Friday, July 9, 2010

మొరాయించిన ఇన్సాట్‌ 4బి ట్రాన్స్‌పాండర్‌

దేశంలో ప్రధాన టెలివిజన్‌ ఛానళ్లు కొన్ని మూగబోయాయి. అకస్మాత్తుగా ప్రసారాలు ఆగిపోయాయి. న్యూస్ ఛానల్ సాక్షి సహా.. కొన్ని తెలుగు ఎంటర్‌టైన్‌మెంట్ ఛానళ్లు కూడా నిలిచిపోయిన జాబితాలో వున్నాయి. ఇన్‌శాట్ ఫోర్‌బీ శాటిలైట్‌లో ఏర్పడిన సాంకేతిక సమస్యే దీనికి కారణంగా తెలుస్తోంది. రేపటిలోగా ప్రసారాలు పునరుద్ధరించే అవకాశముంది. ప్రపంచవ్యాప్తంగా టాప్‌మోస్ట్‌ లిస్టులో వున్న శాటిలైట్‌లో ఇన్‌శాట్ 4B ఒకటి. 93.5 డిగ్రీస్ ఈస్ట్‌ ఫ్రీక్వెన్సీలో ఇది నడుస్తోంది.

ఈ శాటిలైట్ పరిధిలో మొత్తం 13 ట్రాన్స్‌పాండర్లు పనిచేస్తున్నాయి. ఇండియన్‌ టెలివిజన్ రంగంలోని ప్రధాన ఛానళ్లన్నీ ఈ ట్రాన్స్‌పాండర్ల ద్వారానే ప్రసారాలు అందిస్తున్నాయి. నిన్న అర్థరాత్రి ఏర్పడిన సాంకేతిక లోపం.. శాటిలైట్ సర్వీస్‌ను ఉన్నపళంగా నిలిచిపోయేలా చేసింది. దూరదర్శన్‌తో పాటు.. దక్షిణాదిలో అత్యధిక ఛానళ్లనిచ్చే సన్‌నెట్‌వర్క్ కూడా ఈ శాటిలైట్ పరిధిలోనే ట్రాన్స్‌పాండర్లను ఏర్పాటు చేసుకున్నాయి. ఇప్పుడు శాటిలైట్ మొరాయించడంతో.. దాదాపు 60 టెలివిజన్ ఛానళ్లు ఒక్కసారిగా మూగబోయాయి.

ప్రసారాలు నిలిచిపోయిన తెలుగు న్యూస్ ఛానళ్లలో సాక్షి కూడా వుంది. సన్ డీటీహెచ్‌ సర్వీసు కూడా ఆగిపోయింది. ఇస్రో పర్యవేక్షణలో వీ.ఎస్.ఎన్.ఎల్ నిర్వహించే శాటిలైట్ సర్వీసుల్లో.. ఇలాంటి లోపం ఎప్పుడూ తలెత్తిన దాఖలాలు లేవు. అయితే.. సమస్య చిన్నదేనని.. ప్రసారాల పునరుద్ధరణకు ఏర్పాట్లు జరుగుతున్నాయని టెక్నికల్ వర్గాలు చెబుతున్నాయి. వీ.ఎస్‌.ఎన్‌.ఎల్ మాత్రం.. చడీచప్పుడు లేకుండా వుంది. రేపటిలోగా శాటిలైట్ రిస్టోర్ అవుతుందని, మూగబోయిన ఛానళ్లు ఏ క్షణాన్నయినా మళ్లీ పునప్రసారమయ్యే ఛాన్సుందని తెలుస్తోంది.


Source: www.tv5news.in

No comments:

Post a Comment