వరల్డ్‌కప్ పంచ్ భారతీయ టివి మార్కెట్‍ను ఓ కుదుపు కుదిపింది. ఈ కప్ పుణ్యమా అని టివి చానెల్స్ రేటింగ్‌లు అమాంతం పెరిగిపోయాయి. ముఖ్యంగా ఓపెనింగ్ డేనాడు బంగ్లాదేశ్‌ను భారత జట్టు దెబ్బతీయడంతో టివిల పంటపండింది. బెంగళూరు, ముంబై, కోల్‍కతా వంటి ఆరు మెట్రోనగరాల్లో ఆ రోజు వీటి రేటింగ్ 12.48 శాతం ఉందట! ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపిఎల్)తో పోలిస్తే ఇది 11 శాతం ఎక్కువట! ఈ నగరాల్లో దాదాపు మూడు కోట్లమంది టివిలకు అతుక్కుపోయి ఈ మ్యాచ్‌ను చూశారు. దూరదర్శన్‌తో పోలిస్తే స్టార్ క్రికెట్ రేటింగ్ సగటున 3.03 ఇఎస్‌పిఎన్ 2.47, స్టార్ స్పోర్ట్స్ 0.89 శాతం ఉన్నట్టు వెల్లడయింది. వీటిలో బెంగళూరు టాప్‌మోస్ట్‌లో ఉండగా, ఆ తర్వాత ముంబై రెండో స్థానం వహించింది. భారత జట్టు ఆడనున్న రోజుల్లో ఈ రేటింగ్ ఇంగా పెరగవచ్చునని భావిస్తున్నారు. ఒక నాటి ప్రపంచకప్ పోటీల సందర్భంలో కపిల్‍దేవ్ కొట్టిన 175 రన్స్‌ని గుర్తు చేసుకుందాం, తిరిగి మళ్లీ ఇప్పుడు మన సెహ్వాగ్ 175 పరుగులు చేయడం చూస్తే ప్రపంచకప్ మనదేనన్న ఆశలు మొలకెత్తుతున్నాయి.
Source: medianx.tv
No comments:
Post a Comment