‘బిగ్ బాస్’ -4 సీజన్ మొదలైందగ్గర్నుంచీ అది చేసిన హడావిడి అంతా ఇంతా కాదు. సృష్టించినన్ని సంచలనాలూ అన్నీ ఇన్నీ కావు. తాజాగా హాలీవుడ్‌లో ‘బేవాచ్’ సీరియల్‌తో స్వదేశీ విదేశీ కుర్రకారుని ఉర్రూతలూగిస్తూ ముప్పాతిక నగ్నత్వాన్ని ప్రదర్శించిన పమెలా ఆండర్సన్ మన దేశానికి విచ్చేస్తుందంటేనే వొళ్లు పులకరిస్తుంది. అటువంటిది ‘శే్వతాంబర ధారియై’ వస్తూంటే అడ్డుకునేదెవరు? సాక్షాత్తు దేవత ప్రత్యక్షమైనట్టు ఫీలయ్యారు? ఇటు పత్రికలూ ఛానెళ్లు ముఖ్యంగా కలర్స్ ఛానెల్ బోలెడంత పబ్లిసిటీ ఇచ్చేసింది. ఇంటర్వ్యూలూ ప్రసారం చేసింది. పమెలా యధోచితంగా -కావల్సినన్ని వాగ్దానాలూ మెచ్చుకోళ్లు.. ఎనె్నన్నో మాట్లాడేసింది. బాలీవుడ్ అంటేనే అదో కలల ప్రపంచం అంది. పాటలూ డాన్సులతో జనాన్ని మంత్రముగ్ధుల్ని చేస్తున్నారంది. వీలైతే - అవకాశం ఇస్తే బాలీవుడ్‌లో సినిమాలు చేయటానిక్కూడా వెనుకాడనంది. మూడు రోజులకు దాదాపు మూడుకోట్లు ఖర్చయింది. ఇక ఈ బేవాచ్ బేబీ ‘మిల్కీ వైట్ శారీ’ని డిజైన్ చేయటానికి ప్రముఖ డిజైనర్ అశే్ల రెబెల్లో పూనుకున్నాట్ట.
పమెలా ఆండర్సన్ ప్రత్యేక అతిథిగా పాల్గొంటుందన్న ప్రచారం ఎవరికి లాభం చేకూర్చిందన్న మాట పక్కనబెడితే ‘బిగ్ బాస్’ సీజన్-2లో ‘జాడె గూడీ’ జర్మన్ మోడల్ ‘క్లాడియా సిస్లా’ సీజన్ -3లోనూ కనిపించినప్పటికీ ఇంత ప్రచార ఆర్భాటం లేదు. ‘కుక్క అని తిట్టిందనో.. పంది అన్నదనో - ఇలా ఒకరి మీద ఒకరు ఆరోపణలు చేసుకోవటం ఈ షోకి మంచి పేరు తెచ్చిపెట్టింది.
Source: www.andhrabhoomi.net
No comments:
Post a Comment