సాక్షి టెలివిజన్ ఛీఫ్ ఎక్జిక్యూటివ్ ఆఫీసర్ గా వి.మురళిని తాత్కాలికంగా నియమితులయ్యారు. కొద్ది రోజుల క్రితం ఇంతకుముదు ఉన్న సి.ఇ.ఓ. రామ్ రెడ్డికి సాక్షి యాజమాన్యం ఉద్వాసన చెప్పిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సిఇఓగా అదనపు బాధ్యతలు నిర్వహించవలసిందిగా మురళిని యాజమాన్యం కోరింది. ప్రస్తుతం సాక్షి దినపత్రిక సంపాదకుడిగా ఉన్న మురళి ఇకపై టీవీకి అదనపు బాధ్యతలు చేపడతారని సాక్షి వర్గాలు చెప్పాయి. కొత్తగా సిఇఓ కోసం యాజమాన్యం అన్వేషిస్తోందని, ఈలోగా పర్యవేక్షణ నిమిత్తం మురళికి బాధ్యత ఇచ్చారని అంటున్నారు. మురళి ఈనాడు దినపత్రికలో తన కేరీర్ ను ఆరంభించారు. ఆ తర్వాత ఉదయం, వార్త, ఆంధ్రజ్యోతి వంటి ప్రముఖ దినపత్రికలలో వివిధ హోదాలలో పనిచేశారు. సాక్షి పత్రికలో చేరడానికి ముందు ఆయన ఆంధ్రజ్యోతి అసిస్టెంట్ ఎడిటర్ గా విధులు నిర్వహించారు. ఆ తర్వాత సాక్షి దినపత్రిక ఎడిటర్ గా వెళ్లారు. పేజీ మేకప్ లో, శీర్షికలు పెట్టడంలో ఆయనకు మంచి పేరుంది. ఈయన నల్లొండ జిల్లాకు చెందిన మురళి తండ్రి బుచ్చిరాములు వామపక్ష నాయకుడిగా గుర్తింపు పొందారు.
Source: kommineni.info
No comments:
Post a Comment