Friday, August 13, 2010

తెలుగు ఫీడ్ ను ప్రారంభించిన నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్

హైదరాబాద్: ఆంగ్లం, హిందీ తర్వాత నేషనల్ జియోగ్రాఫికల్ చానెల్ ఇండియా తెలుగులోకి అడుగు పెట్టింది. తెలుగు ఫీడ్ ను ఆ చానెల్ బుధవారం ప్రారంభించింది. తద్వారా స్థానిక భాషల్లోకి ప్రవేశించడానికి మార్గం ఏర్పాటు చేసుకుంటోంది. తన చానెల్ కు వీక్షకులు ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఐదు మిలినయన్ల మంది ఉన్నారని, వచ్చే రెండు మూడు నెలల్లో రెండింతలు చేయాలనేది తమ లక్ష్యమని నేషనల్ జియోగ్రాఫిక్ నెట్ వర్క్ మేనేజింగ్ డైరెక్టర్ కీర్తన్ అద్యంతాయ మీడియా ప్రతినిధులతో చెప్పారు.

ఆంగ్ల, హిందీ చానెళ్లు డైరెక్ట్ టు హోం (డిటిహెచ్) ద్వారా అందుబాటులో ఉంటాయని, తెలుగుకు సంబంధించి అనలాగ్ కేబుల్ నెట్ వర్క్ లో డిఫాల్ట్ చానెల్ గా ఉంటుందని ఆయన అన్నారు. వచ్చే నాలుగు, ఐదేళ్లలో మరిన్ని స్థానిక భాషల్లో దాన్ని ప్రారంభిస్తామని చెప్పారు. నిజానికి సాఫ్ట్ లాంచ్ ఆగస్టు 1వ తేదీన ప్రారంభమైందని, దాదాపు 90 శాతం అంటే 300 మందికి పైగా కేబుల్ ఆపరేటర్లు దానికి మారారని ఆయన చెప్పారు. నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్ నేషనల్ జియోగ్రాఫిక్ చానెల్, ఫాక్స్ కేబుల్ నెట్ వర్క్స్ జాయింట్ వెంచర్.

2 comments: