కోట్ల సంవత్సరాల క్రితం రాక్షసిబల్లులు ఉన్నట్టు మనం చదివాం…. వాటి శిలాజాల గురించి తెలుసుకున్నాం. అయితే గత 10 సంవత్సరాల కాలంలో ప్రపంచ వ్యాప్తంగా ఉన్న జంతు పరిశోధకులు లేటెస్ట్ డైనొసార్లకు సంబంధించిన అనేక అంశాలను కొత్తగా అధ్యయనం చేశారు. యంగ్‌జనరేషన్ డైనొసార్ లవర్స్ కోసం బిబిసి ఛానెల్ అప్‌డేట్ ప్రసారాలతో అలరించనుంది. రానున్న తరంవారికి డైనొసార్లతో బాటు టిరన్నోసారస్‌లు, డిప్లోడోకస్ లేదా స్పైనోసారస్ లేదా సముద్ర రాక్షసి ప్రిడేటర్X, మజునాసారస్‌ల వంటి అతి భయంకర జంతువుల గురించి తెలియజేసేందుకు బిబిసి సరికొత్త ప్రయోగాలు చేపట్టింది. త్రీడి గ్రాఫిక్స్‌తో ఈ జంతువుల భీకర పోరాటాలు, వాటి జీవన విధానం, వేటాడే పద్ధతులపై ఈ ప్రసారాలు ఉంటాయి. అలాగే ఆయా దేశాల్లోని నేచురల్ హిస్టరీ మ్యూజియంలలో భద్ర పరచిన ఈ రాకాసి జంతువుల శిలాజాల గురించి, పరిశోధకులు వివరిస్తారు. భూ మండలంలోని అనేక వింత జంతువులు ప్రకృతిలో సంభవించిన మార్పుల కారణంగా అంతరించి పోయాయి. వాటి శిలాజాల కోసం జరుగుతున్న అన్వేషణపై కూడా బిబిసి ప్రసారాలు తెలియజేస్తాయి.
Source: medianx.tv
No comments:
Post a Comment