సంగీత ప్రపంచంలో తమకంటూ ఒక ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకుని ఉన్నత శిఖరాలను అధిరోహించాలనే కోరిక ఔత్సాహిక గాయనీ గాయకులకు ఉంటుంది. వారి ఆశను తీర్చేందుకు జీ తెలుగు ‘సరిగమప’ రూపంలో ఒక సంగీత కార్యక్రమానికి శ్రీకారం చుట్టి గత ఐదేళ్ళలో ఆరు విజయవంతమైన సిరీస్‌లతో ఎంతోమంది గాయనీ గాయకులను సంగీత ప్రవాహానికి పరిచయం చేసింది. ‘సరిగమప’ విభిన్న రీతిలో, వినూత్న పంథాలో గతంలో గెలిచిన విజేతలను ఛాలెంజర్స్ సవాలు చేస్తున్నారు. దీంతోపాటు మరెంతోమంది కొత్త గాయనీ గాయకులను సంగీత ప్రపంచానికి పరిచయం చేసే ప్రయత్నానికి ‘సరిగమప నువ్వా-నేనా’ అంటోంది. ఈ ఏడో సిరీస్‌లో రాష్టమ్రంతటా జరిపిన గళానే్వషణలో ఎన్నో సుమధుర స్వర కుసుమాలు వెలుగులోకి వచ్చాయి. ఆ నవయువ గళాలు గత విజేతలు, రన్నర్స్‌తో జతకట్టి యుగళ గీతాలను ఆలపించేందుకు సంసిద్ధమవుతున్నారు. విజయనగరం, విశాఖపట్నం, రాజమండ్రి, విజయవాడ, తిరుపతి, వరంగల్, కర్నూలు, హైదరాబాద్ ప్రాంతాల్లో జరిగిన ఆడిషన్స్‌కి సుమారు 3వేల మంది ఔత్సాహిక గాయనీ గాయకులు హాజరయ్యారు. శాస్ర్తియ సంగీతాన్ని అభ్యసించి యువ సంగీత దర్శకుడు కె.ఎం.రాధాకృష్ణన్ ఈ కార్యక్రమానికి న్యాయ నిర్ణేతగా వ్యవహరిస్తున్నారు. ఈ నెల 27వ తేదీ నుండి ప్రతి బుధ, గురువారాల్లో రాత్రి 9 గంటలకు జీ తెలుగులో ప్రసారం కానుంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment