Sunday, February 20, 2011

అట్టహాసంగా నంది నాటకోత్సవాలు ప్రారంభం

కర్నూలు జిల్లా నంద్యాల పట్టణంలోని మున్సిపల్‌ టౌన్‌హాల్‌లో శనివారం నంది నాటకోత్సవాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్ర చలనచిత్ర టివి, నాటకరంగం అభివృద్ధి సంస్థ మేనేజింగ్‌ డైరెక్టర్‌ పార్థసారథి, జిల్లా కలెక్టర్‌ రాంశంకర్‌నాయక్‌, జిల్లా ఎస్పీ శ్రీకాంత్‌తోపాటు జిల్లా రెవెన్యూ శాఖ అధికారులు పలువురు కార్యక్రమానికి హాజరయ్యారు. శనివారం ఉదయం 11 గంటలకు తిరుపతి సుబ్బరాజు నాట్య కళాపరిషత్‌ కళాకారులు ప్రదర్శించిన 'అహో ఆంధ్రభోజ' తో ఉత్సవాలు ప్రారంభమయ్యాయి. మధ్యాహ్నం విజయవాడ కళాకారులచే 'సంపూర్ణాకాశం' సాంఘిక నాటకం, సాయత్రం ఒంగోలు శ్రీ కళాప్రకాశం వారిచే 'నర్తనశాల' ప్రదర్శించారు. రాష్ట్రం నలుమూలలనుంచి వచ్చిన కళాకారులు ఈ ప్రదర్శనలలో పాల్గొంటున్నారు. ఈ నాటకోత్సవాలకు జిల్లా యంత్రాంగంతో పాటు ఆర్డీవో మాధవీలత, మున్సిపల్‌ కమిషనర్‌ ఖాదర్‌సాహెబ్‌, నంద్యాల కళారాధన అధ్యక్షుడు డా.మధుసూదన్‌రావుల ఆధ్వర్యంలో విస్తృత ఏర్పాట్లు చేశారు. ముఖ్యంగా డిపిఆర్‌ఓ తిమ్మప్ప ఆధ్వర్యంలో ప్రత్యేక సేవలు అందిస్తున్నారు. వారం రోజుల పాటు జరిగే ఈ నంది నాటకోత్సవాల్లో 42 నాటకాలు ప్రదర్శిస్తారని, 1300మంది కళాకారులు పాల్గొంటున్నారని ఆర్డీవో మాధవీలత తెలిపారు.

Source: www.andhraprabhaonline.com

No comments:

Post a Comment