* బెస్ట్ సోషల్ రిలవెంట్ కేటగిరిలో అవార్డు
టీవీ ఫైవ్ ప్రసారం చేస్తున్న డైలీ మిర్రర్‌కు బంగారు నంది అవార్డు లభించింది. సమకాలీన అంశాలపై ప్రత్యేక కథనాల సమాహారమే డైలీ మిర్రర్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తిలకించిన నంది అవార్డు కమిటీ బెస్ట్ సోషల్ రిలవెంట్ ఫిల్మ్ కేటగిరీ కింద అవార్డును ప్రకటించింది.
సామాజిక, సమకాలీన అంశాలను కళ్లకు కట్టినట్లు సవివరంగా అందించే ఉద్దేశంతో టీవీ-5 డైలీమిర్రర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో పలు సామాజిక అంశాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రతీరోజు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసారమవుతోంది. ఈ మధ్యనే 200 ఎపిసోడ్స్ పూర్తిచేసుకున్న డైలీ మిర్రర్ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగానే సింగరేణి ఓపెన్‌కాస్ట్ బాధితుల కన్నీటి కథలను నిప్పురవ్వ శీర్షికన టీవీ-5 ప్రసారం చేసింది.
ఓపెన్ కాస్ట్ మైన్స్ రాకముందు కళకళలాడే గ్రామాలు బ్లాస్టింగ్ మొదలైనప్పటి నుంచి ఎలా జీవకళను కోల్పోయిందీ ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ కథనానికి నంది అవార్డుల కమిటీ బంగారు నందిని ప్రకటించింది. సృజనాత్మకతకు మారుపేరు, సామాజిక అంశాలకు ప్రతిబింబంగా రూపొందిన డైలీ మిర్రర్‌కు నంది అవార్డు రావడం, సామాజిక సేవ కోసం టీవీ-5 చేస్తున్న కృషికి అభినందనగా భావిస్తున్నాం. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచినట్లుగా భావిస్తూ సామాజిక అంశాలను, ప్రజల కన్నీటి గాథలను ప్రతిభింబించే కార్యక్రమాలకు పునరంకితమవుతాయని ప్రకటిస్తున్నాం.
Source: www.tv5news.in
No comments:
Post a Comment