ఆంధ్రలేఖ ప్రత్యేక ప్రతినిధి: రాష్ట్రంలో పాగా వేయడానికి చిరకాలంగా పని చేస్తున్నా ఫలితాలు చూపలేని బిజెపి మీడియా సపోర్ట్ సక్రమంగా లేకపోవడమే దీనికి కారణమని నమ్ముతోంది. ఇప్పటికే ఆంధ్ర ప్రదేశ్ లో ప్రతి దిన పత్రిక, టీవీ చానెల్ ఏదో ఒక పార్టికి ఉపగ్రహంలా పని చేయడం కాదనలేని నిజం. యువనేత జగన్ మోహన్ రెడ్డి ఏకంగా ఒక దిన పత్రిక, ఒక చానెల్ నడుపుతుండగా, చంద్ర బాబు నాయడు తన కుమారునితో స్టూడియో -ఎన్ చానెల్ నడిపిస్తున్నారు. ఇతర పత్రికలూ, చానెళ్ళు ఈ రెండు పార్టీల చుట్టే తిరుగుతున్నాయి. మీడియాపై కాంగ్రెస్, టి.డి.పి.ల పెత్తనం కారణంగా ఇతర పార్టీల కార్యక్రమాలకు సరైన ప్రచారం లభించడం లేదు. టి.ఆర్.ఎస్. వారికి రాజ్ న్యూస్ ఎలాగూ ఉంది. వామపక్షాలకు సొంత దిన పత్రికలూ ఉన్నాయి. కాని బి.జె.పి. అది కూడా లేక పోవడంతో వారి కార్యక్రమాలకు తగినంత ప్రచారం రావడం లేదు. ఈ పరిస్థితుల్లో సొంత మీడియాను ఏర్పాటు చేసుకోవడం అవసరమని బిజెపి భావిస్తోంది. ఇందులో భాగంగానే ఒక టీవీ చానెల్ తేవడానికి ఆ పార్టీ నేతలు ప్రయత్నిస్తున్నారు. అయితే బిజెపి నేరుగా పత్రిక చానెల్ పెట్టాడు. కొందరు సానుభూతి పరులైన పారిశ్రామికవేత్తలతో చానెల్ పెట్టించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వెంకయ్య నాయుడు, కిషన్ రెడ్డి ఇదే ప్రయత్నంలో ఉన్నారని తెలుస్తోంది.
Source: andhralekhadaily.blogspot.com
No comments:
Post a Comment