నిత్యజీవితంలో శాస్త్ర, సాంకేతికాల ప్రభావం అంతా ఇంతా కాదు. వాటిని మరింతగా ప్రజల్లోకి తీసుకెళ్ళే విధంగా డిస్కవరీ సైన్స్ ఛానల్ కృషిచేస్తుందని ఆసియా పసిఫిక్, ఇండియా, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాహుల్ జోహ్రి అన్నారు. డిస్కవరీ సైన్స్ ఛానల్ ఎనిమిది నూతన సిరీస్‌లను ప్రారంభించింది. గురువారం ఈ విషయాలను జోహ్రి తెలియజేశారు. బుల్లెట్‌ఫ్రూఫ్ ఎలా ఉపయోగిస్తారు ! దాని ముందు, వెనుక ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి ! ఇలాంటి విశేషాలెన్నో తెలియజేసే సైన్స్ ఛానల్. ఆధునిక ఉపకరణాలు, శాస్త్ర సాంకేతిక పరిశోధనలు లాంటి విస్తృతశ్రేణి అంశాలపై ఈ ఛానల్ దృష్టి సారించింది. గత ఏడాది ప్రారంభమై భారత్‌లో 16.4 మిలియన్ కుటుంబాలకు చేరువైంది' అని తెలిపారు.
Source: www.prajasakti.com
No comments:
Post a Comment