Wednesday, February 16, 2011

మా నుంచి రెండు ఛానళ్లు

మా ఛానల్ ఇటీవలే మరో రెండు కొత్త ఛానళ్లను ప్రారంభించింది. మా మూవీస్, మా జూనియర్ పేరిట ప్రారంభమైన ఈ ఛానళ్లు అప్పుడే పిల్లలను, పెద్దలను విశేషంగా ఆకర్షిస్తున్నాయి. జూనియర్స్ ద్వారా పిల్లలను, మూవీస్ ద్వారా ముఖ్యంగా మహిళలను ఆకట్టుకొనే యోచనలో మా ఛానల్ వీటికి శ్రీకారం చుట్టింది. మూవీస్‌లో పాత, కొత్త సినిమాలు, జూనియర్స్‌లో పిల్లల సృజనాత్మక ఆలోచనలు రేపే కార్యక్రమాలు కొత్త స్పూర్తిని నింపుతున్నాయి. ఈ రెండు ఛానల్స్ ద్వారా మరింత మంది ప్రజల ఆదరణను చూరగొనాలని, మా ఛానల్ భావిస్తుంది. ఇప్పటికే మాలో ప్రసారం అవుతున్న జీనియస్ వంటి కార్యక్రమాలు ప్రజలనుంచి భేష్ అనిపించుకున్నాయి. అటు వినోదం, ఇటు విజ్నానం ప్రాతిపదికన మరిన్ని కార్యక్రమాలను చేపట్టాలని మా ఛానల్ భావిస్తోంది.  ఆటలు, పాటలు, కబుర్లు ఉండనే ఉన్నాయి. అటు క్లాస్‌ను, ఇటు మాస్‌ను ఆకట్టుకోవాలన్న మా అభిలాష అభినందనీయం.

Source: medianx.tv

No comments:

Post a Comment