Friday, July 29, 2011

Now, Another Daily, TV Channel By A Politician!

It has become a trend for politicians to start media ventures, be it newspapers or television channels.

The latest to join the media bandwagon is the Congress legislator from Medak district Toorpu Jayaprakash Reddy who is a staunch critic of Telangana Rashtra Samithi (TRS) President K Chandrasekhar Rao.

Expectedly, his proposed Telugu newspaper and a TV channel will be competitors to the TRS leader’s media ventures- T-News channel and “Namaste Telangana” daily.

Jayaprakash, who represents Sangareddy constituency, asserted that his media organizations would reflect the genuine voice of the Telangana people. The daily and the channel are tentatively titled “Jai Telangana Jai”.

Jayaprakash made a scathing attack on KCR for using the media organizations as weapons to extort money.

“KCR and his family members have been exploiting the Telangana sentiment to further own self interests and made huge money. He has now entered into the media field with the same intention,” the Congress legislator said.

The YSR Congress Party President Y S Jagan Mohan Reddy owns “Sakshi” daily and TV channel while the Telugu Desam Party Chief N Chandrababu Naidu’s son Nara Lokesh runs “Studio-N” channel.

Source: www.greatandhra.com

Thursday, July 28, 2011

వాల్ట్ డిస్ని చేతికి ఆ ఛానెల్

ప్రపంచంలో భారతదేశం టీవీ మార్కెట్లో మడవ ప్లేసులో ఉంది. కెపిఎమ్ జి సర్వే ప్రకారం చైనా, అమెరికా తర్వాత ఎక్కువ టీవీ వీక్షకులు ఉన్న మార్కెట్ మనదే. దాంతో ఇప్పుడు లోకల్ మార్కెట్ ని ఆక్రమించటానికి ఎక్కడెక్కడి సమీకరణాలు మొదలయ్యాయి. కొద్దిరోజుల క్రిందట ఈటీవిని రీజనల్ మార్కెట్ లో వాటా కోసం సోనీ కొనుగోలు చేయటానకి మందుకు వచ్చిందనే వార్త వచ్చిన సంగతి తెలిసిందే. అదే క్రమంలో ఇప్పుడు డిస్నీ స్టూడియో వారు యూటీవీని దాదాపు రెండు వేల కోట్ల రూపాయలకు తీసుకోవటాకి ఒప్పందం కుదుర్చుకోవటానకి ముందుకు వచ్చినట్లు తెలుస్తోంది.


ప్రపంచంలోని మీడియా ఫర్మ్ లలో ఒకటైన వాల్ట్ డిస్నీ వారు యూటీవి సాప్ట్ వేర్ కమ్యూనికేషన్ లిమెటెడ్ ని తీసుకోవటానకి కొద్ది రోజులుగా చర్చలు జరుపుతున్నారు. ఇక ఇప్పటికే ఈ రెండు ఫర్మ్ లు కలిసి పనిచేస్తున్నాయి. వాల్ట్ డిస్నీ 50.44% వాటాని యూటీవిలో కలిగి ఉంది. ఇప్పుడు మిగిలిన మార్కెట్ ని కూడా హస్తగతం చేసుకునేందుకు పావులు కదుపుతోంది. షేర్ వెయ్యి రూపాయలు చొప్పున యూటీవీ షేర్స్ ని షేర్ హోల్డర్స్ నుంచి కొనుగోలు చేయటానికి ముందుకొచ్చింది. ఈ ప్రపోజల్ కి యూటీవీ ఛీప్ రోనీ స్క్రూవాల్ కూడా ఒప్పుకున్నట్లు తెలుస్తోంది.

ఈ డీల్ ఖరారైతే రోనీ స్క్రూవాలా ఆ సంస్ధకు యజమాని నుంచి ఎంప్లాయిగా మారుతారు. అంతేగాక డిస్నీకు చెందిన మేనేజింగ్ డైరక్టర్స్ లలో ఒకరిగా సౌత్ ఆసియన్ రీజియన్ కి వ్యవహరిస్తారు. అతి త్వరలోనే ఈ డీల్ పూర్తవతుందని బిజెనెస్ సర్కిల్స్ లో వినపడుతోంది. అదే జరిగితే తమ పరిస్ధితి్ ఏమిటని యూటీవికి పోటీ ఇస్తున్న మిగతా ఛానళ్ళు ఆలోచనలో పడ్డాయి. లోకల్ ఛానెల్ కు పోటీ సాధ్యమేకానీ, అంతర్జాతీయ ప్రమాణాలతో వచ్చే ఛానెల్ తో పోటీ పడటం కష్టమేనని అభిప్రాయపడుతున్నాయి.

Source: thatstelugu.oneindia.in

త్వరలో పత్రిక, న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తా: జగ్గారెడ్డి

సామాజిక తెలంగాణ లక్ష్యంగా దోపిడీదారుల పాలన పోవాలని మీడియా రంగంలో ప్రవేశించాలని నిర్ణయించుకున్నట్లు మెదక్‌ జిల్లా సంగారెడ్డి ఎమ్మెల్యే తూర్పు జయప్రకాశ్‌రెడ్డి(కాంగ్రెస్‌) వెల్లడించారు. బుధవారం రాత్రి ఆయన ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. మరి కొద్ది రోజుల్లో 'జై తెలంగాణ జై' పేరుతో దినపత్రిక, టీవీ న్యూస్‌ ఛానల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు. తెలంగాణ పేరు మీద వంద కోట్ల రూపాయలను పోగుచేసి వాటిని కుటుంబ ఆస్తులుగా కూడబెట్టుకోవడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. ఈ మధ్య తెలంగాణ పేరు మీద వచ్చిన ఒక దినపత్రిక, టీవీ ఛానెల్‌ కేవలం బ్లాక్‌ మెయిలింగ్‌కే పరిమితమై, తెలంగాణ ప్రజల ఆకాంక్షలకు తూట్లు పొడవడం చూసి తానెంతో బాధపడుతున్నానని పేర్కొన్నారు. అందుకే పత్రిక, న్యూస్‌ ఛానెల్‌ ప్రారంభిస్తున్నట్లు వివరించారు.

Source: eenadu.net

ఆ హీరోకి సొంత ఛానల్


Source: telugu.greatandhra.com

2000 కోట్లకు అమ్ముడుపోయింది


Source: telugu.greatandhra.com

మీడియాకు సిబిఐ నివేదిక లీకేజ్ కాలేదు



Source: www.andhravilas.com

Wednesday, July 27, 2011

రామోజీ ఈనాడుకు జగన్ సాక్షి చానెల్ కౌంటర్

సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో రామోజీరావుకు చెందిన ఈనాడులో వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్‌పై వస్తున్న వార్తాకథనాలకు కౌంటర్ ఇచ్చేందుకు సాక్షి టీవీ చానెల్ ప్రయత్నించింది. ఇందుకు సంబంధించి జగన్‌కు చెందిన సాక్షి చానెల్ ఓ వార్తాకథనాన్ని ప్రసారం చేసింది. సిబిఐ దర్యాప్తు నేపథ్యంలో వైయస్ జగన్ ఆస్తులపై ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికలు వార్తాకథనాలను ప్రచురిస్తున్నాయి. ఆంధ్రజ్యోతి పత్రికలోనూ, ఎబిఎన్ టీవీ చానెల్‌లోనూ జగన్ ఆస్తుల వ్యవహారాలపై వరుస వార్తాకథనాలను ఇస్తోంది. ఈ నేపథ్యంలో సాక్షి టీవీ చానెల్ ప్రతినిధి సిబిఐ ఐజి లక్ష్మినారాయణతో మాట్లాడారు. 

జగన్ ఆస్తులపై తాము రూపొందించిన నివేదిక లీక్ కాలేదని ఐజి లక్ష్మినారాయణ చెప్పినట్లు సాక్షి చానెల్ తెలిపింది. తమ నివేదిక లీకయ్యే అవకాశం ఏ మాత్రం లేదని ఆయన చెప్పారు. కాగా, ఈనాడు, ఆంధ్రజ్యోతి దినపత్రికల్లో వస్తున్న వార్తాకథనాలపై లక్ష్మినారాయణ అసహనం ప్రదర్శించారని సాక్షి చానెల్ ప్రతినిధి వ్యాఖ్యానించారు. మీడియాకు చెప్పే విషయాలు ఏమైనా ఉంటే తాము చెబుతామని లక్ష్మినారాయణ అన్నారు. వైయస్ జగన్ ఆస్తులపై వస్తున్న వార్తాకథనాలపై తాము చర్య తీసుకునే అవకాశాలు లేవని ఆయన స్పష్టం చేశారు.


