మీ యొక్క బ్రాడ్ బ్యాండ్ 512 కేబి కన్నా ఎక్కువైతే http://www.tvunetworks.com
మీ యొక్క బ్రాడ్ బ్యాండ్ 256 కేబి కన్నా ఎక్కువైతే http://www.freedocast.com
Friday, November 12, 2010
Telugu Live Tv Channels Websites
Your Broadband More Than 512 Kbps Speed http://www.tvunetworks.com
Your Broadband More Than 256 Kbps Speed http://www.freedocast.com
Your Broadband More Than 256 Kbps Speed http://www.freedocast.com
Labels:
English
Thursday, November 11, 2010
MBS Prasad's TV Program Gets Nandi Award
MBS Prasad, the popular columnist on greatandhra.com recently won Keerthi Puraskar under the category of ‘Humorous Writing’ from Telugu University and that is known for all. He has another feather in his cap. Freshly his TV program ‘Idee Asalu Katha’ that has been rolling on Vanita TV from quite some time has won Nandi Award as ‘second best feature’. The first feature award has gone to ETV’s ‘WOW’ hosted by Sai Kumar.
MBS Prasad is not only a writer but a great narrator. MBS Prasad had scripted, voiceovered and anchored the program ‘Idee Asalu Katha’ that explains how Telugu makers improvised upon the original scripts while remaking other language films like Hindi, Tamil, Bengali, English etc. That proved highly interesting and the Vanita channel (NTV group) also attracted good TRP with that program. The program snippets are also available in youtube as hot favorites. Click here to watch a sample episode of ‘Idee Asalu Katha’.
Source: www.greatandhra.com
Labels:
English
2009 టివి నంది అవార్డుల ప్రకటన
హైదరాబాద్ ,ఆంధ్రప్రభ ప్రతినిధి: 2009 సంవత్సరానికి గాను “”నంది టివి ఫిల్మ్ ఆవార్డు’’లను రాష్ట్ర ఫిల్మ్ టెలివిజన్ అండ్ థియేటర్ డెవలప్‌మెంట్ కార్పోరేషన్ (ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి) ప్రకటించింది. అవార్టుల కోసం మొత్తం 215 ఎంట్రీలు రాగా, 65 ఎంట్రీలు ఎంపికయ్యాయి. డిసెంబర్ 11న నిర్వహించే ఓ కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేయాలని భావిస్తున్నట్లు అవార్డుల కమిటీ వెల్లడించింది. అలాగే నంది ఫిల్మ్ అవార్డులను ఈనెల 28న ప్రదానం చేయినట్లు ఆ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటైన మీడియా ప్రతినిధుల సమావేశంలో సమాచార శాఖ కమీషనర్ సి.పార్థసారథి, అవార్టుల కమిటీ సభ్యులతో కలిసి నంది టివి ఫిల్మ్ అవార్డు కమిటీ ఛైర్మన్ వడ్డెపల్లి కృష్ణ మాట్లాడారు.. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి నవంబర్ 10వ తేదీ వరకు అవార్డులు ఎంపిక స్క్రీనింగ్‌ను నిర్వహించి, ముఖ్యమంత్రి కె.రోశయ్యకు తుది నివేదిక సమర్పించామని ఆయన చెప్పారు. ఈ ఏడాది అవార్డుల కోసం దరఖాస్తు చేసే ఎంట్రీల సంఖ్య పెరిగిందని, కొత్తగా న్యూస్ రీడర్స్ కూడా అవార్డులు ప్రదానం చేస్తునట్లు ఆయన చెప్పారు. నంది టివి ఫిల్మ్ అవార్డుల కోసం టెలిఫిల్మ్ విభాగంలో 35 ఎంట్రీలు, టివి ఫిచర్స్ విభాగంలో 41 ఎంట్రీలు, టివి మెగా సీరియల్స్ విభాగంలో 8 ఎంట్రీలు, టివి డైలీ సీరియల్స్ విభాగంలో 19, టివి బాలల చిత్రాల విభాగంలో 6 ఎంట్రీలు, టివి డాక్యుమెంటరీ ఫిల్మ్స్ విభాగంలో 24 ఎంట్రీలు, టివి సామాజిక సంబంధిత ఫిల్మ్ విభాగంలో 25 ఎంట్రీలు, టివి విద్యా విషయక విభాగంలో 27 ఎంట్రీలు, టివి న్యూస్ రీడర్ అవార్డుల విభాగంలో 30 ఎంట్రీలు వచ్చాయని ఆయన చెప్పారు. సమాచార శాఖ కమీషనర్ సి.పార్థసారథి మాట్లాడుతూ, 6 సంవత్సరాల నుండి టివి రంగంలో నంది అవార్డులను ప్రదానం చేస్తున్నామని చెప్పారు. టివిలో ప్రసారమయ్యే ఉత్తమ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకే ఈ అవార్డులను ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నంది టివి ఫిల్మ్ అవార్డుల కమిటీ సభ్యులు సి.ఉమామహేశ్వరరావు, సత్యయాబి, సి.జె.రెడ్డి, పద్మావతి, కె.దీపికారెడ్డి, పి.వి.రామ్మోహన్ నాయుడు, తోట వెంకట రమణ, బి.శ్రీధర్, శిల్ప చక్రవర్తి, ఐనంపూడి శ్రీలక్ష్మి, గాజోజు నాగభూషణం, యండమూరి అనుగీత, డాక్టర్ డివిఎన్ రాజు, ఎంకెఆర్ ఆశాలతలు పాల్గొన్నారు.
టెలిఫిల్మ్స్ విభాగంలో
విప్రనారాయణ (ఉత్తమ తొలి టెలిఫిల్మ్
దృష్టి (ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్)
టివి ఫీచర్స్ విభాగంలో
వావ్.. (ఉత్తమ తొలి టివి ఫీచర్)
ఇది అసలు కథ (ద్వితీయ ఉత్తమ టివి ఫీచర్)
టివి మెగా సీరియల్స్ విభాగంలో
శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (ఉత్తమ తొలి టివి మెగా సీరియల్)
శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం (ఉత్తమ ద్వితీయ టివి మెగా సీరియల్)
టివి డైలీ సీరియల్స్ విభాగంలో
మొగలి రేకులు (ఉత్తమ తొలి టివి డైలీ సీరియల్)
అభిషేకం (ఉత్తమ ద్వితీయ టివి సీరియల్)
టివి బాలల ఫిల్మ్ విభాగంలో
ఆశాదీపం (ఉత్తమ తొలి టివి బాలల ఫిల్మ్)
ఓ చిన్న ప్రయత్నం (ఉత్తమ ద్వితీయ టివి బాలల ఫిల్మ్)
టివి డాక్యుమెంటరీ ఫిల్మ్ విభాగంలో
చెర్యాల కళాకృతులు (ఉత్తమ తొలి టివి డాక్యుమెంటరీ ఫిల్మ్)
అమృత వర్షిణి (ఉత్తమ ద్వితీయ టివి డాక్యుమెంటరీ ఫిల్మ్)
టివి సామాజిక సంబంధిత ఫిల్మ్ విభాగంలో
డైలీ మిర్రర్ (ఉత్తమ తొలి టివి సామాజిక సంబంధిత ఫిల్మ్)
దుర్గ (ఉత్తమ ద్వితీయ టివి సామాజిక సంబంధిత ఫిల్మ్)
టివి విద్యావిషయక ఫిల్మ్ విభాగంలో
అద్బుత చిరుధాన్యాలు (ఉత్తమ తొలి టివి విద్యావిషయక ఫిల్మ్
భవాణి (ఉత్తమ ద్వితీయ టివి విద్యావిషయక ఫిల్మ్)
స్పెషల్ జ్యూరీ అవార్డ్స్ విభాగంలో
యామిని (శ్రీ వైనతేయం)
జీవితమే నాటకం (దూరదర్శన్ డైరెక్టర్)
సాయికుమార్ (వావ్.. యాంకర్)
కోమలి సిష్టర్స్ (నవ్వులాట)
దేవీ నాగవల్లి (న్యూస్ రీడర్)
న్యూస్ రీడర్స్ విభాగంలో
పి.కిరణ్ కుమార్ (ఉత్తమ పురుష టివి న్యూస్ రీడర్)
జి.రాణి రుద్రమ(ఉత్తమ మహిళా టివి న్యూస్ రీడర్)
వ్యక్తిగత అవార్డుల విభాగంలో
మంజుల నాయుడు (బెస్ట్ డైరెక్టర్, మొగలి రేకులు సీరియల్)
సాగర్ (అత్యుత్ అవార్డ్ ఫర్ బెస్ట్ లీడింగ్ యాక్టర్, మొగలిరేకులు సీరియల్)
వహీదా (ఉత్తమ లీడింగ్ నటి, విప్రనారాయణ)
హరి (ఉత్తమ సపోర్టింగ్ నటుడు, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర)
రూపా దేవి (ఉత్తమ సపోర్టింగ్ నటి, తీరం)
గుండు హనుమంతరావు (ఉత్తమ హాస్య నటుడు, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం)
రవివర్మ (ఉత్తమ విలన్, మనసున మనసై)
మాస్టర్ విజయ్ (ఉత్తమ బాల నటుడు, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర)
బేబి వి.పూజ్యస్వాని (ఉత్తమ బాలనటి, నాగేశ్వరి)
వి.యజువేంద్ర(ఉత్తమ తొలి ఫిల్మ్ దర్శకుడు, భక్త అంబారిష)
రఘు కాపుగంటి, ఎం.శేషుకుమార్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్, అంత:పురం)
డి.కామేశ్వరి (ఉత్తమ కథా రచయిత, మనసున మనసై)
గోవిందరాజుల నాగేశ్వరరావు (ఉత్తమ మాటల రచయిత, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం)
డాక్టర్ మంగళగిరి పూర్ణచంద్ (ఉత్తమ లిరిక్ రైటర్, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
పి.వెంకటరమణ (ఉత్తమ సినిమాటోగ్రాఫర్, శ్రీ వైనతేయం)
రాధ -గోపి (ఉత్తమ సంగీత దర్శకుడు, భక్తపోతన)
మనో (ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేందరస్వామి చరిత్ర)
పి.ఆర్.కౌసల్య (ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్, ఆడదే ఆదారం)
కె.నరశింహరెడ్డి (ఉత్తమ ఎడిటర్, డాక్టర్ చక్రవర్తి)
అడ్డాల పెద్దిరాజు (ఉత్తమ కళా దర్శకుడు, రేలారే రేల)
శివారెడ్డి (ఉత్తమ పురుష యాంకర్, కామిడీ గ్యాంగ్)
సుమ (ఉత్తమ మహిళా యాంకర్, పంచావతారం)
వై.బి.వెంకటేశ్వరరావు (ఉత్తమ పురుష డబ్బింగ్ కళాకారుడు, రంతీదేవుడు)
లెనినా చౌదరి (ఉత్తమ మహిళా డబ్బింగ్ కళాకారిణి, చంద్రముఖి)
సుంకర సతీష్ (ఉత్తమ ఆడియోగ్రాఫర్, చక్రధారి)
వి.తిరుమలేశ్వరరావు (ఉత్తమ కాస్ట్యూమ్స్ డిజైనర్, మండోదరి)
దేవేంద్ర కుమార్ (ఉత్తమ మేకప్ కళాకారుడు, సతీతులసి)
రే యానిమేషన్స్ (ఉత్తమ గ్రాఫిక్స్, శ్రీ వైనతేయం)
