Friday, November 26, 2010

IT Raids at TV Anchor Omkar’s House!

TV Anchor, who got popular with his AATA program in ZEE Telugu later moved to MAA TV with TATA DOCOMO CHALLAENGE programme. As per the sources now he is earning crores of rupees per annum with the support from Zee Telugu and MAA TV. Some people also say that his shows are irritating with his over action and also cheap Tricks for Publicity. Recently his AATA program Telecast was also banned by HRC due to the Vulgarity.

Now the latest news is that Anchor Omkar has purchased a couple of villas and a luxurious flat in the popular ’Indu Fortune Fields’ venture near Hitech City. Someone suggested to the Anchor to purchase the flats on some Binami names and that pushed him in problems.
  
There is also a buzz that the anchor’s house was raided a couple of days back by the Income Tax Officials. Though there is no official confirmation, the news is that Omkar has managed them by offering some huge gifts. Industry experts are saying that, a special channel that only telecast reality shows will be started by Omkar soon, if he is earning bucks at such a speed.

Source: www.chitramala.com

Wednesday, November 24, 2010

ప్రయోజనకర ‘న్యాయ సేవ’

‘టీవీ అంటే ఎప్పుడూ సీరియల్సూ, సినిమా క్లిప్పింగులతో కూడిన కదంబ కార్యక్రమాలు, లేకపోతే ఉన్నపాటున జరిగే వింత, వత్తిడులను పెంచే ప్రత్యక్ష ప్రసారాలూ.. అంతేగా.. అంటూ పెదవి విరిచే వారికి కొంచెం ఉపశమనం కలిగించే కార్యక్రమం ఈటీవీ-2లో వచ్చే ‘న్యాయ సేవ’. కాస్త ఉపయోగపడే కార్యక్రమం కూడా. ఇందులో న్యాయవాద వృత్తిలో అనుభవం గడించిన వారు పాల్గొని నిర్దేశించిన విషయ సంబంధిత ప్రశ్నలకి (ప్రేక్షకులు అడిగినవి) సమాధానాలు చెప్తారు. ఇవి వాస్తవానికి అలా అడిగిన వారికే కాక అలాంటి అంశాలకు సమాధానాలు దొరక్క ఆందోళన చెందేవారికి కూడా వీరు చెప్పే పరిష్కారాలు ఉపయుక్తమవుతాయి.
ప్రత్యక్షంలో నివారించాల్సినవి..
ఈ మధ్య చాలా అంశాలు ‘ప్రత్యక్ష’ ప్రసారాలకు నోచుకుంటున్నాయి కనుక దానికి చెందిన అనివార్య అంశాల తీవ్రత తగ్గించడానికి సంబంధితులు సాధన చేయాలి. ముఖ్యంగా తడబాట్లని, తొట్రుపాటుల్నీ యాంకర్లు పరిహరించుకునే ప్రయత్నాలు చేయాలి. ఉదాహరణకు యాంకర్ రెండు మూడుసార్లు పద ఉచ్ఛారణలో తడబడ్డారు (స్వార్జితం.. తదితర పదాలు) అలాగే ఇందులో ప్రశ్నలడిగేవారు కూడా సమయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంశాల్ని క్లుప్తంగా, క్లారిటీతో అడగాలి. అప్పుడు అది వినేవారికి, సమస్యకు పరిష్కారం చెప్పేవారికీ సౌకర్యంగా ఉంటుంది.

Source: www.andhrabhoomi.net

Tuesday, November 23, 2010

ఇక అర్ధరాత్రి తైతక్కలు..

హమ్మయ్య!... కుంభకర్ణ నిద్ర పోతోందనుకున్న కేంద్ర ప్రసార మంత్రిత్వ శాఖ ఎట్టకేలకు ఒక్క కన్నైనా కాస్త తెరిచి చూసింది. జనాన్ని పెడదోవ పట్టిస్తున్న అశ్లీల కార్యక్రమాలను కట్టడి చేసేందుకు ప్రయత్నాన్ని తీవ్ర స్థాయిలో ప్రారంభించింది. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తూ ఎన్నో వివాదాలకు తెరతీసిన ‘బిగ్ బాస్’ రియాల్టీ షోని, ‘రాఖీ కా ఇన్సాఫ్’ ప్రోగ్రాంలపై కేంద్ర సమాచార, ప్రసారాల శాఖ కొరడా ఝళిపించింది. అశ్లీల, అభ్యంతరకర అంశాలను ఎట్టి పరిస్థితుల్లోనూ ఉపేక్షించేది లేదని పేర్కొంటూ, ‘ప్రైమ్ టైమ్ స్లాట్’లో ప్రసారమవుతున్న ఈ షోలను రాత్రి 11 గంటల నుంచి ఉదయం 5 గంటల మధ్య ప్రసారం చేయాలని ఆయా ఛానెళ్లకు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకుండా - వీటిని పునః ప్రసారం చేయకూడదన్న నిషేదాజ్ఞలు విధించింది. ప్రేక్షకుల నుంచి వస్తున్న అభ్యంతరాలనూ, మహిళా సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆయా అంశాలను పరిశీలించిన మీదట ఈ నిర్ణయం తీసుకుంది. అంతేకాకండా - ఎస్‌ఎస్ మ్యూజిక్ తెలుగు ఛానెల్‌పై వారం రోజులపాటు నిషేధాన్ని విధించినట్టు జాతీయ మహిళా కమిషన్ పేర్కొంది. తాజాగా ‘బిగ్ బాస్’ రియాల్టీ షోలో హాలీవుడ్ తార ‘బేవాచ్’ ఫేమ్ పమిలా ఆండర్సన్ ప్రత్యేక అతిథిగా ప్రవేశించటంతో ప్రజల్లో అలజడి మొదలయింది. ముఖ్యంగా యువతని ఆకట్టుకునే రీతిలో ఉంటున్న ఈ కార్యక్రమాల పట్ల పలు మహిళా సంఘాలు తీవ్ర అభ్యంతరాలను వెలిబుచ్చుతూ వీటిని నిషేధించాలని పోరాటాలకు దిగాయి. ‘రాఖీ కా ఇన్సాఫ్’ మరో కేసులో చిక్కుకుని రాఖీని ముప్పుతిప్పలు పెడుతోంది. ఆ షోలో రాఖీ ప్రయోగించిన పరుష పదజాలాన్ని తట్టుకోలేని ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకోవటం వెనుక - రాఖీ పరోక్ష ప్రేరణ ఉన్నట్టు కేసు దాఖలైంది. నేరారోపణ రుజువైతే - రాఖీ ఎంచక్కా ఊచలు లెక్కపెట్టుకుంటూ పదేళ్లు శ్రీకృష్ణ జన్మస్థానంలో మగ్గాల్సిందే.
అసలు కథ..
కలర్స్ ఛానెల్ - విభిన్న తరహా కార్యక్రమాలను రూపొందించటంలో దిట్ట. ఇందుకుగాను ఛానెళ్ల సెలబ్రిటీలనూ -
బాలీవుడ్ నటీ నటులను తెర మీదికి తెస్తుంది. దీంతో ప్రేక్షకుల్లో సహజంగానే ఉత్సుకత నెలకొంది. ఏదో ఒక ఫాంహౌస్‌ని తీసుకోవటం.. చుట్టూ కెమెరాలతో ప్రతి సన్నివేశం దృశ్యీకరించటం.. ఇదీ తతంగం.
ఇక్కడే అసలు కథ మొదలవుతుంది. ఈ సెలబ్రిటీలకు బోలెడంత ఈగో. ఉన్నదానికి లేని దానికి కొట్టేసుకోవటం... రక్కేసుకోవటం - బూతు పురాణాల్ని విప్పేసుకోవటం.. - ఇలా అట్టడుగు స్థాయికి దిగజారిపోతారు. అణువణువుని ఛానెల్ కెమెరా ‘స్కాన్’ చేస్తుందన్న విషయాన్ని సైతం మర్చిపోయి - విచక్షణా జ్ఞానాన్ని కోల్పోయి.. విచక్షణా రహితంగా బూతులు తిట్టుకోవటం ఒక ప్రహసనం. చెంప దెబ్బలూ - బూటు దెబ్బలూ సహజాతి సహజం. ఈ నేపథ్యంలోనే ఆంతరంగిక పొరల్లోకి సైతం వెళ్లిపోయి ఒకరినొకరు దూషించుకోవటం - తమతమ పర్సనల్ బాగోతాల చిట్టాని విప్పటం - ఇదంతా ‘రూం’లో జరిగే ఒక కోణం. మరో కోణంలోంచి చూస్తే - అశ్లీలత.. అసభ్యకర ప్రవర్తన. జనం చూస్తున్నారన్న (?) మాటని మర్చిపోయి వారికి వారే ఒంటరిగా ఉన్నామన్న భావనలోకి వెళ్లి - విచ్చలవిడితనాన్ని ప్రదర్శించటం. ‘బిగ్ బాస్’ హౌస్‌లో డాలీ బింద్రా - సమీర్ సోనీల తిట్ల దండకాన్ని మళ్లీమళ్లీ చూపిస్తూ.. ప్రేక్షకుల్లో ఉత్కంఠని రేకెత్తించటం ఒక సంగతైతే - ఈ హౌస్‌లో ప్రవేశించిన సారా ఖాన్ - అలీ మర్చంట్‌లు అత్యంత సన్నిహితంగా మెలగి.. ఆ తర్వాత వారిలో ప్రేమ అంకురించి పెళ్లికి దారి తీసింది. ఇంతవరకూ ఓకే. కానీ ఆ తర్వాతి ‘హాట్‌హాట్’ సన్నివేశాలను ‘స్పై’ కెమెరాతో చిత్రీకరించి ప్రసారం చేయటం ఏ ‘టిఆర్‌పి’ కిందికి వస్తాయో తెలీదు. ఇక పాకిస్తాన్ నటీమణి వీణా మాలిక్ - అస్మిత్ పటేల్‌ల ప్రేమాయాణం విశృంఖలత్వాన్ని దాటి విర్రవీగింది. మధ్యలో వైల్డ్‌కార్డ్ ఎంట్రీతో ప్రవేశించిన డాలీ బింద్రా మధ్య రాద్ధాంతం - ఈ అసలు కథ వెనుక ఎనె్నన్నో మలుపులు. మరెన్నో తిరకాసులు.
టిఆర్‌పి సెన్సెక్స్..
పమెలా ఆండర్సన్ అనే హాలీవుడ్ భామ రియాల్టీ షోలో ‘తెల్ల చీర’ కట్టుకునే వచ్చేప్పటికి ఒక్కసారిగా టిఆర్‌పి న్యూ రికార్డు సృష్టించింది. సారా ఖాన్ - అలీ మర్చంట్ వెడ్డింగ్ ఎపిసోడ్‌తో 4.4 పాయింట్లకు చేరుకున్న టిఆర్‌పి ఏకంగా 4.9కి వచ్చేసింది. భారతీయులు మనీ గేమ్‌ని ఇష్టపడతారని ఒక సర్వే చెప్పిన దాన్ని తు.చ తప్పకుండా పాటింపజేస్తున్న ‘కౌన్ బనేగా కరోడ్‌పతి’ ప్రస్తుతం 4.8 రేటింగ్ వద్ద ఆగిపోయింది. ఇంతాచేస్తే - హాలీవుడ్ భామ బాలీవుడ్‌కి బోలెడన్ని ఆఫర్లు ఇచ్చేసి - మూడు రోజుల ప్రయాణానికి 2.5 కోట్లు వసూలు చేసి మరీ వెళ్లిపోయింది.

Source: www.andhrabhoomi.net

ప‘మిలమిల’ అదుర్స్!

