హైదరాబాద్, నవంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నంది టివి అవార్డుల్లో 2009 సంవత్సరానికి మెగా సీరియల్ ‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వివిధ విభాగాల్లో ఐదు అవార్డులు గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచింది. తొమ్మిది క్యాటగిరీల్లో 215 ఎంట్రీలు రాగా, 68 అవార్డులను ప్రకటించారు. ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ చైర్మన్‌గా వ్యవహరించిన కమిటీలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. రాష్ట్ర చలనచిత్ర, టివి, రంగస్థల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సి. పార్థసారథి ఈ కమిటికి మెంబర్ కన్వీనర్‌గా పనిచేశారు. 2009 టివి అవార్డులను బుధవారం ఇక్కడ ప్రకటించారు. కమిటి చైర్మన్ వడ్డేపల్లి కృష్ణతో పాటు సభ్యులు పి.వి. రాంమోహన్‌నాయుడు, సి. ఉమామహేశ్వరరావు, ఎం.పద్మావతి, కె. దీపిక, శిల్పచక్రవర్తి, శ్రీలక్ష్మి, సత్యం, సి.జె.రెడ్డి, డాక్టర్ డివిఎన్ రాజు తదితరులు అవార్డుల ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తమ టెలిఫిల్మ్‌గా ‘విప్రనారాయణ’, ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్‌గా ‘దృష్టి’ ఎంపికయ్యాయి. టివి ఫ్యూచర్ ఫిల్మ్‌లలో ఉత్తమ టివి ఫ్యూచర్‌గా ‘వావ్’, ద్వితీయ ఉత్తమ టివి ఫ్యూచర్‌గా ‘ఇదే అసలు కథ’ ఎంపికయ్యాయి. మెగా సీరియళ్లలో ఉత్తమ మెగా సీరియల్‌గా ‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, ద్వితయ టివి మెగా సీరియల్‌గా ‘శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యం’ ఎంపికయ్యాయి. టివి డెయిలీ సీరియళ్లలో ప్రథమ ఉత్తమ సీరియల్‌గా ‘మొగలిరేకులు’, ద్వీతీయ ఉత్తమ సీరియల్‌గా ‘అభిషేకం’ ఎంపికయ్యాయి. టివి పిల్లల చిత్రాల్లో ప్రథమ టివి పిల్లల ఫిల్మ్‌గా ‘ఆషాడదీపం’, రెండవ ఉత్తమ పిల్లల చిత్రంగా ‘ఓ చిన్న ప్రయత్నం’, డాక్యుమెంటరీల్లో ప్రథమ బహుమతి ‘చేర్యాల కళాకృతులు’, ద్వితీయ బహుమతి ‘అమృత వర్షిణి’కి లభించాయి. సామాజిక స్పృహ కలిగిన చిత్రాల విభాగంలో ప్రథమ బహుమతి ‘డెయిలీ మిర్రర్’కు, ద్వితీయ బహుమతి ‘దుర్గ’కు లభించాయి. టివి ఎడ్యుకేషన్ చిత్రాల విభాగంలో ప్రథమ బహుమతి ‘అద్భుత చిరుధాన్యాలు’కు, ద్వితీయ బహుమతి ‘్భవాని’కి లభించాయి. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో వ్యక్తిగతంగా యామిని (శ్రీ వైనతేయం), డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం (జీవితమే నాటకం), సాయికుమార్ (వావ్), కోమలి సిస్టర్స్ (నవ్వులాట), దేవి నాగావళి (న్యూస్‌రీడర్) కి లభించాయి. న్యూస్ రీడర్ అవార్డులు పురుషుల విభాగంలో పి. కిరణ్‌కుమార్, మహిళల విభాగంలో జి. రాణిరుద్రమకు లభించాయి. వ్యక్తిగత కళాకారులకు ఇచ్చే అవార్డుల్లో మంజులా నాయుడు (ఉత్తమ డైరెక్టర్-మొగలిరేకులు), సాగర్ (బెస్ట్ లీడింగ్ యాక్టర్-మొగలిరేకులు), వహీద (బెస్ట్ లీడింగ్ యాక్టరెస్-విప్రనారాయణ), హరి (ఉత్తమ సహాయ నటుడు-శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), రూపాదేవి (ఉత్తమ సహాయ నటి-తీర్థం), గుండు హన్మంతరావు (ఉత్తమ హాస్యనటుడు), రవి వర్మ (ఉత్తమ విలన్-మనసున్న మనిషి), వి. యజువేంద్ర (ఉత్తమ చిత్ర దర్శకుడు-భక్త అంబరీష), రఘు కాపుగంటి, ఎం. శేషుకుమార్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-అంతఃపురం), డి. కామేశ్వరి (ఉత్తమ కథా రచయిత-మనసున్న మనిషి), గోవిందరాజులు నాగేశ్వరరావు (ఉత్తమ మాటల రచయిత-శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యం), డాక్టర్ మంగళగిరి పూర్ణచంద్ (ఉత్తమ పాటల రచయిత-శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), పి. వెంకటరమణ (ఉత్తమ సినిమాటోగ్రాఫర్-శ్రీవైనతేయం), రాధా-గోపి (ఉత్తమ సంగీత డైరెక్టర్-్భక్తపోతన), మనో (ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్-శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), పి.ఆర్. కౌసల్య (ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్-ఆడదే ఆధారం), కె. నర్సింహారెడ్డి (ఉత్తమ ఎడిటర్-డాక్టర్ చక్రవర్తి), ఆదాల పెద్దిరాజు (ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్-రేలారే రేలా), శివారెడ్డి (ఉత్తమ పురుష యాంకర్-కామెడీ గ్యాంగ్), సుమ (ఉత్తమ మహిళా యాంకర్-పంచావతారం), వై.బి. వెంకటేశ్వరరావు (ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్-రంతి దేవుడు), లెనీనా చౌదరి (ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్-చంద్రముఖి), సుంకర సతీష్ (బెస్ట్ ఆడియోగ్రాఫర్-చక్రదారి), వి. తిరుమలేశ్వరరావు (ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్-మండోదరి) , దేవేంద్ర కుమార్ (ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్-సతీ తులసి), రాయ్ ఎనిమేషన్స్ (ఉత్తమ గ్రాఫిక్స్-శ్రీవైనతేయం)కు లభించాయి. 2009 టివి నంది అవార్డులను ఈ ఏడాది డిసెంబర్ 11న ఇవ్వాలని తాత్కాలికంగా నిర్ణయించామని సి. పార్థసారథి ప్రకటించారు. నంది సినిమా అవార్డులను ఈనెల 28న ఇస్తామని తెలిపారు.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment