దేశంలో టివి ఛానెల్స్ ఇబ్బడి ముబ్బడిగా పెరిగిపోయెట్టు ఉన్నాయి. తమకు లైసెన్స్‌లు కావాలంటూ కొత్తగా పెద్ద సంఖ్యలో ఛానెల్స్ యాజమాన్యాల నుంచి వస్తున్న దరఖాస్తులు వెల్లువలా కేంద్రం వద్ద పెరిగిపోతున్నాయి. గత ఏడాది జులై, ఈ ఏడాది జనవరి 19 వరకు కొత్తగా 29 అప్లికేషన్లు సర్కార్‌కు అందాయట. దాంతో వీటి సంఖ్య మొత్తం 293కి పెరిగిపోయింది. దేశంలో ప్రస్తుతం 626 ఛానల్స్ ఉన్నాయి. వీటిలో 314 ఛానెల్స్ ఎంటర్‌టైన్‌మెంట్ ఛానెల్స్ కాగా, 312 ఛానెల్స్ న్యూస్ అండ్ కరెంట్ అఫైర్స్ ఛానల్స్ అని తేలింది. అప్‌లింకింగ్, డౌన్‌లింకింగ్ గైడ్‌లైన్స్ కింద ఈ దరఖాస్తులన్నీ పరిశీలన దశలో ఉన్నాయి. హోంశాఖ నుంచి క్లియరెన్సులు రాగానే వీటికి పర్మిషన్ ఇస్తారు. లైసెన్సుల కోసం దరఖాస్తుల దాఖలు మీద నిషేధాన్ని ఇటీవలే ఎత్తివేశారు. ఛానెళ్ల సంఖ్యపై ఏదైనా సీలింగ్ విధించాలా అన్న విషయాన్ని పరిశీలించాల్సిందిగా టెలికాం రెగ్యులేటరీ అథారిటీ (ట్రాయ్)ని కేంద్రం ఆమధ్య కోరింది. అయితే ట్రాయ్ నివేదిక సమర్పణలో జాప్యం జరుగుతుండడంతో ఈ నిషేధాన్ని ఇటీవలి కాలంలో ఎత్తివేశారు.
Source: medianx.tv
No comments:
Post a Comment