‘బిగ్ బాస్’ -4 సీజన్ మొదలైందగ్గర్నుంచీ అది చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సృష్టించినన్ని సంచలనాలూ అన్నీ ఇన్నీ కావు. తాజాగా హాలీవుడ్‌లో ‘బేవాచ్’ సీరియల్‌తో స్వదేశీ విదేశీ కుర్రకారుని ఉర్రూతలూగిస్తూ ముప్పాతిక నగ్నత్వాన్ని ప్రదర్శించిన పమెలా ఆండర్సన్ మన దేశానికి విచ్చేస్తుందంటేనే వొళ్లు పులకరిస్తుంది. అటువంటిది ‘శే్వతాంబర ధారియై’ వస్తూంటే అడ్డుకునేదెవరు? సాక్షాత్తు దేవత ప్రత్యక్షమైనట్టు ఫీలయ్యారు? ఇటు పత్రికలూ ఛానెళ్లు ముఖ్యంగా కలర్స్ ఛానెల్ బోలెడంత పబ్లిసిటీ ఇచ్చేసింది. ఇంటర్వ్యూలూ ప్రసారం చేసింది. పమెలా యధోచితంగా -కావల్సినన్ని వాగ్దానాలూ మెచ్చుకోళ్లు.. ఎనె్నన్నో మాట్లాడేసింది. బాలీవుడ్ అంటేనే అదో కలల ప్రపంచం అంది. పాటలూ డాన్సులతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారంది. వీలైతే - అవకాశం ఇస్తే బాలీవుడ్‌లో సినిమాలు చేయటానిక్కూడా వెనుకాడనంది. మూడు రోజులకు దాదాపు మూడుకోట్లు ఖర్చయింది. ఇక ఈ బేవాచ్ బేబీ ‘మిల్కీ వైట్ శారీ’ని డిజైన్ చేయటానికి ప్రముఖ డిజైనర్ అశే్ల రెబెల్లో పూనుకున్నాట్ట.
పమెలా ఆండర్సన్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటుందన్న ప్రచారం ఎవరికి లాభం చేకూర్చిందన్న మాట పక్కనబెడితే ‘బిగ్ బాస్’ సీజన్-2లో ‘జాడె గూడీ’ జర్మన్ మోడల్ ‘క్లాడియా సిస్లా’ సీజన్ -3లోనూ కనిపించినప్పటికీ ఇంత ప్రచార ఆర్భాటం లేదు. ‘కుక్క అని తిట్టిందనో.. పంది అన్నదనో - ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం ఈ షోకి మంచి పేరు తెచ్చిపెట్టింది.

Source: www.andhrabhoomi.net

వీక్షకుల తీర్పు

ఉత్తరాల కార్యక్రమం
అప్పట్లో జెమిని టీవీవారు ‘పోస్ట్‌బాక్స్’ పేరిట టీవీ వీక్షకుల అభిప్రాయాలు ఉత్తరాల ప్రోగ్రాం ప్రసారం చేసేవారు. ఇప్పుడా ఊసే లేదు. తమతమ ఛానల్ ప్రోగ్రాంలు ఎలా ఉన్నాయో తెలుసుకోవడానికి గాను అన్ని ఛానల్స్ వారు వీక్షకుల అభిప్రాయాల పేరిట ఉత్తరాలు ఆహ్వానించి వారంవారం ప్రసారం చేస్తే బావుంటుంది. అలా చేయడంవల్ల తమ తప్పులు సరిదిద్దుకోవచ్చు కదా.
-ఎల్.ప్రఫుల్లచంద్ర (ధర్మవరం)
‘మా దుర్గమ్మ’
మాటీవీలో వస్తున్న ‘మా దుర్గమ్మ’ (సా.6 గంటలకు) సాంకేతికంగా గొప్పగా లేకపోయినా దుర్గమ్మగా నటించిన శాలిని కపూర్ దేవతా కళ ఉట్టిపడే ప్రసన్న వదనంతో అద్భుతంగా ఉంది. రాక్షసులతో యుద్ధం చేసేటప్పుడు రౌద్రం కూడా చక్కగా ప్రదర్శిస్తోంది. ఎపిసోడ్ అంతా పూర్తిగా చూడకపోయినా దుర్గమ్మ కనిపించే ఘట్టాలు చూస్తే చాలు తృప్తిగా ఉంటుంది. సంగీతం గానీ.. కథనం గానీ బాగోలేవు. యుద్ధ దృశ్యాలు, పోరాట దృశ్యాలు నాసిరకంగా ఉన్నాయి.
-చంద్ర (కాకినాడ)
ఓ రాణిగారి కథ
మాటీవీ ప్రసారం చేస్తున్న ‘ఓ రాణిగారి కథ’ సీరియల్ బావుంటోంది. ముందు ముందు కూడా ఇదే మొరాలిటీతో.. ఇంతకు ఏ మాత్రం విలువలను మార్చకుండా కథను నడిపిస్తే ‘క్లిక్’ అవుతుంది. ఇలా ఏదైనా సమాజానికి మంచి చేయాలన్నా, పదిమంది హర్షించాలన్నా, కొంతమందికైనా మార్గదర్శకత్వం కావాలన్నా ఇలాంటి సీరియల్స్ ప్రస్తుత సమాజానికి ఎంతైనా అవసరం. కత్తులు, కటారులు, కుళ్లు కుతంత్రాలు, ఎత్తులు పైఎత్తులు ఇలాంటి విష సంస్కృతులను ఇంజెక్ట్ చేస్తూ ఎపిసోడ్లుగా నానా చెత్తా చెదారాన్ని ప్రేక్షకులపై గుమ్మరిస్తూ చేతులు దులిపేసుకునే మగానుభావులారా ఒక్కసారి ఆలోచించండి.
ఏ మాత్రం పొసగని రెండు మతాల మధ్య జరిగే జీవన మాధుర్యాన్నీ, వైవిధ్యాన్నీ ఎంచక్కా ఎవరినీ నొప్పించకుండా ఎక్కడా కించపరచకుండా కించిత్ పొరపాటును సైతం చేయకుండా వీక్షించే ప్రేక్షకులను సైతం మంత్రముగ్ధులను చేస్తున్న ఈ సీరియల్ ప్రస్తుత తరుణంలో ఎంతైనా అవసరం.
-కొంగర ఉమామహేశ్వరరావు (తెనాలి)
ఆపండి..?!
ఇటీవల ప్రసారమైన ‘బాలికా వధు’ ఎపిసోడ్‌లో ర్యాగింగ్ సంస్కృతిని అంతగా చూపించాల్సిన అవసరం లేదేమో?! ఒక అమ్మాయిని పీకల్లోతు నీటిలో ముంచి ర్యాగింగ్ చేయటం యువతకు సరికొత్త పాఠాలు నేర్పినట్టవుతుంది. ఈ సమస్య ఇప్పటికే ఎన్నో జీవితాలను నాశనం చేసింది. మళ్లీమళ్లీ ఆ సంస్కృతిని తెరపై చూపాల్సిన పనిలేదు. అలాగే - ‘సిగరెట్ తాగటం ఆరోగ్యానికి హానికరం’ అంటూ సబ్ టైటిల్స్ వేసినట్టు వేస్తూ - తెరపై సిగరెట్ తాగే దృశ్యాలను తెర మరుగు చేస్తే మరింత మంచిది. ఇటువంటి రెచ్చగొట్టే సన్నివేశాలు ఉన్నంత మాత్రాన సీరియల్‌కి వొరిగే ప్రయోజనం ఏమీ లేదు.
-పి.బాబ్జీ (కోడిపర్రు)

Souce: www.andhrabhoomi.net

జీ తెలుగులో 'పసుపు--కుంకుమ'

అమ్మానాన్న, తమ్ముడు...ఇదే ప్రపంచంగా భావించే ఓ అమ్మాయి జీవితం విధి బలీయంతో ఎలాంటి తీరాలకు చేరింది. పసుపు, కుంకుమలకు విలువనిస్తూ, సంప్రదాయాల్నీ, సంస్కృతిని పరిరక్షిస్తూ తనవారి కోసం పాటుపడే ఆ మహిళ ఇతివృత్తమే 'పసుపు-కుంకుమ' సీరియల్‌. జీతెలుగు టీవీ, అన్నపూర్ణా స్టూడియోస్‌ సంయుక్తంగా రూపొందిస్తున్న ఈ మెగా డైలీ సీరియల్‌ సోమవారం నుంచి శుక్రవారం వరకు ప్రతిరోజు రాత్రి 7-30 గంటలకు ప్రసారమవుతోంది.

ఈ సందర్భంగా సీరియల్‌ గురించి అక్కినేని నాగార్జున మాట్లాడుతూ, 'ఓ చక్కటి కుటుంబ కథతో రూపొందిస్తున్న ఈ సీరియల్‌ ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంటుందన్న నమ్మకం ఉంది. ఎన్నో జీవితాల మలుపులను ఇందులో చూడవచ్చు' అని చెప్పగా, ప్రతి మహిళకు నచ్చే, మెచ్చే ఎన్నో అంశాలు ఈ సీరియల్‌లో ఉన్నాయని జీ తెలుగు బిజినెస్‌ హెడ్‌ జి.అనురాధ తెలిపారు.

Source: www.andhraprabhaonline.com

Monday, November 22, 2010

Gemini Music enters reality format with Miss Perfect Vizag

BANGALORE: The Sun Network's Telugu music television offering Gemini Music is all set to enter the reality format. It will begin airing ‘Santoor Miss Perfect Vizag’ (MP-V) twice a week at the 8 pm slot on Mondays and Tuesdays starting 22 November.

Eight episodes of MP-V will be aired over a four-week period.

Sun Network Channels – Telugu Cluster Business Head Sanjay Reddy says, “Why should reality TV be restricted to GEC and why not other genres, hence we started with it with the Music genre targeting youth. Later we will move to comedy genre. This will start a trend among niche channels giving opportunity to much talent which otherwise goes unnoticed”.

On the success of MP-V, Gemini Music plans to replicate the format in other major towns of Andhra Pradesh to culminate with Miss Perfect Andhra Pradesh where the winners from each of the centers will be pitted against each other.

Gemini Music claims that unlike other competitions where the contestants are singularly judged on their looks, the MP-V search went beyond looks while judging the contestant's knowledge of art, culinary skills, knowledge of tradition, and social responsibility.

The MP-V contestants had to undergo three phases during the show - the first phase involved sceening all the applicants from which 8 participants were shortlisted. In the second phase these 8 contestants were put through rounds of makeover to personality shaping rounds. The third phase involved the contestants demonstrating their skills in front of select audience that included prominent Telugu film
personalities like model and female actor Tapsee Pannu, Hollywood female actor Lakshmi Manchu and theater guru Satyanand. 
 
Santoor, the flagship sandalwood soap brand of Wipro Consumer Care and Lighting (WCCL), partnered with the first outing at Visakhapatnam (Vizag). Among the associate sponsors is Chennai based Pothys Silks.

Source: www.indiantelevision.com

‘సాక్షి’ కధనం పై అధిష్టానం ఆగ్రహం

న్యూఢిల్లీ:  సాక్షి మీడియాలో ఏఐసిసి అధ్యక్షురాలు సోనియాగాంధీకి వ్యతిరేకంగా వచ్చిన వార్తల పై  ఏఐసిసి తీవ్రంగా మండిపడుతోంది.  అయితే తమకు ఇంతవరకు ఆ కథనాలపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఏఐసిసి వర్గాలు తెలిపాయి. నివేదిక అందిన తర్వాతే చర్యలుంటాయన్నారు. సమగ్ర నివేదిక అందించాల్సిందిగా పిసిసిని ఏఐసిసి కోరింది. నివేదిక అందిన తర్వాతనే షోకాజ్ నోటీసుపై నిర్ణయముండే అవకాశముంది. పిసిసి చీఫ్ డి శ్రీనివాస్ వెంటనే అధిష్టానానికి నివేదిక పంపినట్లు సమాచారం. కాగా కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీపై వచ్చిన ఆరోపణలు వాస్తవ విరుద్ధమని రాష్ట్ర హోంమంత్రి సబితారెడ్డి అన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీని రెండుసార్లు అధికారంలోకి తీసుకువచ్చిన ఘనత సోనియాగాంధీదేనని అన్నారు. కాగా జగన్ కు షోకాజ్ నోటీసు ఇచ్చే అవకాశం లేదని గోనె ప్రకాశరావు ఓ టీవీ ఇంటర్వ్యూలో అన్నారు. ఆయన క్షమాపణలు కోరే అవకాశముందన్నారు.

Source: www.teluguone.com

“సాక్షి”లో సోనియా ఇమేజ్ డామేజ్

హైదరాబాద్: కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వ్యతిరేకంగా సాక్షి దినపత్రికలో, టీవీ చానెల్లో వార్తాకథనం ఇవ్వడంతో రాష్ట్ర కాంగ్రెసు నాయకులు కొంత మంది వైయస్ జగన్ పై ప్రత్యక్ష సమరానికి దిగారు. ప్రదేశ్ కాంగ్రెసు కమిటీ (పిసిసి) అధ్యక్షుడు డి. శ్రీనివాస్ కూడా సాక్షి వార్తాకథనాన్ని వ్యతిరేకించారు. వైయస్సార్ ఎప్పుడు కూడా సోనియాపై, రాజీవ్ పై విమర్శలు చేయలేదని చెప్పారు. వైయస్సార్ ఏనాడూ కాంగ్రెసు జెండాను వీడలేదని చెప్పారు. తద్వారా ఆయన వైయస్ జగన్ పై పరోక్షంగా విమర్శలు చేశారనే అనుకోవాలి. కాంగ్రెసు నాయకుడు వి. హనుమంతరావు, మంత్రి బొత్స సత్యనారాయణ ప్రత్యక్షంగానే జగన్ పై విమర్శలు చేశారు. సీనియర్ కాంగ్రెసు శాసనసభ్యుడు పి. శంకర్ రావు తీవ్రంగా ప్రతిస్పందించారు. సాక్షిని నిషేధించాలని శంకరరావు డిమాండ్ చేశారు. సోనియాకు వ్యతిరేకంగా వార్తాకథనం ఇచ్చినందుకు 24 గంటలలోగా క్షమాపణ చెప్పాలని, లేకుంటే సాక్షి కార్యాలయం ముందు ధర్నాకు దిగుతానని ఆయన హెచ్చరించారు. ఇష్టం లేకపోతే పార్టీ నుంచి వెళ్లిపోవాలని కూడా అన్నారు. వైయస్ జగన్ అహంభావానికి ఆ వార్తాకథనం నిదర్శనమని ఆయన అన్నారు. ఈ వ్యాఖ్యలను బట్టి చూస్తే వైయస్ జగన్ పై పార్టీ అధిష్ఠానం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. దీన్నిబట్టి చూస్తె జగన్ కొత్త పార్టీ కోసం అన్ని ఏర్పాట్లు దాదాపుగా సిద్ధం చేసుకున్నట్లే కనబడుతోంది. జగన్ అనుసరిస్తున్న మార్గాన్ని చూస్తుంటే కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టడం ఖాయమనే సూచనలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఆ దిశగా ఆయన అడుగులు వేస్తున్నట్టు తెలుస్తోంది. ముఖ్యంగా, సోనియానే టార్గెట్ చేస్తూ తన సొంత మీడియాలో ప్రసారం, ఎప్పటి నుంచో ప్రచురిస్తున్న కొన్ని కథనాలు ఈ విషయాన్ని రూఢీ చేస్తున్నాయని అంటున్నారు. అదును చూసి రోశయ్య సర్కారును కూల్చి ముందస్తు ఎన్నికలకు కూడా సిద్ధం కావాలన్న ఏకైక అజెండా, వ్యూహరచనతో ఆయన అడుగులు వేస్తున్నట్టుగా కనిపిస్తోంది.

Source: www.teluguone.com

Thursday, November 18, 2010

Govt plays censor: No 'adult' shows on TV before 11 pm

Faced with numerous complaints from viewers and women's outfits about indecent content, the Information and Broadcasting Ministry has asked channels airing TV shows 'Bigg Boss' and 'Rakhi ka Insaaf' to air them only between 11 pm and 5 am, virtually bracketing them as only for adult viewing. 

Both shows are not for universal viewing and can be aired only in the scheduled time slot, Information and Broadcasting Ministry officials said. 

The shows cannot also be repeated in any other time slot or shown on news programmes, they said.
While 'Bigg Boss' is being aired on Colors, 'Rakhi ka Insaaf' is aired on NDTV Imagine. Both are prime time shows. 

Officials claimed this is the first time that the ministry has compulsorily changed time slots of popular TV shows.
The ministry also banned Telugu SS music channel for seven days for allegedly showing nudity.

The decisions were taken at an inter-ministerial meeting on Monday represented by additional secretaries from the Ministry of Home, Women and Child Development, External Affairs and Information and Broadcasting. 

Numerous complaints have been made by viewers as well as the National Commission for Women and social activists who accused the channels of showing explicit content. 

The decision would be effective with immediate effect that is from today, the officials said. 

"We have not asked the producers of the show to modify content or have not done any sort of censoring, just shifted the time slots allotted to them," senior ministry officials said. 

The meeting had been called after round-the-clock monitoring of the channels. 

'Rakhi ka Insaaf', compared by actor-dancer Rakhi Sawant, hit the spotlight after Laksham Prasad, a resident of Jhansi, committed suicide, which his family alleged, was following the humiliation meted out to him on the show. 

His family said the youth was upset after Rakhi described him as "impotent" and had gone into depression and refused to eat anything for several days. 

Complaints have also been received about the "abusive" language and intimate scenes on 'Bigg Boss', the officials said. 

Source: www.indianexpress.com

Now, a TV channel from saffron stable

HYDERABAD: If TV viewers in the state thought that there is an overkill of news channels projecting the political news and viewpoints of leading politicians and parties, the field might get a little more crowded in a few months time.

Convinced that the idiot box is the route to political success and growth, state BJP president G Kishan Reddy too is all set to go live 24/7.

Kishan Reddy told TOI that a TV news channel is on the cards but clarified that it will not be the mouthpiece of the BJP but more to project his agenda though it will be in sync with the party's to a large extent. "The channel is on course but still a few months away as there are several loose ends that needs to be tied up," he said.

What sounds interesting is the appetite for risk by the young BJP president to project himself as a potential leader and venture into a domain that continuously bleeds owners revenue. That too at a time when the public is already exposed to 32 local TV channels. The minimum amount required to launch a channel would be about Rs 16 crore and can go up to about Rs 50 crore with the monthly operational cost hovering in the range of Rs 2 crore to Rs 10 crore. Kishan Reddy, however, was not willing to reveal the start-up or operational cost of his channel. It is not known whether the Reddy brothers from neighbouring Karnataka would have anything to do with the channel.

Separatist party, Telangana Rashtra Samiti, has a dedicated news channel 'Raj News' to propagate the cause of Telangana, while other channels like Zee 24 Gantalu and HMTV are suspected of having a leaning towards Telangana.
Though it supposedly began as a Congress mouthpiece, Sakshi TV became the voice of Kadapa MP Y S Jaganmohan Reddy. Other news channels like TV5, iNews and NTV too have a pro-Jagan slant.

Besides active backing of channels like ETV, Mahaa TV and ABN Andhra Jyothy, the Telugu Desam Party has an exclusive channel in Studio N. Interestingly, Gemini News, owned by Sun Network, and the top-rated Telugu news channel TV9, for now, are not directly linked to any particular political party in the state. Praja Rajyam Party president K Chiranjeevi has a television channel of his own, Maa TV, but has abandoned its news division. It, however, promotes movies of Chiranjeevi and his family members in a big way.

Given such background, Kishan Reddy's move to launch a TV channel doesn't really come as a big surprise, though it arouses enough curiosity on the kind of flavour it would adopt to make an entry with a bang.

The BJP chief's aides said he has been working overtime to rope in like-minded people to make the channel a reality.

"Kishan is testing the waters, especially when the Telangana movement has reached a critical phase. We also want to reach out to the people of Telangana region and spread word that BJP alone was the first political party to have made up its mind on the formation of a separate state and it was the only effective political alternative to the Congress party," an aide of the BJP president said.  

Source: timesofindia.indiatimes.com

Wednesday, November 17, 2010

తెలుగు లైవ్ టీవీ ఛానెల్స్ వెబ్ సైట్స్.

http://telugutelevisionmedia.blogspot.com/2010/11/blog-post_12.html

మళ్ళీ చిరంజీవి వైపుకి రోజా

హైదరాబాద్: ప్రముఖ సినీ నటి, రాజకీయ నాయకురాలు రోజా ప్రజారాజ్యం పార్టీ అధినేత చిరంజీవికి దగ్గర కావడానికి ప్రయత్నిస్తున్నట్లు అర్థమవుతోంది. ఇటీవలి కాలంలో ఆమె చిరంజీవికి అనుకూలంగా మాట్లాడుతున్నారు. రాజకీయంగా ఇప్పుడు  వైయస్ జగన్ వెంట ఆమె ఉన్నప్పటికీ, జగన్ కు అనుకూలంగా మాట్లాడుతున్నప్పటికీ చిరంజీవి వైపు వెళ్లడానికి వెనకాడకపోవచ్చునని ఆమె మాటలు తెలియజేస్తున్నాయి. జన్మదినం సందర్భంగా ఆమెను పలు టీవీ చానెళ్లు బుధవారం ఇంటర్వ్యూ చేశాయి. ఈ ఇంటర్వ్యూల్లో ఆమె చిరంజీవికి అనుకూలంగా మాట్లాడి అందరినీ ఆశ్చర్యపరిచారు. గతంలో చిరంజీవిని ఐరన్ లెగ్ గా, మహిళల వ్యతిరేకిగా ఆమె ఆడిపోసుకున్నారు. అయితే, ఇప్పుడు తన మనసు మార్చుకున్నట్లు కనిపిస్తున్నారు. సినిమాలో చిరంజీవితో స్టెప్పులు వేయడానికి తనకు అభ్యంతరం లేదని చెప్పిన రోజా ఇప్పుడు రాజకీయంగా కూడా బలపరిచేందుకు సిద్ధపడినట్లు కనిపిస్తోంది. ఎవరు ముఖ్యమంత్రి కావాలని మీరు కోరుకుంటున్నారని మీడియా ప్రశ్నిస్తే ఏ మాత్రం తడుముకోకుండా వైయస్ జగన్ అని చెప్పేశారు. అయితే ఆ వెంటనే సర్దుకున్నారు. రాజకీయంగా చిరంజీవి పరిణతి సాధించారని, చిరంజీవి ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నానని ఆమె చెప్పేశారు. దీన్ని బట్టి ఆమె అంతరంగమేమిటో అర్థమవుతోందని అంటున్నారు. ప్రస్తుతానికైతే ఆమె చిరంజీవి 150వ చిత్రంలో నటించి తీరాలనే ఉద్దేశంతో ఉన్నట్లు తెలుస్తోంది.

Source: www.teluguone.com

Tuesday, November 16, 2010

KBC Now On Mobile, Just One Option Play It!

As the Kaun Banega Crorepati phenomenon continues, Multi-Screen Media and UTV Indiagames have now come together to make the game available on your mobile phone!

During the game, the contestant must answer each question correctly in the given time frame and if answered incorrectly, the user will leave with the last checkpoint amount. Like the on-air version at any time, the gamer can walk away with the amount of money won.

A total of 13 questions of progressive difficulty will need to be answered, by the gamer to virtually experience the triumph of winning Rs. 5 Crore!But that’s not all.

One can also avail of lifelines like like Phone a Friend, where the user can reach out to 3 virtual friends to seek help, Audience Poll where the results of audience’s choice of answers are flashed on the screen the two new lifelines have also been included, hence contestants can choose to Call an Expert which allows you to call up any one of the four available experts or Double Dip which allows you 2 chances to answer a question correctly.

Speaking on the launch of the mobile game, Mr. Samir Bangara, COO, UTV Indiagames, said “Kaun Banega Crorepati is undoubtedly one of the nation’s most watched shows and the format lends itself to enable fans to experience the excitement on the mobile screen. The minute aspects of the game have been captured on the phone and the simple,user friendly interface makes it a classic – easy to play but hard to master- game similar to its real life avatar on Television”

Source: telecomtalk.info

జయెహో! సక్సెస్ మంత్ర!

