ప్రేమ కథలన్నీ - ఏ బస్టాప్‌ల్లోనో.. వీధి మలుపుల్లోనో.. కాలేజీ వరండాల్లోనో జరుగుతాయన్నది యుగాల నుంచీ వస్తున్న సంప్రదాయం. కానీ ‘టెర్రస్’ మీద కూడా ప్రేమ కథలు పుడతాయిట. రొమాన్స్‌కి ‘మేనర్స్’ లేనట్టే.. కథ ఎక్కడ మొదలైతే ఏమిటి? మా కథ టెర్రస్ మీద మొదలవుతుంది అంటున్నారు ‘ఛజ్జే ఛజ్జే కా ప్యార్’ నిర్వాహకులు. రొమాన్స్, కామెడీ, ట్రాజెడీ కలబోతగా నిర్మితమవబోతున్న ఈ ‘టెర్రస్’ కథకి గాను పాత ఢిల్లీలో అందమైన సెట్స్ వేశారు. రియాలిటీ షోలకు పెట్టింది పేరైన మేజర్ ఎండెమోల్ ఇండియా ఆధ్వర్యంలో మహేష్ పాండే ఈ కథని రాశాడు. ఇదేదో పెద్దింటి కథ కాదు. పేదింటి కథ. ఒక అమ్మాయికి - ఒక అబ్బాయికి ‘కామన్’గా వాడుకునే టెర్రస్ మీద పరిచయం. ఆ కథ టెర్రస్ మీద ఎనె్నన్ని మలుపులు తిరిగిందో? చూడాలంటే కొన్ని నెలలు ఆగాలి. షూటింగ్ నిర్విఘ్నంగా కొనసాగుతూ ప్రైమ్ టైమ్ కోసం నిరీక్షిస్తున్నట్టు భోగట్టా.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment