Thursday, July 29, 2010

కెసీఆర్ నిర్వహణలోని రాజ్ ఛానల్ మూసివేతకు సిద్ధం?

తెలంగాణ రాష్ట్ర సమితి అధ్యక్షుడు కె చంద్రశేఖరరావు యాజమాన్యంలో నడుస్తున్న రాజ్ న్యూస్ టీవీ ఛానల్ కు కష్టాలు వచ్చిపడ్డాయి. నిర్వహణ వ్యయం అధికంగా ఉండడం, రేటింగ్ దాదాపు లేకపోవడం వల్ల కెసిఆర్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ ఛానల్ ప్రభావం లేకపోయినా ఉప ఎన్నికల్లో ఘన విజయం సాధించబోవడం టిఆర్ ఎస్ ఘనతగా చెప్పుకోవచ్చు. జనంలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా ఉన్నప్పుడు తెల్ల ఏనుగు వంటి ఈ ఛానల్ ను మోయడమెందుకన్న అభిప్రాయానికి కెసిఆర్ కుటుంబం వచ్చింది.

నిజానికి తమిళనాడుకు చెందిన రాజ్ న్యూస్ ను పూర్తిగా టేకోవర్ చేయలేదు. నెలవారీ లీజుకు తీసుకున్నట్టు చెబుతున్నారు. మొత్తానికి టీవీ రంగంలోకి మోహన్ బాబు వస్తుండగా కెసిఆర్ నిష్క్రమిస్తున్నారు. రాజ్ న్యూస్ ఛానల్ మొదటి నుంచి డల్ గానే ఉంది. తెలంగాణ వాదాన్ని గట్టిగా విన్పించడంలో విఫలమైంది. రాజ్ న్యూస్ ను తిరిగి రాజ్ యాజమాన్యంగా తాత్కాలికంగా నడిపే అవకాశముంది.

Source: thatstelugu.oneindia.in

రామోజీ ఈనాడు డైలీపై సాక్షి డైలీ ఎదురు దాడి

హైదరాబాద్: దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి అల్లుడు అనిల్ కుమార్ కు బయ్యారం గనులతో ఉన్న సంబంధాన్ని బయటపెడుతూ రామోజీ నేతృత్వంలోని ఈనాడు దినపత్రిక ప్రచురించిన వార్తాకథనంపై కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ కు చెందిన సాక్షి దినపత్రిక ఎదురుదాడికి దిగింది. రామోజీపై, తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రాబబునాయుడిపై విరుచుకు పడింది. వారిద్దరికి మధ్య గల సంబంధాలపై, వారికి ఇతర పారిశ్రామికవేత్తలతో ఉన్న సంబంధాలపై వివరమైన వార్తాకథనాన్ని ప్రచురించింది. కోట్లు గోలేమిటి రామో...చంద్రా, మీ పెన్ను మెదడు చితికిందా అనే శీర్షిక కింద ఆ వార్తాకథాన్ని ప్రచురించింది. చంద్రబాబు తన ప్రభుత్వ హయాంలో 2001లో డిబీర్స్ అనే సంస్థకు రాయలసీమలో వజ్రాల అన్వేషణకు పాతిక లక్షల ఎకరాలను కేటాయించినట్లు ఆరోపించింది. ఐఎంజి భూముల పాత్రధారి బిల్లీరావుతో చంద్రబాబు, బిజెపి నాయకుడు దత్తాత్రేయ దిగిన ఫోటోను ప్రచురించింది. తొమ్మిదేళ్ల తెలుగుదేశం పాలనలో అధికారం ఎవరి బినామీ, రామోజీ - చంద్రబాబుల అనుబంధం అసలు కథ ఏమి అంటూ ఆ ఇద్దరు కరచాలనం చేసుకుంటున్న ఫొటోను ప్రచురించింది.

దొంగ నోట్ల కేసులో నిందితుడు రామకృష్ణ గౌడ్ తో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు దిగిన ఫొటోను ప్రచురించింది. దొంగెవరు, దొరెవరు అని వ్యాఖ్యానించింది. సుజనా చౌదరి, సిఎం రమేష్, నామా నాగేశ్వర రావులతో చంద్రబాబు ఫొటోను ప్రచురించి వారు ఎవరికి బినామీలంటూ ప్రశ్నించింది. వారికి ఎంపి సీట్లు కేటాయించిన విషయాన్ని గుర్తు చేసింది. మంత్రులతో సమానంగా వారి సరసన ప్రభుత్వ కార్యక్రమంలో చంద్రబాబు రామోజీరావుకు పీటం వేసిన విషయాన్ని ఫొటో ద్వారా గుర్తు చేసింది. రామోజీరావు పత్రికను నడుపుతున్నది ప్రజల కోసమా, పాలకులను శాసించడానికి అని సాక్షి దినపత్రిక తన వార్తాకథనంలో ప్రశ్నించింది. స్విస్ బ్యాంకులకు సంబంధించి, ఇతర వ్యవహారాలకు సంబంధించి చంద్రబాబుపై తీవ్ర ఆరోపణలు చేస్తూ సాక్షి ఆ వార్తాకథనాన్ని ప్రచురించింది.

Source: thatstelugu.oneindia.in

Wednesday, July 28, 2010

మోహన్ బాబు సొంత టీవీ ఛానల్ యత్నాలు

కలెక్షన్ కింగ్ మోహన్ బాబు న్యూస్ ఛానల్ పెట్టాలకుంటున్నట్టు సమాచారం. దీనిపై టీవీ జర్నలిస్టులు చర్చించుకుంటున్నారు. న్యూస్ ఛానల్ తో పాటు ఒక ఎంటర్ టైన్ మెంట్ ఛానల్ ప్రారంభించాలని ఆయన ఉద్దేశంగా కన్పిస్తోంది. టీవీ రంగంలో తన కుమార్తె లక్ష్మీ ప్రసన్న బాగా రాణించడంతో ఈ రెండు టీవీ ఛానళ్ళ బాధ్యతను ఆమెకు అప్పగించాలన్నది ఆయన ఆలోచన. మోహన్ బాబుకు మంచి బిజినెస్ సెన్స్ ఉంది. విద్యా వ్యాపారంలో ఆయన బాగా రాణించారు.

మోహన్ బాబు కుమారుడు విష్ణుకు థింక్ స్మార్ట్ అనే గ్రాఫిక్స్ స్టూడియో ఉంది. ఆ స్టూడియో టీవీ ఛానళ్ళకు సపోర్టివ్ గా ఉంటుంది. కొత్తగా న్యూస్ ఛానల్స్ కు అనుమతి ఇవ్వకూడదని కేంద్రప్రభుత్వం నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. అందుకే మోహన్ బాబు నష్టాల్లో ఉండి జీతాలు ఇవ్వలేకపోతున్న ఏదైనా ఒక ఛానల్ ను టేకోవర్ చేయాలనుకుంటున్నారు. మళ్ళీ రాజకీయాల్లో యాక్టివ్ కాదలుచుకున్న మోహన్ బాబుకు న్యూస్ ఛానల్ మీద మంచి ఆసక్తి ఉంది.

Source: thatstelugu.oneindia.in

Friday, July 23, 2010

MAA gets telecast rights of 58 English films

MAA TV, a Telugu general entertainment channel network, has acquired Telugu satellite telecast rights of 58 movies from the Warner Bros’ popular Hollywood film library.

These include blockbusters such as 300 Warriors, Matrix, Matrix Revolutions, Matrix Reloaded, Eraser, Lethal Weapon, Superman Returns, Mars Attacks, Outbreak, Perfect World and Tom and Jerry Blast Off to Mars, MAA stated in a press release.

The agreement provides MAA TV with exclusive satellite telecast rights for their Telugu version. The agreement also facilitates MAA TV with multiple telecasts for two years. MAA TV Plans to air these movies every Sunday The first movie to go on-air will be Matrix on July 25.

Thursday, July 15, 2010

అమితాబ్ కు తక్కువ షారుఖ్, సల్మాన్ లకు ఎక్కువైన జగపతి బాబు...

ఓ టైమ్ లో ‘ఆంధ్రా అమితాబ్’ అని పిలిపించుకోవడానికి బాగా ఇష్టపడే వాడు జగపతిబాబు. మరి ఇప్పుడు ‘అమితాబ్ బచ్చన్ కన్నా ఏం తక్కువ నీకైనా ’ అంటూ ఎవరైనా ఉబ్బించారో, లేక షారుఖ్, సల్మాన్ లు కూడా చేసిందేగా నువ్వూ ఓ ట్రయల్ వెయ్యమంటూ డబ్బిచ్చారో ఇంకా తెలీలేదు కానీ మొత్తానికి బాబుగారు బుల్లి తెరపై పాదం మోపుతున్నారు. ఈ టీవీలో ప్రసారం కాబోతున్న ‘రాజు రాణి అండ్ జె’ ప్రోగ్రామ్ కి వ్యాఖ్యాతగా వ్యవహరించనున్న జగపతి బాబు గురించి ‘బుల్లి తెరపై అడుగిడుతోన్న వెండితెర సూపర్ స్టార్’ అంటూ ప్రస్తుతం మనం ఉలిక్కిపడే రేంజ్ లో ఊదరగొడుతున్నారు సదరు ఛానల్ వారు..పోన్లెండి..జగపతి బాబు ఇక్కడైనా సూపర్ స్టార్ అనిపిచుకోగలిగినందుకు ఆయన మహిళాభిమానులు ఆనందిస్తారేమో.

ఇంతకీ ఏమిటా ప్రోగ్రామ్, అందులో విశేషమేంటని ఆరాతీస్తే భార్య, భర్తలను ఆహ్వానించి వాళ్ళతో టాక్ షో నిర్వహించనున్నారట జగపతి బాబు ఈ ప్రోగ్రామ్ టైటిల్ లో ‘రాజు రాణి’ పక్కన తన పేరుని సింపుల్ గా ‘జె’ అని పెట్టుకున్నట్టో లేక ‘జె’ అంటే జాకీ అనో ఇంకా కన్ఫర్మ్ చెయ్యలేదు. అయితే జగపతి అయినా జాకీ అయినా ఓకే అంటూ బుల్లితెర వ్యాఖ్యాతగా కొత్త జర్నీ స్టార్ట్ చేస్తోన్న జగపతి బాబుకి ఆయన అభిమానులు ఆల్ ది బెస్ట్ చెబుతున్నారు.

Source: thatstelugu.oneindia.in

Tuesday, July 13, 2010

మా మూవీస్, మా జూనియర్ ఇన్సాట్ 2E లో...

మా టీవీ నెట్వర్క్ నుండి మా మూవీస్, మా జూనియర్ ఇన్సాట్ 2E లో...

Maa Movies, Maa Junior On Insat 2E


New Channels Maa Movies, Maa Junior On Insat 2E From Maa Tv Network....

ZEE 24 Hrs Comedy About Balayya

Nandamuri Balakrishna is one man who has always been the target when it comes to internet or SMS jokes, this time, even the electronic media seems to have joined the league. We are talking about the ZEE 24 hours channel and their recent analysis on remuneration of stars.


In that, they have given as the remuneration of Balayya as Rs 10 crores. Now, this has turned out to be a big joke. Many say there is not that much scene for Balayya and it is just a stunt to grab attention. After having so many flops, Balayya’s recent movie ‘Simha’ was somewhat okay.


Even here, sources say that fake numbers were given projecting the film to be a bumper hit whereas it was a moderate success.


Many are saying that while it is okay for few groups to project Balayya and create hype about him, they also suggest that such things must be done with sensibility and convincing so that it doesn’t end up like a big joke as it is being seen here now. 
Source: www.greatandhra.com

Monday, July 12, 2010

చానల్స్‌ ప్రచార ప్రభావం నిల్‌



  • జగన్‌ యాత్రా ప్రచారంపై కేంద్ర ఇంటిలిజెన్స్‌ నివేదిక
  • హైకమాండ్‌కు తొలగిన ఉత్కంఠ
  • బ్యాక డ్రాప్‌ సంగీతంతో యాత్రపై లైవ్‌, చర్చాగోష్ఠులపై వీక్షకుల అనాసక్తి
  • యాత్ర తొలి రోజు ఉత్కంఠ ఆపై ఆ చానళ్ల రేటింగ్‌లో మార్పు
  • న్యూస్‌ చానల్స్‌ కంటే ఎంటర్‌టైన్‌మెంట్‌ చానల్స్‌కే పెరిగిన రేటింగ్‌
  • రేటింగ్‌ ఆధారంగా నివేదికలు తయారు చేసిన ఇంటిలిజెన్స్‌ వర్గాలు

హైదరాబాద్‌, కాంగ్రెస్‌ అధిష్ఠానానికి జగన్‌ ఉత్కంఠ తొలగింది. ఓదార్పు యాత్ర స్పందన, మీడియా సృష్టిస్తున్న హైప్‌లను పరిశీలించిన పార్టీ హైకమాండ్‌ దీన్ని కాచి ఒడపోసేసింది. కేంద్ర ఇంటిలిజెన్స్‌ వర్గాలు అతి తేలిగ్గానే ప్రజల్లో యాత్ర ప్రభావాన్ని అంచనాలు కట్టేశాయి. ఓదార్పుయాత్ర, దీని ప్రభావంపై తెలుగువార్తా ఛానళ్ళన్నీ నిరంతరాయంగా ప్రసారాలు చేస్తున్నాయి. రెండోవిడత ఓదార్పు యాత్ర తొలిరోజు సాదాసీదాగా సాఫీగానే సాగిన ప్రసారాలు రెండోరోజు నుంచి ఊపందుకున్నాయి. యాత్రను అడుగడుగునా కవర్‌ చేయడంలో వార్తాఛానళ్ళు పోటీ పడుతున్నాయి. 'బ్యాక్‌డ్రాప్‌'లో హోరెత్తించే పాటలు, వాయిద్యాలతో జనాన్ని తమవైపు ఆకర్షించే ప్రయత్నాలు చేస్తున్నాయి. రాజకీయ పండితులు, సీనియర్‌ జర్నలిస్టులు, వివిధవర్గాలకు చెందినప్రముఖులను ఆహ్వానించి యాత్ర ప్రభావంపై చర్చా గోష్ఠులు నిర్వహిస్తున్నాయి. తద్వారా యాత్రకు మంచి హైప్‌ సృష్టించే ప్రయత్నాలు చేస్తున్నాయి. యాత్రకు విపరీత స్పందనున్నట్లుగా ప్రచారం చేసేందుకు జగన్‌ వర్గం చేస్తున్న ప్రయత్నాలే యాత్రపై ప్రజాభిప్రాయాన్ని ఖచ్చితంగా పసిగట్టేందుకు ఇంటిలిజెన్స్‌ వర్గాలకు దోహదపడ్డాయి.
గత మూడు రోజులుగా తెలుగు నిరంతర వార్తా ప్రసారాలందిస్తున్న ఛానళ్ళ రేటింగ్‌లు తగ్గుముఖం పట్టాయి. అదే సమయంలో యాత్రకు సంబంధించిన వార్తా కథనాలు, విశ్లేషణలకోసం పాఠకులు వార్తాపత్రికలపైనే ఎక్కువగా ఆధారపడుతున్న విషయం ఇంటిలిజెన్స్‌కు రూఢీ అయింది. దీన్నే ఇంటిలిజెన్స్‌ వర్గాలు రాష్ట్ర గవర్నర్‌తో పాటు కేంద్ర హోమ్‌శాఖకు కూడా నివేదికలుగా అందించాయి. గత మూడురోజుల్లో తెలుగువార్తా ఛానళ్ళ కంటే వినోద ప్రధాన ఛానళ్ళ రేటింగ్‌ పెరిగింది. ఇందుకు గల కారణాలను ఇంటిలిజెన్స్‌ పరిశీలించింది. ఒకే విషయాన్ని పదే పదే ప్రసారం చేస్తూ ప్రజల్లో హైప్‌ సృష్టించేందుకు చేస్తున్న ప్రయత్నాలు వికటిస్తున్నాయని కూడా గుర్తించింది.
ప్రారంభ దశలో ఓదార్పు యాత్ర రాష్ట్రవ్యాప్తంగా ఉత్కంఠకు తెరతీసింది. ఇదెలాంటి పరిణామాలకు దారితీస్తుందోనన్న ఆందోళన అన్ని వర్గాల్లో నెలకొంది. అధిష్ఠానం జగన్‌ ఇమేజ్‌కు తలొగ్గుతుందా ? లేకుంటే జగన్‌ భవిష్యత్‌ ప్రణాళికలు ఎలాగుంటాయన్న చర్చ ఒక్క ఆంధ్రప్రదేశ్‌లోనే కాక జాతీయ స్థాయిలో చోటు చేసుకుంది. అధిష్ఠానం ఈ యాత్రపై అసహనంగా ఉందని, జగన్‌ తీరుపై ఆవేదన వ్యక్తంచేస్తోందని, జగన్‌ ఇలా ప్రవర్తించి ఉండాల్సిందికాదన్న ఒకేఒక్కవ్యాఖ్యతో ముఖ్యమంత్రి రోశయ్య కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు, మంత్రులందరినీ యాత్రకెళ్ళకుండా కట్టడి చేయగలిగారు. శ్రీకాకుళం జిల్లాలో నాలుగురోజుల యాత్ర సాగినా ఒక్క ఎమ్‌పి లేదా ఎమ్మెల్యే ప్రత్యక్షంగా యాత్రలో పాల్గొనలేదు. కానీ సోమవారం నుంచి తూర్పుగోదావరిజిల్లాలో జరిగే యాత్రలో పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఎమ్మెల్సీలంతా పాల్గొంటారని జగన్‌ వర్గం అంచనాలువేస్తోంది. జిల్లాలో యాత్ర సాగినన్నాళ్లూ వీరంతా తమవెంటే ఉంటారని ఆశిస్తోంది. ఈ
జిల్లాలోని పార్టీ ఎమ్మెల్యేల్లో పలువురు జగన్‌ సాయంతోనే టికెట్లుపొందారు. వైఎస్‌ కుటుంబ ఆర్ధిక సాయంతోనే ఎన్నికల్లో నెగ్గుకొచ్చారు. ఇప్పటికీ పలువురికి జగన్‌తో ఆర్ధిక లావాదేవీలు, వ్యాపార సంబంధాలున్నాయి. అయినా అధిష్ఠానం వీరిని కూడా కట్టడి చేస్తోందన్న ఆందోళన జగన్‌ శిబిరంలో నెలకొంది. ఈ కారణంగానే జగన్‌ ఆత్మవిశ్వాసం కోల్పోయి బేలగా అధిష్ఠానంపై విమర్శలకు పాల్పడుతున్నట్లు పరిశీలకులు గుర్తించారు. తన కోసం ప్రాణాలు పెట్టేందుకైనా సిద్ధంగా వున్న తూర్పు ఎమ్మెల్యేలు, మంత్రుల్ని అధిష్ఠానం కట్టడి చేస్తోందంటూ జగన్‌ చేసిన వ్యాఖ్యలకు ఇదే కారణంగా భావిస్తున్నారు. రాష్ట్రంలో బలహీన నాయకత్వం ఉందంటూ రోశయ్యపై అసహనాన్ని వ్యక్తం చేయడం కూడా ఈ ఉక్రోషంతోనేనని అంచనాలువేస్తున్నారు. అయినా తూర్పులో ఓదార్పును ఘనవిజయం చేసేందుకు జగన్‌ వర్గం పక్కా ప్రణాళికలు రూపొందించింది. తన సాధనసంపత్తినంతా వినియోగించి ఇక్కడియాత్రను ముందుకు నడిపించనుంది. ఎమ్మెల్యేలు, మంత్రులు ప్రత్యక్షంగా పాల్గొన్నా లేకున్నా యాత్రకు మాత్రం ప్రజాస్పందన విపరీతంగా లభించే విధంగా ఏర్పాట్లు పూర్తయ్యాయి.

