Monday, June 14, 2010

పోలీసులకే ట్విస్టు ఇచ్చిన టీవీ నటి డింపుల్ అరెస్టు

హైదరాబాద్‌: టీవీ సీరియల్స్ లోని ట్విస్ట్ లను ఫాలో అయి, తోటి నటుడిపై కిరాయి వ్యక్తులతో దాడి చేయించిన ఒక నటి బండారం బయటపడింది. తనపై దాడి జరిగిందంటూ మీడియా ముందు హంగామా చేసిన టీవీ నటి డింపుల్‌ను పోలీసులు ఆదివారం అరెస్టు చేశారు. తనకు కాబోయే భర్త, టీవీ నటుడు శ్రీధర్‌ వర్మపై దాడి చేయించడమే కాకుండా, తనపై దాడి జరిగిందని ఆమె పోలీసులను తప్పుదారి పట్టించినట్టు కనుగొన్నారు. దీంతో ఆమెను అదుపులోకి తీసుకున్నారు. శ్రీధర్‌ వర్మపై దాడి చేయమని డింపులే తమకు చెప్పిందని పోలీసుల అదుపులో ఉన్న ఆమె సహాయకులు నాగరాజు, మణి చెప్పడంతో బండారం బట్టబయలయింది.

మణికొండ సమీపంలో కళ్లలో కారం చల్లి, ఇనుప రాడ్‌ తో ఓ యువతి తనపై దాడి చేసిందంటూ డింపుల్‌ బుధవారం మీడియా ముందుకు వచ్చింది. 'ఆరాధన' అనే సీరియల్ ‌లో సెల్వరాజ్‌ అనే నటుడిని తొలగించి తనకు కాబోయే భర్త శ్రీధర్ ‌ను హీరోగా తీసుకోవడం వల్లనే తనపై దాడి జరిగి ఉంటుందని ఆమె అనుమానం వ్యక్తం చేసింది. శ్రీధర్‌ వర్మపై దాడి జరిగిన మరుసటి రోజే ఈ సంఘటన చోటుచేసుకోవడం గమనార్హం.

Source: thatstelugu.oneindia.in

No comments:

Post a Comment