న్యూఢిల్లీ: సాక్షి మీడియాలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తల పై ఏఐసిసి తీవ్రంగా మండిపడుతోంది. అయితే తమకు ఇంతవరకు ఆ కథనాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. నివేదిక అందిన తర్వాతే చర్యలుంటాయన్నారు. సమగ్ర నివేదిక అందించాల్సిందిగా పిసిసిని ఏఐసిసి కోరింది. నివేదిక అందిన తర్వాతనే షోకాజ్ నోటీసుపై నిర్ణయముండే అవకాశముంది. పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ వెంటనే అధిష్టానానికి నివేదిక పంపినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సోనియాగాంధీదేనని అన్నారు. కాగా జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం లేదని గోనె ప్రకాశరావు ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన క్షమాపణలు కోరే అవకాశముందన్నారు.
Source: www.teluguone.com
ఆగ్రహం వ్యక్తం చేయడంతప్ప ఏమీ చేయలేరు,అంతకుమించి చేస్తే వాళ్ళకే ఇబ్బందికదా!
ReplyDeleteరాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సోనియాగాంధీదేనని అన్నారు. /ANTE YSR OKA TOLUBOMMAA..?AYANA KASTAPADINDI EMI LEDAA..?WATT A COMEDY STATEMENT..?
ReplyDelete