Wednesday, July 13, 2011

వీక్షకుల తీర్పు

హాయిని గొలిపే..
ప్రతి సోమవారం రాత్రి 9.30 ని.లకు ప్రసారమవుతున్న ‘పాడుతా తీయగా..’ ఎంతో హాయిని గొలుపుతోంది. అంతా తానై అన్నిటా తానై స్వరాల తప్పొప్పులను సరిచేస్తూ చిరుగళాల సంగీత సాహిత్య విన్యాసాలకు ఆలంబనగా నిలుస్తూ బాలు ఈ కార్యక్రమాన్ని రంజింపజేస్తున్నారు. ఎవరినీ ఎక్కడా నొప్పించకుండా కార్యక్రమాన్ని రక్తి కట్టించే విధానం బాగుంటోంది. కొత్త టెండర్లను పిలుస్తున్నారు. సంతోషం. ఈ సిరీస్‌లో అయినా అన్నీ కొత్త ముఖాలు, కొత్త గళాలు, కొత్త ప్రయత్నాలు సాగుతాయని ఆశిస్తున్నాం. వచ్చే సిరీస్‌లో సీనియర్లను ఆపి అంతా జూనియర్లతో సంగీత యుద్ధం చేయిస్తే చూడాలని ఉంది.
-కొంగర ఉమామహేశ్వరరావు (చెంచుపేట)

ఒకే ఒక్క ఛానల్
ఛానల్ పేరుతోపాటుగా ‘తెలుగు’ అని అక్షరాలలో వేసే ఒకే ఒక్క ఛానల్ ‘జీ తెలుగు’ ఛానల్ మాత్రమే. వీరిదే అయిన జీ వార్తా ఛానల్ పేరుతోపాటుగా ‘24 గంటలు’ అని తెలుగు అక్షరాలలో వేస్తున్నారు. జీ ఛానల్ యాజమాన్యం తెలుగు వారిది కాకపోయినా ‘తెలుగు’ అని పేర్కొంటున్నారు. కాని తెలుగువారి యాజమాన్యాలలో ఉన్న తెలుగు ఛానెళ్ల లోగోలతోపాటు ‘తెలుగు’ అని పేర్కొనే ఛానల్ ఒక్కటి కూడా లేదు. 
-ఎన్.మధుసూదనరావు (హైదరాబాద్)

Source: www.andhrabhoomi.net

శ్రీరస్తు - శుభమస్తు...

‘పెళ్ళి..’ ఈ రెండక్షరాల మాట వింటేనే చాలు ఎలాంటి ప్రవృత్తిగల మనిషైనా కాసేపు ఫ్లాష్‌బ్యాక్‌లోకి వెళ్లిపోతాడు. ఇలా గతంలోకి వెళ్లడం పెళ్లైన వాళ్లు చేసే పని. పెళ్లి కానివాళ్లయితే కాబోయే కల్యాణం గురించి కలలు కంటూ ఉంటారు. ఇలా మానవ జీవితంలో దాదాపు అందరితో మమేకమై పోయిన ఈ మహత్తర అంశాన్ని ఆలంబనగా తీసుకుని ‘పెళ్లి పుస్తకం’ పేరిట మాటీవీలో ప్రతి ఆదివారం ఉదయం పది గంటలకు ఓ కార్యక్రమం ప్రసారం చేస్తోంది. ఇందులో ప్రతి వారం ఓ ప్రముఖుని పెళ్లి ముందు, అనంతర అనుభవాల్ని వారి జీవిత భాగస్వామితో కలిపి ప్రేక్షకులతో ముచ్చటించడం జరుగుతోంది. ఈ పద్ధతి అధిక శాతం చూపరుల్ని ఆకట్టుకుదేనైనా, దీనికి మరింత వ్యక్తిగత నైపుణ్యం జోడిస్తే ఇంకా వీక్షకులకి చేరువయ్యే అవకాశం ఉంది.

వివిధ విభాగాలు
కార్యక్రమ తీరు ప్రకారం ‘కల్యాణ తాంబూలాలు’ శ్రీరస్తు - శుభమస్తు, పెళ్లైన కొత్తలో, తర్వాత సంఘటనల భాగాలతో ఉంటుంది. ఎవరైనా సరే.. తమతమ జీవితాల్లో ఉన్న మధురమైన ఘట్టాలనే గుర్తు చేసుకోడానికి ప్రయత్నిస్తారు. కాస్త అరుచికరమైన అనుభూతైనా సరే.. బహిర్గతపరచడానికి మానవ నైజం ఒప్పుకోదు. ఇందులోనూ అంతే. అయితే కొంత వైవిధ్యంగా వాటినీ ఇందులో స్పృశించే దిశగా పాక్షికంగా సాగింది. ఇది వారి జీవితంలోని సున్నితమైన అంశాల్లోకి తొంగి చూడటం ప్రేక్షకుల ఉద్దేశం కాకపోయినా అలాంటి సందర్భాలు వీరికొస్తే ఎలా చలిస్తే అనుకూల ఫలితాలు వస్తాయి అన్న దానికి ఇది ఓ సూచిక అవుతుంది. ఈ కార్యక్రమ పరంపరలో ఈ మధ్య ప్రముఖ దర్శకుడు బి.గోపాల్, మిమిక్రీ కళాకారులు హరికిషన్ దంపతులు పాల్గొన్నారు. ఇద్దరూ జన సామాన్యానికి తెలిసినవారే. కానీ బి.గోపాల్ వారి సమకాలీన దర్శకుల్లా ఎక్కువగా తెర ముందుకు వచ్చే వ్యక్తి కాదు కనుక, ఆయన జీవితంలో వచ్చిన వెలుగునీడలు చర్చించడం కాస్త కొత్త. ఇద్దరి ప్రముఖుల జీవితాల్లోనూ వారివారి రంగాల్లో పైకి రావడానికి సతీమణులు ఇచ్చిన తోడ్పాటు సహజమైనదే అయినా ప్రత్యామ్నాయం కోసం వెతుకులాడక పరిస్థితులకు వెరవకుండా ముందుకెళ్లడం అభినందనీయం. ముఖ్యంగా హరికిషన్ కొచ్చిన ఆరోగ్యపర ఇబ్బందికి సకాలంలో తానున్నానని ముందు వెనుకలు చూడకుండా వారి భార్య ప్రొసీడవడం మార్గదర్శకంగా అనిపించింది. ఇది ఊరికి ఉపకారం కాకపోయినా సకాల ఆచరణ అని మాత్రం చెప్పవచ్చు.

