Thursday, November 11, 2010

2009 టివి నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ ప్రతినిధి: 2009 సంవత్సరానికి గాను “”నంది టివి ఫిల్మ్‌ ఆవార్డు’’లను రాష్ట్ర ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి) ప్రకటించింది. అవార్టుల కోసం మొత్తం 215 ఎంట్రీలు రాగా, 65 ఎంట్రీలు ఎంపికయ్యాయి. డిసెంబర్‌ 11న నిర్వహించే ఓ కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేయాలని భావిస్తున్నట్లు అవార్డుల కమిటీ వెల్లడించింది. అలాగే నంది ఫిల్మ్‌ అవార్డులను ఈనెల 28న ప్రదానం చేయినట్లు ఆ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటైన మీడియా ప్రతినిధుల సమావేశంలో సమాచార శాఖ కమీషనర్‌ సి.పార్థసారథి, అవార్టుల కమిటీ సభ్యులతో కలిసి నంది టివి ఫిల్మ్‌ అవార్డు కమిటీ ఛైర్మన్‌ వడ్డెపల్లి కృష్ణ మాట్లాడారు.. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు అవార్డులు ఎంపిక స్క్రీనింగ్‌ను నిర్వహించి, ముఖ్యమంత్రి కె.రోశయ్యకు తుది నివేదిక సమర్పించామని ఆయన చెప్పారు. ఈ ఏడాది అవార్డుల కోసం దరఖాస్తు చేసే ఎంట్రీల సంఖ్య పెరిగిందని, కొత్తగా న్యూస్‌ రీడర్స్‌ కూడా అవార్డులు ప్రదానం చేస్తునట్లు ఆయన చెప్పారు. నంది టివి ఫిల్మ్‌ అవార్డుల కోసం టెలిఫిల్మ్‌ విభాగంలో 35 ఎంట్రీలు, టివి ఫిచర్స్‌ విభాగంలో 41 ఎంట్రీలు, టివి మెగా సీరియల్స్‌ విభాగంలో 8 ఎంట్రీలు, టివి డైలీ సీరియల్స్‌ విభాగంలో 19, టివి బాలల చిత్రాల విభాగంలో 6 ఎంట్రీలు, టివి డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ విభాగంలో 24 ఎంట్రీలు, టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌ విభాగంలో 25 ఎంట్రీలు, టివి విద్యా విషయక విభాగంలో 27 ఎంట్రీలు, టివి న్యూస్‌ రీడర్‌ అవార్డుల విభాగంలో 30 ఎంట్రీలు వచ్చాయని ఆయన చెప్పారు. సమాచార శాఖ కమీషనర్‌ సి.పార్థసారథి మాట్లాడుతూ, 6 సంవత్సరాల నుండి టివి రంగంలో నంది అవార్డులను ప్రదానం చేస్తున్నామని చెప్పారు. టివిలో ప్రసారమయ్యే ఉత్తమ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకే ఈ అవార్డులను ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నంది టివి ఫిల్మ్‌ అవార్డుల కమిటీ సభ్యులు సి.ఉమామహేశ్వరరావు, సత్యయాబి, సి.జె.రెడ్డి, పద్మావతి, కె.దీపికారెడ్డి, పి.వి.రామ్మోహన్‌ నాయుడు, తోట వెంకట రమణ, బి.శ్రీధర్‌, శిల్ప చక్రవర్తి, ఐనంపూడి శ్రీలక్ష్మి, గాజోజు నాగభూషణం, యండమూరి అనుగీత, డాక్టర్‌ డివిఎన్‌ రాజు, ఎంకెఆర్‌ ఆశాలతలు పాల్గొన్నారు.
టెలిఫిల్మ్స్‌ విభాగంలో
విప్రనారాయణ (ఉత్తమ తొలి టెలిఫిల్మ్‌
దృష్టి (ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్‌)
టివి ఫీచర్స్‌ విభాగంలో
వావ్‌.. (ఉత్తమ తొలి టివి ఫీచర్‌)
ఇది అసలు కథ (ద్వితీయ ఉత్తమ టివి ఫీచర్‌)
టివి మెగా సీరియల్స్‌ విభాగంలో
శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (ఉత్తమ తొలి టివి మెగా సీరియల్‌)
శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం (ఉత్తమ ద్వితీయ టివి మెగా సీరియల్‌)
టివి డైలీ సీరియల్స్‌ విభాగంలో
మొగలి రేకులు (ఉత్తమ తొలి టివి డైలీ సీరియల్‌)
అభిషేకం (ఉత్తమ ద్వితీయ టివి సీరియల్‌)
టివి బాలల ఫిల్మ్‌ విభాగంలో
ఆశాదీపం (ఉత్తమ తొలి టివి బాలల ఫిల్మ్‌)
ఓ చిన్న ప్రయత్నం (ఉత్తమ ద్వితీయ టివి బాలల ఫిల్మ్‌)
టివి డాక్యుమెంటరీ ఫిల్మ్‌ విభాగంలో
చెర్యాల కళాకృతులు (ఉత్తమ తొలి టివి డాక్యుమెంటరీ ఫిల్మ్‌)
అమృత వర్షిణి (ఉత్తమ ద్వితీయ టివి డాక్యుమెంటరీ ఫిల్మ్‌)
టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌ విభాగంలో
డైలీ మిర్రర్‌ (ఉత్తమ తొలి టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌)
దుర్గ (ఉత్తమ ద్వితీయ టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌)
టివి విద్యావిషయక ఫిల్మ్‌ విభాగంలో
అద్బుత చిరుధాన్యాలు (ఉత్తమ తొలి టివి విద్యావిషయక ఫిల్మ్‌
భవాణి (ఉత్తమ ద్వితీయ టివి విద్యావిషయక ఫిల్మ్‌)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ విభాగంలో
యామిని (శ్రీ వైనతేయం)
జీవితమే నాటకం (దూరదర్శన్‌ డైరెక్టర్‌)
సాయికుమార్‌ (వావ్‌.. యాంకర్‌)
కోమలి సిష్టర్స్‌ (నవ్వులాట)
దేవీ నాగవల్లి (న్యూస్‌ రీడర్‌)
న్యూస్‌ రీడర్స్‌ విభాగంలో
పి.కిరణ్‌ కుమార్‌ (ఉత్తమ పురుష టివి న్యూస్‌ రీడర్‌)
జి.రాణి రుద్రమ(ఉత్తమ మహిళా టివి న్యూస్‌ రీడర్‌)
వ్యక్తిగత అవార్డుల విభాగంలో
మంజుల నాయుడు (బెస్ట్‌ డైరెక్టర్‌, మొగలి రేకులు సీరియల్‌)
సాగర్‌ (అత్యుత్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ లీడింగ్‌ యాక్టర్‌, మొగలిరేకులు సీరియల్‌)
వహీదా (ఉత్తమ లీడింగ్‌ నటి, విప్రనారాయణ)
హరి (ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర)
రూపా దేవి (ఉత్తమ సపోర్టింగ్‌ నటి, తీరం)
గుండు హనుమంతరావు (ఉత్తమ హాస్య నటుడు, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం)
రవివర్మ (ఉత్తమ విలన్‌, మనసున మనసై)
మాస్టర్‌ విజయ్‌ (ఉత్తమ బాల నటుడు, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర)
బేబి వి.పూజ్యస్వాని (ఉత్తమ బాలనటి, నాగేశ్వరి)
వి.యజువేంద్ర(ఉత్తమ తొలి ఫిల్మ్‌ దర్శకుడు, భక్త అంబారిష)
రఘు కాపుగంటి, ఎం.శేషుకుమార్‌ (ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌, అంత:పురం)
డి.కామేశ్వరి (ఉత్తమ కథా రచయిత, మనసున మనసై)
గోవిందరాజుల నాగేశ్వరరావు (ఉత్తమ మాటల రచయిత, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం)
డాక్టర్‌ మంగళగిరి పూర్ణచంద్‌ (ఉత్తమ లిరిక్‌ రైటర్‌, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
పి.వెంకటరమణ (ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌, శ్రీ వైనతేయం)
రాధ -గోపి (ఉత్తమ సంగీత దర్శకుడు, భక్తపోతన)
మనో (ఉత్తమ పురుష ప్లేబ్యాక్‌ సింగర్‌, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేందరస్వామి చరిత్ర)
పి.ఆర్‌.కౌసల్య (ఉత్తమ మహిళా ప్లేబ్యాక్‌ సింగర్‌, ఆడదే ఆదారం)
కె.నరశింహరెడ్డి (ఉత్తమ ఎడిటర్‌, డాక్టర్‌ చక్రవర్తి)
అడ్డాల పెద్దిరాజు (ఉత్తమ కళా దర్శకుడు, రేలారే రేల)
శివారెడ్డి (ఉత్తమ పురుష యాంకర్‌, కామిడీ గ్యాంగ్‌)
సుమ (ఉత్తమ మహిళా యాంకర్‌, పంచావతారం)
వై.బి.వెంకటేశ్వరరావు (ఉత్తమ పురుష డబ్బింగ్‌ కళాకారుడు, రంతీదేవుడు)
లెనినా చౌదరి (ఉత్తమ మహిళా డబ్బింగ్‌ కళాకారిణి, చంద్రముఖి)
సుంకర సతీష్‌ (ఉత్తమ ఆడియోగ్రాఫర్‌, చక్రధారి)
వి.తిరుమలేశ్వరరావు (ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌, మండోదరి)
దేవేంద్ర కుమార్‌ (ఉత్తమ మేకప్‌ కళాకారుడు, సతీతులసి)
రే యానిమేషన్స్‌ (ఉత్తమ గ్రాఫిక్స్‌, శ్రీ వైనతేయం)

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment