Friday, October 1, 2010

తెలుగు డిస్కవరీ మొదలైంది

డిస్కవరీ చానల్ తెలుగు ప్రసారాలు ఈ రోజు ( అక్టోబర్ 1న) మొదలయ్యాయి.  ఈ రోజునుంచి రోజుకు ఆరుగంటలపాటు తెలుగు అనువాదంతో ప్రసారాలు అందిస్తూ ,వచ్చే జనవరి నాటికి 24 గంటలకు విస్తరించాలని డిస్కవరీ నిర్ణయించుకుంది. ఈ ఏడాది జనవరిలోనే తమిళంలో ప్రసారాలు మొదలుపెట్టి అక్కడి ప్రజలను బాగా ఆకట్టుకోగలిగింది. అయితే, అక్కడి అందమైన అనువాదం అందుకు దోహదం చేసింది. కానీ అందుకు పూర్తి భిన్నంగా  తెలుగులో అనువాదాన్ని భ్రష్టుపట్టించారు. అనువాదం ఎలా ఉండకూడదో ఈ రోజునుంచి డిస్కవరీ విని తరించవచ్చు. ఇప్పుడే విన్న ఒక మాట చూడండి… పులి గురించి చెబుతూ ఇంగ్లిష్ స్క్రిప్ట్ లో ఒక చోట బిగ్ కాట్ అని వాడినట్టున్నారు…. మన అనువాదకులు దాన్ని ’’పెద్దపిల్లి” గా మార్చారు. చానల్ నిర్వాహకులు మాత్రం ముంబయ్ లో యూటీవీ కి కాంట్రాక్ట్ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. పైగా వచ్చే జనవరి నాటికి ఇంకో రెండు భాషల్లో కూడా ప్రసారాలు మొదలుపెట్టబోతున్నట్టు ప్రకటించారు. ఇప్పటికే తెలుగులో ప్రసారాలు మొదలెట్టిన నేషనల్ జాగ్రఫీ చానల్ కూడా అంతంతమాత్రంగానే ఉందనుకోండి.

Source: bhavanarayana.co.tv

1 comment:

  1. పెద్ద పిల్లి బాగానే ఉంది కదా. కొన్ని పర్యాయాలు నేను ఈ విషయం ముద్రణలోనూ చదివినట్టు గుర్తు.

    ReplyDelete