Monday, June 14, 2010

టీవీలు చూడటంలో మహిళలే నెంబర్ 1

పురుషులకన్నా మహిళలు టీవీలు చూడటంలో ప్రథమ స్థానంలో నిలిచారని స్టేట్ ఆఫ్ ది మీడియా డెమోక్రసీ సంస్థ న్యూ ఢిల్లీలో వెల్లడించింది. తాము జరిపిన సర్వేలో 92 శాతం మహిళలు టీవీలు చూసేందుకు ఎక్కువ సమయం గడుపుతుంటారని తేలినట్లు ఆ సంస్థ తెలిపింది.ఎక్కువ సమయాన్ని ఎలా గడుపుతారని తాము దేశవ్యాప్తంగా రెండు వేలమంది పురుషులు, మహిళలపై సర్వే జరిపామని సంస్థ తెలిపింది. ఇందులో పాల్గొన్న 93 శాతం మంది మహిళామణులు టీవీలతో కాలక్షేపం జరుగుతుందని, అదే పురుషుల్లో 90 శాతం మాత్రమే టీవీలను చూసేందుకు ఇష్టపడతామని తెలిపినట్లు ఆ సంస్థ పేర్కొంది. టీవీల్లో పలు ధారావాహిక కార్యక్రమాలతోపాటు మహిళలకు సంబంధించిన పలు ప్రోగ్రాంలు వస్తుంటాయని, దీంతో తమకు టీవీయే మనోరంజకమైన సాధనమని మహిళలు పేర్కొన్నట్లు సర్వే నిర్వాహకులు తెలిపారు.తాము బెంగుళూరు, లక్నో, లుధియానా, సూరత్, ఇండోర్‌లాంటి నగరాల్లో సర్వే జరిపినట్లు సంస్థ యాజమాన్యం తెలిపింది. ఇతర ప్రసారసాధనాలకన్నా టీవీనే ఎక్కువగా ఆకర్షిస్తుంటుందని తమ సర్వేలో వెల్లడైందని, టీవీ ద్వారా అన్ని రకాల విషయాలను తెలుసుకోగలుగుతామని సర్వేలో పాల్గొన్న మహిళలు తెలిపినట్లు సంస్థ తెలిపింది.టీవీల ద్వారా దృశ్య, శ్రవణాలను ఒకేసారి వీక్షించి వినే అవకాశం కలుగుతుంది. ఇటీవలి కాలంలో దేశీయ మార్కెట్‌లో డైరెక్ట్‌- టు- హోమ్ (డీటీహెచ్) విరివిగా రావడంతో మారుమూల గ్రామాల్లోను వీటి ద్వారా వార్తలు, ఆటలు, వివిధ ధారావాహిక కార్యక్రమాలను ఇంటిల్లిపాది వీక్షించే అవకాశం కలుగుతోంది. దీంతోపాటు మనసుకు ఉల్లాసం, ఉత్సాహాన్ని నింపే పలు కార్యక్రమాలు ప్రసారమవుతుండటంతో తాము టీవీలను ఎక్కువగా చూస్తుంటామని మహిళలు తెలిపినట్లు ఆ సంస్థ వివరించింది.మనసును రంజింపజేసేందుకు మొదటి స్థానంలో టీవీ నిలవగా రెండవ స్థానంలో వార్తాపత్రికలు నిలిచాయని ఆ సంస్థ తెలిపింది. పశ్చిమ దేశాల్లో నేటికీ ఉదయం నిద్ర లేవగానే టీతోపాటు వార్తాపత్రికను చదవడం ఇష్టపడతారు. 26 సంవత్సరాల వయసుపైబడినవారిలో వార్తాపత్రికలను చదివేందుకు ఉత్సుకత చూసిస్తున్నట్లు తమ సర్వేలో తేలిందని ఆ సంస్థ తెలిపింది.

No comments:

Post a Comment