బిబిసి ఛానెల్‌లో ఎంతో పాపులర్ అయిన ‘స్ట్రిక్ట్‌లీ కమ్ డాన్సింగ్’ అనే ప్రోగ్రామ్ 2006లో సోనీ ఛానెల్‌లో ‘ఝలక్ దిఖ్‌లా జా’ గా ప్రత్యక్షమయింది. ఒక సెలబ్రిటీకి ఒక ప్రొఫెషనల్ కోరియోగ్రాఫర్‌ను జత ఇచ్చి... ఇలా ఎనిమిది జోడీలు తయారు చేసి వారి మధ్యన డాన్స్ పోటీ పెట్టడం ఈ షో ఫార్మాట్. విదేశాలలో ఈ షో నిర్వహించే తీరు వేరు. అక్కడ లైవ్ మ్యూజిక్ కి జోడీలు వివిధ డాన్స్ రీతులు ప్రదర్శిస్తారు. మన దేశంలో ఈ షో ఫార్మాట్ కొంచెం మార్చి బాలీవుడ్ రంగుని అద్దారు. హిందీ సినిమాల్లో పాపులర్ పాటలకు హోరెత్తించే స్టెప్పులతో చేసే ఈ డ్యాన్సులకి ప్రేక్షకులు కిర్రెక్కిపోయారు. ప్రస్తుతం నాలుగో సీజన్‌లో అడుగుపెట్టిన ఈ షో ఇంతింతై వటుడింతై అన్నట్టుగా నాలుగేళ్లలో ‘సూపర్ హిట్ షో’ స్టేటస్‌ను తెచ్చుకుంది.
డైలీ సీరియల్స్ రూపంలో తమ ముందుకు వచ్చే టీవీ స్టార్లను సరికొత్త అవతారాలలో చూసేందుకు ప్రేక్షకులు ఎగబడ్డారు. వారిలోని ఈ కొత్తకోణం ప్రేక్షకులను బాగా అలరించింది. షో మొదలైన నాటి నుంచే మంచి టిఆర్‌పి రేటింగుని సంపాదించుకుంది. దానికి తోడు జడ్జీలుగా బాలీవుడ్ తారలు... వారి కామెంట్లతో షోని ఎంతగానో రక్తికట్టించారు. వారం వారం ఒక టీమ్‌ని తొలగించటంలో ప్రేక్షకులు తమవంతు పాత్రను పెద్ద ఎత్తున పోషించారు. ఎస్సెమ్మెస్‌లు పంపి వారికి సహకరించారు. దీంతో షో రేటింగ్స్ మరింత భారీగా పెరిగాయి.
ఇప్పటికి మూడు సీజన్లు సక్సెస్‌ఫుల్‌గా నిర్వహించుకున్న ఈ షో పోయిన ఏడాది డిసెంబర్ నెలలో కొత్త హంగులను సంతరించుకొని నాలుగో సీజన్‌లోకి అడుగు పెట్టింది. వస్తూ వస్తూ ఒకప్పుడు భారతదేశపు సినీ ప్రేక్షకులని తన అందంతో, నటనతో, డాన్సులతో ఊపు ఊపిన మాధురి దీక్షిత్‌ను జడ్జి రూపంలో తీసుకువచ్చింది. అమెరికాలో సెటిల్ అయిన కారణంగా కొంత కాలంగా తెరమరుగైపోయిన కలల రాణి మాధురిని వారం వారం చూడటానికి... ఆమె జడ్జిమెంట్‌ని వినటానికి ప్రేక్షకులు ప్రతి వారం టీవీ సెట్ల ముందుకు చేరుకోవటం మొదలుపెట్టారు. నవ్వితే నవ వసంతాన్ని చిందించే మాధురి రాకతో ఈ షో లెవల్ మరింతగా పెరిగిపోయింది. ఆమెకు తోడు మున్నీగా బద్నాం అయిన మలైకా అరోరా మరో సెలబ్రిటీ జడ్జి అవటంతో షోకి మరింత గ్లామర్ పెరిగి ప్రేక్షకుల టెంపరేచర్లు పెంచేసింది. మూడో జడ్జ్‌గా బాలీవుడ్ కొరియోగ్రాఫర్ రెమో తన వంతు బాధ్యతను నిర్వర్తిస్తున్నాడు. ఒక షోకి మొదటి సీజన్ విజేత, పాపులర్ నటి మోనాసింగ్‌తో పాటు సుమీత్ రాఘవన్ హోస్ట్‌లుగా వ్యవహరిస్తున్నారు.
ప్రముఖ గాయనీగాయకులు, రియాల్టీ షో విజేతలు, టెలివిజన్ స్టార్లు, స్పోర్ట్స్‌మెన్ ఎంతో ఉత్సాహంగా ఈ పోటీలో పాల్గొని షోని మరింత రక్తి కట్టిస్తున్నారు. సోనీ ఎంటర్‌టెయిన్‌మెంట్ ఛానెల్‌లో ప్రతి సోమ, మంగళ వారాలలో రాత్రి తొమ్మిది గంటలకు ఈ షోని మీరు చూసి ఆనందించవచ్చు.

Source: www.sakshi.com
No comments:
Post a Comment