Source: thatstelugu.oneindia.in

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(30వ వారం)

1) టీవీ9           - 2.56
2) టీవీ5           - 1.79
3) సాక్షి టీవీ      - 1.65
4) ఎన్  టీవీ      - 1.37
5) హెచ్ ఎం టీవీ - 1.30
6) ఈ టీవీ2       - 1.10
7) జీ 24 గంటలు- 0.96
8) మహా టీవీ     - 0.87
9) ఎబిఎన్         - 0.61
10)స్టూడియో ఎన్- 0.60  

Source: www.porutelangana.com

Tuesday, July 26, 2011

టీవీ9 బంద్ అయింది


విధేయతను బదిలీ చేస్తున్న చానల్స్

రాజుల కాలంలో శత్రురాజ్యంపై విజయం సాధించాలంటే వారి కాల్బలం, ఏనుగులు, గుర్రాల బలం ఎంతో ముందు తెలుసుకునే వారు. అంతకు మించిన బలాన్ని సమకూర్చుకున్నాకే యుద్ధం చేసేవారు. రోజులు మారాయి. రాజరికం నుండి ప్రజాస్వామ్యంలోకి వచ్చాం. ఆయుధాలు కూడా మారాయి. అప్పుడు ఏనుగులు, గుర్రాలు ఆయుధాలు అయితే ఇప్పుడు మీడియానే ప్రధాన ఆయుధం. మీడియా బలం సమకూర్చుకోకుండా యుద్ధ రంగంలోకి అడుగుపెడితే ఎంత గొప్ప హీరో అయినా మట్టికరిచిపోతారని జనమే కాదు ఆ యోధుడు సైతం గ్రహించాడు. అందరి వాడిని.. అన్ని ఛానల్స్ నావే అనుకున్న చిరంజీవి చివరకు ప్రత్యర్థుల చానల్స్ ధాటికి తట్టుకోలేకపోయారు. అనుభవం అయిన తరువాత ఆయనకు తత్వం బోధపడింది. ఇప్పుడు సొంత చానల్ కోసం ప్రయత్నిస్తున్నారు. కాంగ్రెస్‌లో ఏదో ఒక రోజు అవకాశం రాకుండా పోదు. అప్పటి వరకు బలమైన ఆయుధాన్ని సమకూర్చుకోవాలనేది ఆయన లక్ష్యం. ఆయనో న్యూస్ ఛానల్ కోసం ప్రయత్నాలు మొదలు పెట్టారు.

చిరంజీవి అనుభవమే కాకుండా తన తండ్రి అనుభవాన్ని సైతం దగ్గరి నుండి చూసిన జగన్ ముందు నుండి మీడియా బలాన్ని బాగానే అంచనా వేశారు. మీడియా విషయంలో తన ప్రత్యర్థి చంద్రబాబు కన్నా ఒక అడుగు ముందుకేశారు. సొంత మీడియానే కాకుండా అనుబంధ మీడియాను ఏర్పాటు చేసుకున్నారు. తాతకు దగ్గులు నేర్పుతావా? అనుకున్న ప్రత్యర్థి సైతం ఈ ఎత్తుకు పైఎత్తు వేశారు. దీంతో జగన్ ఒడిలో నుండి ఒక్కో మీడియా జారిపోతోంది. జగన్‌కు సొంత ఛానల్ ఎలాగూ చేతిలో ఉంది . ఒప్పందాలు ఏమిటో బయటకు తెలియదు కానీ సొంత ఛానల్‌తో పాటు కొన్ని చానల్స్ జగన్‌కు మద్దతుగా ఉండేవి. వీటిలో ఒక్కొక్కటి జారుకుంటోంది.