Source: www.andhraprabhaonline.com
Labels:
Telugu
‘పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’కి ఐదు అవార్డులు
హైదరాబాద్, నవంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నంది టివి అవార్డుల్లో 2009 సంవత్సరానికి మెగా సీరియల్ ‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వివిధ విభాగాల్లో ఐదు అవార్డులు గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచింది. తొమ్మిది క్యాటగిరీల్లో 215 ఎంట్రీలు రాగా, 68 అవార్డులను ప్రకటించారు. ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ చైర్మన్‌గా వ్యవహరించిన కమిటీలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. రాష్ట్ర చలనచిత్ర, టివి, రంగస్థల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సి. పార్థసారథి ఈ కమిటికి మెంబర్ కన్వీనర్‌గా పనిచేశారు. 2009 టివి అవార్డులను బుధవారం ఇక్కడ ప్రకటించారు. కమిటి చైర్మన్ వడ్డేపల్లి కృష్ణతో పాటు సభ్యులు పి.వి. రాంమోహన్‌నాయుడు, సి. ఉమామహేశ్వరరావు, ఎం.పద్మావతి, కె. దీపిక, శిల్పచక్రవర్తి, శ్రీలక్ష్మి, సత్యం, సి.జె.రెడ్డి, డాక్టర్ డివిఎన్ రాజు తదితరులు అవార్డుల ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తమ టెలిఫిల్మ్‌గా ‘విప్రనారాయణ’, ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్‌గా ‘దృష్టి’ ఎంపికయ్యాయి. టివి ఫ్యూచర్ ఫిల్మ్‌లలో ఉత్తమ టివి ఫ్యూచర్‌గా ‘వావ్’, ద్వితీయ ఉత్తమ టివి ఫ్యూచర్‌గా ‘ఇదే అసలు కథ’ ఎంపికయ్యాయి. మెగా సీరియళ్లలో ఉత్తమ మెగా సీరియల్‌గా ‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, ద్వితయ టివి మెగా సీరియల్‌గా ‘శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యం’ ఎంపికయ్యాయి. టివి డెయిలీ సీరియళ్లలో ప్రథమ ఉత్తమ సీరియల్‌గా ‘మొగలిరేకులు’, ద్వీతీయ ఉత్తమ సీరియల్‌గా ‘అభిషేకం’ ఎంపికయ్యాయి. టివి పిల్లల చిత్రాల్లో ప్రథమ టివి పిల్లల ఫిల్మ్‌గా ‘ఆషాడదీపం’, రెండవ ఉత్తమ పిల్లల చిత్రంగా ‘ఓ చిన్న ప్రయత్నం’, డాక్యుమెంటరీల్లో ప్రథమ బహుమతి ‘చేర్యాల కళాకృతులు’, ద్వితీయ బహుమతి ‘అమృత వర్షిణి’కి లభించాయి. సామాజిక స్పృహ కలిగిన చిత్రాల విభాగంలో ప్రథమ బహుమతి ‘డెయిలీ మిర్రర్’కు, ద్వితీయ బహుమతి ‘దుర్గ’కు లభించాయి. టివి ఎడ్యుకేషన్ చిత్రాల విభాగంలో ప్రథమ బహుమతి ‘అద్భుత చిరుధాన్యాలు’కు, ద్వితీయ బహుమతి ‘్భవాని’కి లభించాయి. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో వ్యక్తిగతంగా యామిని (శ్రీ వైనతేయం), డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం (జీవితమే నాటకం), సాయికుమార్ (వావ్), కోమలి సిస్టర్స్ (నవ్వులాట), దేవి నాగావళి (న్యూస్‌రీడర్) కి లభించాయి. న్యూస్ రీడర్ అవార్డులు పురుషుల విభాగంలో పి. కిరణ్‌కుమార్, మహిళల విభాగంలో జి. రాణిరుద్రమకు లభించాయి. వ్యక్తిగత కళాకారులకు ఇచ్చే అవార్డుల్లో మంజులా నాయుడు (ఉత్తమ డైరెక్టర్-మొగలిరేకులు), సాగర్ (బెస్ట్ లీడింగ్ యాక్టర్-మొగలిరేకులు), వహీద (బెస్ట్ లీడింగ్ యాక్టరెస్-విప్రనారాయణ), హరి (ఉత్తమ సహాయ నటుడు-శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), రూపాదేవి (ఉత్తమ సహాయ నటి-తీర్థం), గుండు హన్మంతరావు (ఉత్తమ హాస్యనటుడు), రవి వర్మ (ఉత్తమ విలన్-మనసున్న మనిషి), వి. యజువేంద్ర (ఉత్తమ చిత్ర దర్శకుడు-భక్త అంబరీష), రఘు కాపుగంటి, ఎం. శేషుకుమార్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-అంతఃపురం), డి. కామేశ్వరి (ఉత్తమ కథా రచయిత-మనసున్న మనిషి), గోవిందరాజులు నాగేశ్వరరావు (ఉత్తమ మాటల రచయిత-శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యం), డాక్టర్ మంగళగిరి పూర్ణచంద్ (ఉత్తమ పాటల రచయిత-శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), పి. వెంకటరమణ (ఉత్తమ సినిమాటోగ్రాఫర్-శ్రీవైనతేయం), రాధా-గోపి (ఉత్తమ సంగీత డైరెక్టర్-్భక్తపోతన), మనో (ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్-శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), పి.ఆర్. కౌసల్య (ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్-ఆడదే ఆధారం), కె. నర్సింహారెడ్డి (ఉత్తమ ఎడిటర్-డాక్టర్ చక్రవర్తి), ఆదాల పెద్దిరాజు (ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్-రేలారే రేలా), శివారెడ్డి (ఉత్తమ పురుష యాంకర్-కామెడీ గ్యాంగ్), సుమ (ఉత్తమ మహిళా యాంకర్-పంచావతారం), వై.బి. వెంకటేశ్వరరావు (ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్-రంతి దేవుడు), లెనీనా చౌదరి (ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్-చంద్రముఖి), సుంకర సతీష్ (బెస్ట్ ఆడియోగ్రాఫర్-చక్రదారి), వి. తిరుమలేశ్వరరావు (ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్-మండోదరి) , దేవేంద్ర కుమార్ (ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్-సతీ తులసి), రాయ్ ఎనిమేషన్స్ (ఉత్తమ గ్రాఫిక్స్-శ్రీవైనతేయం)కు లభించాయి. 2009 టివి నంది అవార్డులను ఈ ఏడాది డిసెంబర్ 11న ఇవ్వాలని తాత్కాలికంగా నిర్ణయించామని సి. పార్థసారథి ప్రకటించారు. నంది సినిమా అవార్డులను ఈనెల 28న ఇస్తామని తెలిపారు.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
టీవీ ఫైవ్ డైలీ మిర్రర్‌కు బంగారు నంది
* బెస్ట్ సోషల్ రిలవెంట్ కేటగిరిలో అవార్డు
టీవీ ఫైవ్ ప్రసారం చేస్తున్న డైలీ మిర్రర్‌కు బంగారు నంది అవార్డు లభించింది. సమకాలీన అంశాలపై ప్రత్యేక కథనాల సమాహారమే డైలీ మిర్రర్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తిలకించిన నంది అవార్డు కమిటీ బెస్ట్ సోషల్ రిలవెంట్ ఫిల్మ్ కేటగిరీ కింద అవార్డును ప్రకటించింది.
సామాజిక, సమకాలీన అంశాలను కళ్లకు కట్టినట్లు సవివరంగా అందించే ఉద్దేశంతో టీవీ-5 డైలీమిర్రర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో పలు సామాజిక అంశాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రతీరోజు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసారమవుతోంది. ఈ మధ్యనే 200 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న డైలీ మిర్రర్ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగానే సింగరేణి ఓపెన్‌కాస్ట్ బాధితుల కన్నీటి కథలను నిప్పురవ్వ శీర్షికన టీవీ-5 ప్రసారం చేసింది.
ఓపెన్ కాస్ట్ మైన్స్ రాకముందు కళకళలాడే గ్రామాలు బ్లాస్టింగ్ మొదలైనప్పటి నుంచి ఎలా జీవకళను కోల్పోయిందీ ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ కథనానికి నంది అవార్డుల కమిటీ బంగారు నందిని ప్రకటించింది. సృజనాత్మకతకు మారుపేరు, సామాజిక అంశాలకు ప్రతిబింబంగా రూపొందిన డైలీ మిర్రర్‌కు నంది అవార్డు రావడం, సామాజిక సేవ కోసం టీవీ-5 చేస్తున్న కృషికి అభినందనగా భావిస్తున్నాం. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచినట్లుగా భావిస్తూ సామాజిక అంశాలను, ప్రజల కన్నీటి గాథలను ప్రతిభింబించే కార్యక్రమాలకు పునరంకితమవుతాయని ప్రకటిస్తున్నాం.
Source: www.tv5news.in
Labels:
Telugu
Wednesday, November 10, 2010
2009 టివి నంది అవార్డుల ప్రకటన
2009 టివి నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ టెలీచిత్రంగా విప్రనారాయణ,
ఉత్తమ రెండవ టెలీఫిల్మ్'గా దృష్టి ఎంపికైంది. ఉత్తమ టివీ మెగా సీరియల్'గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఎంపికైంది. ఉత్తమ టివి సీరియల్'గా మొగలిరేకులు, రెండవ ఉత్తమ సీరియల్'గా అభిషేకం, ఉత్తమ పిల్లల సీరియల్'గా ఆశాదీపం ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకురాలి అవార్డు మంజులానాయుడు (మొగలిరేకులు)కి దక్కింది.
ఉత్తమ నటుడుగా సాగర్(మొగలిరేకులు), ఉత్తమ నటిగా వహిదా(విప్రనారాయణ) ఉత్తమ విలన్'గా రవివర్మ(మనసున మనసై..), ఉత్తమ హాస్యనటుడుగా గుండు హనుమంతరావు ఎంపికయ్యారు. ఈ నెల 28న అవార్డులు ప్రదానం చేస్తారు.
Source: www.prajasakti.com
Labels:
Telugu
Tuesday, November 9, 2010
చప్పగా నాచోరే... సరిగమప నువ్వా నేనా?
జీ తెలుగులో ఒకే వారంలో రెండు షోలు బుల్లితెరపై అరంగేట్రం చేశాయి. వారంలో సోమ, మంగళవారం రోజుల్లో రాత్రి 9 గంటలకు ప్రసారంగా ‘నాచోరే’ డాన్స్ షో వస్తే బుధ, గురు రోజుల్లో రాత్రి 9 గంటలకు ‘సరిగమప’ పాటల ప్రోగ్రాం వస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలపట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండదనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ షోలు, పాటల ప్రోగ్రాంలు ఏఛానల్‌కీ కొత్తకాదు. ఊదరగొట్టి వదిలేసాయి. ఒకప్పుడు ఎంతో ఆశక్తి కనబరిచి టెలివిజన్ సెట్ల ముందు టెన్షన్‌గా బైఠాయించే ప్రేక్షకులు ఇప్పుడుఈ షోలకంటే గేమ్ షోలవైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
‘నాచోరే’ ప్రోగ్రాం కాస్త విభిన్నంగా తయారైనా దీనిలో పాల్గొనే తారలందరు మరుగున పడిపోయిన హీరోయినే్ల. పైగా ప్రారంభ ఎపిసోడ్‌లో చూస్తే చాలా ఆచప్పగా వీళ్లు సినిమాల్లో హీరోయిన్లుగా ఎలా నటించారనిపించక మానదు. మా టీవీలో ఈ తరహా డాన్స్ షో గతంలో నడిచింది. దాంట్లో పూనమ్‌బజ్వా వంటి అప్పటికి లేటెస్ట్ హీరోయిన్లు నటించారు. కానీ నాచోరేలో పాపులర్ హీరోయిన్లుగా పేరొందిన వారితోపాటు సరైన గ్లామర్ హీరోయిన్లు లేకపోవడం గమనార్హం ఈ ప్రోగ్రాంకి బలం కాస్త నటి రోజా రూపంలో కనిపిస్తుంది. ఈమె ఈ షోకి జడ్జి. ఇక యాంకరింగ్ చేసే హేమంత్ స్టయిల్ డబ్బాలో గులకరాళ్ల మాదిరి ఉంది. రింగ రింగా డాన్స్‌మాస్టర్ నోవాకు ఇదో స్క్రీన్‌టెస్టులా మారింది.
ప్రోగ్రాం ఓపెనింగ్ సాంగ్ నాచోరే...నాచోరే అతి బలహీనపడిపోయి అది హీరోయిన్ కీర్తిచావ్లా అభినయంలో కనిపించడంతోనే ప్రేక్షకులు ఈ ప్రోగ్రాంపట్ల ఓ అంచనాకు వచ్చేసారు. పైగా ఈ హీరోయిన్లకు కొరియోగ్రాఫ్ చేసేవారు కూడా అన్ ఎక్స్‌పీరియన్స్‌గా వారి డాన్స్‌లో కనిపించారు. నాచోరే ప్రోగ్రాం డిజైన్‌పరంగా కొత్తగా అనిపించినా ఓపెనింగ్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచాయి. మొదట్లోనే ఓ హీరోయిన్ స్టేజిపై అనారోగ్యంతో కుప్పకూలిపోవడం ప్రోమో షాట్స్‌కి శుభారంభంగా నిలిచినట్లయింది. ‘పన్నెండుమంది రాణులు ఒకటే కిరీటం’ అనే క్యాప్షన్‌తో వచ్చిన నాచోరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ ఇంకా బలాన్ని పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేక్షకుల్లో ఓపెనింగ్ నిరాసక్తను తొలగించడానికి నిర్వాహకులు చాలా కష్టపడాలి సుమా! జీ తెలుగులో సరిగమప ఎపిసోడ్స్ అంటే మిగతా చానల్స్‌ని పక్కన పెట్టేసే స్థితి ఉండేది. కానీ ఓంకార్ నిర్వహణలో రూపొందిన సరిగమప ప్రేక్షకుల్లో గందరగోళాన్ని సృష్టించింది. జడ్జీలు, పెద్దమెంటర్లు, బుల్లిమెంటర్లు, యాంకర్లు వంటి గజిబిజితనంతో సరిగమప మసకబారిపోయింది. మళ్లీ చాన్నాళ్ల తరువాత ఈ కార్యక్రమం మొదలై అలరిస్తుందని అనుకుంటే మూసబాటకు తెరతీసింది.
‘సరిగమప నువ్వా నేనా’ అంటూ మళ్లీపాత పార్టిసిపెంట్స్‌ని తెరపైకి తెచ్చారు. వారితోపాటు కొత్తవారికి పోటీపెట్టే దిశగా జతలు కట్టారు. పాటల ప్రోగ్రాం టాలెంట్ హంట్ అంటే వేలాదిగా వచ్చే గాయనీగాయకులుంటారు. అలాంటి వారిని వెతికిపట్టి ప్రోగ్రాం చేయడం కష్టమనుకుంటారో ఏమిటో? గతంలో పాల్గొన్న వారిని విజేతలను పిలిచి కాస్త పాత కొత్త కలయికల్లో ప్రోగ్రాంని చుట్టేయాలని నిర్వాహకుల ఆలోచన ప్రేక్షకులకు ఖచ్చితంగా నీరసం తెప్పిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు మా టీవీ ముందుంటుంది. అందుకే ఆ ఛానల్ నిర్వహించే సూపర్ సింగర్, రేలా..రేలా కార్యక్రమాలు ఎన్ని ఎపిసోడ్‌లు నిర్మించుకున్నా కొత్తదనాన్ని సంతరించుకోలేకపోయాయి. ఈ విషయంలో ఈ టీవీలో పాడుతా తీయగా నిర్వహిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభినందనీయుడు. ఎప్పుటికప్పుడు ఏ ఛానల్‌లోను పాడని కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకువచ్చి ఏవిధమైన కమర్షియల్ హంగు ఆర్భాటాలు లేని ప్రోగ్రాంని అందిస్తాడు. అందుకే ఈ ప్రోగ్రాం పట్ల ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌నెస్ ఫీలవుతారు.
ఒకసారి పూర్తిగా వారి టాలెంట్‌ని వడపోసి జీర్ణించుకున్న ప్రేక్షకులకు మళ్లీ అదే టాలెంట్‌ని వడపోయమనడంతోపాటు బోనస్‌గా కొత్త టాలెంట్‌ని జత చేసినా అంతగా రుచించదు. పైగా ఎన్ని ఎపిసోడ్స్ గడిచినా ఒకటే మోత, ఒకటే పాట అన్నట్టు వుండడంవల్ల ప్రోగ్రాం చప్పబడిపోతుంది. రాధాకృష్ణ, ఎల్‌ఆర్‌ఈశ్వరి, ఉష జడ్జిలుగా గతంలో కనిపించడం కూడా బోరే. సరిగమప నువ్వా నేనాకు ఫ్రెషర్‌గా యాంకర్ ప్రదీప్ మాత్రమే కనిపిస్తున్నాడు. మూస కథలతో సినిమాలను చుట్టేసినట్టే టెలివిజన్ ప్రోగ్రాంలను కూడా చుట్టేయాలనుకుంటే ప్రేక్షకులు రేటింగ్‌ని ఇవ్వరనేది భవిష్యత్ నిర్ణయించే సత్యం.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
బుల్లి తెరపై ‘జీనియస్’ ప్రయోగం??
యాంకర్‌గా మొదలై ప్రోగ్రామ్ మేకర్‌గా ముద్రపడి అందరిచేతా బుల్లితెర అన్నయ్యగా పిలవబడే ఓంకార్ జీనియస్? అని ప్రశ్నించుకుంటే కొంతవరకు ఔననే చెప్పాలి. జెమిని ఛానల్‌లో సాధారణంగా యాంకర్‌గా వుండే ఓంకార్‌కి జీ తెలుగు మంచి ప్లాట్‌ఫారమ్‌గా దొరికింది. వెనుదిరిగి చూసుకోలేనంతగా క్రేజ్‌ని ఇచ్చింది. ఆట ప్రోగ్రాంను స్టార్ట్ చేసి వరసగా ఐదు సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించినా ‘ఆట జూనియర్స్’ ఎంత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో అంతే వివాదాలను అంటగట్టింది. మొత్తానికి ఆట-5 జూనియర్స్ అయ్యిందనిపించి చేతులు దులుపుకున్నాడు.
ఆట ప్రోగ్రాంతోపాటు ‘మాయాద్వీపం’ కూడా కొంతకాలం నడిపించాడు. మా టీవీలోకి ప్రవేశించి ‘ఛాలెంజ్’ అంటూ టాన్స్ షోను ‘అదృష్టం’ అంటూ గేమ్ షోను ప్రారంభించాడు. అనతికాలంలోనే అదృష్టం దురదృష్టంగా ముగించాల్సి వచ్చింది. కోడి కోడిపిల్లలు కథలా ఇప్పటివరకు తన షోలలో పాల్గొన్న వారిని వెంటబెట్టుకుని మాయాద్వీపం, అదృష్టం, ఆట, ఛాలెంజ్‌లను నడిపించిన ఓంకార్ కొత్త టాలెంట్‌ని సెర్చ్ చేస్తూ ‘జీనియస్’ అనే సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో కోడిపిల్లలకు అవకాశం మాట ఎలా వున్నా కొత్త టాలెంట్ హంట్ మాత్రం పూర్తి చేసి బుల్లితెరపై వెండితెర స్క్రీన్ టెస్ట్ ప్రారంభించాడు.