Source: www.andhraprabhaonline.com

ఛానెల్స్ రేటింగ్‌ రేసు ... తిరకాసు... (ప్రజాశక్తి సౌజన్యంతో)

చానెళ్ళు పెరిగితే ప్రేక్షకుల సంఖ్య అమాంతం పెరిగిపోదు. ఉన్న ప్రేక్షకుల్ని పంచుకునేందుకే అన్ని ఛానళ్లూ పోటీ పడుతుంటాయి. ఈక్రమంలో కొందరు కొత్త ప్రేక్షకులు కూడా పుట్టుకురావచ్చు. అయితే ఆపోటీలో బలంగా నిలిచేదెవరు, గెలిచేదెవరనే ప్రశ్న టీవీ చూసే ప్రతి ఒక్కరిలోనూ ఆసక్తి కలిగిస్తుంది. సగటు ప్రేక్షకుడికి కూడా ఏ ఛానల్‌కి ఆదరణ ఎక్కువ అనే విషయం తెలుసుకోవాలనే కోరిక ఉంటుంది. ఈ ఆదరణను బట్టే ర్యాంకింగ్స్‌ నిర్ణయించుకుంటారు. ఇక మార్కెట్‌ విస్తృతికి ఎవరికి తోచిన రీతిలో వారు కసరత్తు చేస్తుంటారు. వీటన్నిటికీ మూలాధారంగా వచ్చినవే రేటింగ్స్‌. శాస్త్రీయంగా జీఆర్పీ (గ్రాస్‌ రేటింగ్‌ పాయింట్స్‌) లేదా టీఆర్పీ (టార్గెట్‌ రేటింగ్‌ పాయింట్స్‌) అంటారు. సింపుల్‌గా ఇది ప్రేక్షకాదరణ కొలమానం(ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌) అన్నమాట. టీవీఆర్‌ (టెలివిజన్‌ రేటింగ్స్‌)గా ఇది బాగా ప్రాచుర్యం పొందింది. రేటింగ్స్‌ అంటే ఒక నిర్దిష్ట సమయంలో, ఒక నిర్దిష్ట ప్రసారాన్ని చూసే ప్రేక్షకుల శాతం. ఇందులో వయో, లింగ వర్గీకరణ కూడా ఉంటుంది.వస్తు ఉత్పత్తి తర్వాత, వినియోగదారుల అభిప్రాయమే కీలకం. ఆ స్పందనలకు అనుగుణంగా మార్కెట్‌ విస్తృతిపైన ఉత్పత్తి సంస్థలు దృష్టి పెడతాయి. టెలివిజన్‌ ప్రసారాలకు సంబంధించినంతవరకు అటువంటి ప్రయత్నమే రేటింగ్స్‌. పత్రికల్లో సులువుగా సర్వే పద్ధతి మీద ఆధారపడవచ్చు. పాఠకుల అభిప్రాయాలు, పంపిణీ వివరాలు సేకరించి ప్రతిస్పందనల్ని తెలుసుకోవచ్చు. ఆడిట్‌ బ్యూరో ఆఫ్‌ సర్క్యులేషన్‌ ఆరు నెలలకొకసారి ఈ ప్రక్రియని నిర్వహిస్తుంది. కానీ టీవీల విషయంలో ఇది సాధ్యం కాదు. ప్రసారమయ్యే కార్యక్రమం, ప్రేక్షకునికి ప్రసారాలు అందుబాటులో ఉండే పరిస్థితి వంటి అంశాల్ని దృష్టిలో ఉంచుకొని రేటింగ్స్‌ నిర్ణయించాలి. ఇది ఎప్పటికప్పుడు జరిగే ప్రక్రియ. వ్యాపార లావాదేవీలు, ఇతరులతో సంబంధాలు, ఛానళ్లకు దిశానిర్దేశం, వాణిజ్య ప్రయోజనాల విషయంలో వీటిదే కీలక పాత్ర కావడంతో రేటింగ్స్‌ సేకరించే సంస్థలకు కూడా ప్రాధాన్యం పెరిగింది. మన దేశంలో ఈ రంగంలో రెండు సంస్థలు పనిచేసేవి. ఒకటి టామ్‌, రెండోది ఇన్‌టామ్‌. పదేళ్ల కిందట మార్కెట్‌లో నిలదొక్కుకునేందుకు ఈ రెండు సంస్థలూ పోటాపోటీగా పనిచేశాయి. వీటిని నడిపిస్తున్న సంస్థల మధ్య కుదిరిన ఒప్పందాల మేరకు రెండూ కలిసిపోయి, టామ్‌గా అవతరించాయి. అంతకుముందు ఇవి సేకరించిన రెండు రకాల శాంపిళ్లలో ఉన్న తేడాల వల్ల రేటింగ్స్‌లోనూ కొన్ని అంతరాలు కనిపించేవి. కొన్ని సందర్భాల్లో భారీ తేడాలు కూడా ఉండేవి. విలీనం తర్వాత భారతీయ టెలివిజన్‌ మార్కెట్‌లో టామ్‌ ఆధిపత్యానికి తిరుగులేకుండా పోయింది. ఇప్పుడు ఈ సంస్థ గీసిందే గీత. ప్రకటనకర్తలకూ, టెలివిజన్‌ యాజమాన్యాలకు, ఏజెన్సీలకు అదే ప్రామాణికం. రేటింగ్స్ సేకరించే విధానం
టామ్‌ అంటే టెలివిజన్‌ ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌. ఈ సంస్థ ఎప్పటికప్పుడు మీడియా అధ్యయనాల్ని నిర్వహిస్తూ ప్రేక్షకుల నాడిని అందించే ప్రయత్నం చేస్తుంది. ఇప్పుడొకసారి రేటింగ్స్‌ తీసే విధానాన్ని పరిశీలిద్దాం. రేటింగ్స్‌ సేకరించడానికి టామ్‌ సంస్థ ''పీపుల్‌ మీటర్‌'' అనే పరికరాన్ని ఉపయోగిస్తుంది. ఎంపిక చేసిన ఇళ్లలో వీటిని ఏర్పాటు చేసి, టీవీ రిమోట్‌తో అనుసంధానిస్తారు. ప్రేక్షకుల వర్గీకరణ కోసం దీనిపై ప్రత్యేకంగా మీటలు ఉంటాయి. అంటే స్త్రీలు, పురుషులు, పిల్లలు... ఇలా వయసుల్ని బట్టి వర్గీకరిస్తారు. సంబంధిత వర్గాలు టీవీ చూస్తున్నప్పుడు ఆయా బటన్లను నొక్కాలి. టీవీ దగ్గర నుంచి వెళ్లిపోయేటప్పుడు మళ్లీ ఆఫ్‌ చేసి వెళ్లాలి. ఈ ప్రక్రియ అంతా టామ్‌ ప్రధాన కార్యాలయంలో రికార్డు అవుతుంది. వారు చూసే ఛానళ్లు, చూస్తున్న సమయం కూడా నమోదవుతుంది. దీన్నిబట్టి రేటింగ్స్‌ నిర్ణయిస్తారు. రేటింగ్స్‌ వ్యవస్థకు కీలకమైన పీపుల్‌ మీటర్ల ఏర్పాటుకి టామ్‌ పదిహేనేళ్ల కిందట దేశంలో క్లాస్‌1 సిటీస్‌గా ఉన్న 29 నగరాల్ని ఎంపిక చేసింది. తర్వాత పెరిగిన అవసరాలకు అనుగుణంగా విస్తరిస్తూ పోయింది. ప్రస్తుతం దేశం మొత్తంలో సుమారు పన్నెండు వేల పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నట్లు అంచనా. ఆంధ్రప్రదేశ్‌లో పన్నెండు వందల వరకు పీపుల్‌ మీటర్లు పనిచేస్తున్నాయి. టెలివిజన్‌ ఛానళ్ల ఎంపిక, చూసే కార్యక్రమాలు, సమయ పరిమితులు, చూస్తున్న వర్గాలు వంటి అంశాల్ని ఈ మీటర్ల సాయంతో గుర్తిస్తారు. మన రాష్ట్రంలోని పట్టణాల్ని మూడు రకాలు విభజించారు. రాజధాని హైదరాబాద్‌కి ప్రత్యేక స్థానం ఉంది. రెండో విభాగంలో విశాఖ, విజయవాడ నగరాలు ఉన్నాయి. మరో పది పట్టణాల్లో కూడా పీపుల్‌ మీటర్లను అమర్చి రేటింగ్స్‌ పరిశీలనని జరుపుతున్నారు. ఈ మీటర్లు అమర్చడంలో వివిధ సామాజిక, ఆర్థిక నేపథ్యాలు ఉన్న ఇళ్లనే ఎంపిక చేసుకోవడం విశేషం.
ఆంధ్రప్రదేశ్‌లో ట్రెండ్‌
సాఫ్ట్‌వేర్‌ బూమ్‌, రియల్‌ ఎస్టేట్‌ బూమ్‌ గురించి వినీ, వినీ బోర్‌ కొట్టేసింది. ఇప్పుడు నడుస్తోంది మీడియా బూమ్‌. దేశంలోని ఇతర రాష్ట్రాల పరిస్థితి ఎలా ఉన్నా, నేషనల్‌ మీడియా తర్వాత ఆ బూమ్‌ని ఆస్వాదిస్తోంది ఆంధ్రప్రదేశే. ఏడేళ్ళ కిందట న్యూస్‌ ఛానల్‌ పెట్టడం అంటే ప్రాంతీయ భాషల్లో సాధ్యమా? అనిపించింది. ఇప్పుడది ప్రాంతీయ భాషలకే సాధ్యమనిపిస్తోంది. జాతీయ మీడియా కూడా చొరబడలేని ప్రాంతాల్లోకి, పల్లెల్లోకి, సెక్షన్లలోకి ప్రాంతీయ మీడియా మాత్రమే ప్రవేశించి, ప్రభావం చూపగలుగుతోంది. తెలుగులో రెండు న్యూస్‌ ఛానళ్లు పుట్టిన తొలి నాళ్ళలో మీడియా పరిశీలకులు జరిపిన అధ్యయనాలన్నీ ఇదే అంశాన్ని ధ్రువీకరించాయి.
వినోద ఛానళ్ల ప్రియులుగా మారిన పేక్షకుల్ని క్రమంగా న్యూస్‌ఛానళ్ల వైపు మళ్లించడంలో నిర్వాహకులు సఫలమయ్యారు. టామ్‌ జరిపిన పరిశీలనలో ఆంధ్రప్రదేశ్‌లో ఒక ప్రేక్షకుడు న్యూస్‌ ఛానళ్లను చూసే సగటు, జాతీయ సగటు కంటే విపరీతంగా పెరిగింది. మార్కెట్‌ సామర్ధ్యం విషయంలోనూ ఇతర రాష్ట్రాలకంటే భిన్నమైన అభిరుచులు ఇక్కడ ఉండటం ఛానళ్ల విస్తృతికి దోహదం చేసింది. ఇండియన్‌ టెలివిజన్‌ డాట్‌ కామ్‌ వంటి సంస్థలు కూడా ఈ అంశాన్ని శాస్త్రీయంగా నిరూపించాయి. 2009లో వచ్చిన ఎన్నికలు, కొత్త ఛానళ్ల వెల్లువ వల్ల పెరిగిన మోజు వంటి అంశాల్ని పరిగణనలోకి తీసుకున్నప్పటికీ టీవీ ప్రేక్షకుల సంఖ్య స్థిరంగా ఉండటం ఆసక్తిని కలిగించే అంశం. టామ్‌ ఇటీవల నిర్వహించిన డిజిటల్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ సర్వేలో డీటీహెచ్‌ సేవలు కూడా వేగంగా విస్తరిస్తున్నట్లు నిర్ధారణ అయ్యింది. దీంతో మార్కెట్‌లో పోటీ మరింత వేగవంతం అయ్యింది. ఈ పోటీ విధానంలో రేటింగ్స్‌కి తప్ప మరే విషయానికీ ప్రాధాన్యం లేకుండా పోయింది. అందుకే రూపొందిన కార్యక్రమాలకు వచ్చిన రేటింగ్స్‌ తెలుసుకునే రోజులు ఇప్పుడు పోయాయి. రేటింగ్స్‌ కోసమే ప్రసారాల్ని రూపొందించాల్సిన పరిస్థితి దాపురించింది. ఛానళ్ల పోటీలో రేటింగ్‌ల వేట మొదలయ్యాక నైతిక నియమావళి మాట అలా ఉంచితే మీడియాలో విపరీత ధోరణులు పెరిగిపోయాయి. ఆర్థిక సంస్కరణలు ప్రారంభమయ్యాక మీడియా దిశ మార్చుకుందంటూ ఇండియన్‌ ఎక్స్‌ప్రెస్‌ సీనియర్‌ జర్నలిస్టు రామ్‌కరణ్‌ చేసిన వ్యాఖ్యలు ఒకసారి గుర్తు చేసుకోవాలి. ''బడ్జెట్‌ స్టోరీలు రాసే బాధ్యతను బిజినెస్‌ జర్నలిస్టుల కంటే, సంస్థ ఎకౌంటెంట్లకు అప్పగించడంతోనే ఎడిటర్ల వ్యవస్థను కుప్పకూల్చే ప్రక్రియ ప్రారంభమైంది.'' ఛానళ్ల వెల్లువ ఈ పరిస్థితిని మరింత దిగజారుస్తోంది.
ఇటీవల హైదరాబాద్‌లో తెలుగు ఛానళ్ల తీరుపై సీఎంఎస్‌ నిర్వహించిన ఫోకస్‌ గ్రూప్‌ వర్క్‌షాప్‌లో సీనియర్‌ జర్నలిస్టు ఒకరు ఇలా వ్యాఖ్యానించారు. ''మీడియా అంటే ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో పనిచేసే సంస్థలు.. వారు కచ్చితంగా లాభాపేక్షతోనే పనిచేస్తారు. డబ్బు పెట్టేవారి ఆలోచనలకు అనుగుణంగా పనిచేయక తప్పదు. వస్తున్న కార్యక్రమాలు ప్రజలకు నచ్చకపోతే చూడటం మానేయవచ్చు. అలానే మంచి కార్యక్రమాలు చేసినప్పుడూ చూస్తున్న పరిస్థితి లేదు. అందుకే మంచో చెడో అనవసరం. ప్రజల అవసరాలకు తగింది కాదు, ప్రజలకు నచ్చేదేంటో చూపిస్తాం... అప్పుడే రేటింగ్స్‌ వస్తాయి.'' ఈ మాటలు ఛానళ్ల పోకడకు అద్దం పడుతున్నాయి. జర్నలిస్టులు ఈ పరిస్థితిని నిలువరించలేరా. రేటింగ్స్‌ వెంపర్లాటలో అన్నీ వదిలేయాల్సిందేనా. పోటీ కాస్తా ఛానళ్ల మధ్య యుద్ధంగా మారుతున్న సందర్భాలు, ఒకరిపై ఒకరు దుమ్మెత్తి పోసుకుంటున్న సంస్కృతి, ప్రచారమే పరమావధిగా మారిపోతున్న ఎయిర్‌టైమ్‌, జర్నలిస్టులే కుట్రదారులుగా దొరికిపోతున్న స్టింగ్‌ (దొంగ) ఆపరేషన్లు, వీటన్నిటి మధ్య మీడియా సంస్కర్తలుగా మనం చేస్తున్న ఉద్యమాలు.. అసలు వ్యాపార ప్రయోజనాల కోసమే నిర్వహిస్తామంటున్న సంస్థలకు మీడియా హక్కులు, పత్రికా స్వేచ్ఛ వంటి అంశాలు వర్తిస్తాయా... ఇంకా మీడియాలో జర్నలిజం మిగిలి ఉందా..? దీనికి 'ఛానలిజం' అని పేరు పెట్టుకోవాలా? మీడియా పెద్దలే ఒకసారి ఆలోచించాలి.
రేటింగ్స్‌కి ప్రామాణికత ఎంత?
మీడియాలో పోటీకి, పెడ పోకడలకు అన్నిటికీ కారణం రేటింగ్సే అన్న అభిప్రాయం చాలా మందిలో ఉంది. ఈ రేటింగ్స్‌ని ఎంతవరకు సీరియస్‌గా తీసుకోవాలన్న విషయాన్నీ పరిశీలించాలి. టామ్‌ సేకరిస్తున్న రేటింగ్స్‌ అన్నీ శాంపిళ్లమీద ఆధారపడినవే. వాటి శాతాన్ని ఒకసారి గమనిస్తే... దేశంలో సుమారు 12 కోట్ల కేబుల్‌ టీవీ కనెక్షన్లు ఉన్నట్లు ఒక అంచనా. వంద కోట్ల జనాభా దాటిన దేశంలో పీపుల్‌ మీటర్లు అమర్చింది కేవలం పన్నెండు వేల ఇళ్లల్లో మాత్రమే. అంటే ఇన్ని కోట్ల జనాభాలో దాదాపు 50 వేలమంది అభిప్రాయమే రేటింగ్‌గా మారుతోంది. ఈ శాంప్లింగ్‌ విధానంపై సీఎంఎస్‌ వంటి సంస్థలు ఎన్నో రకాల అభ్యంతరాల్ని లేవనెత్తాయి. ప్రధానంగా పీపుల్‌ మీటర్ల ఏర్పాటులో పట్టణ ప్రాంతాలకే ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారన్న విమర్శ ఉంది. శాంపిల్‌గా తీసుకున్న ఒక ఇల్లు కొన్ని వేల మందికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ఏకరూప సమాజాలు కలిగిన కెనడా, అమెరికా వంటి దేశాలకు సరిపడే విధానాన్నే ఇక్కడ అమలు చేయడంపైనా అభ్యంతరాలు ఉన్నాయి. పీపుల్‌మీటర్‌ ఆపరేషన్‌లోను అనేక సమస్యలు. ఇందులో పల్లెప్రజల అభిమతాన్ని తీసుకోవడానికి ఏమాత్రం వీలుపడదు. ఇండియాలో వినియోగంలో ఉన్న టీవీ సెట్లలో అరవై శాతం పల్లెలు, చిన్న పట్టణాల్లోనే ఉన్నాయని అంచనా. కానీ లక్షలోపు జనాభా ఉన్న పట్టణాల్ని, మండల కేంద్రాల్ని, గ్రామాల్ని కూడా టామ్‌ లెక్కలోకి తీసుకోవడం లేదు. ఇది ప్రజాభిప్రాయాన్ని ఎలా ప్రతిబింబిస్తుందనేది అంతుబట్టని విషయం. ఇక రాష్ట్రాలు, ప్రాంతాల వారీగా ఎన్నో తేడాలు, ప్రసారాల్లోను ఎన్నో విలక్షణతలు కనిపిస్తాయి.
ఈ విషయంలో టామ్‌ సమతుల్యత పాటించకపోవడం, ముంబై వంటి నగరాల్లోనే సుమారు వెయ్యి మీటర్లు పెట్టడం పైనా విమర్శలు ఉన్నాయి. అయితే పీపుల్‌ మీటర్లకు అయ్యే ఖర్చు భారీగా ఉండటం, వాటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవలసి రావటంతో ఈ విమర్శలన్నిటినీ టామ్‌ తోసిపుచ్చింది. ఇక కేబుల్‌ ఆపరేటర్లు ఛానళ్ల ప్లేస్‌మెంట్స్‌ని మార్చే విధానం, మీటర్ల టాంపరింగ్‌, మేనేజ్‌మెంట్‌ వంటివి కూడా రేటింగ్‌ని ప్రభావితం చేస్తాయి. పీపుల్‌ మీటర్లు పెట్టిన ప్రాంతాలతో పాటు, అవి పెట్టిన ఇళ్ల జాబితా కూడా రహస్యమని టామ్‌ చెబుతున్నప్పటికీ... ఇదొక బహిరంగ రహస్యమని చాలా సందర్భాల్లో నిరూపణ అయింది. స్థానిక ఎంఎస్‌ఓల (మల్టీ సిస్టమ్‌ ఆపరేటర్‌) సహకారంతోనే టామ్‌ పీపుల్‌ మీటర్ల వ్యవస్థను ఏర్పాటు చేసుకుంది. కాబట్టి వీటి ఆనుపానులన్నీ వారికి తెలుసనేది మీడియా పరిశీలకుల వాదన. దూరదర్శన్‌ కూడా ఈ రేటింగ్స్‌ మాయాజాలంలో చిక్కుకొని దిశను మార్చి ప్రయాణించిన సందర్భాలు ఉన్నాయి. అయితే త్వరలోనే తప్పు తెలుసుకొని డార్ట్‌ విధానంలో డీడీ ప్రత్యేకంగా అభిప్రాయ సేకరణ చేస్తోంది. డార్ట్‌ అంటే 'దూరదర్శన్‌ ఆడియన్స్‌ రేటింగ్‌'.
మరోవైపు టామ్‌ ఏకఛత్రాధిపత్యానికి గండి కొట్టేందుకు 2005లో ఇంకో సంస్థ రంగప్రవేశం చేసింది. ఆడియన్స్‌ మెజర్‌మెంట్‌ అండ్‌ ఎనలిటిక్స్‌ లిమిటెడ్‌ సంస్థ ఎమ్యాప్‌ని ప్రారంభించింది. అనుకున్నంత వేగంగా ఇది విస్తరించలేకపోయింది. అప్పటికే వంద కోట్ల పెట్టుబడితో ఒక్కో క్లైంట్‌ దగ్గరా అయిదు నుంచి 15 లక్షల వరకు వసూళ్లు జరుపుతున్న టామ్‌ మార్కెట్‌లో పాతుకుపోయింది. కానీ ఎమ్యాప్‌ ఆన్‌లైన్‌ సేవలు, కోరినవారికి ఏ రోజుకారోజు, ఏ ప్రోగ్రామ్‌కి ఆ ప్రోగ్రామ్‌ రేటింగ్స్‌ అందించేందుకు సిద్ధపడింది. ఈ పోటీని అర్థం చేసుకున్న టామ్‌, వారానికోసారి రేటింగ్స్‌ ఇవ్వడంతో పాటు తాజాగా 'మిడ్‌వీక్‌' పేరుతో ముందుగానే 'రిజల్ట్‌ లీక్‌' చేస్తోంది.
టెలివిజన్‌ రేటింగ్స్‌ సేకరించే పద్ధతి ఒక్క మన దేశంలోనే కాదు, అనేక దేశాల్లో అమల్లో ఉంది. అయితే ఈ విధంగా గుత్తాధిపత్యానికి అవకాశం కల్పించిన దేశాలు మాత్రం చాలా తక్కువ. అందుకే ఇండియన్‌ బ్రాడ్‌కాస్టింగ్‌ ఫౌండేషన్‌ వంటి సంస్థలు జోక్యం చేసుకోవాలని మీడియా నిపుణులు కోరుతున్నారు. అమెరికాలో టామ్‌ మాతృసంస్థ ''ఏసీ నీల్సెన్‌'' ఒంటెత్తుపోకడల విషయంలో ఎన్నో ఆరోపణలు ఎదుర్కొంది. రేటింగ్స్‌ ట్యాంపరింగ్‌కి సంబంధించిన అనేక అక్రమాలు వెలుగు చూడటంతో చివరికి కోర్టు మెట్లు కూడా ఎక్కాల్సి వచ్చింది. అమెరికాలో రేటింగ్స్‌ పర్యవేక్షణకు మీడియా రేటింగ్స్‌ కౌన్సిల్‌ ఉన్నప్పటికీ ఈ దారుణాలను పసిగట్టలేకపోయింది. మన దేశంలో అలాంటి వ్యవస్థలేవీ లేవు. నియంత్రణ కోసం ఇదే తరహాలో ఓ కమిషన్‌ ఏర్పాటు చేస్తామని కేంద్ర ప్రభుత్వం ఎప్పటి నుంచో చెబుతున్నా ఇంతవరకు ఆచరణలోకి రాలేదు. అనేక సంప్రదింపుల తర్వాత 2010 మేలో భారతదేశంలో రేటింగ్స్‌, టీవీ ప్రసార వ్యవస్థలకు సంబంధించిన అంశాలపై అధ్యయనం కోసం ఫిక్కీ సెక్రటరీ జనరల్‌ అమిత్‌ మిత్రా ఆధ్వర్యంలో ఏడుగురు సభ్యుల కమిటీని కేంద్రం నియమించింది. మూడు నెలల కాలపరిమితితో నియమించిన ఈ కమిటీ రేటింగ్‌ పద్ధతిలోని లోపాలతో పాటు ప్రేక్షక బాహుళ్యాల సామాజిక స్థితిగతులు, శాంపిళ్ల సేకరణతీరు, వాటి కచ్చితత్వం, పరిమాణం, ప్రాంతీయ విలక్షణత, కేబుల్‌, డీటీహెచ్‌ వంటి ప్రసార సరఫరా వ్యవస్థల తీరుతెన్నుల్ని కూడా అధ్యయనం చేయనుంది. బ్రాడ్‌కాస్టింగ్‌ ఆడియన్స్‌ రీసెర్చ్‌ కౌన్సిల్‌ వంటి వ్యవస్థలు ఏర్పాటు చేయాలన్న ట్రారు ప్రతిపాదనల్ని కూడా అమిత్‌ మిత్రా కమిటీ పరిశీలించనుంది. సీనియర్‌ జర్నలిస్టులు, టెలికం, మేనేజ్‌మెంట్‌ రంగ నిపుణులతో కూడిన ఈ కమిటీ ఆమోదయోగ్యమైన పరిష్కారాలు సూచిస్తుందని అందరూ ఆశిస్తున్నారు. ఎందుకంటే భావప్రకటన స్వేచ్ఛ పేరుతో వస్తున్న పోకడలతో జనం విసిగిపోయి ఉన్నారు. ఈ పరిస్థితి ఇలానే కొనసాగితే నమ్మకాన్ని కోల్పోయే స్థితిలోకి మీడియా వెళుతుందన్న ఆందోళన ఎక్కువైంది.
 