‘నాకస్సలు టైమ్ లేదండీ..’ అంటూ అలా ఎందుకు టైమ్ లేదో అన్న దానిపై బోలెడంత సేపు సమయం వెచ్చించేస్తూ ఉంటారు చాలామంది. అలా అనుపయోగ కార్యక్రమాలపై అంతులేని సమయం కేటాయిస్తూ పోయే వాళ్లు గుర్తెరిగేలా అనుకుంటా ‘జయహో సక్సెస్ మంత్ర’ (హెచ్‌ఎంటివిలో రోజూ ఉదయం 7.30కి వస్తుంది)లో వ్యక్తిత్వ వికాస నిపుణుడు జవహర్‌లాల్ నెహ్రూ సోదాహరణంగా మాట్లాడారు. మామూలుగా ఛానల్స్ ఈ సమయం (ఉ.7.30) ఆ రోజు పేపర్ల వార్తలపై వ్యాఖ్యలూ వగైరా ప్రసారం చేయడానికి ఆసక్తి చూపిస్తే హెచ్‌ఎంటివి మాత్రం ఇలా వైవిధ్యభరితమైన అంశాన్ని ఎంచుకుని ప్రసారం చేయడం అభినందనీయం. ఇలా రోజుకో పనికి వచ్చే అంశంపై నిష్ణాతులైన నిపుణులతో చర్చింపజేయడమూ జనావళికి ప్రయోజనకరమే. అయితే చర్చించే సమస్యల్ని అధిగమించడానికి ఆచరణ సాధ్యంకాని సలహాలూ, సూత్రాలూ కొన్ని సందర్భాలలో ఇవ్వడమే కొంత ఇబ్బందనిపిస్తోంది. ఎందుకంటే ‘ఈ ప్రాబ్లమ్‌ని ఎదుర్కోడానికి ఇలాంటి పంథాను అవలంబించాలి’ అని చెప్పడం వరకూ ఓకే. కానీ క్షేత్ర స్థాయిలో వాటి నాచరించే సమయంలో ఉత్పన్నమయ్యే సమస్యల మాటేమిటో ప్రస్తావించడం జరగడంలేదు. కానీ ప్రసంగించే వ్యక్తులకున్న అపార అనుభవం తద్వారా వారు వెల్లడించే కొన్ని అభిప్రాయాలూ మాత్రం తప్పనిసరిగా యువతకు సహాయకారే అవుతాయి. ఈ చర్చల ద్వారా మనకు బాగా తెలిసున్న పద సముదాయాలకే కొన్ని కొత్త కోణాలూ అవిష్కృతమవుతున్నాయి. ఉదాహరణకు అక్టోబర్ 27న చర్చించిన దాంట్లో స్వార్థం లేకపోతే మనిషి మరణించినట్లే లెక్క అని ధృవీకరిస్తే దానినే మరో రకంగా ‘స్వార్థాన్ని ఆ పేరుతో పిలవద్దు - ‘నిర్మాణాత్మక భౌతిక వాదం (కనస్ట్రక్టివ్ మెటీరియలిజమ్) అందాం అని నవంబర్ 13న ప్రసారమైన ‘నాయకత్వం’ అంశంపై చెప్తూ మరో నిపుణుడు అన్నారు. తన వరకూ తనకు కావలసిన దానికి ఆశ పడటం అందుకు ప్రయత్నించడం తప్పు కాదు. కానీ అంతా తనకే కావాలనుకున్నప్పుడే పేచీ అంతా వస్తుంది అన్నది దీని అంతరార్థం. అలాగే మరో రోజు ఇంకో టాపిక్‌ని స్పృశిస్తూ ‘అర్హతకు మించిన అహంకారం’ ‘అర్హతకు మించిన లక్ష్య నిర్దేశం చేసుకోవడం వల్లే సమస్య వస్తోంది’ అని తెగేసి చెప్పడం బావుంది. (నవంబర్ 8న ప్రసారమైనది) అదే విధంగా ‘పిల్లల్ని పెంచడం ఎంత గొప్ప కళో మరో రోజు వివరిస్తే, ఇంకో రోజు పని మీద ఏకాగ్రత కావాలంటే ఏం చేయాలో అన్న దానిపై చక్కటి సూచనలిచ్చారు.
పదాడంబరం అనవసరం
ఇవన్నీ వస్తు ఆధారిత, వాస్తవ అంశాల కార్యక్రమాలు కనుక వీటిలో అనవసర పదాడంబరం కోసం ప్రయాస పడనక్కరలేదు. కానీ విచిత్రంగా ఈ ప్రోగ్రామ్‌లో అదే ఎక్కువగా చోటు చేసుకుంటోంది. నాయకత్వ లక్షణాలు ఎలా ఉండాలో వివరిస్తూ ఓ సందర్భంలో నిర్వేదం, నిరుత్సాహం.. అంటూనో, ఉత్సాహం, ఉల్లాసం.. అంటూ ఇంకోసారి చెప్పేశారు. ఈ పద దట్టింపు అనవసరం. అలాగే ఇంకో కార్యక్రమంలో.. ‘చేయలేని’ చేయించుకోలేని’ ‘చేసుకోలేని’ పరిస్థితి అంటూ భాషాడంబరానికీ పోయారు.
సరళీ మార్చాలి..
ముందుగా అనుకున్న అంశాన్ని యాంకర్ నిపుణున్ని అడగడం, ఆయన వివరించడం, అనంతరం ప్రోగ్రామ్‌లో పాల్గొన్న విద్యార్థులు ప్రశ్నలడగడం, వాటికి జవాబులు చెప్పించడం పద్ధతిలో సాగుతోంది. విషయ వివరణకు, ఉన్న సమయంలో అందరూ అవలంబించే సులభ శైలి ఇదే అయినా రోజువారీగా సుదీర్ఘ కాలంగా కొనసాగుతున్న వైనం వల్ల ఈ పోకడలో మార్పు రావాలి. ముఖ్యంగా కొన్ని కార్యక్రమాల్లో స్టూడెంట్స్ ప్రశ్నలడిగే తీరు చాలా కృతకంగా ఉంటోంది. కార్యక్రమానికి తగినంత ముందుగా చర్చించబోయే అంశం పట్ల నిర్వాహకులు సరైన అవగాహన కల్పించినట్లైతే ఇంకా మెరుగైన విధంగా ప్రోగ్రామ్ రూపొందే అవకాశం ఉంది. అలాగే అడిగే ప్రశ్నల్లో కొన్నిచోట్ల స్పష్టత లోపిస్తోంది. దాన్ని కవర్ చేయడానికి, మీరడిగింది అర్థమైంది. అది.. ఇది కదా.. అంటూ రెండింటినీ సమన్వయపరుస్తూ శ్రమ పడాల్సిన బాధ్యత జవాబులిచ్చేవారు వహించాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా చిన్నచిన్న పొరపాట్లున్నప్పటికీ, టివి సమయాన్ని సద్వినియోగ పరుద్దామనే తలంపుతో తలపెట్టిన కార్యక్రమంగా జయహో సక్సెస్ మంత్రని నిరభ్యంతరంగా పరిగణించవచ్చు.

Source: www.andhrabhoomi.net

న్యూస్ ఛానెల్స్‌కి దొంగల భయం?!

ప్రతి న్యూస్ ఛానల్‌లో కనిపించే పదం ఎక్స్‌క్లూజివ్. న్యూస్ చిన్నదైనా, పెద్దదైనా.. పట్టున్నదైనా, పటుత్వం లేనిదైనా మేమే ముందు మీకు చూపిస్తున్నాం సుమా..! అని చెప్పడానికన్నట్లు ఎక్స్‌క్లూజివ్ అనే ముక్క స్క్రీన్‌పై అలా కనిపిస్తూనే ఉంటుంది. ప్రేక్షకుడు పక్క ఛానల్ ఏం చేస్తుందా? అని రిమోట్ నొక్కితే అక్కడా ఇదే చిత్రం అదే మాట కనిపిస్తుంది. ఈ విషయంలో ఏ ఛానల్ ముందు ప్రసారం చేసిందో అర్థంకాక తానే రిమోట్ నొక్కడంలో వెనుకబడి పోయానని తనను తానే నిందించుకునే పరిస్థితిలో పడిపోతున్నాడు. న్యూస్‌కి విలువ ఎలక్ట్రానిక్ మీడియా పుణ్యమాని గణనీయంగా తగ్గిపోయింది. న్యూస్ చూసి బాధపడటం, న్యూస్ చూసి జాలి పడటం ప్రేక్షకుల్లో నశించిపోయాయి. న్యూస్‌ని ఇట్టే చూసి ఆట్టే మరిచిపోయే స్థితికి ప్రేక్షకులను న్యూస్ ఛానల్స్ తెచ్చేసాయి. అందుకే న్యూస్‌కి విలువ న్యూస్‌కి ఆదరణ తగ్గిపోయి టేకిట్ ఈజీ పాలసీలోకి న్యూస్ వెళ్లిపోయింది. అలాంటి న్యూస్‌కి మసాలా బాగా దట్టించి కమింగ్ అప్‌లుగా వేసి రంజుగా వంటకం చేసి వీక్షకుడికి అందించడంలో న్యూస్ ఛానల్స్ పరిగెడుతున్నాయి. 24 గంటల న్యూస్ వంటకం కోసం సమాజ మార్కెట్‌కి వెళ్లి న్యూస్ ఛానల్స్ వెదుకులాట చేస్తున్నాయి. అవసరం వున్నా లేకున్నా ప్రముఖుల పర్సనల్ లైఫ్‌ను కూడా న్యూస్ చేసేస్తున్నాయి. దీనివల్ల న్యూస్ ఛానల్‌కి టైం ఖర్చయినా వీక్షకుడికి మాత్రం వీసమెత్తు ఉపయోగం ఉండదు. ఎటొచ్చి న్యూస్‌లో పడ్డావోడే సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి దాపురిస్తుంది. దీనికో పెద్ద ఉదాహరణగా అల్లు అర్జున్ వివాహంపై ప్రసారమైన కథనాలే నిదర్శనం. ఈ న్యూస్ వల్ల ప్రేక్షకుడికి ఒరిగేదేమీ ఉండదన్న సంగతి ఛానల్ వారికి తెలియంది కాదు. కానీ ఈ న్యూస్‌ని వంటకం చేయడంలో కూడా మేమేముందని ఎక్స్‌క్లూజివ్ అంటూ ఓ ఛానల్ వారు వేస్తే మరొక ఛానల్ కమింగ్ అప్‌లో ఇంకాస్త రుచిగా వంట చేస్తున్నాం చూడండన్నట్లుగా వేస్తూ వచ్చారు. మొత్తానికి సదరు న్యూస్‌కి అల్లు అరవింద్ సమాధానం చెప్పుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. నిప్పు లేనిదే పొగరాదు అన్నది సత్యమే అయినా ఇలాంటి న్యూస్‌లను వండటం వల్ల వీక్షకుడికి ఏ మాత్రం ఉపయోగం ఉండదు. పైగా ఇలాంటి కథనాలతోనే ఛానల్ పరిగెట్టాలని ఆశ పడితే ప్రేక్షకులు రిమోట్‌కి ఎక్కువగా పని చెబుతారనేది నిత్య సత్యం. ప్రతి విషయంపైనా ఎస్‌ఎంఎస్ కంటెస్ట్‌లు, చర్చా కార్యక్రమాలు ఛానళ్లకు కాలక్షేప అంశాలుగా మారాయి. 24 గంటలూ ప్రసారమయ్యే వార్తా ఛానళ్ల సంఖ్య గణనీయంగా పెరిగినా ఏ ఛానల్ కూడా మరో ఛానల్‌కి భిన్నంగా ఉండటం లేదు. పులిని చూసి నక్క వాత పెట్టుకుందన్నట్లు రేటింగ్ బాగున్న ఛానల్స్ అనుసరిస్తున్న ప్రోగ్రాంలను పోలిన ప్రోగ్రాంలను చేయడంలో ప్రతి ఛానల్ నిస్సిగ్గుగా పని చేస్తున్నాయి. అందుకే ఏ ఛానల్ చూసినా వీక్షకుడికి కొత్తదనం కనిపించడంలేదు. సినిమా విశేషాలు, రహస్యాలను ఛేదించడం, ఇంటర్వ్యూలు, మినిట్ న్యూస్‌లు, వంట ప్రోగ్రాంలు, కార్టూన్ ఐటమ్స్ ఇలా ఎన్నో ప్రోగ్రాంలు అన్ని ఛానల్స్‌లోనూ కనిపిస్తున్నాయి. పైగా ఇలాంటివి ప్రసారమయ్యేటప్పుడు ఛానల్ లోగోలను సైతం స్క్రీన్‌పై తిప్పుతూ తమ విశ్వసనీయత చాటుకుంటున్నాయి. ఈ మధ్యకాలంలో సినిమా అంశాలే ప్రధానం సినిమా స్టార్సే లక్ష్యంగా కార్యక్రమాలు రూపొందించడంలో ఛానల్స్ ఎక్కువగా పని చేస్తున్నాయి. గ్యాసిప్ కబుర్లు శృంగార భరితంగా చూపిస్తూ అందించడానికి బాలీవుడ్, హాలీవుడ్‌లు బాగా ఉపయోగపడుతున్నాయి. కుటుంబంతో చూడడానికి వీక్షకుడికి సిగ్గేస్తుంటే నిస్సిగ్గుగా యాంకరమ్మ వాటిని వలిచి వలిచి మరీ చెప్పడం గమనార్హం!
మంద ఎక్కువయితే మజ్జిగ పలచనైనట్లు వార్తా ఛానల్స్ ఎక్కువయ్యే కొద్దీ వాళ్లకి ‘చోర భయం’ (వార్తల దొంగతనం) పట్టుకుంది. అందుకే అనుక్షణం ఎక్స్‌క్లూజివ్ అంటూ తమ లోగోలను పిసరంత వార్తపై కూడా అటు ఇటు తిప్పుకునే పరిస్థితికి వచ్చేశాయి. కమింగ్ అప్‌లో చూపించినంత హడావిడి వార్తా ప్రసారంలోకి వచ్చేసరికి కనిపించకపోవడం వీక్షకుడు గమనిస్తూనే ఉన్నాడు. దొరికిన పిసరంత క్లిప్పింగ్‌ని పట్టుకుని సోదెక్కువ సారం తక్కువ అన్నట్లు అటు తిప్పి ఇటు తిప్పి లాగిలాగి పీకి పీకి చూపించడం వీక్షకుడికి అసహనం తెప్పించే మరో విషయం. ఏదైనా వార్త దొరికితే చాలు ప్రస్తుత పరిస్తితి ఏంటని? విలేఖరిని, స్టూడియోలో చర్చా కార్యక్రమాన్ని, ఓ పక్క ఎస్‌ఎంఎస్‌ల శాతాన్ని నిర్వహించడంలో అన్ని ఛానళ్లూ ఒకే తీరులో నడుస్తున్నాయి. ఛానళ్ల నుండి ఛానళ్లకు ప్రోగ్రాంలతో సహా మారిపోయేవారిది ఒకెత్తయితే క్లిప్పింగ్‌లను కథనాలను కాపీ కొట్టేయడం ఒకెత్తు. దాంతో పాపం ఛానళ్ల వారు కూడా చోరభయంతో లోగోలను స్క్రీన్‌పై ప్రదర్శించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. ఈ మధ్య ఓ ఛానల్‌లో చంద్రముఖి స్వీకెల్‌పై (నాగవల్లి) సెంటిమెంట్‌లను చెబుతూ కార్యక్రమం చేస్తే మరొక ఛానల్ వారు అదే కథనాన్ని ఇంకో కోణంలో చూపించి అతి జాగ్రత్తగా కార్యక్రమంపై లోగోను కూడా అటు ఇటు తిప్పారు. రోజులో ఎక్కువ శాతం ఎక్స్‌క్లూజివ్ అంటూ వార్తలపై కార్యక్రమాలపై లోగోలు కనిపించడం చూస్తుంటే ఛానళ్లకు చోర భయం ఎక్కువయ్యిందేమోననిపిస్తుంది.

www.andhrabhoomi.net

Friday, November 12, 2010

తెలుగు లైవ్ టీవీ ఛానెల్స్ వెబ్ సైట్స్.

మీ యొక్క బ్రాడ్ బ్యాండ్ 512 కేబి కన్నా ఎక్కువైతే  http://www.tvunetworks.com
మీ యొక్క బ్రాడ్ బ్యాండ్ 256 కేబి కన్నా ఎక్కువైతే http://www.freedocast.com 

Telugu Live Tv Channels Websites

Your Broadband More Than 512 Kbps Speed http://www.tvunetworks.com
Your Broadband More Than 256 Kbps Speed http://www.freedocast.com 

Thursday, November 11, 2010

MBS Prasad's TV Program Gets Nandi Award

MBS Prasad, the popular columnist on greatandhra.com recently won Keerthi Puraskar under the category of ‘Humorous Writing’ from Telugu University and that is known for all. He has another feather in his cap. Freshly his TV program ‘Idee Asalu Katha’ that has been rolling on Vanita TV from quite some time has won Nandi Award as ‘second best feature’. The first feature award has gone to ETV’s ‘WOW’ hosted by Sai Kumar.

MBS Prasad is not only a writer but a great narrator. MBS Prasad had scripted, voiceovered and anchored the program ‘Idee Asalu Katha’ that explains how Telugu makers improvised upon the original scripts while remaking other language films like Hindi, Tamil, Bengali, English etc. That proved highly interesting and the Vanita channel (NTV group) also attracted good TRP with that program. The program snippets are also available in youtube as hot favorites. Click here to watch a sample episode of ‘Idee Asalu Katha’.




Source: www.greatandhra.com

2009 టివి నంది అవార్డుల ప్రకటన

హైదరాబాద్‌ ,ఆంధ్రప్రభ ప్రతినిధి: 2009 సంవత్సరానికి గాను “”నంది టివి ఫిల్మ్‌ ఆవార్డు’’లను రాష్ట్ర ఫిల్మ్‌ టెలివిజన్‌ అండ్‌ థియేటర్‌ డెవలప్‌మెంట్‌ కార్పోరేషన్‌ (ఎపిఎస్‌ఎఫ్‌టివిటిడిసి) ప్రకటించింది. అవార్టుల కోసం మొత్తం 215 ఎంట్రీలు రాగా, 65 ఎంట్రీలు ఎంపికయ్యాయి. డిసెంబర్‌ 11న నిర్వహించే ఓ కార్యక్రమంలో ఈ అవార్డులు ప్రదానం చేయాలని భావిస్తున్నట్లు అవార్డుల కమిటీ వెల్లడించింది. అలాగే నంది ఫిల్మ్‌ అవార్డులను ఈనెల 28న ప్రదానం చేయినట్లు ఆ కమిటీ పేర్కొంది. ఈ సందర్భంగా బుధవారం రాష్ట్ర సమాచార శాఖ కార్యాలయంలో ఏర్పాటైన మీడియా ప్రతినిధుల సమావేశంలో సమాచార శాఖ కమీషనర్‌ సి.పార్థసారథి, అవార్టుల కమిటీ సభ్యులతో కలిసి నంది టివి ఫిల్మ్‌ అవార్డు కమిటీ ఛైర్మన్‌ వడ్డెపల్లి కృష్ణ మాట్లాడారు.. ఈ ఏడాది ఆగస్టు 12వ తేదీ నుంచి నవంబర్‌ 10వ తేదీ వరకు అవార్డులు ఎంపిక స్క్రీనింగ్‌ను నిర్వహించి, ముఖ్యమంత్రి కె.రోశయ్యకు తుది నివేదిక సమర్పించామని ఆయన చెప్పారు. ఈ ఏడాది అవార్డుల కోసం దరఖాస్తు చేసే ఎంట్రీల సంఖ్య పెరిగిందని, కొత్తగా న్యూస్‌ రీడర్స్‌ కూడా అవార్డులు ప్రదానం చేస్తునట్లు ఆయన చెప్పారు. నంది టివి ఫిల్మ్‌ అవార్డుల కోసం టెలిఫిల్మ్‌ విభాగంలో 35 ఎంట్రీలు, టివి ఫిచర్స్‌ విభాగంలో 41 ఎంట్రీలు, టివి మెగా సీరియల్స్‌ విభాగంలో 8 ఎంట్రీలు, టివి డైలీ సీరియల్స్‌ విభాగంలో 19, టివి బాలల చిత్రాల విభాగంలో 6 ఎంట్రీలు, టివి డాక్యుమెంటరీ ఫిల్మ్స్‌ విభాగంలో 24 ఎంట్రీలు, టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌ విభాగంలో 25 ఎంట్రీలు, టివి విద్యా విషయక విభాగంలో 27 ఎంట్రీలు, టివి న్యూస్‌ రీడర్‌ అవార్డుల విభాగంలో 30 ఎంట్రీలు వచ్చాయని ఆయన చెప్పారు. సమాచార శాఖ కమీషనర్‌ సి.పార్థసారథి మాట్లాడుతూ, 6 సంవత్సరాల నుండి టివి రంగంలో నంది అవార్డులను ప్రదానం చేస్తున్నామని చెప్పారు. టివిలో ప్రసారమయ్యే ఉత్తమ కార్యక్రమాలను ప్రోత్సహించేందుకే ఈ అవార్డులను ఇస్తున్నామని ఆయన చెప్పారు. ఈ సమావేశంలో నంది టివి ఫిల్మ్‌ అవార్డుల కమిటీ సభ్యులు సి.ఉమామహేశ్వరరావు, సత్యయాబి, సి.జె.రెడ్డి, పద్మావతి, కె.దీపికారెడ్డి, పి.వి.రామ్మోహన్‌ నాయుడు, తోట వెంకట రమణ, బి.శ్రీధర్‌, శిల్ప చక్రవర్తి, ఐనంపూడి శ్రీలక్ష్మి, గాజోజు నాగభూషణం, యండమూరి అనుగీత, డాక్టర్‌ డివిఎన్‌ రాజు, ఎంకెఆర్‌ ఆశాలతలు పాల్గొన్నారు.
టెలిఫిల్మ్స్‌ విభాగంలో
విప్రనారాయణ (ఉత్తమ తొలి టెలిఫిల్మ్‌
దృష్టి (ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్‌)
టివి ఫీచర్స్‌ విభాగంలో
వావ్‌.. (ఉత్తమ తొలి టివి ఫీచర్‌)
ఇది అసలు కథ (ద్వితీయ ఉత్తమ టివి ఫీచర్‌)
టివి మెగా సీరియల్స్‌ విభాగంలో
శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర (ఉత్తమ తొలి టివి మెగా సీరియల్‌)
శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం (ఉత్తమ ద్వితీయ టివి మెగా సీరియల్‌)
టివి డైలీ సీరియల్స్‌ విభాగంలో
మొగలి రేకులు (ఉత్తమ తొలి టివి డైలీ సీరియల్‌)
అభిషేకం (ఉత్తమ ద్వితీయ టివి సీరియల్‌)
టివి బాలల ఫిల్మ్‌ విభాగంలో
ఆశాదీపం (ఉత్తమ తొలి టివి బాలల ఫిల్మ్‌)
ఓ చిన్న ప్రయత్నం (ఉత్తమ ద్వితీయ టివి బాలల ఫిల్మ్‌)
టివి డాక్యుమెంటరీ ఫిల్మ్‌ విభాగంలో
చెర్యాల కళాకృతులు (ఉత్తమ తొలి టివి డాక్యుమెంటరీ ఫిల్మ్‌)
అమృత వర్షిణి (ఉత్తమ ద్వితీయ టివి డాక్యుమెంటరీ ఫిల్మ్‌)
టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌ విభాగంలో
డైలీ మిర్రర్‌ (ఉత్తమ తొలి టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌)
దుర్గ (ఉత్తమ ద్వితీయ టివి సామాజిక సంబంధిత ఫిల్మ్‌)
టివి విద్యావిషయక ఫిల్మ్‌ విభాగంలో
అద్బుత చిరుధాన్యాలు (ఉత్తమ తొలి టివి విద్యావిషయక ఫిల్మ్‌
భవాణి (ఉత్తమ ద్వితీయ టివి విద్యావిషయక ఫిల్మ్‌)
స్పెషల్‌ జ్యూరీ అవార్డ్స్‌ విభాగంలో
యామిని (శ్రీ వైనతేయం)
జీవితమే నాటకం (దూరదర్శన్‌ డైరెక్టర్‌)
సాయికుమార్‌ (వావ్‌.. యాంకర్‌)
కోమలి సిష్టర్స్‌ (నవ్వులాట)
దేవీ నాగవల్లి (న్యూస్‌ రీడర్‌)
న్యూస్‌ రీడర్స్‌ విభాగంలో
పి.కిరణ్‌ కుమార్‌ (ఉత్తమ పురుష టివి న్యూస్‌ రీడర్‌)
జి.రాణి రుద్రమ(ఉత్తమ మహిళా టివి న్యూస్‌ రీడర్‌)
వ్యక్తిగత అవార్డుల విభాగంలో
మంజుల నాయుడు (బెస్ట్‌ డైరెక్టర్‌, మొగలి రేకులు సీరియల్‌)
సాగర్‌ (అత్యుత్‌ అవార్డ్‌ ఫర్‌ బెస్ట్‌ లీడింగ్‌ యాక్టర్‌, మొగలిరేకులు సీరియల్‌)
వహీదా (ఉత్తమ లీడింగ్‌ నటి, విప్రనారాయణ)
హరి (ఉత్తమ సపోర్టింగ్‌ నటుడు, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర)
రూపా దేవి (ఉత్తమ సపోర్టింగ్‌ నటి, తీరం)
గుండు హనుమంతరావు (ఉత్తమ హాస్య నటుడు, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం)
రవివర్మ (ఉత్తమ విలన్‌, మనసున మనసై)
మాస్టర్‌ విజయ్‌ (ఉత్తమ బాల నటుడు, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర)
బేబి వి.పూజ్యస్వాని (ఉత్తమ బాలనటి, నాగేశ్వరి)
వి.యజువేంద్ర(ఉత్తమ తొలి ఫిల్మ్‌ దర్శకుడు, భక్త అంబారిష)
రఘు కాపుగంటి, ఎం.శేషుకుమార్‌ (ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌, అంత:పురం)
డి.కామేశ్వరి (ఉత్తమ కథా రచయిత, మనసున మనసై)
గోవిందరాజుల నాగేశ్వరరావు (ఉత్తమ మాటల రచయిత, శ్రీమతి శ్రీ సుబ్రహ్మణ్యం)
డాక్టర్‌ మంగళగిరి పూర్ణచంద్‌ (ఉత్తమ లిరిక్‌ రైటర్‌, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర స్వామి చరిత్ర
పి.వెంకటరమణ (ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌, శ్రీ వైనతేయం)
రాధ -గోపి (ఉత్తమ సంగీత దర్శకుడు, భక్తపోతన)
మనో (ఉత్తమ పురుష ప్లేబ్యాక్‌ సింగర్‌, శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేందరస్వామి చరిత్ర)
పి.ఆర్‌.కౌసల్య (ఉత్తమ మహిళా ప్లేబ్యాక్‌ సింగర్‌, ఆడదే ఆదారం)
కె.నరశింహరెడ్డి (ఉత్తమ ఎడిటర్‌, డాక్టర్‌ చక్రవర్తి)
అడ్డాల పెద్దిరాజు (ఉత్తమ కళా దర్శకుడు, రేలారే రేల)
శివారెడ్డి (ఉత్తమ పురుష యాంకర్‌, కామిడీ గ్యాంగ్‌)
సుమ (ఉత్తమ మహిళా యాంకర్‌, పంచావతారం)
వై.బి.వెంకటేశ్వరరావు (ఉత్తమ పురుష డబ్బింగ్‌ కళాకారుడు, రంతీదేవుడు)
లెనినా చౌదరి (ఉత్తమ మహిళా డబ్బింగ్‌ కళాకారిణి, చంద్రముఖి)
సుంకర సతీష్‌ (ఉత్తమ ఆడియోగ్రాఫర్‌, చక్రధారి)
వి.తిరుమలేశ్వరరావు (ఉత్తమ కాస్ట్యూమ్స్‌ డిజైనర్‌, మండోదరి)
దేవేంద్ర కుమార్‌ (ఉత్తమ మేకప్‌ కళాకారుడు, సతీతులసి)
రే యానిమేషన్స్‌ (ఉత్తమ గ్రాఫిక్స్‌, శ్రీ వైనతేయం)

Source: www.andhraprabhaonline.com

‘పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి’కి ఐదు అవార్డులు

హైదరాబాద్, నవంబర్ 10 : రాష్ట్ర ప్రభుత్వం ఏటా ప్రకటించే నంది టివి అవార్డుల్లో 2009 సంవత్సరానికి మెగా సీరియల్ ‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ వివిధ విభాగాల్లో ఐదు అవార్డులు గెలుచుకుని మొదటి స్థానంలో నిలిచింది. తొమ్మిది క్యాటగిరీల్లో 215 ఎంట్రీలు రాగా, 68 అవార్డులను ప్రకటించారు. ప్రముఖ రచయిత వడ్డేపల్లి కృష్ణ చైర్మన్‌గా వ్యవహరించిన కమిటీలో మొత్తం 15 మంది సభ్యులున్నారు. రాష్ట్ర చలనచిత్ర, టివి, రంగస్థల అభివృద్ధి సంస్థ మేనేజింగ్ డైరెక్టర్, సమాచార పౌరసంబంధాల శాఖ కమిషనర్ సి. పార్థసారథి ఈ కమిటికి మెంబర్ కన్వీనర్‌గా పనిచేశారు. 2009 టివి అవార్డులను బుధవారం ఇక్కడ ప్రకటించారు. కమిటి చైర్మన్ వడ్డేపల్లి కృష్ణతో పాటు సభ్యులు పి.వి. రాంమోహన్‌నాయుడు, సి. ఉమామహేశ్వరరావు, ఎం.పద్మావతి, కె. దీపిక, శిల్పచక్రవర్తి, శ్రీలక్ష్మి, సత్యం, సి.జె.రెడ్డి, డాక్టర్ డివిఎన్ రాజు తదితరులు అవార్డుల ప్రకటన సమావేశంలో పాల్గొన్నారు. ఉత్తమ టెలిఫిల్మ్‌గా ‘విప్రనారాయణ’, ద్వితీయ ఉత్తమ టెలిఫిల్మ్‌గా ‘దృష్టి’ ఎంపికయ్యాయి. టివి ఫ్యూచర్ ఫిల్మ్‌లలో ఉత్తమ టివి ఫ్యూచర్‌గా ‘వావ్’, ద్వితీయ ఉత్తమ టివి ఫ్యూచర్‌గా ‘ఇదే అసలు కథ’ ఎంపికయ్యాయి. మెగా సీరియళ్లలో ఉత్తమ మెగా సీరియల్‌గా ‘శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’, ద్వితయ టివి మెగా సీరియల్‌గా ‘శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యం’ ఎంపికయ్యాయి. టివి డెయిలీ సీరియళ్లలో ప్రథమ ఉత్తమ సీరియల్‌గా ‘మొగలిరేకులు’, ద్వీతీయ ఉత్తమ సీరియల్‌గా ‘అభిషేకం’ ఎంపికయ్యాయి. టివి పిల్లల చిత్రాల్లో ప్రథమ టివి పిల్లల ఫిల్మ్‌గా ‘ఆషాడదీపం’, రెండవ ఉత్తమ పిల్లల చిత్రంగా ‘ఓ చిన్న ప్రయత్నం’, డాక్యుమెంటరీల్లో ప్రథమ బహుమతి ‘చేర్యాల కళాకృతులు’, ద్వితీయ బహుమతి ‘అమృత వర్షిణి’కి లభించాయి. సామాజిక స్పృహ కలిగిన చిత్రాల విభాగంలో ప్రథమ బహుమతి ‘డెయిలీ మిర్రర్’కు, ద్వితీయ బహుమతి ‘దుర్గ’కు లభించాయి. టివి ఎడ్యుకేషన్ చిత్రాల విభాగంలో ప్రథమ బహుమతి ‘అద్భుత చిరుధాన్యాలు’కు, ద్వితీయ బహుమతి ‘్భవాని’కి లభించాయి. స్పెషల్ జ్యూరీ అవార్డుల్లో వ్యక్తిగతంగా యామిని (శ్రీ వైనతేయం), డైరెక్టర్ దూరదర్శన్ కేంద్రం (జీవితమే నాటకం), సాయికుమార్ (వావ్), కోమలి సిస్టర్స్ (నవ్వులాట), దేవి నాగావళి (న్యూస్‌రీడర్) కి లభించాయి. న్యూస్ రీడర్ అవార్డులు పురుషుల విభాగంలో పి. కిరణ్‌కుమార్, మహిళల విభాగంలో జి. రాణిరుద్రమకు లభించాయి. వ్యక్తిగత కళాకారులకు ఇచ్చే అవార్డుల్లో మంజులా నాయుడు (ఉత్తమ డైరెక్టర్-మొగలిరేకులు), సాగర్ (బెస్ట్ లీడింగ్ యాక్టర్-మొగలిరేకులు), వహీద (బెస్ట్ లీడింగ్ యాక్టరెస్-విప్రనారాయణ), హరి (ఉత్తమ సహాయ నటుడు-శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), రూపాదేవి (ఉత్తమ సహాయ నటి-తీర్థం), గుండు హన్మంతరావు (ఉత్తమ హాస్యనటుడు), రవి వర్మ (ఉత్తమ విలన్-మనసున్న మనిషి), వి. యజువేంద్ర (ఉత్తమ చిత్ర దర్శకుడు-భక్త అంబరీష), రఘు కాపుగంటి, ఎం. శేషుకుమార్ (ఉత్తమ స్క్రీన్‌ప్లే రచయిత-అంతఃపురం), డి. కామేశ్వరి (ఉత్తమ కథా రచయిత-మనసున్న మనిషి), గోవిందరాజులు నాగేశ్వరరావు (ఉత్తమ మాటల రచయిత-శ్రీమతి శ్రీసుబ్రహ్మణ్యం), డాక్టర్ మంగళగిరి పూర్ణచంద్ (ఉత్తమ పాటల రచయిత-శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), పి. వెంకటరమణ (ఉత్తమ సినిమాటోగ్రాఫర్-శ్రీవైనతేయం), రాధా-గోపి (ఉత్తమ సంగీత డైరెక్టర్-్భక్తపోతన), మనో (ఉత్తమ పురుష ప్లేబ్యాక్ సింగర్-శ్రీశ్రీశ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర), పి.ఆర్. కౌసల్య (ఉత్తమ మహిళా ప్లేబ్యాక్ సింగర్-ఆడదే ఆధారం), కె. నర్సింహారెడ్డి (ఉత్తమ ఎడిటర్-డాక్టర్ చక్రవర్తి), ఆదాల పెద్దిరాజు (ఉత్తమ ఆర్ట్ డైరెక్టర్-రేలారే రేలా), శివారెడ్డి (ఉత్తమ పురుష యాంకర్-కామెడీ గ్యాంగ్), సుమ (ఉత్తమ మహిళా యాంకర్-పంచావతారం), వై.బి. వెంకటేశ్వరరావు (ఉత్తమ పురుష డబ్బింగ్ ఆర్టిస్ట్-రంతి దేవుడు), లెనీనా చౌదరి (ఉత్తమ మహిళా డబ్బింగ్ ఆర్టిస్ట్-చంద్రముఖి), సుంకర సతీష్ (బెస్ట్ ఆడియోగ్రాఫర్-చక్రదారి), వి. తిరుమలేశ్వరరావు (ఉత్తమ కాస్ట్యూమ్ డిజైనర్-మండోదరి) , దేవేంద్ర కుమార్ (ఉత్తమ మేకప్ ఆర్టిస్ట్-సతీ తులసి), రాయ్ ఎనిమేషన్స్ (ఉత్తమ గ్రాఫిక్స్-శ్రీవైనతేయం)కు లభించాయి. 2009 టివి నంది అవార్డులను ఈ ఏడాది డిసెంబర్ 11న ఇవ్వాలని తాత్కాలికంగా నిర్ణయించామని సి. పార్థసారథి ప్రకటించారు. నంది సినిమా అవార్డులను ఈనెల 28న ఇస్తామని తెలిపారు.

Source: www.andhrabhoomi.net

టీవీ ఫైవ్‌ డైలీ మిర్రర్‌కు బంగారు నంది


* బెస్ట్‌ సోషల్‌ రిలవెంట్‌ కేటగిరిలో అవార్డు

టీవీ ఫైవ్‌ ప్రసారం చేస్తున్న డైలీ మిర్రర్‌కు బంగారు నంది అవార్డు లభించింది. సమకాలీన అంశాలపై ప్రత్యేక కథనాల సమాహారమే డైలీ మిర్రర్ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని తిలకించిన నంది అవార్డు కమిటీ బెస్ట్ సోషల్ రిలవెంట్ ఫిల్మ్‌ కేటగిరీ కింద అవార్డును ప్రకటించింది.

సామాజిక, సమకాలీన అంశాలను కళ్లకు కట్టినట్లు సవివరంగా అందించే ఉద్దేశంతో టీవీ-5 డైలీమిర్రర్ అనే కార్యక్రమాన్ని ప్రవేశ పెట్టింది. ఇందులో పలు సామాజిక అంశాలను ప్రేక్షకులకు అందిస్తోంది. ఈ కార్యక్రమం ప్రతీరోజు ఉదయం 11 గంటల 40 నిమిషాలకు ప్రసారమవుతోంది. ఈ మధ్యనే 200 ఎపిసోడ్స్‌ పూర్తిచేసుకున్న డైలీ మిర్రర్ కార్యక్రమానికి ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. ఇందులో భాగంగానే సింగరేణి ఓపెన్‌కాస్ట్ బాధితుల కన్నీటి కథలను నిప్పురవ్వ శీర్షికన టీవీ-5 ప్రసారం చేసింది.

ఓపెన్‌ కాస్ట్ మైన్స్ రాకముందు కళకళలాడే గ్రామాలు బ్లాస్టింగ్ మొదలైనప్పటి నుంచి ఎలా జీవకళను కోల్పోయిందీ ఇందులో కళ్లకు కట్టినట్లు వివరించింది. ఈ కథనానికి నంది అవార్డుల కమిటీ బంగారు నందిని ప్రకటించింది. సృజనాత్మకతకు మారుపేరు, సామాజిక అంశాలకు ప్రతిబింబంగా రూపొందిన డైలీ మిర్రర్‌కు నంది అవార్డు రావడం, సామాజిక సేవ కోసం టీవీ-5 చేస్తున్న కృషికి అభినందనగా భావిస్తున్నాం. ఈ అవార్డు మరింత బాధ్యత పెంచినట్లుగా భావిస్తూ సామాజిక అంశాలను, ప్రజల కన్నీటి గాథలను ప్రతిభింబించే కార్యక్రమాలకు పునరంకితమవుతాయని ప్రకటిస్తున్నాం.

Source: www.tv5news.in
 

Wednesday, November 10, 2010

2009 టివి నంది అవార్డుల ప్రకటన

2009 టివి నంది అవార్డులను ప్రభుత్వం ప్రకటించింది. ఉత్తమ టెలీచిత్రంగా విప్రనారాయణ,
ఉత్తమ రెండవ టెలీఫిల్మ్'గా దృష్టి ఎంపికైంది. ఉత్తమ టివీ మెగా సీరియల్'గా శ్రీశ్రీశ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్ర చరిత్ర ఎంపికైంది. ఉత్తమ టివి సీరియల్'గా మొగలిరేకులు, రెండవ ఉత్తమ సీరియల్'గా అభిషేకం, ఉత్తమ పిల్లల సీరియల్'గా ఆశాదీపం ఎంపికయ్యాయి. ఉత్తమ దర్శకురాలి అవార్డు మంజులానాయుడు (మొగలిరేకులు)కి దక్కింది.

ఉత్తమ నటుడుగా సాగర్(మొగలిరేకులు), ఉత్తమ నటిగా వహిదా(విప్రనారాయణ) ఉత్తమ విలన్'గా రవివర్మ(మనసున మనసై..), ఉత్తమ హాస్యనటుడుగా గుండు హనుమంతరావు ఎంపికయ్యారు. ఈ నెల 28న అవార్డులు ప్రదానం చేస్తారు.

Source: www.prajasakti.com

Tuesday, November 9, 2010

చప్పగా నాచోరే... సరిగమప నువ్వా నేనా?

జీ తెలుగులో ఒకే వారంలో రెండు షోలు బుల్లితెరపై అరంగేట్రం చేశాయి. వారంలో సోమ, మంగళవారం రోజుల్లో రాత్రి 9 గంటలకు ప్రసారంగా ‘నాచోరే’ డాన్స్ షో వస్తే బుధ, గురు రోజుల్లో రాత్రి 9 గంటలకు ‘సరిగమప’ పాటల ప్రోగ్రాం వస్తుంది. అయితే ఈ ప్రోగ్రాంలపట్ల ప్రేక్షకుల్లో పెద్దగా ఆసక్తి ఉండదనిపిస్తుంది. ఎందుకంటే డాన్స్ షోలు, పాటల ప్రోగ్రాంలు ఏఛానల్‌కీ కొత్తకాదు. ఊదరగొట్టి వదిలేసాయి. ఒకప్పుడు ఎంతో ఆశక్తి కనబరిచి టెలివిజన్ సెట్ల ముందు టెన్షన్‌గా బైఠాయించే ప్రేక్షకులు ఇప్పుడుఈ షోలకంటే గేమ్ షోలవైపు ఎక్కువ మక్కువ చూపుతున్నారు.
‘నాచోరే’ ప్రోగ్రాం కాస్త విభిన్నంగా తయారైనా దీనిలో పాల్గొనే తారలందరు మరుగున పడిపోయిన హీరోయినే్ల. పైగా ప్రారంభ ఎపిసోడ్‌లో చూస్తే చాలా ఆచప్పగా వీళ్లు సినిమాల్లో హీరోయిన్లుగా ఎలా నటించారనిపించక మానదు. మా టీవీలో ఈ తరహా డాన్స్ షో గతంలో నడిచింది. దాంట్లో పూనమ్‌బజ్వా వంటి అప్పటికి లేటెస్ట్ హీరోయిన్లు నటించారు. కానీ నాచోరేలో పాపులర్ హీరోయిన్లుగా పేరొందిన వారితోపాటు సరైన గ్లామర్ హీరోయిన్లు లేకపోవడం గమనార్హం ఈ ప్రోగ్రాంకి బలం కాస్త నటి రోజా రూపంలో కనిపిస్తుంది. ఈమె ఈ షోకి జడ్జి. ఇక యాంకరింగ్ చేసే హేమంత్ స్టయిల్ డబ్బాలో గులకరాళ్ల మాదిరి ఉంది. రింగ రింగా డాన్స్‌మాస్టర్ నోవాకు ఇదో స్క్రీన్‌టెస్టులా మారింది.
ప్రోగ్రాం ఓపెనింగ్ సాంగ్ నాచోరే...నాచోరే అతి బలహీనపడిపోయి అది హీరోయిన్ కీర్తిచావ్లా అభినయంలో కనిపించడంతోనే ప్రేక్షకులు ఈ ప్రోగ్రాంపట్ల ఓ అంచనాకు వచ్చేసారు. పైగా ఈ హీరోయిన్లకు కొరియోగ్రాఫ్ చేసేవారు కూడా అన్ ఎక్స్‌పీరియన్స్‌గా వారి డాన్స్‌లో కనిపించారు. నాచోరే ప్రోగ్రాం డిజైన్‌పరంగా కొత్తగా అనిపించినా ఓపెనింగ్ ఎపిసోడ్స్ మాత్రం ప్రేక్షకులను నిరాశపరిచాయి. మొదట్లోనే ఓ హీరోయిన్ స్టేజిపై అనారోగ్యంతో కుప్పకూలిపోవడం ప్రోమో షాట్స్‌కి శుభారంభంగా నిలిచినట్లయింది. ‘పన్నెండుమంది రాణులు ఒకటే కిరీటం’ అనే క్యాప్షన్‌తో వచ్చిన నాచోరే ప్రేక్షకులను ఆకట్టుకోవాలంటే రాబోయే ఎపిసోడ్స్ ఇంకా బలాన్ని పుంజుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ప్రేక్షకుల్లో ఓపెనింగ్ నిరాసక్తను తొలగించడానికి నిర్వాహకులు చాలా కష్టపడాలి సుమా! జీ తెలుగులో సరిగమప ఎపిసోడ్స్ అంటే మిగతా చానల్స్‌ని పక్కన పెట్టేసే స్థితి ఉండేది. కానీ ఓంకార్ నిర్వహణలో రూపొందిన సరిగమప ప్రేక్షకుల్లో గందరగోళాన్ని సృష్టించింది. జడ్జీలు, పెద్దమెంటర్లు, బుల్లిమెంటర్లు, యాంకర్లు వంటి గజిబిజితనంతో సరిగమప మసకబారిపోయింది. మళ్లీ చాన్నాళ్ల తరువాత ఈ కార్యక్రమం మొదలై అలరిస్తుందని అనుకుంటే మూసబాటకు తెరతీసింది.
‘సరిగమప నువ్వా నేనా’ అంటూ మళ్లీపాత పార్టిసిపెంట్స్‌ని తెరపైకి తెచ్చారు. వారితోపాటు కొత్తవారికి పోటీపెట్టే దిశగా జతలు కట్టారు. పాటల ప్రోగ్రాం టాలెంట్ హంట్ అంటే వేలాదిగా వచ్చే గాయనీగాయకులుంటారు. అలాంటి వారిని వెతికిపట్టి ప్రోగ్రాం చేయడం కష్టమనుకుంటారో ఏమిటో? గతంలో పాల్గొన్న వారిని విజేతలను పిలిచి కాస్త పాత కొత్త కలయికల్లో ప్రోగ్రాంని చుట్టేయాలని నిర్వాహకుల ఆలోచన ప్రేక్షకులకు ఖచ్చితంగా నీరసం తెప్పిస్తుంది. ఇలాంటి ప్రక్రియకు మా టీవీ ముందుంటుంది. అందుకే ఆ ఛానల్ నిర్వహించే సూపర్ సింగర్, రేలా..రేలా కార్యక్రమాలు ఎన్ని ఎపిసోడ్‌లు నిర్మించుకున్నా కొత్తదనాన్ని సంతరించుకోలేకపోయాయి. ఈ విషయంలో ఈ టీవీలో పాడుతా తీయగా నిర్వహిస్తున్న ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అభినందనీయుడు. ఎప్పుటికప్పుడు ఏ ఛానల్‌లోను పాడని కొత్త టాలెంట్‌ని తెరపైకి తీసుకువచ్చి ఏవిధమైన కమర్షియల్ హంగు ఆర్భాటాలు లేని ప్రోగ్రాంని అందిస్తాడు. అందుకే ఈ ప్రోగ్రాం పట్ల ప్రేక్షకులు ఎప్పటికప్పుడు ఫ్రెష్‌నెస్ ఫీలవుతారు.
ఒకసారి పూర్తిగా వారి టాలెంట్‌ని వడపోసి జీర్ణించుకున్న ప్రేక్షకులకు మళ్లీ అదే టాలెంట్‌ని వడపోయమనడంతోపాటు బోనస్‌గా కొత్త టాలెంట్‌ని జత చేసినా అంతగా రుచించదు. పైగా ఎన్ని ఎపిసోడ్స్ గడిచినా ఒకటే మోత, ఒకటే పాట అన్నట్టు వుండడంవల్ల ప్రోగ్రాం చప్పబడిపోతుంది. రాధాకృష్ణ, ఎల్‌ఆర్‌ఈశ్వరి, ఉష జడ్జిలుగా గతంలో కనిపించడం కూడా బోరే. సరిగమప నువ్వా నేనాకు ఫ్రెషర్‌గా యాంకర్ ప్రదీప్ మాత్రమే కనిపిస్తున్నాడు. మూస కథలతో సినిమాలను చుట్టేసినట్టే టెలివిజన్ ప్రోగ్రాంలను కూడా చుట్టేయాలనుకుంటే ప్రేక్షకులు రేటింగ్‌ని ఇవ్వరనేది భవిష్యత్ నిర్ణయించే సత్యం.

Source: www.andhrabhoomi.net

బుల్లి తెరపై ‘జీనియస్’ ప్రయోగం??

యాంకర్‌గా మొదలై ప్రోగ్రామ్ మేకర్‌గా ముద్రపడి అందరిచేతా బుల్లితెర అన్నయ్యగా పిలవబడే ఓంకార్ జీనియస్? అని ప్రశ్నించుకుంటే కొంతవరకు ఔననే చెప్పాలి. జెమిని ఛానల్‌లో సాధారణంగా యాంకర్‌గా వుండే ఓంకార్‌కి జీ తెలుగు మంచి ప్లాట్‌ఫారమ్‌గా దొరికింది. వెనుదిరిగి చూసుకోలేనంతగా క్రేజ్‌ని ఇచ్చింది. ఆట ప్రోగ్రాంను స్టార్ట్ చేసి వరసగా ఐదు సిరీస్‌లతో ప్రేక్షకులను అలరించినా ‘ఆట జూనియర్స్’ ఎంత క్రేజ్‌ను తెచ్చిపెట్టిందో అంతే వివాదాలను అంటగట్టింది. మొత్తానికి ఆట-5 జూనియర్స్ అయ్యిందనిపించి చేతులు దులుపుకున్నాడు.
ఆట ప్రోగ్రాంతోపాటు ‘మాయాద్వీపం’ కూడా కొంతకాలం నడిపించాడు. మా టీవీలోకి ప్రవేశించి ‘ఛాలెంజ్’ అంటూ టాన్స్ షోను ‘అదృష్టం’ అంటూ గేమ్ షోను ప్రారంభించాడు. అనతికాలంలోనే అదృష్టం దురదృష్టంగా ముగించాల్సి వచ్చింది. కోడి కోడిపిల్లలు కథలా ఇప్పటివరకు తన షోలలో పాల్గొన్న వారిని వెంటబెట్టుకుని మాయాద్వీపం, అదృష్టం, ఆట, ఛాలెంజ్‌లను నడిపించిన ఓంకార్ కొత్త టాలెంట్‌ని సెర్చ్ చేస్తూ ‘జీనియస్’ అనే సినిమా తీయడానికి రెడీ అయ్యాడు. ఈ సినిమాలో కోడిపిల్లలకు అవకాశం మాట ఎలా వున్నా కొత్త టాలెంట్ హంట్ మాత్రం పూర్తి చేసి బుల్లితెరపై వెండితెర స్క్రీన్ టెస్ట్ ప్రారంభించాడు.
ఏడుపులు, పెడబొబ్బలు, ఓదార్పులు, వార్నింగ్‌లు, నిష్క్రమణలు, పునఃప్రవేశాలు వంటివి ఓంకార్ షోలలో కామన్‌సీన్లు. ఇది నిజమా? అనేంతగా ప్రోమోలలో చూపించడం ఓంకార్ సక్సెస్‌కి కారణం. ఒకటిరెండుసార్లు ప్రేక్షకులు ప్రోమోలు చూసి నివ్వెరబోయి ఎప్పుడు ఎపిసోడ్ వస్తుందా అని కాచుకుకూర్చున్నా రానురాను ఇదంతా స్టంట్ అనే స్థాయికి రావడంతో ఆట-5 కాసంత ప్రేక్షకాదరణలో నీరుగారింది. ఇప్పుడు మళ్లీఇలాంటి స్టంట్ టీవీ-9 మీడియా పార్టనర్ సాక్షిగా జీనియస్ సినిమా నటుల సెలక్షన్ విషయంలో ఓంకార్ చేస్తున్నాడు. ఎపిసోడ్‌లుగా చేసి మరీ ప్రేక్షకులకు అందిస్తున్నాడు. బుల్లితెరనుండి వెండి తెరకు ప్రమోట్ కావడమనేది అందరికీ తెలిసిందే! అందుకే బుల్లితెరపై తనకున్న ఇమేజ్‌ని ఉపయోగించుకుని అదేపంథాలో జీనియస్ సెలక్షన్స్ కూడా చేస్తున్నాడు.
నరసింహా, ఇంద్ర వంటి అగ్ర హీరోల చిత్రాలకు కథలు అందించిన చిన్నికృష్ణ జీనియస్ సినిమాకు కథను అందించడం చెప్పుకోదగ్గ విషయం. ఇక బుల్లితెర అన్నయ్య వెండితెరపై ఇదే హైపుతో విజయాన్ని అందుకోవాలని ఆరాటపడడం జీనియస్ స్పెషల్ ఎపిసోడ్స్‌లో కనిపిస్తుంది. అయితేఈ ప్రక్రియ కొత్తదేమీ కాదు. గతంలో ఓ ఛానల్‌లో దర్శకుడు తేజ ఇలాంటి ప్రక్రియనే వారాల తరబడి నడిపాడు. ఫ్లాపులను మూటగట్టుకున్న తరుణంలో విజయంకోసం ఈ పంథాను అనుసరించి నటీనటులను సెలక్టు చేసి వారిని వెండితరకు ‘విచిత్రం’ సినిమాతో పరిచయం చేసినా ఫలితం దక్కలేదు.
ఇంకాస్త ముందుకి పోతే రాఘవేంద్రరావు ‘పరదేశి’ సినిమాకోసం ఈ విధమైన సెలక్షన్లనే జరిపాడు.

Source: www.andhrabhoomi.net

Monday, November 8, 2010

‘సరిగమప’ స్వరాన్వేషణ?

ఏ క్షణాన్నయితే ‘పాడుతా తీయగా’ ఈటీవీలో ఆరంభించారో గానీ (అసలు పాడుతా తీయగా’..నే ప్రాచుర్యం పొందిన జీ ఛానల్ హిందీ ‘సరిగమప’ స్ఫూర్తితో తయారైనది) దాదాపు అన్ని ఛానల్స్‌లోనూ ఆ బాపతు స్వరానే్వషణ ఔత్సాహికుల్లో అవిరామంగా జరిగిపోతోంది. అయితే ‘సంగీతం’ ప్రధాన లక్ష్యమైన ఆహ్లాదతను వీడి స్వర ‘సంగ్రామం’ తదితర యుద్ధ వాతావరణాన్ని ఇవి పెంచి పెద్ద చేయడం చూస్తున్నాం. ఇది వైవిధ్యం కోసమో, ప్రోగ్రామ్‌లో మొనాటనీని తొలగించడానికి అనుసరిస్తున్న పోకడైనా ఈ తరహా నచ్చని ప్రజానీకమూ ఉన్నారు. ఇలా రకరకాల దారులు యధేచ్చగా చుట్టి వచ్చిన గళానే్వషణ కార్యక్రమం జీ తెలుగులో ‘సరిగమప-నువ్వా-నేనా’ పేరుతో అక్టోబర్ 27న ఆరంభమైంది.
ఏదీ కొత్త రూపు?
పేరుకీ, ప్రచారానికీ, కొత్త రూపు అని అర్ధం వచ్చేలా బిల్డప్ జరిగినా ఆ మాదిరి లక్షణాలేవీ ప్రారంభంలోనే గోచరించలేదు. ఒకరొకరుగా వచ్చి పాడడం, వారికి జోడీగా ఇంకో గాత్రాన్ని ఎంచుకోవడం, వారిరువురూ కలిసి పాడడం- అలా పాడిన వాళ్లలో ఎవరు విజేతో తేల్చడం అన్నదిప్పటి వరకు జరిగినదాన్నిబట్టి అర్ధమైన సంగతి. ఇది గతంలో వచ్చిన స్వర పోటీల్లో అవలంబించిన డ్యూయట్ రౌండ్ లాంటిదే గదా...
ఈ ప్రాతిపదిక సరైనదేనా?
ఇక అన్నిటికంటే ముఖ్యమైంది ఎన్నికవుతున్న జోడీల్లో పాల్గొంటున్న అభ్యర్థుల వయస్సులో చాలా తేడా ఉండడం. అయితే గంలో జీ తెలుగు చానలే నిర్వహించిన పాటలపోటీల్లో నెగ్గిన విజేతల బృందంతో ఇప్పుడొచ్చిన కొత్తవాళ్లు పోటీపడడం అన్న కానె్సప్టు పెట్టుకున్న తర్వాత ఇలాంటి వ్యత్యాసాలు అనివార్యం అని భావించాలా? కానీ అంతిమంగా ఈ తరహా ఎక్కువ వయసు వ్యత్యాసాల ద్వారా వెల్వడే గళాలమధ్య పోటీ న్యాయాత్మకంగా ఉండదు. ఎందుకంటే గొంతు అనేది ముఖ్యంగా స్వర విన్యాసంలో తీవ్రమైన అంతరాలు వయోపరంగా వస్తాయి.
ఇది గమనంలోకి తీసుకోవాలి. ఈ ప్రోగ్రామ్‌లో న్యాయ నిర్ణేతల్లో ఒకరుగా వ్యవహరిస్తున్న సంగీత దర్శకుడు రాధాకృష్ణన్ కూడా వయసునుబట్టి, అనుభవాన్నిబట్టి ఎంచుకున్న పాటలో వివిధ స్వరగతులను అనుసరించి గాలిని నియంత్రించి పాడే తీరు వస్తుందని కూడా చెప్పడం జరిగింది. మరి ముందు ముందు భాగాల్లో జరిగే పోటీల్లో ఈ ప్రథాన అడ్డంకిని అధిగమించడానికి కార్యక్రమం ఏం చేస్తుందో చూద్దాం.
పాటల ఎంపికకు సూచనివ్వచ్చుగా...
ఇక పాటల ఎంపికలో ఎవరి స్వేచ్ఛ వారిదైనా, ఇది కార్యక్రమ నిర్వాహకులే పదే పదే చెప్పినట్టు లక్షలాది, కోట్లాది సంగీతాభిమానులు వీక్షించేది కనుక కాస్త సమంజసత ఉండాలి. కానీ దురదృష్టవశాత్తు వినపడ్డ కొన్ని పాటల్లో ఆ లక్షణానికి దూరంగా ఉన్నవీ ఉన్నాయి. ఉదాహరణకు చిన్నారులిద్దరు పాడిన పాట ‘ఆకుచాటు పిందె తడిసే’, మరో గాయనీ గాయకుల జంట పాడినపాట ‘రాఖీ..రాఖీ..రాఖీ..నా కవ్వాసాకీ’ ఎవరి అభిరుచి వారిదైనా, అందరి అనిరుచులనీ అలరించే మరీ ముఖ్యంగా మనం పైన అనుకున్న సంస్కార, సమంజసతలకు ద ర్పణంగా నిలవాలి. ఇంకా విచారకరమేమిటంటే రెండవ పాటగా ఉదహరించిన పాట ‘రాఖీ’ని ఆలపించిన చిన్నారి వయసు ఎనిమిదేళ్లు. కొసమెరుపుగా ఆ పాటలో వచ్చే ఒక హమ్మింగ్‌కి తెగమురిసిపోయి న్యాయనిర్ణేతల్లో ఒకరు మళ్లీ మళ్లీ పాడించుకున్నారు. ఈ పాటల్ని కార్యక్రమ వ్యాఖ్యాత చమక్ చమక్..్ఢమరే పాటలుగా అభివర్ణించారు. సరే..మరీ అంతగా వాళ్లనుకునే హుషారుగీతాలు అనుకుంటే సభ్యతా పరిమితులకు లోబడిన అనేక పాటలున్నాయి. అవి ఆ ఔత్సాహిక గళాలకు తట్టకపోతే అనుభవజ్ఞులైన కార్యక్రమ నిర్వాహకులు సూచన చెయ్యొచ్చు.
హుందా వ్యాఖ్యానాలు కావాలి
ఇక ఈ కార్యక్రమానికి ఇద్దరు వ్యాఖ్యాతలున్నారు. మిగతా కార్యక్రమాల వ్యాఖ్యానాలకీ, ఈ మోడల్ పాటల ప్రోగాం యాంకరింగ్‌కీ తేడా వుంటుంది. ఆ భేదాన్ని ఇక్కడ పాటించినట్టులేదు. భాష దగ్గరనుంచీ, భావ ప్రకటన వరకూ హుందాతనం తప్పనిసరి. అది కొంతమేరకు ఇందులో లోపించినట్టే కనపడుతోంది. మిగతా యాంకరింగ్‌లో కనపడే అరుపులు, వగైరా ఇందులోనూ ఉన్నాయి. ‘అదుర్స్, సూపర్, సూపరూ, పాటేసుకో లాంటి పద ప్రయోగాలూ దొర్లుతున్నాయి. అంతకు మించి పురుష యాంకరు చేసే నంగి నంగి వ్యాఖ్యానాలతో కూడిన అభినయమూ దర్శనమిస్తోంది. ఇది తక్షణం పరిహరించాలి.
ఇంకా వారనుకునే ‘సంగ్రామం’ సమతుల్యత తెలియడానికి రాబోయే భాగాలు చాలా ఉన్నాయి కనుక వాటి విషయాల్లో పరిహరించదగ్గవి పరిహరిస్తే కార్యక్రమం అందరి మన్ననలు పొందుతుంది.

Source: www.andhrabhoomi.net