Monday, January 14, 2019

బుల్లితెర ప్రేక్షకులకు శుభవార్త!


న్యూదిల్లీ: బుల్లితెర ప్రేక్షకులకు టెలికాం రెగ్యులేటరీ అథారిటీ ఆఫ్‌ ఇండియా(ట్రాయ్‌) శుభవార్త తెలిపింది. వీక్షకులు 100 పే లేదా ఫీ ఛానళ్లను రూ.153.40కే పొందవచ్చని ఉత్తర్వులు జారీ చేసింది. జీఎస్‌టీతో కలిపి ఈ మొత్తాన్ని చెల్లించాలని సూచించింది. కేబుల్‌/డీటీహెచ్‌లలో 100 ఛానళ్లను వీక్షించవచ్చన్న ట్రాయ్‌.. జనవరి 31లోపు వీక్షకులు 100 ఛానళ్లను ఎంపిక చేసుకోవాలని తెలిపింది. ఫిబ్రవరి 1 నుంచి కొత్త విధానం అమల్లోకి వస్తుందని, ఈ ప్యాక్‌లో హెచ్‌డీ ఛానళ్లు లభించవని స్పష్టం చేసింది. అయితే, రెండు సాధారణ ఛానళ్లకు బదులు ఒక హెచ్‌డీ ఛానల్‌ను ఎంపిక‌ చేసుకోవచ్చని కొన్ని సంస్థలు ప్రకటిస్తున్నాయి. తమ సర్వీసు ప్రొవైడర్ల నుంచి వినియోగదారులు మరిన్ని తెలుసుకోవాలని ట్రాయ్‌ సూచించింది. కాగా, ఒక ఛానల్‌ గరిష్ఠ ధరను రూ.19గా నిర్ణయించింది. ప్రతి ఛానల్‌ రేటును ట్రాయ్‌ తన అధికారిక వెబ్‌సైట్‌ channeltariff.trai.gov.inలో ఉంచింది.
తెలుగు పే ఛానళ్ల జాబితా ఇది



Source: https://www.eenadu.net