Monday, August 30, 2010

ఈ టీవీ గేమ్ షో- ‘రాజు-రాణి- జగపతి’

ఈ ఆగస్ట్ 17న  ఆరంభమైన ఈ కార్యక్రమం గురించి సుమారు నెలరోజులముందు మొదలైన ప్రచారం సృజనాత్మకతకు మచ్చుగా, చాలా చాలా గొప్పగా ఉంది.  తెలుగు టివి చరిత్రలో మొట్టమొదటి సారిగా సినీ హీరోల్లో ఓ సూపర్ స్టార్- యాంకరింగ్ చేస్తారన్న ఆ ప్రచారంలో- ఆ సూపర్ స్టార్ ఎవరన్నది సస్పెన్స్.
ఆరంభంలో ఫరవాలేదనిపించి క్రమంగా మహిళలు మెచ్చిన కథానాయకుడై కొంతకాలంగా మహానటుడిగా తన ప్రతిభను ప్రదర్శిస్తున్న జగపతిబాబుని సూపర్ స్టార్ అనడం సబబు కాదని అనలేము కానీ- సూపర్ స్టార్ అనగానే చాలామందికి ఆయన పేరు స్ఫురించకపోతే ఆశ్చర్యం లేదు.  అందువల్ల ఆ సూపర్ స్టార్ జగపతి బాబు అనీ, గేమ్ షో పేరు రాజు-రాణి-జగపతి అనీ సస్పెన్స్ విడిపోగానే- ఉత్సాహం కొంత తేలిపోతేనూ ఆశ్చర్యం లేదు.
జగపతిబాబు నటనలో హుందాతనముంది.  గేమ్ షోకి ఎన్నుకున్న టైటిల్ సాంగ్ లో ఆ హుందాతనం లేదు. ప్రచారంలో ఉన్న సృజనాత్మకత- గేమ్ షో రూపకల్పనలో కనిపించదు. కూర్చిన ఆటల్లో ఆసక్తి పుట్టించే అంశాలు లేవు.
ఈ షోలో నాలుగు (దంపతుల) జంటలు పాల్గొంటాయి. నాలుగు రౌండ్లలో మొదటిది నాలుగు స్తంభాలాట. ఒకో జంటకి ఐదేసి ప్రశ్నలు. టాపిక్ లాటరీ పద్ధతిలో ఒకరికి పురాణాలు, ఒకరికి రాజకీయాలు, ఒకరికి సినిమాలు, ఒకరికి లోకజ్ఞానం. అన్ని ప్రశ్నలకీ బడులివ్వగలిగితే బహుమతి 10 లక్షలు. ఆ సంఖ్యలోంచీ ఒకో తప్పు సమాధానానికి ఒక సున్నా చొప్పున తొలగిపోతుంది. అంటే ఐదూ తప్పు చెప్పినవారికి పది రూపాయలు మాత్రమే దక్కుతుంది. ఈ రౌండ్లో అందరికంటే తక్కువ మార్కులు వచ్చిన జంట తప్పుకోగా 3 జంటలు మిగులుతాయి. తప్పుకున్న జంట ‘జూ   లకటక’ పేరిట గుళ్లబోర్డు లాటరీలో సున్నా నుంచి పదివేల రూపాయలవరకూ దక్కించుకుని వెళ్ళవచ్చు. ప్రశ్నలు ఆసక్తికరంగానే నే ఉన్నా షో ఉత్కంఠ  కలిగించదు.
మిగిలిన 3 జంటలకీ రెండవ రౌండ్ ‘కొంచెం ఇష్టం కొంచెం కష్టం’. ఇందులో ప్రతి జంటకూ దంపతులకు వ్యక్తిగతమైన ఐదు ప్రశ్నలు.  ఒకే ప్రశ్నకు విడివిడిగా వారిచ్చే సమాధానాలు ప్రేక్షకులకి వినోదానిస్తాయి. బహుమతి మొత్తం 20 లక్షలు. మొదటి రౌండ్ తీరులోనే అన్ని సమాధానాలూ తప్పే ఐతే దక్కేది 20 రూపాయలు.  తప్పుకున్న జంటకి జూ లకటక. ఇలాంటివి ఇదివరలో కొన్ని గేమ్ షోలలో ఇప్పటికే వచ్చి ఉండడంవల్ల ఈ రౌండ్ కి పేరులో తప్ప కొత్తదనం లేదు.
మూడవది మిగిలిన రెండు జంటలకూ 30 లక్షల రూపాయల బహుమతితో ‘ఔను వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు’.  ఇద్దరూ విడివిడిగా షాపింగుకి వెడతారు. భార్య ఎంచుకున్న మూడు వస్తువులూ భర్త ఎన్నికతోనూ, భర్త ఎంచుకున్న మూడు వస్తువులూ భార్య ఎంపికతోనూ సరిపోవాలి. తప్పు సమాధానాలకు మిగతా రౌండ్లలోలాగే బహుమతి మొత్తం తగ్గిపోతుంది, తప్పుకున్న జంటకి- జూ   లకటక.
చివరి రౌండ్ జాక్‌పాట్ ‘జంబలకిడి పంబ’. మిగిలిన ఒక్క జంటా అంతవరకూ గెల్చుకున్న మొత్తంతో తృప్తిపడి వెళ్లిపోవచ్చు. లేదా ఒకే ఒక్క ప్రశ్నకి సరైన బదులిచ్చి గెల్చుకున్న మొత్తం సంఖ్యకి ఓ సున్నా జతపర్సుకుని పది రెట్లు చేసుకోవచ్చు.  తప్పు సమాధానానికి ఓ సున్నా తగ్గి- బహుమతి మొత్తం పదోవంతుకి తగ్గిపోతుంది. ఈ రౌండ్ ఇంతవరకూ ఉత్కంఠని కలిగించలేదు.
ఒక సినీ హీరో ఇమేజ్ ని పెంచే స్థాయిలో షో రూపొందించబడలేదు. ఏ స్థాయి షోనైనా తమ చేష్టలతో మెప్పించగల యాంకర్స్ ఉండొచ్చు. జగపతిబాబు యాంకరింగ్‌లో- ప్రత్యేకత ఏమాత్రమూ అగుపించలేదు.
ప్రస్తుతానికి ఈ కార్యక్రమం పేలవంగా ఉంది. నటనలో త్వరితగతిని ఎన్నో మెట్లెక్కిన (అ)సామాన్యుడు జగపతిబాబు యాంకరింగ్  మున్ముందు ఈ గేమ్ షోని గట్టెక్కించగలదని ఆశించవచ్చు.

