దూరదర్శన్ న్యూస్, డిడి ఉర్దూ, డిడి ఇండియాలకు 142 కోట్లరూపాయలు కేటాయించాలన్న ఓ ప్రతిపాదనను సమాచార, ప్రసార శాఖలోని సాధికారక కమిటీ సూత్ర ప్రాయంగా ఆమోదించింది. దూరదర్శన్‌కు సంబంధించిన ప్రాంతీయ ఛానెల్స్‌కు కూడా ఈ కేటాయింపు వర్తిస్తుంది. ఈ మొత్తం వల్ల ప్రసార భారతి నూతన కార్యక్రమాలకు సంబంధించి 15 వేల ఎపిసోడ్లను ప్రొడ్యూస్ చేయగలదని భావిస్తున్నారు. వీటివల్ల డిడికి కనీసం 40 కోట్ల ఆదాయం లభించే అవకాశాలున్నాయి. అయితే 142 కోట్లలో సుమారు 57 శాతాన్ని (రు.80 కోట్లు) దూరదర్శన్ ఉర్దూకు కేటాయిస్తారు.
దూరదర్శన్ వ్యూయర్‌షిప్‌ను పెంచడం, సరికొత్త కార్యక్రమాలు చేపట్టడం లక్ష్యంగా ఈ కేటాయింపు ఉంది. దీనివల్ల తాజా కంటెంట్ 6 గంటలనుంచి 14 గంటలకు పెరుగుతుందని భావిస్తున్నారు. ఇటీవల ప్రసారభారతి బోర్డు ఆమోదించిన మార్పుల ప్రకారం దూరదర్శన్, ఆలిండియా రేడియోలతో పాటు ప్రసారభారతిలో చైర్‌పర్సన్ మృణాల్ పాండే ఆధ్వర్యాన ఐదు కమిటీలు పని చేస్తాయి. వివిధ ఛానల్స్ నుంచి వార్తా ప్రసారాల పరంగాను, కార్యక్రమాల పరంగాను వస్తున్న పోటీని తట్టుకునేందుకు ప్రసార భారతి ఇలా తన దూరదర్శన్, ఆలిండియా రేడియోలకు నూతన జవసత్వాలను కల్పించడానికి సిద్ధపడింది.

Source: medianx.tv
No comments:
Post a Comment