Wednesday, February 16, 2011

మెగాటీవి వస్తుందా? రాదా?

పిఆర్‌పి అధినేత, ఇప్పుడు కాంగ్రెస్ నేత అందామా? ఎవరైతే ఏం? ఇంతకీ ఎవరాయన? ఈ పాటికి మీకు అర్థమయ్యే ఉంటుంది. సినిమాలో మాదిరే నిజ జీవితంలోనూ డ్యుయల్ రోల్ పోషిస్తున్న మెగాస్టార్ చిరంజీవి! ఆ మధ్య మెగాటీవి పేరిట ఛానెల్ ప్రారంభిస్తారని లోకమంతా కోడై కూసింది. అనేకమంది జర్నలిస్టులు ఆసక్తిగా ఆ కోడి వంక చూశారు. ప్రజారాజ్యం పార్టీలా ఓ నిశ్శబ్ద విప్లవం మాదిరి ఈ ఛానెల్ రూపుదిద్దుకుంటుందని భావించారు. అయితే ’అందరివాడు’ కాస్తా కొందరివాడే అయ్యాడు. చిరంజీవి పార్టీ కాంగ్రెస్‌లో విలీనం కాకముందు వచ్చిన ఈ వార్త కాస్తా తుస్‌మంది.

మెగాటీవి పేరిట ఇదివరకే తమిళనాడులో ఓ ఛానెల్ ఉందట! దీంతో చిరంజీవి పెడదామనుకున్న ఛానెల్ చాప్టర్ క్లోజైంది. మరి మెగాస్టార్ మనసులో ఇంకా ఈ ఛానెల్ ఆలోచన ఉందో, లేదో తెలియదు.

Source: medianx.tv

No comments:

Post a Comment