తెలుగులో మొట్టమొదటగా ప్రారంభమైన ఛానల్ దూరదర్శన్ హైదరాబాద్. 1995 లో ప్రైవేటు చానల్స్ వచ్చిన తరువాత దూరదర్శన్ మెల్లగా వెనుకబడింది.
ప్రైవేటు చానల్స్ రకరకాల మసాలా కార్యక్రమాలతో వీక్షకులని తమవైపు తిప్పుకున్నాయీ.
దూరదర్శన్ ఒక గవర్నమెంట్ ఛానల్ అవ్వటంతో కొన్ని పరిమితులకి లోనై పని చేస్తుంది. ప్రైవేటు చానల్స్‌కి అలాంటి పరిమితులు లేవు. దీనితో దూరదర్శన్ పట్ల నగర, పట్టణ ప్రజలకి ప్రాధాన్యత తగ్గింది. దానితో దూరదర్శన్ కొన్ని మంచి కార్యక్రమాలని ప్రజలు మిస్ అవ్వుతున్నారు.
గత మూడు శనివారాలలో ప్రసారమవుతున్న "సిని'మా'వీణ" అటు వంటి కార్యక్రమమే. దూరదర్శన్ ప్రేక్షకులకు సుపరిచితురాలైన విజయ దుర్గ గారు నిర్మాతగా రూపొందించిన ఈ కార్యక్రమం ప్రేక్షకులని విపరీతంగా ఆకర్షించింది అనడంలో ఏ మాత్రం సందేహం లేదు. చాలా రోజుల తరువాత ఒక మంచి కార్యక్రమం చూసాం.
ఈ మధ్య కాలంలో వినతగ్గ పాటలు సినిమాలలో తగ్గిపోతున్నై. మన సంస్కృతికి చెందిన కొన్ని వాయిద్యాలు వాడటమే మానేశారు. తెలుగు సినిమా స్వర్ణయుగంగా చెప్పుకునే కాలంలో కొన్ని సినిమాలలో ఆ సిని నిర్మాతల అభిరుచికి అనుగుణంగా వీణ పాటలు ఉండేవి. ఆ పాటలన్నీ ప్రజాదరణ పొందినవే.
ఆ వీణ పాటలు ఏ రాగాలలో సమకుర్చబడ్డాయి ఆ సంగీత దర్శకులు ఏ విధంగా కృషి సలిపారు ప్రముఖ వైణిక విద్వాంసులు శ్రీ అయ్యగారి శ్యామసుందర్ గారు వివరించారు.
ఒక కొత్త ఆలోచనతో తీసిన ఈ కార్యక్రమం అభినందనీయం. చూడాలని ఉంటె శనివారం రాత్రి 8 గం.లకి తిరిగి సోమవారం ఉదయం 8.30ని. లకి ఈ కార్యక్రమం చూడవచ్చు.
ఈ కార్యక్రమం రూపొందించిన విజయదుర్గ గారికి, దూరదర్శన్ హైదరాబాద్ కేంద్రం వారికి అభినందనలు.
Source: devika-puranam.blogspot.com

No comments:
Post a Comment