Source: aksharajalam.wordpress.com

Friday, August 27, 2010

Raj Musix Telugu On Insat 2E

New Channel Raj Musix Telugu On Insat 2E From Raj Tv Network....

రాజ్ ముజిక్స్ ఇన్సాట్ 2E లో...

రాజ్ టీవీ నెట్వర్క్ నుండి రాజ్ ముజిక్స్ ఇన్సాట్ 2E లో...

Wednesday, August 25, 2010

Has Chiranjeevi started Janata news Telugu channel?

Does the Janata news channel belong to Chiranjeevi? As per the available reports, the answer is yes.

A new Telugu news channel has been testing signals since the past few days. It is none other than Janata news channel. Sources say that the news channel has been started indirectly by Chiranjeevi though through a dummy management.

Apparently Chiranjeevi does not want to start a news channel openly so that it does not get a name like Sakshi media which is known as Jagan's channel and people stopped believing the authenticity and non-bias nature of the news.

Sources say that it is just because of this fact that Chiru and Allu Aravind started this channel. According to the sources, Chiranjeevi has come to the conclusion that the elections in Andhra Pradesh might take anytime soon due due to the ongoing tussle between Jagan and the Congress High Command. It is because of this reason that Chiranjeevi started the channel so that it presents the PRP's point of view.

Now the real show starts as now almost all the parties in Andhra Pradesh have their own official or unofficial channels.

Source: www.newsofap.com

Monday, August 23, 2010

కొత్త చానల్స్ గురూ…!

ఆద్రి , మాయాబజార్… ఇవి సరికొత్త తెలుగు శాటిలైట్ చానళ్ల పేర్లు. మూతబడిన హెచ్ వై టీవీ, ఇప్పటిదాకా కేబుల్ కే పరిమితమైన ఆర్కే న్యూస్ త్వరలో పూర్తిస్థాయిలో 24 గంటల శాటిలైట్ చానల్స్ గా కనబడబోతున్నాయి. ఈ నాలుగే కాదు… మాటీవీ నుంచి మరో రెండు చానల్స్ రాబోతున్నాయి. ప్రజారాజ్యం పార్టీ ఈ మధ్యనే తన చానల్ ఆలోచన బయటపెట్టడం, సీపీఎం కొంతకాలంగా  ఆ ఆలోచన నుంచి బయటపడలేకపోవటం గమనిస్తే ఇంకో రెండు న్యూస్ చానల్స్ ఖాయమనే అనుకోవాలి. నేషనల్ జాగ్రఫీ తెలుగు వెర్షన్ ,  ట్రావెల్ ట్రెండ్స్ పేరుతో సిద్ధమవుతున్న టూరిజం చానల్ త్వరలో మనజాబితాలో చేరబోతున్నాయి. ఇప్పటికే 30 దాటిన తెలుగు చానల్స్ కి ఇవి అదనం.  అంటే, ఇంకో ఏడాదిలో మనం 40 దాటతాం. “ఏమిటీ, తెలుగు చానల్స్ కి ఇంత డిమాండా  ? ” అని త్రివేణి వక్కపొడి ప్రకటన స్టయిల్లో ఆశ్చర్యపోకండి.  ఆర్ టీవీ బాటలో ఎవరూ వెనకడుగు వేయకపోతే మాత్రం ఇది నిజమవుతుంది,
” ఇప్పటికే ఇబ్బడిముబ్బడిగా ఉంటే, ఇన్ని చానల్స్ ఎవరు చూస్తారు ? ” ఇది సగటు ప్రేక్షకుడి ప్రశ్న. కానీ చానల్ పెట్టేవాళ్ళ ఆలోచనలు భిన్నంగా ఉంటాయి. మిగిలిన వాళ్లకు భిన్నంగా ఆకట్టుకోగలమనే ధీమా ఉంటుంది. ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ విషయానికొస్తే, బాగా ధైర్యం చేసి డబ్బు ఖర్చుపెట్టి సినిమాలు కొని హడావిడి చేస్తే మార్కెట్లో నిలబడవచ్చునని మా టీవీ, జీ తెలుగు నిరూపించాయి. నేరుగా జెమినీ టీవీ కి పోటీ ఇవ్వలేకపోయినా, ఈటీవీకి, తేజా టీవీకి ఇవి గట్టిపోటీగా తయారయ్యాయి. ’ మనమూ అలా నిలబడగలం ’ అనే ధైర్యమే కొత్త వాళ్ళను ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ వైపు మళ్ళిస్తోంది. జెమిని, తేజ, ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు బాగానే లాభాలు గడిస్తున్నాయి. అందులో కొంత వాటా దక్కించుకుందామనే ఆలోచనే కొత్తవాళ్లకు ఊపిరి. చానల్ ఎలా నడపకూడదో తెలుసుకోవడానికి ఉదాహరణగా నిలిచిన సితార, ఆర్ టీవీ గురించి పట్టించుకోకుండా, లోపాలు విశ్లేషించకుండా ఆశావాదులు కొంతమంది ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ వైపు మొగ్గుచూపుతున్నారు.
ఒక్కో చానల్ వరుసగా పరిశీలిస్తే, ముంబై వాళ్ల చూపు కూడా తెలుగు మార్కెట్ మీద పడిందనటానికి నిదర్శనం ఆద్రి టీవీ. ఇది పూర్తి స్థాయి ఎంటర్‍టైన్‍మెంట్ చానల్. హైటెక్ సిటీ సమీపంలోని అయ్యప్పసొసైటీలో చాపకింద నీరులా ఏర్పాట్లు జరుగుతున్నాయని చెబుతున్నారు. ఇక రెండోది లోకల్ టీవీ వారి మాయాబజార్. ఇది కూడా మాదాపూర్ లో సరికొత్త భవనంలో సిద్ధమవుతోంది. రిథమ్ పేరుతో లైసెన్స్ తీసుకుని,  ఆ పేరువలన దాన్ని మ్యూజిక్ చానల్ అనుకుని చిన్నచూపు చూస్తారని అనుమానం వచ్చి, దక్షిణ్ అయితే బాగుంటుందేమోనని ఆలోచించి చివరికి మాయాబజార్ ఖాయం చేసుకున్నారు. పోయిన చోటనే వెతుక్కోవాలనే సూత్రం బాగా వంటబట్టించుకుని పట్టుదలతో శాటిలైట్ చానల్ తెస్తున్న ఈ సంస్థకి కార్యక్రమాల నిర్మాణంలో మంచి పట్టుంది.  సినీ సంబంధాలు ఎలాగూ ఉపయోగపడతాయి. ( మనలో మనమాట .. కేబుల్ కి ఎగరలేనమ్మ శాటిలైట్ కెగిరినట్టు అని గిట్టనివాళ్ళు కొత్త సామెత ప్రచారం చేస్తారేమో గాని మనం మాత్రం శుభం పలుకుదాం.. )
ఇక మాటీవీ విషయానికొస్తే, అతి త్వరలోనే రెండు చానల్స్ అందించటానికి సన్నాహాలు చేస్తోంది. మా మ్యూజిక్ మొదట్లో జెమినీ మ్యూజిక్ చానల్ ను గడగడలాడించినా, ఆ తరువాత బాగా వెనుకబడింది. అయినా సరే, ఖర్చు నామమాత్రం కనుక లాభదాయకమే. ఇప్పుడు అదే బాటలో పిల్లలకోసం మా జూనియర్స్, తేజ తరహాలో సినిమాల ప్రసారం కోసం మా మూవీస్ అనే రెండు చానల్స్ ప్రసారం చేయబోతోంది. ఇప్పుడు మా టీవీకి  సినిమాలే బలం కదా అనే అనుమానం రావచ్చు గాని అవే సినిమాలు ఇందులోనూ వేస్తారని మనకు తెలియదా ?! పోకిరి, అతడు, మల్లీశ్వరి లాంటి చాలా సినిమాలకు బుల్లితెర మీద కూడా శతదినోత్సవం జరిపిన ఘనతను ఎలా మరువగలం ? అన్నట్టు, ఈ మధ్య ఇంగ్లిష్ సినిమాలు కొని డబ్బింగ్ మొదలెట్టారు. తేజా టీవీ ని మరిపించే విధంగా చెన్నై సువాసనలతో విరాజిల్లే డబ్బింగ్ తెలుగు విని తరించే ప్రత్యేకసదుపాయం కలగబోతోందన్నమాట. ఏమైనప్పటికీ ఎన్ని ఎక్కువ చానల్స్ ఉంటే నెట్‍వర్క్ బలం అంతగా ఉంటుందనే నమ్మకంతో ఇలా ఈ రెండు కొత్త చానల్స్ కోసం పంజాగుట్టలోని పాత ఆఫీసులో పనులు సాగిస్తోంది. లైసెన్సులున్నా మొదలుపెట్టని మా పూజ, మా న్యూస్ గురించి మాత్రం ఇప్పట్లో పట్టించుకోకూడదని స్థిరమైన నిర్ణయం తీసుకున్నట్టుంది మా టీవీ యాజమాన్యం.
ఇప్పటికే 14 కు చేరిన న్యూస్ చానల్స్ జాబితాలో మరో రెండు కలవబోతున్నాయి. ఈశాన్య భారతానికి చెందిన ప్రమోటర్లు హైదరాబాద్ ప్రేక్షకులకోసం హెచ్ వై పేరుతో ఒక చానల్ మొదలెట్టి అంతర్గత సమస్యలతో పట్టించుకోవటం మానేసిన సంగతి తెలిసిందే. అన్ని మౌలిక వసతులూ ఉన్న ఆ చానల్ ని లీజుకు తీసుకుని  చానల్ 4 పేరుతో లాంచ్ చేయడానికి వాసిరెడ్డి శివరామ్ ప్రసాద్ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. గతంలో టీవీ5, స్టుడియో ఎన్ చానల్స్ కి ఆయన ఎమ్ డీ గా ఉన్న విషయం తెలిసిందే. మొదటి దశలో హైదరాబాద్ మీద దృష్టి పెట్టి అతి త్వరలో మిగిలిన నగరాలకు విస్తరించాలన్న వ్యూహంతో మెట్రో చానల్ గా తీర్చిదిద్దే ప్రయత్నంలోఉన్నారు.  అందరూ మాట్లాడుకుంటున్న మరో చానల్ ఆర్ కె న్యూస్. కాంట్రాక్ట్ పద్ధతి మీద జెమినీ న్యూస్ నడిపిన అనుభవంతో సొంతగా కేబుల్ చానల్ కు శ్రీకారం చుట్టి, అగ్రి గోల్డ్ సంస్థను ఆకట్టుకుని శాటిలైట్  చానల్ గా ఎదగబోతున్న ఈ సంస్థ భారీగానే నియామకాల పనిలో ఉంది. మొత్తమ్మీద ఈ రెండు న్యూస్ చానల్స్ ఇప్పుడు మీడియాలో వార్తలుగా చెలామణి అవుతున్నాయి.
ప్రజారాజ్యం పార్టీ  ప్రచారం కోసం ఒక న్యూస్ చానల్ పెట్టబోతున్నట్టు ఆ పార్టీ నాయకుడు వేదవ్యాస్ పత్రికాముఖంగానే ప్రకటించారు. అది ఆచరణలో ఎంతవరకు వచ్చిందో తెలియదుగాని ఈ లోపు ఏ టీవీ లో చిరంజీవి వాటా తీసుకుంటున్నారనే ప్రచారం జరిగింది. వార్తలు ప్రసారం చేయడానికి వీల్లేని నాన్ న్యూస్ చానల్ గా లైసెన్స్ ఉన్న ఏ టీవీ ని ఆయనేం చేసుకుంటారు ? కానీ ఏ టీవీ అధిపతి ఏదో సినిమా పనిమీద మాత్రమే చిరంజీవిని కలిసినట్టు ఆ తరువాత ఆయన సన్నిహితులు వివరణ ఇచ్చారు. ఇక ప్రజాశక్తి వారి చానల్ అనేది కొత్త వార్తేమీ కాదు. వాళ్ళకు చాలా కాలంగా ఉన్న ఆలోచనే అది. అంతమాత్రాన ఇప్పటికిప్పుడు తొందరే్మీ లేదన్న ధోరణిలోనే వారు వ్యవహరిస్తున్నారు.
తెలుగు సహా వివిధ భాషల్లో 18 ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ కోసం లైసెన్సులు తీసుకున్న రిలయెన్స్ విషయంలో నిజాలకంటే పుకార్లే ఎక్కువగా షికారు చేస్తున్నాయి.  కార్టూన్ నెట్‍వర్క్  తరహాలో నేషనల్ జాగ్రఫీ చానల్ కూడా తెలుగు వెర్షన్ మొదలుపెడుతోంది. ఇప్పటికే ప్రచార కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయి. అనువాదం చెన్నై నుంచి దిగుమతి కాబోతోంది. దాదాపు ఏడాదిగా శ్రీనగర్ కాలనీ కార్యాలయం నుంచి పనిచేస్తున్న మరో చానల్ ట్రావెల్ ట్రెండ్స్ లైసెన్స్ కూడా తెచ్చుకుని త్వరలో ప్రసారాలు చేసేందుకు సిద్ధమవుతోంది. నాలుగైదు భాషల్లో తీసుకురావడం ద్వారా ఖర్చు తగ్గించుకుని ఆదాయం పెంచుకోవాలన్నది  ఈ సంస్థ ఆలోచన. తెలుగులో కనీసం సగం చానల్స్ నష్టాల్లో ఉన్నప్పటికీ అవి ఏదో విధంగా కొనసాగుతున్నాయి. హెచ్ వై టీవీ లీజుకిచ్చి తప్పుకోగా, ఐ న్యూస్ యజమాని ఎన్ టీవీ కి అమ్ముకొని బయటపడ్డారు. ఆర్ టీవీ ప్రసారాలు ఆగిపోయాయి. త్వరలో రీలాంచ్ చేస్తామని చెప్పుకుంటోంది. ఆర్థికంగా కష్టాలు పూర్తిగా తొలగకపోయినా కొత్త చానల్ పెట్టాలన్న ఆలోచనలు చాలామంది ఇన్వెస్టర్ల మదిలో సజీవంగా ఉండటం మాత్రం మీడియా ఉద్యోగులలో ఆశలు చిగురింపజేస్తున్నాయి.