ఒక్క మాటలో చెప్పాలంటే ప్రస్తుతం ఛానళ్లలో విషయాన్ని (కంటెంట్‌) నియంత్రిస్తోంది. జర్నలిస్టులు కాదు, యాజమాన్యాలు కాదు... ఎంఎస్‌ఓలు, రేటింగ్స్‌. తమకు నచ్చని విషయాలు టెలికాస్ట్‌ చేస్తే, వెంటనే ఛానల్‌ ప్రసారాన్నే ఆపేస్తారు ఎంఎస్‌ఓలు. ఎక్కువగా రాజకీయ ప్రయోజనాలతోనేే వీరి సంబంధాలు ముడిపడి ఉంటాయి కనుక, ఒక్క నెగిటివ్‌ వార్తను కూడా సహించలేరు! ఇక ఎంత అద్భుతమైన ప్రోగ్రామ్‌ చేసినా రేటింగ్‌ రాకపోతే వెంటనే ఆపేయమంటుంది యాజమాన్యం. ఎందుకంటే ప్రకటనలకు, స్పాన్సర్‌షిప్‌లకు రేటింగ్సే ప్రామాణికం. ఈ పరిస్థితి తప్పనిసరిగా మారాల్సిన అవసరం ఉంది. ప్రముఖ జర్నలిస్టు రాజ్‌దీప్‌ సర్దేశారు మాటల్లో చెప్పాలంటే ''పోటీ తత్వం పేరుతో ఒకరిపై ఒకరు నియంత్రణ కోల్పోతున్న దశలో స్వీయ నియంత్రణ అనే అంశాన్ని నేను నమ్మను. ఓ పదేళ్లక్రితం అడిగితే మీడియాకు ఈలక్ష్మణరేఖలేవీ అవసరం లేదనే చెప్పేవాణ్ణి, కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. బ్రిటన్‌ తరహాలో స్వతంత్రంగా పనిచేసే ఒక రెగ్యులేటరీ వ్యవస్థ మనకు కావాలి. రేటింగ్స్‌, కేబుల్‌ వ్యవస్థలతో సహా న్యూస్‌ఛానళ్ల ప్రసారానికి సంబంధించిన అన్ని అంశాల్నీ దీని పరిధిలోకి తీసుకురావడం అత్యవసరం''.
మొత్తం ఆంధ్రప్రదేశ్‌లో ఛానల్‌ వాటా (29.11.2009-5.12.2009)
ఛానల్‌ 4+ 4+ 4+ 15+ 15+ 15+
అందరూ మహిళలు పురుషులు అందరూ మహిళలు పురుషులు
టీవీ9 5.07 4.37 5.91 5.32 4.57 6.24
ఈటీవీ2 1.95 1.72 2.23 2.06 1.76 2.43
ఎన్‌టీవీ 1.92 1.67 1.21 1.86 1.52 2.27
టీవీ5 2.15 1.95 2.38 2.47 2.25 2.74
జెమినీ నూస్‌ 0.11 0.09 0.14 0.10 0.08 0.12
ఐ న్యూస్‌ 0.73 0.60 0.38 0.80 0.62 1.01
హచ్‌ఎంటీవీ 0.64 0.53 0.78 0.66 0.53 0.81
సాక్షి టీవీ 1.23 0.94 1.57 1.31 1.03 1.65
జీ 24 గంటలు 0.67 0.60 0.76 0.74 0.61 0.89
మహా టీవీ 0.25 0.19 0.32 0.27 0.21 0.33
స్టూడియో ఎన్‌ 0.54 0.42 0.69 0.53 0.42 0.66
ఏబీఎన్‌ 0.49 0.36 0.64 0.47 0.39 0.56
టీవీ1 0.26 0.24 0.29 0.30 0.28 0.33
-కేశవ్‌ (రచయిత మహా టీవీ అవుట్‌పుట్‌ ఎడిటర్‌)
 Source: apmediakaburlu.blogspot.com

ABN- ఆంధ్రజ్యోతి వార్తల్లో రాజకీయ వ్యాఖ్యలు

జనాలకు మీడియా మీద నమ్మకం పోవడానికి ప్రధాన కారణం--వార్తకు, వ్యాఖ్యకు మధ్య ఉన్న రేఖను జర్నలిస్టులు తుడిచిపారెయ్యడమే. ఆ పని చేస్తున్నది జర్నలిస్టులు అనడం కన్నా పత్రికలు/ఛానెల్స్ యాజమాన్యాలు చేయిస్తున్నాయని అనడం మంచిది. అలా చేయకూడదని యాజమాన్యాలకు చెప్పే దమ్మున్న జర్నలిస్టులు కరువయ్యారు. వార్తల ముసుగులో వ్యాఖ్యలు చొప్పించి తమ భావాలకు లేదా అజెండాకు అనుగుణంగా ప్రజాభిప్రాయాన్ని నిర్మించాలనుకోవడం ఒక క్రిమినల్ నేరం.

'సాక్షి' పేపర్ లేదా ఛానల్ లో ఇలా వార్తకు, వ్యాఖ్యకు తేడా లేకుండా రొడ్డ కొట్టుడు కొడితే జనం పెద్దగా పట్టించుకోరు-అది కాంగ్రెస్ ఎంపీ సంస్థ కాబట్టి. 'మీడియా-ఆత్మశోధన' అంటూ సొల్లు కబుర్లు చెప్పే వేమూరి రాధాకృష్ణ, ఆయన ఎంచుకున్న జర్నలిస్టుల బృందం డేరింగ్ జర్నలిజం అనుకుని...వ్యాఖ్యకు, వార్తకు తేడా లేకుండా బీభత్సం సృష్టిస్తున్నది. 'సాక్షి' వాళ్ళ మాదిరిగా తెర మీద నారా చంద్రబాబు బొమ్మ పెట్టుకుని ఈ పనిచేస్తే ఇబ్బంది వుండదు కానీ....శ్రీ రంగ నీతులు చెబుతూ...ఇలాంటి తిక్కల పనులు చేయడం సమజసం కాదు.
శుక్రవారం రాత్రి ఒక రెండు గంటల పాటు ABN- ఆంధ్రజ్యోతి ఛానల్ చూసిన ఎవ్వరికైనా వేమూరి టీం ఎంత రాజకీయ దిగజారుడు జర్నలిజానికి పాల్పడుతున్నదో అర్థమై వుంటుంది. ఒకవేళ...రాజకీయ పరిణామాలపై వ్యాఖ్య ఇవ్వదలిస్తే...'ఓనర్ కామెంట్' అనో 'ఎడిటర్ కామెంట్' అనో లోగో వేసుకుని నోటికొచ్చింది చెప్పుకోవచ్చు...రాజకీయ తీట తీర్చుకోవచ్చు. కానీ వార్తల ముసుగులో జనాలను మోసం చేయడం పధ్ధతి కాదు.  
ముందుగా 'మా నాన్న గాంధీ' అనే పేరు మీద ఒక ప్రోగ్రాం ప్రసారం చేసింది ఈ ఛానల్. తన తండ్రిని జాతిపితతో జగన్ పోల్చడాన్ని తూర్పారపడుతూ చేసిన కార్యక్రమం అది. అంతవరకూ పర్వాలేదు. మరీ పెద్దగా కామెంట్స్ చేయకుండా....పలువురు పార్టీ నేతల అభిప్రాయాలతో దాన్ని వండి వార్చారు. పిత్రోత్సాహంతో...జగన్ అదుపుతప్పి చేసిన పిచ్చి కామెంట్ పై సహేతుకమైన కథనమే అది. అందులో కూడా రిపోర్టర్ ఆత్మ కొన్ని వాక్యాలలో ప్రస్ఫుటం.
దాని తర్వాత వార్తలలో...జగన్ కు కాంగ్రెస్ కు మధ్య పంచాయితీని రెచ్చగొట్టేలా పలు వ్యాఖ్యలు చేశారు. ఒక దశలో జగన్ పార్టీ పెట్టుకునేందుకే ఈ యాత్ర చేస్తున్నారని కూడా తీర్మానించారు...వార్తల్లో. ఇదే మాట చెప్పదలిస్తే...'వార్త వ్యాఖ్య' అనే శీర్షికతో ఒక కార్యక్రమంలో చెప్పుకోవచ్చు గానీ....వార్తలలో విపరీతమైన కామెంట్స్ చేయడమేమిటి? 

పలు రాజకీయ కామెంట్స్ ను న్యూస్ రీడర్ చదువుతూ పోవడం ఎబ్బెట్టుగా వుంది. ఇది సంసారపక్షపు జర్నలిజం కాదు...దీన్ని 'అజెండా జర్నలిజం' అంటారు. జగన్ యాత్ర ముగిసే లోపు ఈ దుర్లక్షణం ముదురు పాకాన పడే అవకాశం వుంది. అయ్యా...వేమూరి గారూ...మీరు వ్యాఖ్యలు చేయదలుచుకుంటే....వార్తలతో కలిపి దంచిపారెయ్యకండి. ఆ Mahaa-news వెంకట్రావు గారి లాగా పెద్ద మనిషి తరహాలో కొంత సమయం మీ అమూల్యమైన వ్యాఖ్యలకు కేటాయించండి. అంతే గానీ....జనం గొర్రెలని భావించి...జర్నలిజాన్ని మరింత బ్రష్టు పట్టించకండి. ప్లీస్...మీడియా ఆత్మశోధన సంగతి తర్వాత....ముందు మీరు అర్జెంటుగా ఆత్మశోధన 

Source: apmediakaburlu.blogspot.com

2008 టీవీ నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌: 2008 సంత్సరానికిగాను ప్రభుత్వం టీవీ నంది అవార్డులను ప్రకటించింది. 62మంది ఆర్టిస్టులను ఈ అవార్డులకు నంది అవార్డుల కమిటీ ప్రకటించింది. సమాచార శాఖ కమిషనర్‌ పార్థసారథి ఆ వివరాలు విలేకరులకు తెలిపారు.
ఉత్తమ సీరియల్‌ - తరిగొండ వెంగమాంబ
ఉత్తమ డైలీ సీరియల్‌ - చిన్నారి
ఉత్తమ డాక్యుమెంట రీ - శ్రీశ్రీ
ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత - చంద్రశేఖర్‌ ఆజాద్‌
ఉత్తమ ఫీచర్‌ -తెలుగు -వెలుగు
ఉత్తమ నటుడు - కల్యాణ్‌ (లయ)
ఉత్తమ పాటల రచయిత -అనంత శ్రీరామ్‌
ఉత్తమ ఆర్ట్‌ డైరెక్టర్‌ - భాస్కర్‌ రాజు
ఉత్తమ దర్శకుడు -టి.ఉదయభాస్కర్‌
ఉత్తమ సహాయ నటి - లహరి
ఉత్తమ హాస్యనటి - మధుమణి
ఉత్తమ విలన్‌ - రంగనాథ్‌
ఉత్తమ బాలనటి - గాయత్రి
ఉత్తమ బాల నటుడు - అభిషేక్‌ రామా
ఉత్తమ సంగీత దర్శకుడు - సుధీర్‌ కుమార్‌
ఉత్తమ వ్యాఖ్యత -దీప్తి వాజ్‌పాయ్

Source: www.andhraprabhaonline.com

అక్కినేని అమల కూడా టీవీలో

రిటైర్డ్ హీరోయిన్స్ అంతా టీవీ ఛానెల్స్ లో రియాల్టి షోలు లలో పాల్గొంటున్న సంగతి తెలిసిందే. అదే కోవలో నాగార్జున భార్య అక్కినేని అమల కూడా విజయ్ టీవీలో త్వరలో టెలీకాస్ట్ అయ్యే పోగ్రామ్ లో చేయనుంది. ది క్లినిక్ ప్లస్ సూపర్ మామ్ షో ఆ పోగ్రామ్ పేరు. అది మే 10 నుంచి టెలీకాస్ట్ అవుతుంది. ఇరవై రెండు మంది టీవీ, ఫిల్మ్ కు సంభందించిన తల్లి, పిల్లలు ఈ షోలో పాల్గొంటున్నారు. సూపర్ మామ్ టైటిల్ కోసం ఆడిషన్స్ జరుగుతాయి. ఇది మే పదమూడవ తేదీ వరకూ జరుగుతుంది. తల్లిగా, ఓ ఆర్టిస్టుగా అమల ఈ పోగ్రామ్ లో పాల్గొంటోంది. ఆమె ఈ పోగ్రామ్ జరిగే సమయంలో పేరెంట్ హుడ్ కు సంభందించిన కొన్ని విలువైన విషయాలు చర్చిస్తారు.

Source: thatstelugu.oneindia.in

Friday, July 9, 2010

INSAT 4-B spacecraft hit by power problem

The INSAT-4B communication satellite has been hit by a “power supply anomaly” in one of its two solar panels which has led to switching off 50 per cent of the transponder capacity. Due to a power supply anomaly in one of its two solar panels, there has been a partial non-availability of services on India’s INSAT-4B communication satellite, ISRO said in a release here today. On the night of July 7, the satellite experienced a power supply glitch which led to switching off 50 per cent of the transponder capacity (6 Ku and 6 C-Band transponders), the release said.


An expert team is studying the possibilities of partial utilisation of some of the transponders that were switched ‘off ’and restoring services at the earliest, it said.


The INSAT-4B carries a total of 24 communication transponders (12 Ku-Band and 12 C-Band) and has been in operation since March 2007. 

Source: www.thehindu.com

మొరాయించిన ఇన్సాట్‌ 4బి ట్రాన్స్‌పాండర్‌

దేశంలో ప్రధాన టెలివిజన్‌ ఛానళ్లు కొన్ని మూగబోయాయి. అకస్మాత్తుగా ప్రసారాలు ఆగిపోయాయి. న్యూస్ ఛానల్ సాక్షి సహా.. కొన్ని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు కూడా నిలిచిపోయిన జాబితాలో వున్నాయి. ఇన్‌శాట్ ఫోర్‌బీ శాటిలైట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యే దీనికి కారణంగా తెలుస్తోంది. రేపటిలోగా ప్రసారాలు పునరుద్ధరించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌మోస్ట్‌ లిస్టులో వున్న శాటిలైట్‌లో ఇన్‌శాట్ 4B ఒకటి. 93.5 డిగ్రీస్ ఈస్ట్‌ ఫ్రీక్వెన్సీలో ఇది నడుస్తోంది.

ఈ శాటిలైట్ పరిధిలో మొత్తం 13 ట్రాన్స్‌పాండర్లు పనిచేస్తున్నాయి. ఇండియన్‌ టెలివిజన్ రంగంలోని ప్రధాన ఛానళ్లన్నీ ఈ ట్రాన్స్‌పాండర్ల ద్వారానే ప్రసారాలు అందిస్తున్నాయి. నిన్న అర్థరాత్రి ఏర్పడిన సాంకేతిక లోపం.. శాటిలైట్ సర్వీస్‌ను ఉన్నపళంగా నిలిచిపోయేలా చేసింది. దూరదర్శన్‌తో పాటు.. దక్షిణాదిలో అత్యధిక ఛానళ్లనిచ్చే సన్‌నెట్‌వర్క్ కూడా ఈ శాటిలైట్ పరిధిలోనే ట్రాన్స్‌పాండర్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు శాటిలైట్ మొరాయించడంతో.. దాదాపు 60 టెలివిజన్ ఛానళ్లు ఒక్కసారిగా మూగబోయాయి.

ప్రసారాలు నిలిచిపోయిన తెలుగు న్యూస్ ఛానళ్లలో సాక్షి కూడా వుంది. సన్ డీటీహెచ్‌ సర్వీసు కూడా ఆగిపోయింది. ఇస్రో పర్యవేక్షణలో వీ.ఎస్.ఎన్.ఎల్ నిర్వహించే శాటిలైట్ సర్వీసుల్లో.. ఇలాంటి లోపం ఎప్పుడూ తలెత్తిన దాఖలాలు లేవు. అయితే.. సమస్య చిన్నదేనని.. ప్రసారాల పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టెక్నికల్ వర్గాలు చెబుతున్నాయి. వీ.ఎస్‌.ఎన్‌.ఎల్ మాత్రం.. చడీచప్పుడు లేకుండా వుంది. రేపటిలోగా శాటిలైట్ రిస్టోర్ అవుతుందని, మూగబోయిన ఛానళ్లు ఏ క్షణాన్నయినా మళ్లీ పునప్రసారమయ్యే ఛాన్సుందని తెలుస్తోంది.


Source: www.tv5news.in

రెండుగా చీలిన తెలుగు మీడియా



Source: telugu.greatandhra.com

దొరస్వామిరాజు..'మహాభారతం'

''తింటే గారెలే తినాలి. వింటే మహాభారతమే వినాలి'' అంటారు. పంచమవేదంగా ప్రసిద్ధిపొందిన మహాభారతాన్ని ఎన్నిసార్లు విన్నా, ఎన్నిసార్లు తెరపై చూసినా తనివితీరదని చెబుతుంటారు. లోగడ హిందీలో వచ్చిన 'మహాభారత్‌' సీరియల్‌ ఎంతటి సంచలనం సృష్టించిందో తెలియంది కాదు. ఇప్పుడు వి.యం.సి. దొరస్వామిరాజు తెలుగులో 'మహాభారతం' సీరియల్‌ నిర్మాణానికి పూనుకున్నారు. వివిధ సాంఘిక చిత్రాలతో పాటు 'అన్నమయ్య', 'వెంగమాంబ' వంటి చిత్రాల నిర్మాతగా దొరస్వామిరాజుకు మంచిపేరుంది. కాగా బుల్లితెర ద్వారా ఆయన సంధించబోతున్న ఈ సీరియల్‌కు ఉదయభాస్కర్‌ దర్శకుడు. ఈ తరహా సీరియల్స్‌కు దర్శకుడిగా ఆయన పెట్టిందిపేరు. శ్రీకృష్ణుడిగా సాయికిరణ్‌, అర్జునుడిగా అశోక్‌కుమార్‌, ద్రౌపదిగా సన ప్రధాన పాత్రలు పోషిస్తున్న ఈ సీరియల్‌ షూటింగ్‌ హైదరాబాద్‌లోని సారథీ స్టూడియోస్‌లో ప్రారంభమైంది. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రెస్‌మీట్‌లో నిర్మాత దొరస్వామిరాజు మాట్లాడుతూ, 'గతంలో హిందీలో బి.ఆర్‌.చోప్రా తీసిన 'మహాభారత్‌' సీరియల్‌ను భాష తెలియకపోయినా అందరూ ఎంతోబాగా చూశారు. ఒక యజ్ఞంగా భావించి ఈ సీరియల్‌ను తీస్తున్నాం. ఖర్చుకు ఎక్కడా వెనుకాడకుండా, లాభనష్టాల గురించి ఆలోచించకుండా నిర్మాణం జరుపుతున్నాం. ఏ టీవీ ఛానల్‌లో దీనిని ప్రసారం చేయాలన్నది అనుకోలేదు' అని అన్నారు.

దర్శకుడు ఉదయభాస్కర్‌ మాట్లాడుతూ, 'భారతీయుల రక్తంలో కలసిపోయిన కథ మహాభారతం అందుకే ఈ సీరియల్‌కు శ్రీకారం చుట్టాం. ఇందులో పద్యాలు కూడా ఉంటాయి ' అని అన్నారు.

సాయికిరణ్‌ మాట్లాడుతూ, 'నిజజీవితంలో మహాభారతం నాకు మార్గ దర్శకం. నేను సమస్యల్లో ఉన్నప్పుడు నాకు మహాభారతమే దిక్సూచి అయ్యింది. కృష్ణుడి పాత్రను పోషించడం అదృష్టంగా భావిస్తున్నాను' అని చెప్పారు. అశోక్‌కుమార్‌, సన తదితరులు ఈ సీరియల్‌లో నటించడం ఆనందదాయకమని అన్నారు. ఈ సీరియల్‌కు సంగీతం: అర్జున్‌, నిర్మాణ నిర్వహణ: విజయ్‌కుమార్‌వర్మ, దర్శకత్వం: ఉదయభాస్కర్‌, పి.వాగ్ధేవి.

Source: www.andhraprabhaonline.com

రాణాతో "ప్రేమతో మీ మంచు లక్ష్మి" అంటున్న మోహన్ బాబు కుమార్తె

మంచు లక్ష్మీ ప్రసన్న మళ్ళీ ప్రారంభిస్తున్న ప్రేమతో మీ లక్ష్మి పోగ్రాం త్వరలో ఈటీవిలో రానుంది. ఈ సారి లీడర్ హీరో రాణాతో ఇంటర్వూ చేసింది. ఇంటర్వూ అయ్యాక..లక్ష్మీ ప్రసన్న గురించి రాణా మాట్లాడుతూ...నేను పూర్తి స్ధాయిలో మంచు లక్ష్మి..ప్రేమతో మీ లక్ష్మి పోగ్రాంకి ఫ్యాన్ ని అయిపోయాను. ఆ ప్రశ్నలు, సర్పైజ్ లు, హాట్స్ అప్..ఇంత గొప్ప పోగ్రామ్ చేస్తున్నందుకు. అలాగే ఆమెకు సహకారమందిస్తున్న టీమ్ కు నా వేల కొలది ధన్యవాదాలు అంటూ పొగడ్తల్లో ముంచేసారు. ఇక రాణా ఇంతలా మెచ్చుకునేలా లక్ష్మి ప్రసన్న ఏం మాట్లాడిందో..ఆయన ఏం చెప్పారో తెలియాలంటే ఆ పోగ్రాం చాడాల్సిందే.

Source: thatstelugu.oneindia.in

టివి న్యూస్‌రీడర్లకూ నంది బహుమతులు

హైదరాబాద్‌, ఆంధ్రప్రభ ప్రతినిధి : తెలుగు వార్తా ఛానెళ్ళలో అందంగా, ఆకర్షణీయంగా వీక్షకులను ఆకట్టుకునే విధంగా వార్తలు చదివే న్యూస్‌రీడర్లను ప్రోత్సహించడం కోసం ఇకనుంచి ఉత్తమ టివీ న్యూస్‌రీడర్లకు నంది బహుమతులు అందజేయనున్నట్టు రాష్ట్ర చలనచిత్ర, టివీ, నాటకరంగ అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ సి. పార్థసారథి తెలిపారు.
2009 నుంచి వివిధ ఉపగ్రహ తెలుగు టివీ ఛానెళ్ళలో వార్తలను ఉత్తమంగా అందించిన న్యూస్‌రీడర్లకు కాంస్య నంది బహుమతులను అందజేస్తారు. వివిధ ఉపగ్రహ ఛానెళ్ళలో ప్రసారమవుతున్న సీరియళ్ళు, టెలిఫిల్మ్‌లలో ఉత్తమమైన వాటిని ఎంపిక చేసే ప్రత్యేక కమిటియే ఈ న్యూస్‌రీడర్లను కూడా ఎంపిక చేస్తారు. 2009 సంవత్సరానికి సంబంధించి ఇప్పటికే ఉత్తమ టివీ సీరియళ్ళను, టెలిఫిల్మ్‌లను ఆహ్యానిస్తూ ఒక ప్రకటన జారీచేశారు.

Source: www.andhraprabhaonline.com

Thursday, July 8, 2010

బుల్లితెరపైన!

సంగీత చూపు ఇప్పుడు బుల్లితెరపై పడిందని అంటున్నారు. లోగడ కొంతకాలం పాటు ఆమె కెరీర్‌ వేగవంతంగానే సాగింది. “ఖడ్గం’, “పెళ్ళాం ఊరెళ్లితే‘ వంటి చిత్రాలు సంగీతకు ఎంతో పేరు తెచ్చిపెట్టాయి. ఆ తర్వాత కూడా ఆమె ఎన్నో సినిమాలు చేసింది. ప్రస్తుతానికి ఆమె నటించిన “శ్రీమతి కల్యాణం’ విడుదలలో జాప్యం చోటుచేసుకుంది. అయితే కొత్త హీరోయిన్లు తాకిడి ఎక్కువ కావడం, వ్యక్తిగతంగా తన సక్సెస్‌ రేట్‌ పడిపోవడంతో సంగీతకు అవకాశాలు సన్నగిల్లాయి. ఈ నేపథ్యంలో తమిళ గాయకుడైన క్రిష్‌ను ఆమె పెళ్లి చేసుకుంది. పెళ్లి తర్వాత కూడా ఆమె నటనను కొనసాగిస్తూనే ఉంది. అయితే ఇటీవల కాలంలో అవకాశాలే అంతంతమాత్రంగా ఉన్నాయి. దాంతో ఆమె చూపు బుల్లితెరపై పడిందని అంటున్నారు. ఇందులో భాగంగా తమిళ సీరియల్స్‌లో నటించేందుకు ఆమె పావులు కదుపుతోందని చెబుతున్నారు. కొన్ని టీవీ ఛానల్స్‌ తమిళ సీరియల్స్‌ను తెలుగులోకి డబ్‌ చేస్తున్న విషయం తెలిసిందే. ఆ రకంగా తెలుగు టీవీ ప్రేక్షకులకు కూడా దగ్గర కావచ్చన్న ఆమె ఆలోచనట.

Source: www.andhraprabhaonline.com

ఓంకార్ కాన్సెప్ట్ తలనొప్పి తెస్తుందా....?

టీవీ యాంకర్ గా, నిర్మాతగా ఓంకార్ బుల్లితెర ప్రేక్షకులకు బాగా దగ్గరయ్యాడు.తన ప్రోగ్రాం 'ఆట, చాలెంజ్' డాన్స్ షోలకు బోల్డు మంది అభిమానులున్నారు. కాని 'చాలెంజ్' షో మాత్రం చాలా మందికి తలనిప్పి తెప్పిస్తోందని తెలుస్తోంది. ఆ ప్రోగ్రాం మొదలయినప్పటి నుంచి డాన్స్ కన్నాపార్టిసిపెంట్స్, జడ్జిలు మధ్య గొడవలతో ప్రేక్షకులకు తలనొప్పి కలిగిస్తోందట. ఓంకార్ ఆ ప్రోగ్రాం మాత్రం తలనొప్పిగా తయరిందని, ఈ డాగ్ ఫైట్ లు మానుకోవాలని చాలా మంది ప్రేక్షకులు అంటున్నారు. డాగ్ ఫైట్ లు అంటే పార్టిసిపెంట్స్, జడ్జి ల మధ్య గొడవ కుక్కలా అరుపులా ఉన్నాయని పలువురు చెప్పుకోవడంగమనార్హం.

Source: telugu.subhodaya.com

పరస్పర సహకారంతో...టీవీ 9 , పవన్ కళ్యాణ్

తెలుగు, కన్నడలో లీడింగ్ ఛానెల్ గా ఉన్న టీవీ నైన్ [^] ఛానెల్ వారు పవన్ కళ్యాణ్ తాజా చిత్రం కొమురం పులి ఆడియో పంక్షన్ టెలీకాస్ట్ రైట్స్ తీసుకున్నారు. వాళ్ళు తప్ప మిగతా ఛానెల్ వాళ్ళు టెలీకాస్ట్ చేయటానికి వీలుండదు. ఆడియో పంక్షన్ జరిగిన రోజు సాయింత్రం ప్రత్యేకంగా కట్ చేసి న్యూస్ ఛానెల్స్ కి భైట్స్ గా ఇస్తారు. గతంలో జల్సా చిత్రం ఆడియో పంక్షన్ ఆడియో రైట్స్ ని కూడా అలాగే ఓ ప్రముఖ ఛానెల్ కు అమ్మేసారు. అప్పుడు అభిమానులు మొత్త ఆ గంటో రెండు గంటలో ఆ ఆడియో పంక్షన్ చూడటం కోసం ఆ ఛానెల్ కు స్టే ట్యూన్ అవుతారు. ఈ రైట్స్ నిమిత్తం నిర్మాతలు ఛానెల్ నుండి భారీగానే వసూలు చేస్తారు. ఇక ఈ నెల 11వ తేదిన హైదరాబాద్ [^] నొవోటెల్ లో సినీ ప్రముఖుల సమక్షంలో ఈ చిత్రం ఆడియో వేడుక జరగనుంది. ఆస్కార్ విజేత ఎ.ఆర్.రహమాన్ ఈ చిత్రానికి ఆడియో రిలీజ్ చేయటంతో అంతటా మంచి క్రేజ్ నెలకొని ఉంది. అందుకు తగ్గట్లుగానే గీతా ఆర్ట్స్ వారు రోజుకో ఆడియో ప్రోమోను యు ట్యూబ్ లో ఉంచి మరింత క్రేజ్ ని క్రియోట్ చేస్తున్నారు. ఈ సందర్భంలో తమ చిత్రానికి క్రేజ్ తెచ్చిపెడుతున్న టీవీ నైన్ కి ధాంక్స్ చెప్పుకోవాలి అని కొందరంటున్నారు. అదేమీ లేదు పవన్ కళ్యాణ్ క్రేజ్ తో టీవీ నైన్ టీఆర్ పి లు పెంచుకోవాలి చూస్తోందని మరికొందరంటున్నారు. ఏదైమైనా పరస్పర లబ్ది పొందుతున్నట్లే.

Source: thatstelugu.oneindia.in

ఆగిన 'సాక్షి'.... సహకరిస్తున్న 'వనిత'


Cong Govt Birthday Gift To YSR- Blocking ‘Sakshi TV’

This is the understanding that has been in wide spread across the Telugu population. Today is YSR’s birthday and it is obvious that the fans of departed leader wish to sit in front of TV sets to watch their favorite programs on Sakshi TV that happens to be lead by YS Jagan Mohana Reddy. But alarmingly, the channel is not functioning from midnight 1 AM. It’s stated to be the technical problem, but that wasn’t fixed till now.

But the opinions are spread that Central Government toed down the channel to avoid the unwanted publicity for YSR that will bring in mileage for YS Jagan who is showing his revolution on High Command. It is true that the controls of any channel whether to air it or not will be in the hands of Center.

As it may bring a doubt for many if only Sakshi TV was blocked, the Center has also blocked I News and HMTV, opine many. And the buck is passed in the disguise of ‘technical problem’, they say.

Right now, with the mutual consent between Sakshi TV and Vanitha TV, the programs of Sakshi are being aired on Vanita.

So, blocking Sakshi TV is the gift given by High Command on YSR’s birthday. If this is tru, we can call it the worst conspiracy of the year.

Source: www.greatandhra.com

మూగబోయిన మూడు ఛానెల్స్: 'వనిత'లో వస్తున్న 'సాక్షి'

నిన్న రాత్రి నుంచి మూడు ప్రధాన ఛానెల్స్--సాక్షి, i-news, HM-టీవీ-- ప్రసారాలు నిలిచిపోయాయి. ఈ ఛానెల్స్ ట్యూన్ చేస్తే...నల్లని తెర మాత్రమే కనిపిస్తున్నది. ఉపగ్రహ సాంకేతిక సమస్య వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని ఒక సీనియర్ జర్నలిస్టు తెలిపారు.
 
TV-9, TV-5 ఛానెల్స్ లో కూడా స్పష్టత లోపించింది. ఏవో రంగుల చారలు అడ్డదిడ్డంగా వస్తున్నాయి. ఇలా కొన్ని ప్రాంతాలో వస్తున్నదా? అన్నిచోట్లా ఇదే పరిస్థితా? అన్నది తెలియరావడం లేదు. TV-9 లో గత కొన్ని రోజులుగా క్లారిటీ లోపిస్తే...పిచ్చి రేసులో పడి ఎవరైనా కావాలనే ప్రసారాలు అంతరాయం కలిగిస్తున్నదేమో అని నాకు అనుమానం వచ్చింది.

అయితే...అధిష్టానం హెచ్చరికలు తోసిరాజని వై.ఎస్.జగన్ యాత్ర ఆరంభించిన రోజే ఛానల్ ప్రసారాలు లేకపోవడంతో 'సాక్షి' యాజమాన్యం కలత చెంది వేగంగా స్పందించింది. కావాలనే కేంద్ర ప్రభుత్వం కుట్ర చేసి ప్రసారాలు నిలిపివేసిందని, ఇది దారుణమని 'సాక్షి' ఉద్యోగులు గట్టిగా నమ్ముతున్నారు. వారి అనుమానం నిజమో కాదో మనకు తెలియదు. 

అంత పెద్ద ప్రోగ్రాం నిర్వహిస్తున్న సమయంలో ఛానల్ లేకపోవడం భరించలేని జగన్ బృందం...సహచర కాంగ్రెస్ వాది, N-TV ఓనర్ నరేంద్ర చౌదరిని సంప్రదించింది. ఆయన పెరటి ఛానల్ గా నడుపుతున్న 'వనిత' ఛానల్ లో 'సాక్షి' ప్రసారాలు కొనసాగిస్తున్నారు. మామూలుగా ఛానెల్ వుంటే...అపుడుప్పుడు జగన్ ప్రోగ్రాం చూపే 'సాక్షి' వారు ఇప్పుడు 'వనిత'లో రెచ్చిపోయి లైవ్ ఇస్తున్నారు. 'వనిత' లోగో కింద 'courtesy to Saakshi channel' అని వేస్తున్నారు. ఈ రోజు మధ్యాహ్నం లోపు ఈ సాంకేతిక సమస్య పరిష్కారం కావచ్చని భావిస్తున్నారు.

Source: apmediakaburlu.blogspot.com

Congress High Command Foul games with Sakshi TV?

Is Congress High Command (eg. Sonia Gandhi) prepared to go any distance to crush Jagan? Looks like they do. It appears that the central government has sabotaged Sakshi TV's ability to broadcast by cutting off their satellite signal, the signal is unavailable throughout AP and on the internet for the rest of the world. This is about as low as the central government can go. We need to be aware and investigate this episode to the fullest and demand that justice be brought to Sakshi. With this event, may be all those conspiracy theories about YSRs death were not just theories perhaps. What do you say?
Gurava Reddy, Atlanta


Source: www.greatandhra.com

Regional wars on reality TV

Nuvvu ekkada nunchi vachavu? (where do you come from?)” actress Hema Malini asked Indian Idol aspirant Sreeram Chandra in the last episode. Fans watching in his hometown, Hyderabad were delighted to hear B-town’s dream-girl talk to the young singer from their city in Telugu. Sreeram however quickly switched to Hindi — he knew the consequences of strong linguistic and regional associations in the contest.

Indian Idol, a very popular TV show is being accused of stoking regionalism to up TRP’s. It’s a difficult one to deny when presenters introduce contestants by prefixing their geographical origins to their names, “Dakshin ka anna” or “Rajasthan ka shaan” while contestants themselves try and drum up votes for themselves by asking fans to help uphold the “image of their race”.

The inherent ‘democracy’ in the voting system of the contest also holds its greatest flaw: because votes alone decide the fate of the performers, participants are beginning to claim that if you’re from a region where Hindi programmes are not popular, you will lose.

“Not many in the South watch Hindi channels and there is no SMS vote culture for TV shows here,” says M.S.N. Prasad, father of Indian Idol participant Sreeram Chandra. Prasad himself tries to increase the ‘Telugu’ votes for his son in TV interviews. He explains, “My relatives in Ongole don’t even watch the show. The penetration of this channel and the language is low in South and so it is tough to get votes for my son compared to those from Mumbai or other regions.”

“Since this is a national level contest with participants from across the country, regional feelings are bound to be there. Earlier, singers from South have lost because of lesser SMSes from other parts of the country. As a music composer I don’t like this system of judging through votes. But it is a TRP gimmick to evoke regional feeling,” says Koti, popular music director who has judged several TV music shows.

Hemachandra, ex participant of SaReGaMaPa and now a music director and playback singer in Tollywood attributes his defeat in the last round to ‘regional’ voting. But he realistically maintains that evoking regional emotion brings in popularity and TRPs, “Audiences connect with the show and take it seriously only if there is a regional affiliation. It is more a game of region than of the talent. I lost in the final rounds as not many South Indians watch the show and I got fewer SMSes.”

Now in its fifth season, Indian Idol this year seems to have artificially balanced regional representation to maximize TRPs across the country: one representative each from South India, Gujarat, Bengal, Mumbai and Delhi.

There have even been instances where state governments have made icons of participants, dubbing them ‘brand ambassadors’ for the state while the contest is on. Local film and theatre personalities, politicians and other industrialists have been known to raise campaigns and hoardings supporting the contestant from their region.

Singer and former Indian Idol finalist Karunya however cautions against generalisation saying that if the show was blatantly regionalist, he wouldn’t have even reached finals in the contest. “I am against voting on the basis of regionalism. I had Punjabi, Bengali and supporters from all over the country. I never took the ‘Telugu’ or South slogan but asked people to vote for me only on the basis of my singing,” he says.

Source: www.deccanchronicle.com

Tags: actress Hema Malini, Dakshin ka anna” or “Rajasthan ka shaan, Indian Idol aspirant Sreeram Chandra, Nuvvu ekkada nunchi vachavu