ఓవర్ యాక్షన్ తగ్గిస్తే..
కార్యక్రమంలో చెప్పేవారు అరమరికలు లేకుండా (హరికిషన్ విషయంలో అసలు కన్నా నాటకీయత ఎక్కువ కన్పడింది. ఇది తగ్గిస్తే ఇంకా సహజంగా ఉండేది) చాలావరకు చెప్పినా, వ్యాఖ్యాత్రి కొన్నిచోట్ల చూపిన అతి స్పందన ఏ రకంగా చూసినా సమంజసం కాదు. తాను తన కాబోయే సహధర్మచారిణి ఫొటో తొలిసారి చూసినప్పుడు కరెంటు పోయి చీకటిగా ఉందని హరికిషన్ చెప్పినపుడు ‘అంటే చీకటిలో కారుచీకటిలో..’ అంటూ అతిగా నటిస్తూ అభినయించడం లాంటివి కార్యక్రమ ఫోకస్‌ని పక్కదారి పట్టిస్తుంది. ఇదంతా ఇలా ఇంటర్వ్యూ చేసేవారు కూడా స్వతహాగా నటీమణులో, నృత్య కళాకారిణులో లేదా ఇతర కళారూపాల ప్రసిద్ధులో కావడం వల్ల వచ్చిన తంటానా? అయినా సందర్భానికి తగినట్లు టాలెంట్‌ని నియంత్రించుకుంటేనే కార్యక్రమం ప్రేక్షక రంజకం అవుతుంది.

కథలిలా వెళ్లాల్సిందేనా?
అభివృద్ధి చెందేశాం.. అంతా ఆధునికమై, ఆలోచనల సరళీ మారిపోయింది... అంటూ తరచూ మనం సమాజంలో పలు వర్గాల నుంచి వింటూంటాం. కానీ ఇంకా తెలుగు సీరియల్స్ కథాగమనం తీరులో ఏమీ మార్పులేదు. ఎక్కడ వేసిన.. తీరులో ఉందనడానికి తాజా ఉదాహరణ ‘కుంకుమరేఖ’ (ఈటీవీలో రోజూ రాత్రి 7 గంటలకు వస్తున్నది) అనుకోని సందర్భాలలో జరిగే ఊహించని పరిణామం వల్ల పరాజితులమై పోయామన్న భావన వారి నుంచి తొలగించి అందరిలాగే వారూ ఉండాలన్న దిశగా సీరియల్స్ నడవాలి. లేదా సమకాలీన అంశాలను స్పృశిస్తూ వీలైతే అందులో ఎదురయ్యే సమస్యలకు ఆచరణ పూర్వక సూచనలు చేయాలి. ఇవేవీ లేకుండా అమ్మాయి అబ్బాయి ట్రాప్‌లో పడటం, మోసపోవడం, మరో వ్యక్తి ఆమెకోసం అర్రులు చాచడం, ఒప్పుకోకపోతే వీలైనంత విలనీని ప్రదర్శించడం వగైరా నలిగి, అరిగి, అర్థంలేని సంఘటనల సమాహారాలతో సీరియల్స్ నడపడం ఎవరి విజ్ఞత పరీక్షించడానికో తెలియడం లేదు. ఇంచుమించుగా ఇదే తీరులో నడుస్తున్న ఈ సీరియల్‌కు ప్రముఖులు నేపథ్య బాధ్యత వహించడం? ఉదాహరణకు ఏదైనా ఓ మాట వింటే అది అందరికీ తెలియజెప్పేవరకు మనసూరుకోని మనస్తత్వం కల పాత్రల్ని ఓ వెయ్యికి పైగా వివిధ సృజనాత్మక కార్యక్రమాల్లో చూసేశాం. మళ్లీ ఇందులో ప్రవేశపెట్టిన ఆ స్వభావపు పాత్ర ఎవరిని అలరిస్తుంది? అలాగే ఫలానా వారి అబార్షన్ కాగితం కావాలని వచ్చిన వ్యక్తికి ఆ పనిని లంచం ఎరచూపి ఆస్పత్రిలో సంపాదించడం వంటివి ఈ ధారావాహిక భాగంలో చూపినంత సులువుగా కుదరదేమో?! ‘ఆడపిల్ల సున్నితంగా ఉండాలి తప్ప మరీ ఇంత సున్నితంగానా?’ అన్న సంభాషణ మాత్రం అప్పటి స్థితికి సరిపోయింది. ప్రాచీనతని, సంప్రదాయాన్నీ గౌరవించడంలో తప్పు లేదు. కానీ అంత మాత్రంచేత ఆధునికతనీ, ప్రస్తుత కాలపు పోకడల్నీ పట్టించుకోకపోవడం బావుండదు.

తప్పుల్లేకుండా మాట్లాడలేమా?
ఈ మధ్య అమెరికాలో జరిగిన తెలుగు సంబరాలకు ముఖ్య అతిథిగా మన రాష్ట్రానికి చెందిన ప్రముఖ చానల్, పత్రికాధిపతి వెళ్లారు. ఆయన పాల్గొన్న ఓ కార్యక్రమంలో అక్కడి తెలుగు మహిళ ఒకామె ‘మేం స్వరాష్ట్రానికి ఇంత దూరంలో ఉండి తెలుగు భాష పట్ల మమకారంతో పిల్లలకి తప్పుల్లేకుండా మాట్లాడటం, చదవడం నేర్పుతున్నాం. కానీ తెలుగు రాష్ట్రంలో ఉండి రాజధాని వేదికగా నడిచే ఛానల్స్‌లో వస్తున్న యాంకర్ల యాక్సెంట్, అక్షరాల్ని తప్పుల్లేకుండా చదవని విధానంగానీ చూస్తూంటే బాధేస్తోంది. అలా కాకుండా తప్పుల్లేకుండా భాషని పలికే యాంకర్లే తెలుగు నేలపై మీకు దొరకడం లేదా? అని ఎంతో ఆవేదనతో అడిగారు. అందుకా ఛానల్ అధిపతి నిస్సంకోచంగా ‘దొరకడం లేదు..’ అని చెప్పి తన చానల్ కోసం పరిశీలించినప్పుడు అందరూ అనుకునే లోపరహిత ఉచ్ఛారణ గల యాంకర్ల కోసం చేసిన కృషి, అందులో విఫలమైన తీరు వివరించారు. ‘అందుకే రాజీపడిపోవల్సి వచ్చింది. వొత్తుల్లేకుండా భాష నుచ్ఛరించే వారే ఎక్కువ’ అని చెప్తూ, ‘మీరు కనుక ఇండియా వచ్చి ప్రోగ్రామ్‌లు చేస్తానంటే అవకాశం కల్పిస్తా’నంటూ ఆఫర్ కూడా చేశారాయన. ఈ కార్యక్రమం కూడా ఎబిఎన్ చానల్‌లో ప్రసారమైంది. దీన్నిబట్టి తెలుగు యాంకరింగ్ స్థితి ఎలా ఉందో తెలుస్తోంది. సువ్యవస్థితమైన నట శిక్షణాలయాలతోపాటు తెలుగునాట ప్రమాణాల కనుగుణంగా కార్యక్రమ వ్యాఖ్యానాలు చేయగల సమర్థతను అందించే సువ్యవస్థిత శిక్షణ కేంద్రాలు బాధ్యతగల వ్యక్తుల నుంచి ఏర్పడినప్పుడు గానీ ఈ సమస్యకు పరిష్కారం దొరకదేమో?!

Source: www.andhrabhoomi.net

బాబులను గుర్తిస్తే రు. లక్ష మీవే

మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని గుర్తు పడతారా? పోనీ మహేశ్‌బాబును గుర్తు పడతారా? అంటే హెయిర్ స్టైల్‌నో, చేతి వేళ్లలో చూసి గుర్తు పట్టడం కాదండీ మొత్తం ముఖాన్ని మీరు కోరినంత సేపు చూసి మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని చెప్పినా ఫరవాలేదు. గుర్తు పట్టగలరా? ఓ.. చాలా ఈజీగా అంటున్నారా? మరింకెందుకాలస్యం ఐతే మీరు రోజుకో లక్ష సంపాదించవచ్చు. కష్టమేమీ లేదు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, త్రిష వంటి చాలా పాపులర్ నటీనటుల ఫోటోలను టీవీ తెరపై చూపిస్తారు. వెంటనే మీరు వారు చూపించిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే మీరు ఇల్లు కదలకుండా లక్ష రూపాయలు మీ ఒళ్లో వచ్చి పడిపోతాయి. బాగుంది కదూ! ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యానికి పూనుకున్నది మా మూవీ చానల్ వాళ్లు. వాళ్ల చానల్‌లో రోజంతా కష్టపడ్డవారికి నెలకు పాతిక వేలు ఇస్తారో లేదో కానీ పాపం వాళ్లు మనమీదున్న ప్రేమ కొద్దీ ఫోన్ చేసి పేరు చెబితే చాలు లక్ష ఇచ్చేస్తారు. గుడ్డివాళ్లు తప్ప ఎవరైనా చెప్పగలంత ఈజీ ప్రశ్నలతో లక్ష రూపాయలిచ్చేస్తారు దానకర్ణులు.

మా మూవీ చానల్‌లో రాత్రి పదకొండు గంటల సమయంలో కవ్వించే మాటలతో రా రా అని పిలుస్తున్నట్టుగా మాట్లాడే ఒక అమ్మాయి ఆలసించిన ఆశాభంగం మీ కోసమే ఎదురు చూస్తున్నాం.. వచ్చేయండి ఫోన్ చేయండి.. అంటూ రెచ్చగొడుతుంది. తెరపై హీరో బొమ్మ వారు చూపించే లక్ష రూపాయల అంకె చూడగానే ఆశ మొదలవుతుంది. అసలు వ్యవహారం అక్కడే ఉంది. ఇదో పెద్ద బోగస్ వ్యవహారం. ఒక్కసారి పొరపాటును ఎవరైనా ఫోన్ చేశారంటే దాదాపు వెయ్యి రూపాయల వరకు నెత్తిన బిల్లు పడ్డట్టే. లేదా ఒకవేళ మీ సెల్‌ఫోన్ ప్రీ పెయిడ్ అయితే మీరు కాస్తంత అదృష్టవంతులు. ఎందుకంటే సెల్‌ఫోన్‌లో ఉన్న వందో రెండు వందల రూపాయల బ్యాలెన్స్‌తోనే మీకు జ్ఞానోదయం అవుతుంది. పోస్ట్‌పెయిడ్ అయితే ఆరిపోతారు. అంత పాపులర్ హీరోలను ఎవరైనా గుర్తు పడతారు. నిమిషానికి అర్ధ రూపాయే కదా, అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఫోన్ చేస్తే వారికి దొరికి పోతారు. నిజానికి నిమిషానికి పన్నెండు నుండి 15 రూపాయల వరకు వసూలు చేస్తారు. వెంటనే ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వకుండా గంట గంటన్నర పాటు వెయిటింగ్‌లో ఉంచుతారు. టీవీలో- రండి ఫోన్ చేయండి అని అమ్మాయి పిలుస్తుంటుంది ఆ సమయంలో మాత్రం చాలా మంది వెయింటింగ్‌లో ఉంటారు. అలా ఉంటేనే ఆ కార్యక్రమ నిర్వాహకులకు గిట్టుబాటు అయ్యేది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి ప్రత్యేకంగా శిక్షణ, ప్రత్యేక దుస్తులు ఉంటాయి.

మోసపోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన చానల్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మోసపుచ్చడం ఎంత వరకు సబబు. కనీసం ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తే చార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి. నిమిషానికి ఎంతో చెప్పాల్సిన బాధ్యత లేదా?

ఈ కార్యక్రమంపై టీవీ 1 యెటకారం డాట్‌కాంలో హాస్యగుళిక చూపారు. ఒక వడను తెరపై చూపించి కొద్దిగా కనిపించకుండా చేసి అదేంటో చెప్పాలని అడిగారు. మనం టిఫిన్‌గా తింటాం, మధ్యలో చిల్లు ఉంటుంది. చెట్నీతో తింటాం అంటూ చెప్పుకు పోయారు. దానికి సమాధానంగా పూరి అని కొందరు, దోశ అని కొందరు చెప్పారు. మహేశ్‌బాబును గుర్తుపట్టని వారు, వడను గుర్తుపట్టని వారుంటారా?

ఇంకా చిత్రమైన విషయం ఏమంటే అదే సంస్థకు చెందిన మా చానల్‌లో ఈ కార్యక్రమంపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఉదయం సినిమాల్లో హాస్య దృశ్యాలను చూపించే కార్యక్రమంలో ఇద్దరు వ్యాఖ్యాతల మధ్య హీరోలను గుర్తించే కార్యక్రమంలోని మోసాన్ని ఎండగట్టారు. కానీ చానల్ వారే ఆ మోసం ఇంకా గుర్తించనట్టుగా ఉంది. ఇదే విధంగా శనియంత్రం, హనుమాన్ యంత్రం ధరించడం వల్ల దరిద్రం అంతా పోతుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఊదరగొడుతున్నారు. ఇలాంటి ప్రచారం నియమనిబంధనలకు విరుద్ధం. అయితే వీటిపై ఫిర్యాదులు రావడం లేదో ఏమో కానీ అన్ని చానల్స్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు రోజంతా వస్తున్నాయి. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉన్న ఇలాంటి ప్రకటనలపై కనీసం వినియోగ హక్కుల ఉద్యమకారులైనా దృష్టిసారించాలి. అన్ని చానల్స్ ఈ యంత్రాలు ధరిస్తే వారే నంబర్ వన్ అయిపోతారు కదా!

అది ఎవరి సొమ్ము?
ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయంగా పద్మనాభస్వామి ఆలయం గురించి అన్ని చానల్స్‌లోనే ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఆ సంపదను పేదల సంక్షేమానికి ఉపయోగించాలని టీవీ9 ఉచిత సలహా పారేసింది. మంచిదే మనది కాదు కాబట్టి అలాంటి సలహాలిచ్చి పేద జనుల ఉద్ధరించిన తృప్తి పొందొచ్చు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు లభించాయి నిజమే. అంటే టీవీ 9 ఉద్దేశం అంత పురాతనమైన ఆ ఆభరణాలను కరిగించి బంగారం అమ్మాలా? లేక ఆ విగ్రహాలను, ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగించాలా? అది కాస్తా వివరంగా చెబితే మరింత బాగుండేది. ఏదో నోటికొచ్చిన ఒక మాట చెప్పేద్దాం అనుకుంటే ఎలా?

శుక్రవారం అన్ని చానల్స్‌లోనూ వైఎస్‌ఆర్ జయంతి దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఇడుపుల పాయలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతం నుండే సాక్షి చానల్ హెడ్‌లైన్ షో పేరుతో వార్త పత్రికల సమీక్ష ప్రసారం చేశారు. రోజూ స్టూడియోలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒక పార్టీ వేదికపై నుండి నిర్వహించారు. రాష్ట్రంలో ఒక్కో చానల్ ఒక్కో పార్టీ ముద్దుబిడ్డలు అనే విషయం రహస్యమేమీ కాదు. కానీ ఒక పార్టీ వేదిక నుండి ఇలాంటివి నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. పార్టీ వారినే కాకుండా సమీక్షలో పాల్గ్గొనే బయటి వారిని వేదికపైకి రప్పించడం ఏ విధంగా సమర్ధనీయం. అదే అంశంపై స్టూడియో నుండే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుండేది.

Source: www.andhrabhoomi.net

Thursday, July 7, 2011

మీడియాకి పనుండదంటున్న పూరి



Source: andhravilas.com

Wednesday, July 6, 2011

ఈ వారం టీఆర్పీ రేటింగ్స్‌(27వ వారం)

27వ వారం- సియస్ 15+ జూలై 2 మార్కెట్ షేర్ 
1) టీవీ9        - 2.84
2) సాక్షి టీవీ  - 1.72
3) టీవీ5        - 1.66
4) హెచ్ ఎం టీవీ - 1.31  
5) ఈ టీవీ2    - 1.17
6) ఎన్  టీవీ   - 1.05
7) జీ 24 గంటలు - 0.78
8) మహా టీవీ  - 0.61
9) స్టూడియో ఎన్ - 0.53
10)ఎబిఎన్     - 0.49
11)ఐ న్యూస్  - 0.34
12)టి న్యూస్  - 0.21(కేవలం హైదరాబాద్ లో మాత్రమే)
13)జెమిని న్యూస్ - 0.06 

Source: www.porutelangana.com

Clarification: Raj TV’s Raj News continues; T News operates as separate entity

n context to an exchange4media article published on July 4, 2011, headlined ‘Raj News renamed as T News; plans to launch Telugu GEC soon’, Raj TV has clarified that following the termination of agreement between Telangana Broadcasting and Raj TV, the former has set up a new entity T News.
 
Raj TV’s Raj News continues to be a Telugu news channel. A Raj TV official explained, “It is no longer a Telangana news channel. It is now managed by Raj TV itself.”

T News officials also clarified that under the agreement with Raj TV, Telangana Broadcasting was managing Raj News for a period of one year. In April 2011, Telangana was issued its own licence, and with that it started T News.

Source: www.exchange4media.com

ఈ వారం GRP రేటింగ్స్‌(27వ వారం)

1) TV9- 127          గత వారం-110
2) SAKSHI TV-80 గత వారం-72
3) TV5-  75            గత వారం-81
4) HMTV-59          గత వారం-59
5) ETV2-52           గత వారం-48
6) NTV-48             గత వారం-45
7)ZEE24GANTALU-36 గత వారం-32
8)MAHAA TV-27  గత వారం-37
9)STUDIO N-24     గత వారం-23
10)ABN-22            గత వారం-19
11)I NEWS-15       గత వారం-15
12)T NEWS-9    (only in hyderabad)
గత వారం-15
13)GEMINI NEWS-3 గత వారం-4

Source: www.porutelangana.com 

Tuesday, July 5, 2011

టీవీ ఇలా వాడుదాం

టెలివిజన్ లేని ఇళ్ళు మీ ఊళ్ళో ఎన్ని ఉన్నాయి? ఒకప్పుడీ ప్రశ్నకు జవాబు చెప్పాలంటే ఎంతో కష్టపడాల్సి వచ్చేది. కానీ, ఇప్పుడా ఇబ్బంది లేదు. ఇప్పుడీ ప్రశ్న ఎవర్ని అడిగినా, వాళ్ళు, తడుముకోకుండా చెప్పేస్తారు జవాబు. ఎందుకంటే, వేళ్ళమీద లెక్కించదగిన సంఖ్యలో మాత్రమే ఈ ఇళ్ళు ఉండేవి. టెలివిజన్ ప్రాముఖ్యత అంతలా పెరిగి పోయింది. మరి. కానీ టెలివిజన్ సెట్ ఇంట్లో ఉన్నా, దాని గురించి ఎవరూ ఏ జాగ్రత్త కూడా తీసుకోరన్నది నిజం. ఈ టెలివిజన్ సెట్‌ల విషయంలో కొన్ని చిన్నపాటి జాగ్రత్తలను పాటించటం వలన ఏ సమస్యలూ తలెత్తకుండా చూసుకోవచ్చు.

టెలివిజన్ కొనుగోలు సమయంలో దానితో పాటుగా సూచనలు కూడా ఇస్తారు. దీనినే ఆపరేటింగ్ మాన్యువల్ అనీ, ఇన్‌స్ట్రక్షన్ బుక్‌లెట్ అనీ, యూజర్స్ మాన్యువల్ అనీ కూడా పిలుస్తారు. ఇది చాలా ఉపయోగకరమైన పుస్తకం. సెట్‌తో పాటుగా షాప్‌వాళ్ళు ఈ పుస్తకం ఇవ్వకపోతే అడిగి మరీ తీసుకోవాలి. ఈ చిన్న పుస్తకంలో సాధారణంగా క్రింది అంశాలు ప్రధానంగా ఉంటాయి.

* టివి సెట్‌ను సురక్షితంగా వినియోగించుకొనే విషయంలో హెచ్చరికలు, జాగ్రత్తలు

* లొకేషన్ కంట్రోల్స్‌కు సంబంధించిన సచిత్ర సమాచారం

* ట్యూనింగ్ ప్రొసీజర్, పిక్చర్ కంట్రోల్ ఎడ్జస్ట్‌మెంట్‌లకు సంబంధించిన సమాచారం.

* టివి సెట్ టెక్నికల్ స్పెసిఫికేషన్లు

* విసిడి లేదా డివిడి ప్లేయర్‌ను అమర్చుకొనే విధానం

* వారంటీ నియమ నిబంధనలు

టెలివిజన్ సెట్‌ను సరిగ్గా ఉపయోగించుకొనే విధానం గూర్చి తెలిపే ఈ ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌ను ఉత్పత్తిదారులే రూపొందించి, ప్రతి సెట్‌తోనూ దీనిని తప్పనిసరిగా అందించాలి. ఓల్టేజి స్టెబిలైజర్ అవసరమా? కలర్ టెలివిజన్‌ను ఉంచిన గదిలో కాంతి ఏ స్థాయిలో ఉండవచ్చు? ఎంత దూరంలో కూర్చుని చూడటం మంచిది? ఎటువంటి ట్రాలీమీద ఉంచవచ్చు. ఇటువంటి వివరాలు ఒక్కో తరహా టీవీకి ఒక్కో రకంగా ఉంటాయి. కనుక సంబంధిత మాన్యువల్‌ను కనీసం ఒకసారి అయినా వినియోగదారులు చదవటం మంచిది.
బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ వారి ఐఎస్‌ఐ మార్కు పొందిన టీవీ రిసీవర్లు తగు రక్షిత ప్రమాణాలకు అనుగుణంగా తయారవుతాయి. అయినప్పటికీ వీటి విషయంలో కూడా ప్రమాదాలకు, నష్టాలకు గురి కాకూడదంటే వినియోగదారులు కొన్ని జాగ్రత్తలు పాటించక తప్పదు.

ఇవే చిన్నచిన్న జాగ్రత్తలు...
* స్థిరంగా ఉండే టేబుల్ లేదా ట్రాలీ పైన మాత్రమే టెలివిజన్‌ను ఉంచాలి.

* పవర్ కార్డుమీద వస్తువులు ఉంచడం, దానిని తొక్కుతూ నడవడం చేయకూడదు. ‘ఆన్’ పొజిషన్‌లో ఉన్నప్పుడు రిసీవర్‌ను అటూ ఇటూ మార్చకూడదు. ఒక్కోసారి చిన్నపాటి జర్క్ కూడా పెద్ద ప్రమాదానికి కారణం కావచ్చు.

* టెలివిజన్ తెర మధ్య భాగం, ప్రేక్షకుల కళ్ళు ఒకే మట్టంలో ఉండేలా కూర్చోవాలి.

* తెర ఎత్తుకు ఆరు రెట్ల దూరంలో కూర్చుని టెలివిజన్‌ను చూడటం మంచిది. ఉదాహరణకి 51 సెంటీమీటర్ల డయాగనల్ సైజ్ స్క్రీన్‌కు రెండు మీటర్ల దూరంలో కూర్చుని చూడవచ్చు.

* దీర్ఘకాలంపాటు సెట్‌ను ఉపయోగించనప్పుడు, ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం వస్తున్నప్పుడు కేబుల్ కనెక్షన్లను తొలగించడం మంచిది.

* ఎక్కువకాలం పాటు టెలివిజన్ సెట్‌ను ఉపయోగించనప్పుడు పవర్ పాయింట్ నుంచి ప్లగ్‌ను తీసివేయాలి.

* ఎలక్ట్రికల్ షాక్‌లకు గురి కాకుండా ఉండేందుకు ముందు జాగ్రత్త చర్యగా సెట్‌ను వానజల్లు పడే ప్రాంతానికీ, తేమ ప్రదేశాలకూ దూరంగా ఉంచాలి.

* వాల్ ఔట్‌లెట్స్, ఎక్స్‌టెన్షన్ కార్డుల విషయంలో ఓవర్ లోడ్ కాకుండా జాగ్రత్త పడాలి. కాదంటే ఎలక్ట్రిక్ షాక్, అగ్ని ప్రమాదాలు జరిగే ప్రమాదం ఉంది.

* తగిన గాలి సోకే విధంగా సెట్‌ను అమర్చుకోవాలి. రిసీవర్ ఎక్కువగా వేడెక్కకుండా చేసేందుకు ఇది అవసరం.

* ఎండపడే విధంగా సెట్‌ను ఉంచకూడదు. అలాగే వేడి ప్రదేశాల్లో ఉంచకూడదు.

* కాబినెట్‌నీ, స్క్రీన్‌ని శుభ్రపరిచేందుకు మైల్డ్ డిటర్జెంట్ కలిపిన నీటిలో మెత్తని గుడ్డను తడిపి ఉపయోగించవచ్చు. బెంజాల్, పెట్రోలియం, లేదా కెమికల్ క్లాత్‌ను ఉపయోగించకూడదు. శుభ్రపరిచే ముందు పవర్ పాయింట్ నుంచి ప్లగ్‌ను తీసివేయాలి.

* కాబినెట్ వెనుక ఉన్న కవర్‌ను తొలగించే ప్రయత్నం చేయకూడదు. ప్రాణాంతక ఓల్టేజీలకు గురయ్యే ప్రమాదం ఉంది.

* వెంటిలేషన్ హోల్స్, ఓపెనింగ్‌ల నుంచి నాణేలు, చిన్న చిన్న ఆటవస్తువులు, గుండీల వంటి వస్తువులను రిసీవర్‌లోకి పిల్లలు నెట్టకుండా చూడాలి.

* కలర్ టెలివిజన్‌లకు సమీపంలో అయస్కాంత పదార్థాలు ఉంచకూడదు. స్పీకర్, ఆడియో సిస్టమ్స్ వంటి వాటిని టెలివిజన్‌కు సమీపంలో ఉంచినప్పుడు అనవసరమైన రంగు గీతలు తెరపై రావచ్చు.

* తెగిపోయిన, పాడైపోయిన కార్డును ఉపయోగించడం వలన అగ్నిప్రమాదాలు, కరెంటు షాక్ వంటివి జరగవచ్చు. కనుక పవర్ కార్డుపైన బరువయిన వస్తువులను ఉంచవద్దు. ఎక్కువ ఉష్ణాన్ని ఉత్పత్తి చేసే గృహోపకరణాలకు విద్యుత్ వైర్లు దూరంగా ఉండేలా చూడాలి. సాకెట్ నుంచి ప్లగ్‌ను తీసేటప్పుడు కార్డ్‌ను పట్టుకొని లాగకూడదు. ప్లగ్‌ను పట్టుకొని లాగాలి.
ఇటువంటి మరికొన్ని జాగ్రత్తల వివరాలు ఇన్‌స్ట్రక్షన్ మాన్యువల్‌లో ఉంటాయి. టెలివిజన్ కొన్న తర్వాత ఈ చిన్న పుస్తకాన్ని ఒకసారి చదివి, అందులో సూచనలను, సలహాలను పాటించటం వలన టెలివిజన్ ఎక్కువ కాలం పనిచేస్తుంది. రిపరెన్స్ కోసం ఈ పుస్తకాన్ని ఒకచోట పదిలంగా భద్రపర్చుకోవాలి.

Source: www.andhrabhoomi.net

గిఫ్ట్ కొట్టు - రేటింగ్ పట్టు

ప్రేక్షకో రక్షతి రక్షితః అన్నట్లు ఛానల్స్ వ్యవహరిస్తున్నాయి. ఈ విషయంలో ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌కి ఏ మాత్రం తీసిపోని రీతిలో న్యూస్ ఛానెల్స్ కూడా వ్యవహరిస్తున్నాయి. లంచానికి మరో అందమైన పేరు గిఫ్ట్. బహుమతి ఎంతటి కిక్ నిస్తుందో అది అందుకున్న వారికే తెలుస్తుంది. అందుకే ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ బహుమతులు ఎరగా వేసి ప్రేక్షకులను రక్షించుకునే పనిలో పడిపోతున్నాయి.

ప్రేక్షకుడిని ఎటూ కదలిపోకుండా తమ ఛానల్ వైపేలా చూసేటట్లు చేసుకోగలిగితే టిఆర్‌పి రేటింగ్ బావుంటుంది. అది బావుంటే ప్రకటన ఆదాయం వస్తుంది. అప్పుడు ఛానల్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్థిల్లుతుందని ఓ అంచనా. అయితే రోజురోజుకి పుట్టుకొస్తున్న న్యూస్ ఛానల్స్, ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ దాడిని తట్టుకునేందుకు, మరింతగా బలపడేందుకు ప్రేక్షకులను బహుమతుల వల విసరక తప్పడం లేదు.

మొదట్లో బహుమతి గెలుచుకుంటే ఆనందపడిపోయే ప్రేక్షకుడు ఛానల్స్ మధ్య పోటీ పుణ్యమాని దానికి బాగా అలవాటు పడిపోయాడు. ఇప్పుడు కొత్తదనం కోసం కాకుండా ఏ ఛానల్ వారు ఏ ఎర వేస్తున్నారో గమనించి అటువైపు పరుగు పెట్టడానికి రిమోట్‌ని ఉపయోగిస్తున్నాడు. ఆఖరికి అదేదో సినిమా డైలాగ్ మాదిరి ‘నాకేంటంట?’ అని ప్రశ్నించుకుంటూ ఛానల్స్ వారికి టిఆర్‌పి ఛాలెంజ్ విసురుతున్నాడు.

ప్రస్తుతం ఏదైనా కొత్త ప్రోగ్రాం, సీరియల్ స్టార్స్ అవుతున్నాయంటే ‘నాకేంటంట?’ అన్నట్లు ప్రోమోలను గమనిస్తున్నాడు. దానికి తగ్గట్టుగానే మొదట కొన్ని ఎపిసోడ్ల వరకు తృణమో పణమో ప్రేక్షకులకు చెల్లించుకుంటూ ప్రోగ్రాంలు స్టార్ట్ కావడం విశేషం! శ్లాట్స్ ప్రకారం టైమ్ తీసుకున్న నిర్మాతలు బిజినెస్ బావుండాలని టిఆర్‌పి రేటింగ్ కోసం మొదట్లో ఎటువంటి ఎర వేయకపోయినా ప్రేక్షకులు జారిపోతున్నారని గమనిస్తే మాత్రం ఎరవేసి కాపాడుకోక తప్పడం లేదు. అయితే ఇక్కడో లింకు పెడుతున్నారు. సోమవారం నుండి శుక్రవారం వరకు గమనించి అప్పుడు అడిగే ప్రశ్నలకు ఎస్‌ఎంఎస్‌లు చేస్తే బహుమతి ఇస్తామంటున్నారు. బహుమతి మరీ విలువైనదైతే ప్రేక్షకులు ఫాలోకాక తప్పడంలేదు.

ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్ పరిస్థితి ఈ విధంగా ఉంటే న్యూస్ ఛానల్స్ వారు కూడా ఎస్‌ఎంఎస్‌లతో ప్రేక్షకుల నుండి నిలువుదోపిడీ చేస్తున్నారు. అయితే వీరి తీరు వేరు. డిబేట్‌లు, చక్కగా ఇంటర్వ్యూలు నిర్వహించేటపుడు మీరు ఏకీభవిస్తారా? అంటూ ఎస్‌ఎంఎస్‌ల ద్వారా అభిప్రాయాలను సేకరించేస్తుంటారు. ఈ మధ్యకాలంలో సినిమాలు రిలీజ్ అవుతున్నప్పుడు, వివిధ సినిమా ఫంక్షన్లు జరుగుతున్నప్పుడు న్యూస్ ఛానల్స్ వారు మీడియా పార్ట్‌నర్‌లుగా వ్యవహరిస్తూ ఎంట్రీ పాస్‌లు దక్కించుకోమని ప్రేక్షకులకు ఎస్‌ఎంఎస్‌ల ఎర వేస్తున్నాయి. వీటన్నింటికి భిన్నంగా టీవీ5 వారు కొన్ని ఆదివారాల పాటు ‘్ధనలక్ష్మీ ఐ లవ్‌యూ’ ప్రోగ్రాం నిర్వహించి క్యాష్ ప్రైజులిచ్చారు. ‘మహా’ ఛానల్ వారు వెండి కుంకుమ భరిణిలను ఓ ప్రోగ్రాం ద్వారా ఇవ్వడం జరిగింది. ఇవికాక పండుగలకు స్పెషల్ గిఫ్ట్‌లను కూడా విసరడం జరుగుతుంది.

ఎంటర్‌టైన్‌మెంట్ ఛానల్స్‌లో ‘పట్టుకుంటే పట్టు చీర’ సంవత్సరాల తరబడి జెమినిలో ప్రతి ఆదివారం ప్రసారవౌతుంటే ఈ మధ్యనే 2 గ్రాముల బంగారం గెలుచుకోండని ‘నెం.2 మహాలక్ష్మి నివాసం’ సీరియల్ వారు కొన్ని వారాలపాటు నిర్వహించారు. వారమంతా చూసి మూడు ప్రశ్నలకు సమాధానమిచ్చి ‘లేడీస్ బైక్’ గెలుచుకోమని ‘అపరంజి’ సీరియల్ వారు కొన్ని వారాలపాటు ప్రేక్షకులను తమ ఖాతాలో వేసుకున్నారు. ఈ మధ్యనే ‘బంగారు కోడిపెట్ట’ అంటూ కొత్త గేమ్ షో కూడా స్టార్టయ్యింది.
మాటీవీ ఏకంగా ‘కొంగుబంగారం’ ప్రోగ్రాంతో దాదాపు 4 నెలలపాటు ప్రేక్షకులను మత్తెక్కించేసింది. ప్రతిరోజూ దాదాపు 10 గ్రాముల బంగారాన్ని కేవలం మాటలకే పంచిపెట్టేసి క్రేజీ ఛానల్‌గా మారిపోయింది. పాపులర్ సినీ నటుడు ప్రకాష్‌రాజ్ ప్రోగ్రాం ‘ఇట్స్ మై షో’కు కూడా బంగారం, వెండితో వల విసిరింది. వేసవి సినిమాలకు సైతం గిఫ్ట్‌లు పెట్టి ప్రేక్షకులను కట్టేసింది మాటీవీ.

బంగా రం, వెండి కానుకలను ప్రవేశపెట్టడంలో జీ తెలుగుదే అగ్రస్థానమని చెప్పాలి. జీ తెలుగులో ప్రసారమైన ముద్దుబిడ్డ, కృష్ణావతారాలు, లేత మనసులు, డాక్టర్ చక్రవర్తి ఇలా ఎన్నో సీరియల్స్‌కి బహుమతుల వర్షం కురిపించింది. దాదాపు 2 వేల ఎపిసోడ్స్ దాటుతున్న ప్రతిరోజూ ‘మీ ఇంటి వంట’ ప్రోగ్రాంలో రోజూ ప్రేక్షకులను గెలిపిస్తూనే ఉంది. ‘షిర్డీ సాయికథ’ ద్వారా సాయి భక్తులకు సైతం వెండి విగ్రహం ప్రతిరోజూ బహూకరిస్తుంది. ‘రాధాకల్యాణం’ కాంటెస్ట్ ఒక్క వారంతోనే ఎత్తేయడం జీ తెలుగు లీస్ట్ కాంటెస్ట్‌గా చెప్పవచ్చు.

ప్రస్తుతం జీ తెలుగు లోగోను మార్చుకుని జూన్ 27 నుండి సరికొత్త కాంటెస్ట్‌ను నిర్వహిస్తుంది. 100 పట్టుచీరలు, 10 ఫ్రిజ్‌లు, 4 బైక్‌లు, 1 కారుని గెలుచుకోమని ప్రేక్షకులకు ఎరవేస్తుంది. అయితే దీని కోసం ప్రతిరోజూ సాయంత్రం మొదలు అర్ధరాత్రి వరకు దాదాపు 5 గంటలు పైనే జీ తెలుగు ప్రోగ్రాంలు ప్రతిరోజూ చూసి వారడిగే ప్రశ్నలకు ఎస్‌ఎంఎస్‌లు చేయాల్సి ఉంటుంది. ఇలా చేసిన వీరాభిమానుల్లో ఒకరికి ‘జీ తెలుగు వీరాభిమాని’ గిఫ్ట్‌గా కారు లభిస్తుంది.

వనితా ఛానల్‌లో ప్రతిరోజూ రన్ అవుతున్న ‘లక్కీ వనిత’ ఈటీవీలో ప్రసారవౌతున్న ‘అభిమాని’ వంటి కొన్ని ప్రోగ్రాంలు ప్రేక్షకులకు వల విసురుతూనే ఉన్నాయి. కొన్ని ఛానల్స్ ఫలానా కంపెనీ ఫోన్ వారే ఎస్‌ఎంఎస్‌లు పంపాలనడం కూడా ఇక్కడ గమనించాలి. కొన్ని ఛానల్స్‌కి అన్ని కంపెనీల వారు నిబంధనల ప్రకారం ఖర్చు చెల్లిస్తూ పంపవచ్చు.

ఛానల్స్ ఎర వేసే ఈ కానుకల పట్ల ప్రేక్షకుల్లో గందరగోళం వున్న కొందరు సంతృప్తిగానే ఉన్నారు. అయితే కానుక గెలుచుకోవాలంటే ఎస్‌ఎంఎస్‌లు తప్పనిసరి కనుక కానుక విలువను బేరీజు వేసుకుని ప్రేక్షకులు వాటిని పంపుతూంటారు. ఎస్‌ఎంఎస్ల ద్వారా అభిప్రాయాలను సేకరించినా, ఆన్సర్స్ సేకరించినా అది ఓ రకంగా ఛానల్స్‌కి వీక్షకుల సంఖ్యను చూపిస్తాయి. దానితోపాటు కంపెనీల మధ్య ఒప్పందముంటే భారీ ఆదాయం కూడా ముడుతుంది.

విలువైన బహుమతుల పట్ల ప్రేక్షకులు ఎక్కువ మక్కువ చూపడంతో ఛానల్స్‌కి ఆ ప్రోగ్రాం నడిచే సమయంలో వేల నుండి లక్షల వరకు ఎస్‌ఎంఎస్‌లు రావడం చాలామందికి తెలియదు. పైగా ప్రేక్షకులు నాలుగైదు సిమ్స్ వాడటం వలన అన్నింటి నుండి ఎస్‌ఎంఎస్‌లు చేస్తే వాటి సంఖ్య కొండలా పెరిగిపోతుంది. వెల్లువలా వచ్చి పడే వీటి నుండి ఒకరిని సెలెక్ట్ చేసి చూపడం వలన ప్రేక్షకుడు పోగొట్టుకున్న డబ్బు గురించి ఇట్టే మరిచిపోతున్నాడు. తిరిగి రేపటి ఎపిసోడ్ గురించి ఎదురుచూస్తూ బానిసై పోతున్నాడు. ఈ రకంగా ఛానల్స్ ప్రేక్షకులను కట్టి పడేయడంలో చాలా వరకు సక్సెస్ సాధిస్తున్నాయనే చెప్పాలి. బహుమతులను ఎరవేయడంలో ప్రతి ఛానల్ ఏదో ఒక ట్రిక్‌ను ఫాలో అవుతూనే ఉన్నాయి. బహుమతులతో ప్రేక్షకులను ఆకట్టుకోవడంలో ఏ ఛానల్ కూడా తీసిపోదనే చెప్పాలి.

ఛానల్ కాంటెస్ట్‌ల వెంట ఎక్కువగా పరిగెట్టేది గ్రామీణ, పట్టణ ప్రాంతాల వారేనని చెప్పాలి. నగర ప్రాంతాల్లో కూడా కొన్ని ఏరియాల వారు కూడా వీటి పట్ల ఆకర్షితులవుతున్నారు. మొత్తానికి ప్రేక్షకులను తమ ఖాతాలో వేసుకునే దిశలో స్టూడియోలో నిర్వహించే ప్రోగ్రాంలు కొన్నయితే నేరుగా ప్రేక్షకుల మధ్యకేపోయి నిర్వహించేవి కొన్ని ఉన్నాయి. ప్రేక్షకులకు ఇచ్చే కానుకలను స్పాన్సర్స్ చూసుకుంటే ఎస్‌ఎంఎస్ ఆదాయాన్ని ప్రేక్షకుల సంఖ్యను ఛానల్స్ తమ ఖాతాలో వేసుకుంటున్నాయి.

ఏ జాతి చూసినా ఏమున్నది గర్వకారణం.. అన్నట్లు ఏ ఛానెల్ చూసినా ఎస్‌ఎంఎస్‌ల గోలే. సామాన్య ప్రేక్షకుడు ఖర్చు చేసినంత ఖర్చు చేయకపోయినా ఇదో రకం పిచ్చి... జూదం అంటూ కొట్టి పారేసే కొంతమంది ప్రేక్షకులు ఛానల్స్ ఇచ్చే గిఫ్ట్‌లను ప్రత్యక్షంగా చూసి ఆశ్చర్యపోవడం కొసమెరుపు. మొత్తానికి ఎవరి గోల వారిదన్నట్లు ప్రేక్షకుల కోసం ఛానల్స్.. గిఫ్ట్స్ కోసం ప్రేక్షకులు ఉన్నారు. ఎవరి లాభం వారిది.. ఎవరి అంచనాలు వారివి..

Source: www.andhrabhoomi.net

శృతి తప్పుతోన్న ‘పాడుతా తీయగా...’

ఇది వరకంటే ప్రతిభ ఉన్నా, దానిని వ్యక్త పరచుకోడానికి బలమైన వేదిక లేక ఉన్న టాలెంట్‌ని తమంత తామే బలహీనపరచుకునే సందర్భం ఉండేది. కానీ ఛానల్స్ ధర్మమా అని మారుమూల పల్లెల్లో ఉన్న వారు సైతం టాలెంట్‌ని గణనీయ ప్రజావళి దగ్గరకు చేర్చగలుగుతున్నారు. ఇది అభినందించదగ్గ, ఆహ్వానించదగ్గ విషయం. ఈటీవీ ప్రసారం చేసిన, చేస్తున్న ‘పాడుతా తీయగా...’ చెప్పుకోదగ్గది. ఇందులో ప్రసారమైన స్వరాలు అనంతర కాలంలో వెండితెరలోనూ వెలిగిన దాఖలాలూ చూశాం. ఇలా బహుళ ప్రాచుర్యం పొందిన ఈ కార్యక్రమం ప్రస్తుతం కొన్ని సందర్భాలలో గాడి తప్పుతుందేమోననిపిస్తోంది. ఏ కార్యక్రమమైనా ఆ కార్యక్రమ లక్ష్యం తదితరాలపై ఎక్కువ దృష్టి పెడితే బావుంటుంది. కానీ ‘పాడుతా తీయగా...’ లక్ష్యదిశగా సాగడానికే ప్రయత్నిస్తూ మధ్యమధ్య అసంగతాలకీ, అవసరాన్ని మించి ఆస్కారం కల్పిస్తున్నారు. అవేమిటో చూద్దాం. ఓ అభ్యర్థి తర్వాత ఓ అభ్యర్థి తమ గళాన్ని వినిపించడం, దాంట్లో ఉన్న తప్పొప్పులని సంబంధిత రంగంలో అపార అనుభవమున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం కార్యక్రమ వ్యాఖ్యాతగా చెప్పడం వరకూ ఓకే. కానీ పక్కనున్న ముఖ్య అతిథిగా విచ్చేసిన వారితో సరదా మాటల నెపంతో పదేపదే మాట్లాడటం అనేది అవసరం లేదు. ఈ మధ్య ప్రసారమైన ఈ కార్యక్రమంలో అలా ముఖ్య అతిథిగా విచ్చేసిన గాయనితో ‘ఓ పాత సినిమా పేరు ప్రస్తావించి.. అది నువ్వు చూశావా?’ అని అడగడం.. అంటే నేను అప్పుడు ఉన్నానా? అని అర్థం వచ్చేలా ఆమె సమాధానమివ్వడం లాంటివి జరిగాయి. విషయమేమిటంటే ఇలా పాత సినిమాల ప్రస్తావన రావడం వల్ల నేను అంత పెద్దదాన్నా? అన్న అర్థం గోచరించడం ‘అవును నువ్వు పెద్దదానివే’ అని బాలు ఆట పట్టించడం జరిగింది. ఇదేదో ఒకసారికి పరిమితమైతే ఫర్వాలేదు. కానీ మాటిమాటికీ ఇదే ఆనాటి కార్యక్రమంలో పునరావృతమైంది. దాంతో చూపరులకు చిరాకు పుట్టింది. ఇలాంటి వాటిని తక్షణం పరిహరించాలి. అయితే ఇదే కార్యక్రమంలో పాట స్వరపరంగా అద్భుత సంపత్తి ప్రదర్శించినా, భాషాపరంగా తెలియకుండానే దొర్లే దోష భూయిష్టతను సరిదిద్దే ప్రక్రియను బాలసుబ్రహ్మణ్యం చేయడం బాగుంది. జూన్ 27న సినీ దర్శకుడు, రచయిత జంధ్యాలను స్మరిస్తూ వారి చిత్రాల్లోని పాటల్ని చిన్నారులతో పాడించిన ఎపిసోడ్ ఆకట్టుకుంది. ఇందులో కూడా ముఖ్య అతిథిగా వచ్చిన కోట శ్రీనివాసరావుని బాలు, బాలుని కోట పరిమితి మించి పొగడటం కూడా అనవసరమే. ఎందుకంటే ఇద్దరూ కూడా పరిచయ వాక్యాలూ, వగైరాని మించిన ఖ్యాతిని గడించినవారే.

ఎలా బ్యూటిఫుల్లో?.. కొన్నికొన్ని పేర్లకీ కార్యక్రమానికీ సాపత్యముండదు. అలాగే వ్యక్తుల విషయాల్లోనూ ఇది వర్తిస్తుంది. మోహనరావు అన్న పేరున వ్యక్తి అందరూ అనుకునేంత మోహన రూపానికి చాలా దూరంగా ఉండొచ్చు. అలాగే దయానిధి అన్న నామధారి దయ విషయంలో దరిదాపుల్లో ఉండకపోవచ్చు. అలాగే ఇప్పుడు జీ తెలుగు ఛానల్‌లో రాత్రి 10.30కి వస్తున్న ‘లైఫ్ ఈజ్ బ్యూటీఫుల్’ అన్న పేరుతో వస్తున్న దాంట్లో ఏమి బ్యూటిఫుల్‌నెస్ కనిపిస్తుందన్నది ప్రశ్నార్థకమే. ఈ కార్యక్రమ కానె్సప్ట్ ప్రకారం ఏదో ఒక టాపిక్ తీసుకుని ఇద్దరు వ్యక్తులు మాట్లాడటం మధ్యలో సినిమా క్లిప్పింగులు చూపడం, అసలు ఇలా సినిమా బిట్స్ చూపించి టైంపాస్ చేయడం ఛానల్స్‌కు సర్వసాధారణమై పోయింది. చెప్పే వ్యాఖ్యానానికి, చూసే సన్నివేశానికీ పొంతన కుదరడం మాట అటుంచి, అసలు వారు మాట్లాడుకుంటున్న మాటలే విసుగు పుట్టిస్తున్నా యిందులో. జూలై 1న ప్రసారమైన ఈ కార్యక్రమంలో డ్రైవింగ్ నేర్పడం గురించి ఉన్న ఇద్దరు వ్యక్తులూ సంభాషించుకున్నారు. ఆ డ్రైవింగూ సైకిలు నేర్పడం గురించి.. సైకిల్స్‌లో రకాలూ, ఆటో రిక్షా, లారీ, కారు అంటూ రకరకాల వాహనాలు - చివరకు హెలికాప్టర్ వరకూ అన్నీ నేర్పేస్తా అంటూ ఏవేవో మాట్లాడతాడు. వినోద ఛానల్స్ ప్రధాన ఆశయం హాస్యాన్నందివ్వడమే అయినా, అలా అందించే హాస్య, ఆహ్లాదకర హాస్యంలా ఉండాలి తప్ప, ఇలా హాస్యాస్పదంగా ఉండకూడదు. అలాగే అంతకు ముందు రోజు నిజం, అబద్ధం అంటూ ఈ కార్యక్రమంలో చర్చించారు. అదీ అసంబద్ధంగానే ఉంది.

Source: www.andhrabhoomi.net