‘టీవీ అంటే ఎప్పుడూ సీరియల్సూ, సినిమా క్లిప్పింగులతో కూడిన కదంబ కార్యక్రమాలు, లేకపోతే ఉన్నపాటున జరిగే వింత, వత్తిడులను పెంచే ప్రత్యక్ష ప్రసారాలూ.. అంతేగా.. అంటూ పెదవి విరిచే వారికి కొంచెం ఉపశమనం కలిగించే కార్యక్రమం ఈటీవీ-2లో వచ్చే ‘న్యాయ సేవ’. కాస్త ఉపయోగపడే కార్యక్రమం కూడా. ఇందులో న్యాయవాద వృత్తిలో అనుభవం గడించిన వారు పాల్గొని నిర్దేశించిన విషయ సంబంధిత ప్రశ్నలకి (ప్రేక్షకులు అడిగినవి) సమాధానాలు చెప్తారు. ఇవి వాస్తవానికి అలా అడిగిన వారికే కాక అలాంటి అంశాలకు సమాధానాలు దొరక్క ఆందోళన చెందేవారికి కూడా వీరు చెప్పే పరిష్కారాలు ఉపయుక్తమవుతాయి.
ప్రత్యక్షంలో నివారించాల్సినవి..
ఈ మధ్య చాలా అంశాలు ‘ప్రత్యక్ష’ ప్రసారాలకు నోచుకుంటున్నాయి కనుక దానికి చెందిన అనివార్య అంశాల తీవ్రత తగ్గించడానికి సంబంధితులు సాధన చేయాలి. ముఖ్యంగా తడబాట్లని, తొట్రుపాటుల్నీ యాంకర్లు పరిహరించుకునే ప్రయత్నాలు చేయాలి. ఉదాహరణకు యాంకర్ రెండు మూడుసార్లు పద ఉచ్ఛారణలో తడబడ్డారు (స్వార్జితం.. తదితర పదాలు) అలాగే ఇందులో ప్రశ్నలడిగేవారు కూడా సమయ పరిమితిని దృష్టిలో పెట్టుకుని అంశాల్ని క్లుప్తంగా, క్లారిటీతో అడగాలి. అప్పుడు అది వినేవారికి, సమస్యకు పరిష్కారం చెప్పేవారికీ సౌకర్యంగా ఉంటుంది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment