascreen.com

Friday, February 25, 2011

'రామ్ ఢమాల్ వర్మ' పై కథనం: TV-9 కు లీగల్ నోటీస్!

ఎవరిమీదనైనా...ఎలాంటి కార్యక్రమమైనా... ప్రసారం చేస్తానని విర్రవీగుతున్న TV-9 ఛానల్ తిక్కకుదిర్చే పని ఎట్టకేలకు ఒక వ్యక్తి  చేసాడు.  ఆయన...ఎప్పుడేమి చేస్తాడో, ఎప్పుడేమి చెబుతాడో తెలీని వ్యక్తే అయినా...ఆయన చర్య ఈ తలతిక్కల చానెల్స్ కు ఒక గుణపాఠం అవుతుందన్న ఆశాభావం నాకుంది. ఆ వ్యక్తే...స్టార్ దర్శకుడు....రామ్ గోపాల్ వర్మ. ఆయన చేసినట్లు చెబుతున్న ప్రకటన ఇలా ఉంది.
"With regard to an extremely derogatory programme done by TV9 on me titled 'Ram Dhamaal Varma' where they have attributed many false quotes to me of which one example is 'Prekshakullu Verri Vedhavulu'. I am here by informing that I am initiating criminal action against TV9 for defamation with a criminal intent"

ఈ గొడవకు కారణమైన కార్యక్రమం "రామ్ ఢమాల్ వర్మ" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని TV-9 ఫిబ్రవరి 23 (బుధవారం) సాయంత్రం ప్రసారం చేసింది. జర్నలిజం ప్రమాణాల పరంగా చూస్తే ఈ కార్యక్రమం నిజంగా ఒక చెత్త. వర్మపై వ్యక్తిగతంగా కసితో చేసిన పరుషమైన మాటల దాడి. శాస్త్రీయ విశ్లేషణలేని  ఎల్లో జర్నలిజం. వర్మే కాక ఎవరిపైనైనా ఇంత దారుణమైన దాడి చేయడం తగని పని. 

I-News లో కనిపించిన చల్లా శ్రీనివాస్, HM-TV లో పనిచేసిన ప్రభు అనే 'సినీ విశ్లేషకులను' స్టూడియోలో కూర్చోబెట్టి భద్రి అనే యాంకర్ యమ కసితో ఈ ప్రోగ్రాం చేసారు. వర్మ కెరీర్ గ్రాఫ్ అథఃపాతాళానికి పడిపోయింది...ఆయన తీసిన లేటెస్ట్ సినిమా అప్పలరాజ్ ది మోస్ట్ వరస్ట్ ఫిలిం అనుకుంటున్నారు...వంటి కామెంట్స్ భద్రి చేసారు. 
ఆ చల్లా శ్రీనివాస్ అయితే వర్మ..."ఇష్టమొచ్చిన సొల్లు వాగుతున్నాడు...", "గారడీ చేస్తున్నాడు", "చేతగాని...చేవలేని డైరెక్టర్", "ఇంట్రావర్ట్" వంటి కామెంట్స్ తేలిగ్గా చేసారు. "ఆయన క్రియేటివిటీని రీ చార్జ్ చేసుకోవాలి," అని కూడా అయన సలహా ఇచ్చారు. "రామ్ గోపాల్ వర్మ అంటే భయపడే స్థితిలో జనం వున్నారు," అని ప్రభు చెప్పారు. మధ్యలో...యండమూరి కూడా ఏదో మాట్లాడినట్లు వున్నారు...నేను అది మిస్ అయ్యాను. 

ఇక ఈ ప్రోగ్రాం కొనసాగుతున్నప్పుడు ఆ చానెల్ తెర మీద కనిపించిన వాక్యాలు ఇవి: 
--వర్మకు మతి భ్రమించిందని కామెంట్లు
--రోజు రోజుకీ పేరుప్రతిష్టలు మసకబారుతున్నాయి
--అతని సినిమాలు చూస్తే ప్రేక్షకులకు తిప్పలే
--ఇప్పుడు తీస్తున్నవన్నీ పరమసోది సినిమాలే
--సినిమా మేకింగ్ పై వర్మ శ్రద్ధ తగ్గింది

ఇలా సాగిన ప్రోగ్రాం ఎవరోచెప్పి చేయిస్తే...ఈ చానెల్ చేసిందన్న అనుమానం కలగకమానదు. 'వర్మ కెరీర్ గ్రాఫ్' అంటూ ఒక ప్రోగ్రాం ను కూడా ఇందులో ప్రసారం చేసారు. అందులో...చానెల్ కున్న కక్కుర్తి రోగం ప్రకారం నడుము తిప్పే భామల, సొగసులు చూపే సుందరాంగుల ఫిలిం క్లిప్స్ చూపించి కుతి తీర్చుకున్నారు. 

ఈ ప్రోగ్రాంతో వర్మకు మండిందట. అలా మండడం నిజానికి మంచి పరిణామం. ఇది కోర్టులో నలిగి...ఈ ప్రోగ్రాం చేసిన వారి నుంచి భారీగా నష్టపరిహారం వసూలు చేయడమో, వ్యక్తిగత దాడి చేసినందుకు సంబంధీకులకు అరదండాలు వేయడమో చేస్తే బాగుంటుంది. మిగిలిన చానెల్ ఎజమానులు కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుంటారు. 

వర్మ ఒక ఐదు కోట్లు ఇస్తే....రవి ప్రకాష్ నుంచి ఈ కార్యక్రమం ఆధారంగా ఒక యాభై కోట్లు నష్టపరిహారం పొందే మార్గం చెప్పడానికి మా అబ్రకదబ్ర సిద్ధంగా ఉన్నాడు. వర్మా....ఆర్ యూ రెడీ? 
 
Source: apmediakaburlu.blogspot.com

జగన్‌పై నారా లోకేష్ ప్రతీకారం

మాజీ పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్‌పై తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడి తనయుడు నారా లోకేష్ ప్రతీకారం తీర్చుకున్నారు. తన స్టూడియోఎన్  టీవీ చానెల్‌లో వైయస్ జగన్‌పై ఆరోపణాస్త్రాలు సంధిస్తూ లోకేష్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేశారు. ఏడు రోజుల పాటు దీక్ష చేసిన వైయస్ జగన్ అంత ఆరోగ్యంగా ఉండడమేమిటని, ఆ శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని, జగన్ ఆరోగ్య రహస్యమేమిటని ప్రశ్నిస్తూ ఆ చానెల్ ఓ కార్యక్రమాన్ని ప్రసారం చేసింది. ఫీజు రీయంబర్స్‌మెంట్ కోసం ఏడు రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన వైయస్ జగన్ దీక్ష ముగించిన తర్వాత ప్రభుత్వాన్ని శాపనార్థాలు పెడుతూ ధాటిగా ప్రసంగించారు. ఏడు రోజుల పాటు దీక్ష చేసిన జగన్‌ అంత దాటిగా మాట్లాడే శక్తి ఎక్కడి నుంచి వచ్చిందని చానెల్ ప్రశ్నించింది. దీక్షకు వచ్చినవారికి డబ్బులు పంపిణీ చేశారని, దాంతో వారు మద్యం కొనుక్కుని సేవించారని ఆరోపిస్తూ మద్యం కొంటున్న దృశ్యాలను స్టూడియోఎన్ ప్రసారం చేసింది. గతంలో చంద్రబాబు రైతు సమస్యలపై దీక్ష చేసినప్పుడు ఇదే విధమైన వార్తాకథనాన్ని జగన్‌కు చెందిన సాక్షి టీవీ చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. చంద్రబాబు దీక్షపై అనుమానాలు వ్యక్తం చేస్తూ, చంద్రబాబు ఆరోగ్య రహస్యమేమిటంటూ ప్రశ్నించింది. నీవు నేర్పిన విద్యయే అంటూ లోకేష్ జగన్ దారినే ఎంచుకున్నారు.

Source: thatstelugu.oneindia.in

Thursday, February 24, 2011

Ram Dhamaal Varma Video





RGV slaps case on TV9

Maverick film maker Ramgopal Varma sent legal notices to TV9 for telecasting a defamatory programme on him.  The show titled 'Ram Dhamaal Varma' was telecast on TV9 at 7PM on Wednesday.

The one hour show which also had critics on the panel lash out at RGV and his wierd antics and his flop show with KSD-Appalraju, bisected his career.  This well edited and fabulously written story was widely watched across the state.

TV9 executive editor Arun Sagar lent his voice to this story. The show called Varma a semi intellectual and a half mad person masquerading himself as an ace director.

This one hour dressing down of Varma didn't go well with him. He took offense to this show and sent legal notices to TV9  for defaming him.

RGV released a press statement confirming his legal proceedings against the channel.

"With regard to an extremely derogatory programme done by TV 9 on me titled ‘Ram Dhamaal Varma’ where they have attributed many false quotes to me, of which one example is ‘prekshakulu verri vedhavalu’, I am hereby informing that I am initiating criminal action against TV 9 for defamation with a criminal intent.

Source: www.indiaglitz.com

Ram Gopal Varma: 'Criminal Case Against TV9'

"With regard to an extremely derogatory programme done by TV9 on me titled 'Ram Dhamaal Varma' where they have attributed many false quotes to me of which one example is 'Prekshakullu Verri Vedhavulu'. I am here by informing that I am initiating criminal action against TV9 for defamation with a criminal intent"

Source: www.greatandhra.com

వరల్డ్‌కప్‌ అనధికార ప్రసారాల నిలిపివేతకు ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వులు

న్యూఢిల్లీ: ఐసీసీ వరల్డ్‌ కప్‌ను కేబుల్‌ ఆపరేటర్లు తమ కేబుల్‌ నెట్‌వర్క్‌ల ద్వారా అనధికారికంగా ప్రసారం చేయకుండా శాశ్వత నిరోధం కోరుతూ ఈఎస్‌పీఎన్‌ సాఫ్ట్‌వేర్‌ ఇండియా ప్రై.లి (ఈఎస్‌ఐపీఎల్‌) దాఖలు చేసిన కేసుకు సంబంధించి సంస్థకు అనుకూలంగా ఢిల్లీ హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. సుమారు 144 మంది కేబుల్‌ ఆపరేటర్లు ఎలాంటి లైసెన్సు పొందకుండా అనధికార కనెక్షన్లు తీసుకొని అనధికారికంగా సిగ్నల్స్‌ ఇస్తున్నట్లు ఈఎస్‌ఐపీఎల్‌ ఈ కేసులో వాదించింది.తాజా ఉత్తర్వుల నేపథ్యంలో ఎవరైనా, మరే ఇతర ఛానల్‌ అయినా అనధికారికంగా ఈ క్రీడలను ప్రసారం చేసినా ప్రాసిక్యూషన్‌కు బాధ్యులవుతారని ఈఎస్‌ఐపీఎల్‌ హెచ్చరించింది. లైసెన్సు లేకుండా ఈఎస్‌పీఎన్‌, స్టార్‌స్పోర్ట్స్‌, స్టార్‌ క్రికెట్‌ ఫీడ్‌ను అనధికారికంగా ప్రసారం చేసే ఇతర కేబుల్‌ ఆపరేటర్లపై చర్యలు తీసుకునే అవకాశాన్ని న్యాయస్థానం కల్పించింది.ఈ సందర్భంగా ఈఎస్‌ఐపీఎల్‌ అఫిలియేట్‌ సేల్స్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ టి.పానేసర్‌ మాట్లాడుతూ కోర్టు తీర్పుపై హర్షం వ్యక్తం చేశారు. పైరసీని తాము సహించబోమని న్యాయస్థానం స్పష్టం చేసినట్లయిందన్నారు. ఎక్కడైనా ఉల్లంఘనలు జరిగినట్లు తమ దృష్టికి వస్తే తగు చర్యలు తీసుకుంటామన్నారు. 

Source: www.suryaa.com

రు.5.5 కోట్లకు ‘తీన్‌మార్’ శాటిలైట్ హక్కులు

పవర్‌స్టార్ పవన్ కల్యాణ్, అందాల నటి త్రిష జంటగా నటిస్తున్న ‘తీన్‌మార్’ సినిమా శాటిలైట్ హక్కులు కళ్లు చెదిరే ధరకు అమ్ముడు పోయాయి. పవన్ అభిమానులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఈ చిత్రం శాటిలైట్ హక్కులను జెమిని టివి రు.5.5 కోట్లకు పొందింది. ‘తీన్‍మార్’ ఖచ్చితంగా తమ మనసుల్ని దోచుకుంటుందని పవర్‌స్టార్ అభిమానులు ఆశిస్తున్నారు. పవన్ పవర్ ఏమిటో రుచి చూసేందుకు వారు ఉవ్విళ్లూరుతున్నారు.

Source: medianx.tv

డిడికి 142 కోట్లు!

దూరదర్శన్ న్యూస్, డిడి ఉర్దూ, డిడి ఇండియాలకు 142 కోట్లరూపాయలు కేటాయించాలన్న ఓ ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖలోని సాధికారక కమిటీ సూత్ర ప్రాయంగా ఆమోదించింది. దూరదర్శన్‌కు సంబంధించిన ప్రాంతీయ ఛానెల్స్‌కు కూడా ఈ కేటాయింపు వర్తిస్తుంది. ఈ మొత్తం వల్ల ప్రసార భారతి నూతన కార్యక్రమాలకు సంబంధించి 15 వేల ఎపిసోడ్లను ప్రొడ్యూస్ చేయగలదని భావిస్తున్నారు. వీటివల్ల డిడికి కనీసం 40 కోట్ల ఆదాయం లభించే అవకాశాలున్నాయి. అయితే 142 కోట్లలో సుమారు 57 శాతాన్ని (రు.80 కోట్లు) దూరదర్శన్ ఉర్దూకు కేటాయిస్తారు.
దూరదర్శన్ వ్యూయర్‌షిప్‌ను పెంచడం, సరికొత్త కార్యక్రమాలు చేపట్టడం లక్ష్యంగా ఈ కేటాయింపు ఉంది. దీనివల్ల తాజా కంటెంట్ 6 గంటలనుంచి 14 గంటలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రసారభారతి బోర్డు ఆమోదించిన మార్పుల ప్రకారం దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో పాటు ప్రసారభారతిలో చైర్‌పర్సన్ మృణాల్ పాండే ఆధ్వర్యాన ఐదు కమిటీలు పని చేస్తాయి. వివిధ ఛానల్స్ నుంచి వార్తా ప్రసారాల పరంగాను, కార్యక్రమాల పరంగాను వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రసార భారతి ఇలా తన దూరదర్శన్, ఆలిండియా రేడియోలకు నూతన జవసత్వాలను కల్పించడానికి సిద్ధపడింది.

