హైదరాబాద్: తెలుగు ప్రేక్షకులకు వినోదాల విందు అందిస్తున్న ఈటీవీ.. విస్పష్టమైన వినోదాల ప్రసారాలకు మరో అడుగు ముందుకు వేసింది. ఈటీవీ హెచ్‌డీ ఛానల్ ప్రసారాలను రామోజీ గ్రూపు సంస్థల ఛైర్మన్ రామోజీరావు శుక్రవారం ప్రారంభించారు. తెలుగులో మొదటిసారి బీటాకామ్ ఎక్విప్‌మెంట్, ప్రైవేటు రంగంలో తొలిసారిగా ఎర్త్‌స్టేషన్ కలిగి సంచలనం సృష్టించిన ఈటీవీ... ఇప్పుడు హెచ్‌డీలో ప్రసారాలు ప్రారంభించి మరో మైలురాయిని అధిగమించింది. స్పష్టమైన చిత్రం, శబ్దం, అద్భుతమైన రంగులతో ఈటీవీ హెచ్‌డీ ఛానల్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతి అందించనుంది.. ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఈటీవీ సీఈవో బాపినీడు, చీఫ్ ప్రొడ్యూసర్ అజయ్‌శాంతి, నెట్‌వర్క్ చీఫ్ ప్రొడ్యూసర్ పీకే మాన్వి, చీఫ్ ఇంజనీర్ ఎస్‌ఎల్‌కే ప్రసాదరావు, ఆర్‌ఎఫ్‌సీ సీఈవో రాజీవ్ జాల్న పుర్కర్, సిబ్బంది పాల్గొన్నారు.
Source: http://www.eenadu.net/
No comments:
Post a Comment