మొన్నటి వరకు ఒక నాయకుడిని తీవ్రంగా విమర్శించే ఛానల్ హఠాత్తుగా ప్లేటు మార్చి ఆ నాయకుడిని తీవ్రంగా విమర్శిస్తుంటే తెరపై చూసినప్పుడు నిష్పక్షితత్వానికి మారు పేరు అనిపిస్తుంది. లోతుగా విషయ పరిశీలన చేస్తే అసలు విషయం నిష్పక్షపాతం కాదు విధేయతగా మారింది అని తెలుస్తుంది.

2009 ఎన్నికల సమయంలో ఒక ఛానల్ మొదటి విడత పోలింగ్ మొత్తం టిడిపిని విమర్శిస్తూ, వైఎస్‌కు అండగా నిలిచింది. బాబు, ఆ ఛానల్ యజమాని ఒకే పోలింగ్ బూత్‌లో ఓటు వేయాలి. అక్కడ ఇద్దరూ తారసపడ్డారు. ఏంటయ్యా మనవాడివై ఉండి మనకు వ్యతిరేకంగా మీ ఛానల్ ఉందేమిటి? అని బాబు ఆవేదన వ్యక్తం చేశారు. ఏం చేస్తాం ఎటు నుండి సహాయం వస్తే అటుండాలి, మీ నుండి ఆశించిన సహాయం రాలేదు అన్నారు. ఏం సహాయం అందిందో కానీ మొదటి విడత పోలింగ్‌లో కాంగ్రెస్‌కు అండగా నిలిచిన ఆ ఛానల్ రెండవ విడత పోలింగ్‌లో బాబును భుజానికెత్తుకుంది. ఫలితాలు వచ్చాక మళ్లీ జగన్ పక్షం వహించింది. ఇప్పుడు ఛానల్ తన విశ్వసనీయతకు పచ్చదనం పులుముకుంది.

మరో ఛానల్ నిర్మొహమాటంగా జగన్‌కు రాంరాం చెప్పి కిరణ్‌లోని పాలనా పటిమను ప్రపంచానికి చాటడంలో మునిగిపోయింది.

గతంలో టీవి9 పట్ల చంద్రబాబు బహిరంగంగానే వ్యతిరేకత వ్యక్తం చేశారు. మీ ఛానల్ వైఎస్‌ఆర్ కొమ్ము కాస్తోంది మీ సంగతి చూస్తాం, మిమ్ములను మేం బహిష్కరిస్తాం అని బాబు వార్నింగ్ కూడా ఇచ్చారు. ఆ ఛానల్‌ను జగన్ కొనేశాడు అని టిడిపి నాయకులు బహిరంగంగానే విమర్శలు చేసేవారు. అందులో నిజం ఎంతో, తరువాత ఏం జరిగిందో కానీ ఇప్పుడా ఛానల్ పేరు వింటేనే జగన్ వర్గం మండిపడుతోంది. జగన్‌పై విషం కక్కడంలో ఆ ఛానల్ ఏ అవకాశాన్ని వదులుకోవడం లేదు. ఇక తెలంగాణ వారు ఈ ఛానల్‌కు తెలంగాణ వ్యతిరేకి అని ముద్ర వేశారు.