ఏడుపులు, పెడబొబ్బలు, ఓదార్పులు, వార్నింగ్‌లు, నిష్క్రమణలు, పునఃప్రవేశాలు వంటివి ఓంకార్ షోలలో కామన్‌సీన్లు. ఇది నిజమా? అనేంతగా ప్రోమోలలో చూపించడం ఓంకార్ సక్సెస్‌కి కారణం. ఒకటిరెండుసార్లు ప్రేక్షకులు ప్రోమోలు చూసి నివ్వెరబోయి ఎప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని కాచుకుకూర్చున్నా రానురాను ఇదంతా స్టంట్ అనే స్థాయికి రావడంతో ఆట-5 కాసంత ప్రేక్షకాదరణలో నీరుగారింది. ఇప్పుడు మళ్లీఇలాంటి స్టంట్ టీవీ-9 మీడియా పార్టనర్ సాక్షిగా జీనియస్ సినిమా నటుల సెలక్షన్ విషయంలో ఓంకార్ చేస్తున్నాడు. ఎపిసోడ్‌లుగా చేసి మరీ ప్రేక్షకులకు అందిస్తున్నాడు. బుల్లితెరనుండి వెండి తెరకు ప్రమోట్ కావడమనేది అందరికీ తెలిసిందే! అందుకే బుల్లితెరపై తనకున్న ఇమేజ్‌ని ఉపయోగించుకుని అదేపంథాలో జీనియస్ సెలక్షన్స్ కూడా చేస్తున్నాడు.
నరసింహా, ఇంద్ర వంటి అగ్ర హీరోల చిత్రాలకు కథలు అందించిన చిన్నికృష్ణ జీనియస్ సినిమాకు కథను అందించడం చెప్పుకోదగ్గ విషయం. ఇక బుల్లితెర అన్నయ్య వెండితెరపై ఇదే హైపుతో విజయాన్ని అందుకోవాలని ఆరాటపడడం జీనియస్ స్పెషల్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తుంది. అయితేఈ ప్రక్రియ కొత్తదేమీ కాదు. గతంలో ఓ ఛానల్‌లో దర్శకుడు తేజ ఇలాంటి ప్రక్రియనే వారాల తరబడి నడిపాడు. ఫ్లాపులను మూటగట్టుకున్న తరుణంలో విజయంకోసం ఈ పంథాను అనుసరించి నటీనటులను సెలక్టు చేసి వారిని వెండితరకు ‘విచిత్రం’ సినిమాతో పరిచయం చేసినా ఫలితం దక్కలేదు.
ఇంకాస్త ముందుకి పోతే రాఘవేంద్రరావు ‘పరదేశి’ సినిమాకోసం ఈ విధమైన సెలక్షన్లనే జరిపాడు.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
Monday, November 8, 2010
‘సరిగమప’ స్వరాన్వేషణ?
ఏ క్షణాన్నయితే ‘పాడుతా తీయగా’ ఈటీవీలో ఆరంభించారో గానీ (అసలు పాడుతా తీయగా’..నే ప్రాచుర్యం పొందిన జీ ఛానల్ హిందీ ‘సరిగమప’ స్ఫూర్తితో తయారైనది) దాదాపు అన్ని ఛానల్స్‌లోనూ ఆ బాపతు స్వరానే్వషణ ఔత్సాహికుల్లో అవిరామంగా జరిగిపోతోంది. అయితే ‘సంగీతం’ ప్రధాన లక్ష్యమైన ఆహ్లాదతను వీడి స్వర ‘సంగ్రామం’ తదితర యుద్ధ వాతావరణాన్ని ఇవి పెంచి పెద్ద చేయడం చూస్తున్నాం. ఇది వైవిధ్యం కోసమో, ప్రోగ్రామ్‌లో మొనాటనీని తొలగించడానికి అనుసరిస్తున్న పోకడైనా ఈ తరహా నచ్చని ప్రజానీకమూ ఉన్నారు. ఇలా రకరకాల దారులు యధేచ్చగా చుట్టి వచ్చిన గళానే్వషణ కార్యక్రమం జీ తెలుగులో ‘సరిగమప-నువ్వా-నేనా’ పేరుతో అక్టోబర్ 27న ఆరంభమైంది.
ఏదీ కొత్త రూపు?
పేరుకీ, ప్రచారానికీ, కొత్త రూపు అని అర్ధం వచ్చేలా బిల్డప్ జరిగినా ఆ మాదిరి లక్షణాలేవీ ప్రారంభంలోనే గోచరించలేదు. ఒకరొకరుగా వచ్చి పాడడం, వారికి జోడీగా ఇంకో గాత్రాన్ని ఎంచుకోవడం, వారిరువురూ కలిసి పాడడం- అలా పాడిన వాళ్లలో ఎవరు విజేతో తేల్చడం అన్నదిప్పటి వరకు జరిగినదాన్నిబట్టి అర్ధమైన సంగతి. ఇది గతంలో వచ్చిన స్వర పోటీల్లో అవలంబించిన డ్యూయట్ రౌండ్ లాంటిదే గదా...
ఈ ప్రాతిపదిక సరైనదేనా?
ఇక అన్నిటికంటే ముఖ్యమైంది ఎన్నికవుతున్న జోడీల్లో పాల్గొంటున్న అభ్యర్థుల వయస్సులో చాలా తేడా ఉండడం. అయితే గంలో జీ తెలుగు చానలే నిర్వహించిన పాటలపోటీల్లో నెగ్గిన విజేతల బృందంతో ఇప్పుడొచ్చిన కొత్తవాళ్లు పోటీపడడం అన్న కానె్సప్టు పెట్టుకున్న తర్వాత ఇలాంటి వ్యత్యాసాలు అనివార్యం అని భావించాలా? కానీ అంతిమంగా ఈ తరహా ఎక్కువ వయసు వ్యత్యాసాల ద్వారా వెల్వడే గళాలమధ్య పోటీ న్యాయాత్మకంగా ఉండదు. ఎందుకంటే గొంతు అనేది ముఖ్యంగా స్వర విన్యాసంలో తీవ్రమైన అంతరాలు వయోపరంగా వస్తాయి.
ఇది గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌లో న్యాయ నిర్ణేతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ కూడా వయసునుబట్టి, అనుభవాన్నిబట్టి ఎంచుకున్న పాటలో వివిధ స్వరగతులను అనుసరించి గాలిని నియంత్రించి పాడే తీరు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి ముందు ముందు భాగాల్లో జరిగే పోటీల్లో ఈ ప్రథాన అడ్డంకిని అధిగమించడానికి కార్యక్రమం ఏం చేస్తుందో చూద్దాం.
పాటల ఎంపికకు సూచనివ్వచ్చుగా...
ఇక పాటల ఎంపికలో ఎవరి స్వేచ్ఛ వారిదైనా, ఇది కార్యక్రమ నిర్వాహకులే పదే పదే చెప్పినట్టు లక్షలాది, కోట్లాది సంగీతాభిమానులు వీక్షించేది కనుక కాస్త సమంజసత ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు వినపడ్డ కొన్ని పాటల్లో ఆ లక్షణానికి దూరంగా ఉన్నవీ ఉన్నాయి. ఉదాహరణకు చిన్నారులిద్దరు పాడిన పాట ‘ఆకుచాటు పిందె తడిసే’, మరో గాయనీ గాయకుల జంట పాడినపాట ‘రాఖీ..రాఖీ..రాఖీ..నా కవ్వాసాకీ’ ఎవరి అభిరుచి వారిదైనా, అందరి అనిరుచులనీ అలరించే మరీ ముఖ్యంగా మనం పైన అనుకున్న సంస్కార, సమంజసతలకు ద ర్పణంగా నిలవాలి. ఇంకా విచారకరమేమిటంటే రెండవ పాటగా ఉదహరించిన పాట ‘రాఖీ’ని ఆలపించిన చిన్నారి వయసు ఎనిమిదేళ్లు. కొసమెరుపుగా ఆ పాటలో వచ్చే ఒక హమ్మింగ్‌కి తెగమురిసిపోయి న్యాయనిర్ణేతల్లో ఒకరు మళ్లీ మళ్లీ పాడించుకున్నారు. ఈ పాటల్ని కార్యక్రమ వ్యాఖ్యాత చమక్ చమక్..్ఢమరే పాటలుగా అభివర్ణించారు. సరే..మరీ అంతగా వాళ్లనుకునే హుషారుగీతాలు అనుకుంటే సభ్యతా పరిమితులకు లోబడిన అనేక పాటలున్నాయి. అవి ఆ ఔత్సాహిక గళాలకు తట్టకపోతే అనుభవజ్ఞులైన కార్యక్రమ నిర్వాహకులు సూచన చెయ్యొచ్చు.
హుందా వ్యాఖ్యానాలు కావాలి
ఇక ఈ కార్యక్రమానికి ఇద్దరు వ్యాఖ్యాతలున్నారు. మిగతా కార్యక్రమాల వ్యాఖ్యానాలకీ, ఈ మోడల్ పాటల ప్రోగాం యాంకరింగ్‌కీ తేడా వుంటుంది. ఆ భేదాన్ని ఇక్కడ పాటించినట్టులేదు. భాష దగ్గరనుంచీ, భావ ప్రకటన వరకూ హుందాతనం తప్పనిసరి. అది కొంతమేరకు ఇందులో లోపించినట్టే కనపడుతోంది. మిగతా యాంకరింగ్‌లో కనపడే అరుపులు, వగైరా ఇందులోనూ ఉన్నాయి. ‘అదుర్స్, సూపర్, సూపరూ, పాటేసుకో లాంటి పద ప్రయోగాలూ దొర్లుతున్నాయి. అంతకు మించి పురుష యాంకరు చేసే నంగి నంగి వ్యాఖ్యానాలతో కూడిన అభినయమూ దర్శనమిస్తోంది. ఇది తక్షణం పరిహరించాలి.
ఇంకా వారనుకునే ‘సంగ్రామం’ సమతుల్యత తెలియడానికి రాబోయే భాగాలు చాలా ఉన్నాయి కనుక వాటి విషయాల్లో పరిహరించదగ్గవి పరిహరిస్తే కార్యక్రమం అందరి మన్ననలు పొందుతుంది.
Source: www.andhrabhoomi.net
Labels:
Telugu
Subscribe to:
Posts (Atom)