Source: medianx.tv

అనధికారిక టెలికాస్ట్ వద్దు

ఐసిసి వరల్డ్ కప్ మ్యాచ్‌లను అనధికారికంగా ప్రసారం చేయవద్దని ఢిల్లీ హైకోర్టు అక్కడి కేబుల్ ఆపరేటర్లను ఆదేశించింది. ప్రపంచకప్ ప్రసార హక్కులను పొందిన ఇఎస్‌పిఎన్ ఛానల్ దాఖలు చేసిన దావాను పురస్కరించుకుని కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ఢిల్లీలో పలువురు కేబుల్ ఆపరేటర్లు తమ అనుమతి లేకుండా అనధికారిక కనెక్షన్లు తీసుకుని ఇష్టం వచ్చినట్టు మ్యాచ్‌లను టెలికాస్ట్ చేస్తున్నారని ఈ ఛానెల్ పేర్కొంది.  లైసెన్స్ లేకుండా కొందరు ఇఎస్‌పిఎన్, స్టార్ స్పోర్ట్స్, స్టార్ క్రికెట్ ఛానెల్స్ నుంచి ‘ఫీడ్’ తీసుకొంటున్నారని ఈ ఛానల్ వివరించింది.

Source: medianx.tv

ఛానల్స్‌ రేటింగ్‌ పెంచిన భారత్‌ - బంగ్లా మ్యాచ్‌

ఐసీసీ వరల్డ్‌కప్‌లో ఈ నెల 19న భారత్‌, బంగ్లాదేశ్‌ల మధ్య జరిగిన మ్యాచ్‌ దేశవ్యాప్తంగా అభిమానులను విశేషంగా ఆకట్టుకుంది. టెలివిజన్‌ ఛానల్స్‌ రేటింగ్‌ను అమాంతం పెంచింది. రీసెర్చ్‌ ఏజెన్సీ టామ్‌ అందించిన వివరాల ప్రకారం ఆరు ప్రధాన మెట్రో నగరాల్లో ఈ మ్యాచ్‌కు 12.48 టీవీఆర్‌ (రేటింగ్‌) లభించడం విశేషం. ఈ ఓపెనింగ్‌ మ్యాచ్‌ ఈఎస్‌పీఎన్‌, స్టార్‌స్పోర్ట్స్‌, స్టార్‌ క్రికెట్‌, డీడీ1 ఛానళ్ళకు 7.8 సగటు క్యూములేటివ్‌ టీవీఆర్‌ అందించింది. 6 ప్రధాన మెట్రోల్లో ఈ మ్యాచ్‌ను 27.4 మిలియన్ల మంది వీక్షించారు. ఆ ఆరు మెట్రోల్లోనూ ఈ ఆరంభమ్యాచ్‌ సగటు రేటింగ్‌లలో, గత ఐపీఎల్‌ సీజన్‌ 3 ఆరంభమ్యాచ్‌ రేటింగ్‌లతో పోలిస్తే 11శాతం పెరిగింది. ఈ ప్యాక్‌లో మొదటి మ్యాచ్‌కు సంబంధించి 9.17సగటు టీవీఆర్‌తో బెంగళూరు అగ్రభాగంలో నిలిచింది. ఓపెనింగ్‌ మ్యాచ్‌ హవా షషష.వరజూఅర్‌aతీ.షశీఎ లోనూ కొసాగింది. మొదటి మ్యాచ్‌కు 8.5 మిలియన్‌ పేజ్‌ వ్యూస్‌ లభించాయి. ఐసీసీ క్రికెట్‌ వరల్డ్‌కప్‌ లైవ్‌ స్ట్రీమింగ్‌ కోసం ఈ వెబ్‌సైట్‌కు ఇప్పటి వరకూ 3 మిలియన్ల వీడియో అభ్యర్థనలు అందాయి. ఈ వెబ్‌ స్ట్రీమింగ్‌ ఇప్పటికే 1మిలియన్‌కు పైగా వెబ్‌ వీక్షకులను ఆకట్టుకుంది.

Source: www.visalaandhra.com

పాంటింగ్‌ టివి పగులకొట్టలేదు

బుధవారం గ్రూప్‌-ఎలో జింబాబ్వేతో అహ్మదాబాద్‌లో జరిగిన మ్యాచ్‌లో ఆస్ట్రేలియా కెప్టెన్‌ రికీ పాంటింగ్‌ రనౌట్‌ అయిన తర్వాత డ్రెస్సింగ్‌ రూమ్‌లో టివీ పగలగొట్టినట్టు వచ్చిన వార్తలపై ఆసీస్‌ మీడియా మేనేజర్‌ స్పందించారు. 'అతను టివి పగులకొట్టలేదు. ఒక బాక్స్‌ను గోడకేసి కొట్టడంతో అది వెళ్ళి టివి వెనక పడింది. దాంతో టివిలో సాంకేతిక లోపం ఏర్పడింది. ఈ సంఘటన పట్ల వెంటనే పాంటింగ్‌ క్షమాణాలు చెప్పాడు. టీమ్‌ మేనేజర్‌కు వివరణ కూడా ఇచ్చాడు. దాంతో ఈ సమస్య అప్పటితో ముగిసిపోయింది' అని ఆసీస్‌ టీమ్‌ మీడియా మేనేజర్‌ లాకె పాటర్సన్‌ తెలిపాడు.

గుజరాత్‌ క్రికెట్‌ అసోసియేషన్‌ సెక్రటరీ రాజేష్‌ పటేల్‌ ఆస్ట్రేలియా జట్టు బసచేస్తున్న హౌటల్‌లో వారి వసతులను పర్యవేక్షిస్తున్నారు. పటేల్‌ వెంటనే ఈ సంఘటన పట్ల బిసిసిఐకి ఫిర్యాదు చేశారు. పాంటింగ్‌ పగలగొట్టిన టివిని ఫొటో తీసి బిసిసిఐకి పంపించారు. రికీ పాంటింగ్‌ ఒక కెప్టెన్‌ అయిఉండి ఇలా ప్రవర్తించడం ఆసీస్‌ జట్టుకు ఏమాత్రం మంచిదికాదని రాజేష్‌ పటేల్‌ అన్నాడు. జింబాబ్వే జరిగిన మ్యాచ్‌లో క్రిష్‌ మొఫూ విసిరిన డైరెక్ట్‌ త్రోకు రికీ పాంటింగ్‌ రనౌట్‌ అయ్యాడు. పాంటింగ్‌ తన అసహనాన్ని దాచు కోలేకపోయాడు. దాంతో విమర్శలపాలయ్యాడు.

Source: www.prajasakti.com

Tuesday, February 22, 2011

Actor Raja Maa TV Gatha Janma Rahasyam Video











హీరో రాజాతో మా టీవీ గత జన్మ రహస్యం వీడియో










గత జన్మ.. హాట్ కాన్సెప్ట్

వాస్తవాస్తవాల మాట పక్కన పెడితే - ‘గత జన్మ’ తాలూకు రహస్యాలను ఛేదించాలని ఎన్నో యుగాలుగా అనుకుంటున్నదే. 3 వేల ఏళ్ల క్రితం - ఈజిప్ట్‌లోని ఒక ప్రాంతం. ఒక ఇశ్రాయేలీయుడు.. ఆజానుబాహుడూ.. చేతిలో కర్ర.. మాసిన గడ్డం.. దేనికోసమో వెతుకులాట. దప్పిక గొని ఉన్నాడేమో? ఇసుక తిన్నెలూ.. ఎండమావులూ - దాటుకొని ఒకానొక కుటుంబాన్ని ఆశ్రయిస్తాడు. అతను ఆ తెగ నాయకుడని వాళ్ల మాటల్ని బట్టి తెలుస్తుంది. పేరు ‘మోషుమోషు’. తెగలోని జనం కష్టాలూ కన్నీళ్లూ విని చలించి పోయి ఆ ప్రాంతాన్ని ఏలే రాజుకి విన్నవించుకునేందుకు వెళతాడు. చర్చలు విఫలమవుతాయి. యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధంలో తెగ గెలుస్తుంది. రాజు ఓడిపోతాడు. ఆ తర్వాత కొన్నేళ్ళకు వయసు పైబడటంతో ఆ నాయకుడు మరణిస్తాడు. తమ ఆత్మీయుణ్ణి కోల్పోయినట్టు వారంతా భావిస్తారు. ఇది ‘రాజా’ చెప్పిన గత జన్మ కథ. మాటీవీలో బుధవారం రాత్రి 9 గంటలకు ప్రసారమవుతున్న ‘గత జన్మ రహస్యాలు’లో నటుడు రాజా తన పూర్వ జన్మలోకి వెళ్లి అనుభూతుల్ని పంచుకున్నాడు.

ఐతే - ‘గత జన్మ రహస్యం’ శాస్ర్తియంగా నిరూపించబడిన ప్రక్రియనా? లేక కేవలం ‘ఫేంటసీ’ మాత్రమేనా? ‘యజుర్వేదం’లో ‘గత జన్మ’కి సంబంధించిన పుట ఉంది. తపో బలం చేత పునర్జన్మల రహస్యాల్ని ఛేదించి ప్రస్తుత జన్మని సార్థకం చేసుకుంటూ - సరైన పంథాలో నడిపించేందుకు దోహదపడే ప్రక్రియ. ఈ హైటెక్ యుగంలో ‘జన్మ’ల రహస్యం అన్న  కాన్సెప్ట్ ఆసక్తి రేకెత్తించేదే. కానీ - ‘గత జన్మ’లపై అనేకానేక సందేహాలూ ఉంటాయి. ఆయా సందేహాలను నివృత్తి చేయాల్సిన బాధ్యత కార్యక్రమ నిర్వాహకులపై ఉంది. ఉదాహరణకు - రాజా విషయమే తీసుకుంటే - ౩ వేల ఏళ్ల వెనక్కి వెళ్లి రావటం ఎన్నో అనుమానాలను రేకెత్తిస్తుంది. మధ్యలో జన్మలేవీ లేవా? ఆయా జన్మలకీ ఈ జన్మకీ పోలికలూ పొంతన ఉన్నాయా? - పాప పుణ్యాలన్నీ గత జన్మ జ్ఞాపకాలేనా? ఇత్యాది అంశాలకు తెర తీసినట్టయితే - ‘గత జన్మ’ శాస్త్రం (?) కాకపోదు. ఏది ఏమైనప్పటికీ - అన్ని ఛానెళ్లు ఇదే పంథాలో వెళుతూ ‘గత జన్మ’ రహస్యాన్ని ఛేదించేందుకు గట్టి ప్రయత్నం మీదే ఉన్నాయి. కొన్నాళ్ల క్రితం ‘స్టూడియో ఎన్’ ప్రారంభించిన ఈ కాన్సెప్ట్ మళ్లీ తెర మీదికి రావటం వెరైటీ ‘కాన్సెప్ట్’ల కోసం వెతుకుతున్న ఛానెళ్లకు హాట్ సబ్జెక్ట్.

Source: www.andhrabhoomi.net

Telugu TV – New kid on the block

Borrowing the lines of late Art Buchwald, American humorist and Pulitzer Prize winner: “Television has a real problem. They have no page two.”

The reality of TV content is that over 4.2 million hours of TV content is being beamed annually to Indian homes and less than 8 per cent is quality original content created for TV and out of that, less than 3 per cent is financially viable.

In the two-decade life span of satellite TV, the K-era captured the hearts and minds in Hindi heartland for almost a decade, which triggered a gold rush for a challenger, which brought in a flood of international imports (sellers, concepts, formats). A host of national channels – existing and new – started searching for the breakthrough.

Viewers all along got their daily dose of reality from news, the real father of reality TV! Strangely, 50 per cent of the 480-odd channels received in this country are news and current affairs channels.

Over a period, strong viewer preference for local language, local culture, local setting and local stories started to emerge. Today, local language programming is the preferred content in over 60 per cent of C&S viewers in the country.

The South led the way, setting standard for language content that connected with viewers, pioneering non-fiction shows of games, skill, talent and behaviour. Progressively evolving fiction with storylines mirroring social trends and rich in local symbolism. Regionals now dominate West and East.

Andhra Pradesh TV space
Let us look at the Andhra Pradesh TV space in particular with 92 per cent C&S penetration, which has grown both in terms of revenue as well as number of channels.
 




 



 
 
Talking about news channels in particular – news consumption in Andhra Pradesh is much higher than any other state, as the state witnessed many events post 2005. For a lot of other reasons, of the Rs 700-crore ad pie in the Andhra Pradesh market, 15 per cent is what the news channels corner, hence a lot of infrastructure and political players jumped into the fray, more for vested interests.
 
The already large presence of the film industry in Andhra Pradesh has seen a phenomenal and unfettered expansion through commercial television industry, both in entertainment and news segments. Interestingly, film industry takes up a significant chunk of news content, contributing extra velocity in the ratings race.

Until 2008, there were only a few Telugu news channels in the state, such as TV9, ETV2, NTV and TV5, alongside the entertainment ones, like Doordarshan’s Saptagiri, ETV, Gemini TV, Teja TV, Maa TV and Zee Telugu. The simultaneous Lok Sabha and Assembly elections in 2009 marked a surge in news channels as film star Chiranjeevi announced his entry into active politics. These included Sakshi TV, HMTV, HYTV, Maha TV, Studio-N, Zee 24 Gantalu and ABN Andhra Jyothy. With the launch of Raj TV, the state now has 15 news channels compared to nine general entertainment channels. It’s intriguing to see this rush to start news channels in an already cluttered space. It can be seen that there was neither clear economics nor appealing newsworthiness in the launch.
 









 
 

GEC genre
Coming to the GEC genre, clearly the audience have been spoilt for choice, be it fiction, non-fiction, or movies. Any back-of-the-envelope calculation shows that today, on an average, a household gets to watch 11 movies a day, a far cry from the initial days of satellite invasion. Coming to the next big GRP driver – the fiction segment of any channel, masterfully juggling tears, smiles, campy inside jokes – the content churned out by top channels delivered unstoppable entertainment in prime time. The data given below clearly analyse the TVR contribution of fiction to non-fiction vis-à-vis movie.



















 
To have an absolute winner in terms of content in the market, marketing plays a pivotal role. From doing standalone campaigns, television channels have been seen doing integrated campaigns more so to present the bouquet of offerings in a particular channel. The campaigns we see today are a mix of traditional and non-traditional media across print, radio, TV, digital, OOH, experimental marketing. A case in point has been the high-decibel campaigns done by Zee TV in the past, positioning its non-fiction genre/ films, of late, Maa TV has gone beyond billboards and retail touch points to digital media. Gemini TV’s innovation in marketing has been remarkable over the last one year. In film branding, where the brand seamlessly blends into the content of the movie, has been a clincher – ‘Jhummandi Naadam’, a musical hit, is a case in point, where Gemini Music brand was positioned.

This cluttered market is poised to grow further, but consolidation symptoms on the channels’ front have started to appear.

Source: www.exchange4media.com

బుల్లితెరపై ‘జాక్‌పాట్’

సూరత్ సుందరి నమితను ‘జాక్‌పాట్’ అవకాశం వరించిందనే వార్తలు వినిపిస్తున్నాయి. అయితే నమితకు ఇది పెద్ద సవాల్‌లాంటి చాన్స్. ఎందుకంటే ఈ కార్యక్రమానికి ముంబయ్ బ్యూటీ ఖుష్బూ వ్యాఖ్యాతగా వ్యవహరించి తమిళ ప్రేక్షకుల హృదయాలను కొల్లగొట్టేశారు.

జయ టీవీలో ప్రసారమైన ఈ ‘జాక్‌పాట్’ షోకి టీఆర్పీ రేటింగ్ భారీ
ఎత్తున ఉండేది. ఎడీఎంకె అధ్యక్షురాలు జయలలితకు సంబంధించిన చానల్ ఇది. కాగా.. డిఎంకె పార్టీతో ఖుష్బూ చేతులు కలపడంతో జయలలిత ఆగ్రహానికి గురై జాక్‌పాట్ నుంచి ఆమెను తీసేశారు. ఆ స్థానంలో నదియాను తీసుకున్నారు. కానీ ఖుష్బూ రేంజ్‌లో నదియా ఆకట్టుకోలేకపోతున్నారనే వార్తలు వినిపిస్తున్నాయి. టీఆర్పీ రేటింగ్ భారీ ఎత్తున పడిపోయిందట. ఆ కారణంగా నదియా స్థానంలో వేరే తారను తీసుకోవాలని జయ టీవీ భావించింది.

బొద్దుగుమ్మ నమిత అయితే ‘జాక్‌పాట్’కి పూర్వ వైభవం వస్తుందని భావించారట. తమిళీయులకు బొద్దుగా ఉండే నాయికలంటే చాలా ఇష్టం. ఈ క్రమంలో నమితకు భారీ ఎత్తున ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఈ ఫాలోయింగ్ ‘జాక్‌పాట్’కు బాగా ఉపయోగపడుతుందని చానల్‌వారు భావిస్తున్నారు. ఇప్పటికే నమిత ‘మానాడ మైలాడ’ అనే షోకు న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. బుల్లితెర వీక్షకులు నమితకు బాగానే నీరాజనాలు పడుతున్నారు. ‘జాక్‌పాట్’కు తనని ఎన్నుకోవడానికి ఇది కూడా ఒక కారణం అని పరిశీలకులు అంటున్నారు. నమిత కూడా ఈ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరించడానికి పచ్చజెండా ఊపారట. బొద్దుగా ఉండే ఖుష్బూ జాక్‌పాట్‌కి నిండుదనం తెచ్చినట్లే నమిత కూడా తీసుకువస్తారనే అంచనాలు ఉన్నాయి. మరి.. నమిత ఆ అంచనాలను చేరుకుంటారో లేదో వేచి చూడాల్సిందే.

Source: www.sakshi.com 

ఇండియన్‌ రియాలిటీ షోలో జెన్నిఫర్‌ లోపెజ్‌

ఇండియన్‌ టివి రియాల్టీ షోలు నేడు అంతర్జాతీయ గుర్తింపును సాధించాయి. వివిధ టివి ఛానెల్స్‌ లో ప్రస్తుతం కొనసాగుతున్న రియాల్టీ షోలు ఎంతో పాపులారిటీ పొందాయి. ఇటీవలే బిగ్‌బాస్‌ -4 రియాల్టీ షోలో హాలీవుడ్‌ సెలబ్రిటీ పమేలా ఆండర్సన్‌ అతిథిగా పాల్గొని కనువిందుచేశారు. ఆమె ఈ షోకే హైలైట్‌గా నిలిచి బుల్లితెర ప్రేక్షకులను మైమరపించారు. ఈ నేపథ్యంలో పాప్‌ సింగర్‌, సెలబ్రిటీ జెన్నిఫర్‌ లోపెజ్‌ ఓ ఇండియన్‌ టివి రియాల్టీ షోలో చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. అమెరికాలో ‘ఎక్స్‌-ఫ్యాక్టర్‌’ మ్యూజికల్‌ రియాల్టీ షో ఎంతో హిట్‌ అయ్యింది.

ఆ రియాల్టీ షోకు దేశీ వర్ష న్‌గా ఓ రియాల్టీ షో మన దేశంలోని ఓ టివి ఛానెల్‌లో త్వరలో ప్రసారం కానుంది. ఈ రియాల్టీ షోకు హాలీవుడ్‌ సెలబ్రిటీ జెన్నిఫర్‌ లోపెజ్‌ (జెఎల్‌ఒ) జడ్జీగా తీసుకోనున్నట్టు తెలిసింది. ‘యుఎస్‌ రియాల్టీ షో ఎక్స్‌-ఫ్యాక్టర్‌ జడ్జీల ప్యానెల్‌లో జెఎల్‌ఒను కూడా తీసుకోనున్నారు. కానీ ఈ షో ఇండియన్‌ వర్షన్‌లో జెన్నిఫర్‌ చేసే అవకాశాలు కొద్దిగా మాత్రమే ఉన్నాయి’ అని ఓ హాలీవుడ్‌ ప్రముఖుడు పేర్కొన్నారు. ప్రస్తుతం ఇండియన్‌ టివి ఛానెల్స్‌లో ఎక్కువగా రేటింగ్‌ కలిగిన రియాల్టీ షోలలో రానున్న రోజుల్లో మరింత మంది హాలీవుడ్‌ సెలబ్రిటీలు పాల్గొననున్నారు. 
 
పమేలా ఆండర్సన్‌ బిగ్‌బాస్‌లో అతిథిగా వచ్చి ఈ సెల బ్రిటీలకు మార్గం సుగమం చేశారు. ఆమె తర్వాత జెన్నిఫర్‌ ఇండియన్‌ రియాల్టీ షోలో కనిపిస్తే మరింత మంది సెలబ్రిటీలు ముందుకువచ్చే అవకాశాలు ఉన్నాయి. ‘ఇండియన్‌ రియాల్టీ షోలకు నేడు మంచి ఆదరణ ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఆర్‌ఐలు కూడా ఈ షోలను తిలకిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ షోలకు జడ్జీలుగా హాలీవుడ్‌ సెలబ్రిటీలను తీసుకోవాలని నిర్వాహకులు భావిస్తున్నారు. రాబోయే రోజుల్లో పలువురు హాలీవుడ్‌ సెలబ్రిటీలు రియాల్టీ షోలలో కనువిందుచేస్తారు’ అని టివి యాంకర్‌ శేఖర్‌ సుమన్‌ పేర్కొన్నారు. వివాదాస్పదంగా మారుతున్న రియాలిటీ షోలలోకి విదేశీ సెలబ్రిటీలను కూడా తీసుకు వస్తే టీఆర్‌పి రేటింగులు విపరీతంగా పెరుగుతాయని ఛానెళ్ళు ఆశిస్తుండచ్చు. అయితే ఇటువంటి షోలు, వివాదాల వల్ల యువతపై, పిల్లలపై దుష్ర్పభావాల గురించి ఆలోచించక పోవడమే విచారకరం.

Source: www.suryaa.com

అమ్మో! నా వల్ల కాదు.. ప్రీతి

టీవీ అంటే ఆషామాషీ వ్యవహారం కాదన్నది ప్రీతిజింతా మాట. సినిమా షూటింగ్‌లైతే - కావల్సినంత స్వేచ్ఛ. మనం చెప్పిందే వేదం. కానీ టీవీ విషయానికి వస్తే మాత్రం ఆ పప్పులేం ఉడికేట్టు లేవట. ఇది తాజాగా ప్రీతి అనుభవం. సినీ తారలంతా ఛానెళ్ల చుట్టూ ప్రదక్షిణలు చేయటంతో తానూ ఏ మాత్రం తీసిపోలేదని వచ్చిన ఒక్క అవకాశాన్ని ఓకే అనేసి ఆనక - నోరెళ్ల బెట్టింది. ‘గిన్నిస్ వరల్డ్ రికార్డ్స్ - అబ్ ఇండియా తోడేగా’ని నిర్వహిస్తున్న ప్రీతి - ఈ ఒక్క రియాలిటీ షో ఎపిసోడ్‌తోనే గుక్క తిప్పుకోకుండా అయిందిట. మరి అమిత్‌జీ, సల్మాన్, షారుక్‌ఖాన్, అక్షయ్, ప్రియాంకా చోప్రా.. ఎలా నెగ్గుకు వస్తున్నారోనని ఆశ్చర్యం వ్యక్తం చేసింది. చూడబోతే - ఇంకెన్నో రోజులు ఈ కార్యక్రమంలో నిలబడేట్టు లేదు. ‘కలర్స్’ ఛానెల్‌లో త్వరలోనే ఈ కార్యక్రమం ప్రసారం కాబోతోంది.

Source: www.andhrabhoomi.net

Teen Maar satellite rights@5.5 crore

The Pawan Kalyan and Trisha starrer film Teen Maar is ringing in excitement for the fans. The film is raising the expectations of the fans and this news will only add to their joy.

The satellite rights of Teen Maar have been bagged by Gemini TV. The rights have been bagged at a fancy price of 5.5 crore. So the business for the film will reach bigger proportions. 

Source: bharatwaves.com

Cable operators black out Andhra news channels

NIZAMABAD: Channels are now tuning into the T band. After students, lawyers, government employees and others, it is the turn of the Telangana Multi-System Operators (MSOs) to wage a stir for the cause of separate Telangana by blocking Telugu news chancels owned by Andhra and Rayalaseema industrialists.
 
Cable operators belonging to the region expressed their solidarity with the ongoing movement by deciding to stop the screening of the channels in the region for 48 hours. This was to protest the TV channel managements' "anti-Telangana" stand and for broadcasting "anti-Telangana" reports, the operators said.

Except Raj News and HMTV, all other news channels including TV9, NTV, ETV, ABN-Andhra Jyothi, TV5, INews, Maha TV, Zee 24 and Gemini News were blacked out since Monday morning.
 
Telangana MSOs' association president Kuldeep Sahani, participating in a discussion on a private TV channel, alleged that news channels owned by influential people of Seemandhra region were projecting the T-movement by giving it a negative slant and highlighting united Andhra concept. "These channels are least bothered about the struggle for the cause of separate state," he said.
 
A leader of the association alleged that the channels did not show a single visual of police ransacking the Osmania University hostels and attacking students with tear gas shells and rubber bullets on the pretext of following NBA (National Broadcasters Association) guidelines. "But the same channels were repeatedly showing the clippings of the attack on Lok Satta Party chief N Jayaprakash Narayan on the assembly premises," he charged.  

Source: timesofindia.indiatimes.com