Source: bhavanarayana.co.tv

మన చానల్స్ రేటింగ్స్ ఎలా ఉన్నాయి ?



టీవీ చానల్స్ రేటింగ్స్ లెక్కించే టామ్ సంస్థ ప్రతివారం సేకరించిన సమాచారాన్ని చార్టుల రూపంలో ఆ తరువాత వచ్చే బుధవారం నాటికి చానల్స్ కు అందజేస్తుంది. ఆ సమాచారాన్ని సంక్షిప్తంగా ఈ బ్లాగులో ప్రతి వారం చూడవచ్చు.
—————————————————————————————–
చానల్              4+ సం.           15+ సం.          25+ సం          25+ సం
.                    అందరూ          అందరూ        అందరూ        పురుషులు
—————————————————————————————–
టీవీ 9                3.10               3.38              3.51              4.13
ఈటీవీ 2             0.83               0.95              1.06             1.25
ఎన్ టీవీ             0.98               1.11                1.11               1.40
టీవీ 5                1.63                1.87              2.14              2.17
ఐ న్యూస్           0.36               0.41               0.41             0.46
హెచ్ ఎమ్ టీవీ     0.73               0.82              0.83             0.92
సాక్షి టీవీ            1.02                1.12               1.19              1.40
జీ 24 గంటలు       0.78               0.83              0.81             0.90
మహా టీవీ           0.47                0.52             0.55            0.66
స్టుడియో ఎన్       0.51                 0.56             0.55            0.68
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 0.75                 0.82             0.90            1.16
జెమిని న్యూస్      0.16                  0.17             0.20            0.25
రాజ్ న్యూస్        0.47                  0.46            0.54            0.76
టీవీ 1                0.20                  0.24            0.21            0.23
————————————————————————————-
ఆగస్టు 8 నుంచి 14 వరకు వివిధ వయోవర్గాలవారీగా వివిధ చానల్స్ మార్కెట్ వాటా ఇది.
వార్తలు చూసే వాళ్ళలో పురుషుల శాతం ఎక్కువనే విషయం స్పష్టంగా తెలుస్తూనే ఉంది.
వయసు పెరిగే కొద్దీ న్యూస్ మీద ఆసక్తి పెరుగుతున్నట్టు గమనించవచ్చు.
గడిచిన మూడు వారాల విశ్లేషణ
—————————————————————————————————–
చానల్          31 వ వారం      32వ వారం         33 వ వారం       సగటు      ర్యాంకు
—————————————————————————————————–
టీవీ 9             3.86              3.48                   3.95             3.76           1
ఈటీవీ 2           1.49              1.30                    1.12              1.30           4
ఎన్ టీవీ           1.34              1.20                    1.41              1.32           3
టీవీ 5              1.81              2.02                    1.80             1.88           2
ఐ న్యూస్          0.36            0.37                    0.48             0.40          11
హెచ్ ఎమ్ టీవీ    0.74            0.76                    0.83             0.78          8
సాక్షి టీవీ           1.20            1.15                      1.34              1.23          5
జీ 24 గంటలు     0.76            0.82                    0.98             0.85          7
మహా టీవీ         0.45            0.46                   0.61              0.51          10
స్టుడియో ఎన్     0.59             0.63                  0.70              0.64         9
ఏబిఎన్ ఆంధ్రజ్యోతి 0.79           1.05                   1.03              0.96          6
జెమిని న్యూస్     0.21             0.18                   0.21              0.20          13
రాజ్ న్యూస్        1.21              0.74                  0.60             0.85          7
టీవీ 1              0.24              0.26                 0.29              0.26         12
—————————————————————————————————-
మొత్తం వాటా     15.05             14.42                15.35              14.94
—————————————————————————————————-
ఎన్నికల సమయంలో బాగా పుంజుకున్న రాజ్ న్యూస్ ఆ తరువాత కాస్త తగ్గింది. అయితే తెలంగాణ జిల్లాల్లోనే ఎక్కువగా అందుబాటులో ఉన్నప్పటికీ గణనీయంగా మార్కెట్ వాటా సంపాదించుకోగలుగుతున్నట్టు స్పష్టంగా తెలుస్తోంది. మొదటి స్థానంలో టీవీ9 ఎంత సుస్థిరంగా ఉందంటే, రెండో స్థానంలో ఉన్న టీవీ5 వాటా అందులో సగం మాత్రమే. ఇటీవలి కాలంలో సాక్షి, ఏబిఎన్ చానల్స్ గణనీయమైన పెరుగుదల నమోదుచేసుకుంటుండగా ఐ న్యూస్ వేగంగా పడిపోతోంది. ఈటీవీ 2 కూడా ఆశాజనకమైన ఫలితాలు సాధించలేకపోతోంది. మహా, స్టుడియో ఎన్, జీ 24 గంటలు, హెచ్ ఎమ్ టీవీ కొంతమేరకు మెరుగుపడుతున్నాయి.
ఎంటర్‌టైన్మెంట్ చానల్స్
చానల్                        4+ సం.             4+సం.             4+సం.            15+సం. .      15+సం.           15+సం.
.                              అందరూ    మహిళలు   పురుషులు  అందరూ    మహిళలు   పురుషులు
ఈటీవీ 8.63 9.42 7.73 9.02 9.94 7.90
జెమిని 18.88 20.31 17.24 19.17 20.42 17.67
తేజ టీవీ 9.35 9.19 9.53 9.58 9.34 9.88
మా టీవీ 6.53 6.47 6.60 6.37 6.35 6.39
జీ తెలుగు 7.31 7.90 6.64 7.22 7.68 6.67
వనిత 0.21 0.23 0.17 0.21 0.23 0.18
సితార 0.42 0.35 0.49 0.43 0.37 0.51
ఆర్ టీవీ 0.01 0.02 0.01 0.02 0.02 0.02
జెమిని మ్యూజిక్ 1.84 2.19 1.44 1.84 2.14 1.47
మా మ్యూజిక్ 0.96 1.15 0.75 0.92 1.04 0.78
విస్సా 0.02 0.03 0.02 0.03 0.03 0.02
హెచ్ వై టీవీ 0.00 0.00 0.00 0.00 0.00 0.00
ఏ టీవీ 0.24 0.20 0.29 0.27 0.23 0.32
ఇతర చానల్స్ 33.10 31.32 35.13 31.10 30.12 32.30
మొత్తం వాటా 100.00 100.00 100.00 100.00 100.00 100.00
ఎంటర్‍టైన్‍మెంట్ చానల్స్ లో జెమిని, తేజ చానల్స్ మొదటి రెండూ స్థానాలు కొనసాగిస్తూ తిరుగులేని ఆధిక్యంలో ఉన్నాయి. రెండో స్థానం కోసం పోటీపడిన ఈటీవీ, మా టీవీ, జీ తెలుగు బాగా వెనుకబడ్డాయి. వనిత, సితార, ఆర్ టీవీ, విస్సా వంటివి నామమాత్రంగా మిగిలిపోయాయి. గతంలో జెమినీ మ్యూజిక్ కు గట్టి పోటీ ఇచ్చిన మా మ్యూజిక్ ఇప్పుడు సగానికి సగమై పోయింది.

Source: bhavanarayana.co.tv

Friday, August 13, 2010

తెలుగు ఫీడ్ ను ప్రారంభించిన నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

హైదరాబాద్: ఆంగ్లం, హిందీ తర్వాత నేషనల్ జియోగ్రాఫికల్ చానెల్ ఇండియా తెలుగులోకి అడుగు పెట్టింది. తెలుగు ఫీడ్ ను ఆ చానెల్ బుధవారం ప్రారంభించింది. తద్వారా స్థానిక భాషల్లోకి ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేసుకుంటోంది. తన చానెల్ కు వీక్షకులు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఐదు మిలినయన్ల మంది ఉన్నారని, వచ్చే రెండు మూడు నెలల్లో రెండింతలు చేయాలనేది తమ లక్ష్యమని నేషనల్ జియోగ్రాఫిక్ నెట్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తన్ అద్యంతాయ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఆంగ్ల, హిందీ చానెళ్లు డైరెక్ట్ టు హోం (డిటిహెచ్) ద్వారా అందుబాటులో ఉంటాయని, తెలుగుకు సంబంధించి అనలాగ్ కేబుల్ నెట్ వర్క్ లో డిఫాల్ట్ చానెల్ గా ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగు, ఐదేళ్లలో మరిన్ని స్థానిక భాషల్లో దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. నిజానికి సాఫ్ట్ లాంచ్ ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైందని, దాదాపు 90 శాతం అంటే 300 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు దానికి మారారని ఆయన చెప్పారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, ఫాక్స్ కేబుల్ నెట్ వర్క్స్ జాయింట్ వెంచర్.

శ్రీరామ్ ను గెలిపించాలన్న చంద్రబాబు


హైదరాబాద్: సోనీ టీవీ నిర్వహిస్తున్న ఇండియన్ ఐడల్ పోటీలో శ్రీరామ్ ఫైనల్స్ కు చేరికోవడం తెలుగువారందరికీ గర్వకారణమని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు అన్నారు. ఆ పోటీలో ఫైనల్స్ కు చేరుకున్న తెలుగు యువ గాయకుడు శ్రీరామ్ కు ఎస్ఎంఎస్ ల ద్వారా మద్దతు తెలపాలని అయన పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా శ్రీరామ్ కు శుభాకాంక్షలు తెలిపారు. ఫైనల్స్ లో శ్రీరామ్ విజయం సాధించాలని చంద్రబాబు ఆకాంక్షించారు.