ఛానల్స్ ఆపద్బాంధవుడు
గతంలో ఒకే ఛానల్ ఉన్నప్పుడు వారు ఆడిందే ఆట వారు చెప్పిందే వార్త. ఇప్పుడు పార్టీల వారీగా, ప్రాంతాల వారీగా, కులాల వారీగా, మతాల వారీగా ఛానల్స్ ఉండడం వల్ల అందరి వాదనలు తెలుసుకునే అవకాశం ప్రజలకు లభిస్తోంది. ఈ వారం టీవీ ఛానల్స్ పాలిట ఆపద్బాంధవుడిగా మందకృష్ణ మాదిగ మారారు. యాదిరెడ్డి ఆత్మహత్య అంశంపై ఢిల్లీలో దళిత అధికారిపై టిఆర్‌ఎస్ ఎమ్మెల్యే హరీష్‌రావు చేయి చేసుకున్నారు. తరువాత క్షమాపణ చెప్పారు. అప్పటి వరకు జగన్ సభ ముగిసిన తరువాత మైదానంలో కనిపించే కొద్దిమందిని చూపించి జనం లేరు అని చెప్పడం, మద్యం షాపుల వద్ద కార్యకర్తలను చూపించడం. ప్రతి మీటింగ్‌కూ రెడీమేడ్‌గా ఇవే దృశ్యాలు చూపుతూ అదే అద్భుతంగా భావిస్తూ మురిసిపోయిన యువ బాబు ఛానల్ స్టూడియో ఎన్ ఢిల్లీ సంఘటనపై ఒక్కసారిగా మేల్కొంది. దళితునిపై దొరల దౌర్జన్యం అంటూ ఆవేదన వ్యక్తం చేసింది. బాబు ఆదేశాలపై టిడిపి దళిత నేతలతో పాటు దళిత సంఘాలతో మాట్లాడించారు. పయ్యావుల కేశవ్, దేవినేని ఉమా మహేశ్వర్‌రావువంటి కొందరు నేతలు ఈ సంఘటన పట్ల తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. కారం చేడులో దళితులను ముక్కలుగా నరికి గోనె సంచుల్లో మూటకట్టి ఊరవతల పారేసిన ‘మహానుభావుల వర్గం’ ఒక్కసారిగా దళిత ప్రేమను కుమ్మరించింది. వారిలో ఇంతటి మార్పు వస్తే ఆహ్వానించదగిందే. ఈ సంఘటనతో పలు తెలుగు ఛానల్స్ పాలిట మందకృష్ణ మాదిగ ఆపద్బాంధువునిగా కనిపించారు. అప్పటి వరకు తెలంగాణ అంశంపై దాడి చేయడానికి అవకాశం లేదని ఆవేదన చెందిన ఛానల్స్ అన్నీ మందకృష్ణ మాదిగతో చర్చ కార్యక్రమాన్ని నిర్వహించాయి. ఇక టిఆర్‌ఎస్‌కు చెందిన టీ ఛానల్ దీనిపై ఎదురుదాడి జరిపింది. టిఆర్‌ఎస్ దళిత నాయకులతో మాట్లాడించింది. పలు ఛానల్స్‌లో మందకృష్ణ మాట్లాడారు. ఈ అంశంపై ఐ న్యూస్‌లో మందకృష్ణకు ఆయన గురువు దళిత నాయకుడు ఉ సాంబశివరావుకు వాగ్వివాదం జరిగింది. టీ న్యూస్‌లో ఉ సాంబశివరావు మాట్లాడుతూ దాడిని ఖండించాల్సిందే,దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎంత వరకైనా పోరాడాలి. కానీ కొందరు వ్యక్తులు ఈ అంశాన్ని సాకుగా చూపించి తెలంగాణ ఉద్యమాన్ని దెబ్బతీయాలని ప్రయత్నిస్తున్నారు. అలాంటి వాటికి మనం మద్దతుగా నిలిస్తే మన అసలు లక్ష్యం దెబ్బతింటుందని చెప్పారు.

గతంలో ఎబిఎన్ ఛానల్‌పై దాడికి దిగిన మందకృష్ణ తెలంగాణకు చెందిన నాయకుడు ఆయన చానల్స్‌కు ఆత్మబంధువుగా కనిపిస్తే, సీమాంధ్రకు చెందిన దళిత నాయకుడు ఉ సాంబశివరావు తెలంగాణ చానల్ టీ ఛానల్‌కు ఆత్మబంధువుగా కనిపించారు. రాజకీయాల్లోనే కాదు ఛానల్స్‌కు సైతం ఎవరూ శాశ్వత మిత్రులు కాదు, శాశ్వత శత్రువులు కాదు. నాయకత్వం స్థాయిలో ఉన్నవారు ఎలాంటి సందర్భంలోనైనా సంయమనం కోల్పోతే తన శత్రువు అవకాశం కల్పించిన వారవుతారని హరీష్ ఉదంతం నాయకులకు ఒక పాఠంగా నిలవాలి.

Source: www.andhrabhoomi.net