Source: www.teluguone.com

ఆ టీవీ ఛానెల్‌కి నాగ చైతన్య బ్రాండ్ అంబాసిడర్

రెండు సినిమాల వయస్సున్న నాగచైతన్య ఇప్పుడు ఇంటర్నేషనల్ ఛానల్ నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌కి తెలుగు బ్రాండ్ అంబాసిడర్. ఈ విషయాన్ని ప్రస్దావిస్తూ..తాను నేషనల్ జియోగ్రఫిక్ ఛానెల్‌కి బ్రాండ్ అంబాసిడిగా ఒప్పుకోవటానకి కారణం చెపుతూ...ఎప్పుడూ కొత్తగా కనిపించే ఎన్ ‌జీసీ అంటే తనకున్న ఇష్టంతోనే దానికి బ్రాండ్ అంబాసిడర్ ‌గా ఉండడానికి ఒప్పుకున్నానని చెప్పారు. హైదరాబాద్ ‌లోని తాజ్ ‌కృష్ణ హోటల్‌ లో బుధవారం జరిగిన తెలుగు నేషనల్ జియోగ్రఫిక్ చానెల్ పారంభోత్సవ కార్యక్రమంలో చైతన్య ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.

అలాగే బ్రాండ్ అంబాసిడర్ ‌గా తాను ఏదైనా డాక్యుమెంటరీ చేయాల్సి వస్తే సొంతంగానే తీస్తానన్నారు చైతన్య. డాక్యుమెంటరీ తీసేటపుడు పులి వస్తే ఏంచేస్తారు? అని ప్రశ్నించగా..'చెట్టెక్కి కూర్చుంటాను' అని సమాధానమిచ్చారు. ఇక నాకు చిన్నప్పటి నుంచి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్(ఎన్ ‌జీసీ) అంటే ఇష్టం. ముఖ్యంగా వైల్డ్ లైఫ్ బాగా చూసే వాడిని. ఇందులో ప్రసారం అయ్యే అడ్వెంచర్, రియల్ స్టోరీస్ చాలా థ్రిల్లింగ్ ‌గా ఉంటాయి. నాకు కూడా సాహసాలు చేయడమంటే ఇష్టం అని నాగచైతన్య అన్నారు.

సోర్సు: thatstelugu.oneindia.in

TV5 launches business portal; mulls biz channel

Telugu television channel TV5 announced, on Thursday, the launch of TV5MoneyLive, an interactive Web-casting platform streaming business content, and hinted that they are considering the option of a business channel.
The interactive Web-cast platform showcases stock market developments, personal finance and business content for two hours initially and will gradually become a 24x7 feature.
The Chairman and Managing Director of Karvy Group, Mr C. Parthasarathy, and Mr M. Yugandhar, Managing Director of Karvy Compushare, inaugurated the portal at the TV5 Studio here.
Mr B. Ravindranath, Managing Director of Shreya Broadcasting, said, “with the Internet penetration growing exponentially and yet to be introduced Broadband Wireless Access system expected to revolutionise the Internet viewing patterns, we are expecting TV5MoneyLive to catch up with the domestic and overseas audiences.”
Viewers' choice
Mr P. V. Vasanth Kumar, Business Editor, TV5, said that this feature was launched by us based on the feedback from channel viewers.
It aims to cater to those who need information in Telugu.
The viewers can ask queries and have them answered by experts.

Nat Geo launches Telugu feed

MUMBAI: After having experimented with regional language blocks on general entertainment channels, National Geographic Channel (NGC) has launched its Telugu feed to expand its base in this large television viewing market.


NGC has roped in Tollywood actor Naga Chaitanya as the brand ambassador as he launched the channel in Hyderabad late Wednesday.
With a tagline 'Live Curious', NGC is currently available in Hindi and English.
National Geographic Network & Fox International Channels MD Keerthan Adyanthaya says, "We are excited to reach out to a wider Indian audience. The channel will give our viewers a flavour of compelling stories in their native language, aided by stunning visuals and credibility that people have come to expect from the NGC. It reinforces our commitment to offer our viewers a new way to look at the world - inviting them to Live Curious: learn and explore constantly about science, technology, history, culture, nature and wildlife."


The Telugu channel will be available along with Hindi and English through distribution affiliates and cable network operators. It will air popular programmes like Jailed Abroad, Air Crash Investigations and NGC specials like Strange Days on Planet Earth among others. The best of NGC specials, events and signature series will now also be available on the Telugu channel.
In April, NGC had entered into a content syndication deal with Star Jupiter for a one-hour slot of NGC dubbed content on the Kannada channel Suvarna and Telugu channel Sitara.
Launched in 1998, NGC programming covers adventure and exploration, natural history, science, wildlife and people of the world. It is currently distributed by Star Den distribution bouquet to over 45 million homes in India. It claims over 54 million viewers a month on an average.



Source: www.indiantelevision.com